
ముంబై: ఆఖరి గంటలో అధిక వెయిటేజీ రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు సోమవారం ఇంట్రాడే నష్టాలను భర్తీ చేసుకొని స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం నుంచీ సానుకూల సంకేతాలు అందిపుచ్చుకున్నాయి. ట్రే డింగ్‌లో 501 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 79 పాయింట్ల లాభంతో 65,402 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 170 పాయింట్ల పతనం నుంచి తేరుకొని ఆరు పాయింట్ల స్వల్ప లాభంతో 19,435 వద్ద ముగిసింది. మెటల్, బ్యాంక్స్, ఫైనాన్స్, ఇంధన, ఫార్మా, కన్జూమర్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఎక్సే్చంజీలకు సెలవు ప్రకటించారు.
► అదానీ పోర్ట్స్ ఆడిటర్ బాధ్యతల నుంచి డెలాయిట్ ని్రష్కమణతో అదానీ గ్రూప్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అత్యధికంగా అంబుజా సిమెంట్స్ షేరు 3.50% పతనమైంది. ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు 3.26% నష్టపోయింది. అదానీ ట్రాన్స్‌మిషన్స్ 2.50%, ఏసీసీ, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ విల్మార్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 2% వరకు నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ 1.50%, ఎన్‌డీటీ 1.30%, అదానీ పవర్ ఒక శాతం పతనయ్యాయి.
► రూ.880 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో గతవారం ఐపీఓకు వచి్చన టీవీఎస్ సప్లై చివరి రోజు నాటికి 2.78 రెట్ల సబ్‌్రస్కిప్షన్ సాధించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 2.51 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయగా మొత్తం 6.98 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment