Q3
-
ఆఫీస్ స్పేస్ మార్కెట్లో హైదరాబాద్ జోరు
న్యూఢిల్లీ: కార్యాలయ వసతులకు (ఆఫీస్ స్పేస్) డిమాండ్ బలంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఆరు ప్రముఖ పట్టణాల్లో జూలై–సెప్టెంబర్ మధ్య 17.3 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) స్థూల లీజింగ్ నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ పరిమాణం 13.2 మిలియన్ ఎస్ఎఫ్టీ కంటే 31 శాతం పెరిగినట్టు కొలియర్స్ ఇండియా విడుదల చేసిన డేటా స్పష్టం చేసింది. బెంగళూరు, హైదరాబాద్ మార్కెట్లలోనే సగం మేర లీజింగ్ నమోదు కావడం గమనార్హం. పట్టణాల వారీగా లీజింగ్ » హైదరాబాద్ మార్కెట్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ సెపె్టంబర్ క్వార్టర్లో 16 శాతం పెరిగి రూ.2.9 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో స్థూల లీజింగ్ 2.5 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. » బెంగళూరులో 6.3 మిలియన్ ఎస్ఎఫ్టీ లీజింగ్ జరిగింది. ఒక త్రైమాసికం వారీగా అత్యధిక లీజింగ్ ఇదే కావడం గమనించొచ్చు. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 3.4 మిలియన్ ఎస్ఎఫ్టీతో పోలి్చతే 85 శాతం పెరిగింది. » పుణెలో స్థూల ఆఫీస్ స్పేస్ లీజింగ్ 2.6 మిలియన్ ఎ స్ఎఫ్టీగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఒ క మిలియన్ ఎస్ఎఫ్టీ లీజింగ్ నమోదైంది. » ముంబైలో 1.7 మిలియన్, చెన్నైలో 1.4 మిలియన్ ఎస్ఎఫ్టీ చొప్పున స్థూల లీజింగ్ జరిగింది. » ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఆఫీస్ లీజింగ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 25%పెరిగి 2.4 మిలి యన్ ఎస్ఎఫ్టీకి చేరుకుంది. స్థూల లీజింగ్‌లో రెన్యువల్స్, ఆసక్తి వ్యక్తీకరణ లావాదేవీలను కలపలేదు. టెక్నాలజీ రంగం నుంచి డిమాండ్ జూలై –సెపె్టంబర్ కాలంలో నమోదైన స్థూల లీజింగ్‌లో 25 శాతం మేర టెక్నాలజీ రంగం నుంచే ఉన్నట్టు కొలియర్స్ ఇండియా డేటా తెలియజేసింది. ఆ తర్వాత బీఎఫ్ఎస్ఐ కంపెనీలు, ఫ్లెక్స్ స్పేస్ ఆపరేట్ల నుంచి లీజ్ ఒప్పందాలు అధికంగా జరిగాయి. ‘‘గడిచిన 2–3 ఏళ్లలో వివిధ రంగాలు, విభిన్న మార్కెట్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. లీజింగ్ మార్కెట్ ఏటేటా కొత్త గరిష్టాలకు చేరుకుంటోంది. 2024లోనూ అధిక డిమాండ్, సరఫరా కనిపిస్తోంది’’అని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సరీ్వసెస్ ఎండీ అర్పితా మల్హోత్రా తెలిపారు.హైదరాబాద్, బెంగళూరు, ముంబై మార్కెట్లలో ఈ ఏడాది మొదటి మూడు త్రైమాసికాల్లో (జనవరి–సెప్టెంబర్) ఆఫీస్ స్పేస్ డిమాండ్ 2023 మొత్తం డిమాండ్‌ను అధిగమించినట్టు చెప్పారు. సెపె్టంబర్ క్వార్టర్లో లీజు లావాదేవీల్లో రూ.లక్ష ఎస్ఎఫ్టీకి మించినవే 65 శాతంగా ఉన్నట్టు తెలిపారు. -
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలకు ఏమైంది?
న్యూఢిల్లీ: హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు జూలై–సెప్టెంబర్ మధ్య కాలంలో 11 శాతం మేర క్షీణించాయి. మొత్తం 1.07 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో విక్రయాలు 1,20,290 యూనిట్లుగా ఉన్నాయి. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది.కొత్త ఆవిష్కరణలు తక్కువగా ఉండడం, అదే సమయంలో ఇళ్ల ధరలు సగటున 23 శాతం పెరగడం అమ్మకాల క్షీణతకు కారణాలుగా పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో అమ్మకాలు ఏకంగా 22 శాతం తగ్గి 12,735 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 16,375 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. పట్టణాల వారీగా.. » పుణెలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 17 శాతం తక్కువగా 19,050 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. » ఢిల్లీ ఎన్సీఆర్లో అమ్మకాలు 15,570 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాల కంటే 2% తక్కువ. » బెంగళూరులో ఇళ్ల విక్రయాలు 8 శాతం క్షీణించి 15,025 యూనిట్లుగా ఉన్నాయి. » కోల్‌కతా పట్టణంలో 25 తక్కువగా 3,980 యూనిట్ల విక్రయాలు జరిగాయి. » చెన్నైలో 4,510 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 4,945 యూనిట్ల కంటే 9% తగ్గాయి. హైదరాబాద్‌లో ధరల పెరుగుదల అధికం ఏడు ప్రముఖ పట్టణాల్లో హైదరాబాద్‌లోనే ఇళ్ల ధరల పెరుగుదల అధికంగా 32 శాతం మేర నమోదైంది. ‘‘నిర్మాణంలోకి వినియోగించే ఉత్పత్తుల ధరలు పెరగడం, అమ్మకాల్లోనూ గణనీయమైన వృద్ధితో.. ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు మొత్తం మీద 23 శాతం మేర పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.6,800 నుంచి రూ.8,390కు పెరిగింది’’అని అనరాక్ నివేదిక తెలిపింది. పండుగల కాలంలో డిమాండ్ ‘‘అన్ని ప్రముఖ పట్టణాల్లోనూ ఇళ్ల అమ్మకాలు క్షీణించాయి. టాప్–7 పట్టణాల్లో నూతన ఇళ్ల యూనిట్ల సరఫరా జూలై–సెపె్టంబర్ మధ్య 19 శాతం తగ్గి 93,750 యూనిట్లుగానే ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 1,16,220 కొత్త యూనిట్ల సరఫరా నమోదైంది. ఆవిష్కరణల కంటే విక్రయాలు ఎక్కువగా ఉండడం.. డిమాండ్–సరఫరా సమీకరణం బలంగా ఉండడాన్ని సూచిస్తోంది’’అని అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి తెలిపారు. అధిక ధరలకు తోడు, వర్షాకాలం కావడం విక్రయాలు తగ్గడం వెనుక ఉన్న అంశాలుగా పేర్కొన్నారు. -
హీరో మోటో డివిడెండ్ రూ. 100
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 50 శాతం జంప్‌చేసి రూ. 1,093 కోట్లను తాకింది. వివిధ ప్రాంతాలలో అమ్మకాలు పుంజుకోవడం లాభాలకు దోహదపడింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 726 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 8,300 కోట్ల నుంచి రూ. 10,031 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో 18 శాతం అధికంగా 14.6 లక్షల మోటార్‌సైకిళ్లు, స్కూటర్లను విక్రయించింది. కంపెనీ చైర్మన్ ఎమెరిటస్ బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ శత జయంతి సందర్భంగా రూ. 25 ప్రత్యేక డివిడెండుతో కలిపి వాటాదారులకు కంపెనీ బోర్డు మొత్తం షేరుకి రూ. 100 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. రూ. 600 కోట్లు వెచి్చంచడం ద్వారా విడిభాగాలు, యాక్సెసరీస్, మెర్కండైజ్ బిజినెస్‌ను విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు హీరో మోటోకార్ప్ తాజాగా వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో హీరో మోటోకార్ప్ షేరు 2 శాతం లాభంతో రూ. 4,909 వద్ద ముగిసింది. -
మీకు తెలుసా.. ఈ ఆడి కార్ల ధరలు పెరగనున్నాయ్!
భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన జర్మన్ బ్రాండ్ 'ఆడి' 2023 మే 01 నుంచి తన వాహనాల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. కస్టమ్స్ డ్యూటీ అండ్ ఇన్పుట్ ఖర్చుల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆడి క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ధరలు వచ్చే నెల ప్రారభం నుంచి 1.6 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సంస్థ ప్రకటించింది. ఇప్పటికే క్యూ8 సెలబ్రేషన్, ఆర్ఎస్ 5, ఎస్ 5 ధరలు ఈ నెల ప్రారంభం నుంచి పెరిగిన విషయం అందరికి తెలిసిందే. కాగా వచ్చే నెల ప్రారంభం నుంచి మరో రెండు మోడల్స్ ధరలు పెరుగుతాయి. ఆడి కంపెనీ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అత్యాధునిక కార్లను విడుదల చేసి మంచి అమ్మకాలను పొందుతోంది. అయితే ఇప్పుడు ధరల పెరుగుదల కొనుగోలుదారులపైన కొంత ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. అయితే కొత్త ధరలు త్వరలోనే వెల్లడవుతాయని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీ వివిధ స్థాయిలలో ధరల ప్రభావాన్ని కస్టమర్ల మీద పడకుండా చూడటానికి ప్రయత్నించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితి ధరలను పెంచాల్సిన అవసరం తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ కూడా వివిధ మోడళ్ల ధరలను ఏప్రిల్ 01 నుంచి రూ. 2 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు పెంచింది. -
స్పైస్‌జెట్‌కు లాభాలు
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ డిసెంబర్ త్రైమాసికానికి రూ.107 కోట్లను ప్రకటించింది. ప్రయాణికులు, సరుకు రవాణా పరంగా పనితీరు మెరుగ్గా ఉండడం లాభాలకు కారణమని కంపెనీ తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలానికి స్పైస్‌జెట్ లాభం రూ.23.28 కోట్లుగా ఉంది. విదేశీ మారకం సర్దుబాటుకు ముందు చూస్తే డిసెంబర్ క్వార్టర్లో లాభం రూ.221 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.2,679 కోట్ల నుంచి రూ.2,794 కోట్లకు పెరిగింది. ‘‘మా ప్యాసింజర్, కార్గో వ్యాపారం మంచి పనితీరు చూపించడం లాభాలకు తోడ్పడింది. రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయి. రుణ భారం తగ్గించుకునేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి’’ అని స్పైస్‌జెట్ చైర్మన్, ఎండీ అజయ్ సింగ్ తెలిపారు. -
ఐషర్ మోటార్స్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ఆటో రంగ దిగ్గజం ఐషర్ మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 62 శాతం దూసుకెళ్లి రూ. 741 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 456 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,973 కోట్ల నుంచి రూ. 3,913 కోట్లకు జంప్ చేసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 2,416 కోట్ల నుంచి రూ. 3,006 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో వాణిజ్య వాహన భాగస్వామ్య సంస్థ వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్ 13 శాతం వృద్ధితో 18,162 యూనిట్లను విక్రయించినట్లు ఐషర్ మోటార్స్ పేర్కొంది. కంపెనీ చరిత్రలోనే ఇవి అత్యధికంకాగా.. ద్విచక్ర వాహన విభాగం రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు సైతం 31 శాతం జంప్‌చేశాయి. 2,19,898 మోటార్ సైకిళ్లను విక్రయించింది. గత కొద్ది నెలలుగా ప్రవేశపెట్టిన కొత్త మోడళ్లు హంటర్ 350, సూపర్ మీటియోర్ 650కు అంతర్జాతీయంగా డిమాండ్ కనిపిస్తున్నట్లు కంపెనీ ఎండీ సిద్ధార్థ లాల్ తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో ఐషర్ మోటార్స్ షేరు ఎన్ఎస్ఈలో 2.2 శాతం నీరసించి రూ. 3,180 వద్ద ముగిసింది. -
బాబోయ్, హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు.. కారణం ఎంటంటే!
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇళ్ల ధరలు సెప్టెంబర్ త్రైమాసికంలో 8 శాతం పెరిగాయి. చరదపు అడుగు ధర రూ.9,266కు చేరుకుంది. దేశంలో అత్యధికంగా ఢిల్లీ–ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల ధరలు 14 శాతం పెరిగాయి. ఇక్కడ చదరపు అడుగు ధర రూ.7,741గా ఉంది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల రియల్టీ ధరల వివరాలతో క్రెడాయ్–కొలియర్స్, లియాసెస్ ఫొరాస్ నివేదిక విడుదలైంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు సగటున 6 శాతం పెరిగాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో అత్యధికంగా గోల్ఫ్‌కోర్స్ రోడ్డులో ఇళ్ల ధరలు 21 శాతం పెరిగాయి. ► కోల్‌కతాలో సగటున 12 శాతం అధికమై, చదరపు అడుగు ధర రూ.6,954గా ఉంది. ► అహ్మదాబాద్ పట్టణంలో 11 శాతం పెరిగి చదరపు అడుగు ధర రూ.6,077గా ఉంది. ► పుణెలో 9 శాతం వృద్ధితో చదరపు అడుగు ధర రూ.8,013కు చేరింది. ► బెంగళూరులో 6% పెరిగి రూ.8,035గా ఉంది. ► చెన్నై, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ధరల్లో పెద్ద మార్పు లేదు. చెన్నైలో చదరపు అడుగు రూ.7,222గా, ఎంఎంఆర్‌లో రూ.19,485 చొప్పున ఉంది. ► 2022 ఆరంభం నుంచి డిమాండ్ బలంగా ఉండడం, నిర్మాణ వ్యయాలు అధికం కావడంతో ఇళ్ల ధరలు పెరుగుతూ వచ్చినట్టు ఈ నివేదిక తెలిపింది. ‘కే’ షేప్డ్ రికవరీ ‘‘దేశవ్యాప్తంగా రియల్ఎస్టేట్ మార్కెట్ ధరల పరంగా ‘కే’ ఆకారపు రికవరీ తీసుకుంది. వినియోగదారుల కొనుగోలు సెంటిమెంట్ బలంగా కొనసాగింది. అద్దె ఇంటి కంటే సొంతిల్లు అవసరమనే ప్రాధాన్యత కరోనా తర్వాత ఏర్పడింది’’అని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ హర్ష వర్ధన్ పటోడియా చెప్పారు. డిమాండ్ ఉన్నందున అమ్ముడుపోని మిగులు ఇళ్ల నిల్వలు ఇక ముందు తగ్గుతాయని అంచనా వేశారు. ఇళ్ల ధరల పెరుగుదల అంతర్జాతీయంగా నెలకొన్న ద్రవ్యోల్బణ ధోరణలకు అనుగుణంగానే ఉందన్నారు. డిమాండ్ బలంగా ఉండడంతో ఇళ్ల ధరల పెరుగుదల ఇంక ముందూ కొనసాగొచ్చని అంచనా వేశారు. చదవండి: IT Layoffs 2022: ‘నా ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో’..టెక్కీలకు చుక్కలు చూపిస్తున్న కంపెనీలు! -
క్యూ3లో మెరుగ్గా ఉక్కు కంపెనీల లాభాలు
న్యూఢిల్లీ: సవాళ్లతో గడిచిపోయిన సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో దేశీ ఉక్కు తయారీ సంస్థల లాభదాయకత మెరుగుపడవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా పెరుగుతున్న డిమాండ్, తగ్గుతున్న ముడి ఉత్పత్తుల వ్యయాలు ఇందుకు దోహదపడవచ్చని భావిస్తున్నారు. ‘ఒకవైపు ఉక్కు ధరలు పడిపోతూ మరోవైపు ముడి వస్తువుల రేట్లు.. ముఖ్యంగా కోకింగ్ కోల్ ధరలు పెరిగిపోతూ ఉండటం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారతీయ స్టీల్ కంపెనీల ఆర్థిక పనితీరుపై ప్రతికూల ప్రభావం పడింది. అయితే, కోకింగ్ కోల్ వ్యయాలు తగ్గడం, పెరుగుతున్న డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాలు పుంజుకంటూ ఉండటం వంటి అంశాలతో మూడో త్రైమాసికంలో వాటి లాభదాయకత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి‘ అని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా సీనియర్ వైస్–ప్రెసిడెంట్ జయంత రాయ్ చెప్పారు. వచ్చే రెండు త్రైమాసికాల్లో ఉక్కు రంగం లాభదాయకత ఒక మోస్తరుగా మెరుగుపడవచ్చని ఎక్యూయిట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ అనలిటికల్ ఆఫీసర్ సుమన్ చౌదరి తెలిపారు. సరఫరాపరమైన సవాళ్లతో పెరిగిన ముడి వస్తువుల రేట్లు ద్వితీయార్థంలో తగ్గుముఖం పట్టనుండటం, సీజనల్‌గా డిమాండ్ పుంజుకుని ఉక్కు ధర పెరగడం వంటివి ఇందుకు సహాయపడగలవని తెలిపారు. ప్రాంతీయంగా ఆశావహంగా భారత్.. ముడి వస్తువులు .. ఇతర ఉత్పత్తుల వ్యయాలు అధిక స్థాయిలో ఉండి, ఉక్కు ధరలు గణనీయంగా పడిపోవడం వల్ల సీజనల్‌గా స్టీల్ కంపెనీలకు జూలై–సెప్టెంబర్ త్రైమాసికంగా బలహీనంగా ఉంటుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ ఫైనాన్స్) కౌస్తుభ్ చౌబల్ తెలిపారు. అయినప్పటికీ, ప్రాంతీయంగా భారత్ ఆశావహంగానే ఉందని, వచ్చే 12 నెలల్లో స్టీల్ వినియోగం సింగిల్ డిజిట్ శాతంలో వృద్ధి నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. ఆటో రంగం నుండి డిమాండ్, ఇన్ఫ్రాపై ప్రభుత్వం భారీగా పెట్టుబడులు కొనసాగిస్తుండటం ఇందుకు దోహదపడగలవని వివరించారు. ద్వితీయార్థంలో అంతర్జాతీయంగా స్టీల్‌కు డిమాండ్ బలహీనంగా ఉన్నా దేశీయంగా మాత్రం బాగానే ఉండటంతో పరిశ్రమ ఈ ఆర్థిక సంవత్సరంలో 6–8 శాతం వృద్ధి చెందవచ్చని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ మనీష్ గుప్తా చెప్పారు. ఉక్కు ధరలు ఒక శ్రేణిలో తిరగవచ్చని పేర్కొన్నారు. చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్.. నేటి నుంచి -
తరలిపోతున్న విదేశీ ఇన్వెస్టర్లు
న్యూఢిల్లీ: దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో 2 శాతం క్షీణించాయి. దీంతో అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో ఎఫ్‌పీఐ పెట్టుబడుల విలువ 654 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. మార్నింగ్ స్టార్ నివేదిక ప్రకారం జులై–సెప్టెంబర్(క్యూ2)లో ఇవి 667 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఎఫ్‌పీఐలు భారీ విక్రయాలకు తెరతీయడంతో దేశీ స్టాక్ మార్కెట్లలో దిద్దుబాటు చోటుచేసుకుంది. ప్రధానంగా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్స్‌లో అత్యధిక విక్రయాలు మార్కెట్లను దెబ్బతీశాయి. వెరసి ఈక్విటీ మార్కెట్ల క్యాపిటలైజేషన్లో ఎఫ్‌పీఐల వాటా క్యూ3లో నమోదైన 19 శాతం నుంచి క్యూ4 కల్లా 18 శాతానికి నీరసించింది. కాగా.. 2020 డిసెంబర్‌కల్లా దేశీ ఈక్విటీలలో ఎఫ్‌పీఐల వాటాల విలువ 518 బిలియన్ డాలర్లుగా నమోదుకావడం గమనార్హం! అమ్మకాలకే ప్రాధాన్యం ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో ఆఫ్‌షోర్ బీమా కంపెనీలు, హెడ్జ్ ఫండ్స్, సావరిన్ వెల్త్ ఫండ్స్‌తోపాటు ఆఫ్‌షోర్ మ్యూచువల్ ఫండ్స్ సైతం కీలక పాత్ర పోషిస్తుంటాయి. దేశీ ఈక్విటీలలో ఈ ఏడాది క్యూ2లో 56.34 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు క్యూ3లో యూటర్న్ తీసుకుని 5.12 బిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. నెలవారీగా చూస్తే అక్టోబర్‌లో 1.81 బిలియన్ డాలర్లు, నవంబర్‌లో 0.79 బిలియన్ డాలర్లు, డిసెంబర్లో మరింత అధికంగా 2.52 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇక 2021 జనవరి–డిసెంబర్ కాలాన్ని పరిగణిస్తే నికరంగా 3.76 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. అయితే 2020 ఇదేకాలంలో ఏకంగా 8.42 బిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. 2022లో మరింత డీలా ఇక ప్రస్తుత కేలండర్ ఏడాది(2022)లో సైతం ఎఫ్‌పీఐలు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ప్రధానంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ బాండ్ల కొనుగోలు నిలిపివేసేందుకు నిర్ణయించడంతోపాటు.. వడ్డీ రేట్ల పెంపువైపు దృష్టిపెట్టడంతో పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కఠిన పరపతి విధానాలు అమల్లోకి రానున్న అంచనాలు ప్రభావం చూపుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఇటీవల బాండ్ల ఈల్డ్స్ జోరందుకోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. దీంతో ఇన్వెస్టర్లు ఈక్విటీల వంటి రిస్క్ అధికంగాగల ఆస్తుల నుంచి వైదొలగి పసిడివైపు మళ్లుతున్నట్లు తెలియజేసింది. వెరసి 2022లో ఫిబ్రవరి 4వరకూ ఎఫ్‌పీఐలు 4.95 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లు తెలియజేసింది. చదవండి : డెట్ ఇష్యూల్లో రూ.5 లక్షల వరకు పెట్టుబడులకు యూపీఐ -
వృద్ధి రేటులో 0.3 శాతం ‘ఒమిక్రాన్’పాలు!
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్–19 కొత్త వేరియంట్ ప్రభావం తీవ్రంగా ఉండబోతున్నట్లు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది. తాజా ఆంక్షల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి) స్థూల దేశీయోత్పతి (జీడీపీ) విలువలో కొంత మొత్తం ఒమిక్రాన్ వల్ల హరించుకుపోనుందని విశ్లేషించింది. వృద్ధి రేటులో 0.2– 0.3 శాతం శ్రేణి మేర కోతపడే అవకాశం ఉందని పేర్కొంది. క్యూ4లో 6.1 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్నది తమ తొలి అంచనాకాగా, ఇది 5.9–5.8 శాతం శ్రేణికి పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే వెల్లడైన గణాంకాల ప్రకారం క్యూ1, క్యూ2ల్లో జీడీపీ వృద్ధి రేటు వరుసగా 20.1 శాతం, 8.4 శాతాలుగా నమోదయ్యాయి. తాజా నివేదికలో బ్యాంక్ ఆర్థిక వేత్తలు వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో కొన్ని... ► రాష్ట్రాలు కోవిడ్–సంబంధిత ఆంక్షలు విధించడంతో (ప్రజల రాకపోకలపై రాత్రిపూట కర్ఫ్యూ, 50 శాతం సామర్థ్యంతో రెస్టారెంట్లు, వివిధ రాష్ట్రాల్లో 50 శాతం సామర్థ్యంతో కార్యాలయాలు పనిచేయడం) 2021–22 క్యూ4లో ఆర్థిక కార్యకలాపాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ► ప్రస్తుత తరుణంలో మరిన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దీనికితోడు గ్లోబల్ రికవరీ మందగించడం వల్ల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడే వీలుంది. ► కోవిడ్ మహమ్మారికి సంబంధించి మునుపటి వేవ్‌ల అనుభవాలను బట్టిచూస్తే, కోవిడ్ కేసులు పెరిగేకొద్దీ కదలికలపై (మొబిలిటీ) పరిమితులు మొదలవుతాయి. ఇది ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది. ► భారతదేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. మొత్తం ఇన్ఫెక్షన్లలో 60 శాతం కొత్త వేరియంట్‌కు సంబంధించినవిగా ఉంటున్నాయి. ► నాటికి దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య సోమవారంనాటికి (3వ తేదీ) 1,700గా ఉంది. అయితే జీనోమ్ సీక్వెన్సింగ్‌ను తనిఖీ చేయడానికి భారతదేశంలో చాలా తక్కువ పరీక్షా సౌకర్యాలు ఉన్నందున ఒమిక్రాన్ కేసుల వాస్తవ సంఖ్య ఎక్కువగా ఉండవచ్చు. కొన్ని మీడియా నివేదికలు దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసులను 18,000గా అంచనా వేస్తుండడం గమనార్హం. ► ఒమిక్రాన్ భయాందోళనలు ఉన్నప్పటికీ, డాలర్ మారకంలో రూపాయి విలువ 74–76 శ్రేణిలో ఉండే వీలుంది. రూపాయి భారీ పతనాన్ని నిరోధించడానికి అవసరమైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జోక్యం చేసుకునే వీలుంది. ► తాజా వేరియంట్ వృద్ధిపై ప్రభావం చూపే అవకాశాలు ఉండడం వల్ల ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)ను మరికొంత కాలం సరళతరం రీతిలోనే కొనసాగించే వీలుంది. అలాగే బ్యాంకుల్లో అదనపు దవ్య లభ్యతను వెనక్కు తీసుకునే చర్యలనూ తక్షణం తీసుకోకపోవచ్చు. దీనిప్రకారం ఫిబ్రవరిలో ఆశించిన రివర్స్ రెపో (బ్యాంకులు తమ అదనపు నిధులను ఆర్బీఐ వద్ద ఉంచి పొందే వడ్డీరేటు– ప్రస్తుతం 3.35 శాతం) పెంపు ఉండకపోవచ్చు. తగిన ద్రవ్య లభ్యత, ఈల్డ్స్ కట్టడి వంటి అంశాలపై ఆర్బీఐ దృష్టి సారించే వీలుంది. ద్రవ్యల్బణం కట్టడి, వృద్ధి లక్ష్యంగా గడచిన తొమ్మిది ద్వైమాసిక సమీక్షల సందర్భంగా ఆర్బీఐ రెపో రేటును 4శాతంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. -
భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ల్యాప్టాప్స్ ఏవంటే..!
కరోనా రాకతో స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ కంపెనీలకు కాసుల వర్షం కురిసింది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులతో పలు ల్యాప్‌ట్యాప్ కంపెనీలు గణనీయమైన అమ్మకాలను చూశాయి. దేశవ్యాప్తంగా జూలై నుంచి సెప్టెంబర్(క్యూ 3) త్రైమాసికంలో పర్సనల్ కంప్యూటర్ షిప్మెంట్లు బలమైన వృద్ధిని సాధించాయి. మూడు నెలల్లో సుమారు 4.5 మిలియన్ల యూనిట్లను పలు ల్యాప్‌టాప్ కంపెనీలు షిప్పింగ్ చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే 30 శాతం అధికంగా వృద్ధిని సాధించాయి. ►ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ నివేదిక ప్రకారం... ఈ ఏడాది క్యూ3లో భారత్‌లో ఎక్కువగా అమ్ముడైన ల్యాప్‌టాప్‌లో హెచ్‌పీ 28.5 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌లో దాదాపు 1.3 మిలియన్ల యూనిట్ల కొనుగోలు జరిగినట్లు తెలుస్తోంది. హెచ్‌పీ సుమారు 31.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. ►డెల్ టెక్నాలజీస్ రెండో స్థానంలో నిలిచింది. పర్సనల్ కంప్యూటర్ కేటగిరీలో క్యూ3లో 23.8 శాతం వాటాను డెల్ సొంతం చేసుకుంది.లెనోవోను అధిగమించి 45 శాతం వృద్దిను డెల్ సాధించింది. ►2021 క్యూ3లో లెనోవో మొత్తంగా 18.6 శాతం వాటాతో మూడవ స్థానాన్ని కొనసాగించింది. గత సంవత్సరంతో పోలిస్తే లెనోవో ల్యాప్టాప్స్ షిప్మెంట్లు 11.5 శాతం వృద్ధి చెందాయి. ►ఏసర్ 8.6 శాతం మార్కెట్ వాటాతో నాలుగో స్థానంలో నిలవగా....గత సంవత్సరం ఎగుమతులలో పోలిస్తే 16.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో దాదాపు 3.8 లక్షల యూనిట్లకు చేరుకుంది. ►మరో వైపు ఆసుస్ ఈ ఏడాది క్యూ3లో 8.5 శాతం మార్కెట్ వాటాతో ఐదవ స్థానంలో ఉండగా... భారత్‌లో మొదటిసారిగా 3 లక్షల పర్సనల్ కంప్యూటర్లను షిప్పింగ్ చేసింది. ►యాపిల్ లాంట్ దిగ్గజ కంపెనీ కూడా ఈ ఏడాది క్యూ3లో సుమారు 12 శాతం మేర వాటాను దక్కించుకున్నాయి. ►సరఫరా, లాజిస్టికల్ సవాళ్లు పలు కంపెనీలకు వేధిస్తున్నప్పటికీ ఆయా కంపెనీలు ఈ త్రైమాసికంలో గణనీయంగానే వృద్ధిని సాధించాయి. పర్సనల్ కంప్యూటర్స్‌లో నోట్‌బుక్ ల్యాప్‌టాప్ సుమారు 80 శాతం మేర కొనుగోలు జరిగాయి. డెస్క్‌టాప్ కంప్యూటర్లు 16.5 శాతంగా నిలిచాయి. -
బంగారం డిమాండ్ పదిలం!
ముంబై: బంగారం డిమాండ్ మళ్లీ పుంజుకుంటోంది. 2021 జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే పసిడి డిమాండ్ 47 శాతం పెరిగింది. పరిమాణంలో 139.1 టన్నులుగా నమోదయ్యింది. మహమ్మారి సవాళ్ల తగ్గి, ఎకానమీ పుంజుకుంటున్న నేపథ్యంలో బంగారానికి తిరిగి వినియోగ డిమాండ్ ఏర్పడుతున్నట్లు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తన తాజా నివేదికలో పేర్కొంది. డబ్ల్యూజీసీ ఆవిష్కరించిన క్యూ3 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ 2021 నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2020 సెప్టెంబర్ త్రైమాసికంలో దేశం మొత్తం డిమాండ్ 94.6 టన్నులు. అప్పటితో పోల్చితే 47 శాతం పెరిగి 139.1 టన్నులకు చేరింది. విలువ పరంగా, భారతదేశం మూడవ త్రైమాసిక బంగారం డిమాండ్ 37 శాతం పెరిగి రూ. 59,330 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం రూ.43,160 కోట్లు. ► ఇది తక్కువ బేస్ ఎఫెక్ట్ అలాగే సానుకూల వాణిజ్యం, వినియోగదారుల మనోభావాల మేళవింపును ఇది ప్రతిబింబిస్తుంది. వ్యాక్సినేషన్ విస్తృతి, ఆర్థిక కార్యకలాపాల్లో బలమైన పురోగతి బంగారం కొనుగోళ్లు భారీగా పెరగడానికి కారణం. ► దేశవ్యాప్తంగా ఆంక్షలు క్రమంగా ఎత్తివేస్తున్నందున, రిటైల్ డిమాండ్ కోవిడ్–పూర్వ స్థాయికి పుంజుకుంది. రాబోయే పండుగలు, వివాహాల సీజన్‌తో బంగారం డిమాండ్ మరింత పెరిగే వీలుంది. బంగారానికి ఇంతటి డిమాండ్ నెలకొనడం కోవిడ్ మహమ్మారి సవాళ్లు విసరడం ప్రారంభించిన తర్వాత ఇదే మొదటిసారి. ► డిజిటల్ బంగారానికి డిమాండ్ పలు రెట్లు పెరిగింది. వినూత్న సాంకేతిక చొరవలు, ప్రముఖ ఆభరణాల యూపీఐ ప్లాట్‌ఫారమ్‌ల వంటి అంశాలు ఆన్లైన్ కొనుగోళ్లను ఇష్టపడే కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల సంఖ్యను పెంచడానికి గణనీయంగా దోహదపడుతుండడం గమనార్హం. ► రాబోయే నెలల్లో కమోడిటీ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. రావాణా వ్యయాలు భారం పెరుగుతుంది. ఆయా అంశాలు ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీయవచ్చు. ఇది దీర్ఘకాలంలో బంగారం డిమాండ్ మరింత పటిష్టం కావడానికి కలిసివచ్చే అంశం. ► సెప్టెంబర్ త్రైమాసికంలో దేశం మొత్తం ఆభరణాల డిమాండ్ 58 శాతం పెరిగి 96.2 టన్నులకు చేరుకుంది. 2020 జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ పరిమాణం 60.8 టన్నులు. విలువలో ఆభరణాల డిమాండ్ 48 శాతం పెరిగి రూ.41,030 కోట్లకు చేరింది, ఇది ఏడాది క్రితం రూ.27,750 కోట్లు. ► మూడవ త్రైమాసికంలో మొత్తం పెట్టుబడి డిమాండ్ 27 శాతం పెరిగి 42.9 టన్నులకు చేరుకుంది. 2020 అదే త్రైమాసికంలో ఈ డిమాండ్ 33.8 టన్నులు. విలువ పరంగా, జూలై–సెప్టెంబర్‌లో బంగారం ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ 19 శాతం పెరిగి రూ.18,300 కోట్లకు చేరుకుంది.ఇది ఏడాది క్రితం రూ.15,410 కోట్లు. ► సమీక్షా కాలంలో భారతదేశంలో రీసైకిల్ చేసిన మొత్తం బంగారం 50 శాతం క్షీణించి 20.7 టన్నులకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో 41.5 టన్నులు. బంగారం రీసైక్లింగ్‌లో 50 శాతం తగ్గుదలను పరిశీలిస్తే, బంగారాన్ని విక్రయించడం కంటే బంగారాన్ని కలిగి ఉండాలనే బలమైన వినియోగదారు ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోంది. ► బలమైన సంస్థాగత మార్కెట్ల దన్నుతో బంగారంపై రుణాల మార్కెట్ కూడా భారీగా పెరుగుతుండడం గమనార్హం. ► పన్నులు లేకుండా మొత్తం నికర బులియన్ దిగుమతులు మూడవ త్రైమాసికంలో 187 శాతం పెరిగి 255.6 టన్నులకు చేరింది. 2020 ఇదే త్రైమాసికంలో ఈ పరిమాణం 89 టన్నులు. ► మూడో త్రైమాసికంలో బంగారం ధర సగటున 10 గ్రాములకు రూ.42,635గా ఉంది. 2020 ఇదే త్రైమాసికంలో ఈ ధర రూ.45,640. 2021 ఏప్రిల్–జూన్‌లో సగటు ధర రూ.43,076. ► వివిధ కొనుగోలుదారు–విక్రేతల సమావేశాల సందర్భంలో వచ్చిన అభిప్రాయాలను, పెరుగుతున్న వాణిజ్య కార్యకలాపాలనూ పరిశీలిస్తే నాల్గవ త్రైమాసికం పండుగ సీజన్లో పసిడి డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా. దిగుమతులూ భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా డౌన్ మరోవైపు అంతర్జాతీయంగా సెప్టెంబర్ త్రైమాసికంలో పసిడి డిమాండ్ 7 శాతం తగ్గింది. డిమాండ్ 831 టన్నులకు తగ్గినట్లు డబ్ల్యూజీసీ పేర్కొంది. గోల్డ్ ఎక్ఛ్సేంజ్ ట్రేడెట్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్) నుంచి భారీగా డబ్బు వెనక్కు వెళ్లినట్లు గణాంకాలు వెల్లడించాయి. మూడవ త్రైమాసికంలో సగటున ఔన్స్ (31.1గ్రాములు) ధర 6 శాతం తగ్గి, 1,790 డాలర్లకు చేరింది. 2020 ఇదే కాలంలో ఈ ధర 1,900 డాలర్లు. ఆభరణాలకు డిమాండ్ 33 శాతం పెరిగి 443 టన్నులకు చేరింది. టెక్నాలజీలో పసిడి వినియోగం 9 శాతం పెరిగి 83.8 టన్నులకు ఎగసింది. సెంట్రల్ బ్యాంకులు తమ పసిడి నిల్వలను మొత్తంగా 69 టన్నులు పెంచుకున్నాయి. 2020 ఇదే కాలంలో 10 టన్నుల విక్రయాలు జరిపాయి. కాగా సరఫరాలు మాత్రం మూడు శాతం తగ్గి 1,279 డాలర్ల నుంచి 1,239 డాలర్లకు పడింది. -
టెస్లా జోరు.. మిగతా కంపెనీల బేజారు..!
ఎలన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ టెస్లా అమ్మకాల్లో సరికొత్త రికార్డును నమోదుచేసింది.ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా కార్ కంపెనీలు చిప్ కొరతతో సతమతమౌతుంటే టెస్లా దానిని అధిగమించి అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో సుమారు 241,300 కార్ల అమ్మకాలు జరిపింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో జరిపిన అమ్మకాల కంటే లక్షకుపైగా కార్లను టెస్లా విక్రయించింది. 2019 సంవత్సరంలో టెస్లా మొత్తంగా 367500 కార్ల సేల్స్‌ను జరిపింది. చదవండి: ఇంటర్నెట్ స్పీడ్ ఎంత వస్తుందో ఇలా చెక్ చేయండి..! గత త్రైమాసికంలో ప్రధాన కార్ల తయారీదారులు అమ్మకాల రేటు గణనీయంగా పడిపోయింది.టెస్లాకు చైనాలో బలమైన మార్కెట్ అమ్మకాలను గణనీయంగా పెరగడానికి దోహదపడింది. అమెరికన్ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ జనరల్‌మోటార్స్ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 446,997 వాహనాలను మాత్రమే విక్రయించింది. ఈ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 33 శాతం తగ్గాయి. చదవండి: టాటా స్కై కోసం అంతరిక్షంలోకి జిశాట్-24 కమ్యూనికేషన్ శాటిలైట్ -
మార్కెట్‌ను ముంచేసిన అంతర్జాతీయ అస్థిరతలు
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న అస్థిర పరిస్థితులు మరోసారి మన మార్కెట్‌ను ముంచేశాయి. ఆరున్నర గంటల పాటు అమ్మకాల పరంపరం కొనసాగడంతో సూచీలు గడిచిన తొమ్మిది నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. అధిక వెయిటేజీ కలిగిన ఆర్థిక, బ్యాంకింగ్ రంగాల షేర్లలో పెద్ద ఎత్తున విక్రయాలు వెల్లువెత్తడం సూచీలు భారీ క్షీణతకు దారితీసింది. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 1,939 పాయింట్ల నష్టంతో 49,100 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 568 పాయింట్లు కోల్పోయి 14,529 వద్ద ముగిసింది. ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు విక్రయాలకే మొగ్గు చూపడంతో ఒక దశలో సెన్సెక్స్ 2,149 పాయింట్ల మేర నష్టపోయి 48,890 స్థాయికి దిగివచ్చింది. నిఫ్టీ ఇంట్రాడేలో ఏకంగా 630 పాయింట్ల పతనమై 14,467 వద్దకు దిగజారింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలోని అన్ని రంగాల షేర్లు నష్టాల పాలయ్యాయి. ఎన్ఎస్ఈలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల సూచీలతో పాటు ఆర్థిక, బ్యాంక్ నిఫ్టీ సూచీలు 5% పతనమయ్యాయి. మెటల్, ఫార్మా, ఐటీ, ఆటో ఇండెక్స్‌లు 3% పతనయ్యాయి. ‘‘ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీనతలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బాండ్ ఈల్డ్స్ పుంజుకోవడంతో వడ్డీరేట్ల పెరుగుదల భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, రూపాయి భారీ పతనం ప్రతికూలాంశాలుగా మారాయి. దేశీయ మార్కెట్‌ను రానున్న రోజుల్లో క్యూ3 జీడీపీ గణాంకాలు కొంతకాలం ప్రభావితం చేసే అవకాశం ఉన్నప్పటికీ.. దీర్ఘకాలం పాటు మన మార్కెట్ అంతర్జాతీయ పరిణామాలనే అనుసరిస్తుంది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. మార్కెట్లో మరిన్ని అంశాలు... ► సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లు, నిఫ్టీలోని 50 షేర్లలో ఏ ఒక్క షేరూ లాభంతో ముగియలేదు. ► మార్కెట్లో ఒడుదొడుకుల్ని సూచించే వొలటాలిటీ ఇండెక్స్(వీఐఎక్స్) 19 శాతం నుంచి ఏకంగా 27 శాతానికి ఎగబాకింది. ► క్రూడాయిల్ ధర కాస్త దిగిరావడంతో ఓఎన్జీసీ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా షేరు ఎనిమిది శాతం పతనంతో రూ.111 వద్ద ముగిసింది. ► హెచ్డీఎఫ్సీ ద్వయం షేరు 4 నుంచి 5 శాతం పతనయ్యాయి. నిమిషానికి రూ.1,450 కోట్ల నష్టం సూచీలు మూడు శాతానికి పైగా పతనంతో ఇన్వెస్టర్లు 5.43 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ప్రతి నిమిషానికి రూ.1,450 కోట్ల నష్టాన్ని చూవిచూశారు. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.200 లక్షల కోట్లకు దిగివచ్చింది. పతనానికి కారణాలు... ► భయపెట్టిన బాండ్ ఈల్డ్స్ ... కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంచనాల కంటే వేగంగా పుంజుకుంటోంది. వ్యవస్థ ఊహించని రీతిలో వృద్ధి బాట పట్టడంతో రానున్న రోజుల్లో ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు తిరిగి వడ్డీరేట్లను పెంచవచ్చనే అనుమానాలు తలెత్తాయి. ఈక్విటీలతో పోలిస్తే బాండ్లలో పెట్టుబడులకు రిస్క్ సామర్థ్యం చాలా తక్కువ. పైగా వడ్డీరేట్ల పెంపుతో బాండ్ల నుంచి అధిక ఆదాయాన్ని పొందవచ్చని ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఈక్విటీల నుంచి బాండ్లలోకి మళ్లిస్తున్నారు. ► మళ్లీ పెరుగుతున్న కోవిడ్–19 కేసులు ఒకపక్క దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలోనూ తిరిగి పెరుగుతున్న కోవిడ్–19 కేసులు మార్కెట్ వర్గాలను భయపెట్టాయి. దేశంలో గురువారం ఒక్కరోజే 15వేల కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పెరుగుతున్న కేసుల నియంత్రించే చర్యల్లో భాగంగా స్థానిక ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన లాక్డౌన్ చర్యలు ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఆంటంకాన్ని కలిగించవచ్చనే ఆందోళనలు మార్కెట్ వర్గాలను వెంటాడాయి. ► లాభాల స్వీకరణ.. అప్రమత్తత! అంతకుముందు సూచీలు మూడురోజుల వరుస ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ పరిస్థితులు నెలకొన్న తరుణంలోనూ గడిచిన మూడురోజుల్లో సెన్సెక్స్ 1295 పాయింట్లు, నిఫ్టీ 421 పాయింట్లను ఆర్జించాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ ఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. అలాగే మార్కెట్ ముగింపు తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు క్యూ3 జీడీపీ గణాంకాలు విడుదల కానుండటంతో ట్రేడింగ్ సమయంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ► ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు... పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్, ద్రవ్యోల్బణ భయాలు ప్రపంచ మార్కెట్లను నష్టాల బాట పట్టించాయి. అమెరికా–ఇరాన్ దేశాల మధ్య రాజుకున్న ఘర్షణలు కూడా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. అమెరికా మార్కెట్లు గురువారం రాత్రి రెండు శాతం నష్టంతో ముగిశాయి. ఈ ప్రభావంతో ఆసియా మార్కెట్లపై పడటంతో శుక్రవారం ఆసియాలో ప్రధాన దేశాలైన జపాన్, చైనా, సింగపూర్, కొరియా, తైవాన్ దేశాలకు చెందిన స్టాక్ మార్కెట్లు 2–3 % శాతం నష్టాన్ని చవిచూశాయి. ► రూపాయి భారీ పతనం డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ కుప్పకూలింది. గత 19 నెలల్లోలేని విధంగా 104 పైసలు కోల్పోయింది. 73.47 వద్ద ముగిసింది. -
ఆశాజనకంగా జీడీపీ వృద్ది 4.7 శాతం
సాక్షి, న్యూఢిల్లీ: దేశీ స్థూల జాతీయోత్పత్తి ఆశాజనకంగా నమోదైంది. క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో జీడీపీ వృద్ధి 4.7 శాతంగా వుంది. మునుపటి త్రైమాసికంలో నమోదైన ఆరేళ్ల కనిష్టం 4.5 శాతంతో పోలిస్తే స్వల్పంగా పుంజుకుంది. గత ఏడాది ఇదే కాలంలో 5.6 శాతంగా వుంది. కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం జీడీపీ వృద్ధి 4.7 శాతంగా నమోదైంది. అలాగే మూడవ త్రైమాసికంలో స్థూల విలువ ఆధారిత (జీవీఏ) వృద్ధి 4.5 శాతంగా ఉంది, ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 4.3 శాతం ఉండగా, డిసెంబర్ త్రైమాసికంలో 6.3 శాతంగా ఉంది. ఫండమెంటల్స్ చాలా బలంగా ఉన్నాయని, భారత దేశాన్ని 5 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన దిశలో తమ తాజా బడ్జెట్ పునాది వేసిందని ఇటీవల ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలోతాజా గణాంకాల్లో జీడీవీ వృద్ధి రేటు సుమారు 5 శాతంగా ఉండటం విశేషం. -
క్యూ3 ఫలితాలు, ఆర్థికాంశాలే కీలకం...
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ కంపెనీల క్యూ3 ఫలితాల ప్రకటనలు, ద్రవ్యోల్బణ గణాంకాల వంటి స్థూల ఆర్థిక అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్ ఏకంగా 24 శాతం వృద్ధితో అంచనాలకు మించి నికర లాభాన్ని శుక్రవారం ప్రకటించి, బంపర్ ఫలితాలతో క్యూ3 బోణీ కొట్టింది. దీంతో ఈ వారంలో వెల్లడికానున్న మిగిలిన దిగ్గజ ఐటీ కంపెనీల ఫలితాలపై అంచనాలు పెరిగాయి. ఇదే రంగానికి చెందిన విప్రో సోమవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసిక (అక్టోబర్ – డిసెంబర్) ఫలితాలను ప్రకటించనుండగా.. టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్ (టీసీఎస్), హెచ్‌సీఎల్ టెక్ ఈ శుక్రవారం ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో తొలుత ఇన్ఫీ ఫలితాలకు మార్కెట్ స్పందించనుందని, ఆ తరువాత వెల్లడికానున్న ఫలితాల ఆధారంగా ఈ వారం ట్రేడింగ్ కొనసాగనుందని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అన్నారు. స్టాక్ స్పెసిఫిక్‌గా భారీ ఒడిదుడుకులకు ఆస్కారం ఎక్కువగా ఉంటుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఫలితాలు నడిపిస్తాయ్... మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అతిపెద్ద కంపెనీ, ఇండెక్స్ హెవీ వెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) క్యూ3 ఫలితాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. ఇక ఈ వారంలో ఫలితాలను ప్రకటించనున్న కంపెనీల జాబితాలో.. మైండ్‌ట్రీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఎల్ అండ్ టి ఇన్ఫోటెక్, ఎల్ అండ్ టి ఫైనాన్స్, ఎల్ అండ్ టి టెక్నాలజీ వంటి 75 దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. ఈ ఫలితాలు మార్కెట్ కదలికలపై ప్రభావం చూపనున్నాయని ట్రేడింగ్‌బెల్స్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ సంతోష్ మీనా అన్నారు. ఫలితాలతో పాటు.. వచ్చే నెల తొలి వారంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2020–21 బడ్జెట్, ఆర్బీఐ పాలసీ ప్రభావం కూడా ఈ వారం ట్రేడింగ్‌పై ఉండనుందని కోటక్ మహీంద్రా ఏఎంసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఈక్విటీ రీసెర్చ్ హెడ్ షిబాని కురియన్ విశ్లేíÙంచారు. బడ్జెట్ సమీపిస్తున్నందున ఒడిదుడుకులు పెరగనున్నాయని భావిస్తున్నట్లు సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. స్థూల ఆర్థికాంశాలు... గతేడాది డిసెంబర్ సీపీఐ ద్రవ్యోల్బణం ఈ నెల 13న (సోమవారం) వెల్లడికానుండగా.. ఆ తరువాత రోజున డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి కానున్నాయి. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్(ఎగుమతులు–దిగుమతులు) డేటా బుధవారం వెల్లడికానుంది. ఇక గత శుక్రవారం పారిశ్రామికోత్పత్తి వెల్లడికాగా, నవంబర్‌లో ఈ సూచీ 1.8 శాతం వృద్ధిరేటును నమోదుచేసింది. మూడు నెలల తర్వాత క్షీణత నుంచి బయట పడింది. ఈ సానుకూల ప్రభావం సోమవారం ట్రేడింగ్ తొలి సెషన్లో కనిపించవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. అంతర్జాతీయ అంశాల ప్రభావం.. అమెరికా–ఇరాన్ దేశాల మధ్య కమ్ముకున్న యుద్ధమేఘాలు నెమ్మదిగా కరిగిపోతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల దృష్టి అమెరికా–చైనా వాణిజ్య చర్చల వైపునకు మళ్లనుందని వినోద్ నాయర్ అన్నారు. చైనా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం.. ఈ నెల 13 నుంచి 15 వరకు అమెరికా ప్రభుత్వ పరిపాలన అధికారులతో సమావేశం కానుంది. తాజాగా కుదిరిన తొలి వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల సభ్యులు సంతకం చేయనున్నారని అంచనా. ఇదే జరిగితే మార్కెట్ నూతన శిఖరాలను దాటుకుంటూ ప్రయాణం కొనసాగిస్తుందని దలాల్ స్ట్రీట్ పండితులు చెబుతున్నారు. ఇక చైనా దేశ జీడీపీ డేటా, పారిశ్రామికోత్పత్తి శుక్రవారం వెల్లడి కానున్నాయి. -
తగ్గిన నష్టాలు
ఇరాక్‌లోని సైనిక స్థావరాలపై ఇరాన్ దాడిచేయడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ ముందస్తు అంచనాలు బలహీనంగా ఉండటంతో మన స్టాక్ మార్కెట్ బుధవారం నష్టపోయింది. ఒక దశలో దాదాపు 392 పాయింట్ల మేర క్షీణించిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 52 పాయింట్ల నష్టంతో 40,818 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఇంట్రాడేలో 123 పాయింట్లు పతనమైన నిఫ్టీ చివరకు 28 పాయింట్లు తగ్గి 12,025 పాయింట్ల వద్దకు చేరింది. ట్రేడింగ్‌లో ఒక దశలో 20 పైసలు పతనమైన రూపాయితో డాలర్ మారకం విలువ చివరకు 12 పైసలు లాభంతో ముగిసింది. సైనిక స్థావరాలపై ఇరాన్ దాడుల కారణంగా ముడి చమురు ధరలు ఒక దశలో 4 శాతం ఎగిసినా.. ఆ తర్వాత 0.62 శాతం మాత్రమే లాభపడ్డాయి. ఇక కొన్ని బ్యాంక్, ఆర్థిక రంగ, టెక్నాలజీ, ఎఫ్ఎమ్సీజీ షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో నష్టాలు తగ్గాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు చక్కబడగానే కంపెనీల క్యూ3 ఫలితాలు, బడ్జెట్లపై మార్కెట్ దృష్టి సారిస్తుందని జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ చెప్పారు. ఈ ఆరి్థక సంవత్సరం జీడీపీ 5 శాతంలోపే(ఇది పదికొండేళ్ల కనిష్ట స్థాయి) నమోదయ్యే అవకాశాలున్నాయంటూ కేంద్ర గణాంకాల సంఘం ముందస్తు అంచనాలను వెల్లడించడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఆసియా మార్కెట్లు నష్టాల్లో, యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. -
క్యూ3, క్యూ4లలో బ్యాంకింగ్‌కు వెలుగురేఖలు!
ముంబై: భారత్ బ్యాంకింగ్ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో చక్కటి ఫలితాలు నమోదుచేసుకునే అవకాశం ఉందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ రజ్నీష్ కుమార్ విశ్లేషించారు. భారీ మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య పరిష్కారం దీనికి ప్రధాన కారణమనీ వివరించారు. రుణాలకు సంబంధించి ఎడిల్వీస్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో బుధవారం ఆయన మాట్లాడారు. కొన్ని కీలక అంశాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే... రుణ వృద్ధి ‘పరుగు’ కష్టమే! ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలాన్ని (2019 ఏప్రిల్–సెప్టెంబర్) 2018లోని ఇదే కాలంతో పోలిస్తే ఎస్బీఐకి సంబంధించినంతవరకూ రుణ వృద్ధిలేకపోగా ప్రతికూలత నమోదయ్యింది. అయితే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ మాత్రం ఈ పరిస్థితి మెరుగుపడింది. వార్షిక ప్రాతిపదికన రుణ వృద్ధి దేశీయంగా 5 శాతానికి తగ్గితే, అంతర్జాతీయ మార్కెట్‌కు సంబంధించి ఈ శాతం 7గా ఉంది. మరికొంత కాలం రుణ వృద్ధి మందగమనంలోనే ఉండే అవకాశం ఉంది. 2018–19లో మొత్తం బ్యాంకింగ్ రుణ వృద్ధిరేటు 13.3 శాతం. అయితే 2019 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అంతకు ముం దటి ఏడాదితో పోలి్చచూస్తే పెరుగుదల 7.1 శాతం మాత్రమే. విలువ రూపంలో రూ.92.87 లక్షల కోట్ల నుంచి రూ.99.47 లక్షల కోట్లకు చేరింది. 2019–20లో రుణ వృద్ధిరేటు అరవై సంవత్సరాల కనిష్టస్థాయి 6.5 – 7 శాతానికి పడిపోయే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ– ఇక్రా ఇటీవలే ఒక నివేదికలో పేర్కొంది. రుణ మంజూరీల విషయం లో బ్యాంకులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ►చమురు గ్యాస్, సోలార్, రహదారుల రంగాల నుంచి బ్యాంకులకు రుణాల డిమాండ్ వస్తోంది. ►అమెరికా–ఇరాన్‌ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు దేశంలో నిత్యావసర ధరల పెరుగుదలకు దారితీస్తాయి. ఇది కరెంట్ అకౌంట్‌లోటు, కరెన్సీ విలువపైనా ప్రభావం చూపే అంశం. ► కొన్ని ప్రతికూలతలు ఉన్నా మొత్తంగా ప్రభుత్వ ఫైనాన్షియల్ పరిస్థితులు బాగున్నాయి. ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించి ద్రవ్యలోటు (జీడీపీలో 3.3 %) కట్టడిలో ఉండాలని డిమాండ్ ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో దీనిని ప్రభుత్వం పట్టంచుకుంటుందని భావించడం లేదు. 2019– 20 ఆరి్థక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు రూ.7.03 లక్షల కోట్లుగా ఉండాలన్నది (జీడీపీలో 3.3%) బడ్జెట్ లక్ష్యం. కానీ అక్టోబర్ ముగిసే నాటికే ఈ మొత్తం రూ.7,20,445 కోట్లకు(బడ్జెట్ అంచనాల్లో 102.4 శాతానికి) చేరింది. -
షేర్ల తనఖా తగ్గింది!
న్యూఢిల్లీ: ప్రమోటర్ల షేర్ల తనఖా గత ఏడాది డిసెంబర్ క్వార్టర్లో తగ్గింది. తనఖాలో ఉన్న ప్రమోటర్ల షేర్ల శాతం గత ఏడాది అక్టోబర్ క్వార్టర్లో సగటున 8.3 శాతంగా ఉంది. అది డిసెంబర్ క్వార్టర్లో 7.8 శాతానికి తగ్గినట్లు కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ రీసెర్చ్ తెలియజేసింది. డిసెంబర్ క్వార్టర్లో ప్రమోటర్లు రూ.1.98 లక్షల కోట్ల విలువైన షేర్లను తనఖా పెట్టారని, ఇది బీఎస్ఈ–500 సూచీ మార్కెట్ క్యాప్‌లో 1.47 శాతానికి సమానమని పేర్కొంది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.., ♦ బీఎస్ఈ 500 సూచీల్లోని 129 కంపెనీల ప్రమోటర్లు తమ షేర్లను తనఖా పెట్టారు. వీటిల్లో తొమ్మిది కంపెనీల ప్రమోటర్లు తమ ప్రమోటర్ హోల్డింగ్స్‌లో 90 శాతం వరకూ షేర్లను తనఖాలో ఉంచారు. ♦ కొంతమంది ప్రమోటర్లు తమ మొత్తం వాటాలో 95 శాతం వాటా షేర్లను తనఖా పెట్టారు. బజాజ్ హిందుస్తాన్, సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్, రిలయన్స్ నేవల్ అండ్ ఇంజనీరింగ్, జేబీఎఫ్ ఇండస్ట్రీస్, సుజ్లాన్ ఎనర్జీ, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్స్, ఫోర్టిస్ హెల్త్‌కేర్ ఈ జాబితాలో ఉన్నాయి. ♦ కొన్ని కంపెనీల తనఖా షేర్ల వాటా తగ్గింది. గ్రాన్యూల్స్ ఇండియా, ఫ్యూచర్ లైఫ్‌స్టైల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, క్రాంప్టన్ గ్రీవ్స్ కన్సూమర్, బాంబే బర్మా కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ♦ నిఫ్టీ సూచీలోని కొన్ని కంపెనీల ప్రమోటర్లు తమ తమ వాటాలో 5 శాతానికి పైగా షేర్లను తనఖా పెట్టారు. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ కంపెనీ ప్రమోటర్లు తమ వాటాలో 24.7 శాతం మేర తనఖా పెట్టారు. ఆ తర్వాతి స్థానాల్లో ఏసియన్ పెయింట్స్ (14 శాతం), ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (12.5 శాతం), మహీంద్రా అండ్ మహీంద్రా (5.8 శాతం), టాటా మోటార్స్ (5.3 శాతం), జీ ఎంటర్టైన్మెంట్ (4.57 శాతం) ఉన్నాయి. -
హెచ్‌యూఎల్ లాభం 1,326 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలివర్ (హెచ్‌యూఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,326 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.1,038 కోట్లతో పోలిస్తే 28 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్ తెలిపింది. గత క్యూ3లో రూ.8,400 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 4 శాతం వృద్ధితో రూ.8,742 కోట్లకు పెరిగిందని కంపెనీ చైర్మన్ హరిశ్ మన్వాని చెప్పారు. గత క్యూ3లో రూ.7,067 కోట్లుగా ఉన్న మొత్తం వ్యయాలు ఈ క్యూ3లో రూ.7,036 కోట్లకు తగ్గాయని తెలిపారు. ఇబిటా రూ.1,162 కోట్ల నుంచి 45 శాతం వృద్ధితో రూ.1,680 కోట్లకు, ఇబిటా మార్జిన్ 15.5% నుంచి 19.6%కి పెరిగాయని పేర్కొన్నారు. అన్ని కేటగిరీల్లో మంచి వృద్ధి... ఈ క్యూ3లో మంచి పనితీరు కనబరిచామని మన్వాని సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని కేటగిరీల్లో మంచి వృద్ధి సాధించామని, మార్జిన్లు కూడా మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. కీలక బ్రాండ్లపై మరింతగా పెట్టుబడులు పెడతామని, భవిష్యత్తు కోసం మరిన్ని కేటగిరీలను అభివృద్ధి చేస్తామని వివరించారు. కమోడిటీల ధరల పెరుగుదల సెగ ఇప్పుడిప్పుడే తగులుతోందని, వ్యయ నియంత్రణ పద్ధతులపై మరింతగా దృష్టిపెడుతున్నామని పేర్కొన్నారు. లాభదాయకతకను నిలకడగా కొనసాగించడానికి, పోటీని తట్టుకునేందుకు మరింత దూకుడుగా వ్యాపార నిర్వహణ సాగిస్తామని తెలిపారు. ఫెయిర్ అండ్ లవ్లీ కారణంగా స్కిన్ కేర్ సెగ్మెంట్, డవ్, పియర్స్ కారణంగా వ్యక్తిగత ఉత్పత్తుల సెగ్మెంట్లు మంచి వృద్ధిని సాధించాయని పేర్కొన్నారు. పర్సనల్ కేర్ సెగ్మెంట్ ఆదాయం రూ.3,980 కోట్ల నుంచి రూ.4,090 కోట్లకు, హోమ్ కేర్ డివిజన్ రూ.2,689 కోట్ల నుంచి రూ.2,741 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఫలితాలు అంచనాలను మించడంతో బీఎస్ఈలో హెచ్‌యూఎల్ షేర్ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,390ను తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 0.7 శాతం క్షీణించి రూ.1,372 వద్ద ముగిసింది. -
అంచనాలు మించాయ్ జీడీపీ వృద్ధి 7%
⇒ క్యూ3లో కనబడని నోట్ల రద్దు ఎఫెక్ట్ ⇒ తయారీ, వ్యవసాయ రంగాల ఊతం ⇒ 2016–17లో 7.1 శాతం ఖాయమన్న సీఎస్ఓ న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్, క్యూ3)లో అంచనాలను మించింది. ఏడు శాతంగా నమోదయ్యింది. నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ రూ.500, రూ.1,000 నోట్ల రద్దు ప్రకటన... సేవలు, తయారీసహా పలు రంగాలపై ఈ ప్రతికూల ప్రభావం భయాలు... దీనితో వృద్ధి రేటు తగ్గిపోతుందన్న అంచనాల నేపథ్యంలో తాజాగా కేంద్ర గణాంకాల శాఖ మంగళవారం ప్రకటించిన అంచనాలు ఆర్థిక విశ్లేషకులకు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించాయి. మూడో త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు 6.1–6.8 శాతం మధ్య ఉండగలదంటూ పలు ఏజెన్సీలు వేసిన అంచనాల్ని తాజా గణాంకాలు మించడం విశేషం. ముఖ్య రంగాలను చూస్తే... అక్టోబర్– డిసెంబర్‌మధ్య కాలంలో తయారీ రంగం 8.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలోని 6.9 శాతం కన్నా ఇది అధిక వృద్ధి కావడం గమనార్హం. అయితే 2015 ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 12.8 శాతం. మొత్తం ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగం వృద్ధి 10.6 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గుతుందన్నది సీఎస్ఓ అంచనా. ఇక వ్యవసాయ రంగం (అటవీ, మత్స్య సంపదసహా) వృద్ధి మూడవ త్రైమాసికంలో 6 శాతంగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా –2.2 శాతం క్షీణత నమోదయ్యింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా ఈ వృద్ధి 0.8 శాతం నుంచి 4.4 శాతానికి పెరుగుతుందన్నది అంచనా. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్కాలంలో వ్యవసాయ రంగం వృద్ధి 3.8 శాతం. ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనా 7.1 శాతం ⇒ తాజా గణాంకాల నేపథ్యంలో మొత్తం ఆర్థిక సంవత్సరం (2016–17, ఏప్రిల్–మార్చి)లో వృద్ధి రేటు 7.1 శాతంగా ఉంటుందన్న జనవరి మొదటి అడ్వాన్స్ అంచనాలను అదే విధంగా కొనసాగిస్తున్నట్లు సీఎస్ఓ పేర్కొంది. గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ⇒ మొత్తం ఆర్థిక సంవత్సరంలో జీడీపీ విలువ రూ.113.58 లక్షల కోట్ల నుంచి రూ.121.65 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనాల్లో ఎటువంటి మార్పు చేయడం లేదని సీఎస్ఓ పేర్కొంది. కాగా స్థూల విలువ ఆధారిత (జీవీఏ) వాస్తవిక జీడీపీ రేటు మాత్రం 7.8 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గుతున్నట్లు సీఎస్ఓ తెలిపింది. విలువ రూపంలో ఇది రూ.104.70 లక్షల కోట్ల నుంచి రూ.111.68 కోట్లకు పెరుగుతుందన్నది అంచనా. ⇒ కరెంట్ ప్రైస్ వద్ద తలసరి ఆదాయం 10.2 శాతం పెరుగుదలతో రూ.94,178 నుంచి రూ.1,03,818 చేరుతుందని అంచనావేసింది. ⇒ ప్రైవేటు వినియోగ వ్యయం రూ.79 లక్షల కోట్ల నుంచి రూ.88.40 లక్షల కోట్లకు చేరుతుందని సీఎస్ఓ అంచనావేస్తోంది. ⇒ పెట్టుబడులకు సంబంధించి గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ విలువ రూ.39.89 లక్షల కోట్ల నుంచి రూ.40.97 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. ⇒ కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల (జూన్, సెప్టెంబర్ నెలలతో ముగిసిన మూడు నెలల కాలాలు) జీడీపీ గణాంకాలను ఎగువ దిశగా సీఎస్ఓ సవరించింది. వీటిని వరుసగా 7.2 శాతం, 7.4 శాతాలకు పెంచింది. 2014–15లో భారత్ జీడీపీ వృద్ధి 7.2 శాతంకాగా, 2015–16లో ఈ రేటు 7.9 శాతంగా ఉంది. గణాంకాల ప్రకారమే ముందుకు: కేంద్రం ఇదిలావుండగా, గత ఆర్థిక సంవత్సరం అధిక బేస్‌తో ఉన్న గణాంకాలు ఇవని, ఆర్థిక వ్యవస్థ క్రియాశీలతకు అద్దం పడుతున్నాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్‌దాస్ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ క్రియాశీలత తగ్గిందనడంలో వాస్తవం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. గణాంకాల ప్రాతిపదికనే కేంద్రం నిర్ణయాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. -
జియో దెబ్బ: ప్రత్యర్థులు మరింత కుదేలు
జియో దెబ్బకు మేజర్ టెలికాం రంగ దిగ్గజాలు భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఒక్కసారిగా మూడో క్వార్టర్లో భారీగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే నాలుగో క్వార్టర్లోనూ ఈ దిగ్గజాలకు పరిస్థితి ఇదే మాదిరే ఉంటుందని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. రిలయన్స్ జియో ఉచిత డేటా ఆఫర్లు కొనసాగించినంత వరకు టెలికాం దిగ్గజాలు మార్జిన్లకు భారీగానే గండికొడుతూ ఉంటుందని పేర్కొన్నారు. ఎప్పుడైతే జియో తన ఉచిత ఆఫర్లను విత్ డ్రా చేసుకుని, డేటా సర్వీసులపై ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభిస్తుందో అప్పటినుంచి టెలికాం దిగ్గజాల పరిస్థితి కొంత మెరుగుపడవచ్చని టెలికాం ఇండస్ట్రి ప్రాక్టిస్, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఇండియా అర్పితా పాల్ అగర్వాల్ చెప్పారు. 2016 సెప్టెంబర్ నుంచి వెల్ కమ్ ఆఫర్ కింద జియో ఉచిత ఆఫర్లు ఇవ్వడం ప్రారంభించింది. అనంతరం డిసెంబర్లో జియో తమ ఉచిత డేటా ఆఫర్లను 2017 మార్చి వరకు పొడిగిస్తున్నామని పేర్కొంది. దీంతో టెలికాం దిగ్గజాలు రెవెన్యూలు భారీగా కోల్పోతున్నాయి. భారతీ ఎయిర్ టెల్ 55 శాతం, ఐడియా సెల్యులార్ రూ.478.9కోట్లను, రిలయన్స్ కమ్యూనికేషన్ రూ.531 కోట్ల నష్టాలను నమోదుచేశాయి. మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జియో దోపిడీ ధరల విధానం వల్లనే తాము రెవెన్యూలను భారీగా కోల్పోతున్నామని టెలికాం కంపెనీలు ఆరోపిస్తున్నాయి. రిలయన్స్ జియో ఉచిత డేటా ఆఫర్ల దూకుడే టెలికాం కంపెనీలకు భారీగా దెబ్బకొడుతుందనే దానికి ఎలాంటి సందేహం లేదని టెలికాం కన్సల్టెన్సీకి చెందిన ఓ సంస్థ డైరెక్టర్ మహేష్ ఉప్పల్ చెప్పారు. ధరల విధానంపై భారత మార్కెట్ ఆధారపడి ఉంటుందని, అలాంటి ఆఫర్లు మార్కెట్ లో విధ్వంసం సృష్టించేలా ఉన్నాయని గార్టనర్ టెలికాం బిజినెస్ స్ట్రాటజీ ప్రిన్సిపల్ రీసెర్చ్ అనలిస్టు రిషి తేజ్ పాల్ చెప్పారు. -
టాటా మోటార్స్ నికర లాభాలు ఢమాల్!
ముంబై: ప్రముఖ కార్ల దిగ్గజం టాటా మోటార్స్ క్యూ3 లో నిరాశాజనక ఫలితాలను ప్రకటించింది. మంగళవారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేపోయింది. గత ఏడాది రూ.2,953 కోట్ల లాభాలతో పోలిస్తే ఈ క్వార్టర్ లో96 శాతం క్షీణించి రూ.112 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. మొత్తం ఆదాయం కూడా 4 శాతం క్షీణించి రూ. 68,541కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే క్వార్టర్ లోరూ.71,616కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అటు ఈ ఫలితాల నేపథ్యంలో టాటా మెటార్స్ కౌంటర్ లో అమ్మకాల వెల్లువ కొనసాగింది. టాటా మెటార్స్ షేర్ 8శాతానికిపైగా, డీవీఆర్ షేర్ 4 శాతం క్షీణించాయి. డీమానిటైజేషన్ కారణంగా కంపెనీ భారీ నష్టాలను మూటగట్టుకుంది. నిర్వహణ లాభం(ఇబిటా) 42 శాతం దిగజారి రూ. 5,161 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 12.5 శాతం నుంచి 7.6 శాతానికి బలహీనపడ్డాయి. స్టాండెలోన్ ప్రాతిపదికన నికర నష్టం రూ. 147 కోట్ల నుంచి రూ. 1036 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం మాత్రం 1.5 శాతం పుంజుకుని రూ. 11,222 కోట్లయ్యింది. ఫారిన్ ఎక్సేంజ్ నష్టం భారీగా ఉందని ఎనలిస్టులు అంచనా వేశారు. అలాగే బ్రెగ్సిట్ ఉదంతంతో ముఖ్యంగా జెఎల్ఆర్ నిరుత్సాహకర అమ్మకాలు టాటా మోటార్స్ ఫలితాలను బాగా దెబ్బతీసింది. జాగ్వార్ రేంజ్ రోవర్ 10 శాతానికి దిగువడం పడిపోవడం మార్కెట్ వర్గాలను సైతం విస్మయపర్చింది. -
ఎస్బీఐ లాభం 71% జూమ్
క్యూ3లో రూ. 2,152 కోట్లు • మొండిబాకీలకు కేటాయింపుల తగ్గింపు, ఇతర ఆదాయం ఊతం ముంబై: మొండిబకాయిలకు కేటాయింపుల తగ్గుదల, ఇతర ఆదాయం ఊతంతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 2,152 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. ఇది క్రితం ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నమోదైన రూ. 1,259 కోట్లతో పోలిస్తే 71 శాతం వృద్ధి. స్టాండెలోన్ ప్రాతిపదికన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం 134 శాతం వృద్ధి చెంది రూ. 2,610 కోట్లుగా నమోదైంది. గత క్యూ3లో ఇది రూ. 1,115 కోట్లు. 2015–16 క్యూ3లో ఆర్థిక ఫలితాలపై అసెట్ క్వాలిటీ రివ్యూ (ఏక్యూఆర్) ప్రతికూల ప్రభావం భారీగా పడటంతో, అప్పట్లో లాభాల గణాంకాలు తమ సాధారణ పనితీరుకు తగినట్లుగా నమోదు కాలేదని బ్యాంక్ చైర్మన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. డిపాజిట్లు వెల్లువెత్తడం, వాటిని ట్రెజరీల్లో సముచితంగా ఇన్వెస్ట్ చేయడం వల్ల తాజాగా మూడో త్రైమాసికంలో వడ్డీ ఆదాయం 8.07 శాతం మేర వృద్ధి చెంది రూ. 40,644 కోట్ల నుంచి రూ. 43,926 కోట్లకు చేరిందని ఆమె పేర్కొన్నారు. ఇతర ఆదాయం 15% వృద్ధి.. క్యూ3లో ఎస్బీఐ మొత్తం ఆదాయం 14.67 శాతం పెరిగి రూ. 53,588 కోట్లకు చేరింది. ఇందులో ఇతర ఆదాయం 58.73 శాతం వృద్ధితో రూ. 9,662 కోట్లుగా నమోదైంది. డిసెంబర్లో ఎస్బీఐ తమ అనుబంధ సంస్థ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 3.9 శాతం వాటాలను కేకేఆర్, టెమాసెక్‌లకు రూ. 1,794 కోట్లకు విక్రయించింది. మరోవైపు, సమీక్షాకాలంలో మొండిబకాయిలకు మొత్తం కేటాయింపుల పరిమాణం 17.10% పెరుగుదలతో రూ.9,933 కోట్లకు చేరాయి. అయితే కొత్త కేటాయింపులు 5 శాతం తగ్గాయి. అటు, నికర వడ్డీ మార్జిన్ 3.22 శాతం నుంచి 3.03 శాతానికి తగ్గింది. ఫీజు ఆదాయం 14.30 శాతం వృద్ధితో రూ. 3,509 కోట్ల నుంచి రూ. 4,011 కోట్లకు పెరిగింది. డిపాజిట్లు సుమారు 36% పెరుగుదలతో రూ. 20,40,778 కోట్లకు చేరగా, స్థూల రుణాల పరిమాణం 4.81 శాతం వృద్ధితో రూ.14,97,164 కోట్లకు పెరిగింది. పెరిగిన ఎన్పీఏలు.. స్థూల నిరర్ధక ఆస్తుల (జీఎన్‌పీఏ) పరిమాణం 5.10 శాతం నుంచి 7.23 శాతానికి ఎగియగా.. నికర ఎన్పీఏలు 2.89 శాతం నుంచి 4.24 శాతానికి పెరిగాయి. క్యూ3లో కొత్తగా మరో రూ. 10,185 కోట్ల మేర ఎన్పీఏలు నమోదయ్యాయని, అయితే ఇవి తాము ముందుగా ప్రకటించిన అంచనాలకు లోబడే ఉన్నాయని అరుంధతి భట్టాచార్య తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రూ. 40,000 కోట్ల మేర మొండి బకాయిలు నమోదు కావొచ్చని భావించగా.. తొలి మూడు త్రైమాసికాల్లో మొత్తం రూ. 29,316 కోట్ల స్థాయికి చేరాయన్నారు. వీటిలో 73 శాతం (సుమారు రూ.17,992 కోట్లు) అసెట్స్‌ను వాచ్‌లిస్టులో ఉంచినట్లు ఆమె చెప్పారు. డీమోనిటైజేషన్‌తో ఒక క్వార్టర్ వెనక్కి.. పెద్ద నోట్ల రద్దు తో పనితీరు ఒక త్రైమాసిక కాలం పాటు వెనక్కిపోయినట్లయిందని భట్టాచార్య తెలిపారు. గృహ, వ్యవసాయ, చిన్న మధ్య తరహా సంస్థలకిచ్చే రుణాలపై ప్రతికూల ప్రభావం పడిందని చెప్పారు. అయితే, ఈ క్వార్టర్ ముగిసేటప్పటికి మళ్లీ సాధారణ స్థాయి నెలకొనవచ్చన్నారు. అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ మార్చిలోగా పూర్తి చేయాలని భావించినప్పటికీ డీమోనిటైజేషన్ వల్ల వాయిదాపడిందని, ప్రభుత్వం ఎప్పుడు ఆదేశాలిస్తే అప్పుడు మొదలుపెడతామని చెప్పారు. రేట్ల కోత ఇప్పట్లో ఉండదు.. బ్యాంకులు వడ్డీ రేట్లను మరింతగా తగ్గించడంపై దృష్టి పెట్టా లంటూ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సూచించినప్పటికీ.. ప్రస్తుతం ఆ అవకాశాలేమీ లేవని భట్టాచార్య పేర్కొన్నారు. ‘గవర్నర్ ఏ బ్యాంకు గురించి మాట్లాడారో నాకు తెలియదు. మా బ్యాంకు సంగతి చూస్తే.. తగ్గింపు మొదలైనప్పుడు 10%గా ఉన్న రేటు ప్రస్తుతం 8% స్థాయికి వచ్చింది. ఆర్బీఐ 175 బేసిస్ పాయింట్లే పాలసీ రేటు తగ్గిస్తే.. మేం ఎంసీఎల్ఆర్ను 200 బేసిస్ పాయింట్ల మేర తగ్గించాం. మేం అర్బీఐ కన్నా ఎక్కువే తగ్గించినట్లవుతుంది కాబట్టి.. మరింత రేట్ల కోతకు అంతగా అవకాశాలు లేవు’ అని ఆమె వివరించారు. -
ఆంధ్రా బ్యాంక్ లాభం 65% అప్
• క్యూ3లో రూ. 57 కోట్లు • 6.98 శాతానికి నికర ఎన్పీఏలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొండి బకాయిలు గణనీయంగా పెరిగినప్పటికీ.. అధిక ట్రెజరీ ఆదాయాల ఊతంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(క్యూ3)లో ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంక్ నికర లాభం 65% వృద్ధితో రూ. 56.70 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బ్యాంక్ 34.46 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. తాజాగా ఆదాయం రూ. 4,801 కోట్ల నుంచి రూ. 5,012 కోట్లకు పెరిగినట్లు ఆంధ్రా బ్యాంక్ వెల్లడించింది. సమీక్షాకాలంలో ట్రెజరీ విభాగ ఆదాయం రూ. 1,013 కోట్ల నుంచి రూ. 1,312 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్ధక ఆస్తులు (జీఎన్‌పీఏ) 7% నుంచి 11.88%కి పెరగ్గా.. నికర ఎన్పీఏలు 3.89% నుంచి 6.98%కి ఎగిశాయి. విలువపరంగా చూస్తే డిసెంబర్ ఆఖరుకి జీఎన్‌పీఏలు రూ. 9,520.92 కోట్ల నుంచి రూ. 16,888.34 కోట్లకు పెరిగాయి. అటు నికర ఎన్పీఏలు రూ. 5,102.81 కోట్ల నుంచి రూ. 9,382.38 కోట్లకు ఎగిశాయి. అయితే, మొండి బకాయిల కోసం కేటాయింపులు రూ. 905.56 కోట్ల నుంచి రూ. 828.71 కోట్లకు తగ్గాయి. గురువారం బీఎస్ఈలో ఆంధ్రా బ్యాంక్ షేరు 1.23 శాతం పెరిగి రూ. 57.80 వద్ద ముగిసింది. -
లాభాల బాటలో టాటా స్టీల్...
ఈ క్యూ3లో రూ.231కోట్ల లాభం న్యూఢిల్లీ: టాటా స్టీల్ మళ్లీ లాభాల బాట పట్టింది. అమ్మకాలు మెరుగుపడడం, ఉక్కు ఉత్పత్తుల ధరలు అధికంగా ఉండడం, తదితర కారణాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో రూ.231 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జిం చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.2,748 కోట్ల నికర నష్టాలు వచ్చాయని టాటా స్టీల్ తెలిపింది. స్థూల అమ్మకాలు రూ.25,662 కోట్ల నుంచి రూ.29,279 కోట్లకు పెరిగాయని టాటా స్టీల్ ఎండీ(ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియా) టి. వి. నరేంద్రన్ చెప్పారు. వివిధ విభాగాల దన్నుతో, పెద్ద కరెన్సీ నోట్ల రద్దు వంటి సమస్యలున్నప్పటికీ పటిష్టమైన అమ్మకాలను సాధించామని చెప్పారు. అయితే గ్రామీణ మార్కెట్లో అమ్మకాలు తక్కువగా ఉండడం, వినియోగదారుల సెంటిమెంట్ ప్రతికూలంగా ఉండడం కొంత ప్రభావం చూపాయని అంగీకరించారు. వ్యయ నియంత్రణ పద్ధతులు, సమగ్రంగా కార్యకలాపాలు నిర్వహించడం వంటి కారణాల వల్ల ముడి పదార్ధాల ధరలు పెరిగిన ప్రభావాన్ని తట్టుకున్నామని నరేంద్రన్ వివరించారు. కళింగనగర్ ప్లాంట్ పునర్వ్యస్థీకరణ పనులు సజావుగానే జరుగుతున్నాయని చెప్పారు. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి స్థూల రుణ భారం రూ.84,752 కోట్లుగా, నికర రుణ భారం రూ.76,680 కోట్లుగా ఉందని తెలిపారు. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.15,000 కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. టాటా స్టీల్ చైర్మన్‌గా చంద్రశేఖరన్ టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్ర శేఖరన్ టాటా స్టీల్ బోర్డ్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన టీసీఎస్ సీఈఓగా, ఎండీగాగా ఉన్నారు. చైర్మన్‌గా ఎన్నికవడం గౌరవంగా భావిస్తున్నానని. వినమ్రంగా ఆ బాధ్యతను స్వీకరిస్తున్నానని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. మిస్త్రీ తొలగింపు తర్వాత గత నెల 13న చంద్రశేఖరన్ టాటా స్టీల్ డైరెక్టర్‌గా వచ్చారు. -
టెక్ మహీంద్రా లాభం జూమ్
క్యూ3లో 14% అప్; రూ.856 కోట్లు ఆదాయం రూ.7,558 కోట్లు; 13% వృద్ధి గ్లోబల్ డిజిటలైజేషన్ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాం... కంపెనీ వైస్‌చైర్మన్ వినీత్ నయ్యర్ న్యూఢిల్లీ: టెక్ మహీంద్రా కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో రూ.856 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం (రూ.751 కోట్లు)తో పోల్చితే 14 శాతం వృద్ధి సాధించామని టెక్ మహీంద్రా తెలిపింది. గత క్యూ3లో రూ.6,701 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 13 శాతం వృద్ధితో రూ.7,558 కోట్లకు చేరిందని కంపెనీ వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ చెప్పారు. ఈ క్వార్టర్లో మంచి డీల్స్ సాధించామని, వ్యాపారం జోరుగా ఉందని వివరించారు. అంతర్జాతీయ డిజిటలైజేషన్ కార్యకలాపాల్లో మంచి అవకాశాలు అందిపుచ్చుకునే స్థాయిలోనే ఉన్నామనడానికి తాము సాధించిన డీల్స్, జోరుగా ఉన్న వ్యాపారమే నిదర్శనాలని వివరించారు. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 11 శాతం వృద్ధితో 13 కోట్ల డాలర్లకు, ఆదాయం 10 శాతం వృద్ధితో 112 కోట్ల డాలర్లకు చేరినట్లు పేర్కొన్నారు. 4,209 కొత్త ఉద్యోగాలు... ఈ క్యూ3లో ఐటీ ఆదాయం రూ.7,031 కోట్లు, బీపీఓ ఆదాయం రూ.526 కోట్లకు పెరిగినట్లు వినీత్ నయ్యర్ పేర్కొన్నారు. ఐటీ ఆదాయంలో అమెరికా వాటా 47 శాతం, యూరోప్ వాటా 29 శాతం, ఇతర దేశాల వాటా 24 శాతంగా ఉందని వివరించారు. ఈ క్యూ3లో కొత్తగా 4,209 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, గత ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,17,095గా ఉందని, వీరిలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య 80,858 అని తెలిపారు. ఉద్యోగుల వలస 18 శాతంగా ఉందని చెప్పారు. రూ.4,951 కోట్ల నగదు నిల్వలు.. ఈ క్యూ3లో అదనంగా చేరిన రూ.950 కోట్ల నగదుతో కలుపుకొని నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.4,951 కోట్లుగా ఉన్నాయని నయ్యర్ చెప్పారు. ఈ క్యూ3లో కొత్తగా 12 క్లయింట్లు లభించారని, మొత్తం క్లయింట్ల సంఖ్య 837కు పెరిగిందని తెలిపారు. నికర లాభం 14 శాతం పెరిగిన నేపథ్యంలో బీఎస్ఈలో టెక్ మహీంద్రా షేర్ 1 శాతం లాభపడి రూ.471 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్రూ.483 కోట్లు పెరిగి రూ.45,903 కోట్లకు చేరింది. -
రెండు నెలల గరిష్టానికి సెన్సెక్స్
జోష్‌నిచ్చిన క్యూ3 ఫలితాలు • కలసివచ్చిన షార్ట్ కవరింగ్ • బడ్జెట్‌పై అంచనాలు • 258 పాయింట్ల లాభంతో 27,376కు సెన్సెక్స్ • 84 పాయింట్ల లాభంతో 8,476కు నిఫ్టీ కంపెనీల క్యూ3 ఫలితాలు ఆశావహంగా ఉండటంతో స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల్లో ముగిసింది. స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ మళ్లీ 8,400 పాయింట్ల పైన ముగిసింది. జనవరి సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో షార్ట్ కవరింగ్ జరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 258 పాయింట్లు లాభపడి 27,376 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 84 పాయింట్లు లాభపడి 8,476 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది రెండు నెలల గరిష్ట స్థాయి. లోహ, వాహన, విద్యుత్తు, ఆయిల్, గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, పీఎస్‌యూ, బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. ప్రోత్సాహకరంగా క్యూ3 ఫలితాలు.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా కమ్యూనికేషన్స్ వంటి బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండడం, యూరప్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం, డాలర్‌తో రూపాయి మారకం లాభాల్లో ముగియడం..సానుకూల ప్రభావం చూపాయి. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరును కొనసాగించింది. 27,393–27,140 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 259 పాయింట్ల లాభంతో ముగిసింది. రానున్న బడ్జెట్‌పై ఇన్వెస్టర్ల దృష్టి పెరుగుతోందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. బుధవారం డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో షార్ట్ కవరింగ్ చోటు చేసుకుందని వివరించారు. ⇔ నాలుగు సెన్సెక్స్ షేర్లకే నష్టాలు 30 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లకే–భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, హిందుస్తాన్ యునిలివర్, ఐసీఐసీఐ బ్యాంక్‌కు నష్టాలు వచ్చాయి. మిగిలిన 24 షేర్లు లాభపడ్డాయి. ⇔ బీఎస్ఈ ఐపీఓకు 1.55 రెట్లు స్పందన నేడు ముగింపు బీఎస్ఈ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) రెండో రోజూ 1.55 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. నేడు(బుధవారం) ముగిసే ఈ ఐపీఓ ద్వారా బీఎస్ఈ రూ.1,243 కోట్లు సమీకరించనున్నది. రూ.805–806 ఇష్యూధర ఉన్న ఈ ఐపీఓలో భాగంగా రూ.2 ముఖ విలువ ఉన్న 1,07,99,039 షేర్లను జారీ చేయనున్నారు. ఇప్పటికే 1,67,06,394 షేర్లకు బిడ్లు వచ్చాయి. -
రిలయన్స్ లాభాల రికార్డ్
• క్యూ3లో స్టాండెలోన్ నికర లాభం • రూ.8,022 కోట్లు; 10 శాతం వృద్ధి • ఆదాయం 9 శాతం అప్; రూ.66,606 కోట్లు • స్థూల రిఫైనింగ్ మార్జిన్ 10.8 డాలర్లు భావిభాతర అవసరాలకు అనుగుణంగా అనుసంధానమైన మా వ్యాపార విభాగాలు, అత్యుత్తమ నిర్వహణ ప్రక్రియలతో మరోసారి రికార్డు పనితీరును సాధించాం. సవాళ్లతో కూడిన మార్కెట్ పరిస్థితులను దీటుగా ఎదుర్కొన్నాం. రిఫైనింగ్ వ్యాపారం దూసుకెళ్తోంది. వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ జీఆర్ఎంలో రెండంకెల వృద్ధిని సాధించాం. ప్రపంచవ్యాప్తంగా ఇంధన డిమాండ్ పెరగడం ఈ జోరుకు దోహదం చేస్తోంది. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ సీఎండీ ముంబై: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) మరోసారి రికార్డు స్థాయిలో లాభాల మోతమోగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2016–17, క్యూ3)లో కంపెనీ స్టాండెలోన్(కీలకమైన రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, మార్కెటింగ్ వ్యాపారం) ప్రాతిపదికన రూ.8,022 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.7,296 కోట్లతో పోలిస్తే.. 10 శాతం వృద్ధి చెందింది. వ్యయాలు పెరిగినప్పటికీ.. ఇతర ఆదాయం భారీగా ఎగబాకడం లాభాల జోరుకు ప్రధాన కారణంగా నిలిచింది. ఇక మొత్తం స్టాండెలోన్ ఆదాయం క్యూ3లో రూ.66,606 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.61,125 కోట్లతో పోలిస్తే 9 శాతం వృద్ధి నమోదైంది. కన్సాలిడేటెడ్‌గా ఇలా... అనుబంధ సంస్థలతో కలిపి(కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) చూస్తే రిలయన్స్ క్యూ3లో రూ.7,506 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో లాభం రూ. 7,245 కోట్లతో పోలిస్తే 3.6 శాతం వృద్ధి చెందింది. ఇక కన్సాలిడేటెడ్ ఆదాయం 16.1 శాతం వృద్ధితో రూ. 72,513 కోట్ల నుంచి రూ.84,189 కోట్లకు ఎగబాకింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోల్చిచూస్తే(సీక్వెన్షియల్‌గా) స్టాండెలోన్ లాభం 4.1 శాతం, ఆదాయం 3.5 శాతం చొప్పున పెరిగాయి. ఇక కన్సాలిడేటెడ్ లాభం సీక్వెన్షియల్‌గా 4.1 శాతం, ఆదాయం 3.1 శాతం చొప్పున వృద్ధి చెందాయి. జీఆర్ఎం పెరిగింది... రిలయన్స్ స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం) మూడో త్రైమాసికంలో 10.8 డాలర్లుగా నమోదైంది. సెప్టెంబర్ క్వార్టర్లో 10.1 డాలర్లతో పోలిస్తే వృద్ధి సాధించింది. అయితే, క్రితం ఏడాది మూడో క్వార్టర్లో జీఆర్ఎం 11.5 డాలర్లతో పోలిస్తే తగ్గింది. ఒక్కో బ్యారెల్ ముడిచమురును పెట్రో ఉత్పత్తులుగా మార్చడం ద్వారా వచ్చే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు. కాగా, సింగపూర్ ప్రామాణిక జీఆర్ఎం డిసెంబర్ క్వార్టర్లో సీక్వెన్షియల్‌గా 5.1 డాలర్ల నుంచి 6.7 డాలర్లకు పెరిగింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ⇔ క్యూ3లో రిఫైనింగ్, మార్కెటింగ్ విభాగం ఆదాయం 7.5 శాతం వృద్ధితో రూ.61,693 కోట్లకు చేరింది. అయితే, స్థూల లాభం మాత్రం 4.3 శాతం క్షీణించి రూ.6,194 కోట్లుగా నమోదైంది. ⇔ పెట్రోకెమికల్స్ ఆదాయం 17.8% వృద్ధితో రూ.22,854 కోట్లకు చేరింది. స్థూల లాభం 3.4% తగ్గి రూ.3,301 కోట్లుగా నమోదైంది. ⇔ ఇక చమురు, గ్యాస్ ఉత్పత్తి వ్యాపారం ఆదాయం క్యూ3లో 31 శాతం క్షీణించి.. రూ.1,762 కోట్ల నుంచి రూ. 1,215 కోట్లకు పడిపోయింది. గతేడాది క్యూ3లో రూ.258 కోట్ల స్థూల లాభాన్ని ఆర్జించగా.. ఈసారి రూ.295 కోట్ల స్థూల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ⇔ కేజీ–డీ6 క్షేత్రాల్లో ఉత్పత్తి డిసెంబర్ క్వార్టర్లో 0.26 మిలియన్ బ్యారెల్స్(ఎంఎంబీబీఎల్)కు, సహజవాయువు ఉత్పత్తి 24.4 బిలియన్ ఘనపుటడుగుల(బీసీఎఫ్)కు పడిపోయింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే ఉత్పత్తి వరుసగా 28 శాతం, 29 శాతం చొప్పున దిగజారింది. ⇔ పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) ప్రభావం ఉన్నప్పటికీ... క్యూ3లో రిలయన్స్ రిటైల్ విభాగం ఆదాయం ఏకంగా 47.2% ఎగబాకి రూ.5,901 కోట్ల నుంచి రూ. 8.688 కోట్లకు ఎగబాకింది. ఇక స్థూల లాభం 41% ఎగసి రూ.237 కోట్ల నుంచి రూ.333 కోట్లకు ఎగసింది. ⇔ ఇతర ఆదాయం రూ.2,440 కోట్ల నుంచి రూ.2,736 కోట్లకు చేరింది. ⇔ డిసెంబర్ చివరినాటికి కంపెనీ మొత్తం రుణం రూ.1,94,381 కోట్లకు పెరిగింది. సెప్టెబర్ నాటికి రుణభారం రూ.1,89,132 కోట్లుగా ఉంది. ఇక కంపెనీవద్ద నగదు, తత్సబంధ నిల్వలు డిసెంబర్ నాటికి రూ.82,533 కోట్ల నుంచి రూ.76,339 కోట్లకు తగ్గాయి. ⇔ డిసెంబర్ చివిరినాటికి టెలికం అనుబంధ సంస్థ రిలయన్స్ జియో యూజర్ల సంఖ్య 7.24 కోట్లకు చేరినట్లు కంపెనీ తెలిపింది. ⇔ కంపెనీ షేరు ధర సోమవారం బీఎస్ఈలో 1.21 శాతం క్షీణించి రూ.1,077 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. రూ. 30 వేల కోట్ల రైట్స్ ఇష్యూ... ముంబై: రైట్స్ ఇష్యూ ద్వారా రూ.30 వేల కోట్ల మేర నిధులను సమీకరించనున్నట్లు రిలయన్స్ సోమవారం ప్రకటించింది. ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్ల జారీద్వారా దీన్ని పూర్తిచేయనున్నట్లు తెలిపింది. ఈ నిధులను జియో సేవల విస్తరణకోసం వినియోగిస్తామని వివరించింది. రూ.10 ముఖ విలువగల ఒక్కో డిబెంచర్పై 9 శాతం వడ్డీరేటును కంపెనీ ఆఫర్ చేస్తోంది. -
క్యూ3 ఆర్థిక ఫలితాలపై దృష్టి..
బడ్జెట్ అంచనాలపైనా కూడా... ఈ వారం మార్కెట్ గమనంపై నిపుణుల అభిప్రాయం కంపెనీల మూడో త్రైమాసిక(క్యూ3) ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్‌కు కీలకం కానున్నాయి. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కు సంబంధించిన అడ్డంకులను తొలగించడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలు, బడ్జెట్ అంచనాలు కూడా స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. వీటితో పాటు డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పోకడ, ప్రపంచ స్టాక్ మార్కెట్ల తీరు.. ఈ అంశాలన్నీ స్టాక్ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. నేడు(సోమవారం) వెలువడే డిసెంబర్ నెల టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుంది. నేడే రిలయన్స్ ఫలితాలు కేంద్ర బడ్జెట్‌పై అంచనాలు, కంపెనీల క్యూ3 ఫలితాలు, రానున్న బీఎస్ఈ ఐపీఓ.. మార్కెట్‌ను నడిపిస్తాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్(సోమవారం), యాక్సిస్ బ్యాంక్, అదానీ పవర్ తదితర బ్లూ చిప్ కంపెనీలు క్యూ3 ఫలితాలను ఈ వారంలోనే వెల్లడించనున్నాయి. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు అనంతరం వెలువడే కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై స్టాక్ మార్కెట్ దృష్టి కేంద్రీకరిస్తుందని జైఫిన్ అడ్వైజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవేంద్ర నేవ్‌గి చెప్పారు. వినియోగ, బ్యాంక్, సైక్లికల్ షేర్లపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏ మేరకు ఉందో ఈ క్యూ3 ఫలితాలు వెల్లడిస్తాయని పేర్కొన్నారు. నవంబర్‌లో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండగా, డిసెంబర్లో మిశ్రమంగా ఉందని గణాంకాలు వివరిస్తున్నాయని చెప్పారు. రానున్న బడ్జెట్‌పై అంచనాలు బాగా పెరిగిపోయాయని, బడ్జెట్ అంచనాలు కూడా స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని వివరించారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళిని ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తారని జియోజిత్ బీఎన్పీ పారిబా చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో అమ్మకాలు కొనసాగిస్తున్నారని, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌ల్లో మాత్రం కొనుగోళ్లు జరుపుతున్నారని వివరించారు. సాంకేతికంగా చూస్తే ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,460–8,520 స్థాయిలను పరీక్షిస్తుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ హెడ్(రిటైల్ రీసెర్చ్) దీపక్ జసాని చెప్పారు. 8,382 పాయింట్ల వద్ద మద్దతు కోల్పోతే స్వల్పకాలికంగా బలహీనత ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. రూపాయిపై ఒత్తిడి.. రూపాయిపై ఒత్తిడి కొనసాగుతుందని కోటక్ సెక్యూరిటీస్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్(కరెన్సీ డెరివేటివ్స్) అనింద్య బెనర్జీ చెప్పారు. ఆర్బీఐ జోక్యం చేసుకోకపోవడం, విదేశీ నిధులు తరలిపోతుండడంతో డాలర్‌తో రూపాయి మారకం 67.70/90–69.40/50 రేంజ్లో కదలాడుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఇక అంతర్జాతీయ అంశాలపరంగా చూస్తే, అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ పాలసీలపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుంది. తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు గత వారంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,104 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించారు. డెట్ మార్కెట్లతో కూడా కలుపుకొని వారి అమ్మకాలు రూ.2,685 కోట్లుగా ఉన్నాయి. కాగా ఈ నెలలో ఇప్పటిదాకా విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.3,809 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. అయితే డెట్ మార్కెట్లో మాత్రం రూ.243 కోట్లు పెట్టుబడులు పెట్టారు. మొత్తం మీద మన క్యాపిటల్ మార్కెట్ నుంచి ఈ నెల 13 వరకూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,566 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. గత ఏడాది అక్టోబర్–డిసెంబర్ కాలానికి విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల నుంచి రూ.31,000 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించారు. ఇతర వర్థమాన దేశాలతో పోల్చితే భారత వృద్ధి అవకాశాలు తక్కువగా ఉండడం వల్ల విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని బజాజ్ క్యాపిటల్ గ్రూప్ సీఈఓ అనిల్ చోప్రా చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా 29 వేలకు సెన్సెక్స్: బీఓఎఫ్ఏ ముంబై: ఈ ఏడాది చివరికల్లా బీఎస్ఈ సెన్సెక్స్ 29వేల పాయింట్లకు (ప్రస్తుతం 27,238 పాయిం ట్లు) చేరుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్(బీఓఎఫ్ఏ–ఎంఎల్) అంచనా వేస్తోంది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, జీఎస్టీ అంశాలపై అనిశ్చితి ఉన్నప్పటికీ, స్టాక్ మార్కెట్ మంచి రాబడులనే ఇస్తుందని పేర్కొంది. జీఎస్టీ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశాల్లేవని తేల్చి చెప్పింది. జూలైలో అమల్లోకి రావచ్చని ఈ సంస్థ అంచనా వేస్తోంది. -
ఇన్ఫీ గైడెన్స్ మళ్లీ తగ్గింది!
• 2016–17 పూర్తి ఏడాదికి అదాయ అంచనాల్లో కోత • క్యూ3 లాభం రూ.3,708 కోట్లు; 7% వృద్ధి • ఆదాయం 8.6% అప్; రూ.17,273 కోట్లు బెంగళూరు: దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫలితాలు ఆకట్టుకున్నప్పటికీ.. ఆదాయ అంచనాలు(గైడెన్స్) మాత్రం నిరుత్సాహపరిచాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2016–17, క్యూ3)లో కంపెనీ కన్సాలిడేషన్ నికర లాభం రూ.3,708 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,465 కోట్లతో పోలిస్తే 7 శాతం వృద్ధి చెందింది. ఇక ఆదాయం రూ.15,902 కోట్ల నుంచి రూ.17,273 కోట్లకు ఎగసింది. క్రితం ఏడాది క్యూ3తో పోలిస్తే 8.6 శాతం పెరిగింది. సీక్వెన్షియల్‌గా మిశ్రమ ధోరణి... ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(క్యూ2)తో పోలిస్తే సీక్వెన్షియల్ ప్రాతిపదికన నికర లాభం 2.8 శాతం వృద్ధి చెందింది. ఆదాయం మాత్రం 0.2 శాతం తగ్గింది. ఇక డాలరు రూపంలో చూస్తే సీక్వెన్షియల్‌గా ఆదాయం 1.4% దిగజారి క్యూ3లో 2.53 బిలియన్ డాలర్లను తాకింది. గడిచిన ఏడు క్వార్టర్లలో డాలరు ఆదాయం తగ్గడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సీజనల్‌గా బలహీన క్వార్టర్ కావడంతోపాటు ఆర్బీఎస్ డీల్ రద్దు కావడం కూడా ఫలితాలపై ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. అమెరికా, యూరప్‌లలో పనిదినాలు తక్కువగా ఉండటంతో సాధారణంగా భారత ఐటీ కంపెనీల పనితీరు డిసెంబర్ క్వార్టర్లో కాస్త బలహీనంగా ఉంటుంది. కాగా, క్యూ3లో ఇన్ఫోసిస్ నికర లాభం రూ.3,569 కోట్లు, ఆదాయం రూ.17,313 కోట్లుగా ఉండొచ్చని పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేశారు. గైడెన్స్ ప్చ్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఇన్ఫోసిస్ ఆదాయ అంచనా(గైడెన్స్)లను మళ్లీ తగ్గించింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయ వృద్ధి అంతక్రితం 8–9 శాతంగా అంచనా వేయగా ఇప్పుడు దీన్ని 8.4–8.8 శాతానికి సవరించింది. దీని ప్రకారం చూస్తే.. డాలర్ల రూపంలో గైడెన్స్ 7.5–8.5% నుంచి 7.2–7.6 శాతానికి తగ్గినట్లు లెక్క. ఇక రూపాయిల్లో ఆదాయ గైడెన్స్ కూడా 10.9–11.9 శాతం నుంచి 10–10.4 శాతానికి తగ్గింది. గత తొమ్మిది నెలల్లో ఇన్ఫోసిస్ గైడెన్స్‌ను తగ్గించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ⇔ అక్టోబర్–డిసెంబర్ వ్యవధిలో ఇన్ఫీ కొత్తగా 77 క్లయింట్లను జతచేసుకుంది. ఇందులో 75 మిలియన్ డాలర్ల ఆదాయ విభాగంలో రెండు కాంట్రాక్టులు ఉన్నాయి. ⇔ క్యూ3లో ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ వ్యాపార సీక్వెన్షియల్‌గా 0.8 శాతం దిగజారింది. అయితే, ఆర్బీఎస్ కాంట్రాక్టు రద్దయినప్పటికీ స్థిర కరెన్సీ(డాలరుతో రూపాయి మారకం విలువ) ప్రాతిపదికన 0.2 శాతం వృద్ధి చెందింది. ⇔ ప్రాంతాలవారీగా చూస్తే... ఉత్తర అమెరికా వ్యాపారం సీక్వెన్షియల్‌గా 0.6%, యూరప్ వ్యాపారం 2.5 శాతం చొప్పన తగ్గాయి. భారత్‌లో వ్యాపారం1% తగ్గింది. మిగతా దేశాలకు చెందిన వ్యాపారంలోనూ 3.2 శాతం తగ్గుదల నమోదైంది. ⇔ 2016 డిసెంబర్ చివరినాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,99,763కు చేరింది. సెప్టెంబర్ క్వార్టర్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,99,829గా ఉంది. అంటే నికర నియామకాలు 66 తగ్గాయి. 2015 డిసెంబర్ చివరినాటికి ఇన్ఫీ మొత్తం సిబ్బంది సంఖ్య 1,93,383. క్యూ3లో ఉద్యోగుల వలసలు(అట్రిషన్ రేటు) కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 1.6 శాతం(సీక్వెన్షియల్‌గా) తగ్గింది. 20 శాతం నుంచి 18.4 శాతానికి చేరింది. ⇔ ఇక ఇదే నెలాఖరుకు ఇన్ఫీ వద్దనున్న మొత్తం నగదు, తత్సంబంధ నిల్వలు రూ.35,697 కోట్లకు చేరాయి. గైడెన్స్ తగ్గింపు ప్రభావంతో శుక్రవారం ఇన్ఫోసిస్ షేరు ధర శుక్రవారం బీఎస్ఈలో 2.5 శాతం దిగజారింది. రూ.975 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ ఒక్కరోజులో రూ.5,718 కోట్లు దిగజారి రూ. 2,23,987 కోట్లకు చేరింది. 2016 క్యాలెండర్ ఏడాదిలో ఇన్ఫీ 10 బిలియన్ డాలర్ల ఆదాయ మైలురాయిని అధిగమించడం చాలా ఆనందం కలిగిస్తోంది. మానసికంగా, భావోద్వేగపరంగా ఇది మాకు చాలా కీలకమైన మైలురాయి. అయితే, 2020కల్లా మార్జిన్ల స్థాయిని 30 శాతానికి పెంచుకోవడం, 20 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయ లక్ష్యాన్ని సాధించడమే లక్ష్యంగా మేం ముందుకెళ్తున్నాం. సీజనల్‌గా బలహీన ధోరణి, ఆర్బీఐ కాంట్రాక్టు రద్దు వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. క్యూ3లో మేం మెరుగైన పనితీరునే నమోదు చేశాం. మార్జిన్లు కూడా మెరుగయ్యాయి. క్యూ4పై ఆశాజనకంగా ఉన్నాం. ఇక ఒక్క ఇంధన రంగం మినహా వచ్చే ఏడాది చాలా రంగాలకు సంబంధించి మా వ్యాపారం మళ్లీ పుంజుకుంటుందని భావిస్తున్నాం. మొత్తంమీద చూస్తే గడిచిన తొమ్మిది నెలల్లో కంపెనీ పనితీరు సంతృప్తికరంగానే ఉంది. – విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ ట్రంప్ విధానాలు సానుకూలంగానే..! అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉద్యోగ వీసాలను భారీగా తగ్గించేస్తారన్న అంచనాలపై ఇన్ఫీ చీఫ్ విశాల్ సిక్కా మాట్లాడుతూ.. తమ క్లయింట్ల నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ఆందోళనలూ వ్యక్తం కాలేదని చెప్పారు. ట్రంప్ ప్రభుత్వం వ్యాపారాలకు స్నేహపూర్వకంగానే ఉంటుం దని, అదేవిధంగా ఎంట్రప్రెన్యూర్షిప్, నవకల్పనలను ప్రోత్సహిస్తుందనే భావిస్తున్నట్లు సిక్కా పేర్కొన్నారు. అయితే, అమెరికాలో వీసా, వలసలకు సంబంధించిన విధానాలు మారొచ్చని... ఏం జరుగుతుందనేది వేచిచూడాల్సి ఉందని చెప్పారు. -
అంచనాల్ని మించిన టీసీఎస్..
-
అంచనాల్ని మించిన టీసీఎస్..
• క్యూ3లో 11% ఎగిసిన నికర లాభం • మొత్తం ఆదాయంలో 9% వృద్ధి • ఆల్‌టైమ్ గరిష్ఠానికి మహిళా ఉద్యోగులు ముంబై: దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంచనాల్ని మించి వృద్ధి సాధించింది. క్యూ3లో నికర లాభం 10.9 శాతం ఎగిసి రూ. 6,778 కోట్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ.6,110 కోట్లు. తాజా క్యూ3లో మొత్తం ఆదాయం 8.7 శాతం వృద్ధితో రూ.27,364 కోట్ల నుంచి రూ. 29,735 కోట్లకు పెరిగింది. రెండో త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 2.9 శాతం, ఆదాయం 1.5 శాతం మేర పెరిగాయి. నిర్వహణ లాభం రూ. 7,733 కోట్లుగా నమోదైంది. షేరు ఒక్కింటికి రూ. 6.5 మేర డివిడెండ్ ఇవ్వనున్నట్లు టీసీఎస్ తెలిపింది. సాధారణంగా డిసెంబర్ త్రైమాసికంలో డిమాండ్ తక్కువని, అయినప్పటికీ పటిష్టమైన నిర్వహణ వ్యూహాలతో మెరుగైన పనితీరు కనపర్చగలిగామని టీసీఎస్ ఎండీ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. డిజిటల్, క్లౌడ్ తదితర విభాగాల్లో విశేషానుభవం ఇందుకు తోడ్పడిందన్నారు. ‘‘ఏటా 30 శాతం మేర వృద్ధి చెందుతున్న డిజిటల్ వ్యాపార విభాగాన్ని పటిష్టం చేసుకునేలా ఈ టెక్నాలజీలపై మరింత ఇన్వెస్ట్ చేస్తాం. కొత్త ఐపీ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లు, ఉత్పత్తుల రూపకల్పనపై దృష్టి పెడతాం’’ అని ఆయన వివరించారు. ఓ వైపు మెరుగైన వృద్ధి సాధిస్తూనే ..మరోవైపు నిర్దేశించుకున్న స్థాయిలో లాభదాయకతను కూడా స్థిరంగా సాధించగలుగుతున్నామని టీసీఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాజేశ్ గోపీనాథన్ తెలిపారు. విభాగాల వారీగా..: ఆదాయాల వృద్ధిలో ఎనర్జీ అండ్ యుటిలిటీస్ విభాగం కీలక పాత్ర పోషించింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన 5.8 శాతం పెరిగింది. ఇక హైటెక్ 2.6 శాతం , బ్యాంకింగ్.. ఫైనాన్షియల్ సర్వీసెస్.. బీమా విభాగం 2.1 శాతం, తయారీ 2.1 శాతం, రిటైల్ 1.9 శాతం మేర వృద్ధి చెందాయి. ప్రాంతాల వారీగా చూస్తే లాటిన్ అమెరికా వ్యాపారం 12.5%, భారత మార్కెట్ 10.3 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఉత్తర అమెరికా 2.2 శాతం, బ్రిటన్ 1.7 శాతం పెరిగాయి. రికార్డు స్థాయికి ఉద్యోగినుల సంఖ్య.. ఐటీ సేవల విభాగానికి సంబంధించి మొత్తం అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) 11.3 శాతానికి తగ్గినట్లు టీసీఎస్ తెలిపింది. క్యూ3లో స్థూలంగా 18,362 మంది, నికరంగా 6,978 మంది ఉద్యోగులను తీసుకున్నట్లు టీసీఎస్ తెలిపింది. కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,78,497కి చేరింది. మరోవైపు, మహిళా ఉద్యోగుల సంఖ్య ఆల్‌టైమ్ రికార్డు స్థాయి 34.6 శాతానికి చేరినట్లు కంపెనీ పేర్కొంది. వీసాల రిస్కులకు వ్యూహం.. అమెరికాలో హెచ్1–బీ వీసాల జారీని తగ్గించటం, వీసా ఫీజులు పెంచటం వంటి రిస్కులను ఎదుర్కొనేందుకు తగు వ్యూహాలను రూపొందించుకుంటున్నట్లు చంద్రశేఖరన్ తెలిపారు. ‘‘ఇలాంటి పరిస్థితి వస్తుందని మేం ఏడాది కిందటే ఊహించాం. 2016లో అమెరికా వీసా దరఖాస్తుల సంఖ్య 4,000కు తగ్గించుకున్నాం. 2015లో దరఖాస్తుల సంఖ్య 14,000గా ఉన్నా.. వాటిలో మూడో వంతుకే వీసాలు జారీ అయ్యాయి’’ అని వివరించారు. ఫలితాల నేపథ్యంలో గురువారం బీఎస్ఈలో టీసీఎస్ షేరు 0.8 శాతం పెరిగి రూ. 2,343 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత కంపెనీ ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. -
ఇండస్ఇండ్ బ్యాంక్ బోణీ బాగుంది
క్యూ3లో లాభం 29 శాతం వృద్ధి ముంబై: గతేడాది అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికంలో పెద్ద నోట్ల రద్దు వంటి ప్రతికూలతలను తట్టుకుని మరీ ప్రైవేటు రంగ ఇండస్ఇండ్ బ్యాంకు మెరుగైన ఫలితాలను ప్రకటించింది. బ్యాంకు లాభం 29 శాతం అధికంగా రూ.750.64కోట్లు నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో బ్యాంకు లాభం రూ.581 కోట్లే. డీమానిటైజేషన్ ప్రభావం అంతగా లేదని బ్యాంకు తెలిపింది. ఎన్ఐఐ జూమ్: నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) విభాగంలో లాభం 35 శాతం అధికంగా రూ.1,578 కోట్లు వచ్చిందని... నిధుల వ్యయాలు తగ్గడమే దీనికి కారణమని ఇండస్ ఇండ్ బ్యాంకు ఎండీ రమేశ్ సోబ్తి తెలిపారు. నగదు నిల్వల నిష్పత్తి విషయంలో ఆర్బీఐ తీసుకున్న చర్యల వల్ల ఎన్ఐఐ రూ.40 కోట్లు అధికంగా వచ్చినట్టు చెప్పారు. కలిసొచ్చిన డిపాజిట్లు: ఇక బ్యాంకు డిపాజిట్లు 35 శాతం పెరిగాయి. వీటిలో 56 శాతం సేవింగ్స్ ఖాతాల్లో నిల్వలే. వీటిపై వ్యయాలు తక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే. రుణాలు: రుణాల జారీలోనూ ఇండస్ ఇండ్ బ్యాంకు మెరుగైన గణాంకాలను ప్రకటించింది. ఇవి 25 శాతం వృద్ధి చెందాయి. పరిశ్రమ సగటు కంటే ఐదు రెట్లు అధికమని సోబ్తి పేర్కొన్నారు. రుణాలకు డిమాండ్ కూడా తగ్గలేదన్నారు. చెల్లని నోట్లు: రూ.11,400 కోట్ల విలువైన చెల్లని పెద్ద నోట్లను డిపాజిట్లుగా బ్యాంకు స్వీకరించింది. నవంబర్ 8 తర్వాత రూ.200, రూ.1,000 నోట్ల రూపంలో భారీ స్థాయిలో నగదు జమలు వచ్చినప్పటికీ సీఆర్ఆర్ రూపంలో పక్కన పెట్టినట్టు బ్యాంకు తెలిపింది -
చైనా స్మార్ట్ ఫోన్ మార్కెట్ నయా కింగ్.. ‘ఒప్పొ’
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కొత్త లీడర్‌గా ‘ఒప్పొ’ అవతరించింది. ‘ఆర్’ సరీస్ బాగా క్లిక్ కావడం ఒప్పొకు బాగా కలిసొచ్చింది. మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే ‘ఆర్ 9’ స్మార్ట్‌ఫోన్ (భారత్‌లో ఎఫ్ 1 ప్లస్) చైనా ప్రజలకు బాగా చేరువరుు్యంది. దీంతో కంపెనీ తొలిసారిగా క్యూ3లో చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రస్థానాన్ని కై వసం చేసుకుంది. చైనా మార్కెట్లో మంచి పనితీరు కనబరచడం కంపెనీకి అంతర్జాతీయంగా కూడా కలిసొచ్చింది. దీంతో ఒప్పొ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నాల్గవ స్థానంలో నిలిచింది. ఈ విషయాలను ప్రముఖ రీసెర్చ్ సంస్థ ఐడీసీ తన తాజా నివేదికలో వెల్లడించింది. నివేదిక ప్రకారం.. ఒప్పొ కంపెనీ క్యూ3లో 2.53 కోట్ల స్మార్ట్ఫోన్లను విక్రరుుంచింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే విక్రయాల్లో 121 శాతం వృద్ధి నమోదరుు్యంది. గ్లోబల్ టాప్-5 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో మరేఇతర కంపెనీ కూడా ఈ స్థారుులో వృద్ధిని నమోదు చేయలేకపోవడం గమనార్హం. -
క్యూ3లో మొబైల్స్ విక్రయాలు @ 7.5 కోట్లు!
సీఎంఆర్ అంచనా న్యూఢిల్లీ: జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో (క్యూ3) మొబైల్ హ్యాండ్సెట్స్ విక్రయాలు 7.5 కోట్ల యూనిట్లుగా ఉండొచ్చని రీసెర్చ్ సంస్థ సీఎంఆర్ అంచనా వేసింది. పండుగల సీజన్, కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ, సానుకూల రుతుపవనాలు, ఏడవ వేతన కమిషన్ సిఫార్సుల అమలు వంటి అంశాలు అమ్మకాల పెరుగుదలకు దోహదపడొచ్చని తన నివేదికలో పేర్కొంది. ఏప్రిల్-జూన్ క్వార్టర్ (క్యూ2)లో మొబైల్ ఫోన్ల విక్రయాలు 6.59 కోట్ల యూనిట్లుగా ఉన్నాయని తెలిపింది. జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే 24% వృద్ధి నమోదయ్యిందని పేర్కొంది. ఇందులో ఫీచర్ ఫోన్ల వాటా 3.73 కోట్లుగా, స్మార్ట్‌ఫోన్స్ వాటా 2.87 కోట్లుగా ఉందని తెలిపింది. శాంసంగ్ టాప్: క్యూ2లో మొబైల్ హ్యాండ్సెట్స్ మార్కెట్లో 25.5% వాటాతో శాంసంగ్ అగ్రస్థానంలో ఉంది. దీని వాటా స్మార్ట్‌ఫోన్స్ విభాగంలో 29.7%, ఫీచర్ ఫోన్స్ విభాగంలో 22.3% ఉందని సీఎంఆర్ పేర్కొంది. ఇక 13.6% మార్కెట్ వాటాతో మైక్రోమ్యాక్స్ రెండో స్థానంలో ఉంది. ఇది స్మార్ట్‌ఫోన్స్ విభాగంలో 14.8% వాటాను, ఫీచర్ ఫోన్స్ విభాగంలో 12.6 శాతం వాటాను ఆక్రమించింది. మైక్రోమ్యాక్స్ తర్వాతి స్థానాల్లో ఇంటెక్స్ (10.4 %), కార్బన్ (9.6 శాతం), లావా (8 శాతం) ఉన్నాయి. పీసీ విక్రయాలు 2% డౌన్ న్యూఢిల్లీ: దేశంలో పీసీ విక్రయాలు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 2.2 శాతం తగ్గుదలతో 21.4 లక్షల యూనిట్లకు క్షీణించాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో పీసీ అమ్మకాలు 21.9 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. రీసెర్చ్ సంస్థ ఐడీసీ నివేదిక ప్రకారం.. జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్-జూన్ క్వార్టర్లో పీసీ విక్రయాలు 7.2 శాతంమేర ఎగశాయి. కాగా, పీసీ మార్కెట్లో హెచ్‌పీ అగ్రస్థానంలో ఉంది. దీని మార్కెట్ వాటా 28.4 శాతంగా ఉంది. ఇక దీని తర్వాత స్థానాల్లో డెల్ (22.2 శాతం), లెనొవొ (16.1 శాతం), ఏసర్ (14 శాతం) ఉన్నాయి. -
అంచనాలను అందుకోలేని హెచ్ సీఎల్
భారత బహుళ జాతి టెక్నాలజీ సంస్థ హెచ్ సీఎల్ ఈ త్రైమాసింకంలో మార్కెట్ నిపుణుల అంచనాలను అందుకోలేకపోయింది. వారి అంచనాలను తాకలేక జనవరి-మార్చి త్రైమాసికంలో కేవలం 0.3శాతం నికర ఆదాయాలనే నమోదుచేసింది. క్యూ3లో రూ.1,939 కోట్లగా ఉంటాయనుకున్న నికరలాభాలను రూ. 1926 కోట్లగానే కంపెనీ ఫలితాలు చూపించాయి. అంచనాలకు కిందగానే అమ్మకాలను సైతం రూ.10,698 కోట్లగా నమోదుచేశాయి. ఇన్ఫోసిస్, విప్రో కంపెనీల రెవెన్యూ వృద్ధి కంటే తక్కువగా కేవలం 11.6శాతం రెవెన్యూ వృద్దినే హెచ్ సీఎల్ చూపించింది. హెచ్ సీఎల్ గురువారం(నేడు) ఆశించిదగ్గ ఫలితాలను విడుదల చేయకపోవడంతో, మార్కెట్లో ఆ కంపెనీ షేర్లు 5శాతం మేర పడిపోయాయి. బీసీఎస్ ఈ సెన్సెక్స్ లో రూ.799.30 వద్ద నమోదైంది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ ట్రేడింగ్ లో టాప్ లూజర్ నమోదైన హెచ్ సీఎల్ 1.4 శాతం పడిపోయింది. -
రిలయన్స్ క్యాపిటల్ లాభం 10 అప్
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 10 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.213 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.235 కోట్లకు పెరిగిందని రిలయన్స్ క్యాపిటల్ పేర్కొంది. మ్యూచువల్ ఫండ్, బ్రోకింగ్ వ్యాపారాల్లో వృద్ధి కారణంగా నికర లాభంలో పెరుగుదల సాధించామని వివరించింది. మొత్తం ఆదాయం రూ.2,106 కోట్ల నుంచి రూ.2,318 కోట్లకు వృద్ధి చెందిందని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో రిలయన్స్ క్యాపిటల్ షేర్ బీఎస్ఈలో 1 శాతం క్షీణించి రూ.363 వద్ద ముగిసింది. ఇండిగో లాభం 24 శాతం అప్ న్యూఢిల్లీ: ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబల్ ఏవియేషన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 24 శాతం పెరిగింది. గత ఏడాది నవంబర్‌లో స్టాక్ మార్కెట్లో లిస్టైన ఈ కంపెనీ ఈ క్యూ3లో రూ.657 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇంధన వ్యయాలు తక్కువగా ఉండడం, విమాన సర్వీసులు పెరగడం ప్రయాణికుల ఆదాయం పెరగడంతో మంచి నికర లాభం సాధించామని ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ చెప్పారు. గత క్యూ3లో రూ.3,939 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం 12 శాతం వృద్ధి చెంది రూ.4,407 కోట్లకు పెరిగిందని వివరించారు. స్టాక్ మార్కెట్లో లిస్టైన తర్వాత ఈ కంపెనీ ప్రకటించిన తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఇవి. -
రిలయన్స్ లాభాల రికార్డ్..
క్యూ3లో నికర లాభం రూ.7,290 కోట్లు; 39 శాతం జూమ్ * ఆదాయం రూ. 68,261 కోట్లు; 27 శాతం తగ్గుదల * ఏడేళ్ల గరిష్టానికి జీఆర్ఎం; 11.5 డాలర్లు... న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల రికార్డులతో అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(2015-16, క్యూ3)లో కంపెనీ ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను మించాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం రూ.7,290 కోట్లకు దూసుకెళ్లింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.5,256 కోట్లతో పోలిస్తే ఏకంగా 38.7 శాతం వృద్ధి చెందింది. రిలయన్స్ చరిత్రలో ఒక క్వార్టర్‌కు ఇంత అత్యధిక స్థాయిలో లాభాన్ని నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రధానంగా స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం)లు అనూహ్యంగా ఎగబాకడం, పెట్రోకెమికల్స్ విభాగంలో మార్జిన్లు పుంజుకోవడం వంటివి రికార్డుస్థాయి లాభాలకు దోహదం చేసింది. అయితే, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఘోరంగా పడిపోయిన ప్రభావంతో రిలయన్స్ మొత్తం ఆదాయం భారీగా క్షీణించింది. రూ.68,261 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది క్యూ3లో రూ93,528 కోట్లతో పోలిస్తే 27 శాతం దిగజారింది. మార్కెట్ విశ్లేషకులు సగటున క్యూ3లో రూ.6,950 కోట్ల నికర లాభాన్ని అంచనా వేశారు. దూసుకెళ్లిన జీఆర్ఎం... ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో రిలయన్స్ జీఆర్ఎం 11.5 డాలర్లకు ఎగబాకింది. ఇది ఏడేళ్ల గరిష్టస్థాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో జీఆర్ఎం 7.3 డాలర్లే. ఈ ఏడాది క్యూ2లో జీఆర్ఎం 10.6 డాలర్లుగా ఉంది. ఒక్కో బ్యారెల్ ముడిచమురు(క్రూడ్)ను పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చడం ద్వారా కంపెనీకి లభించిన రాబడిని స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం)గా వ్యవహరిస్తారు. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు... * జామ్ నగర్‌లోని జంట రిఫైనరీల ద్వారా క్యూ3లో రికార్డు స్థాయిలో 18 మిలియన్ టన్నుల క్రూడ్ శుద్ధిచేసినట్లు కంపెనీ తెలిపింది. * రిఫైనింగ్ వ్యాపారం స్థూల లాభం అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో దాదాపు రెట్టింపై రూ.6,491 కోట్లకు ఎగబాకింది. ఇక పెట్రోకెమికల్స్ వ్యాపారానికి సంబంధించి 28 శాతం వృద్ధితో రూ.2,639 కోట్లుగా నమోదైంది. * కేజీ-డీ6 క్షేత్రం నుంచి చమురు, గ్యాస్ ఉత్పత్తి భారీగా పడిపోవడం.. ధరల పతనం కారణంగా ఈ విభాగం ఆదాయం 40 శాతం క్షీణించి రూ.1,765 కోట్లకు పరిమితమైంది. స్థూల లాభం 89 శాతం దిగజారి రూ.832 కోట్ల నుంచి రూ.90 కోట్లకు క్షీణించింది. * టెలికం అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జియో.. దేశవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించే సన్నాహాల్లో ఉందని రిలయన్స్ తెలిపింది. అయితే, ఎప్పటినుంచి సర్వీసులు వాణిజ్యపరంగా మొదలవుతాయనేది వెల్లడించలేదు. ఇటీవలే రిలయన్స్ గ్రూప్‌లోని లక్ష మందికి పైగా ఉద్యోగులు, వారి కుటుంబాలకు 4జీ సేవలను కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. * మరో అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ ఆదాయం క్యూ3లో కీలమైన మైలురాయిని అధిగమించింది. కంపెనీ చరిత్రలో తొలిసారి అత్యధికంగా రూ.6,042 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,686 కోట్లతో పోలిస్తే 29 శాతం ఎగసింది. ఇక రిలయన్స్ రిటైల్ స్థూల లాభం రూ.227 కోట్ల నుంచి రూ.243 కోట్లకు పెరిగింది. * కొన్ని ఆస్తుల విక్రయం కారణంగా రిలయన్స్ ఇతర ఆదాయం క్యూ3లో రూ.2,426 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది క్యూ3లో ఇది రూ.2,340 కోట్లు. * డిసెంబర్ చివరినాటికి రిలయన్స్ నగదు నిల్వలు రూ.91,736 కోట్లకు పెరిగాయి. ఇక మొత్తం రుణాలు కూడా రూ.1,78,077 కోట్లకు ఎగబాకాయి. * ఫలితాల నేపథ్యంలో మంగళవారం రిలయన్స్ షేరు ధర బీఎస్ఈలో 2.51 శాతం ఎగసి రూ.1,043 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రపంచ స్థాయి రిఫైనింగ్, పెట్రోకెమికల్ కార్యకలాపాలతో మరోసారి ఆకర్షణీయమైన ఫలితాలను సాధించగలిగాం. ఏడేళ్లకుపైగా గరిష్టానికి ఎగబాకిన జీఆర్ఎం ఆసరాతో రిఫైనింగ్ వ్యాపారం మరోసారి రికార్డు పనితీరును నమోదుచేసింది. పటిష్టమైన పాలిమర్ మార్జిన్ల కారణంగా పెట్రోకెమికల్ వ్యాపారంలో అత్యంత మెరుగ్గా రాణించగలిగాం. - ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ రైట్స్ ఇష్యూ ద్వారా రూ.15,000 కోట్లు * సమీకరించనున్న రిలయన్స్ జియో న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారులకు రైట్స్ ఇష్యూ జారీచేయడం ద్వారా రూ.15,000 కోట్లు సమీకరిస్తామని రిలయన్స్ జియో తెలిపింది. మంగళవారం జరిగిన బోర్డ్ సమావేశంలో ఈ ప్రతిపాదన ఆమోదం పొందిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ విభాగం రిలయన్స్ జియో బీఎస్ఈకి నివేదించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీతో స్పెక్ట్రమ్ షేరింగ్, ట్రేడింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని పేర్కొంది. రిలయన్స్ జియో త్వరలో 4జీ సేవలను అందించనున్నది. రిలయన్స్ జియోపై రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ ఇప్పటికే రూ. లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేసింది. కాగా నెలకు రూ.300-500 చార్జీకే 4జీ సేవలను, 4జీ హ్యాండ్సెట్లను రూ.4,000 చొప్పున అందించాలని రిలయన్స్ జియో యోచిస్తోంది. -
అదరగొట్టిన ఇన్ఫీ...దూసుకుపోతున్న షేర్
ముంబై: భారతీయ దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ టెక్నాలజీ క్యూ 3లో ఆశ్చర్యకరమైన ఫలితాలను నమోదు చేసింది. మూడవ త్రైమాసిక ఫలితాల్లో అంచనాలకు మించి రాణించింది. గురువారం ప్రకటించిన ఆర్థిక ఫలితాలు విశ్లేషకులను సైతం విస్మయపర్చాయి. ఫలితంగా మార్కెట్లో ఈ షేర్లు లాభాల్లో దూసుకు పోతోంది. 5 శాతం లాభాలతో ఈనాటి స్టాక్ మార్కెట్లో లాభాలను ఆర్జిస్తున్న ఏకైక షేర్‌గా నిలచింది. ఇన్ఫోసిస్ 1.94 శాతం లాభంతో రూ 3.465 నికర లాభాన్ని సాధించింది. 1.7 శాతంతో రూ. 15.902 కోట్ల ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. 2016 ఆర్థిక సంవత్సరానికి వద్ద డాలర్ ఆదాయం 10-12 శాతం వృద్ధి ని నమోదు చేసింది.. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి బలహీనపడటంతో ఇన్ఫీ లాభాలు భారీగా పెరిగాయి. 2016 ఆర్థిక సంవత్సరానికి 8.9 - 9.3 శాతం ఉంటుందనే అంచనాలను దాటి 12.8-13.2 వృద్ధిని సాధించింది. దీంతో గత కొన్ని రోజులుగా నష్టాలను చవిచూస్తున్న దలాల్ స్ట్రీట్‌లో పెట్టుబడిదారులకు భారీ ఉపశమనం కలిగింది. మరోవైపు ఈ మధ్య ప్రకటించిన మరో ఐటి దిగ్గజం టీసీఎస్ ఫలితాలు వరుసగా నిరాశ పర్చడంతో ఇన్ఫీ మెరుగైన లాభాలు మెరుపులు మెరిపించింది. -
క్యూ3లో కార్పొరేట్ల ఆదాయాల వృద్ధి 2 శాతమే..
క్రిసిల్ రీసెర్చ్ అంచనాలు న్యూఢిల్లీ: పెట్టుబడుల డిమాండ్ బలహీనంగా ఉండటం, కమోడిటీల ధరలు పతనం కావడం తదితర పరిణామాల నేపథ్యంలో డిసెంబర్ త్రైమాసికంలో బీఎఫ్ఎస్ఐ, ఆయిల్..గ్యాస్ కంపెనీలు మినహా ఇతర కార్పొరేట్ల ఆదాయాలు కేవలం 2 శాతం మాత్రమే వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని క్రిసిల్ రీసెర్చ్ వెల్లడించింది. తక్కువ బేస్-ఎఫెక్ట్, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం తగ్గుతుండటం తదితర అంశాలు కూడా దీనికి కారణం కాగలవని పేర్కొంది. క్రిత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కార్పొరేట్ల ఆదాయాలు 5 శాతం మేర పెరిగాయి. స్టాక్ ఎక్స్చేంజీ ఎన్ఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్లో దాదాపు 70 శాతం వాటా ఉన్న 600 కంపెనీల (ఫైనాన్షియల్, చమురు, గ్యాస్ సంస్థలను మినహాయించి) అధ్యయనం ఆధారంగా క్రిసిల్ రీసెర్చ్ ఈ నివేదిక రూపొందించింది. పట్టణ ప్రాంత వినియోగదారులపై ఆధారపడిన ఆటోమొబైల్స్, మీడియా, రిటైల్, టెలికం కంపెనీలు మెరుగ్గా రెండంకెల స్థాయి వృద్ధిని నమోదు చేయొచ్చని అందులో పేర్కొంది. అమెరికాకు ఎగుమతుల వృద్ధితో మధ్య స్థాయి ఫార్మా కంపెనీల పనితీరు కూడా మెరుగుపడొచ్చని క్రిసిల్ రీసెర్చ్ తెలిపింది. అయితే, స్థూలంగా చూస్తే కార్పొరేట్ సంస్థలు బలహీన డిమాండ్ సెంటిమెంటుతో సమస్యలు ఎదుర్కొంటున్నాయని క్రిసిల్ రీసెర్చ్ సీనియర్ డెరైక్టర్ ప్రసాద్ కొపార్కర్ తెలిపారు. చెన్నైలో వరదలు సైతం ఐటీ, ఆటోమొబైల్ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వంటి రంగాల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చన్నారు. -
గతవారం బిజినెస్
క్యూ3లో చైనా వృద్ధి రేటు 6.9 శాతం చైనా ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో 6.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. 2009 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరువాత చైనా వృద్ధి ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. దేశం నుంచి ఎగుమతులు పడిపోవడం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దేశం 7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. త్వరలో పీఎన్బీ హౌసింగ్ ఐపీఓ పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా... ఈ రెండు కంపెనీలు ఐపీఓకు రావాలని యోచిస్తున్నాయి. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, ఇతర వ్యాపార అవసరాల కోసం వినియోగించుకోవాలనేది ఈ కంపెనీల ఆలోచన. ఈ రెండు కంపెనీలు త్వరలో ఐపీఓ సంబంధిత పత్రాలను మా ర్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించనున్నాయని సమాచారం. ఆన్లైన్ విభాగంలోకి ఎంఅండ్ఎం ప్రముఖ వాహన తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ‘స్మార్ట్‌షిఫ్ట్’ అనే ఇంట్రా సిటీ లాజిస్టిక్స్ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. ఇది కార్గో యజమానులకు, ట్రాన్స్పోర్టర్స్కు ఒక వినిమయ వేదికగా పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ పోర్టల్ మహీంద్రా లాజిస్టిక్స్ విభాగం కింద కాకుండా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఆధ్వర్యంలోనే పనిచేస్తుందని పేర్కొంది. 2020 నాటికి హోండా సెల్ఫ్ డ్రైవ్ కార్లు వాహన తయారీ కంపెనీలు తనంతట తానుగా నడిచే కార్ల (సెల్ఫ్ డ్రై వింగ్ కార్లు) తయారీపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. నిస్సాన్, టయోటా కంపెనీలకు సవాలు విసురుతూ హోండా కంపెనీ కూడా సెల్ఫ్ డ్రైవ్ కార్లను మార్కెట్లోకి తీసుకురానుంది. సెల్ఫ్ డ్రై వింగ్ కార్లను 2020 నాటికి రోడ్లపైన పరిగెత్తిస్తామని హోండా కంపెనీ ప్రకటించింది. ఈ విధంగా హోండా కంపెనీ నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీతో తన ప్రత్యర్థులకు చెక్ పెట్టాలని భావిస్తోంది. కాఫీ డే ఐపీఓ ఇష్యూ ధర రూ.328 కాఫీ డే ఎంటర్ప్రైజెస్ తన ఐపీఓ ఇష్యూ ధరను రూ.328గా నిర్ణయించింది. గత శుక్రవారం(అక్టోబర్ 16న) ముగిసిన ఈ ఐపీఓకు ప్రైస్‌బాండ్‌గా రూ.316-328ని కాఫీ డే ఎంటర్ప్రైజెస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఐపీఓ ద్వారా 3.5 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేశామని, రూ. 328 ఇష్యూ ధరను పరిగణనలోకి తీసుకుంటే రూ.1,150 కోట్ల నిధులు వస్తాయని తెలిపింది. ఈ ఇష్యూ 1.8 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిందని, రూ.2,000 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయని పేర్కొంది. వడ్డీ రేట్లను తగ్గించిన చైనా బ్యాంక్ ఆర్థిక వ్యవస్థకు ఊపునివ్వడానికి చైనా కేంద్ర బ్యాంక్ బెంచ్‌మార్క్ వడ్డీరేట్లను తగ్గించింది. రుణ, డిపాజిట్ వడ్డీరేట్లను చెరో పావు శాతం తగ్గిస్తున్నట్లు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా పేర్కొంది. బ్యాంకులు తమ వద్ద ఉంచుకునే నగదుకు సంబంధించి రిజర్వ్ రిక్వైర్మెంట్ రేషియో(ఆర్ఆర్ఆర్)ను అర శాతం తగ్గించింది. ఆర్ఆర్ఆర్ను అరశాతం తగ్గించడం వల్ల బ్యాంకులకు పుష్కలంగా నిధులు అందుబాటులోకి వస్తాయని, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని చైనా కేంద్ర బ్యాంక్ భావిస్తోంది. గోల్డ్ డిపాజిట్ల వడ్డీరేట్ల స్వేచ్ఛ బ్యాంకులకే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్(బంగారం డిపాజిట్ పథకం) మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) శుక్రవారం జారీ చేసింది. గోల్డ్ డిపాజిట్లకు వడ్డీరేట్లను నిర్ణయించే పూర్తి స్వేచ్ఛ బ్యాంకులకే ఇస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. వచ్చే నెల 5న అధికారికంగా ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆర్బీఐ నిబంధనల నోటిఫికేషన్ వెలువడింది. నవంబర్ 6న భారత్‌లోకి యాపిల్ వాచ్‌లు! ఇటీవలే కొత్త ఐఫోన్స్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన టెక్నాలజీ దిగ్గజం యాపిల్ అతి త్వరలోనే తన స్మార్ట్‌వాచ్‌లను భారతీయులకు అందుబాటులోకి తీసుకురానుంది. యాపిల్ వెబ్సైట్ ప్రకారం.. ‘యాపిల్ వాచ్’ నవంబర్ 6న భారత మార్కెట్లోకి రానుంది. ఈ వాచ్‌లు అమెరికా, జపాన్, ఫ్రాన్స్, యూకే దేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. రియల్టీ జాప్యాలు ఏపీలో అధికం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్మాణ జాప్యం ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా ఉంది. రియల్టీ ప్రాజెక్టుల పూర్తి దాదాపు 45 నెలలు ఆలస్యం అవుతోంది. ఇక దేశం మొత్తం మీద సగటున రియల్టీ ప్రాజెక్టుల నిర్మాణ జాప్యం 33 నెలలుగా ఉంది. ప్రాజెక్టుల జాప్యాల్లో ఏపీ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (41 నెలలు), తెలంగాణ (40 నెలలు), పంజాబ్ (38 నెలలు) ఉన్నాయి. కాగా దేశంలో 2014-15 నాటికి 3,540 ప్రతిపాదిత రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్‌లో 75 శాతం ఇంకా ప్రారంభం కాలేదు. డీల్స్ * సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ అమెరికాకు చెందిన నోహ కన్సల్టింగ్ కంపెనీని రూ.454 కోట్లకు కొనుగోలు చేసింది. * స్వీడన్‌కు చెందిన వాణిజ్య వాహనాల దిగ్గజం వొల్వొ గ్రూప్‌కు చెందిన ఐటీ వ్యాపారాన్ని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ.895 కోట్లకు కొనుగోలు చేయనుంది. * భారత్‌లో టెలికాం టవర్లను నిర్వహిస్తున్న వయామ్ నెట్‌వర్క్స్‌లో 51 శాతం వాటాను అమెరికాకు చెందిన అమెరికన్ టవర్ కార్పొ(ఏటీసీ) రూ.7,600 కోట్లకు కొనుగోలు చేయనున్నది. * మెమరీ కార్డులు వంటి స్టోరేజ్ పరికరాలు తయారు చేసే శాన్డిస్క్ కంపెనీని హార్డ్-డిస్క్ డ్రైవ్‌లు తయారు చేసే వెస్టర్న్ డిజిటల్ కార్పొ 1,900 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయనున్నది. * అంతర్జాతీయ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ భారత మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్మెంట్ రూ.243 కోట్లకు కొనుగోలు చేయనున్నది. * అమెరికా బిట్ కాయిన్ స్టార్టప్ ఆబ్రాలో టాటా సన్స్ చైర్మన్ ఎమిరటస్ రతన్ టాటా పెట్టుబడులు పెట్టారు. ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేశారో తెలియాల్సి ఉంది. -
క్యూ3లో చైనా వృద్ధి రేటు 6.9%
బీజింగ్: చైనా ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో (జూలై, ఆగస్టు, సెప్టెంబర్) 6.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. 2009 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరువాత చైనా వృద్ధి ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. ఈ పరిస్థితుల్లో దేశాభివృద్ధికి దోహదపడే విధంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన దేశం తాజాగా కొత్త ఉద్దీపన చర్యలు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దేశం నుంచి ఎగుమతులు పడిపోవడం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దేశం 7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. మెరుగుపడుతున్న సేవలు, వినియోగం ... దేశ గణాంకాల బ్యూరో విభాగం విడుదల చేసిన వివరాల ప్రకారం.. గడచిన మూడు త్రైమాసికాల్లో దేశ జీడీపీ విలువ 48.79 ట్రిలియన్ యువాన్లు (7.68 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లు). మొత్తం జీడీపీ విలువలో సగం సేవారంగం నుంచి వచ్చిందని గణాంకాలు తెలిపాయి. ‘అమెరికా వడ్డీరేట్ల పెంపు అంచనాలు కమోడిటీ, స్టాక్, ఫారెన్ కరెన్సీ మార్కెట్లపై ప్రభావితం చూపుతున్నాయి. పలు దేశాలు తమ కరెన్సీల విలువను తగ్గిస్తున్నాయి. ఈ ప్రభావం చైనా ఎగుమతులపై పడుతోంది. చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూలతల్లో ఇది ఒకటి’ అని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రతినిధి షాంగ్ లియూన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనాల ప్రకారం చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు గత ఏడాది 7.3 శాతం నుంచి ఈ ఏడాది 6.8 శాతానికి పడిపోతుంది. వచ్చే ఏడాది ఈ రేటు 6.3 శాతంగా ఉండనుంది. ఈ పరిస్థితుల్లో 7 శాతం పైగా వృద్ధి రేటుతో భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందిన దేశం హోదా దక్కించుకుంటుందన్న విశ్లేషణలు వస్తున్నాయి. -
కెనరా బ్యాంక్ లాభం రూ.613 కోట్లు
డివిడెండ్ ఒక్కో షేర్‌కు రూ.10.5 న్యూఢిల్లీ: కెనరా బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.613 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఈ బ్యాంక్ నికర లాభం రూ.611 కోట్లుగా ఉందని బ్యాంక్ ఈడీ పి. ఎస్. రావత్ చెప్పారు. మొండి బకాయిలు పెరగడం వల్ల నికర లాభం ఫ్లాట్‌గా ఉందని తెలిపారు. మొత్తం ఆదాయం రూ.11,610 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.12,429 కోట్లకు పెరిగిందని, స్థూల మొండి బకాయిలు 2.49 శాతం నుంచి 3.89 శాతానికి, నికర మొండి బకాయిలు 1.98 శాతం నుంచి 2.65 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి(2014-15) బ్యాంక్ నికర లాభం 11 శాతం పెరిగి రూ.2,703 కోట్లకు పెరిగిందని రావత్ వివరించారు.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.2,438 కోట్లుగా ఉందని చెప్పారు. మొత్తం ఆదాయం కూడా రూ.43,480 కోట్ల నుంచి 11% వృద్ధితో రూ.48,300 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రోడ్లు, ఉక్కు, విద్యుత్, టెక్స్టైల్స్ వంటి భారీ పరిశ్రమ కంపెనీలకు రుణాలిచ్చామని పేర్కొన్నారు. ఒక్కో షేర్‌కు రూ.10.5 డివిడెండ్‌ను ఇస్తామని వివరించారు. రూ.10 ముఖ విలువ గల ఒక్కోషేర్‌ను రూ.398.95 ప్రీమియం ధరకు 1,39,38,134 షేర్లను ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ ప్రాతిపాదికన కేటాయించి రూ.569.99 కోట్లు సమీకరించామని పేర్కొన్నారు. -
ఎస్బీఐ లాభం రయ్...
దేశీ బ్యాంకింగ్ రంగం మొండి బకాయిల(ఎన్పీఏ) సెగతో అల్లాడుతున్న తరుణంలో... ఎడారిలో ఒయాసిస్సులా ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ మెరుగైన పనితీరుతో ఆశ్చర్యపరిచింది. వడ్డీ ఆదాయాల జోరు, వ్యయ నియంత్రణ చర్యలతో బ్యాంక్ నికర లాభం భారీగా దూసుకెళ్లింది. మరోపక్క, ఎన్పీఏలు కూడా తగ్గుముఖం పట్టడంతో షేరు ధర రివ్వున ఎగసి ఇన్వెస్టర్లలో ఆనందం నింపింది. ⇒ క్యూ3లో లాభం 30 శాతం జంప్; రూ.2,910 కోట్లు ⇒9 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం ⇒వడ్డీయేతర ఆదాయంలో 24% వృద్ధి ⇒మొత్తం ఆదాయం రూ.43,784 కోట్లు; 12 శాతం అప్ ⇒మొండిబకాయిలు తగ్గుముఖం... ⇒8 శాతం పైగా ఎగబాకిన షేరు ధర... ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో ఎస్బీఐ బంపర్ ఫలితాలను ప్రకటించింది. బ్యాంక్ స్టాండెలోన్(ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాల ద్వారా) నికర లాభం 30 శాతం ఎగబాకి రూ.2,910 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,234 కోట్లు మాత్రమే. కాగా, క్యూ3లో నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) రూ.12,616 కోట్ల నుంచి రూ.13,777 కోట్లకు పెరిగింది. 9.2 శాతం వృద్ధి నమోదైంది. మరోపక్క, వడ్డీయేతర ఆదాయం మరింత మెరుగ్గా 24.27 శాతం పెరుగుదలతో రూ.5,235 కోట్లకు ఎగసింది. దీంతో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.43,784 కోట్లకు చేరింది. క్రితం ఏడాది క్యూ3లో రూ.39,068 కోట్లతో పోలిస్తే 12 శాతం మేర పుంజుకుంది. ఎన్పీఏలు తగ్గాయ్... డిసెంబర్ క్వార్టర్ చివరినాటికి బ్యాంక్ మొత్తం రుణాల్లో మొండిబకాయిల పరిమాణం(స్థూల ఎన్పీఏలు) 4.9 శాతానికి తగ్గాయి. విలువ పరంగా రూ.61,991 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో స్థూల ఎన్పీఏలు 5.73 శాతంగా ఉన్నాయి. కాగా, ఈ సెప్టెంబర్ క్వార్టర్లో 4.89 శాతంగా నమోదయ్యాయి. ఇక నికర ఎన్పీఏలు కూడా వార్షిక ప్రాతిపదికన క్యూ3లో 3.24 శాతం నుంచి 2.8 శాతానికి దిగొచ్చాయి. క్యూ2లో కూడా ఈ పరిమాణం 2.73 శాతంగా ఉంది. ఎన్పీఏల తగ్గుముఖం పట్టినప్పటికీ.. వీటిపై కేటాయింపులు(ప్రొవిజనింగ్) మాత్రం పెరిగాయి. క్యూ3లో రూ. 4,149 కోట్ల నుంచి రూ. 5,235 కోట్లకు చేరాయి. అంటే 26 శాతం పెరిగినట్లు లెక్క. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ⇒ అనుంబంధ బ్యాంకులు, సంస్థలన్నింటితో కలిపి క్యూ3లో ఎస్బీఐ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.3,828 కోట్ల లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది క్యూ3లో రూ.2,839 కోట్లతో పోలిస్తే 35 శాతం వృద్ధి నమోదైంది. ⇒ మొత్తం కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.58,649 కోట్ల నుంచి రూ.64,605 కోట్లకు ఎగసింది. 10 శాతం వృద్ధి సాధించింది. ⇒ క్యూ3లో ట్రెజరీ ఆదాయం రూ.238 కోట్ల నుంచి రూ.920 కోట్ల దూసుకెళ్లింది. ⇒ ఫీజుల రూపంలో బ్యాంక్ ఆదాయం 10 శాతం ఎగబాకింది. రూ.2,971 కోట్ల నుంచి రూ.3,291 కోట్లకు పెరిగింది. ⇒ నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) 3.19 శాతం నుంచి 3.12 శాతానికి తగ్గింది. ⇒ డిసెంబర్ క్వార్టర్లో రూ.475 కోట్ల విలువైన రుణాలను అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ(ఏఆర్సీ)లకు విక్రయించింది. మార్చిలో మరో రూ.1,200 కోట్ల విలువైన రుణాలను వేలానికి పెట్టనుంది. ⇒ కాగా, క్యూ3లో రూ.4,092 కోట్ల సాధారణ రుణాలను, ఎన్పీఏలుగా మారిన రూ.1,454 కోట్ల విలువైన రుణాలను బ్యాంక్ పునర్వ్యవస్థీకరించింది. మరో రూ.5,500 కోట్ల రుణాలు ఈ బాటలో ఉన్నాయి. ⇒ డిసెంబర్ చివరి నాటికి ఎస్బీఐ మొత్తం డిపాజిట్లు రూ.15,10 లక్షల కోట్లకు ఎగబాకాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.13.49 లక్షల కోట్లతో పోలిస్తే 12 శాతం వృద్ధి చెందాయి. ⇒ ఇక మొత్తం రుణాలు 7 శాతం వృద్ధితో రూ.12.65 లక్షల కోట్లకు పెరిగాయి. ⇒ కేంద్ర ప్రభుత్వానికి ప్రిఫరెన్సియల్ ప్రాతిపదికన రూ.2,970 కోట్ల విలువైన షేర్లను జారీ చేసేందుకు ఎస్బీఐ డెరైక్టర్ల బోర్డు ఆమోదించింది. ఈ ఆర్థిక సం వత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనం సమకూర్చే చర్యల్లో భాగంగా ఈ మొత్తాన్ని ఇవ్వాలని కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. షేరు దూకుడు... అనూహ్యంగా మొండిబకాయిల తగ్గుదల, లాభం భారీగా ఎగబాకడంతో ఎస్బీఐ షేరు పరుగులు తీసింది. శుక్రవారం బీఎస్ఈలో బ్యాంక్ షేరు ధర ఒకానొక దశలో 8.26 శాతం దూసుకెళ్లింది. చివరకు 7.96 శాతం లాభంతో రూ.307.05 వద్ద స్థిరపడింది. వెరసి ఒక్క రోజులోనే ఎస్బీఐ మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ.16,910 కోట్లు పెరిగింది. రూ.2,29,235 కోట్లకు ఎగబాకింది. అంతేకాదు శుక్రవారం ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో అత్యధికంగా లాభపడిన బ్లూచిప్ షేరు ఇదే కావడం గమనార్హం. ఎన్ఎస్ఈలో 7 కోట్లకు పైగా షేర్లు, బీఎస్ఈలో 85.7 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. ఎన్పీఏలు మరింత తగ్గుతాయ్... ఇతర ఆదాయాలతో పాటు నికర వడ్డీ ఆదాయం కూడా భారీగా పుంజుకోవడంతో క్యూ3 లాభాలు జోరందుకున్నాయి. దీనికితోడు వ్యయాలు తగ్గడం కూడా దీనికి దోహదం చేసింది. డిసెంబర్ క్వార్టర్లో రూ.7,043 కోట్లు కొత్తగా మొండిబకాయిల జాబితాలో చేరాయి. క్యూ2లో ఈ మొత్తం రూ.7,700 కోట్లుగా ఉన్నాయి. ప్రధానంగా స్టీల్, ఇన్ఫ్రా, టెక్స్టైల్స్, ట్రేడ్ అండ్ సర్వీసెస్ రంగాల కంపెనీల నుంచే అధికంగా మొండి బకాయిలు పేరుకుపోతున్నాయి. వీటికి అడ్డుకట్టపై మరింత దృష్టిపెడుతున్నాం. అయితే, మొత్తంమీద చూస్తే ఎన్పీఏల పరిస్థితి కాస్త మెరుగుపడింది. రానున్న కాలంలో మరింత నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి ఏడాదికి రుణ వృద్ధి 10 శాతం స్థాయిలో ఉండొచ్చు. బీమా అనుంబంధ సంస్థల్లో(ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్) కొంత వాటాను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాం. దీనిపై ఆయా సంస్థల్లోని భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుపుతున్నాం. అనుంబంధ బ్యాంకులపై ప్రస్తుతానికి దృష్టిపెట్టడం లేదు. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చైర్పర్సన్ -
మహీంద్రా లాభం రూ.930 కోట్లు
ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో రూ.930 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.1,230 కోట్ల నికర లాభం సాధించామని పేర్కొంది. ఆదాయం గత క్యూ3లో రూ.20,680 కోట్లుగా, ఈ క్యూ3లో రూ.18,372 కోట్లుగా ఉందని పేర్కొంది. అనుబంధ కంపెనీల విలీనం కారణంగా ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది. మహీంద్రా ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీ(ఈ కంపెనీ అనుబంధ సంస్థలు కూడా) టెక్ మహీంద్రాలో విలీనమయ్యాయని పేర్కొంది. వాహన విభాగ వ్యాపార ఆదాయం గత క్యూ3లో రూ.11,984 కోట్లుగా, ఈ క్యూ3లో 10,691 కోట్లుగా, ఫార్మ్ ఎక్విప్మెంట్ వ్యాపార ఆదాయాలు గత క్యూ3లో రూ.4,668 కోట్లుగా, ఈ క్యూ3లో రూ.4,049 కోట్లుగా ఉన్నాయని వివరించింది. ఆర్థిక సేవల విభాగం ఆదాయం రూ.1,366 కోట్ల నుంచి రూ.1,522 కోట్లకు చేరిందని తెలిపింది. ఇక స్టాండోలోన్ ప్రాతిపదికన నికర లాభం గత క్యూ3లో రూ. 934 కోట్లు, ఈ క్యూ3లో రూ.942 కోట్లుగా, ఆదాయం గత క్యూ3లో రూ.11,295 కోట్లుగా, ఈ క్యూ3లో రూ.10,188 కోట్లుగా ఉన్నాయని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపధ్యంలో ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం వృద్ధితో రూ.1,193కు ఎగసింది. -
ఇండియన్ ఆయిల్‌కు భారీగా నిల్వ నష్టాలు
క్యూ3లో రూ.2,637 కోట్ల నష్టం న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)కు ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.2,637 కోట్ల నష్టాలు వచ్చాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు బాగా తగ్గడంతో నిల్వ నష్టాలు బాగా పెరిగాయని, దీంతో నికర నష్టం అధికమైందని కంపెనీ చైర్మన్ బి. అశోక్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో నికర నష్టాలు రూ. 961 కోట్లుగా ఉన్నాయని వివరించారు. గత క్యూ3లో నిల్వ లాభాలు రూ.2,454 కోట్లుగా ఉండగా, ఈ క్యూ3లో నిల్వ నష్టాలు రూ.12,842 కోట్లుగా ఉన్నాయని వివరించారు. ముడి చమురును కొనుగోలు చేసినప్పటి ధర కాకుండా ప్రాసెస్ చేసినప్పుడు ఉన్న ధర ఆధారంగా పెట్రో ఇంధనాల ధరలను నిర్ణయిస్తామని, ఈ కాలంలో ముడిచమురు ధరలు మరింతగా పతనమయ్యాయని, ఈ విధంగా నిల్వ నష్టాలు భారీగా పెరిగిపోయాయని పేర్కొన్నారు. విక్రయాల ద్వారా వచ్చిన నష్టాలకు ప్రభుత్వం రూ.2,866 కోట్లు నగదు సబ్సిడీని, ఓఎన్జీసీ వంటి చమురు వెలికితీత కంపెనీలు రూ.6,116 కోట్ల తోడ్పాటునందించాయని వివరించారు. ఇక గత క్యూ3లో రూ.1,17,672 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ3లో రూ.1,07,074 కోట్లకు తగ్గాయని తెలిపారు. వడ్డీ భారం రూ.1,262 కోట్ల నుంచి రూ.929 కోట్లకు తగ్గిందని వివరించారు. -
ఆర్‌కామ్ లాభం 86 శాతం వృద్ధి
* టెలికం సేవలపై మార్జిన్లు పెరిగాయ్ * వడ్డీ భారం తగ్గింది ముంబై: టెలికం కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 86 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.108 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్ ) ఈ క్యూ3లో రూ.201 కోట్లకు పెరిగిందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ తెలిపింది. టెలికం సేవలపై మార్జిన్లు పెరగడం, వడ్డీ భారం తగ్గడం వల్ల నికర లాభంలో భారీ వృద్ధి సాధించామని కంపెనీ సీఈఓ(కన్సూమర్ బిజినెస్)గుర్దీప్ సింగ్ పేర్కొన్నారు. గత క్యూ3లో రూ.40,762 కోట్లుగా ఉన్న రుణ భారం ఈ క్యూ3లో 4,000 కోట్లు తగ్గి రూ.36,767 కోట్లకు క్షీణించిందని వివరించారు. తమ నెట్‌వర్క్‌లో డేటా వినియోగం 83 శాతం పెరిగిందని, ఇది పరిశ్రమలోనే అధికమని పేర్కొన్నారు. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.5,157 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.5,435 కోట్లకు పెరిగిందని వివరించారు. సీడీఎంఏ విభాగం ఆదాయం ఈ క్యూ3లో నిలకడను సాధించిందని పేర్కొన్నారు. జీఎస్ఎం ఆదాయం 4 శాతం పెరిగిందని వివరించారు. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి తమ వినియోగదారుల సంఖ్య 10.6 కోట్లకు పెరిగిందని చెప్పారు. మొబైల్ వినియోగదారుడి నుంచి సగటు రాబడి రూ.142కు వృద్ధి చెందిందన వివరించారు. గత క్యూ3లో 44.4 పైసలుగా ఉన్న నెట్వర్క్ ఆదాయం (నిమిషానికి) ఈ క్యూ3లో 45.2 పైసలకు పెరిగిందని వివరించారు. ఫలితాల నేపథ్యంలో ఆర్‌కామ్ షేర్ బీఎస్ఈలో 1.3 శాతం వృద్ధితో రూ.72 వద్ద ముగిసింది. -
ఎల్అండ్టీ లాభం రూ.867 కోట్లు
10 శాతం పెరుగుదల * గట్టెక్కించిన ఇన్ఫ్రా వ్యాపారం * 17 శాతం పెరిగిన ఆర్డర్ల బుక్ ముంబై: ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం, లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్అండ్టీ) ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌కు రూ.867 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు సాధించిన నికర లాభం(రూ.797 కోట్లు)తో పోల్చితే 9 శాతం వృద్ధి సాధించామని ఎల్ అండ్ టీ తెలిపింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారం మెరుగుపడడం, రియల్టీ, సర్వీసెస్ వ్యాపారాల నుంచి అధిక ఆదాయం రావడంతో నికర లాభం పెరిగిందని ఎల్ అండ్ టీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆర్. శంకర్ రామన్ పేర్కొన్నారు. గత క్యూ3లో రూ.21,732 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ3లో 10 శాతం వృద్ధితో రూ.23,848 కోట్లకు పెరిగిందని వివరించారు. దీంట్లో అంతర్జాతీయ వ్యాపారం వాటా రూ.6,400 కోట్లని తెలిపారు. 17 శాతం పెరిగిన ఆర్డర్లు గత ఏడాది డిసెంబర్ 31 నాటికి కంపెనీ కన్సాలిడేటెడ్ ఆర్డర్-బుక్ 17 శాతం వృద్ధితో రూ.2,25,788 కోట్లకు చేరిందని రామన్ పేర్కొన్నారు. దీంట్లో నాలుగో వంతు అంతర్జాతీయ ఆర్డర్లేనని వివరించారు. ఇన్ఫ్రా వ్యాపారం 22 శాతం వృద్ధి ఇన్ఫ్రా వ్యాపారం రాబడి 22 శాతం వృద్ధితో రూ,11,553 కోట్లకు పెరిగిందని రామన్ వివరించారు. ఈ విభాగంలో రూ.24,032 కోట్ల కొత్త ఆర్డర్లు సాధించామని పేర్కొన్నారు. అవకాశాలు అందుకుంటాం.. రుణ లభ్యత, అంతర్జాతీయ పరిస్థితి సహా వివిధ ప్రభుత్వ చర్యల కారణంగా వ్యాపార పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయని పేర్కొన్నారు. వీటన్నింటి ఫలితంగా ఉత్పన్నమయ్యే అవకాశాలను వివిధ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న తాము అందిపుచ్చుకోనున్నామని వివరించారు. -
69 శాతం తగ్గిన టాటా స్టీల్ నికర లాభం
క్యూ3లో రూ.157 కోట్లే... న్యూఢిల్లీ: ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ నికర లాభం భారీగా పడిపోయింది. యూరప్‌లో మంచి పనితీరు కనబరిచినప్పటికీ, భారత్‌లో వ్యాపారం మందకొడిగా ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌కు నికర లాభం 69 శాతం క్షీణించిందని టాటా స్టీల్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.503 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.157 కోట్లకు దిగిపోయిందని టాటా స్టీల్ గ్రూప్ ఈడీ (ఫైనాన్స్ అండ్ కార్పొరేట్) కౌశిక్ చటర్జీ వివరించారు. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం, ధరలు తగ్గడం, డిమాండ్ కనిష్ట స్థాయిలో ఉండడం, చైనా నుంచి దిగుమతులు పెరగడం, ఉక్కు తయారీకి అవసరమైన ముడి పదార్ధాల సమీకరణకు సంబంధించి భారత ప్రభుత్వ నిబంధనలు... ప్రభావం చూపాయని పేర్కొన్నారు. భారత కార్యకలాపాలకు సంబంధించి నికర లాభం రూ.1,519 కోట్ల నుంచి రూ.881 కోట్లకు తగ్గిందని, అలాగే టర్నోవర్ కూడా రూ.10,143 కోట్ల నుంచి రూ.9,897 కోట్లకు పడిపోయిందని వివరించారు. దేశీయంగా ఉక్కు ధరలు తగ్గడం వల్ల టర్నోవర్ తగ్గిందని పేర్కొన్నారు. యూరప్ కార్యకలాపాల టర్నోవర్ రూ.20,709 కోట్ల నుంచి రూ.19,399 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. గత ఏడాది ఉన్నట్లే ఈ ఏడాది కూడా యూరప్‌లో ఉక్కుకు డిమాండ్ ఉండగలదని, అయితే చైనా, రష్యా, తదితర దేశాల నుంచి దిగుమతులు పెరుగుతుండటంతో మార్జిన్లపై ఒత్తిడి ఉంటుందని తెలిపారు. -
టాటా మోటార్స్ లాభం 25% డౌన్
క్యూ3లో రూ. 3,581 కోట్లు.. - దేశీ మార్కెట్లో మందగమనమే కారణం ముంబై: దేశీ మార్కెట్లో అమ్మకాల మందగమనం కారణంగా వాహన దిగ్గజం టాటా మోటార్స్ నిరుత్సాహకరమైన ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో కంపెనీ కన్సాలిడేటెడ్(అనుంబంధ కంపెనీలతో కలిపి) ప్రాతిపదికన రూ.3,581 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.4,805 కోట్లతో పోలిస్తే లాభం 25.47 శాతం దిగజారింది. అయితే, మొత్తం ఆదాయం రూ.63,513 కోట్ల నుంచి రూ.69,122 కోట్లకు పెరిగింది. 8.83 శాతం వృద్ధి నమోదైంది. ఇందులో బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్) క్యూ3 ఆదాయం రూ.58,550 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది క్యూ3లో రూ.53,893 కోట్లతో పోలిస్తే 8.64 శాతం వృద్ధి చెందింది. భారత్ విషయానికొస్తే... దేశీయంగా కార్యకలాపాలపై(స్టాండెలోన్) కంపెనీ నష్టాలు మరింత తీవ్రతరమయ్యాయి. ఈ డిసెంబర్ క్వార్టర్లో నికర నష్టం రూ.2,123 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో రూ.1,251 కోట్ల నష్టంతో పోలిస్తే... 70 శాతం అధికం కావడం గమనార్హం. కాగా, మొత్తం ఆదాయం రూ.7,671 కోట్ల నుంచి రూ.8,944 కోట్లకు పెరిగింది. క్యూ3లో దేశీయంగా వాహన విక్రయాలు 3.48 క్షీణించి వృద్ధితో 1,27,484 యూనిట్లుగా నమోదయ్యాయి. టాటా మోటార్స్ షేరు ధర గురువారం బీఎస్ఈలో 0.39 శాతం నష్టపోయి రూ.590 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి. -
ఎయిర్టెల్ లాభం రెట్టింపు
క్యూ3లో రూ.1,437 కోట్లు * మొబైల్ డేటా ఆదాయాల జోరు * 6 శాతం పెరిగి... రూ. 23,228 కోట్లకు చేరిన ఆదాయం న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో కంపెనీ కన్సాలిడేటెడ్(అనుంబంధ సంస్థలతో కలిపి) నికర లాభం రెట్టింపునకుపైగా ఎగబాకి రూ.1,437 కోట్లుగా నమోదైంది. ముందటేడాది ఇదే కాలంలో రూ.610 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మొబైల్ డేటా(ఇంటర్నెట్ ప్యాకేజీలు) ఆదాయాల్లో వృద్ధి కొనసాగుతుండటం కంపెనీ మెరుగైన పనితీరుకు ప్రధానంగా దోహదం చేసింది. కాగా, మొత్తం ఆదాయం క్యూ3లో రూ.23,228 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.21,960 కోట్లతో పోలిస్తే 5.8 శాతం పెరిగింది. కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటాం: ఎండీ కస్టమర్ల సంఖ్యను భారీగా పెంచుకోవడంద్వారా ఆదాయాన్ని మరింత పరుగులు పెట్టించడం తమ లక్ష్యమని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈఓ (భారత్, దక్షిణాసియా) గోపాల్ విట్టల్ పేర్కొన్నారు. అదేవిధంగా స్థిరమైన టారిఫ్‌లు, మొబైల్ డేటా విభాగంలో వినూత్న ప్లాన్‌ను అందించడంపై అత్యధికంగా దృష్టిసారిస్తున్నట్లు చెప్పారు. గడచిన నాలుగేళ్లలో మూడో క్వార్టర్లో ఇంత భారీ ఆదాయం లభించడం ఇదే తొలిసారని ఆయన చెప్పారు. ఇతర ముఖ్యాంశాలివీ... ⇒ ఎయిర్టెల్ భారత్ కార్యకలాపాల ఆదాయం క్యూ3లో 12.6 శాతం పెరిగి రూ.16,256 కోట్లుగా నమోదైంది. ⇒ మొబైల్ సేవల ఆదాయం 13 శాతం, టెలీ మీడియా ఆదాయం 13.2%, డిజిటల్ టీవీ(డీటీహె చ్) ఆదాయం 15.8% చొప్పున వృద్ధి చెందాయి. ⇒ మొబైల్ వాయిస్ కాల్స్ ద్వారా డిసెంబర్ క్వార్టర్లో ఒక్కో భారతీయ యూజర్ నుంచి నిమిషానికి సగటున(ఏఆర్పీయూ) 37.67 పైసలు లభించినట్లు కంపెనీ తెలిపింది. అంతక్రితం ఏడాది ఏఆర్‌పీయూతో పోలిస్తే 0.45 పైసలు పెరిగింది. ⇒ మొబైల్ డేటా ఆదాయం అత్యధికంగా 74.3 శాతం ఎగబాకి రూ.2,114 కోట్లకు చేరింది. భారత్‌లో ఒక్కో కస్టమర్ మొబైల్ ఇంటర్నెట్ వినియోగం క్యూ3లో 38.3 శాతం పెరిగింది. ఇక కన్సాలిడేటెడ్‌గా ఈ ఆదాయం క్యూ3లో 62 శాతం వృద్ధి చెంది రూ.2,872 కోట్లుగా నమోదైంది. ⇒ ఆఫ్రికాలోని అనుంబంధ సంస్థల నుంచి డిసెంబర్ క్వార్టర్లో నష్టాలు రూ.836 కోట్లకు పెరిగాయి. ఆదాయం 5.5 శాతం తగ్గుదలతో రూ.7,230 కోట్ల నుంచి రూ.6,828 కోట్లకు చేరింది. అయితే, అక్కడి స్థానిక కరెన్సీల ప్రకారం చూస్తే... ఆదాయం 3.9 శాతం వృద్ధి చెందిందని కంపెనీ వెల్లడించింది. ⇒ ఆఫ్రికాలో మొబైల్ డేటా ఆదాయాలు 116 మిలియన్ డాలర్లకు చేరాయి. 34.9 శాతం వృద్ధి నమోదైంది. ⇒ మొత్తంమీద... 20 దేశాల్లో టెలికం సేవలు అందిస్తున్న ఎయిర్టెల్ కస్టమర్ల సంఖ్య డిసెంబర్ చివరినాటికి 31.29 కోట్లకు చేరింది. వీరిలో భారతీయ కస్టమర్లు 22 కోట్లు. మొబైల్ ఇంటర్నెట్ వాడకందార్ల సంఖ్య 4.2 కోట్లుగా ఉంది. ⇒ డిసెంబర్ ఆఖరికల్లా కంపెనీ నికర రుణ భారం రూ.66,839 కోట్లుగా నమోదైంది. భారతీ ఎయిర్టెల్ షేరు ధర బుధవారం 1 శాతం మేర క్షీణించి రూ.368 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. -
ఐసీఐసీఐకి మొండి బకాయిల సెగ
క్యూ3లో రూ. 3,265 కోట్లు; 14 % అప్ ⇒ 3.4 శాతానికి ఎగబాకిన మొండి బకాయిలు... ⇒ భారీగా క్షీణించిన షేరు ధర... ముంబై: ప్రైవేటు రంగ బ్యాకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంక్ లాభాలతోపాటు మొండిబకాయిలు కూడా భారీగా పెరిగాయి. ఈ ఏడాది డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి(2014-15, క్యూ3) బ్యాంక్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.3,265 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.2,872 కోట్లతో పోలిస్తే లాభం 13.7 శాతం వృద్ధి చెందింది. ప్రధానంగా బీమా, బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్ తదితర అనుంబంధ సంస్థల మెరుగైన పనితీరుతో లాభాలు పుంజుకున్నాయి. ఇక మొత్తం ఆదాయం కూడా క్యూ3లో రూ.20,543 కోట్ల నుంచి రూ.23,054 కోట్లకు వృద్ధి చెందింది. 12.2 శాతం పెరిగింది. స్టాండెలోన్‌గానూ 14 శాతం అప్... ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించి(సాండెలోన్) ఐసీఐసీఐ నికర లాభం క్యూ3లో 14.1 శాతం వృద్ధితో రూ.2,889 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,532 కోట్లు. మొత్తం ఆదాయం రూ.14,226 కోట్ల నుంచి రూ.15,526 కోట్లకు పెరిగింది. 8.8 శాతం వృద్ధి నమోదైంది. మొండిబకాయిల సెగ... ఈ డిసెంబర్ క్వార్టర్లో ఐసీఐసీఐ బ్యాంక్‌ను మొండిబకాయిలు(ఎన్పీఏ) వెంటాడాయి. మొత్తం రుణాల్లో స్థూల ఎన్పీఏలు 3.4 శాతానికి ఎగబాకాయి. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఈ పరిమాణం 3.05 శాతమే. మరోపక్క, నికర ఎన్పీఏలు కూడా 1.76 శాతం నుంచి 1.9 శాతానికి పెరిగాయి. ఇక మొండిబకాయిలు, కంటింజెన్సీల కోసం ప్రొవిజనింగ్ కేటాయింపులు రూ.695 కోట్ల నుంచి రూ.980 కోట్లకు ఎగిశాయి. కాగా, ఈ క్యూ3లో కొత్తగా రూ.2,279 కోట్ల విలువైన రుణాలు మొండిబకాయిలుగా మారినట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇందులో రూ.776 కోట్లు గతంలో పునర్వ్యవస్థీకరించిన రుణాలేనని కూడా తెలిపింది. కాగా, అక్టోబర్-డిసెంబర్ వ్యవధిలో రూ.1,755 కోట్ల రుణాలను బ్యాంక్ పునర్వ్యవస్థీకరిచింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఈ పరిమాణం రూ.2,300 కోట్లుగా ఉంది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ⇒ క్యూ3లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 13 శాతం పెరిగి రూ.4,812 కోట్లకు ఎగబాకింది. నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) కూడా స్వల్ప పెరుగుదలతో 3.46 శాతంగా నమోదైంది. ⇒ రిటైల్ రుణాల్లో 26 శాతం వృద్ధి దీనికి దోహదం చేసింది. ⇒ సబ్సిడరీల నుంచి అధిక డివిడెండ్ల కారణంగా ఇతర ఆదాయం 50 శాతం వృద్ధితో రూ.357 కోట్ల నుంచి రూ.538 కోట్లకు పెరిగింది. ఫీజుల రూపంలో ఆదాయం 6 శాతం పెరిగి రూ.443 కోట్లకు చేరింది. ⇒ సబ్సిడరీల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ లాభం డిసెంబర్ త్రైమాసికంలో రూ.428 కోట్ల నుంచి రూ.462 కోట్లకు పెరిగింది. ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ నికర లాభం రూ.76 కోట్ల నుంచి రూ.176 కోట్లకు వృద్ధి చెందింది. ⇒ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్(మ్యూచువల్ ఫండ్) సంస్థ లాభం 43 శాతం పెరగగా.. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లాభం రెట్టింపై రూ.76 కోట్లకు చేరింది. ⇒ క్యూ3లో కార్పొరేట్ రంగానికి రుణాల్లో 4 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం రుణాల్లో ఈ రంగానికి రుణాల వాటా 29 శాతానికి తగ్గింది. రిటైల్ రుణాల వాటా 41 శాతానికి ఎగబాకింది. కాగా, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల నేపథ్యంలో కార్పొరేట్ల నుంచి రుణ డిమాండ్ క్రమంగా పుంజుకుంటోంది. ఆర్థిక వ్యవస్థలో చాన్నాళ్లుగా కొనసాగుతూవస్తున్న మందగమన పరిస్థితులవల్లే మొండి బకాయిలు పెరిగేందుకు దారితీస్తోంది. ఫలితంగా పునర్వ్యవస్థీకరించిన రుణాలు కూడా మళ్లీ ఎన్పీఏలుగా మారుతున్నాయి. ఇదేవిధమైన దోరణి మరో 2-3 త్రైమాసికాలపాటు కొనసాగవచ్చు. ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలోపడితే.. కంపెనీల పనితీరు మెరుగుపడటమేకాకుండా.. మొండి బకాయిల సమస్యకు కూడా అడ్డుకట్టపడుతుంది. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం పరిశ్రమకు పోత్సాహకరమైన చర్య. మా బీమా సబ్సిడరీలో పెట్టుబడులకు సంబంధించి ఐపీఓ సహా ఇతరత్రా అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నాం. వడ్డీరేట్లు దిగొస్తాయని రుణగ్రహీతలు భావిస్తున్నారు. అయితే, మా బ్యాంక్ వడ్డీరేట్ల తగ్గింపు ఎప్పుడనేది వెల్లడించలేను. అసెట్స్ లయబిలిటీ కమిటీ దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ షేరు ధర క్రాష్... మొండి బకాయిల పెరుగుదల ఆందోళనల నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ధర భారీగా క్షీణించింది. శుక్రవారం బీఎస్ఈలో ఒకానొకదశలో 6.5 శాతం మేర దిగజారి రూ.355కు పడిపోయింది. చివరకు 4.95 శాతం నష్టంతో రూ.361 వద్ద స్థిరపడింది. ఈ ఒక్క రోజులోనే బ్యాంక్ మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్)రూ.10,839 కోట్లు ఆవిరై.. రూ.2,09,208 కోట్లకు తగ్గిపోయింది. -
ఓబీసీకి మొండిబకాయిల షాక్
- క్యూ3లో లాభం 91 శాతం క్షీణత - రూ.19.56 కోట్లకు పరిమితం - 5.53%కి పెరిగిన స్థూల ఎన్పీఏలు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ)కు మొండి బకాయిల షాక్ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో నికర లాభం ఏకంగా 91.2 శాతం దిగజారి రూ.19.56 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది ఇదే కాలానికి బ్యాంక్ నికర లాభం రూ.224 కోట్లుగా నమోదైంది. కాగా, డిసెంబర్ చివరినాటికి ఓబీసీ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏ) 5.43 శాతానికి పెరిగిపోయాయి. 2013 డిసెంబర్ చివరికి స్థూల ఎన్పీఏలు 3.87 శాతం మాత్రమే ఉన్నాయి. ఇక నికర ఎన్పీఏలు కూడా2.91 శాతం నుంచి 3.68 శాతానికి ఎగబాకాయి. బ్యాంక్ మొత్తం ఆదాయం 7.8 శాతం వృద్ధితో రూ. 5,064 కోట్ల నుంచి రూ.5,459 కోట్లకు పెరిగింది. నిర్వహణ వ్యయాలు రూ.712 కోట్ల నుంచి రూ.794 కోట్లకు చేరాయి. మొండిబకాయిలకు అధిక ప్రొవిజనింగ్ కేటాయింపులతోపాటు సాంకేతికపరమైన కొన్ని కారణాలు కూడా క్యూ3లో లాభాలు భారీగా పడిపోయేందుకు కారణమైందని ఓబీసీ ఎండీ, సీఈఓ, అనిమేష్ చౌహాన్ పేర్కొన్నారు. జూన్‌లో కొన్ని మొండి బకాయిలను విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని లాభంగా చూపించామని... అయితే, ఆర్బీఐతో సంప్రతింపుల అనంతరం దీన్ని పొరపాటుగా గుర్తించి, రూ.137 కోట్లను లాభాల నుంచి తొలగించినట్లు ఆయన తెలిపారు. మరోపక్క, డిసెంబర్ క్వార్టర్లో రూ.1,340 కోట్ల రుణాలు మొండిబకాయిలుగా మారగా.. రూ.2,050 కోట్ల రుణాలను పునర్వ్యవస్థీకరించినట్లు చౌహాన్ వివరించారు. ఇక క్యూ3లో మొండిబకాయిల కోసం రూ.885 కోట్లను బ్యాంక్ ప్రొవిజనింగ్గా కేటాయించింది. క్రితం క్యూ3లో ఈ మొత్తం రూ.561 కోట్లుగా ఉంది. కాగా, ఇటీవలే(2014 డిసెంబర్ 31న) బ్యాంక్ కొత్త సీఈఓ, ఎండీగా చౌహాన్ బాధ్యతలు చేపట్టడం గమనార్హం. ఆఖరి త్రైమాసికం(క్యూ4) కూడా మందకొడిగానే ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. భారీగా పడిన షేరు: ప్రతికూల ఫలితాల కారణంగా ఓబీసీ షేరు ధర కుప్పకూలింది. గురువారం బీఎస్ఈలో ఒకానొక దశలో 11 శాతం పైగా క్షీణించి రూ.279 కనిష్టాన్ని తాకింది. చివరకు 10.81 శాతం నష్టంతో రూ.281 వద్ద ముగిసింది. గురువారం ఒక్కరోజులోనే బ్యాంక్ మార్కెట్ విలువ రూ.1,182 కోట్లు ఆవిరై.. రూ.8,203 కోట్లకు పడిపోయింది. -
హెచ్డీఎఫ్సీ లాభం రూ.1,425 కోట్లు
క్యూ3లో 12 శాతం వృద్ధి న్యూఢిల్లీ: గృహ రుణ దిగ్గజం హెచ్డీఎఫ్సీ... డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో రూ.1,425 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాంలో రూ.1,278 కోట్లతో పోలిస్తే 11.6 శాతం వృద్ధి చెందింది. సంస్థ మొత్తం ఆదాయం 14.13 శాతం ఎగబాకి.. రూ.6,020 కోట్ల నుంచి రూ.6,871 కోట్లకు పెరిగింది. నిర్వహణ ఆదాయం 12.9 శాతం పెరుగుదలతో రూ.5,985 కోట్ల నుంచి రూ.6,758 కోట్లకు వృద్ధి చెందింది. కాగా, మొండిబకాయిలు, కంటింజెన్సీల కోసం ఈ క్యూ3లో రూ.45 కోట్లను ప్రొవిజనింగ్ రూపంలో హెచ్డీఎఫ్సీ కేటాయించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఈ కేటాయింపులు రూ.25 కోట్లు. 2014, డిసెంబర్ చివరినాటికి సంస్థ ఇచ్చిన మొత్తం రుణాల విలువ రూ.2.19 లక్షల కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది డిసెంబర్ చివరికి ఈ విలువ రూ.1.92 లక్షల కోట్లు. కాగా, డిసెంబర్ క్వార్టర్లో తమ అనుంబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 1,19,69,000 ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు వెల్లడించింది. రూ.10 ముఖ విలువగల ఒక్కో షేరును రూ.105 ధరకు విక్రయించింది. ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ షేరు ధర గురువారం బీఎస్ఈలో 2.61 శాతం క్షీణించి రూ.1,310 వద్ద ముగిసింది. -
7% తగ్గిన డాక్టర్ రెడ్డీస్ లాభం
క్యూ3లో నికర లాభం రూ. 574 కోట్లు... ⇒ రష్యా వ్యాపారంలో 10 శాతం క్షీణత ⇒ 9% వృద్ధితో రూ. 3,843 కోట్లకు చేరిన కంపెనీ ఆదాయం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసిక నికర లాభంలో 7% క్షీణతను నమోదు చేసింది. గతేడాది ఇదే కాలానికి రూ. 618 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ. 574 కోట్లకు పడిపోయింది. ప్రధాన ఆదాయ వనరైన అమెరికా మార్కెట్లో వృద్ధి అంతగా లేకపోవడం, ఇదే సమయంలో రష్యా వ్యాపారంలో 10%క్షీణత, ఆర్అండ్డీ వ్యయం పెరగడం లాభాలు తగ్గడానికి ప్రధాన కారణాలుగా డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌమెన్ చక్రవర్తి గురువారంనాడిక్కడ మీడియా సమావేశంలో తెలిపారు. సమీక్షా కాలంలో కంపెనీ ఆదాయం 9 శాతం పెరిగి రూ. 3,534 కోట్ల నుంచి రూ. 3,843 కోట్లకు పెరిగింది. డాక్టర్ రెడ్డీస్ ప్రధాన ఆదాయ వనరైన గ్లోబల్ జెనరిక్ వ్యాపారం 8 శాతం పెరిగి రూ. 2,936 కోట్ల నుంచి రూ. 3,169 కోట్లకు చేరింది. ఇందులో 53 శాతం వాటా కలిగిన ఉత్తర అమెరికా మార్కెట్లో మాత్రం కేవలం నాలుగు శాతం వృద్ధి మాత్రమే నమోదు కావడం, ధరలపై ఒత్తిడి ఉండటం లాభాలపై ప్రభావం చూపిందన్నారు. గతేడాదితో పోలిస్తే అభివృద్ధి, పరిశోధనల కేటాయింపులు (ఆర్ అండ్ డీ) 45 శాతం పెంచినట్లు డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిజిత్ ముఖర్జీ తెలిపారు. ఈ మూడు నెలల కాలంలో ఆర్ అండ్ డీపై రూ. 430 కోట్లు వ్యయం చేశారు. అలాగే ఈ త్రైమాసికంలో కొత్తగా ఆరు ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయగా, రెండు ఏఎన్‌డీఏలను ఫైల్ చేసినట్లు ముఖర్జీ తెలిపారు. ప్రస్తుతం 68 ఏఎన్‌డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటికి వచ్చిన అనుమతులను బట్టి కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయడం ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.ఈ సమీక్షా కాలంలో దేశీయ వ్యాపారం 11 శాతం వృద్ధితో రూ. 485 కోట్ల నుంచి రూ. 526 కోట్లకు చేరింది. మార్కెట్ అంచనాల కంటే లాభాల్లో క్షీణత తక్కువగా ఉండటంతో గురువారం బీఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ షేరు ధర సుమారు నాలుగు శాతం పెరిగి రూ. 3,359 వద్ద ముగిసింది. -
మారుతీ లాభం 18% అప్
క్యూ3లో రూ.802 కోట్లు... న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో కంపెనీ నికర లాభం రూ.802 కోట్లకు ఎగబాకింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.681 కోట్లతో పోలిస్తే 17.8 శాతం వృద్ధి చెందింది. ప్రధానంగా క్యూ3లో అమ్మకాల జోరుతో పాటు ఉత్పాదక వ్యయం తగ్గింపు చర్యలు, ఫారెన్ ఎక్స్ఛేంజ్(ఫారెక్స్)పరమైన రాబడులు... మెరుగైన లాభాలకు దోహదం చేసినట్లు కంపెనీ ప్రకటనలో పేర్కొంది. కాగా, మొత్తం ఆదాయం క్యూ3లో 15.5 శాతం పెరిగి రూ.10,620 కోట్ల నుంచి రూ.12,263 కోట్లకు చేరింది. విక్రయాలు 12 శాతం పెరిగాయ్... క్యూ3లో కంపెనీ మొత్తం 3,23,911 వాహనాలను విక్రయించింది. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో అమ్మకాల సంఖ్య 2,88,151తో పోలిస్తే 12.4 శాతం పెరిగాయి. ఇక ఎగుమతులు కూడా 19,966 యూనిట్ల నుంచి 28,709 యూనిట్లకు వృద్ధి చెందాయి. ఎగుమతులపరంగా రూ.1,224 కోట్ల ఆదాయం సమకూరింది. కాగా, వాహన పరిశ్రమకు మార్కెట్లో ఇంకా బలహీన సెంటిమెంట్ కొనసాగుతోందని.. డిమాండ్ పూర్తిస్థాయిలో పుంజుకోవడానికి మరికొంత కాలం పడుతుందని కంపెనీ సీఎఫ్ఓ అజయ్ సేథ్ పేర్కొన్నారు. గడచిన క్వార్టర్లో ఒక్కో కారుపై సగటున దాదాపు రూ.21,000 చొప్పున డిస్కౌంట్‌ను ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం వరకూ ఈ డిస్కౌంట్లు కొనసాగే అవకాశం ఉందన్నారు. కాగా, ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం రాయితీలను వెనక్కితీసుకోవడంతో అనివార్యంగా ధరలను పెంచాల్సి రావడంతో కార్ల అమ్మకాలపై ప్రభావం పడుతోందని.. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ విభాగంలో ఈ ప్రభావం అధికంగా ఉందని ఆయన వివరించారు. గుజరాత్లో నెలకొల్పుతున్న కొత్త ప్లాంట్‌ను పూర్తిగా మాతృ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్‌కు వదిలిపెట్టడం.. పెట్టుబడులకు సంబంధించి మైనారిటీ వాటాదారుల నుంచి రానున్న ఆరు నెలల వ్యవధిలో ఆమోదం లభిస్తుందని భావిస్తున్నట్లు సేథీ చెప్పారు. కంపెనీల చట్టం-2013లో సవరణలకు రాజ్య సభ ఇంకా ఆమోదించాల్సి ఉన్నందున ఈ అంశంలో కొంత జాప్యం జరుగుతోందని ఆయన చెప్పారు.. -
ఐటీసీ లాభం రూ. 2,635 కోట్లు
⇒ క్యూ3లో 10.5% పెరుగుదల ⇒ సిగరెట్ల వ్యాపారంలో వృద్ధి అంతంతే... న్యూఢిల్లీ: బహుళ వ్యాపార రంగ దిగ్గజం ఐటీసీ.. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో రూ.2,635 కోట్ల లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.2,385 కోట్లతో పోలిస్తే లాభం 10.5 శాతం వృద్ధి చెందింది. అయితే, కంపెనీ ఆదాయం మాత్రం నామమాత్రంగా 2 శాతం పెరిగి రూ.8,800 కోట్లకు చేరింది. క్రితం క్యూ3లో ఆదాయం రూ.8,623 కోట్లుగా ఉంది. ప్రధానంగా సిగరెట్ల వ్యాపారంలో వృద్ధి అంతంతమాత్రంగా కొనసాగడం మొత్తం ఆదాయాల పెరుగుదలపై ప్రభావం చూపింది. ఫలితాల్లో ముఖ్యాంశాలివీ... * సిగరెట్లు, ఇతరత్రా ఎఫ్ఎంసీజీ విభాగాల నుంచి క్యూ3లో రూ.6,456 కోట్ల ఆదాయం కంపెనీకి సమకూరింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 4.23% పెరిగింది. ఇందులో ఒక్క సిగరెట్ల విభాగం నుంచి రూ.4,142 కోట్ల ఆదాయం లభించింది. వృద్ధి 0.62%కి పరిమితమైంది. * గతేడాది బడ్జెట్లో సిగరెట్లపై భారీగా ఎక్సైజ్ సుంకం పెంపు పూర్తి ప్రభావంతో పాటు.. తమిళనాడు, కేరళ, అసోంలు వ్యాట్‌ను పెంచడంతో ఈ విభాగం నుంచి ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడిందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. * ఇక హోటళ్ల వ్యాపార ఆదాయం మూడో క్వార్టర్లో 4.69% పెరిగి రూ.330 కోట్లుగా నమోదైంది. * అగ్రి బిజినెస్ ఆదాయం 10.55 శాతం దిగజారి రూ.1,598 కోట్లకు పరిమితమైంది. * పేపర్ బోర్డులు, పేపర్, ప్యాకేజింగ్ వ్యాపార విభాగం ఆదాయం కూడా 4.66 శాతం క్షీణించి రూ.1,199 కోట్లకు తగ్గిపోయింది. * ఆదాయాల్లో వృద్ధి మందగమనంతో ఐటీసీ షేరు కుప్పకూలింది. బుధవారం బీఎస్ఈలో కంపెనీ షేరు ధర 5.01%(రూ.18.60) క్షీణించి రూ.352.60 వద్ద ముగిసింది. -
హెచ్‌యూఎల్ లాభం 18% అప్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో రూ.1,252 కోట్ల స్టాండెలోన్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో రూ.1,062 కోట్లతో పోలిస్తే లాభం 17.87 శాతం పెరిగింది. ప్రధానంగా క్యూ3లో కంపెనీ కొన్ని ఆస్తులను విక్రయించడం, ఉత్పాదక వ్యయాలు తగ్గుముఖం పట్టడం వంటివి లాభాల జోరుకు దోహదం చేశాయి. ఆస్తుల అమ్మకం రూపంలో రూ.407 కోట్ల అసాధారణ ఆదాయం లభించినట్లు బీఎస్ఈకి వెల్లడించిన సమాచారంలో కంపెనీ తెలిపింది. హెచ్‌యూఎల్ మొత్తం ఆదాయం క్యూ3లో 7.69 శాతం ఎగసి రూ.7,037 కోట్ల నుంచి రూ.7,579 కోట్లకు చేరింది. పట్టణ ప్రాంత అమ్మకాల్లో మందగమనం... దేశీ మార్కెట్లో డిమాండ్ ఇంకా మందకొడిగానే ఉన్న నేపథ్యంలో మూడో తైమాసికంలో అమ్మకాల వృద్ధి కాస్త తగ్గిందని.. అయితే, ముడి చమురు ధరల భారీ పతనం కారణంగా ఉత్పాదక వ్యయాలు దిగొచ్చినట్లు హెచ్‌యూఎల్ సీఎఫ్ఓ పీబీ బాలాజీ చెప్పారు. పట్టణ ప్రాంత అమ్మకాలతో పోలిస్తే.. గ్రామీణ విక్రయాలు జోరందుకున్నాయన్నారు. మరోపక్క, ఈసారి చలికాలం ఆరంభం జాప్యం కావడం కూడా చర్మసంరక్షణ ఉత్పత్తుల అమ్మకాలపై ప్రభావం చూపినట్లు ఆయన తెలిపారు. * క్యూ3లో సబ్బులు, డిటర్జెంట్ల విభాగ ఆదాయం 5.95% వృద్ధితో రూ.3,398 కోట్లకు చేరింది. * పర్సనల్ ప్రొడక్టుల విభాగం నుంచి రూ.2,455 కోట్ల ఆదాయం సమకూరింది. క్రితం క్యూ3తో పోలిస్తే 6.53 శాతం పెరిగింది. * పానీయాల విభాగం ఆదాయం 8.19 శాతం పెరిగి రూ.920 కోట్లకు చేరింది. * ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తుల విభాగం 12.64 శాతం వృద్ధిచెంది రూ.420 కోట్లుగా నమోదైంది. * డిసెంబర్ క్వార్టర్లో పన్ను చెల్లింపుల వ్యయాలు రెట్టింపై రూ.519 కోట్లకు ఎగబాకాయి. 5% పైగా పడిన షేరు.. మందకొడి అమ్మకాలు, ఫలితాలు మార్కెట్వర్గాల అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో కంపెనీ షేరు ధర సోమవారం బీఎస్ఈలో 5.27 శాతం క్షీణించి రూ.892.80 వద్ద ముగిసింది. ఈ ఒక్కరోజులోనే హెచ్‌యూఎల్ మార్కెట్ విలువలో రూ. 10,740 కోట్లు ఆవిరైంది. రూ.1,93,133 కోట్లకు పడిపోయింది. మరోపక్క, ఈ నెలలో ఇప్పటిదాకా 24% షేరు ఎగబా కడంతో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కూడా షేరు పతనానికి కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. -
ఇన్ఫోసిస్ బంపర్ బోణీ..!
అంచనాలు మించిన క్యూ3 ఫలితాలు కన్సాలిడేటెడ్ నికర లాభం 3,250 కోట్లు ⇒ త్రైమాసిక ప్రాతిపదికన 5% వృద్ధి; వార్షికంగా 13 శాతం పెరుగుదల ⇒ మొత్తం ఆదాయం 13,796 కోట్లు ⇒ ఆదాయ గెడైన్స్ యథాతథంగానే ⇒ ఉద్యోగులకు 100 శాతం బోనస్ ⇒ 5 శాతం పైగా దూసుకెళ్లిన షేరు ధర దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ అంచనాలను మించిన పనితీరుతో అదరగొట్టింది. మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో అటు ఇన్వెస్టర్లు ఇటు కంపెనీ ఉద్యోగుల్లోనూ కొత్త ఉత్తేజం నింపింది. కంపెనీ నికర లాభం, ఆదాయాలు ఆకర్షణీయంగా వృద్ధి చెందడమే కాకుండా... పూర్తి ఏడాదికి ఆదాయ వృద్ధి అంచనాలను(గెడైన్స్) కూడా మార్చలేదు. దీంతో కంపెనీ షేరు ధర 5% పైగా రివ్వున ఎగసింది. బెంగళూరు: సాఫ్ట్వేర్ అగ్రగామి ఇన్ఫోసిస్.. ఈ ఏడాది డిసెంబర్‌తో ముగిసిన మూడో క్వార్టర్లో(2014-15, క్యూ3) రూ.3,250 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.2,875 కోట్లతో పోలిస్తే.. లాభం వార్షిక ప్రాతిపదికన 13 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం కూడా రూ.13,026 కోట్ల నుంచి రూ.13,796 కోట్లకు ఎగబాకింది. 5.9 శాతం పెరుగుదల నమోదైంది. వాస్తవానికి బ్రోకరేజి సంస్థల విశ్లేషకులు సగటున రూ.3,157 కోట్ల లాభం, రూ.13,783 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా.. ఇన్ఫీ దీనికంటే మెరుగ్గానే ఫలితాలను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. క్యూ3లో రూపాయి మారకం విలువ 2.5 శాతం మేర క్షీణించడం కూడా కంపెనీ మెరుగైన రాబడులకు ఒక కారణమని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, ఇన్ఫోసిస్‌కు తొలి ప్రమోటరేతర సీఈఓగా విశాల్ సిక్కా బాధ్యతలు చేపట్టడం(ఆగస్టు1న) ఒకెత్తయితే.. ఆయన హయాంలో తొలి పూర్తిస్థాయి త్రైమాసిక ఫలితాలు ఇవే. సీక్వెన్షియల్‌గానూ జోష్.. ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదు చేసిన రూ.3,096 కోట్లతో పోలిస్తే(సీక్వెన్షియల్‌గా)... క్యూ3లో లాభం దాదాపు 5 శాతం ఎగబాకడం విశేషం. మొత్తం ఆదాయం క్యూ2లో రూ.13,342 కోట్ల నుంచి 3.4 శాతం వృద్ధి చెందింది. ఇక డాలర్లలో చూస్తే... కంపెనీ ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన(స్థిర కరెన్సీ విలువ ప్రకారం) 2.6 శాతం వృద్ధితో 2.218 బిలియన్ డాలర్లుగా నమోదైంది. నికర లాభం 2.15 శాతం వృద్ధి చెంది 522 మిలియన్ డాలర్లకు చేరింది. కాగా, డాలరుతో యూరో, పౌండ్ ఇతరత్రా ప్రధాన కరెన్సీల విలువలు భారీగా క్షీణించడంతో క్యూ3లో డాలరు ఆదాయాల వృద్ధిలో 1.8 శాతం మేర ప్రతికూల ప్రభావం పడిందని ఇన్ఫీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) రాజీవ్ బన్సల్ పేర్కొన్నారు. గెడైన్స్ యథాతథం...: ప్రస్తుత 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరానికి డాలరు ఆదాయాల్లో వృద్ధి అంచనా(గెడైన్స్)ను ఇన్ఫోసిస్ యథాతథంగా కొనసాగించింది. గతంలో ప్రకటించిన 7-9 శాతం గెడైన్స్‌లో ఎలాంటి మార్పులూ చేయలేదు. కరెన్సీ హెచ్చుతగ్గులు ఇతరత్రా అంశాల నేపథ్యంలో గెడైన్స్‌ను తగ్గించే అవకాశం ఉందని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడినప్పటికీ.. ఇన్ఫోసిస్ వారి అంచనాలను తలదన్నడం గమనార్హం. మూడో త్రైమాసికం ఫలితాల్లో అనేక అంశాల్లో మంచి పురోగతిని సాధించాం. ప్రధానంగా మేం అనుసరిస్తున్న ‘రెన్యూ అండ్ న్యూ(పాత ప్రణాళికల పునరుద్ధరణ, కొత్త విభాగాలపై దృష్టి సారించడం)’ వ్యూహాన్ని క్లయింట్లు స్వాగతిస్తున్నారు. కొత్త ఆవిష్కరణల కోసం ఉద్దేశించిన ఇన్నోవేషన్ ఫండ్‌ను ఇప్పుడున్న 100 మిలియన్ డాలర్ల నుంచి 500 మిలియన్ డాలర్లకు పెంచుతున్నాం. ప్రధానంగా అంతర్జాతీయంగా మా వ్యూహాత్మక భాగస్వాములకు మరింత మెరుగైన సేవల కల్పనే దీని లక్ష్యం. - విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ షేరు రయ్ రయ్... ఆకర్షణీయమైన ఫలితాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు ధర శుక్రవారం దూసుకుపోయింది. ఒకానొక దశలో బీఎస్ఈలో 7 శాతం మేర ఎగబాకి రూ.2,108 గరిష్టాన్ని తాకింది. చివరకు 5.1% పెరిగి రూ.2,074 వద్ద ముగిసింది. ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ప్రారంభానికి ముందే ఫలితాలను ప్రకటిస్తూ వస్తున్న ఇన్ఫీ తొలిసారి మధ్యాహ్నం ఫలితాలను వెల్లడించడం విశేషం. ఉద్యోగులకు బోనస్ బొనాంజా.. ఉద్యోగుల వలసల(అట్రిషన్) జోరు నేపథ్యంలో దీనికి అడ్డుకట్టవేయడంపై ఇన్ఫీ దృష్టిపెట్టింది. డిసెంబర్ త్రైమాసికంలో సంస్థ సిబ్బందికి 100 శాతం బోనస్(వేరియబుల్... పనితీరు ఆధారంగా) చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల వలసల రేటు డిసెంబర్ క్వార్టర్లో 20.4 శాతానికి ఎగబాకింది. సెప్టెంబర్ క్వార్టర్లో ఈ రేటు 20.1 శాతంగా ఉంది. క్యూ3లో స్థూలంగా కంపెనీ 13,154 మందిని.. నికరంగా 4,227 మంది సిబ్బందిని జతచేసుకుంది. డిసెంబర్ చివరికి కంపెనీ(అనుబంధ సంస్థలతో కలిపి) మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,69,638కి చేరింది. కాగా, సిక్కా బాధ్యతలు స్వీకరించాక క్యూ2 ఫలితాల సందర్భంగా ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకి మరో షేరు బోనస్(1:1)గా ప్రకటించగా.. క్యూ3 ఫలితాల్లో ఉద్యోగులకు బోనస్ ఇవ్వడం గమనార్హం. -
ఐటీకి కరెన్సీ కుదుపులు!
క్యూ3లో ఆదాయాల వృద్ధి అంతంతే! * రేపు ఇన్ఫోసిస్ ఫలితాలతో బోణీ... * సీజనల్‌గానూ ఈ త్రైమాసికం ఐటీ కంపెనీలకు నిరుత్సాహకరం... * పరిశ్రమ విశ్లేషకుల అంచనా... ముంబై: దేశీ ఐటీ రంగానికి డిసెంబర్ క్వార్టర్ నిరుత్సాహకరంగానే ఉండొచ్చని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ కరెన్సీల మధ్య మారకపు విలువల్లో తీవ్ర హెచ్చుతగ్గులు... కంపెనీల పనితీరుపై ప్రభావం చూపనున్నాయనేది వారి అంచనా. దీనికితోడు సాధారణంగా ఈ త్రైమాసికంలో అమెరికా, యూరప్ ఇతరత్రా ప్రధాన మార్కెట్లలో అధిక సెలవులు ఇతరత్రా సీజనల్ అంశాలు కూడా తోడవుతాయని.. దీనివల్ల ఆదాయాలు మందగించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ నెల 9న(శుక్రవారం) ప్రకటించనున్న ఫలితాలతో ఈ ఏడాది మూడో త్రైమాసికం(2014-15, క్యూ3) ఫలితాల సీజన్ మొదలుకానుంది. 15న ఐటీ అగ్రగామి టీసీఎస్, 16న విప్రో క్యూ3 ఫలితాలను ప్రకటించనున్నాయి. డాలరుతో యూరో క్యూ3లో 6%, పౌండ్ 5%, ఆస్ట్రేలియా డాలరు 7.8% చొప్పున క్షీణించాయి. మన ఐటీ కంపెనీలకు అమెరికా(70%) తర్వాత యూరప్ అతిపెద్ద మార్కెట్‌గా(20%) నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా కరెన్సీ విలువలు పతనం కావడం ఐటీ కంపెనీల డాలరు ఆదాయాలను దెబ్బతీయనుంది. ఎందుకంటే.. ఇతర కరెన్సీల్లో వచ్చిన ఆదాయాన్ని భారతీయ కంపెనీలు డాలర్లలోకి మార్చుకొని ఫలితాల్లో చూపించడమే దీనికి ప్రధాన కారణమని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇతర కరెన్సీలు బాగా క్షీణించినందున, ఆ దేశాల నుంచి ఒనగూడే ఆదాయం డాలర్ల రూపంలో తగ్గుతుంది. అయితే, డాలరుతో రూపాయి మారకం విలువ క్షీణత నేపథ్యంలో ఐటీ కంపెనీల మార్జిన్లలో కాస్త మెరుగుదల కనబడొచ్చనేది వారి అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ డాలర్ల నుంచి మార్చడం వల్ల రూపాయిల్లో ఆదాయం పెరుగుతుంది. క్యూ3లో రూపాయి విలువ 2.7 శాతం తగ్గింది. ఇన్ఫీ గెడైన్స్ తగ్గిస్తుందా..? కరెన్సీ హెచ్చుతగ్గుల కారణంగా ఇన్ఫోసిస్ ఈ ఏడాది పూర్తి కాలానికి ఇచ్చిన ఆదాయ వృద్ధి అంచనా(గెడైన్స్)6.75-8.75 శాతానికి తగ్గించే అవకాశం ఉందని బ్రోకరేజి సంస్థ మోతీలాల్ ఓశ్వాల్ తాజా నోట్లో పేర్కొంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను ఇన్ఫీ 7-9% డాలరు ఆదాయ గెడైన్స్‌ను ఇదివరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, క్యూ3లో కంపెనీ డాలరు ఆదాయ వృద్ధి 1-3%కే(క్యూ2తో పోలిస్తే సీక్వెన్షియల్‌గా) పరిమితం కావచ్చనేది విశ్లేషకుల అంచనా. క్యూ2లో సీక్వెన్షియల్ ఆదాయ వృద్ధి అంచనాలను మించి 3.1 శాతంగా నమోదుకావడమే కాకుండా... ఒక షేరుకి మరో షేరు(1:1) బోనస్‌గా కూడా ప్రకటించడం విశేషం. కంపెనీ సీఈఓగా తొలిసారి ప్రమోటరేతర వ్యక్తి(విశాల్ సిక్కా) బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇన్ఫీ మళ్లీ పూర్వవైభవం దిశగా వెళ్తోందని పలువురు నిపుణులు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా, గడచిన రెండు క్వార్టర్లలో కరెన్సీ కుదుపుల కారణంగా ఇన్ఫీ ఆదాయ గెడైన్స్ 2014-15లో 7 శాతానికి పరిమితం కావొచ్చని క్రెడిట్ సూసీ పేర్కొంది. ఇతర దిగ్గజాల పరిస్థితేంటి... క్యూ3 సీజనల్‌గా బలహీన ధోరణి ఉంటుందని.. అధిక సెలవుల కారణంగా కీలక మార్కెట్లలోని కొన్ని ప్రధాన రంగాలకు చెందిన క్లయింట్ల నుంచి వచ్చే ఆదాయాలపై ప్రభావమే కారణమంటూ టీసీఎస్ ఇప్పటికే సంకేతాలిచ్చింది. దీనికితోడు కరెన్సీ కుదుపులు కూడా తోడవుతాయని డాయిష్ బ్యాంక్ విశ్లేషకుడు అనిరుద్ధ భోశాలే చెప్పారు. ఇన్ఫోసిస్, విప్రో కంటే టీసీఎస్‌పై ఈ అంశాలు అధిక ప్రభావం చూపొచ్చన్నారు. టీసీఎస్ డాలరు ఆదాయాల వృద్ధి క్యూ3లో 0.8%కే(సీక్వెన్షియల్‌గా) పరిమితం కావచ్చనేది డాయిష్ బ్యాంక్ అంచనా. అదేవిధంగా హెచ్‌సీఎల్ టెక్ మార్జిన్లపైనా కరెన్సీ ప్రతికూలతలు ప్రభావం చూపనున్నాయని.. కంపెనీ వేతన పెంపులు డిసెంబర్ క్వార్టర్లో ప్రతిబింభించడం కూడా దీనికి మరో కారణంగా పరిశీలకులు చెబుతున్నారు. ఇన్ఫోసిస్ ఆదాయ వృద్ధి సీక్వెన్షియల్‌గా డాలర్లలో 1.2 శాతంగా ఉంటుందని డాయిష్ బ్యాంక్ పేర్కొంది. అయితే, టెక్ మహీంద్రా మాత్రం కాస్త మెరుగైన పనితీరును నమోదు చేసే అవకాశం ఉందని.. త్రైమాసిక ప్రాతిపదికన క్యూ3లో డాలరు ఆదాయాల్లో వృద్ధి 3.8%గా అంచనా వేసింది. అయితే, స్థిర కరెన్సీ ప్రాతిపదికన దేశీ టాప్ కంపెనీల ఆదాయాల వృద్ధి 2.2-3.5% మేర ఉంటుందన్న అంచనాలున్నాయి. -
హెచ్‌సీఎల్ టెక్ భేష్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ జవనరి-మార్చి(క్యూ3)లో ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. నికర లాభం 59% ఎగసి రూ. 1,624 కోట్లను తాకింది. గతేడాది క్యూ3లో రూ. 1,021 కోట్లను మాత్రమే ఆర్జించింది. కంపెనీ జూలై-జూన్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. ఇక ఇదే కాలానికి ఆదాయం కూడా దాదాపు 30% పుంజుకుని రూ. 8,349 కోట్లకు చేరింది. గతంలో రూ. 6,430 కోట్లు నమోదైంది. ఇక డాలర్ల రూపేణా చూస్తే... నికర లాభం 40% వృద్ధితో 26.42 కోట్ల డాలర్లకు చేరగా, 14% అధికంగా 136 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. కాగా, త్రైమాసిక ప్రాతిపదికన కూడా 3% స్థాయిలో వృద్ధిని చూపగలిగినట్లు హెచ్‌సీఎల్ టెక్ ప్రెసిడెంట్ అనంత్ గుప్తా చెప్పారు. వరుసగా 10వ క్వార్టర్లో మార్జిన ్లను పెంచుకోగలిగినట్లు తెలిపారు. అక్టోబర్-డిసెంబర్(క్యూ2) కాలంతో పోలిస్తే క్యూ3లో నికర లాభం 8.5% పుంజుకోగా, ఆదాయం 2% వృద్ధిని సాధించినట్లు వివరించారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సేవలను అందించడం ద్వారా కాంట్రాక్ట్‌లను పెంచుకున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో అనిల్ చనానా చెప్పారు. సాధారణ, పాలనా సంబంధ వ్యయాలను కట్టడి చేయడం ద్వారా మార్జిన్లను 15.9% నుంచి 19.4%కు మెరుగుపరచుకున్నట్లు తెలిపారు. ఇతర విశేషాలివీ... వాటాదారులకు షేరుకి రూ. 4 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. క్యూ3లో స్థూలంగా 8,291 మందికి ఉద్యోగాలను కల్పించగా, నికరంగా 1,858 మంది మిగిలారు. మార్చి చివరికల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 90,190గా నమోదైంది. 50 మిలియన్ డాలర్లు, 30 మిలియన్ డాలర్ల విభాగంలో కొత్తగా ఇద్దరేసి చొప్పున క్లయింట్లను పొందింది. నగదు, తత్సమాన నిల్వల విలువ దాదాపు రూ. 1,046 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు ఇంట్రాడేలో 3% ఎగసి గరిష్టంగా రూ.1,455ను తాకింది. చివరికి 1% లాభంతో రూ. 1,424 వద్ద ముగిసింది. -
అపోలో హాస్పిటల్స్ లాభం 83 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపోలో హాస్పిటల్స్ డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసిక ఆదాయంలో 16%, నికరలాభంలో 3.5% వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలానికి రూ.81 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ.83 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఆదాయం రూ.856 కోట్ల నుంచి రూ.993 కోట్లకు పెరిగింది. ఫార్మా ఆదాయం 23% వృద్ధితో రూ.291 కోట్ల నుంచి రూ.357 కోట్లకు చేరుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 8 ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నట్లు అపోలో హాస్పిటల్స్ ప్రకటించింది. ఈ 8 హాస్పిటల్స్ ద్వారా అదనంగా 1,000 పడకలు జత కానున్నాయి. నెల్లూరు(200 పడకలు), నాసిక్ (125 పడకలు), ఇండోర్(120 పడకలు) వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి రానున్నాయి. గత 12 నెలల్లో 540 ప డకల సామర్థ్యంతో 3 హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేసిన ట్లు అపోలో ఒక ప్రకటనలో పేర్కొంది. 1983లో ప్రారంభమైన అపోలో హస్పిటల్స్ ప్రస్తుతం భారత్‌తో పా టు శ్రీలంక, బంగ్లాదేశ్, ఘనా, నైజీరియా, మారిషస్, ఖతర్, ఒమన్లలో ఆసుపత్రులను నిర్వహిస్తోంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో అపోలో షేరు నామమాత్ర నష్టంతో రూ. 945 వద్ద ముగిసింది.