సాక్షి, హైదరాబాద్: నివాస, కార్యాలయ స్థిరాస్తి వ్యాపారంలో ఐటీ రంగానికి ప్రధాన పాత్ర. ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని గృహాలను, కంపెనీల కోసం ఆఫీస్ స్పేస్‌ను నిర్మిస్తుంటారు. కానీ, కరోనా తర్వాతి నుంచి సీన్ మారింది. వర్క్ ఫ్రం హోమ్ విధానంతో అపార్ట్‌మెంట్లకు గిరాకీ తగ్గడంతో పాటు గ్రేడ్–ఏ కార్యాలయ స్థలాలకు డిమాండ్ ఆశించిన స్థాయిలో లేదు. నాలుగు ప్రధాన ఐటీ హబ్‌లైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణేలలో ఆఫీస్ స్పేస్ వేకెన్సీగా ఉంది. కోవిడ్ తర్వాత నిర్మాణ సంస్థలు కూడా కొత్త కార్యాలయాల స్థలాల సరఫరాను తగ్గించి.. ఉన్న ఆఫీస్ స్పేస్‌ను భర్తీ చేయడంపై దృష్టి సారించాయి.
కరోనా సమయంలో ఐటీ వ్యాపారం జోరుగా సాగడంతో పెద్ద, మధ్య తరహా సంస్థలు అప్పటికే ఉన్న ఆఫీస్ స్పేస్ లీజులను పునరుద్ధరించారు. అదే సమయంలో లీజు స్థలాలను సొంతానికి కొనుగోలు చేయడమో లేదా కొత్త ఆఫీస్ స్పేస్‌ను తీసుకోవటమో చేయలేదు. ఎందుకంటే లీజు పునరుద్ధరణ కంటే స్థలం కొనుగోలు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి. కరోనా తర్వాతి నుంచి ఐటీ, ఐటీఈఎస్ రంగాల కంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ), తయారీ, పారిశ్రామిక రంగాల నుంచి గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్‌కు గణనీయమైన డిమాండ్ ఏర్పడింది. నాలుగు ప్రధాన ఐటీ హబ్ నగరాలలో చ.అ. ఆఫీస్ స్పేస్ ధర నెలకు రూ.58–78లుగా ఉండగా.. ఎన్‌సీఆర్, ముంబైలలో రూ.80–126లుగా ఉన్నాయి.
హైదరాబాద్‌లో 4 కోట్ల చ.అ. స్థలం..
ప్రస్తుతం హైదరాబాద్‌లో 8 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉంది. ఇందులో 15 శాతం కంటే ఎక్కువ స్పేస్ ఖాళీగా ఉందని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. బెంగళూరు మాదిరిగానే హైదరాబాద్‌లో కూడా మరో 4 కోట్ల చ.అ. గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ నిర్మాణ దశలో ఉందని, వచ్చే 2–3 ఏళ్లలో ఆయా నిర్మాణాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఇతర నగరాల్లో..
ప్రస్తుతం అత్యధికంగా బెంగళూరులో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉంది. 16.8 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ ఉండగా.. ఇందులో 11.25 శాతం స్పేస్ వేకెన్సీ ఉంది. కొత్తగా 4 కోట్ల చ.అ. స్థలం నిర్మాణ దశలో ఉంది.
► ముంబైలో 10.8 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ ఉండగా.. 16 శాతం ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కొత్తగా 1.5 కోట్ల చ.అ. కొత్త స్పేస్ కన్‌స్ట్రక్షన్ స్టేజ్‌లో ఉంది.
► కోల్‌కతాలో 2.5 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ ఉండగా.. 23.5 శాతం వెకెన్సీ ఉంది. సుమారు 20 లక్షల చ.అ. స్పేస్ ΄్లానింగ్ దశలో ఉంది.
► పుణేలో ప్రస్తుతం 6 కోట్ల చ.అ. స్పేస్ ఉండగా.. అత్యల్పంగా 8.5 శాతం స్థలం మాత్రమే వేకెన్సీ ఉంది. కానీ, కొత్తగా 1.3 కోట్ల చ.అ. స్థలం నిర్మాణ దశలో ఉంది.
► చెన్నైలో 5.5 కోట్ల చ.అ. అందుబాటులో ఉండగా.. 10.35 శాతం స్థలం ఖాళీగా ఉంది. కొత్తగా 1.5 కోట్ల చ.అ. స్పేస్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది.
► ఎన్‌సీఆర్‌లో 12.8 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ ఉండగా.. 28.5 శాతం వేకెన్సీ ఉంది. కొత్తగా 2.6 కోట్ల చ.అ. స్పేస్ నిర్మాణ దశలో ఉంది.
నగరాల వారీగా గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ (చ.అ.) (కోట్లలో)
నగరం ప్రస్తుత ఖాళీలు నిర్మాణంలోని
స్థలం (%లో) స్థలం
బెంగళూరు 16.8 11.25 4
హైదరాబాద్ 8 15 4
చెన్నై 5.5 10.35 1.5
పుణే 6 8.50 1.3
ఎన్‌సీఆర్ 12.8 28.50 2.6
ముంబై 10.8 16 1.5
కోల్‌కతా 2.5 23.50 20 లక్షలు
Hyderabad: ఆఫీస్ స్పేస్ సరఫరా తగ్గింది
Published Sat, Jul 2 2022 4:35 AM | Last Updated on Sat, Jul 2 2022 10:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment