అదరగొట్టిన ఇన్ఫీ...దూసుకుపోతున్న షేర్
ముంబై: భారతీయ దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ టెక్నాలజీ క్యూ 3లో ఆశ్చర్యకరమైన ఫలితాలను నమోదు చేసింది. మూడవ త్రైమాసిక ఫలితాల్లో అంచనాలకు మించి రాణించింది. గురువారం ప్రకటించిన ఆర్థిక ఫలితాలు విశ్లేషకులను సైతం విస్మయపర్చాయి. ఫలితంగా మార్కెట్లో ఈ షేర్లు లాభాల్లో దూసుకు పోతోంది. 5 శాతం లాభాలతో ఈనాటి స్టాక్ మార్కెట్లో లాభాలను ఆర్జిస్తున్న ఏకైక షేర్గా నిలచింది.
ఇన్ఫోసిస్ 1.94 శాతం లాభంతో రూ 3.465 నికర లాభాన్ని సాధించింది. 1.7 శాతంతో రూ. 15.902 కోట్ల ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. 2016 ఆర్థిక సంవత్సరానికి వద్ద డాలర్ ఆదాయం 10-12 శాతం వృద్ధి ని నమోదు చేసింది.. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి బలహీనపడటంతో ఇన్ఫీ లాభాలు భారీగా పెరిగాయి. 2016 ఆర్థిక సంవత్సరానికి 8.9 - 9.3 శాతం ఉంటుందనే అంచనాలను దాటి 12.8-13.2 వృద్ధిని సాధించింది.
దీంతో గత కొన్ని రోజులుగా నష్టాలను చవిచూస్తున్న దలాల్ స్ట్రీట్లో పెట్టుబడిదారులకు భారీ ఉపశమనం కలిగింది. మరోవైపు ఈ మధ్య ప్రకటించిన మరో ఐటి దిగ్గజం టీసీఎస్ ఫలితాలు వరుసగా నిరాశ పర్చడంతో ఇన్ఫీ మెరుగైన లాభాలు మెరుపులు మెరిపించింది.