office space market
-
ఆఫీస్ మార్కెట్ రారాజు.. హైదరాబాద్
హైదరాబాద్: ఆఫీస్ మార్కెట్‌కు ఆకర్షణీయ కేంద్రంగా హైదరాబాద్ అవతరిస్తోంది. 134 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) ఆఫీస్ స్పేస్‌తో దేశ ఆఫీస్ స్పేస్ (కార్యాలయ వసతులు) మార్కెట్లో హైదరాబాద్ 15 శాతం వాటా కలిగి ఉండగా, 2030 నాటికి 200 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకుంటుందని సీబీఆర్ఈ దక్షిణాసియా, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) సంయుక్త నివేదిక అంచనా వేసింది. అంతర్జాతీయ సంస్థల నుంచి ఆఫీస్ స్పేస్‌కు బలమైన డిమాండ్ నెలకొందని, 2014 నుంచి చూస్తే హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ పరిమాణం మూడొంతులు పెరిగినట్టు తెలిపింది.అంతర్జాతీయ వ్యాపార, టెక్నాలజీ కేంద్రంగా హైదరాబాద్ అవతరించడం డిమాండ్‌కు అనుగుణంగా మారే స్వభావాన్ని తెలియజేస్తున్నట్టు సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగిజన్ పేర్కొన్నారు. విస్తృతమైన మౌలిక వసతులు, నైపుణ్య మానవ వనరుల లభ్యతతో భారత దేశ రియల్ ఎస్టేట్‌కు కీలక వృద్ధి కేంద్రంగా మారినట్టు తెలిపింది. టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లకు (జీసీసీ) హైదరాబాద్ ముఖ్య ఎంపికగా ఉన్నట్టు వెల్లడించింది.పర్యావరణ అనుకూల వసతులు..గ్రీన్ సరి్టఫైడ్ (పర్యావరణ అనుకూల ధ్రువీకరణ పొందిన) ఆఫీస్ వసతుల పరంగా హైదరాబాద్ మార్కెట్ దేశంలో 18 శాతం వాటా కలిగి ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది.డెవలపర్లు గ్రీన్ స్పేసెస్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని, పర్యావరణ అనుకూల చర్యలు తీసుకుంటున్నారని వివరించింది. ఇందుకు సానుకూల ప్రభుత్వ విధానాలు ప్రోత్సాహమిస్తున్నట్టు పేర్కొంది. హైదరాబాద్ ఆఫీస్ లీజింగ్‌లో టెక్నాలజీ రంగం 31 శాతం వాటాతో అగ్రగామిగా ఉన్నట్టు తెలిపింది.జీసీసీలకు బెంగళూరు తర్వాత హైదరాబాద్ రెండో అతిపెద్ద కేంద్రంగా (లీజు పరంగా) ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. టెక్నాలజీ, ఫార్మా, బయో టెక్నాలజీ, ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఇలా వివిధ రంగాల్లో జీసీసీలను హైదరాబాద్ ఆకర్షిస్తున్నట్టు పేర్కొంది. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలైటిక్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీల వినియోగం పెరిగే కొద్దీ హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ వృద్ధి మరింత వేగాన్ని అందుకుంటుందని అంచనా వేసింది.లీజింగ్‌లోనూ టాప్ఆఫీస్ స్పేస్ మార్కెట్లో ఈ ఏడాది హైరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్ అత్యధిక వృద్ధిని చూస్తాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘కొలియర్స్ ఇండియా’ సంస్థ అంచనా వేసింది. ఈ రెండు చోట్లా 10–15 మిలియన్ ఎస్ఎఫ్టీ చొప్పున గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ లీజింగ్ కార్యకలాపాలు నమోదు కావచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా ఆరు ప్రముఖ నగరాల్లో ఈ ఏడాది ఆఫీస్ స్పేస్ లీజింగ్ బలంగా ఉంటుందని.. 65–70 మిలియన్ ఎస్ఎఫ్టీ మేర లీజింగ్ నమోదు కావొచ్చని అంచనా వేసింది.2025 సంవత్సరంలో ఈ ఆరు నగరాల్లో ఆఫీస్ స్పేస్ మార్కెట్ ఎలా ఉండొచ్చన్న అంచనాలతో నివేదికను ఫిక్కీ 18వ రియల్ ఎస్టెట్ సదస్సు సందర్భంగా విడుదల చేసింది. ఈ ఆరు నగరాల్లో 2024లో స్థూల ఆఫీస్ లీజింగ్ 66.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండగా.. ఈ ఏడాది 65–70 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంటుందని అంచనా వేసింది. జీసీసీల విస్తరణ, ఆశావహ వ్యాపార వాతావరణంతో లీజింగ్ పరి మాణం పెరగొచ్చని తెలిపింది.బెంగళూరులో అధిక డిమాండ్ ఈ ఏడాది స్థూల ఆఫీస్ స్పేస్ డిమాండ్‌లో మూడింట ఒక వంతు బెంగళూరు నుంచే ఉంటుందని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్వీసెస్ ఎండీ అరి్పత్ మెహరోత్రా తెలిపారు. జీసీసీలు, ఇంజనీరింగ్, తయారీ సంస్థలు, ఫ్లెక్స్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్ల నుంచి డిమాండ్ ఉంటుందన్నారు. ముంబై, చెన్నై పుణెలలో 5–10 మిలియన్ ఎస్ఎఫ్టీ చొప్పున డిమాండ్ ఉండొచ్చని చెప్పారు. టాప్ మెట్రో నగరాల్లో జీసీసీలు అతిపెద్ద ఆఫీస్ స్పేస్ వినియోగదారులుగా ఉన్నట్టు అనరాక్ గ్రూప్ కమర్షియల్ లీజింగ్ ఎండీ పీయూష్ జైన్ సైతం తెలిపారు. -
హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ ఖాళీ
డిమాండ్‌కు మించి తాజా సరఫరా తోడవుతున్నందున 2026 మార్చి నాటికి హైదరాబాద్‌లోని మొత్తం కార్యాలయ స్థలంలో 24.5 శాతం ఖాళీగా ఉండవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. వేకెన్సీ స్థాయి 2023 మార్చిలో 14.1 శాతం, 2025 సెప్టెంబర్‌లో 19.3 శాతంగా ఉందని తెలిపింది.‘హైదరాబాద్ మార్కెట్లో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీ 2026 మార్చి నాటికి 75.5–76 శాతానికి చేరవచ్చు. 2023 మార్చి నాటికి ఇది 86 శాతం నమోదైంది. నికర ఆక్యుపెన్సీతో పోలిస్తే సరఫరా ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌లో 2016–17 నుంచి 2023–24 మధ్య ఆఫీస్ స్పేస్ సరఫరా వార్షిక వృద్ధి రేటు ఏటా 14 శాతం దూసుకెళ్లింది. టాప్–6 ఆఫీస్ మార్కెట్లలో ఇది సుమారు 7 శాతం నమోదైంది. ఈ ఆరు మార్కెట్లలో 2024 మార్చి 31 నాటికి అందుబాటులో ఉన్న మొత్తం కార్యాలయ సరఫరాలో హైదరాబాద్ వాటా 15 శాతం. 2026 మార్చి నాటికి ఇది 17 శాతానికి చేరవచ్చు’ అని నివేదిక వివరించింది.ఇదీ చదవండి: బేర్.. ఎటాక్! మార్కెట్ నేల చూపులు ఎందుకంటే..అంచనాలు లేకుండా..అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) నియమాన్ని కలిగి ఉన్న ఏకైక ప్రముఖ భారతీయ నగరం హైదరాబాద్ అని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్, కో–గ్రూప్ హెడ్ అనుపమ రెడ్డి తెలిపారు. ‘ఈ నిబంధనలను సద్వినియోగం చేసుకుని కొంతమంది డెవలపర్లు సమీప కాలంలో లీజింగ్‌పై సరైన అంచనాలు లేకుండా భారీగా ఊహించుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. ఫలితంగా డిమాండ్–సరఫరా మధ్య భారీగా అసమతుల్యత ఏర్పడింది’ అని అన్నారు. ‘2023–24 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో 1.9 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ తోడైంది. ఇది హైదరాబాద్ చరిత్రలో అత్యధికం. అలాగే ఇతర టాప్ నగరాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువ. ఈ అధిక సరఫరా ధోరణి 2024–25, 2025–26 వరకు కొనసాగుతుంది. ఏటా 1.7–2 కోట్ల చదరపు అడుగుల కొత్త సరఫరా తోడు కానుంది. -
భళా హైదరాబాద్
న్యూఢిల్లీ: కార్యాలయ స్థలాల (ఆఫీస్ స్పేస్) మార్కెట్లో సందడి నెలకొంది. 2024లో ఈ మార్కెట్లో లీజు లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 37 శాతం వృద్ధితో 123 లక్షల చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) స్థూల లీజింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. 2023లో 90 లక్షల ఎస్ఎఫ్టీ మేర లావాదేవీలు జరగడం గమనార్హం. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో 885 లక్షల చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) విస్తీర్ణం మేర స్థూల లీజింగ్ 2024లో నమోదైనట్టు కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. అంతకుముందు ఏడాది 746 లక్షల ఎస్ఎఫ్టీతో పోల్చి చూస్తే 19 శాతం వృద్ధి నమోదైనట్టు తెలిపింది. ‘‘భారత ఆఫీస్ మార్కెట్‌కు 2024 నిర్ణయాత్మకమైనది. రికార్డు స్థాయిలో లీజింగ్ నమోదైంది. ఆఫీస్ స్పేస్‌కు అంతర్జాతీయంగా భారత్ బలమైన వృద్ధి మార్కెట్ అని మరోసారి నిరూపితమైంది’’అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా సీఈవో అన్షుల్ జైన్ పేర్కొన్నారు. గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీలు) పెరుగుతుండడం బహుళజాతి సంస్థలకు భారత్ వ్యూహాత్మక ప్రాధాన్యమైనదిగా తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆఫీస్ స్పేస్ డిమాండ్‌లో 30 శాతం డిమాండ్ జీసీసీల నుంచే వస్తోంది. ‘‘2025లో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ డిమాండ్ బలంగా ఉండనుంది. అంతర్జాతీయ ఆఫీస్ మార్కెట్లో భారత్ ఆధిపత్యం బలపడనుంది’’అని జైన్ అంచనా వేశారు. తాజా లావాదేవీలు, రెన్యువల్ అన్నీ స్థూల లీజింగ్ కిందకే వస్తాయి. పట్టణాల వారీగా లీజింగ్.. → బెంగళూరులో 259 లక్షల చదరపు అడుగుల స్థూల లీజింగ్ లావాదేవీలు 2024లో నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది లీజింగ్ పరిమాణం 158.3 లక్షల చదరపు అడుగులుగా ఉంది. అత్యధికంగా 64 శాతం వృద్ది ఇక్కడ నమోదైంది. → ముంబైలో స్థూల లీజింగ్ 27 శాతం పెరిగి 178.4 లక్షల చదరపు అడుగులకు చేరింది. → అహ్మదాబాద్‌లో 11 శాతం అధికంగా 18.1 లక్షల ఎస్ఎఫ్టీ లీజు లావాదేవీలు జరిగాయి. → ఢిల్లీ ఎన్సీఆర్లో మాత్రం క్రితం ఏడాదితో పోలి్చతే 3 శాతం తక్కువగా 131.4 లక్షల చదరపు అడుగుల లీజింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. → పుణెలో 84.7 లక్షల ఎస్ఎఫ్టీ లీజింగ్ రికార్డు అయింది. 2023లో లీజు పరిమాణం 97.4 లక్షల ఎస్ఎఫ్టీతో పోల్చితే 13 శాతం తగ్గింది. → కోల్‌కతా ఆఫీస్ మార్కెట్లో 17 లక్షల చదరపు అడుగుల లీజు లావాదేవీలు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోల్చితే స్థిరంగా కొనసాగింది. → ఐటీ–బీపీఎం, ఇంజనీరింగ్ అండ్ తయారీ, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగాలు ఆఫీస్ స్పేస్ డిమాండ్‌లో ప్రముఖ పాత్ర పోషించాయి. → మొత్తం స్థూల లీజింగ్‌లో కోవర్కింగ్ ఆపరేటర్లు 14 శాతం తీసుకున్నారు. ప్రాపర్టీ యజమానుల నుంచి ఆఫీస్ స్పేస్ లీజు తీసుకుని, కార్పొరేట్లు, ఇతరులకు వీరు లీజుకు ఇవ్వనున్నారు. తగ్గిన ఖాళీ స్థలాలు.. 2024లో వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో రికార్డు స్థాయి లావాదేవీలు నమోదైనట్టు, ఖాళీ స్థలాలు గణనీయంగా తగ్గినట్టు ముంబైకి చెందిన రహేజా కార్ప్ ఎండీ, సీఈవో వినోద్ రోహిరా తెలిపారు. మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇచ్చే అన్ని పట్టణాల్లోనూ వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో వృద్ధి నమోదైనట్టు చెప్పారు. గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ ఇక ముందూ కొనసాగుతుందన్నారు. -
హైదరాబాద్‌లో ఆఫీస్ స్థలాలకు గిరాకీ
హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ సరికొత్త శిఖరాలను తాకింది. దేశంలో కార్యాలయాల స్థలాల లావాదేవీల్లో మూడో స్థానంలో, సరఫరాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది తొమ్మిది నెలల కాలంలో గ్రేటర్లో 87 లక్షల చదరపు అడుగులు(చ.అ.) ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగ్గా.. కొత్తగా 85 లక్షల చ.అ. స్థలం సరఫరా అయ్యింది. ఏటేటా ఆఫీస్ స్పేస్ రంగంలో 34 శాతం వృద్ధి నమోదవుతోందని సావిల్స్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ వంటి పని విధానాలకు స్వస్తి పలికి ఆఫీస్ యాజమాన్యాలు ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. దీంతో మెట్రో నగరాల్లో ఆఫీస్ స్థలాలకు డిమాండ్ ఊపందుకుంది. – సాక్షి, సిటీబ్యూరోఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, తయారీ రంగ సంస్థలు కొత్త యూనిట్ల ఏర్పాటు, ఉన్న వాటి విస్తరణకు ప్రణాళికలు చేస్తున్నాయి. దీంతో ప్రధాన ప్రాంతాలతో పాటు రవాణా సదుపాయాలున్న శివారు ప్రాంతాల్లోని ఆఫీస్ స్పేస్‌లకు డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ ఏడాది మూడో త్రైమాసికంలో నగరంలో 58 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ సరఫరా జరిగింది. వార్షిక ప్రాతిపదికన 8 శాతం పెరుగుదల నమోదైంది. 2024 మూడో త్రైమాసికంలో (జులై–సెప్టెంబర్)లోనే 30 లక్షల చ.అ. లావాదేవీలు జరిగాయి. ఎక్కువగా 25 వేల నుంచి లక్షలోపు చ.అ. మధ్యస్థాయి ఆఫీస్ స్పేస్ ఒప్పందాలు ఎక్కువగా జరిగాయి. 54 శాతం వాటాతో ఈ విభాగంలో 16 లక్షల చ.అ. లావాదేవీలు పూర్తయ్యాయి.బెంగళూరు–హైదరాబాద్ పోటాపోటీ.. కార్యాలయాల స్థలాల విభాగంలో ఐటీ హబ్‌లుగా పేరొందిన హైదరాబాద్, బెంగళూరు పోటీపడుతున్నాయి. అత్యధికంగా గ్రేడ్–ఏ ఆఫీసు స్పేస్ అందుబాటులో ఉన్న నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. గ్రేటర్లో ఇప్పటి వరకు గ్రేటర్లో 12.57 కోట్ల చ.అ. గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉంది. అత్యధికంగా బెంగళూరులో 23.15 కోట్ల చ.అ., ఢిల్లీ–ఎన్సీఆర్లో 14.46 కోట్ల చ.అ. స్థలం అందుబాటులో ఉంది. ఇక, ముంబైలో 12.14, చెన్నైలో 9.13, పుణేలో 6.82 కోట్ల చ.అ. స్థలం ఉంది.దేశంలో 7 కోట్ల చ.అ. దాటనున్న ఆఫీస్ స్పేస్.. దేశంలో ఆఫీస్ స్పేస్ మార్కెట్ రికార్డ్లను బ్రేక్ చేసింది. దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో 2024 జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో 5.51 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు పూర్తికాగా.. ఈ ఏడాది చివరి నాటికి 7 కోట్ల చ.అ.లను అధిగమిస్తుందని, ఆఫీస్ స్పేస్ సప్లయ్ 6.2 కోట్ల చ.అ.లకు చేరుతుందని సావిల్స్ ఇండియా అంచనా వేసింది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ స్టాక్ 81 కోట్ల చ.అ. చేరుకుంటుంది. ఏటేటా ఆఫీస్ స్పేస్ రంగంలో 30 శాతం వృద్ధి రేటు నమోదవుతుంది. కార్యాలయాల స్థలాలకు డిమాండ్ ఉన్నప్పటికీ.. నిర్మాణం పూర్తి చేసు కొని, మార్కెట్లో అందుబాటులోకి ఆఫీస్ స్పేస్ మాత్రం మందగమనంలో సాగుతోంది. ఈ ఏడాది 9 నెలల్లో కొత్తగా 3.26 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ మార్కెట్లోకి వచ్చింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 12 శాతం తగ్గుదల. ఆఫీస్ స్పేస్ వేకన్సీ ఎక్కువగా ఉండటంతో ధరలు 15.5 శాతం మేర తగ్గాయి. -
దేశంలో ఆఫీస్ స్పేస్ విస్తరణ.. కారణం..
దేశీయంగా మూడో త్రైమాసికంలో ప్రధానం నగరాల్లోని కంపెనీలు 19 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజ్‌కు తీసుకున్నట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. 2023లో ఇదే సమయంలో అద్దెకు తీసుకున్న 16.1 మిలియన్ చదరపు అడుగుల స్థలంతో పోలిస్తే ఈసారి 18 శాతం పెరుగుదల నమోదైందని నివేదికలో పేర్కొంది. 2024 సంవత్సరం మొదటి 9 నెలల్లో 53.7 మిలియన్ చదరపు అడుగుల మేర ఆఫీస్ స్థలాన్ని లీజ్‌కు తీసుకున్నట్లు నైట్ ఫ్రాంక్ నివేదించింది.నివేదికలోని వివరాల ప్రకారం..2024 క్యూ3లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీ) 7.1 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకున్నాయి. ఆఫీస్ స్పేస్‌కు మార్కెట్లో డిమాండ్ భారీగా పెరుగుతోంది. జీసీసీల వృద్ధి అందుకు ప్రధాన కారణంగా నిలుస్తుంది. దాంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. దేశంలో 2024 క్యూ3లో బెంగళూరు నగరం 5.3 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అద్దెతో మొదటిస్థానంలో నిలిచింది. ఎన్సీఆర్ ఢిల్లీ 3.2, ముంబయి 2.6, పుణె 2.6, చెన్నై 2.6, హైదరాబాద్‌లో 2.2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్ స్పేస్‌ను లీస్‌కు తీసుకున్నారు. కొత్తగా హైదరాబాద్ నగరం 4.2, పుణె 2.7, బెంగళూరు 2.5, ఎన్సీఆర్ ఢిల్లీ 0.9, ముంబయి 0.8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్ స్థలాన్ని నిర్మించాయి.ఇదీ చదవండి: మార్కెట్ కల్లోలానికి కారణాలుదేశంలోని ఐటీ కంపెనీలు, ఇతర టెక్ సర్వీస్‌లు అందించే సంస్థలు కొంతకాలంగా అనుసరిస్తున్న వర్క్‌ఫ్రంహోం, హైబ్రిడ్ వర్క్ కల్చర్‌కు స్వస్తి పలుకుతున్నాయి. క్రమంగా ఉద్యోగులను పూర్తి స్థాయిలో ఆఫీస్ నుంచే పని చేయాలని మెయిళ్లు పంపుతున్నాయి. దాంతో కరోనా సమయం నుంచి ఇంటి వద్ద పనిచేస్తున్నవారు తిరిగి కార్యాలయాలకు వస్తున్నారు. నిత్యం సంస్థలు తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. దాంతో గడిచిన 3-4 ఏళ్ల నుంచి కంపెనీల్లోని మానవ వనరులు పెరిగాయి. తిరిగి అందరూ ఆఫీస్‌కు వస్తుండడంతో అందుకు సరిపడా స్పేస్‌ను లీజ్‌కు తీసుకుంటున్నాయి. దేశీయంగా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఫలితంగా ప్రధాన నగరాల్లో జీసీసీల సంఖ్య పెరుగుతోంది. వాటిలోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగులు చేరుతుండడంతో అద్దె స్థలం పెరుగుతోంది. -
ఆఫీస్ స్పేస్ మార్కెట్లో హైదరాబాద్ జోరు
న్యూఢిల్లీ: కార్యాలయ వసతులకు (ఆఫీస్ స్పేస్) డిమాండ్ బలంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఆరు ప్రముఖ పట్టణాల్లో జూలై–సెప్టెంబర్ మధ్య 17.3 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) స్థూల లీజింగ్ నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ పరిమాణం 13.2 మిలియన్ ఎస్ఎఫ్టీ కంటే 31 శాతం పెరిగినట్టు కొలియర్స్ ఇండియా విడుదల చేసిన డేటా స్పష్టం చేసింది. బెంగళూరు, హైదరాబాద్ మార్కెట్లలోనే సగం మేర లీజింగ్ నమోదు కావడం గమనార్హం. పట్టణాల వారీగా లీజింగ్ » హైదరాబాద్ మార్కెట్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ సెపె్టంబర్ క్వార్టర్లో 16 శాతం పెరిగి రూ.2.9 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో స్థూల లీజింగ్ 2.5 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. » బెంగళూరులో 6.3 మిలియన్ ఎస్ఎఫ్టీ లీజింగ్ జరిగింది. ఒక త్రైమాసికం వారీగా అత్యధిక లీజింగ్ ఇదే కావడం గమనించొచ్చు. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 3.4 మిలియన్ ఎస్ఎఫ్టీతో పోలి్చతే 85 శాతం పెరిగింది. » పుణెలో స్థూల ఆఫీస్ స్పేస్ లీజింగ్ 2.6 మిలియన్ ఎ స్ఎఫ్టీగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఒ క మిలియన్ ఎస్ఎఫ్టీ లీజింగ్ నమోదైంది. » ముంబైలో 1.7 మిలియన్, చెన్నైలో 1.4 మిలియన్ ఎస్ఎఫ్టీ చొప్పున స్థూల లీజింగ్ జరిగింది. » ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఆఫీస్ లీజింగ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 25%పెరిగి 2.4 మిలి యన్ ఎస్ఎఫ్టీకి చేరుకుంది. స్థూల లీజింగ్‌లో రెన్యువల్స్, ఆసక్తి వ్యక్తీకరణ లావాదేవీలను కలపలేదు. టెక్నాలజీ రంగం నుంచి డిమాండ్ జూలై –సెపె్టంబర్ కాలంలో నమోదైన స్థూల లీజింగ్‌లో 25 శాతం మేర టెక్నాలజీ రంగం నుంచే ఉన్నట్టు కొలియర్స్ ఇండియా డేటా తెలియజేసింది. ఆ తర్వాత బీఎఫ్ఎస్ఐ కంపెనీలు, ఫ్లెక్స్ స్పేస్ ఆపరేట్ల నుంచి లీజ్ ఒప్పందాలు అధికంగా జరిగాయి. ‘‘గడిచిన 2–3 ఏళ్లలో వివిధ రంగాలు, విభిన్న మార్కెట్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. లీజింగ్ మార్కెట్ ఏటేటా కొత్త గరిష్టాలకు చేరుకుంటోంది. 2024లోనూ అధిక డిమాండ్, సరఫరా కనిపిస్తోంది’’అని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సరీ్వసెస్ ఎండీ అర్పితా మల్హోత్రా తెలిపారు.హైదరాబాద్, బెంగళూరు, ముంబై మార్కెట్లలో ఈ ఏడాది మొదటి మూడు త్రైమాసికాల్లో (జనవరి–సెప్టెంబర్) ఆఫీస్ స్పేస్ డిమాండ్ 2023 మొత్తం డిమాండ్‌ను అధిగమించినట్టు చెప్పారు. సెపె్టంబర్ క్వార్టర్లో లీజు లావాదేవీల్లో రూ.లక్ష ఎస్ఎఫ్టీకి మించినవే 65 శాతంగా ఉన్నట్టు తెలిపారు. -
ఆఫీస్ స్పేస్‌లో.. దేశీ కంపెనీల హవా
న్యూఢిల్లీ: కార్యాలయ వసతుల వినియోగంలో దేశీ కంపెనీల వాటా గణనీయంగా మెరుగుపడింది. 2022కు ముందు తొమ్మిది పట్టణాల్లోని మొత్తం ఆఫీస్ వసతుల్లో దేశీ కంపెనీల వాటా మూడింట ఒక వంతే ఉండగా, ఆ తర్వాత (2022 నుంచి 2024లో మొదటి ఆరు నెలలు) చోటుచేసుకున్న 154 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) లీజు లావాదేవీల్లో దేశీ కంపెనీల వాటా 47 శాతానికి (72 మిలియన్ ఎస్ఎఫ్టీ) చేరుకుంది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ విడుదల చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, కోల్‌కతా, కోచి, అహ్మదాబాద్‌కు సంబంధించి గణాంకాలను ఈ నివేదికలో సీబీఆర్ఈ వెల్లడించింది. ‘‘వృద్ధి, వ్యాపార కార్యకలాపాల విస్తరణ పట్ల దేశీ కంపెనీల అంకిత భావాన్ని ఈ గణంకాలు తెలియజేస్తున్నాయి. రానున్న సంవత్సరాల్లో ఆఫీస్ వసతుల్లో దేశీ కంపెనీల వాటా మరింత పెరుగుతుంది. దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎంతో వేగంగా విస్తరిస్తోంది. నైపుణ్య మానవవనరులు దండిగా ఉన్నాయి. డిమాండ్‌ను కీలకంగా ఇవే నడిపిస్తున్నాయి. వ్యాపారంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా అధిక నాణ్యత, సౌకర్యవంతమైన పని వాతావరణానికి భారత కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి’’అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజిన్ పేర్కొన్నారు. టాప్–9 పట్టణాల్లో 2026 నాటికి అదనంగా 189 మిలియన్ ఎస్ఎఫ్టీల ప్రీమియం ఆఫీస్ వసతి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. మెరుగుపడిన సామర్థ్యాలు.. అంతర్జాతీయ అనిశి్చతుల్లోనూ దేశ ఆర్థిక భవిష్యత్ వృద్ధి పట్ల స్థానిక కంపెనీల్లో ఉన్న ఆశాభావాన్ని సీబీఆర్ఈ డేటా తెలియజేస్తోందని భీవ్ వర్క్‌స్పేసెస్ వ్యవస్థాపకుడు, సీఈవో శేషురావు పప్లికర్ పేర్కొన్నారు. ‘‘ఇది దేశ వాణిజ్య రియల్ ఎసేŠట్ట్ మార్కెట్ పరిణతిని తెలియజేస్తోంది. స్థిరమైన వృద్ధిలో దేశీ డిమాండ్ కీలక పాత్ర పోషిస్తోంది. మరిన్ని భారత కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నందున, ఇదే ధోరణి ఇక ముందూ కొనసాగుతుంది’’అని శేషురావు వివరించారు. స్థానిక కంపెనీల సామర్థ్యాలను ఈ డిమాండ్ ధోరణులు తెలియజేస్తున్నట్టు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన బ్రహ్మ గ్రూప్ ఏవీపీ (ఆపరేషన్స్) ఆశిష్ శర్మ అన్నారు. టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ రంగాల మద్దతుతో ఆఫీస్ స్పేస్ డిమాండ్ పుంజుకున్నట్టు చెప్పారు. -
ఆఫీస్ స్పేస్‌కు రికార్డు డిమాండ్.. లిస్ట్‌లో హైదరాబాద్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లో ఈ ఏడాది స్థూల ఆఫీస్ స్పేస్ (కార్యాలయ వసతి) డిమాండ్ 80 మిలియన్ చదరపు అడుగులు (ఎస్ఎఫ్టీ) దాటుతుందని కుష్‌మ్యాన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక తెలిపింది. 2023లో 74 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండడం గమనార్హం. హైదరాబాద్‌తోపాటు, పుణె, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్ నగరాల గణాంకాలు ఈ నివేదికలో ఉన్నాయి.డీఎల్ఎఫ్ రెంటల్ వ్యాపారం ఎండీ, వైస్ చైర్మన్ శ్రీరామ్ ఖట్టర్ ఈ నివేదికపై స్పందిస్తూ.. భారత్ అంతర్జాతీయంగా పోటీతత్వంతో కూడిన సానుకూల ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నట్టు చెప్పారు. మన దేశంలో యువ, సాంకేతిక నిపుణులు అధిక సంఖ్యలో ఉన్నారని, వీరు నాణ్యమైన రియల్ ఎస్టేట్‌ను కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ అనుకూలతలు అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తున్నట్టు పేర్కొన్నారు.విశ్వసనీయత కలిగిన డెవలపర్ల నుంచి గ్రేడ్–ఏ ఆఫీస్ వసతుల కోసం అంతర్జాతీయ కంపెనీలు చూస్తున్నట్టు ఖట్టర్ తెలిపారు. 2024 మొదటి ఆరు నెలల్లో 41.9 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ లీజింగ్ నమోదైందని.. బహుళజాతి కంపెనీల నుంచి తాజా డిమాండ్ ఇందుకు తోడైనట్టు ఈ నివేదిక వెల్లడించింది. ద్వితీయ ఆరు నెలల్లోనూ ఇదే ధోరణి ఉంటుందని, మరో 40 మిలియన్ చదరపు అడుగుల మేర ఆఫీస్ స్పేస్ లీజింగ్ నమోదు కావచ్చని అంచనా వేసింది.గ్రేడ్ ఏ డిమాండ్ డౌన్.. గ్రేడ్ ఏ ఆఫీస్ వసతుల లీజింగ్ ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 0.40 శాతం తగ్గి 17.7 శాతంగా ఉంది. 2021 చివరి మూడు నెలల కాలం తర్వాత ఇంత తక్కువ లీజింగ్ తిరిగి మళ్లీ ఇదే కావడం గమనార్హం. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఐటీ–బీపీఎం రంగం అత్యధికంగా 26 శాతం మేర స్థూల ఆఫీస్ వసతుల డిమాండ్‌ను ఆక్రమించింది. ఆ తర్వాత బీఎఫ్ఎస్ఐ రంగం రెండో స్థానంలో ఉంది.‘‘భారత ఆఫీస్ లీజింగ్ మార్కెట్ రికార్డు స్థాయి డిమాండ్‌ను చూస్తోంది. బలమైన ఆర్థిక మూలాలు, అత్యాధునిక డిజిటల్ సాంకేతికత, కార్యాలయాలకు వచ్చి పనిచేసే ఉద్యోగులు పెరగడం, కరోనా కాలంలో వాయిదా పడిన విస్తరణ ప్రణాళికలు అమల్లోకి రావడం ఇవన్నీ డిమాండ్‌ను నడిపిస్తున్నాయి’’అని టెనెంట్ రిప్రజెంటేషన్ ఎండీ వీరబాబు తెలిపారు. దేశీయ కంపెనీల నుంచి డిమాండ్ స్థిరంగా ఉండగా, అంతర్జాతీయ కంపెనీలను సైతం భారత ఆర్థిక వ్యవస్థ ఆకర్షిస్తున్నట్టు చెప్పారు.దీంతో 2024 మొదటి ఆరు నెలల్లో లీజింగ్ కార్యకలాపాలు జోరుగా సాగినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది ఆఫీస్ లీజింగ్ కొత్త రికార్డులను నమోదు చేయవచ్చన్నారు. విభిన్నమైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు, టెక్నాలజీ అనుకూల వాతావరణం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం.. ఇవన్నీ గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాల (జీసీసీ) ఏర్పాటుకు వీలు కల్పిస్తున్నట్టు టెనెంట్ రిప్రజెంటేషన్ ఇండియా సీఈవో అన్షుల్ జైన్ తెలిపారు. కేవలం టెక్నాలజీయే కాకుండా దాదాపు అన్ని రంగాల నుంచి ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ నెలకొన్నట్టు చెప్పారు. -
హైదరాబాద్‌లో కార్యాలయ స్థలాలకు డిమాండ్
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో కార్యాలయ స్థలాలకు డిమాండ్ బలంగా ఉన్నట్టు వర్క్‌ప్లేస్ సొల్యూషన్స్ సంస్థ వెస్టియన్ వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు ఆఫీస్ స్పేస్ లీజింగ్ 48 శాతం వృద్ధితో 3.4 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 2.30 మిలియన్ చదరపు అడుగుల మేర (ఎస్ఎఫ్టీ) లీజింగ్ చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో జూన్ త్రైమాసికంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 23 శాతం పెరిగి 17.04 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. పట్టణాల వారీగా.. → బెంగళూరులో కార్యాలయ స్థలాల లీజింగ్ 15 శాతం వృద్ధితో 4.25 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలానికి ఇది 3.70 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ఐటీ – ఐటీఈఎస్, ఏఐ అండ్ రోబోటిక్స్ కంపెనీలే మొత్తం లీజింగ్‌లో 69 శాతం మేర వాటా కలిగి ఉన్నాయి. → ముంబైలో బలమైన వృద్ధి నమోదైంది. 88 శాతం పెరిగి 3.39 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. → పుణెలో 60 శాతం వృద్ధితో 2.88 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. → చెన్నైలో మాత్రం క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలి్చనప్పుడు 20 శాతం తగ్గి 1.75 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. → ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 1.4 మిలియన్ చదరపు అడుగుల తాజా లీజింగ్ నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 43 శాతం తగ్గింది. → కోల్‌కతా మార్కెట్లో రెట్టింపు పరిమాణంలో 0.23 మిలియన్ ఎస్ఎఫ్టీ లీజింగ్ నమోదైంది.ఇక ముందూ బలమైన వృద్ధి..‘‘అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ.. భారత ఆఫీస్ స్పేస్ మార్కెట్ క్యూ2(జూన్ క్వార్టర్)లో బలమైన లావాదేవీలుగా వేదికగా నిలిచింది. ఐటీ–ఐటీఈఎస్, బీఎఫ్ఎస్ఐ రంగాల నుంచి బలమైన డిమాండ్ నేపథ్యంలో లీజింగ్ మార్కెట్ ఇక మీదటా వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నాం. ఫ్లెక్స్ స్పేస్ ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది’’అని వెస్టియన్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలోనూ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 18 శాతం వృద్ధితో 30 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు వెస్టియన్ నివేదిక వెల్లడించింది. గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ ఏడు పట్టణాల్లో బలంగా ఉందని.. ఈ ఏడాది మొత్తం మీద 60 మిలియన్ ఎస్ఎఫ్టీ అధిగమించొచ్చని పేర్కొంది. -
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు జూమ్
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కళకళలాడుతోంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో (జనవరి–జూన్) బలమైన పనితీరు నమోదు చేసిందిజ ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూస్తే 21 శాతం పెరిగి 18,573 యూనిట్లకు చేరాయి. ఇదే కాలంలో ఆఫీస్ వసతులకు డిమాండ్ 71 శాతం పెరిగి 5 మిలియన్ చదరపు అడుగులకు చేరినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లో ఇళ్ల విక్రయాలు జనవరి–జూన్ కాలంలో 11 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. 1.73 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఎనిమిది నగరాల్లో ఆఫీస్ వసతుల లీజింగ్ 33 శాతం పెరిగి 34.7 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ గడిచిన కొన్ని త్రైమాసికాల్లో బలంగా ఉండడం బలమైన ఆర్థిక మూలాలాలను, స్థిరమైన సామాజిక ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబిస్తున్నట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. దీని ఫలితమే ఇళ్ల అమ్మకాలు, కార్యాలయ వసతుల లీజింగ్ దశాబ్ద గరిష్ట స్థాయికి చేరుకోవడంగా పేర్కొన్నారు. 2024 తొలి ఆరు నెలల్లో మొత్తం అమ్మకాల్లో 34 శాతం ఖరీదైన ఇళ్లే ఉన్నట్టు చెప్పారు. ‘‘ప్రపంచంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కావడం ఆఫీస్ వసతుల డిమాండ్‌పై సానుకూల ప్రభావం చూపించింది. స్థిరమైన సామాజిక ఆర్థిక పరిస్థితులకు తోడు, ప్రస్తుత వృద్ధి జోరు ఆధారంగా 2024 సంవత్సరం మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు, వాణిజ్య వసతుల లావాదేవీలు బలంగా నమోదవుతాయనే అంచనా వేస్తున్నాం’’అని బైజాల్ వివరించారు. పట్టణాల వారీగా గణాంకాలు.. → ముంబై నగరంలో ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య కాలంలో 47,259 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోలి్చచూస్తే 16 శాతం అధికం. ఇక ఆఫీస్ వసతుల లీజింగ్ పరిమాణం 79 శాతం వృద్ధితో 5.8 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. → ఢిల్లీ ఎన్సీఆర్లో ఇళ్ల అమ్మకాలు 4 శాతం పెరిగి 28,998 యూనిట్లుగా ఉన్నాయి. ఆఫీస్ స్పేస్ డిమాండ్ 11.5 శాతం పెరిగి 5.7 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. → బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 4 శాతం వృద్ధితో 27,404 యూనిట్లకు చేరాయి. కార్యాలయ స్థలాల లీజింగ్ 21 శాతం పెరిగి 8.4 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. → పుణెలో 24,525 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. ఇది 13 శాతం వృద్ధికి సమానం. ఆఫీస్ వసతుల లీజింగ్ 88 శాతం పెరిగి 4.4 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. → చెన్నైలో 12 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు 7,975 యూనిట్లుగా ఉన్నాయి. ఇక్కడ ఆఫీస్ వసతులకు డిమాండ్ 33 శాతం తగ్గి 3 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. → కోల్‌కతాలో 9,130 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూస్తే 25 శాతం పెరిగాయి. ఆఫీస్ స్పేస్ లీజు సైతం 23 శాతం వృద్ధితో 0.7 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. → అహ్మదాబాద్ పట్టణంలో ఇళ్ల అమ్మకాలు 17 శాతం వృద్ధితో 9,377 యూనిట్లకు చేరాయి. ఆఫీస్ వసతుల లీజింగ్ భారీ వృద్ధితో 1.7 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది.సానుకూల పరిస్థితుల అన్ని ధరల విభాగాల్లో ఇళ్ల అమ్మకాలు బలంగా ఉన్నట్టు గురుగ్రామ్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ తెలిపారు. అధిక వృద్ధికితోడు, మౌలిక వసతుల అభివృద్ధి డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తున్నట్టు చెప్పారు. సొంతిల్లు కలిగి ఉండాలనే అభిలాష, కొనుగోలుకు ముందస్తు ప్రణాళికలు ఈ వృద్ధిని ప్రధానంగా నడిపిస్తున్నాయని ప్రాపర్టీ ఫస్ట్ రియల్టీ వ్యవస్థాపకుడు, సీఈవో భవేష్ కొఠారి అభిప్రాయపడ్డారు. -
రెండు ఆఫీస్ స్పేస్‌లను అమ్మిన గోద్రెజ్.. ధర 157 కోట్లు
గోద్రెజ్ అండ్ బోయ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలోని విక్రోలిలోని గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రెండు ఆఫీస్ స్పేస్‌లను రూ.157 కోట్లకు విక్రయించింది గోద్రెజ్ వన్ భవనంలోని సౌత్ టవర్లోని ఎనిమిదో అంతస్తులో మొదటి కార్యాలయ స్థలం 24,364 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇదే టవర్లోని తొమ్మిదో అంతస్తులో రెండో కార్యాలయం ఉంది. ఈ రెండు ఆఫీస్ స్పేస్‌లను అమ్మింది. కాగా, రెండు కార్యాలయ స్థలాలకు సంబంధించి మొత్తం 75 వెహికల్ పార్కింగ్ స్థలం ఉన్నట్లు తెలుస్తోంది. కమర్షియల్ బిల్డింగ్ గోద్రెజ్ వన్గోద్రెజ్ వన్ కమర్షియల్ లగ్జరీ టవర్స్. సౌత్ ఉత్తర టవర్‌లో భూమి నుంచి కిందకి రెండు ఫ్లోర్లు ఉండగా.. 11 అంతస్తుల కార్యాలయ స్థలాలు ఉన్నాయి.వేల కోట్ల విలువైన హౌసింగ్ ప్రాజెక్ట్‌లు బుకింగ్స్సంస్థ రియల్ ఎస్టేట్ విభాగం గోద్రెజ్ ప్రాపర్టీస్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.21,000 కోట్ల విలువైన హౌసింగ్ ప్రాజెక్ట్‌లను నిర్మించడానికి 10 స్థలాలను కొనుగోలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 20వేల కోట్ల అమ్మకాల బుకింగ్స్ నిర్వహించేలా.. మరికొన్ని ప్రాంతాల్లో ల్యాండ్స్‌ను కొనుగోలు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. గోద్రెజ్ ప్రాపర్టీస్ భవిష్యత్‌లో రూ. 21,225 కోట్లతో 10 కొత్త ప్రాజెక్ట్‌లు బుకింగ్స్ అవుతాయని తెలిపింది. -
హైదరాబాద్‌లో దూసుకెళ్తున్న రియల్టీ రంగం
దేశవ్యాప్తంగా ఆఫీస్ స్థలాలకు డిమాండ్ పెరుగుతోంది. కొవిడ్ భయాలు తొలగి క్రమంగా దాదాపు చాలా కంపెనీలు వర్క్‌ఫ్రంహోం కల్చర్‌కు స్వస్తి పలుకుతాన్నాయి. ఉద్యోగులను కార్యాలయాల నుంచే పనిచేయాలని కోరుతున్నాయి. దాంతో దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు కొత్తగా కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటంతో ఆఫీస్ స్థలాలు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ జనవరి-మార్చి మధ్యకాలంలో ఆరు మెట్రో నగరాల్లో ఆఫీస్ స్థలాల లీజులో 35 శాతం వృద్ధి నమోదైందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొల్లియర్స్ ఇండియా తాజాగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా టాప్-6 నగరాలైన బెంగళూరు, దిల్లీ-ఎన్సీఆర్, ముంబై, చెన్నై, హైదరాబాద్, పుణెలో సమీప భవిష్యత్తులో 13.6 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకునే అవకాశాలున్నాయని పేర్కొంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఇది 10.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. హైదరాబాద్‌తోపాటు ముంబై, బెంగళూరు, దిల్లీ-ఎన్సీఆర్లలో ఆఫీస్ స్థలాల లీజు పెరగగా, చెన్నైలో తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 2.9 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నారని నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. వచ్చే త్రైమాసికానికిగాను ఇప్పటికే కార్పొరేట్ సంస్థలు తమ లీజుకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకున్నాయని తెలిపింది. నివేదికలోని కొన్ని ప్రధానాంశాలు ముంబైలో ఆఫీస్ స్థలం డిమాండ్ 90 శాతం ఎగబాకి 1 మిలియన్ చదరపు అడుగుల నుంచి 1.9 మిలియన్ చదరపు అడుగులకు చేరుకోనుంది. బెంగళూరులో కార్యాలయాల స్థలం 25 శాతం పెరిగి 4 మిలియన్ చదరపు అడుగులకు చేరుకోనుంది. గతేడాది ఇది 3.2 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. దిల్లీ-ఎన్సీఆర్లో 2.5 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకునే అవకాశం ఉంది. క్రితం ఏడాది కంటే ఇది 14 శాతం అధికం. చెన్నైలో ఆఫీస్ స్పేస్ డిమాండ్ 6 శాతం తగ్గి 1.6 మిలియన్ చదరపు అడుగుల నుంచి 1.5 మిలియన్ చదరపు అడుగులకు తగ్గింది. ఇదీ చదవండి: భారత్‌లో భారీ నిక్షేపాలు.. తేలిగ్గా, దృఢంగా మార్చే ధాతువు -
హైదరాబాద్‌లో ఆఫీస్ లీజు జోరు
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో కార్యాలయ స్థలాలకు (ఆఫీస్ స్పేస్) మెరుగైన డిమాండ్ నెలకొంది. ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ కాలంలో 57 శాతం పెరిగి 2.9 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన పట్టణాల్లో ఆఫీస్ స్పేస్ లీజు మార్కెట్ 92 శాతం వృద్ధిని ఇదే కాలంలో నమోదు చేసింది. స్థూల ఆఫీస్ స్పేస్ లీజు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 10.5 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) నుంచి 20.2 మిలియన్ ఎస్ఎఫ్టీకి పెరిగింది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా వెల్లడించింది. ఇక డిసెంబర్ త్రైమాసికంలో బలమైన డిమాండ్ మద్దతుతో 2023 మొత్తం మీద ఆరు పట్టణాల్లో ఆఫీస్ స్పేస్ లీజు 16 శాతం వృద్ధితో రూ.58.2 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. పునరుద్ధరించుకున్న లీజులు, ఆసక్తి వ్యక్తీకరించిన వాటిని స్థూల ఆఫీస్ స్పేస్ లీజులో మినహాయించారు. పట్టణాల వారీగా.. ► బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజు 58 శాతం పెరిగి 5.5 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజు పరిమాణం 3.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ► చెన్నై మార్కెట్లో నాలుగు రెట్ల వృద్ధితో మిలియన్ ఎస్ఎఫ్టీ నుంచి 4.3 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. ► ఢిల్లీ ఎన్సీఆర్లో లీజు 61 శాతం పెరిగి 3.1 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ► ముంబై మార్కెట్లో ఏకంగా 87 శాతం పెరిగి 2.6 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. ► పుణెలో ఆఫీస్ స్పేస్ లీజు డిమాండ్ రెట్టింపై 2 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. డిమాండ్ కొనసాగుతుంది.. ‘‘భారత ఆఫీస్ మార్కెట్ ఆరంభ అనిశి్చతులను అధిగమించడమే కాదు, అంచనాలను మించి విజయాన్ని సాధించింది. 2023లో 58 మిలియన్ ఎస్ఎఫ్టీ మేర లీజు నమోదైంది. ఇది 2024 సంవత్సరంలో ఆఫీస్ మార్కెట్ ఆశావహంగా ప్రారంభమయ్యేందుకు మార్గం వేసింది. అనూహ్య సంఘటనలు జరిగినా, స్థిరమైన ఆర్థిక వృద్ధి అంచనాలు భారత వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు అనుకూలించనున్నాయి. దేశ, విదేశీ కంపెనీల నుంచి ఆఫీస్ స్పేస్ కోసం ఆసక్తి కొనసాగుతూనే ఉంటుంది’’అని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సరీ్వసెస్ హెడ్, ఎండీ అరి్పత్ మెహరోత్రా పేర్కొన్నారు. 2023లో ఆఫీస్ స్పేస్ లీజులో టెక్నాలజీ రంగం వాటా 25 శాతానికి తగ్గిందని, ఇది 2020లో 50 శాతంగా ఉన్నట్టు కొలియర్స్‌ఇండియా నివేదిక తెలిపింది. బీఎఫ్ఎస్ఐ, ఇంజనీరింగ్, తయారీ రంగాల నుంచి డిమాండ్ రెట్టింపైందని.. 2020లో వీటి వాటా 10–12 శాతంగా ఉంటే, 2023లో 16–20 శాతానికి పెరిగినట్టు పేర్కొంది. ఇంజనీరింగ్, తయారీ రంగ కంపెనీల నుంచి లీజు డిమాండ్ 26 శాతానికి చేరుకుంది. ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్ల నుంచి డిమాండ్ 24 శాతం పెరిగి 8.7 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. -
ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: దేశీయంగా ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ (అన్ని వసతులతో, పని చేయడానికి సిద్ధంగా ఉండే పని ప్రదేశాలు) మార్కెట్ మంచి జోరు మీద ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ మార్కెట్ 60 శాతం వృద్ధితో రూ.14,000 కోట్లకు చేరుకుంటుందని అప్‌ఫ్లెక్స్ ఇండియా సంస్థ తెలిపింది. అప్‌ఫ్లెక్స్ కూడా ఈ రంగంలోనే సేవలు అందిస్తుంటుంది. ఆపరేటర్లు ఒక్కో డెస్‌్కకు వసూలు చేసే చార్జీ పెరగడం, పోర్ట్‌ఫోలియో విస్తరణ మార్కెట్ పరిమాణం పెరిగేందుకు కారణమవుతాయని అప్‌ఫ్లెక్స్ నివేదిక వివరించింది. ఈ నివేదికను వీవర్క్ ఇండియా సీఈవో కరన్ విర్వాణి వెల్లడించారు. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ వార్షిక అద్దె ఆదాయం 2022–23లో రూ.8,903 కోట్లుగా ఉంటే, అది 2023–24లో రూ.14,227 కోట్లకు పెరుగుతుందని ఈ నివేదిక తెలిపింది. అలాగే ఈ విభాగంలో సేవలు అందించే ఆపరేటర్ల సంఖ్య గత ఆర్థిక సంవత్సరం చివరికి 10.4 లక్షలుగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి 12.66 లక్షలకు పెరగనున్నట్టు అంచనా వేసింది. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ 47 లక్షల చదరపు అడుగుల పరిమాణం నుంచి 57 లక్షల చదరపు అడుగులకు విస్తరిస్తుందని పేర్కొంది. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌లో ఒక్కో డెస్క్ నెలవారీ సగటు అద్దె 9,200 నుంచి 10,400కు.. అలాగే, అక్యుపెన్సీ (డెస్క్‌లు భర్తీ) రేటు 75 శాతం నుంచి 90 శాతానికి మెరుగుపడినట్టు వెల్లడించింది. హైబ్రిడ్ పని విధానాలతో డిమాండ్ ‘‘దేశ వాణిజ్య రియల్ ఎస్టేట్ గడిచిన కొన్ని సంవత్సరాల్లో గుణాత్మకమైన మార్పును చూసింది. ఇందులో ఫ్లెక్స్ స్పేస్ తన వంతు పాత్ర పోషించింది. హైబ్రిడ్ పని విధానాల అమలు నేపథ్యంలో సౌకర్యవంతమైన పని ప్రదేశాలకు డిమాండ్ పెరుగుతోంది’’అని విర్వాణీ తెలిపారు. ‘‘కరోనా ముందు 55 పట్టణాల పరిధిలో 1500కు పైగా ప్రదేశాల్లో 400కు పైగా ఆపరేటర్లు పని చేసే వారు. ఇప్పుడు 90 పట్టణాల పరిధిలోని 2,320 ప్రాంతాల్లో 965కు పైగా ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. దేశంలో ఫ్లెక్సిబుల్ వర్స్‌స్పేస్ దిశగా వస్తున్న మార్పు ఆశాజనకంగా ఉంది’’అని అప్‌ఫ్లెక్స్ ఇండియా సీఈవో ప్రత్యూష్ పాండే వివరించారు. పెద్ద కార్పొరేట్లు, సంస్థల నుంచి హైబ్రిడ్ పని విధానాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నందున ఇక మీదట ఈ మార్కెట్ ఇంకా విస్తరిస్తుందని చెప్పారు. ‘‘కార్పొరేట్లు సొంతంగా పెద్ద ప్రదేశాలపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదు. దీనికి బదులు ఆఫీస్ పరిష్కారాలను అందించే వారి సేవలను పొందడాన్ని సౌకర్యంగా భావిస్తున్నారు. దీనివల్ల పనిలో సౌకర్యంతోపాటు, వ్యయాలు ఆదా చేసుకునేందుకు వీలు కలుగుతోంది’’అని పాండే వివరించారు. 2023 జూన్ నాటికి దేశ వాణిజ్య ఆఫీస్ లీజింగ్‌లో కోవర్కింగ్ వాటా 19 శాతంగా ఉన్నట్టు అప్‌ఫ్లెక్స్ తెలిపింది. -
ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌లో 52 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశంలో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ 53.4 మిలియన్ చదరపు అడుగులుగా (ఎస్ఎఫ్టీ) ఉండగా, 2025 నాటికి 52 శాతం పెరిగి 81 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టిన్ పేర్కొంది. ఏటా 23 శాతం చొప్పున కాంపౌండెడ్ (సీఏజీఆర్) వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. కరోనా మహమ్మారి ఈ మార్కెట్‌కు ప్రేరణగా నిలిచినట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా 1,000కి పైగా కేంద్రాల్లో ఆపరేటర్ల నిర్వహణలో ప్రస్తుతం 7.6 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయని వెస్టిన్ నివేదిక తెలిపింది. ఈ రంగంలో 50 పెద్ద సంస్థలు ఉండగా, టాప్–10 సంస్థల నిర్వహణలోనే 84 శాతం ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ పరిమాణం ఉన్నట్టు పేర్కొంది. యూఎస్, యూరప్ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ (తక్షణ కార్యాలయ ఏర్పాటుకు అనుకూలమైన) ఆరంభ దశలో ఉన్నట్టు వెస్టిన్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. అన్ని విధాల వృద్ధి 2015–16 నుంచి ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ వినియోగం విస్తృతమైందని (వివిధ రంగాలు, కంపెనీలు), అప్పటి వరకు ఈ మార్కెట్ అసంఘటితంగా, పరిమితంగా ఉండేదని వెస్టిన్ నివేదిక వివరించింది. ఆ తర్వాత నుంచి వేగంగా పెరుగుతూ, మరింత సంఘటితంగా మారినట్టు తెలిపింది. కేవలం స్టార్టప్‌ల నుంచే కాకుండా, చిన్న, మధ్య తరహా సంస్థలు, పెద్ద సంస్థలు సైతం వినియోగించుకోవడం మొదలైనట్టు వివరించింది. ‘‘ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకునే సంస్థలు తక్కువ వ్యయం, సౌకర్యాలు, సాంకేతికంగా అత్యాధునిక వసతులను కోరుకుంటున్నాయి. స్థూల ఆర్థిక అనిశి్చతులు, మాంద్యం భయాలతో 2023 ఈ మార్కెట్‌కు సవాలే’’అని శ్రీనివాసరావు వివరించారు. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు హైబ్రిడ్ నమూనాలో రప్పిస్తున్నాయని, దీంతో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పెరుగుతుందని వెస్టిన్ నివేదిక అంచనా వేసింది. 2025 నాటికి మొత్తం ఆఫీస్ స్పేస్ (కార్యాలయ స్థలాలు )లో ఫ్లెక్సిబుల్ స్పేస్ 25 శాతంగా ఉంటుందని పేర్కొంది. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, బెంగళూరులోని వైట్‌ఫీల్డ్, పుణెలోని బనేర్, ముంబైలోని అంధేరి, గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ సిటీ ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌కు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. -
రిటైల్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: దేశ రిటైల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంస్థాగత పెట్టుబడులు (ఇనిస్టిట్యూషన్స్ ఇన్వెస్ట్మెంట్స్) గతేడాది అరు రెట్లు వృద్ధి చెంది 492 మిలియన్ డాలర్లుగా (రూ.4034 కోట్లు) నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ప్రభావం అనంతరం రిటైల్ వ్యాపారాలు పుంజుకోవడాన్ని కొలియర్స్ ఇండియా ఓ నివేదిక రూపంలో తెలియజేసింది. 2021లో రిటైల్ రియల్ ఎస్టేట్‌లోకి 77 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రావడం గమనించాలి. 2020, 2021లో కరోనా ఉధృతంగా ఉండడం పెట్టుబడులపై ప్రభావం చూపించింది. ఇక భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి సంస్థాగత పెట్టుబడులు 2022లో 20 శాతం పెరిగి 4.9 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు ఏడాదిలో ఇవి 4.08 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. డేటా కేంద్రాలు, సీనియర్ హౌసింగ్, హాలీడే హోమ్స్ తదితర ఆల్టర్నేటివ్ రియల్ ఎస్టేట్‌లోకి గతేడాది 867 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. 2021లో వచ్చిన 453 మిలియన్ డాలర్ల కంటే 92 శాతం పెరిగాయి. సంప్రదాయ సాధనాలతో పోలిస్తే మెరుగైన రాబడులను ఇచ్చే ప్రత్యామ్నాయ సాధనాల వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. ప్రత్యామ్నాయ పెట్టుబడుల్లో 52 శాతం డేటా సెంటర్స్ ఆకర్షించాయి. ఆఫీస్ మార్కెట్లోకి 41 శాతం ఇక గతేడాది మొత్తం సంస్థాగత పెట్టుబడుల్లో 41 శాతం ఆఫీస్ స్పేస్ విభాగంలోకి వచ్చాయి. అంటే 1.9 బిలియన్ డాలర్లను ఆఫీస్ స్పేస్ విభాగం ఆకర్షించింది. అంతకుముందు ఏడాది ఇదే విభాగంలో పెట్టుబడులు 1.32 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మిశ్రమ వినియోగ ప్రాజెక్టుల్లోకి రెట్టింపునకు పైగా పెరిగి 464 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇండస్ట్రియల్, వేర్‌హౌసింగ్ ఆస్తుల్లోకి 63 శాతం తక్కువగా 422 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఏడాది ఈ విభాగంలోకి వచ్చిన పెట్టుబడులు 1,130 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. నివాస ప్రాజెక్టుల్లోకి సైతం 29 శాతం తక్కువగా 656 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ‘‘భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి పెట్టుబడులు గత కొన్నేళ్ల నుంచి స్థిరంగా వస్తున్నాయి. నిర్మాణాత్మక వచ్చిన మార్పుతో ఈ మార్కెట్ ఇంకా వృద్ధి చెందుతుంది’’అని కొలియర్స్‌ఇండియా తన నివేదికలో పేర్కొంది. తొమ్మిదేళ్ల గరిష్టానికి ఇళ్ల అమ్మకాలు దేశవ్యాప్తంగా ఎనమిది ప్రధాన నగరాల్లో గతేడాది 3,12,666 ఇళ్లు అమ్ముడయ్యాయి. 2021తో పోలిస్తే 34 శాతం అధికం కాగా, తొమ్మిదేళ్లలో ఇదే గరిష్టం కావడం విశేషం. ఇళ్ల ధరలు, వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ ఈ స్థాయి వృద్ధి నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా తన నివేదికలో తెలిపింది. ‘ముంబై అత్యధికంగా 85,169 యూనిట్లతో 35 శాతం వృద్ధి సాధించింది. ఢిల్లీ ఎన్సీఆర్ 58,460 యూనిట్లతో 67 శాతం, బెంగళూరు 53,363 యూనిట్లతో 40 శాతం, 43,410 యూనిట్లతో పుణే 17 శాతం అధికంగా విక్రయాలు నమోదు చేసింది. 28 శాతం వృద్ధితో హైదరాబాద్ 31,046 యూనిట్లు, 19 శాతం అధికమై చెన్నైలో 14,248 యూనిట్లు, 58 శాతం ఎక్కువై అహ్మదాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 14,062 యూనిట్లకు చేరుకున్నాయి. కోల్‌కత 10 శాతం క్షీణించి 12,909 యూనిట్లకు పరిమితమైంది. 2022లో ఆఫీస్ లీజింగ్ స్థలం స్థూలంగా 36 శాతం అధికమై 5.16 కోట్ల చదరపు అడుగులుగా ఉంది’ అని నివేదిక వివరించింది. -
పెట్టుబడుల వరద, హైదరాబాద్‌లో సెమీకండక్టర్ల తయారీ..ఎక్కడంటే!
సాక్షి, సిటీబ్యూరో: కార్యాలయ స్థలాల లావాదేవీలలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ ఆఫీసు స్పేస్‌ను కొనుగోలు చేసింది. అమెరికాకు చెందిన సెమీకండకర్ల తయారీ కంపెనీ మైక్రోచిప్ టెక్నాలజీ కోకాపేటలోని వన్ గోల్డెన్ మైల్ టవర్‌లో 1.68 లక్షల చదరపు అడుగుల గ్రేడ్–ఏ ఆఫీసు స్థలాన్ని కొనుగోలు చేసింది. డీల్ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. ఈ లావాదేవీలకు కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సలహాదారుగా వ్యవహరించింది. అమెరికాలోని ఆరిజోనా ప్రధాన కేంద్రంగా ఉన్న మైక్రోచిప్‌కు మన దేశంలో హైదరాబాద్‌తో సహా బెంగళూరు, చెన్నైలలో డెవలప్మెంట్ సెంటర్లున్నాయి. తాజా పెట్టుబడులు వచ్చే 10 ఏళ్లలో కంపెనీ సామర్థ్యాల విస్తరణ, నియామకాలు, అభివృద్ధి ప్రణాళికలకు సరిపోతాయని మైక్రోచిప్ టెక్నాలజీ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఎండీ శ్రీకాంత్ శెట్టికెరె అన్నారు. 66 మీటర్ల ఎత్తయిన వాణిజ్య సముదాయంలో సుమారు 5 లక్షల చ.అ. గ్రేడ్–ఏ ఆఫీసు స్థలం ఉంది. ఆరియన్, ఎస్కార్, టెర్మినస్‌లు ఈ ప్రాపర్టీని కో–ప్రమోటర్లుగా ఉన్నాయి. యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (యూఎస్జీబీసీ) నుంచి ఎల్ఈఈడీ గోల్డ్ రేటింగ్ సర్టిఫికెట్‌ను దక్కించుకుందని వన్ గోల్డెన్ మైల్ మేనేజింగ్ పార్టనర్ పుష్కిన్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఆర్ధిక మాంద్యం, లేఆఫ్‌లు వంటి వ్యాపార ఒత్తిడి నేపథ్యంలోనూ హైదరాబాద్‌లో ప్రీమియం ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగడం సానుకూల దృక్పథమని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ హైదరాబాద్ ఎండీ వీరాబాబు తెలిపారు. -
ఆఫీస్ స్పేస్ లీజింగ్.. పెరుగుతున్న డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాణిజ్య లీజింగ్ కార్యకలాపాలు ఈ ఆర్థిక సంవత్సరంతోపాటు 2023–24లో సైతం 10–15 శాతం ఆరోగ్యకర వృద్ధిని సాధించే అవకాశం ఉందని క్రిసిల్ నివేదిక తెలిపింది. దీని ప్రకారం.. ఈ వృద్ధి రేటును అనుసరించి వాణిజ్య లీజింగ్ స్థలం 2022–23లో 2.8–3 కోట్ల చదరపు అడుగులను తాకుతుంది. ఆ తర్వాతి ఏడాది 3.1–3.3 కోట్ల చ.అడుగులకు పెరుగుతుంది. ఆఫీసుల నుంచి కార్యకలాపాలకు ఎక్కువ కంపెనీలు ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో డిమాండ్‌లో మెరుగుదల ఉంటుంది. కమర్షియల్ రియల్టర్ల క్రెడిట్ ప్రొఫైల్స్ తగిన పరపతితో ఈ రెండేళ్లలో ఆరోగ్యంగా కొనసాగుతాయి. హైదరాబాద్‌సహా బెంగళూరు, చెన్నై, కోల్‌కత, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, ఢిల్లీ ఎన్సీఆర్లో 2022 మార్చి నాటికి 67 కోట్ల చ.అడుగుల గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో వేగం పుంజుకున్న తర్వాత ఆఫీస్ స్పేస్ లీజింగ్ అక్టోబర్–మార్చిలో తాత్కాలికంగా వెనక్కి తగ్గుతుంది. సానుకూల అంశాలు.. ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో 45 శాతం వాటా ఉన్న ఐటీ, ఐటీఈఎస్ విభాగంలో కొత్త ఉద్యోగుల చేరిక విషయంలో 2023–24లో సింగిల్ డిజిట్లో వృద్ధి నమోదు కానుంది. 30–50 శాతం ఉన్న ఆక్యుపెన్సీ మరింత పెరగనుంది. బీఎఫ్ఎస్ఐ, కన్సల్టింగ్, ఇంజనీరింగ్, ఫార్మా, ఈ–కామర్స్ విభాగాలు నూతనంగా ఆఫీస్ స్పేస్‌ను జతచేయనున్నాయి. ఆక్యుపెన్సీ 2022–23లో 84–85 శాతం వద్ద స్థిరపడవచ్చు. ఆసియా దేశాల్లోని పలు నగరాలతో పోలిస్తే భారత్‌లో అద్దె తక్కువ. ముంబైలో అద్దె చదరపు అడుగుకు రూ.130, బెంగళూరు 95, ఢిల్లీ ఎన్సీఆర్ 80 ఉంది. షాంఘై రూ.275, సియోల్ 200, మనీలా రూ.150 పలుకుతోంది. సింగపూర్ రూ.650, లండన్ 600, న్యూయార్క్, టోక్యో చెరి 550, హాంగ్‌కాంగ్ 500, సిడ్నీలో రూ.400 ఉంది. -
ప్రీమియం ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌లో బెంగళూరు టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ (గ్రేడ్–ఏ) విభాగంలో బెంగళూరు కొత్త రికార్డు నమోదు చేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 2022 సెప్టెంబర్ నాటికి 1.06 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంతో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. కమర్షియల్ రియల్ ఎస్టేట్ సర్వీసుల్లో ఉన్న సీబీఆర్ఈ ఇండియా ప్రకారం.. షాంఘై, బీజింగ్, సియోల్, టోక్యో, సింగపూర్ వంటి 11 ప్రధాన నగరాలను తలదన్ని బెంగళూరు ముందు వరుసలో నిలిచింది. షాంఘై ఒక కోటి, బీజింగ్ 76 లక్షల చ.అడుగుల విస్తీర్ణంతో ఆ తర్వాతి స్థానాలను అందుకున్నాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఫ్లెక్సిబుల్ ఏ–గ్రేడ్ ఆఫీస్ స్థలంలో భారతదేశం ముందుంది. 12 నగరాలతో కూడిన జాబితాలో 66 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఢిల్లీ–ఎన్సీఆర్ అయిదవ స్థానంలో ఉంది. 57 లక్షల చ.అడుగులతో హైదరాబాద్ ఏడవ స్థానం ఆక్రమించింది. ఆసియా పసిఫిక్‌లో ప్రీమియం ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ రంగంలో ఈ మూడు నగరాల వాటా ఏకంగా 35 శాతానికి చేరింది. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే గ్రేడ్–ఏ కార్యాలయ భవనాలలో భారత్, సింగపూర్ అత్యధిక ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్థలం కలిగి ఉన్నాయి. భారత్ అత్యధిక వృద్ధి.. మొత్తం ప్రీమియం ఆఫీస్ స్పేస్‌లో 5.5 శాతం ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ వాటాతో హైదరాబాద్ తొలి స్థానంలో ఉంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మహమ్మారి తర్వాత ఫ్లెక్సీ–ఆఫీస్ మార్కెట్లో భారత్ అత్యధిక వృద్ధిని సాధిస్తోంది. ఆసియా పసిఫిక్‌లో ఫ్లెక్సిబుల్ స్థలం 6 శాతం వార్షిక వృద్ధితో 7.6 కోట్ల చ.అడుగులు ఉంది. మహమ్మారి ముందు కాలంతో పోలిస్తే 2022 జనవరి–సెప్టెంబర్‌లో 15 శాతం వృద్ధి చెందింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మొత్తం ఫ్లెక్సిబుల్ కేంద్రాల సంఖ్య సుమారు 3,000 ఉంది. ఫ్లెక్సిబుల్ స్థల వినియోగంలో సాంకేతిక కంపెనీలు 36 శాతం, బిజినెస్ సర్వీసులు 28 శాతం కైవసం చేసుకున్నాయి. ఫైనాన్స్, లైఫ్ సైన్సెస్, రిటైల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్లు స్వల్పకాలిక ఒప్పందాలు, అనువైన నిబంధనలతో సేవలు అందిస్తున్నాయి. దీంతో క్లయింట్లకు వ్యయాలు తగ్గుతున్నాయి’ అని ద్వారక ఆఫీస్ స్పేసెస్ ఎండీ ఆర్.ఎస్.ప్రదీప్ రెడ్డి తెలిపారు. ఫ్లెక్సిబుల్ కేంద్రాల్లో కార్యాలయాల నిర్వహణకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటాయి. -
ఆఫీస్ స్పేస్ నికర లీజింగ్‌లో వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఆఫీస్ స్పేస్ నికర లీజింగ్ ఏడు ప్రధాన నగరాల్లో 41–49 శాతం వృద్ధి చెందుతుందని జేఎల్ఎల్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై, కోల్‌కత, ముంబై, పుణేలో నికర లీజింగ్ 2021లో 2.62 కోట్ల చదరపు అడుగులు నమోదైంది. 2022లో ఇది 3.7–3.9 కోట్ల చదరపు అడుగులు ఉండే అవకాశం ఉంది. మహమ్మారికి ముందు 2019లో నికర లీజింగ్ ఏకంగా 4.79 కోట్ల చదరపు అడుగులు నమోదైంది. 2022 జనవరి–సెప్టెంబర్‌లో కార్యాలయ స్థలాల నికర లీజింగ్ మూడేళ్ల గరిష్టం 3.03 కోట్ల చదరపు అడుగులుగా ఉంది. ప్రస్తుత సంవత్సరంలో మార్కెట్ అయిదేళ్ల (2015–19) సగటు దిశగా వెళ్తోంది. వచ్చే ఏడాది సైతం.. నూతనంగా కార్యాలయ స్థలాలను చేజిక్కించుకునే విషయంలో టెక్ కంపెనీల నుంచి డిమాండ్ తగ్గినప్పటికీ, తయారీ, ఆరోగ్య సేవలు, ఫ్లెక్స్ విభాగాల నుంచి పెరిగింది. 2023లోనూ ఇదే ట్రెండ్ ఉంటుంది. వచ్చే ఏడాది ఆఫీస్ స్పేస్ నికర లీజింగ్ 3.7–4 కోట్ల చదరపు అడుగులు నమోదయ్యే చాన్స్ ఉంది. ఇక రెసిడెన్షియల్ విభాగంలో ఈ ఏడాది అమ్మకాలు 2 లక్షల యూనిట్లు దాటే అవకాశం ఉంది. ఇదే జరిగితే దశాబ్దంలో అత్యధిక విక్రయాలు నమోదు కావొచ్చు. 2010లో దేశంలో ఏడు ప్రధాన నగరాల్లో 2.16 లక్షల యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగాయి. 2022లో ప్రతి త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు 50,000 యూనిట్లను దాటాయి. గిడ్డంగులు, అసెంబ్లింగ్, విలువ ఆధారిత తయారీ విభాగంలో స్థల డిమాండ్ 2021 కంటే అధికంగా ఈ ఏడాది 4 కోట్ల చదరపు అడుగులు మించనుంది. -
ఆఫీస్ స్పేస్ డిమాండ్ డౌన్
న్యూఢిల్లీ: ఆఫీసు స్థలాల లీజు అక్టోబర్ నెలలో 21 శాతం తక్కువగా నమోదైనట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ సేవల్లోని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో మొత్తం 6.7 మిలియన్ చదరపు అడుగుల మేర కార్యాలయాల స్థలాల లీజు నమోదైనట్టు బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణె, కోల్‌కతాకు సంబంధించి వివరాలను వెల్లడించింది. అన్ని రకాల ఆఫీసు లీజు వివరాలను పరిగణనలోకి తీసుకుంది. క్రితం ఏడాది అక్టోబర్ నెలకు సంబంధించి ఆఫీసు లీజ్ పరిమాణం 8.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. నెలవారీ లీజు పరిమాణంలో 65 శాతం వాటాతో ముంబై ముందుంది. ముంబై మార్కెట్లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ బలంగా ఉండడానికి తోడు, కొన్ని రెన్యువల్స్ (గడువు తీరిన లీజు పునరుద్ధరణ) నమోదైనట్టు జేఎల్ఎల్ నివేదిక వివరించింది. ఆ తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్, పుణె మార్కెట్లు అధిక వాటాతో ఉన్నాయి. ఈ మూడు మార్కెట్ల వాటా అక్టోబర్ నెలకు సంబంధించి ఆఫీసు లీజు పరిమాణంలో 93 శాతంగా ఉంది. తయారీ రంగం నుంచి డిమాండ్ తయారీ రంగం నుంచి ఎక్కువ డిమాండ్ కనిపించింది. 22 శాతం ఆఫీస్ స్పేస్‌ను తయారీ కంపెనీలే లీజుకు తీసుకున్నాయి. కన్సల్టెన్సీ రంగం 18 శాతం, బీఎఫ్ఎస్ఐ రంగం ఇంతే చొప్పున లీజుకు తీసుకున్నాయి. టెక్నాలజీ రంగ కంపెనీల వాటా 15 శాతంగా ఉంది. ఆఫీస్ స్పేస్ లీజు విషయంలో టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికీ నిదానంగా అడుగులు వేస్తున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. జేఎల్ఎల్ ఇండియా డేటా ప్రకారం.. ఈ ఏడాది మార్చి నాటికి ఆఫీస్ గ్రేడ్ ఏ (ప్రీమియం) విస్తీర్ణం ఈ ఏడు పట్టణాల్లో 732 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఇతర గ్రేడ్లలోని విస్తీర్ణం 370 మిలియన్ చదరపు అడుగుల మేర ఉంది. మొత్తం 1.1 బిలియన్ చదరపు అడుగులు ఉన్నట్టు ఈ నివేదిక తెలియజేసింది. -
ఆఫీస్ స్పేస్ సరఫరా తగ్గింది
సాక్షి, హైదరాబాద్: నివాస, కార్యాలయ స్థిరాస్తి వ్యాపారంలో ఐటీ రంగానికి ప్రధాన పాత్ర. ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని గృహాలను, కంపెనీల కోసం ఆఫీస్ స్పేస్‌ను నిర్మిస్తుంటారు. కానీ, కరోనా తర్వాతి నుంచి సీన్ మారింది. వర్క్ ఫ్రం హోమ్ విధానంతో అపార్ట్మెంట్లకు గిరాకీ తగ్గడంతో పాటు గ్రేడ్–ఏ కార్యాలయ స్థలాలకు డిమాండ్ ఆశించిన స్థాయిలో లేదు. నాలుగు ప్రధాన ఐటీ హబ్‌లైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణేలలో ఆఫీస్ స్పేస్ వేకెన్సీగా ఉంది. కోవిడ్ తర్వాత నిర్మాణ సంస్థలు కూడా కొత్త కార్యాలయాల స్థలాల సరఫరాను తగ్గించి.. ఉన్న ఆఫీస్ స్పేస్‌ను భర్తీ చేయడంపై దృష్టి సారించాయి. కరోనా సమయంలో ఐటీ వ్యాపారం జోరుగా సాగడంతో పెద్ద, మధ్య తరహా సంస్థలు అప్పటికే ఉన్న ఆఫీస్ స్పేస్ లీజులను పునరుద్ధరించారు. అదే సమయంలో లీజు స్థలాలను సొంతానికి కొనుగోలు చేయడమో లేదా కొత్త ఆఫీస్ స్పేస్‌ను తీసుకోవటమో చేయలేదు. ఎందుకంటే లీజు పునరుద్ధరణ కంటే స్థలం కొనుగోలు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి. కరోనా తర్వాతి నుంచి ఐటీ, ఐటీఈఎస్ రంగాల కంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), తయారీ, పారిశ్రామిక రంగాల నుంచి గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్‌కు గణనీయమైన డిమాండ్ ఏర్పడింది. నాలుగు ప్రధాన ఐటీ హబ్ నగరాలలో చ.అ. ఆఫీస్ స్పేస్ ధర నెలకు రూ.58–78లుగా ఉండగా.. ఎన్సీఆర్, ముంబైలలో రూ.80–126లుగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 4 కోట్ల చ.అ. స్థలం.. ప్రస్తుతం హైదరాబాద్‌లో 8 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉంది. ఇందులో 15 శాతం కంటే ఎక్కువ స్పేస్ ఖాళీగా ఉందని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. బెంగళూరు మాదిరిగానే హైదరాబాద్‌లో కూడా మరో 4 కోట్ల చ.అ. గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ నిర్మాణ దశలో ఉందని, వచ్చే 2–3 ఏళ్లలో ఆయా నిర్మాణాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఇతర నగరాల్లో.. ప్రస్తుతం అత్యధికంగా బెంగళూరులో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉంది. 16.8 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ ఉండగా.. ఇందులో 11.25 శాతం స్పేస్ వేకెన్సీ ఉంది. కొత్తగా 4 కోట్ల చ.అ. స్థలం నిర్మాణ దశలో ఉంది. ► ముంబైలో 10.8 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ ఉండగా.. 16 శాతం ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కొత్తగా 1.5 కోట్ల చ.అ. కొత్త స్పేస్ కన్స్ట్రక్షన్ స్టేజ్‌లో ఉంది. ► కోల్‌కతాలో 2.5 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ ఉండగా.. 23.5 శాతం వెకెన్సీ ఉంది. సుమారు 20 లక్షల చ.అ. స్పేస్ ΄్లానింగ్ దశలో ఉంది. ► పుణేలో ప్రస్తుతం 6 కోట్ల చ.అ. స్పేస్ ఉండగా.. అత్యల్పంగా 8.5 శాతం స్థలం మాత్రమే వేకెన్సీ ఉంది. కానీ, కొత్తగా 1.3 కోట్ల చ.అ. స్థలం నిర్మాణ దశలో ఉంది. ► చెన్నైలో 5.5 కోట్ల చ.అ. అందుబాటులో ఉండగా.. 10.35 శాతం స్థలం ఖాళీగా ఉంది. కొత్తగా 1.5 కోట్ల చ.అ. స్పేస్ కన్స్ట్రక్షన్లో ఉంది. ► ఎన్సీఆర్లో 12.8 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ ఉండగా.. 28.5 శాతం వేకెన్సీ ఉంది. కొత్తగా 2.6 కోట్ల చ.అ. స్పేస్ నిర్మాణ దశలో ఉంది. నగరాల వారీగా గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ (చ.అ.) (కోట్లలో) నగరం ప్రస్తుత ఖాళీలు నిర్మాణంలోని స్థలం (%లో) స్థలం బెంగళూరు 16.8 11.25 4 హైదరాబాద్ 8 15 4 చెన్నై 5.5 10.35 1.5 పుణే 6 8.50 1.3 ఎన్సీఆర్ 12.8 28.50 2.6 ముంబై 10.8 16 1.5 కోల్‌కతా 2.5 23.50 20 లక్షలు -
రియల్ ఎస్టేట్ రంగం ఢీలా, కానీ వీటికి మాత్రం భారీగా పెరిగిన డిమాండ్!
న్యూఢిల్లీ: కార్యాలయ స్థలాలకు (ఆఫీస్ స్పేస్) మే నెలలో డిమాండ్ గణనీయంగా పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా మూడింతలు పెరిగి 6.1 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైనట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ ఓ నివేదిక విడుదల చేసింది. కార్యాలయాలకు తిరిగి వచ్చి పనిచేయడం, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడమే డిమాండ్ ఇంతలా వృద్ధి చెందడానికి కారణమని పేర్కొంది. 2021 మే నెలలో ఆఫీస్ స్పేస్ లీజు 2.2 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. అప్పుడు కరోనా రెండో విడత ప్రభావం చూపించడం గమనార్హం. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణె, కోల్‌కతా నగరాల్లోని గణాంకాలను జేఎల్ఎల్ ఇండియా తన నివేదికలో చోటు కల్పించింది. ప్రధానంగా బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై నగరాలు మే నెల మొత్తం ఆఫీసు స్పేస్ లీజులో 91 శాతం వాటా ఆక్రమించాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో స్థూల ఆఫీసు స్పేస్ లీజు 4.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్నట్టు నివేదిక తెలిపింది. ఆఫీస్ గ్రేడ్ ఏ (ప్రీమియం/ఖరీదైన) స్పేస్ లీజు మార్చి చివరికి 732 మిలియన్ చరదపు అడుగులుగా ఉంది. దీంతో మొత్తం లీజు స్థలం 1.1 బిలియన్ చదరపు అడుగులకు చేరింది. మాంద్యం ఒత్తిళ్లు ఉంటాయేమో చూడాలి.. భౌతికంగా పనిచేసే ప్రదేశాలు కంపెనీలకు ప్రాధాన్యంగా ఉండడమే డిమాండ్ పెరగడానికి కారణమని జేఎల్ఎల్ ఇండియా రీసెర్చ్ హెడ్ సమంతక్‌దాస్ తెలిపారు. ‘‘కరోనా ఇన్ఫెక్షన్లు తగ్గిపోవడం, టీకాలను పూర్తిస్థాయిలో ఇవ్వడం, ఆర్థిక కార్యకలపాలను పూర్థి స్థాయిలో అనుమతించడం, రవాణా, పౌరుల కదలికలపై ఎటువంటి ఆంక్షల్లేకపోవడం.. రియల్ ఎస్టేట్ ప్రణాళికలపై మరింత స్పష్టతకు వీలు కల్పించింది’’అని దాస్ చెప్పారు. అయితే, రానున్న నెలల్లో ఆఫీస్ స్పేస్ డిమాండ్‌పై ప్రభావం ఉండొచ్చన్నారు. ‘‘అంతర్జాతీయంగా అధిక స్థాయిలో ద్రవ్యోల్బణం, మాంద్యం ఒత్తిళ్లు కార్యాలయ స్థలాల డిమాండ్‌పై ఏ మేరకు ఉంటాయో రానున్న కాలంలో మేము సమీక్షిస్తుంటాం. అయితే ఐటీకి ప్రధాన కేంద్రంగా ఉండడం, అవుట్సోర్సింగ్ వల్ల భారత్ ప్రయోజనం పొందొచ్చు’’అని చెప్పారు. భారత్‌లో రియల్ ఎస్టేట్ వ్యయాలు తక్కువగా ఉండడం, పుష్కలమైన నైపుణ్యాలు కార్యాలయ స్థలాల డిమాండ్‌ను నడిపించే కీలక అంశాలుగా పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో నిర్మాణంలో భారీ భవంతి.. ఏకంగా 45 అంతస్థులతో..
సాక్షి, హైదరాబాద్: సాస్ ఇన్ఫ్రా హైదరాబాద్‌లో మూడు భారీ ఆఫీస్ స్పేస్ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తోంది. 1.4 కోట్ల చ.అ. రానున్న ఈ మూడు ప్రాజెక్ట్‌ల మార్కెట్, మేనేజ్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కొల్లియర్స్ గ్రూప్‌తో భాగస్వామ్యమైంది. ఇప్పటికే సాస్ ఇన్ఫ్రా ఎంబసీ గ్రూప్‌తో జతకట్టిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ రియల్టీ మార్కెట్లోకి ఎంబీసీ రీ ఎంట్రీ ఇచ్చినట్టయింది. ప్రపంచ స్థాయి కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయుక్తమవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 52 లక్షల చ.అ. విస్తీర్ణంలో 36 అంతస్తులలో ఎంబసీ–సాస్ 1 టవర్ ప్రాజెక్ట్ ఉంటుంది. 30 లక్షల చ.అ.లలో రానున్న ఎంబసీ డైమండ్ టవర్ 45 అంతస్తులలో ఉంటుంది. అలాగే మరో 30 లక్షల చ.అ.లలో క్రౌన్ ప్రాజెక్ట్ ప్రణాళిక దశలో ఉంది. చదవండి: తెలుగులో రియల్ ఎస్టేట్ కింగ్‌లు ఎవరంటే! -
బెంగళూరు కంటే హైదరాబాద్‌లో వీటికి డిమాండ్ ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: ఊహించినట్లుగానే కరోనా తర్వాత కో–వర్కింగ్ స్పేస్ శరవేగంగా కోలుకుంది. బహుళ జాతి కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్‌ను కొనసాగిస్తుండటం, మధ్య స్థాయి కంపెనీలు హైబ్రిడ్ విధానంలో పని చేస్తుండటంతో కో–వర్కింగ్ విభాగానికి డిమాండ్ ఏర్పడింది. 2021–22 ఆర్థ్ధిక సంవత్సరంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 3.41 కోట్ల చ.అ. నికర ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగగా.. ఇందులో 13 శాతం వాటా (44.3 లక్షల చ.అ.) కో–వర్కింగ్ స్పేస్ విభాగానిదే. 2020–21 ఆర్థిక సంవత్సరంలో టాప్–7 నగరాల్లో 2.13 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగగా.. ఇందులో కో–వర్కింగ్ స్పేస్ 5 శాతం వాటాను కలిగి ఉందని అనరాక్ రిపోర్ట్ వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన 8 శాతం వృద్ధి రేటు నమోదయింది. అన్ని కార్యాలయాల విభాగాలలో ఇదే అత్యధిక వృద్ధి రేటు కావటం గమనార్హం. క్షీణించిన ఐటీ, ఈ–కామర్స్.. ఆశ్చర్యకరంగా 2022 ఆర్థిక సంవత్సరంలో ఐటీ, ఐటీఈఎస్, ఈ–కామర్స్ రంగాల ఆఫీస్ స్పేస్ లావాదేవీలు క్షీణించాయి. 2021 ఆర్ధికంతో పోలిస్తే తయారీ, పారిశ్రామిక రంగాలు అత్యధికంగా ఏటా 4 శాతం నికర లావాదేవీల వృద్ధిని నమోదు చేయగా.. ఐటీ, ఈ–కామర్స్ రంగాలు మాత్రం వరుసగా 8 శాతం, 6 శాతం మేర క్షీణించాయి. పెద్ద స్థలాలకే గిరాకీ.. 2022 ఫైనాన్షియల్ ఇయర్లో నికర ఆఫీస్ స్పేస్ లావాదేవీలలో బెంగళూరును హైదరాబాద్ అధిగమించింది. లక్ష చ.అ. కంటే ఎక్కువ స్పేస్ లావాదేవీలు 2021 ఆర్ధిక సంవత్సరంలో 47 శాతం వాటా కలిగి ఉండగా.. 2022 ఆర్థికం నాటికి 50 శాతానికి పెరిగాయి. అలాగే మధ్య స్థాయి ఆఫీస్ స్పేస్ లావాదేవీలు స్వల్పంగా 1 శాతం మేర వృద్ధి చెందగా.. చిన్న స్థాయి ఒప్పందాలు మాత్రం ఏకంగా 4 శాతం క్షీణించాయి. కొత్త సప్లయ్‌లో దక్షిణాది టాప్.. 2022 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 5.12 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ సరఫరా జరిగింది. ఇందులో 58 శాతం అంటే 2.98 కోట్ల చ.అ. వాటా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై దక్షిణాది నగరాలే కలిగి ఉన్నాయి. 2021 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 27 శాతం వృద్ధి. సగటున టాప్ 7 నగరాలలో కార్యాలయాల అద్దెలు చ.అ.కు రూ.76గా ఉంది. అత్యంత ఖరీదైన ఆఫీస్ మార్కెట్‌గా ముంబై నిలిచింది. ఇక్కడ చ.అ. ధర రూ.126గా ఉంది. ఆ తర్వాత బెంగళూరు, ఎన్సీఆర్ నగరాలలో చ.అ.కు రూ.78గా ఉంది. కొత్తగా ఆఫీస్ స్పేస్ నిర్మాణాలు పూర్తి కావటంతో టాప్ 7 నగరాల్లో ఖాళీ స్థాయిలు 1 శాతం మేర పెరిగాయి. అత్యధికంగా 28.5 శాతంతో అత్యధిక ఆఫీస్ స్పేస్ వేకెన్సీ ఉన్న నగరంగా ఎన్సీఆర్ నిలిచింది. ఆ తర్వాత 23.5 శాతంతో కోల్‌కతా, 15.75 శాతం వేకెన్సీతో ముంబై నిలిచాయి. బెంగళూరును మించి హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ కొత్త రికార్డ్లను సృష్టిస్తోంది. బెంగళూరులో కంటే మన నగరంలోనే అత్యధికంగా కార్యాలయాల స్థలాల లావాదేవీలు జరిగాయి. 2022 ఆర్ధిక సంవత్సరంలో గార్డెన్ సిటీలో 76 లక్షల చ.అ. నికర ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగగా.. హైదరాబాద్‌లో 78.5 లక్షల చ.అ. ట్రాన్సాక్షన్స్ పూర్తయ్యాయి. 2022 ఫైనాన్షియల్ ఇయర్‌లోని మొత్తం ఆఫీస్ స్పేస్ లావాదేవీలలో హైదరాబాద్ వాటా 23 శాతంగా ఉంది. అయితే కొత్త సపయ్లో మాత్రం బెంగళూరు ముందుంది. ఇక్కడ కొత్తగా 1.45 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ సరఫరా కాగా.. మన నగరంలో 1.18 కోట్ల చ.అ.లకు పరిమితమైంది. డిమాండ్ ఎందుకంటే? – అనూజ్ పూరీ, చైర్మన్, అనరాక్ గ్రూప్ కరోనా సమయంలో దేశీయ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో హైబ్రిడ్ వర్క్ మోడల్ బలమైన కొత్త శక్తిగా ఆవిర్భవించింది. వ్యాపారులు, ఉద్యోగులకు కార్యకలాపాలను సజావుగా కొనసాగించే సౌకర్యవంతమైన ప్రదేశాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆఫీస్ లేఅవుట్‌ను మార్చే ఇతర ఎంపికలు లేదా హబ్ అండ్ స్పోక్ మోడల్‌తో పోలిస్తే హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను స్వీకరించడానికి కో–వర్కింగ్ స్పేస్ అత్యంత ప్రాధాన్య ఎంపికగా మారిపోయాయి. చదవండి: రియల్టీ అంటే ఇళ్లు ఒక్కటే కాదు.. ఇవి కూడా -
రియాల్టీ రంగంలో ఈ విభాగానికి భారీ డిమాండ్!
న్యూఢిల్లీ: దేశంలో కార్యాలయాల వసతి (ఆఫీసు స్పేస్) వృద్ధి అవకాశాల పట్ల సానుకూలంగా ఉన్నట్టు టాటా రియల్టీ ప్రకటించింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్, కంపెనీల నియామకాలు డిమాండ్‌ను నిర్ణయిస్తాయని పేర్కొంది. ఏడు ప్రధాన పట్టణాల్లో ఆఫీసు స్పేస్ లీజింగ్ 2022లో 30 మిలియన్ చదరపు అడుగులకు పైగా విస్తరిస్తుందని అంచనా వేసింది. 2021లో లీజు పరిమాణం 26 మిలియన్ చదరపు మీటర్లుగా ఉంది. చాలా రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగుల నియామకాలు తిరిగి మొదలయ్యాయని టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ, సీఈవో సంజయ్ దత్ తెలిపారు. ‘‘కరోనా కేసులు గణనీయంగా తగ్గడంతో వాణిజ్య కార్యకలాపాలు ఇప్పటికే జోరందుకున్నాయి. ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేయడం కూడా పెరగనుంది. ముందస్తు సంకేతాలను గమనిస్తే 2022లో కార్యాలయల వసతి లీజు గతేడాది సంఖ్యను అధిగమిస్తుందని తెలుస్తోంది’’అని దత్ వివరించారు. చదవండి: హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు..ఎక్కువగా ఇళ్లు కొంటున్న ప్రాంతాలివే! -
హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు..ఎక్కువగా ఇళ్లు కొంటున్న ప్రాంతాలివే!
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమాది ప్రాంతాలకే పరిమితమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ఆఫీస్ స్పేస్..గ్రోత్ ఇన్ డిస్పర్షన్ (గ్రిడ్) పాలసీతో నగరం నలువైపులా విస్తరించింది. ఈ పాలసీలో భాగంగా ప్రభుత్వం ఔటర్ వెంబడి ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఉన్న 11 పారిశ్రామిక పార్క్‌లను ఐటీ పార్క్‌లుగా మార్చింది. దీంతో పాటు కొంపల్లిలో ఐటీ టవర్, కొల్లూరులో ఐటీ పార్క్‌లను నిర్మిస్తోంది. ఫలితంగా పశ్చిమం వైపున కాకుండా ఇతర ప్రాంతాలలో కొత్తగా 3.5–4 కోట్ల చ.అ. ఐటీ ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రానుందని జేఎల్ఎల్ తెలిపింది. ∙గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ లావాదేవీల్లో హైదరాబాద్ దూసుకెళుతోంది. దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం 9.04 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ ఉన్న హైదరాబాద్.. ఈ ఏడాది ముగింపు నాటికి 10 కోట్ల చ.అ. మైలురాయిని దాటనుందని జేఎల్ఎల్ సర్వేలో తేలింది. ఆఫీస్ స్పేస్ మార్కెట్లో బెంగళూరు, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్ తర్వాత హైదరాబాద్ నాల్గో స్థానంలో నిలిచింది. 2019–21 మధ్య కాలంలో నగరంలో కొత్తగా 3.47 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. గత కొంత కాలంగా కొంపల్లి, బాచుపల్లి, మేడ్చల్ వంటి ఉత్తరాది ప్రాంతాలు, ఎల్బీనగర్, ఉప్పల్, పోచారం వంటి తూర్పు ప్రాంతాలలో నివాస క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. ఆయా ప్రాంతాలలోని అందుబాటు గృహాలను ఐటీ ఉద్యోగులు కొనుగోలు చేస్తున్నారు. 81 శాతం వృద్ధి రేటు.. గత కొన్నేళ్లుగా గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో హైదరాబాద్ నగరం మెరుగైన స్థానాన్ని నమోదు చేస్తుంది. 2016 నుంచి 2021 వరకు పరిశీలిస్తే.. ఏకంగా 81 శాతం వృద్ధి రేటును నమోదు చేయడం విశేషం. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇదెంతో మెరుగైన స్థానం. హైదరాబాద్ తర్వాత రెండో స్థానంలో ఉన్న బెంగళూరు ఈ ఆరేళ్లలో 47 శాతం వృద్ధిని నమోదు చేసింది. కాగా దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోని గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ మార్కెట్ విభాగంలో హైదరాబాద్ నగర భాగస్వామ్యం ఇటీవలి వరకు 12.7 శాతంగా ఉండగా.. కొత్తగా అందుబాటులోకి వచ్చిన స్పేస్‌తో 25 శాతానికి పెరిగింది. గ్రిడ్ పాలసీ అమలుతో.. గ్రిడ్ పాలసీతో నగరం నలువైపులా ఐటీ విస్తరించింది. డెవలపర్లకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా అమలు చేస్తుంది. మూడు సంవత్సరాల వ్యవధిలో 500 లేదా అంతకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న ఐటీ, ఐటీఈఎస్ యూనిట్లకు యాంకర్ యూనిట్ ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఇందులో సంబంధిత భూమిని 50 శాతం ఐటీ, ఐటీఈఎస్ ప్రయోజనాల కోసం వినియోగించగా.. మిగిలిన సంగంలో నివాస, వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించవచ్చనే వెసులుబాటును కల్పించింది. హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ అనేది కేవలం రెండు ప్రధాన కారిడార్లలోనే కేంద్రీకృతమై ఉంది. హైటెక్‌సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలు గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ మార్కెట్ ఇంజిన్లుగా పనిచేస్తున్నాయి. 96 శాతం స్పేస్ ఈ ప్రాంతాల నుంచే ఉందని జేఎల్ఎల్ తెలంగాణ, ఏపీ ఎంండీ సందీప్ పట్నాయక్ తెలిపారు. చదవండి: తగ్గేదేలే! ఆఫీస్ స్పేస్‌లో హైదరాబాద్ అదుర్స్! -
రియల్టీలో సంస్థాగత పెట్టుబడుల జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్టీ రంగంలో సంస్థాగత పెట్టుబడుల జోరు సాగుతోంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా ప్రకారం.. 2022 జనవరి–మార్చిలో సంస్థాగత పెట్టుబడులు అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రెండింతలకుపైగా అధికమై రూ.8,375 కోట్లకు ఎగశాయి. 2021 అక్టోబర్– డిసెంబర్లో ఇవి రూ.7,600 కోట్లుగా ఉంది. కోవిడ్–19 థర్డ్ వేవ్ తర్వాత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడం, ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపడడం ఈ వృద్ధికి కారణం. కార్యాలయాల విభాగంలో పెద్ద డీల్స్ మార్చితో ముగిసిన త్రైమాసికాన్ని నడిపించాయి. గడిచిన 3 నెలల్లో వెల్లువెత్తిన పెట్టుబడుల్లో విదేశీ ఇన్వెస్టర్ల వాటా ఏకంగా 70% ఉండడం విశేషం. 2020లో తగ్గుముఖం పట్టిన తర్వాత దేశీయ పెట్టుబడిదార్ల వాటా కోవిడ్ ముందస్తు స్థాయి అయిన 30%కి చేరుకున్నాయి. ఇది దేశీయ ఇన్వెస్టర్ల విశ్వాసం లో పునరుజ్జీవనాన్ని చూపుతోంది. సంస్థాగత పెట్టుబడుల్లో ఆఫీస్, రిటైల్, ఇండ్రస్టియల్, లాజిస్టిక్స్ విభాగాలు 95% కైవసం చేసుకుని, ఆఫీస్ విభాగం తొలి స్థానాన్ని చేజిక్కించుకుంది. చదవండి: తగ్గేదేలే! ఆఫీస్ స్పేస్‌లో హైదరాబాద్ అదుర్స్! -
తగ్గేదేలే! ఆఫీస్ స్పేస్‌లో హైదరాబాద్ అదుర్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్యాలయాల కోసం లీజుకు తీసుకున్న స్థలం జనవరి–మార్చిలో 25 శాతం పెరిగి 1.08 కోట్ల చదరపు అడుగులు నమోదైంది. 2021 జనవరి–మార్చితో పోలిస్తే దేశవ్యాప్తంగా ఎనమిది ప్రధాన నగరాల్లో ఆఫీసుల కోసం నూతనంగా తోడైన స్థలం 13 శాతం వృద్ధి చెంది 1.19 కోట్ల చదరపు అడుగులుగా ఉంది. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం.. 2022 మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో హైదరాబాద్‌లో ఆఫీస్ లీజింగ్ 72 శాతం అధికమై 16 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. చెన్నైలో రెండింతలకుపైగా పెరిగి 10 లక్షల చదరపు అడుగులు, బెంగళూరు 5 శాతం దూసుకెళ్లి 35 లక్షలు, ఢిల్లీ–ఎన్సీఆర్ 37 శాతం అధికమై 23 లక్షలు, పుణే 15 శాతం వృద్ధి చెంది 9 లక్షలు, అహ్మదాబాద్ 2 లక్షల నుంచి 5 లక్షల చదరపు అడుగులకు ఎగసింది. ముంబై 24 శాతం తిరోగమనం చెంది 9 లక్షల చదరపు అడుగులుగా ఉంది. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడంతో కొన్ని త్రైమాసికాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ కోవిడ్ ముందస్తు స్థాయికి చేరుకుంటుంది. -
ఆఫీస్ స్పేస్.. పక్కాప్లాన్
ఆఫీస్ స్పేస్‌ను క్రియేట్ చేయడంలో తెలంగాణ సర్కారు వ్యూహాత్మంగా వ్యవహరిస్తోందంటూ ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ ప్రకటించింది. అంతేకాదు ఈ ఏడాది చివరి నాటికి వంద మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ కలిగిన నగరంగా నిలుస్తుందంటూ అంచనా వేసింది. హైదరాబాద్ నగరంలో ఐటీ రంగం బలంగా పాతుకుపోవడంతో ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ విషయంలో గణనీయమైన వృద్ధిని హైదరాబాద్ కనబరుస్తోంది. ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ విషయంలో బెంగళూరు, ముంబై, ఢిల్లీల తర్వాత హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. కోల్‌కతా, చెన్నై, పూనే వంటి నగరాలను వెనక్కి నెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో గ్రేడ్ ఏ రకం ఆఫీస్ స్పేస్ 90 మిలియిన్ల చదరపు అడుగులుగా ఉంది. అయితే ఇందులో 96 శాతం ఆఫీస్ స్పేస్ గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్‌సిటి వంటి నగరంలోని పశ్చిమ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. గ్రేడ్ ఏ రకం ఆఫీస్ స్పేస్ అంతా ఒకే దిక్కున ఉండడటంతో అక్కడ ఆఫీస్ స్పేస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరోవైపు భవిష్యత్తులో పశ్చిమ ప్రాంతాన్ని ట్రాఫిక్ చిక్కులు తదితర సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. దీంతో ఆఫీస్ స్పేస్‌ను వికేంద్రీకరించే విషయంగా తెలంగాణ ప్రభుత్వం గ్రోత్ ఇన్ డిస్పెర్షన్ (గ్రిడ్) పాలసీని అందుబాటులోకి తెచ్చింది. గ్రిడ్ పాలసీలో భాగంగా హైదరాబాద్ నగరంలో తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో భారీ ఎత్తున ఆఫీస్ స్పేస్‌లను అందుబాటులోకి తెచ్చే విధంగా నిర్మాణ సంస్థలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే నగరంలోని తూర్పు ప్రాంతమైన ఉప్పల్‌లో జెన్పాక్ట్, ఎన్ఎస్ఎల్, రాంకీ ఎస్టేట్స్ ఉన్నాయి. కాగా రాబోయే ఐదేళ్లలో ఈ రెండు సంస్థలు కలిసి కొత్తగా మూడు మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్‌ను వృద్ధి చేస్తామని ప్రకటించాయి. ఇక కొంపల్లి, మేడ్చల్ ఏరియాలో ఇటీవల కొత్త ఐటీ టవర్ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. గ్రేడ్ వన్ ఆఫీస్ స్పేస్ విస్తరణకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తే 2016 నుంచి 2021 వరకు హైదరాబాద్ నగరం 81 శాతం వృద్ధితో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఇక రాబోయే ఐదేళ్లలోనూ ఇదే జోరు కొనసాగుంది. అయితే కొత్తగా వచ్చే 35 నుంచి 40 మిలియన్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ పశ్చిమను మినహాయించి నగరం నలుమూలలా రానున్నట్టు జేఎల్ఎల్ పేర్కొంది. గ్రిడ్ పాలసీ వల్ల ఇది సాధ్యమవుతోందని ఆ సంస్థ పేర్కొంది. దీంతో నగరంలో ఉపాధి అవకాశాలు మెరుగవడంతో పాటు నలువైపులా సమాన స్థాయిలో అభివృద్ధి, మౌలిక వసతులు నెలకొనే అవకాశం ఉందని జేఎల్ఎల్ అభిప్రాయపడింది. చదవండి: కో–వర్కింగ్ స్పేస్.. అందరి నోటా ఇదే మాటా.. ప్రత్యేకతలు ఇవే -
ఆఫీస్ స్పేస్‌లో హైదరాబాద్ హవా.. అందుబాటులో 8.85 కోట్ల చదరపు అడుగులు
సాక్షి, హైదరాబాద్: గతేడాది హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో మిశ్రమ పవనాలు వీచాయి. వర్క్ ఫ్రం హోమ్ కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త ఆఫీస్ స్పేస్ నిర్మాణం విషయంలో డెవలపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో గతేడాది హెచ్2లో పూర్తయిన ఆఫీస్ స్పేస్‌లో క్షీణత నమోదయింది. 2020 హెచ్2లో 46 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ పూర్తి కాగా.. గతేడాది హెచ్2 నాటికి 21 శాతం క్షీణతతో 38 లక్షల చ.అ.లకు తగ్గింది. ఇక, గతేడాది హెచ్2లో 44 లక్షల చ.అ. కార్యాలయ స్థలాల లావాదేవీలు జరిగాయి. 2020 హెచ్2తో పోలిస్తే ఇది 16 శాతం వృద్ధి. గతేడాది మొత్తంగా చూస్తే నగరంలో 60 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగగా.. కొత్తగా 46 లక్షల చ.అ. స్థలం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం నగరంలో 8.85 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ స్టాక్ ఉంది. 2020తో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువ. ఈసారి తయారీ రంగానిది హవా.. గతేడాది హెచ్2లోని ఆఫీస్ స్పేస్ లావాదేవీలలో 35 శాతం తయారీ రంగం ఆక్రమించింది. ఐటీ, ఫార్మాతో పాటూ తయారీ రంగం కూడా నగరంలో కేంద్రీకరించుకోవటం శుభపరిణామమనే చెప్పాలి. గతేడాది రాయదుర్గంలోని రహేజా కామర్జోన్లో 1.5 మిలియన్ చ.అ. స్పేస్‌ను కంప్యూటర్ హార్డ్‌వేర్ కంపెనీ క్వాల్కమ్ లీజుకు తీసుకుంది. ఇప్పటికే నగరంలో డెల్, ఇంటెల్, హెచ్‌పీ వంటి సంస్థల తయారీ కేంద్రాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఆ తర్వాత 18 శాతం ఐటీ కంపెనీలు, 21 శాతం కో–వర్కింగ్ స్పేస్ ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. గతేడాది హెచ్2లోని ఆఫీస్ స్పేస్ లావాదేవీలలో 92 శాతం హైటెక్ సిటీ, కొండాపూర్, మణికొండ, కూకట్పల్లి, రాయదుర్గం వంటి సబర్బన్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (ఎస్‌బీడీ)లోనే జరిగాయి. రహేజా కామర్‌జోన్, దివ్యశ్రీ, రహేజా మైండ్‌స్పేస్, ఫీనిక్స్ అవాన్స్ హబ్ వంటి బిజినెస్ కేంద్రాలలో ప్రధాన లావాదేవీలు జరిగాయి. ఆఫీస్ స్పేస్ ధరలలో అరశాతం వృద్ధి నమోదయింది. -
50 వేల గృహాలు.. 1.35 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నుంచి దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా కోలుకుంటోంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం (క్యూ2)తో పోలిస్తే మూడో త్రైమాసికం (క్యూ3)లో రియల్టీ లావాదేవీలు పెరిగాయి. గృహ, ఆఫీస్, రిటైల్, వేర్‌హౌస్ అన్ని విభాగాలలో వృద్ధి రేటు నమోదయింది. తక్కువ వడ్డీ రేట్ల కారణంగా గృహ విక్రయాలు పెరగగా.. ప్రయాణ పరిమితులు తొలగడం, ఆఫీసులు పునఃప్రారంభాలతో కార్యాలయాల స్థలాలకు, వ్యాక్సినేషన్ డ్రైవ్‌తో రిటైల్ స్పేస్, ఓమ్నీ చానల్ విధానంతో వేర్‌హౌస్ స్పేస్ వృద్ధికి కారణాలని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సీబీఆర్ఈ సౌత్ ఏషియా వెల్లడించింది. మిడ్, అఫర్డబుల్ యూనిట్లదే హవా.. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో దేశంలో 50 వేల గృహాలు విక్రయమయ్యాయి. క్యూ2తో పోలిస్తే 46 శాతం వృద్ధి. అదే ఏడాది క్రితం క్యూ3తో పోలిస్తే 86 శాతం పెరుగుదల. నగరాల వారీగా చూస్తే.. 33 శాతం అమ్మకాల వాటాతో పుణే ప్రథమ స్థానంలో నిలవగా.. ముంబైలో 23 శాతం, బెంగళూరులో 17 శాతం, హైదరాబాద్‌లో 13 శాతం వాటాలున్నాయి. మొత్తం విక్రయాలలో 47 శాతం మధ్యస్థాయి గృహాలు కాగా 31 శాతం అఫర్డబుల్ హౌసింగ్ యూనిట్లు అమ్ముడుపోయాయి. ► ఈ ఏడాది క్యూ3లో కొత్తగా 48,950 యూనిట్లు ప్రారంభమయ్యాయి, గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 37 శాతం వృద్ధి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మార్ట్గేజ్ వంటి కారణంగా మధ్యస్థాయి, అందుబాటు గృహాల విక్రయాలు, లాంచింగ్స్కు ప్రధాన కారణాలు. అద్దె గృహాల చట్టం అమలుతో డెవలపర్లు ప్రత్యామ్నాయ మార్గాల కోసం కో–లివింగ్, స్టూడెంట్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లపై ఆసక్తి చూపిస్తున్నారు. మిలీనియల్స్, తొలిసారి గృహ కొనుగోలుదారులు పెరగడంతో పెద్ద విస్తీర్ణ గృహాలు, ఓపెన్ ప్లాట్ల ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. నగదు నిర్వహణ, ప్రాజెక్ట్ అమలు సామర్థ్యాలు పెరగడం వంటివి కూడా రెసిడెన్షియల్ రియల్టీ మార్కెట్‌కు సానుకూలంగా మారాయి. చిన్న సైజు ఆఫీస్ స్పేస్లకే డిమాండ్.. ఈ ఏడాది క్యూ3లో దేశంలో అదనంగా 1.35 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. క్యూ2తో పోలిస్తే ఇది 30 శాతం వృద్ధి. చిన్న సైజు ఆఫీస్ స్పేస్ లావాదేవీలదే హవా కొనసాగింది. 50 వేల చ.అ.ల కంటే తక్కువ స్థలం లావాదేవీల వాటా 84 శాతం వాటా ఉంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్ నగరాలలోనే 80 శాతం లావాదేవీలు కేంద్రీకృతమయ్యాయి. ఆఫీస్ నుంచి పని చేయడం సంస్కృతి పునఃప్రారంభం కావటంతో రానున్న రోజుల్లో ఆఫీస్ స్పేస్‌కు మరింత డిమాండ్ ఏర్పడుతుంది. 90 లక్షల చ.అ. వేర్‌హౌస్ స్పేస్.. పారిశ్రామిక గిడ్డంగుల విభాగం కూడా స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది క్యూ2తో పోలిస్తే క్యూ3లో 6 శాతం వృద్ధి నమోదయింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 90 లక్షల చ.అ. పారిశ్రామిక గిడ్డంగి స్థలాల లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది తొలి 9 నెలల కాలంలో 2.3 కోట్ల చ.అ. ట్రాన్సాక్షన్స్ జరిగాయి. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (3పీఎల్) ఈ–కామర్స్ మంచి డిమాండ్ ఉంది. క్యూ3లోని లీజులలో 55 శాతం లావాదేవీలు మధ్యస్థాయి, పెద్ద పరిమాణ ఒప్పందాలు ఉన్నాయి. 32 శాతం లావాదేవీల వాటాతో బెంగళూరు ప్రథమ స్థానంలో నిలవగా.. ఢిల్లీలో 22 శాతం, ముంబైలో 12 శాతం వాటాలున్నాయి. ► ఈ ఏడాది ముగింపు నాటికి ఇండస్ట్రియల్ వేర్‌హౌస్ స్పేస్ సపయ్ 2.5 కోట్ల చ.అ. చేరుతుందని, అలాగే 3.2 కోట్ల చ.అ. లావాదేవీలు జరుగుతాయని అంచనా. వినియోగ కేంద్రాలకు సమీపంలో ఉన్న అధిక నాణ్యత గిడ్డంగులపై దేశ, విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆటోమేషన్ లాజిస్టిక్స్, త్వరితగతిన పూర్తి చేసే ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌లో రిటైల్ హవా.. ప్రయాణ పరిమితులు తొలగిపోవటం, లాక్డౌన్ లేకపోవటం, విద్యా సంస్థలు, పని ప్రదేశాలు పునఃప్రారంభం కావటంతో రిటైల్ కార్యకలాపాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. ఈ ఏడాది క్యూ3లో గ్రేడ్–ఏ, హైస్ట్రీట్ మాల్స్‌లలో 6 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లావాదేవీల్లో జరిగాయి. క్యూ2తో పోలిస్తే ఇది 165 శాతం వృద్ధి రేటు. క్యూ3లోని రిటైల్ స్పేస్ లావాదేవీలో హైదరాబాద్ టాప్ స్థానంలో నిలిచింది. మొత్తం రిటైల్ స్పేస్ ట్రాన్సాక్షన్స్లో నగరం వాటా 38 శాతం కాగా.. ఢిల్లీ–ఎన్సీఆర్లో 26 శాతం, బెంగళూరులో 12 శాతం లావాదేవీలు జరిగాయి. విభాగాల వారీగా చూస్తే ఫ్యాషన్ అండ్ అపెరల్స్ రిటైల్ స్పేస్ లావాదేవీలు 26 శాతం జరగగా.. 16 శాతం సూపర్ మార్కెట్ల స్థల లావాదేవీలు జరిగాయి. రానున్న రోజుల్లోనూ ఇదే తీరు దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత ఏడాదితో పోలిస్తే స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తుంది. వేగవంతమైన వ్యాక్సినేషన్, విధానపరమైన సంస్కరణలు, పెరుగుతున్న పట్టణీకరణ వంటి కారణాలతో దేశీయ రియల్టీ మార్కెట్ సానుకూలంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నివాస, వాణిజ్య, రిటైల్, పారిశ్రామిక గిడ్డంగుల విభాగాలలో కూడా ఇదే విధమైన డిమాండ్ కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. – అన్షుమన్ మేగజైన్, సీఈఓ అండ్ చైర్మన్, సీబీఆర్ఈ ఇండియా -
జోరు తగ్గని ఆఫీస్ స్పేస్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో కార్యాలయ స్థలాల లావాదేవీల జోరు తగ్గడం లేదు. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో (జులై– సెప్టెంబర్) నగరంలో 25 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ లీజు కార్యకలాపాలు జరిగాయని కొల్లియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. ఇదే సమయంలో నగర మార్కె ట్లోకి కొత్తగా 32 లక్షల చ.అ. స్పేస్ సరఫరా జరిగింది. ఆఫీస్ స్పేస్ లీజులలో బ్యాంకింగ్, ఫైనా న్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), ఫ్లెక్సిబుల్ వర్క్‌ప్లేస్ వాటా 66 శాతంగా ఉన్నాయి. రాయదుర్గలో అత్యధికంగా 53 శాతం, హైటెక్ సిటీలో 40% లీజు కార్యకలాపాలు జరిగాయి. ఈ ఏడాది క్యూ3లో దేశవ్యాప్తంగా 1.03 కోట్ల చ.అ. ఆఫీస్ లావాదేవీలు జరిగాయి. క్రితం త్రైమా సికంతో పోలిస్తే ఇది 89 శాతం వృద్ధి రేటు. క్యూ3లోని మొత్తం లావాదేవీలలో ఐటీ హబ్‌లైన హైదరాబాద్, బెంగళూరు, పుణే నగరాల వాటా 62 శాతంగా ఉంది. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య పెరగడం, కంపెనీలు వర్క్ ఫ్రం ఆఫీస్ పునఃప్రారంభిస్తుండటం, రవాణా పరిమితులు తొలగిపోవటం వంటి కారణాలతో దేశీయ కార్యాలయాల మార్కెట్‌కు డిమాండ్ పెరుగు తుందని కొల్లియర్స్ ఇండియా ఎండీ, సీఈఓ రమేష్ నాయర్ తెలిపారు. -
జోరు తగ్గని ఆఫీస్ స్పేస్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో కార్యాలయ స్థలాల లావాదేవీల జోరు తగ్గడం లేదు. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో (జులై– సెప్టెంబర్) నగరంలో 25 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ లీజు కార్యకలాపాలు జరిగాయని కొల్లియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. ఇదే సమయంలో నగర మార్కె ట్లోకి కొత్తగా 32 లక్షల చ.అ. స్పేస్ సరఫరా జరిగింది. ఆఫీస్ స్పేస్ లీజులలో బ్యాంకింగ్, ఫైనా న్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), ఫ్లెక్సిబుల్ వర్క్‌ప్లేస్ వాటా 66 శాతంగా ఉన్నాయి. రాయదుర్గలో అత్యధికంగా 53 శాతం, హైటెక్ సిటీలో 40% లీజు కార్యకలాపాలు జరిగాయి. ఈ ఏడాది క్యూ3లో దేశవ్యాప్తంగా 1.03 కోట్ల చ.అ. ఆఫీస్ లావాదేవీలు జరిగాయి. క్రితం త్రైమా సికంతో పోలిస్తే ఇది 89 శాతం వృద్ధి రేటు. క్యూ3లోని మొత్తం లావాదేవీలలో ఐటీ హబ్‌లైన హైదరాబాద్, బెంగళూరు, పుణే నగరాల వాటా 62 శాతంగా ఉంది. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య పెరగడం, కంపెనీలు వర్క్ ఫ్రం ఆఫీస్ పునఃప్రారంభిస్తుండటం, రవాణా పరిమితులు తొలగిపోవటం వంటి కారణాలతో దేశీయ కార్యాలయాల మార్కెట్‌కు డిమాండ్ పెరుగు తుందని కొల్లియర్స్ ఇండియా ఎండీ, సీఈఓ రమేష్ నాయర్ తెలిపారు. చదవండి:చేవెళ్ల దారిలో పెరిగిన ధరలు, ఎకరం రూ.3 కోట్లు -
బెంగళూరుని వెనక్కి నెట్టి.. నంబర్ వన్ స్థానంలో హైదరాబాద్!
ఐటీ సెక్టార్ ఇండియన్ క్యాపిటల్‌గా పేర్కొందిన బెంగళూరుకి హైదరాబాద్ ఝలక్ ఇచ్చింది. ఆఫీస్ స్పేస్ లీజు విషయంలో గత కొన్నేళ్లుగా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న సిటీ ఆఫ్ గార్డెన్స్‌ని వెనక్కి నెట్టింది ముత్యాల నగరం. కరోనా పూర్వపు స్థితి కరోనా సెకండ్ వేవ్ తర్వాత దేశవ్యాప్తంగా ఆర్తిక కార్యకలాపాలు వేగంగా ఊపందుకుంటున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం జోరుగా సాగుతుండటంతో ఉద్యోగులు తిరిగి ఆఫీసుల బాట పడుతున్నారు. దీంతో ఆఫీసు స్పేస్‌కి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దాదాపుగా కరోనాకు ముందున్న స్థితికి ఆఫీస్ స్పేస్ డిమాండ్ చేరుకుంది. ప్లేస్ మారింది జులై, ఆగస్టు, సెప్టెంబరులకు సంబంధించి మూడో త్రైమాసికంలో దేశవ్యాప్తగా దాదాపు 1.3 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజు అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. అయితే ప్రతీసారి ఆఫీస్ స్పేస్ విషయంలో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండేంది. మిగిలిన ఐదు మెట్రో నగరాలు ఆ తర్వాతే అన్నట్టుగా పరిస్థితి ఉండేంది. అయితే ఇప్పుడా పరిస్థితిలో మార్పు వచ్చింది. నంబర్ వన్ ఈ ఏడాది మూడో త్రైమాసికం ఆఫీస్ స్పేస్ లీజుకి సంబంధించి హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ఏకంగా 25 లక్షల చదరపు అడుగుల స్థలానికి సంబంధించిన లీజు అగ్రిమెంట్లు పూర్తి అయ్యాయి. అంతకు ముందు ఏప్రిల్, మే, జూన్‌తో పోల్చితే ఈసారి అగ్రిమెంట్లు వేగంగా పూర్తి కావడంతో హైదరాబాద్ ముందుకు దూసుకుపోయింది. మన తర్వాతే మూడో త్రైమాసికానికి సంబంధించి ఆఫీసు లీజు విషయంలో 29 శాతం వాటాతో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా 25 శాతం వాటాతో పూనే రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు నగరాల తర్వాతే మిగిలిన మెట్రో సిటీలైన బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నైలు ఉన్నాయి. ఇక్కడే ఎక్కువ భాగ్యనగరంలో ఆఫీసు ప్లేస్‌కి సంబంధించి రాయదుర్గం ఏరియాలో డిమాండ్ ఎక్కువగా ఉంది. నగరంలో బుక్కయిన 25 లక్షల చదరపు అడుగుల స్థలంలో సగం ఇక్కడున్న భవనాల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో హైటెక్ సిటీ ఉంది. లుక్ ఈస్ట్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలను కోరుతున్నా.. ఇంకా ఆశించిన స్థాయి ఫలితాలు రావడం లేదు. చదవండి:మనీ గురించి ఆలోచించకు.. లగ్జరీగా ఉంటే చూడు -
రియల్టీకి జోష్ !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు జూలై–సెప్టెంబర్‌లో 32,358 యూనిట్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 14,415 యూనిట్లు మాత్రమే. ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా ప్రకారం.. హైదరాబాద్ సహా ఏడు నగరాల్లో డిమాండ్ తిరిగి పుంజుకుంది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అమ్ముడైన ఇళ్ల సంఖ్య 19,635 యూనిట్లు. హైదరాబాద్‌లో ఇలా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో విక్రయాలు 2,122 నుంచి 4,418 యూనిట్లకు ఎగబాకాయి. ఇక సెప్టెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో ఏడు ప్రధాన నగరాల్లో 77,576 ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 52,619 యూనిట్లుగా ఉంది. క్యూ2తో పోలిస్తే క్యూ3లో అమ్మకం కాని ఇళ్లు స్థిరంగా 4.78 లక్షల యూనిట్ల స్థాయిలో ఉన్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకారం.. ఎనమిది ప్రధాన నగరాల్లో గత త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు కోవిడ్ ముందస్తు స్థాయికి చేరాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా చెబుతోంది. 64,010 యూనిట్లు విక్రయం అయ్యాయని వెల్లడించింది. ధరల్లో స్థిరత్వంతోపాటు వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం ఇందుకు కారణమని తెలిపింది. క్రితం ఏడాదితో పోలిస్తే 92% వృద్ధి నమోదైంది. ఏప్రిల్–జూన్‌లో 27,453 యూనిట్లు అమ్ముడయ్యాయని తెలిపింది. ఆఫీస్ స్పేస్ లీజింగ్.. దేశంలో ఎనమిది ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ జూలై–సెప్టెంబర్‌లో 1.25 కోట్ల చదరపు అడుగులు నమోదైంది. గతేడాది ఇదే కాలంలో ఇది 47 లక్షల చదరపు అడుగులు ఉంది. ప్రధానంగా ఐటీ రంగం కారణంగా ఈ స్థాయి డిమాండ్ వచ్చిందని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. చదవండి :టాప్‌గేర్‌లో హైదరాబాద్ -
ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో కార్యాలయాల స్థలాల లావాదేవీలలో దక్షిణాది రాష్ట్రాల హవా కొనసాగుతోంది. సప్లయి, లావాదేవీలు, అద్దెలు అన్నింట్లోనూ సౌత్ స్టేట్స్లోనే వృద్ధి నమోదవుతుంది. గత ఆర్థిక సంవత్సరం దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2.13 కోట్ల చ.అ. లావాదేవీలు జరగగా.. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 66 శాతంగా ఉంది. పశి్చమాది రాష్ట్రాల వాటా 21 శాతం, నార్త్ స్టేట్స్ వాటా 11 శాతంగా ఉందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ తెలిపింది. ► 2020–21 ఫైనాన్షియల్ ఇయర్లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల్లోని 66 శాతం ఆఫీస్ స్పేస్‌లో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో 1.4 కోట్ల చ.అ. లావాదేవీలు జరిగాయి. వెస్ట్ రాష్ట్రాల్లోని ట్రాన్సాక్షన్స్లో ముంబై, పుణే నగరాల్లో 45.6 లక్షల చ.అ. నార్త్‌లోని లావాదేవీల్లో ఎన్సీఆర్ నగరంలో 23 లక్షల చ.అ. లావాదేవీలు జరిగాయి. దేశంలోని టాప్–7 నగరాల్లో 2017–18 ఆర్థిక సంవత్సరంలో 3.11 కోట్ల చ.అ. లావాదేవీలు జరగగా దక్షిణాది రాష్ట్రాల వాటా 47 శాతం కాగా, పశి్చమంలో 33 శాతం, ఉత్తరంలో 17 శాతం వాటా కలిగి ఉన్నాయి. అలాగే 2018–19 ఆర్థికంలో 3.58 కోట్ల చ.అ. లావాదేవీలు జరగగా.. దక్షిణంలో 57 శాతం, వెస్ట్‌లో 25 శాతం, నార్త్‌లో 15 శాతం, 2019–20 ఆర్థిక సంవత్సరంలో 4.3 కోట్ల చ.అ. లావాదేవీలు జరగగా.. సౌత్‌లో 55 శాతం, వెస్ట్‌లో 22 శాతం, నార్త్‌లో 20 శాతం వాటాలు కలిగి ఉన్నాయి. సప్లయి కూడా సౌత్‌లోనే.. కొత్త ఆఫీస్ స్పేస్ సప్లయి కూడా దక్షిణాది రాష్ట్రాలనే ఎక్కువగా ఉంది. గత ఆర్థికంలో 4.02 కోట్ల చ.అ. సప్లయి జరగగా ఇందులో సౌత్ వాటా 63 శాతంగా ఉంది. పశ్చిమాది రాష్ట్రాల వాటా 19 శాతం, నార్త్ వాటా 18 శాతంగా ఉన్నాయి. 2019–20 ఆర్థికంలోనూ అంతే. మొత్తం 4.36 కోట్ల చ.అ. లావాదేవీలు జరగగా.. 59 శాతం దక్షిణాదిలో, 16 శాతం వెస్ట్‌లో, 24 శాతం ఉత్తరాది రాష్ట్రాలలో జరిగాయి. డిమాండ్ ఎందుకంటే.. గత రెండు మూడేళ్లుగా దక్షిణాది రాష్ట్రాలలో స్టార్టప్స్ విపరీతంగా పెరగడం, తయారీ, పారిశ్రామిక రంగాలు వృద్ధి బాటలో కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాలలో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ ఏర్పడుతుందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్ అనూజ్ పురీ తెలిపారు. హైదరాబాద్‌లో అద్దెల వృద్ధి హైదరాబాద్‌లో నెలవారీ ఆఫీస్ స్పేస్ అద్దెలు పెరుగుతున్నాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో చ.అ. రెంట్ నెలకు రూ.51 ఉండగా.. 2018–19 నాటికి రూ.53కు, 2019–20లో రూ.56కు, 2020–21 ఆర్థికం నాటికి రూ.57కి వృద్ధి చెందింది. గత ఆర్థికంలో నగరంలో గచ్చిబౌలిలో రెండు ప్రధాన ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. దివ్యశ్రీ ఓరియన్‌లో వెల్స్‌ఫార్గో 13 లక్షల చ.అ., సాలార్పూరియా సత్వా నాలెడ్జ్ క్యాపిటల్‌లో గూగుల్ 10 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్‌ను అద్దెకు తీసుకుంది. బెంగళూరులో గత ఆర్థికంలో చ.అ. అద్దె నెలకు రూ.77గా ఉంది. చెన్నై లో రూ.60, ఎంఎంఆర్‌లో రూ. 125, పుణేలో రూ.68, ఎన్సీఆర్లో రూ.78గా ఉంది. -
మూడు నగరాల్లో డిమాండ్ ఉన్న బిజినెస్ ఇదే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆఫీస్ మార్కెట్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల హవా నడుస్తోంది. 2020–21లో దేశవ్యాప్తంగా మొత్తం ఆఫీస్ స్పేస్ డిమాండ్‌లో ఈ మూడు నగరాల వాటా ఏకంగా 66 శాతముందని అనరాక్ నివేదిక వెల్లడించింది. అలాగే ఆఫీస్ అద్దె పెరుగుదలలో రెండంకెల వృద్ధి నమోదైందని తెలిపింది. ‘ఆఫీస్ స్పేస్ సరఫరా, నికరంగా కంపెనీలు స్థలం తీసుకోవడం, అద్దె పెరుగుదలలో ఈ దక్షిణాది నగరాలు ఇతర ప్రాంతాలను దాటాయి. పశ్చిమ, ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదికి చెందిన ఈ మూడు నగరాల్లో ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల నుంచి భారీ డిమాండ్, అందుబాటు ధరలో అద్దెలు, స్టార్టప్స్‌తోపాటు తయారీ, పారిశ్రామిక రంగాలు ఆఫీస్ స్పేస్ పెరగడానికి కారణం. టాప్–7 నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల వాటా 2019–20లో 47 శాతం నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు కొత్తగా 2.13 కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకున్నాయి. ఇందులో మూడు నగరాల వాటా 1.4 కోట్ల చదరపు అడుగులు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, పుణే 45.6 లక్షల చదరపు అడుగులతో 21 శాతం, జాతీయ రాజధాని ప్రాంతం 23 లక్షల చదరపు అడుగులతో 11 శాతం వాటా కైవసం చేసుకుంది. కార్యాలయాలకు చెల్లించే అద్దె హైదరాబాద్‌లో చదరపు అడుగుకు 2017–18లో రూ.51 ఉంటే, గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.57కు చేరింది’ అని అనరాక్ నివేదిక వివరించింది. చదవండి: ఆఫీస్ స్పేస్.. హాట్ కేకుల్లా హైటెక్ సిటీ, మాదాపూర్ -
ఆఫీస్ స్పేస్.. హాట్ కేకుల్లా హైటెక్ సిటీ, మాదాపూర్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. రాబోయే నాలుగేళ్లలో (2025 నాటికి) మహానగర పరిధిలో ఏకంగా 15 కోట్ల చదరపు అడుగుల విలువైన ఆఫీస్ స్పేస్ ఏర్పాటవుతుందని తాజా అధ్యయనం అంచనా వేసింది. ఇప్పటికే నగరంలో సుమారు 7 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో వివిధ ఐటీ, బీపీఓ, కేపీఓ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. రాబోయే నాలుగేళ్లలో మరో 8 కోట్ల చదరపు అడుగుల లక్ష్యాన్ని చేరుకుంటుందని స్పష్టం చేయడం విశేషం. ప్రధానంగా హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా, కోకాపేట్ పరిధిలో తమ కార్యాలయాలను నెలకొల్పేందుకు బహుళజాతి, దేశీయ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని ప్రముఖ రియల్టీ సంస్థ కుష్మన్ వేక్ఫీల్డ్ చేపట్టిన తాజా అధ్యయనం పేర్కొంది. ఇక మహానగరం పరిధిలో గతేడాదిగా 4 కోట్ల ఆఫీస్ స్పేస్ అదనంగా ఏర్పాటైందని తెలిపింది. కార్యకలాపాల విస్తరణ.. ► కోవిడ్.. లాక్డౌన్ కారణంగా నగరంలో పలు ఐటీ, బీపీఓ, కేపీఓ సంస్థలు తమ ఉద్యోగులకు ప్రస్తుతానికి వర్క్‌ఫ్రం హోంకు అనుమతించాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఈ అధ్యయనం అంచనా వేసింది. ► రాబోయే నాలుగేళ్లలో తమ కార్యకలాపాలను నగరంలో విస్తరించేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చే అవకాశాలున్నట్లు స్పష్టం చేసింది. ► నగరంలో సుమారు 20కిపైగా ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలు 6.5 కోట్ల ఆఫీస్‌స్పేస్‌ను ఏర్పాటు చేసే పనుల్లో నిమగ్నమయ్యాయని.. చేపట్టిన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నాయని ఈ అధ్యయనం తెలిపింది. డిమాండ్– సప్లై సూత్రాల ఆధారంగానే ఈ నిర్మాణ కార్యకలాపాలు సాగుతున్నాయని పేర్కొంది. ► ప్రధానంగా ఒక్కో ప్రాంతంలో 2 లక్షల నుంచి 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నెలకొల్పుతున్నట్లు తెలిపింది. ప్రభుత్వ పరంగా పలు కార్పొరేట్, ఐటీ, బీపీఓ, కేపీఓ, స్టార్టప్ సంస్థలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, ఐటీ, హార్డ్‌వేర్ పాలసీ తదితర కారణాల రీత్యా ఆఫీస్ స్పేస్ అభివృద్ధి విషయంలో ఏటా 5 నుంచి 10 శాతం వృద్ధి నమోదవుతోందని విశ్లేషించింది. ముంబై, బెంగళూరు, ఢిల్లీ తర్వాత.. ► ఆఫీస్‌స్పేస్ విషయంలో దేశ వాణిజ్య రాజధాని ముందు వరుసలో ఉందట. రెండోస్థానంలో బెంగళూరు, ఢిల్లీ నగరాలు పోటాపోటీగా పురోగిస్తున్నాయట. ఈ మెట్రో సిటీల తర్వాత మూడో స్థానంలో మన గ్రేటర్ హైదరాబాద్ నగరం నిలిచినట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ► నగరంలో ఫోనిక్స్, ఆర్ఎంజెడ్, సాలార్‌పూర్ సత్వ, కె.రహేజా గ్రూప్, దివ్యశ్రీ డెవలపర్స్, జీఏఆర్ కార్పొరేషన్, వంశీరామ్ బిల్డర్స్ తదితర ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలు 2025 నాటికి సుమారు 6.5 కోట్ల చదరపు అడుగుల మేర ఆఫీస్‌స్పేస్‌ను ఏర్పాటుచేసే అవకాశాలున్నాయని ఈ అధ్యయనం తెలిపింది. -
బెంగళూరును దాటేసిన భాగ్యనగరం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ క్రయవిక్రయాలు టాప్ గేర్‌లో సాగుతున్నాయి. 2019 జూలై – డిసెంబర్ (హెచ్2) మధ్య కాలంలో దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే భాగ్యనగరంలోనే అత్యధిక లావాదేవీలు జరిగాయి. గతేడాది హెచ్2లో బెంగళూరులో 70 లక్షల చ.అ.కు సంబంధించిన లావాదేవీలు జరగ్గా.. హైదరాబాద్‌లో 89 లక్షల చ.అ. లావాదేవీలు జరిగాయి. ఏడాది మొత్తంగా చూస్తే 1.28 కోట్ల చ.అ. లావాదేవీలు జరిగినట్లు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా తన 12వ నివేదికలో తెలియజేసింది. ఇతర నగరాల్లో లావాదేవీలు చూస్తే.. ముంబైలో 51 లక్షల చ.అ., ఎన్సీఆర్లో 48 లక్షలు, పుణేలో 24 లక్షలు, అహ్మదాబాద్‌లో 10 లక్షలు, చెన్నైలో 34 లక్షలు, కోల్‌కతాలో 7 లక్షల చ.అ. మేర నమోదయ్యాయి. మంగళవారమిక్కడ హైదరాబాద్ డైరెక్టర్ శామ్సన్ ఆర్థర్ నైట్‌ఫ్రాంక్ ఇండియా రియల్ ఎస్టేట్ రెండో అర్ధ సంవత్సర నివేదిక విడుదల చేసిన సందర్భంగా ఈ విషయాలు వెల్లడించారు. జూలై – డిసెంబర్ మధ్య కాలంలో హైదరాబాద్‌లో కొత్తగా 8,065 గృహాలు ప్రారంభం కాగా.. 7,933 గృహాలు విక్రయమయ్యాయి. హెచ్1లో ప్రారంభాలు 5,430 కాగా.. అమ్మకాలు 8,334లుగా ఉన్నాయి. కూకట్పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట వంటి పశ్చిమ హైదరాబాద్‌లోనే ఎక్కువ ప్రాజెక్ట్‌లు ఆరంభమయ్యాయి. రూ.80– కోటి రూపాయల ధర ఉండే ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కోటిన్నర పైన ధర ఉండే గృహాల్లో 17 శాతం వృద్ధి నమోదైంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం హైదరాబాద్‌లో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన గృహాలు (ఇన్వెంటరీ) 39 శాతం క్షీణించి 4,397 యూనిట్లుగా ఉన్నాయి. 13.6 లక్షల చ.అ. కో–వర్కింగ్ స్పేస్.. హైదరాబాద్ కార్యాలయ స్థలాల లావాదేవీల్లో ఐటీ రంగానిదే హవా. 2018 హెచ్2లో మొత్తం లావాదేవీల్లో ఐటీ స్పేస్ వాటా 44 శాతంగా ఉండగా.. 2019 హెచ్2 నాటికి 58 శాతానికి పెరిగింది. గతేడాది హెచ్2లో నగరంలో 13.6 లక్షల చ.అ. కో–వర్కింగ్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. ఆఫీస్ స్పేస్ ధరలు చ.అ.కు రూ.61గా ఉండగా... ఏడాదిలో 5 శాతం వృద్ధి కనిపించింది. దేశవ్యాప్తంగా..: దేశవ్యాప్తంగా హెచ్2లో 1,12,150 గృహాలు ప్రారంభం కాగా.. 1,16,576 ఇళ్లు విక్రయమయ్యాయి. ఇన్వెంటరీ 5% క్షీణించి 4,45,836 యూనిట్లకు పరిమితమయింది. ఆఫీస్ స్పేస్‌లో 3.32 కోట్ల చ.అ. లావాదేవీలు జరిగాయి. -
సింగపూర్‌ను దాటేసిన హైదరాబాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దక్షిణాది నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలు సింగపూర్, హాంగ్‌కాంగ్‌లను దాటేశాయి. జులై – సెప్టెంబర్ (క్యూ3) మధ్య కాలంలో ఆఫీస్ స్పేస్ లావాదేవీల్లో ఈ మూడు నగరాల్లో 23 శాతం వృద్ధి నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా ఆసియా పసిఫిక్ క్యూ3–2019 ఆఫీస్ రెంటల్ ఇండెక్స్ నివేదిక తెలిపింది బెంగళూరు తర్వాతే మెల్బోర్న్, బ్యాంకాక్.. 2019 క్యూ3లో ఆఫీస్ రెంట్స్ వృద్ధిలో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో మెల్బోర్న్, మూడో స్థానంలో బ్యాంకాక్ నగరాలు నిలిచాయి. గతేడాదితో పోలిస్తే బెంగళూరులో అద్దెలు 17.6 శాతం వృద్ధి చెందగా.. మెల్బోర్న్లో 15.5 శాతం, బ్యాంకాక్‌లో 9.4 శాతం వృద్ధి నమోదైంది. నెల వారీ అద్దెలు చూస్తే.. ఖరీదైన అద్దెలున్న నగరాల్లో హాంగ్‌కాంగ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ నెల అద్దె చ.మీ.కు రూ.206.6 డాలర్లు. టోక్యోలో 11.9 డాలర్లు, సింగపూర్‌లో 80.5 డాలర్లుగా ఉంది. మన దేశంలో ఖరీదైన ఆఫీస్ అద్దె నగరాల్లో ప్రథమ స్థానంలో ఎన్సీఆర్ (ఆసియా పసిఫిక్ రీజియన్‌లో 5వ స్థానం), ముంబై (7వ స్థానం) నిలిచాయి. ఎన్సీఆర్లో నెలకు రూ.51.8 డాలర్లు, ముంబైలో 46.2 డాలర్లుగా ఉంది. బెంగళూరులో 20.5 డాలర్లుగా ఉంది. 2020లో 50 మిలియన్ చ.అ. ఈ ఏడాది దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 46.5 మిలియన్ చ.అ. నికర ఆఫీసు స్థల లావాదేవీలు జరిగాయి. ఇందులో హైదరాబాద్, బెంగళూరు వాటా 70 శాతంగా ఉంది. విభాగాల వారీగా చూస్తే ఐటీ, ఐటీఈఎస్ రంగాల వాటా 42 శాతంగా ఉంది. 2020లో 50 మిలియన్ చ.అ.ల ఆఫీసు స్థల లావాదేవీలు జరుగుతాయని నివేదిక అంచనా వేసింది. ఈ ఏడాది మన దేశంలో ఆఫీస్ స్పేస్ లావాదేవీలు అత్యధికంగా జరిగిన నగరం బెంగళూరే. ఇక్కడ 2019లో 15 మిలియన్ చ.అ. లావాదేవీలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే 8 శాతం వృద్ధి. ఐటీ, ఐటీఈఎస్ రంగాల వాటా 39 శాతంగా ఉంది. ఇంజనీరింగ్, తయారీ రంగాల వాటా 16 శాతంగా ఉంది. 2019లో కొత్తగా 10.9 మిలియన్ చ.అ. స్పేస్ జత అయింది. హైదరాబాద్‌లో 10.5 మిలియన్ చ.అ. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ కమర్షియల్ స్పేస్ లావాదేవీల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది. మౌలిక వసతుల అభివృద్ధి, స్థానిక ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రాయితీల వంటి కారణాలతో పాటూ అందుబాటులో స్థలాలు, తక్కువ అద్దెలు, నైపుణ్యమున్న ఉద్యోగులు తదితర కారణాలతో ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నాయి. దీంతో స్థానికంగా ఆఫీస్ అద్దెలు వృద్ధి చెందుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది నగరంలో 10.5 మిలియన్ చ.అ. నికర ఆఫీసు స్థల లావాదేవీలు జరిగాయి. ఇందులో టెక్నాలజీ కంపెనీల వాటా 51 శాతం ఉంది. ఫ్లెక్సిబుల్ వర్క్‌ప్లేస్ వాటా నాలుగింతలు వృద్ధి చెంది 32 శాతం వద్ధ స్థిరపడింది. 2020లో హైదరాబాద్‌లో 13 మిలియన్ చ.అ. లావాదేవీలు జరుగుతాయని అంచనా. -
రియల్టీ పట్టాలెక్కింది!
ఈ ఏడాది తొలి 6 నెలల్లో భాగ్యనగర నిర్మాణ రంగం వృద్ధి ♦ 7,700 ఫ్లాట్ల విక్రయం; 2.8 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు ♦ కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభంలోనే కొంత క్షీణత ♦ నైట్ ఫ్రాంక్ ఇండియా ఐదో సంచిక నివేదిక వెల్లడి సాక్షి, హైదరాబాద్ : గతేడాదితో పోలిస్తే 2016 తొలి ఆరు నెలల్లో హైదరాబాద్‌లో నివాస సముదాయాల అమ్మకాలు 8 శాతం, ఆఫీస్ స్పేస్ మార్కెట్ 91 శాతం వృద్ధిని నమోదు చేశాయని నైట్ ఫ్రాంక్ ఇండియా ఐదో సంచిక (జనవరి-జూన్ హెచ్1 2016) నివేదిక వెల్లడించింది. నూతన గృహ ప్రాజెక్ట్ ప్రారంభం విషయంలోనే కొంత తగ్గుదల ఉందని.. అయితే రానున్న రోజుల్లో ఇది స్థిరపడుతుందని నివేదిక పేర్కొంది. దేశంలోని అన్ని ముఖ్యనగరాలతో పాటూ హైదరాబాద్‌లో నివాస, కార్యాలయాల రంగాల పరిస్థితులపై క్షేత్రస్థాయిలోని నివేదిక వివరాలను సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో సంస్థ డెరైక్టర్ (హైదరాబాద్, బెంగళూరు) అర్పిత్, మెహ్రోత్రా, హైదరాబాద్ డెరైక్టర్ వాసుదేవన్ అయ్యర్లు వివరించారు. ఈ సందర్భంగా వారేమన్నారంటే.. ⇔ దేశంలోని ఆరు ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కత్తా, అహ్మదాబాద్, ముంబై, పుణె, హైదరాబాద్‌లో 2016 తొలి ఆరు నెలల్లో నివాస, ఆఫీస్ మార్కెట్ పరిస్థితులను సమీక్షించారు. ఈ ఆరు ప్రధాన నగరాల్లో 2016 హెచ్1లో అమ్ముడుపోకుండా ఉన్న యూనిట్లు 6.60 లక్షలు కాగా.. గతేడాది ఈ సంఖ్య 7.10 లక్షలు. అంటే ఏడాదిలో 7 శాతం అమ్మకాల్లో వృద్ధి సాధించిందన్నమాట. అమ్మకాల్లో వృద్ధి, కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభంలో ఆలస్యాలే ఈ వృద్ధికి కారణం. ఇన్వెంటరీ భారం పూర్తిగా తొలగాలంటే మరో రెండేళ్ల సమయం పడుతుందని అంచనా. ⇔ నూతన గృహ ప్రాజెక్ట్‌ల విషయంలోనూ తగ్గుదలే కనిపిస్తుంది. గతేడాది హెచ్1లో 1,17,200 యూనిట్లు ప్రారంభం కాగా.. ఈ ఏడాది హెచ్1లో 1,07,120 యూనిట్లు ప్రారంభమయ్యాయి. అంటే కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాలు 9 శాతం మేర పడిపోయాయన్నమాట. ఇందులోనూ ఎన్సీఆర్లో 41 శాతం, చెన్నైలో 36 శాతం, పుణెలో 32 శాతం మేర ప్రారంభాలు పడిపోయాయి. ⇔ హైదరాబాద్, ముంబై, బెంగళూరు నగరాల్లో మాత్రం కొత్త ప్రాజెక్ట్ అమ్మకాలు, ప్రారంభాలు పెరిగాయి. భాగ్యనగరంలో 2016 హెచ్1లో 5,700 కొత్త యూనిట్లు ప్రారంభమయ్యాయి. 7,700 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాదితో పోలిస్తే 8 శాతం వృద్ధి. 2016 హెచ్ 2 పూర్తయ్యే నాటికి సుమారు 8,200 యూనిట్లు అమ్ముడుపోతాయని అంచనా. ⇔ ఇప్పటికీ హైదరాబాద్ పశ్చిమ భాగం మార్కెట్ హవా కొనసాగుతుంది. ఇక్కడే ఎక్కువ ప్రారంభాలు, అమ్మకాలూ ఉంటున్నాయి,. నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాలు కొత్తగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి. ఆఫీస్ స్పేస్ వృద్ధి.. తొలి ఆరు నెలల్లో ఆరు ప్రధాన నగరాల్లో గతేడాదితో 17.9 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్ మార్కెట్ లావాదేవీలు జరిగితే.. ఈ ఏడాది హెచ్ 1లో 20 మిలియన్ చ.అ. జరిగాయి. అంటే 12 శాతం కార్యాలయాల మార్కెట్ వృద్ధి చెందిందన్నమాట. హైదరాబాద్ విషయానికొస్తే.. 2016 హెచ్ 1లో 2.8 మిలియన్ చ.అ. లావాదేవీలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సరఫరా 140 శాతం, స్వీకరణ పరంగా చూస్తే 91 శాతం వృద్ధిని నమోదు చేశాయి. రాజకీయ స్థిరత్వం, పారిశ్రామిక, ఐటీ పాలసీలు, ఐటీ/ఐటీఈఎస్ కంపెనీల రాక ఇందుకు కారణం. ⇔ ఆఫీస్ స్పేస్ వేకన్సీ 9.5 శాతంగా ఉంటే.. ప్రైమ్ ఆఫీస్ మార్కెట్లు అయిన మాదాపూర్, హైటెక్ సిటీల్లో 3.5-4 శాతంగా ఉంది. తగినంత సరఫరా లేని కారణంగా నగరంలో అద్దెలు 6 శాతం మేర పెరిగాయి. ⇔పాత భవనాలను గ్రీన్ బిల్డింగ్స్ మార్చుకునే వీలుంది. గచ్చిబౌలిలోని హెచ్ఎస్బీసీ బ్యాంక్ భవనమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ⇔ ఇంట్లో వినియోగించే ఎలక్ట్రిక్ వస్తువులన్నీ త్రీస్టార్, ఫై స్టార్ ఉండే వి మాత్రమే చూసుకోవడం. ⇔ భవనాల లోపలికి గాలి, వెలుతురు దారాళంగా వచ్చే విధంగా పైకప్పు నిర్మాణ ంలో చిన్నచిన్న మార్పులు చే యాలి. ⇔ సాధ్యమైనంత వరకు సౌర విద్యుత్‌నే వినియోగించాలి. భవనాల్లో ఉండే నల్లాల మొదట్లో ఎరోటర్‌ను వినియోగించాలి. దీంతో నీటి వృథా తగ్గుతుంది. ⇔ ఆయా భవన ప్రాంతాల్లో ఉన్న జీవ వైవిధ్యాన్ని కూడా పరిరక్షించాలి. భవనాల ఆవరణలో లాన్‌ను పెంచకుండా ఎక్కువ మొక్కలను పెంచాలి. ఎందుకంటే లాన్ ఎక్కువ నీటిని తీసుకుంటుంది మరి. ⇔ వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి.