స్ట్రీట్ అంచనాలు బీట్ చేసిన ఇన్ఫీ
స్ట్రీట్ అంచనాలు బీట్ చేసిన ఇన్ఫీ
Published Fri, Jul 14 2017 10:00 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM
ముంబై: దేశంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ టీసీఎస్ ఫలితాలు అంచనాలు తప్పగా.. రెండో దిగ్గజం ఇన్ఫోసిస్ విశ్లేషకుల అంచనాలను బీట్ చేసింది. నేడు ప్రకటించిన 2017-18 జూన్ క్వార్టర్ ఫలితాల్లో ఇన్ఫోసిస్ అంచనా వేసిన దానికంటే మెరుగైన ప్రదర్శననే కనబర్చి, నికర లాభాలు రూ.3,483 కోట్లగా నమోదుచేసింది. కీలక క్లయింట్ల సహకారంతో మెరుగైన ఫలితాలను నమోదుచేసినట్టు కంపెనీ నేడు బీఎస్‌ఈకి సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే సీక్వెన్షియల్‌గా మాత్రం కంపెనీ నికరలాభాలు 3.3 శాతం పడిపోయాయి. అంచనాల ప్రకారం ఇన్ఫీకి రూ.3,429 కోట్ల లాభాలు మాత్రమే వస్తాయని విశ్లేషకులు భావించారు. గత క్వార్టర్‌లో కంపెనీ లాభాలు రూ.3,603 కోట్లగా ఉన్నాయి. రెవెన్యూలు కూడా స్వల్పంగా 0.2 శాతం క్షీణించి రూ.17,078 కోట్లగా నమోదయ్యాయి.
అయితే డాలర్ రెవెన్యూ వృద్ధి 3.2 శాతం పైకి ఎగిసి 2,651 మిలియన్ డాలర్లుగా ఉంది. స్థిరమైన కరెన్సీ రెవెన్యూ వృద్ధి కూడా 2.7 శాతంగా నమోదైంది. కంపెనీ ఈ ఆర్థిక సంవత్సర డాలర్ రెవెన్యూ వృద్ధి గైడెన్స్‌ను పెంచింది. ముందస్తు 6.1-8.1 శాతంగా ఉన్న గైడెన్స్‌ను 7.1-9.1 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. స్థిరమైన కరెన్సీ రెవెన్యూ వృద్ధి గైడెన్స్‌ను స్థిరంగా 6.5-8.5 శాతంగా ఉంచింది. ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్‌ను కూడా ప్రస్తుతమున్న 23-25 శాతాన్నే కొనసాగిస్తున్నట్టు పేర్కొంది. కంపెనీ రూ.13వేల కోట్ల నగదును డివిడెండ్ లేదా బైబ్యాక్ రూపంలో ఇన్వెస్టర్లకు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ క్వార్టర్‌లో గ్రాస్ అడిక్షన్ 59కి పెరిగింది. 25 మిలియన్ డాలర్ల కేటగిరీలో 6 గురు క్లయింట్లను చేర్చుకున్నట్టు తెలిపింది.
Advertisement
Advertisement