Revenue Guidance
-
Infosys Q1 Results: అంచనాలు మిస్, రెవెన్యూ గైడెన్స్ కోత
Infosys Q1 results: దేశీయ రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ త్రైమాసికం ఫలితాల్లో అంచనాలను అందుకోలేకపోయింది. జూన్ 30తో ముగిసిన క్వార్టర్లో నికర లాభం 11 శాతం పెరిగి రూ.5,945 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.5,360 కోట్లతో పోలిస్తే లాభాలు 10.9 ఎగిసాయి. అయితే, రూ. 6,141 కోట్ల లాభం సాధిస్తుందన్న ఎనలిస్టుల అంచనాలనుమిస్ చేసింది. (లగ్జరీ కార్ల పిచ్చి! సూపర్ స్పోర్ట్స్‌కారు కొన్న బాలీవుడ్ యాక్టర్, వీడియో) స్థిరమైన కరెన్సీ (CC) పరంగా, కంపెనీ ఆదాయం సంవత్సరానికి 4.2 శాతం పెరిగి రూ. 37,933 కోట్లకు చేరుకుంది. అయితే ఈ త్రైమాసికంలో నిర్వహణ మార్జిన్ 20.8 శాతం వద్ద స్థిరంగా ఉంది. త్రైమాసికంలో దీని అట్రిషన్ 17.3 శాతానికి తగ్గింది. ప్రస్తుత ఏడాది కంపెనీ ఆదాయ మార్గదర్శకాన్ని 1 శాతం- 3.5 శాతానికి సవరించింది. ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ 20-22 శాతంగా ఉంచింది. (మరో వివాదంలో ఓలా ఎలక్ట్రిక్: సోషల్ మీడియాలో ఫోటో వైరల్) క్యాస్ట్ ఆప్టిమైజేషన్‌పై తమ దృష్టి నేపథ్యంలో అనిశ్చిత స్థూల వాతావరణంలో క్యూ1లో ఆపరేటింగ్ మార్జిన్లు నిలకడగా ఉన్నాయని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిలంజన్ రాయ్ అన్నారు. 4.2 శాతం పటిష్టమైన Q1 వృద్ధిపట్ట ఇన్ఫోసిస్ సీఎండీ సలీల్ పరేఖ్ సంతృప్తిని వ్యక్తం చేశారు . భారీ ఒప్పందాల ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ ఇదే భవిష్యత్ వృద్ధికి బలమైన పునాదిని వేస్తుందన్నారు. (కాగ్నిజెంట్ సీఈవో కీలక నిర్ణయం: ఉద్యోగుల్లో ఉత్సాహం) ఇదీ చదవండి: సినిమాలకు బ్రేక్: సమంతకు ఆర్థికంగా అన్ని కోట్లు నష్టమా? -
గైడెన్స్‌లో మళ్లీ నిరాశపరిచిన టెక్ దిగ్గజం
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ మరోసారి ఆదాయ అంచనాల్లో(గైడెన్స్‌లో) నిరాశపరిచింది. నేడు ప్రకటించిన సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాల్లో కంపెనీ 2018 ఆర్థిక సంవత్సరపు గైడెన్స్‌ను 6.5-8.5 శాతం నుంచి 5.5-6.5 శాతానికి తగ్గించింది. కంపెనీ లాభాల్లో ఏడాది ఏడాదికి 7 శాతం పెరిగి రూ.3726 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్టు రిపోర్టు చేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ లాభాలు రూ.3,606 కోట్లగా ఉన్నాయి. సీక్వెన్షియల్ బేసిస్‌గా కంపెనీ ప్రాఫిట్ 3.4 శాతం పెరిగింది. ఇన్ఫీ చైర్మన్‌గా నందన్ నిలేకని పునరాగమనంతో తర్వాత విడుదలైన తొలి క్వార్టర్లీ ఫలితాలు ఇవే. డాలర్ లెక్కలో ఈ కంపెనీ రెవెన్యూలు సీక్వెన్షియల్‌గా 2.9 శాతం పెరిగాయి. రూ.17,078 కోట్లగా ఉన్న రెవెన్యూలు రూ.17,567 కోట్లగా ఉన్నాయి. అదేవిధంగా స్థిర కరెన్సీ విలువల్లో క్వార్టర్ క్వార్టర్‌కు రెవెన్యూ వృద్ధి 5.4 శాతంగా ఉంది. ఈ క్వార్టర్లో కంపెనీ మార్జిన్లు 24.2 శాతం పెరిగాయి. ఒక్కో షేరుకు రూ.13 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. -
స్ట్రీట్ అంచనాలు బీట్ చేసిన ఇన్ఫీ
ముంబై: దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్ ఫలితాలు అంచనాలు తప్పగా.. రెండో దిగ్గజం ఇన్ఫోసిస్ విశ్లేషకుల అంచనాలను బీట్ చేసింది. నేడు ప్రకటించిన 2017-18 జూన్ క్వార్టర్ ఫలితాల్లో ఇన్ఫోసిస్ అంచనా వేసిన దానికంటే మెరుగైన ప్రదర్శననే కనబర్చి, నికర లాభాలు రూ.3,483 కోట్లగా నమోదుచేసింది. కీలక క్లయింట్ల సహకారంతో మెరుగైన ఫలితాలను నమోదుచేసినట్టు కంపెనీ నేడు బీఎస్ఈకి సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే సీక్వెన్షియల్‌గా మాత్రం కంపెనీ నికరలాభాలు 3.3 శాతం పడిపోయాయి. అంచనాల ప్రకారం ఇన్ఫీకి రూ.3,429 కోట్ల లాభాలు మాత్రమే వస్తాయని విశ్లేషకులు భావించారు. గత క్వార్టర్లో కంపెనీ లాభాలు రూ.3,603 కోట్లగా ఉన్నాయి. రెవెన్యూలు కూడా స్వల్పంగా 0.2 శాతం క్షీణించి రూ.17,078 కోట్లగా నమోదయ్యాయి. అయితే డాలర్ రెవెన్యూ వృద్ధి 3.2 శాతం పైకి ఎగిసి 2,651 మిలియన్ డాలర్లుగా ఉంది. స్థిరమైన కరెన్సీ రెవెన్యూ వృద్ధి కూడా 2.7 శాతంగా నమోదైంది. కంపెనీ ఈ ఆర్థిక సంవత్సర డాలర్ రెవెన్యూ వృద్ధి గైడెన్స్‌ను పెంచింది. ముందస్తు 6.1-8.1 శాతంగా ఉన్న గైడెన్స్‌ను 7.1-9.1 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. స్థిరమైన కరెన్సీ రెవెన్యూ వృద్ధి గైడెన్స్‌ను స్థిరంగా 6.5-8.5 శాతంగా ఉంచింది. ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్‌ను కూడా ప్రస్తుతమున్న 23-25 శాతాన్నే కొనసాగిస్తున్నట్టు పేర్కొంది. కంపెనీ రూ.13వేల కోట్ల నగదును డివిడెండ్ లేదా బైబ్యాక్ రూపంలో ఇన్వెస్టర్లకు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ క్వార్టర్లో గ్రాస్ అడిక్షన్ 59కి పెరిగింది. 25 మిలియన్ డాలర్ల కేటగిరీలో 6 గురు క్లయింట్లను చేర్చుకున్నట్టు తెలిపింది. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం జూమ్
-
హెచ్‌సీఎల్ టెక్ లాభం జూమ్
క్యూ4లో 27 శాతం వృద్ధి; రూ.2,475 కోట్లు ► ఒక్కో షేర్ కు రూ.6 డివిడెండ్ ► ఆశావహంగా రెవెన్యూ గైడెన్స్ న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2016–17, క్యూ4)లో 27 శాతం పెరిగింది. 2015–16 క్యూ4లో రూ.1,939 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.2,475 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తెలిపింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా చూస్తే నికర లాభం 12 శాతం పెరిగిందని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ సి. విజయ్‌కుమార్ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.10,925 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ.13,183 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఆదాయం–రూపాయల్లో 13 శాతం, డాలర్లలో 15 శాతం చొప్పున వృద్ధి చెందిందని వివరించారు. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఈ డివిడెండ్‌కు ఈ నెల 25 రికార్డ్ డేట్అని, వచ్చే నెల 2న చెల్లింపులు జరుపుతామని తెలిపారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17 ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 53 శాతం వృద్ధితో రూ.8,606 కోట్లకు, మొత్తం ఆదాయం 52 శాతం వృద్ధితో రూ.48,641 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఆశావహ అంచనాలు మంచి ఆర్థిక ఫలితాలు సాధించామని విజయ్‌కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. అధిక వృద్ధి అవకాశాలున్న విభాగాలపై పెట్టుబడుల జోరు పెంచుతామని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 10.5–12.5 శాతం వృద్ధి చెందగలదని అంచనా వేస్తున్నామన్నారు. నిర్వహణ లాభం 19.5–20.5 శాతం రేంజ్లో ఉండగలదని పేర్కొన్నారు. అంచనాలను మించి... కంపెనీ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయని నిపుణులంటున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్‌లతో పోల్చితే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మంచి వృద్ధి సాధించిందని తెలిపారు. నికర లాభంలో టీసీఎస్ 4.2 శాతం, ఇన్ఫోసిస్ 3.4 శాతం చొప్పున వృద్ధి సాధించగా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 27 శాతం వృద్ధి సాధించడం విశేషం. పన్ను రివర్సల్ కారణంగా నికర లాభం పెరిగిందని. ప్రముఖంగా ప్రస్తావించదగ్గ విషయం కంపెనీ రెవెన్యూ గైడెన్స్ అని షేర్‌ఖాన్ బ్రోకరేజ్ సంస్థ వ్యాఖ్యానించింది. ఐటీ రంగంలో కొనుగోలు రేటింగ్‌ను ఇచ్చింది. ఐటీ కంపెనీలకు ఆటోమేషన్, డిజిటలైజేషన్ వంటి కొత్త అవకాశాలు లభిస్తుండగా, వీసా నిబంధనలు కఠినతరం కావడం వంటి సమస్యలు తప్పట్లేదు. కాగా ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ 0.4 శాతం నష్టపోయి రూ.839 వద్ద ముగిసింది. వీసా సమస్యల్లేవ్ వీసా నిబంధనలను అమెరికా కఠినతరం చేయడం తమపై పెద్దగా ప్రభావం చూపబోదని విజయకుమార్ వివరించారు. తమ ఉద్యోగుల్లో 55 శాతం మంది స్థానికులే ఉంటారని పేర్కొన్నారు. అమెరికాలో తమకు 12 సెంటర్లున్నాయని, వీటిల్లో 12,000కు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. వీరిలో సగానికి పైగా అమెరికన్లేనని తెలిపారు. తమ కంపెనీ మొత్తం ఆదాయంలో 63 శాతం వరకూ అమెరికా మార్కెట్ నుంచే వస్తోందని విజయ్‌కుమార్ వివరించారు. ఈ ఏడాది మార్చినాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,15,973గా ఉందని, సమీక్షా క్వార్టర్లో కొత్తగా 10,605 మందికి ఉద్యోగాలిచ్చామని వివరించారు. కాగా రూ.3,500 కోట్ల షేర్ల బైబ్యాక్ మరో రెండు నెలల్లో ముగియగలదని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఎఫ్ఓ అనిల్ చనానా పేర్కొన్నారు. ఈ ఏడాది రిటర్న్స్ ఆన్ ఈక్విటీ (ఆర్ఓఈ) 27 శాతంగా ఉండగలదని తెలిపారు. -
అదరగొట్టిన ఇన్ఫీ...దూసుకుపోతున్న షేర్
ముంబై: భారతీయ దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ టెక్నాలజీ క్యూ 3లో ఆశ్చర్యకరమైన ఫలితాలను నమోదు చేసింది. మూడవ త్రైమాసిక ఫలితాల్లో అంచనాలకు మించి రాణించింది. గురువారం ప్రకటించిన ఆర్థిక ఫలితాలు విశ్లేషకులను సైతం విస్మయపర్చాయి. ఫలితంగా మార్కెట్లో ఈ షేర్లు లాభాల్లో దూసుకు పోతోంది. 5 శాతం లాభాలతో ఈనాటి స్టాక్ మార్కెట్లో లాభాలను ఆర్జిస్తున్న ఏకైక షేర్‌గా నిలచింది. ఇన్ఫోసిస్ 1.94 శాతం లాభంతో రూ 3.465 నికర లాభాన్ని సాధించింది. 1.7 శాతంతో రూ. 15.902 కోట్ల ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. 2016 ఆర్థిక సంవత్సరానికి వద్ద డాలర్ ఆదాయం 10-12 శాతం వృద్ధి ని నమోదు చేసింది.. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి బలహీనపడటంతో ఇన్ఫీ లాభాలు భారీగా పెరిగాయి. 2016 ఆర్థిక సంవత్సరానికి 8.9 - 9.3 శాతం ఉంటుందనే అంచనాలను దాటి 12.8-13.2 వృద్ధిని సాధించింది. దీంతో గత కొన్ని రోజులుగా నష్టాలను చవిచూస్తున్న దలాల్ స్ట్రీట్‌లో పెట్టుబడిదారులకు భారీ ఉపశమనం కలిగింది. మరోవైపు ఈ మధ్య ప్రకటించిన మరో ఐటి దిగ్గజం టీసీఎస్ ఫలితాలు వరుసగా నిరాశ పర్చడంతో ఇన్ఫీ మెరుగైన లాభాలు మెరుపులు మెరిపించింది. -
కాగ్నిజంట్ నికర లాభం 15 శాతం వృద్ధి
ముంబై: సాఫ్ట్వేర్ అవుట్సోర్సింగ్ సంస్థ కాగ్నిజంట్ టెక్నాలజీ నికర లాభం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి 15 శాతం వృద్ధి చెందింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 27.69 కోట్ల డాలర్లుగా ఉన్న నికర లాభం, ఈ ఏడాది ఇదే క్వార్టర్‌కు 31.96 కోట్ల డాలర్లకు పెరిగిందని కంపెనీ మంగళవారం తెలిపింది. ఆదాయం 22 శాతం వృద్ధితో 231 కోట్ల డాలర్లకు పెరిగిందని పేర్కొంది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన 7 శాతం వృద్ధి సాధించామని వివరించింది. అవుట్ సోర్సింగ్ సర్వీసులకు డిమాండ్ పెరగడం, కన్సల్టింగ్, టెక్నాలజీ సర్వీసులపై కంపెనీలు వ్యయాలను పెంచడం వంటి కారణాల వల్ల తమ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయని కాగ్నిజంట్ ప్రెసిడెంట్ గోర్డన్ కోబర్న్ చెప్పారు. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 75 శాతం మంది భారత్‌లోనే పనిచేస్తున్నారు. ఆర్థిక ఫలితాలు బావుండటంతో ఈ ఏడాది గెడైన్స్‌ను కంపెనీ పెంచింది. 2012 ఆదాయంతో పోల్చితే 2013 ఆదాయం కనీసం 20 శాతం వృద్ధితో 884 కోట్ల డాలర్లకు పెరగవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది.