న్యూఢిల్లీ: కార్యాలయ వసతులకు (ఆఫీస్ స్పేస్) డిమాండ్ బలంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఆరు ప్రముఖ పట్టణాల్లో జూలై–సెప్టెంబర్ మధ్య 17.3 మిలియన్ చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) స్థూల లీజింగ్ నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ పరిమాణం 13.2 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ కంటే 31 శాతం పెరిగినట్టు కొలియర్స్ ఇండియా విడుదల చేసిన డేటా స్పష్టం చేసింది. బెంగళూరు, హైదరాబాద్ మార్కెట్లలోనే సగం మేర లీజింగ్ నమోదు కావడం గమనార్హం.
పట్టణాల వారీగా లీజింగ్
» హైదరాబాద్ మార్కెట్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ సెపె్టంబర్ క్వార్టర్‌లో 16 శాతం పెరిగి రూ.2.9 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో స్థూల లీజింగ్ 2.5 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది.
» బెంగళూరులో 6.3 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ లీజింగ్ జరిగింది. ఒక త్రైమాసికం వారీగా అత్యధిక లీజింగ్ ఇదే కావడం గమనించొచ్చు. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 3.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీతో పోలి్చతే 85 శాతం పెరిగింది.
» పుణెలో స్థూల ఆఫీస్ స్పేస్ లీజింగ్ 2.6 మిలియన్ ఎ స్‌ఎఫ్‌టీగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఒ క మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ లీజింగ్ నమోదైంది.
» ముంబైలో 1.7 మిలియన్, చెన్నైలో 1.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ చొప్పున స్థూల లీజింగ్ జరిగింది.
» ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లో ఆఫీస్ లీజింగ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 25%పెరిగి 2.4 మిలి యన్ ఎస్‌ఎఫ్‌టీకి చేరుకుంది. స్థూల లీజింగ్‌లో రెన్యువల్స్, ఆసక్తి వ్యక్తీకరణ లావాదేవీలను కలపలేదు.
టెక్నాలజీ రంగం నుంచి డిమాండ్
జూలై –సెపె్టంబర్ కాలంలో నమోదైన స్థూల లీజింగ్‌లో 25 శాతం మేర టెక్నాలజీ రంగం నుంచే ఉన్నట్టు కొలియర్స్ ఇండియా డేటా తెలియజేసింది. ఆ తర్వాత బీఎఫ్‌ఎస్‌ఐ కంపెనీలు, ఫ్లెక్స్ స్పేస్ ఆపరేట్ల నుంచి లీజ్ ఒప్పందాలు అధికంగా జరిగాయి. ‘‘గడిచిన 2–3 ఏళ్లలో వివిధ రంగాలు, విభిన్న మార్కెట్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. లీజింగ్ మార్కెట్ ఏటేటా కొత్త గరిష్టాలకు చేరుకుంటోంది. 2024లోనూ అధిక డిమాండ్, సరఫరా కనిపిస్తోంది’’అని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సరీ్వసెస్ ఎండీ అర్పితా మల్హోత్రా తెలిపారు.
హైదరాబాద్, బెంగళూరు, ముంబై మార్కెట్లలో ఈ ఏడాది మొదటి మూడు త్రైమాసికాల్లో (జనవరి–సెప్టెంబర్) ఆఫీస్ స్పేస్ డిమాండ్ 2023 మొత్తం డిమాండ్‌ను అధిగమించినట్టు చెప్పారు. సెపె్టంబర్ క్వార్టర్‌లో లీజు లావాదేవీల్లో రూ.లక్ష ఎస్‌ఎఫ్‌టీకి మించినవే 65 శాతంగా ఉన్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment