Q1
-
కాపెక్స్ వ్యయంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ - వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కాపెక్స్ (మూలధనం) వ్యయంలో ఇతర రాష్ట్రాలకంటే కూడా ముందంజలో అగ్రగామిగా అవతరించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) డేటా ప్రకారం.. ఏప్రిల్ - జూన్ కాలంలో ఆంధ్రప్రదేశ్ మూలధన వ్యయంలో రూ. 12,669 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. కాగా FY24కి రాష్ట్ర కాపెక్స్ బడ్జెట్ రూ. 31,061 కోట్లుతో 41 శాతంగా ఉంది. ఇక్కడ తెలుసుకోవలసిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తెలంగాణ మూలధన వ్యయం కూడా గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 8 శాతంతో పోలిస్తే FY24 బడ్జెట్లో 27 శాతానికి పెరిగింది. క్యూ1లో వార్షిక లక్ష్యంలో 20 శాతానికి పైగా సాధించిన ఇతర రాష్ట్రాలుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఉన్నాయి. 20 రాష్ట్రాల కాపెక్స్ ఖర్చులను విశ్లేషించిన రేటింగ్ ఏజెన్సీ.. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లు కలిసి మొదటి త్రైమాసికంలో మొత్తం క్యాపెక్స్‌లో 56.4 శాతంగా ఉన్నాయని పేర్కొంది. పటిష్టమైన పన్ను వసూళ్లు, వ్యయం తగ్గడం, ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో సబ్సిడీలు, జీతాల చెల్లింపుల ద్వారా కాపెక్స్ వృద్ధి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ తన బడ్జెట్ రెవెన్యూ రాబడిలో క్యూ1లో 22 శాతాన్ని సాధించింది. ఇది క్రితం సంవత్సరం త్రైమాసికంలో 18 శాతంగా ఉంది. గత సంవత్సరంతో పోల్చితే ఈ త్రైమాసికంలో వడ్డీ, పెన్షన్, సబ్సిడీ చెల్లింపులు వంటి వ్యయాలను నియంత్రించడంలో కూడా రాష్ట్రం బాగా పనిచేసింది. -
ఐటీసీ లాభం జూమ్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 16% ఎగసి రూ. 5,180 కోట్లను అధిగమించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 4,462 కోట్లు ఆర్జించింది. నిర్వహణ ఆదాయం మాత్రం రూ. 19,831 కోట్ల నుంచి రూ. 18,639 కోట్లకు తగ్గింది. ఇది 6% క్షీణతకాగా.. మొత్తం వ్యయాలు సైతం 13% తగ్గి రూ. 12,422 కోట్లకు పరిమితమయ్యాయి. ఇక మొత్తం టర్నోవర్ 4% నీరసించి రూ. 19,362 కోట్లుగా నమోదైంది. విభాగాలవారీగా..: తాజా క్యూ1లో ఐటీసీ.. ఎఫ్ఎంసీజీ విభాగం 13 శాతంపైగా వృద్ధితో రూ. 13,528 కోట్ల ఆదాయాన్ని సాధించింది. దీనిలో సిగరెట్ల బిజినెస్ నుంచి 12 శాతం అధికంగా రూ. 8,356 కోట్లు అందుకుంది. హోటళ్ల బిజినెస్ 8% బలపడి రూ. 625 కోట్ల ఆదాయం అందుకుంది. ‘హోటల్’ షేర్ల జారీ తీరిదీ..: ఐటీసీ హోటల్స్ పేరుతో ఆతిథ్య రంగ బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా ఐటీసీ విడదీస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కంపెనీ బోర్డు 1:10 నిష్పత్తిలో షేర్ల జారీకి ఆమోదముద్ర వేసినట్లు ఐటీసీ పేర్కొంది. వాటాదారులకు ఐటీసీలోగల ప్రతీ 10 షేర్లకుగాను 1 ఐటీసీ హోటల్ షేరును కేటాయించనుంది. షేర్ల జారీ తదుపరి ఐటీసీ హోటల్స్‌లో 60% వాటాను ఐటీసీ వాటాదారులు పొందనుండగా.. ఐటీసీ 40% వాటాను కలిగి ఉండనుంది. హోటల్ షేర్లు త్వరలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్‌కానున్నాయి. ఐటీసీ హోటల్స్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేసేందుకు సుమారు 15 నెలలు పట్టవచ్చని ఐటీసీ తాజాగా అంచనాలు ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో నామమాత్ర లాభంతో రూ. 449 వద్ద ముగిసింది. -
అరబిందో ఫార్మా లాభం రూ. 571 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 571 కోట్ల లాభం నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన రూ. 521 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 10 శాతం అధికం. ఇక సమీక్షాకాలంలో ఆదాయం 10 శాతం వృద్ధి చెంది రూ. 6,236 కోట్ల నుంచి రూ. 6850 కోట్లకు చేరింది. సమీక్షాకాలంలో అమెరికా మార్కెట్లో ఫార్ములేషన్స్ విభాగం ఆదాయం 11 శాతం పెరిగి రూ. 3,304 కోట్లకు, యూరప్ ఆదాయం 18 శాతం వృద్ధి చెంది రూ. 1,837 కోట్లకు చేరినట్లు సంస్థ తెలిపింది. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల కోసం ఆదాయంలో సుమారు 6 శాతాన్ని (రూ. 388 కోట్లు) వెచ్చించినట్లు వివరించింది. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని పటిష్టమైన వృద్ధి, మార్జిన్లతో సానుకూలంగా ప్రారంభించడం సంతోషకరమైన అంశమని సంస్థ వైస్ చైర్మన్ కె. నిత్యానంద రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లోనూ తమ వృద్ధి వ్యూహాలను పటిష్టంగా అమలు చేయగలమని, వాటాదారులకు దీర్ఘకాలికంగా మరిన్ని ప్రయోజనాలను చేకూర్చగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
ప్రభుత్వ బ్యాంకుల లాభాల జోరు..క్యూ1 ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆకర్షణీయ పనితీరు చూపాయి. మొత్తం 12 సంస్థలు ఉమ్మడిగా రూ. 34,774 కోట్ల నికర లాభం ఆర్జించాయి. గతేడాది(2022–23) క్యూ1(ఏప్రిల్–జూన్)లో ఆర్జించిన రూ. 15,306 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపుకాగా.. అధిక వడ్డీ రేట్ల పరిస్థితులు ఇందుకు సహకరించాయి. రుణ రేట్ల సవరణ కారణంగా పలు బ్యాంకుల వడ్డీ మార్జిన్లు బలపడ్డాయి. వెరసి నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 3 శాతానికిపైనే నమోదయ్యాయి. బీవోఎం అదుర్స్ పీఎస్‌యూ సంస్థలలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎన్ఐఎం అత్యధికంగా 3.86 శాతానికి చేరగా.. సెంట్రల్ బ్యాంక్ 3.62 శాతం, ఇండియన్ బ్యాంక్ 3.61 శాతం మార్జిన్లను సాధించాయి. నాలుగు సంస్థలు 100 శాతానికిపైగా నికర లాభంలో వృద్ధిని అందుకున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 307 శాతం అధికంగా రూ. 1,255 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఈ బాటలో నంబర్ వన్ సంస్థ ఎస్బీఐ నికర లాభం 178 శాతం దూసుకెళ్లి రూ. 16,884 కోట్లను తాకింది. ఇది బ్యాంక్ చరిత్రలోనే ఒక త్రైమాసికంలో రికార్డ్‌కాగా.. మొత్తం పీఎస్‌యూ బ్యాంకుల లాభాల్లో 50 శాతం వాటాను ఆక్రమించింది. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం 176 శాతం జంప్ చేసి రూ. 1,551 కోట్లకు చేరింది. గతేడాది మొత్తం లాభాల(రూ. 1.05 లక్షల కోట్లు)లోనూ ఎస్బీఐ నుంచి 50 శాతం సమకూరిన సంగతి తెలిసిందే. ఐదు బ్యాంకులు భేష్ క్యూ1లో ఐదు ప్రభుత్వ బ్యాంకులు 50–100 శాతం మధ్య లాభాలు ఆర్జించాయి. వీటిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 95 శాతం వృద్ధితో రూ. 882 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 88 శాతం అధికంగా రూ. 4,070 కోట్లు, యుకో బ్యాంక్ 81 శాతం వృద్ధితో రూ. 581 కోట్లు సాధించాయి. కేవలం పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ మాత్రమే 25 శాతం క్షీణతతో రూ. 153 కోట్ల నికర లాభం ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు పీఎస్‌యూ బ్యాంకుల పురోగతికి దోహదపడ్డాయి. గుర్తింపు, పరిష్కారం, పెట్టుబడులు, సంస్కరణల పేరుతో అమలు చేసిన వ్యూహాలు ఫలితాలినిచ్చాయి. దీంతో మొండి రుణాలు దశాబ్దకాలపు కనిష్టం 3.9 శాతానికి చేరాయి. ఇదే సమయంలో(గత ఎనిమిదేళ్లలో) మొండి రుణాల నుంచి రూ. 8.6 లక్షల కోట్ల రికవరీని సాధించాయి. 2017–21 మధ్య ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం రూ. 3,10,997 కోట్ల పెట్టుబడులను పీఎస్‌యూ బ్యాంకులకు అందించింది. -
మారుతీ లాభం హైస్పీడ్
న్యూఢిల్లీ: కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్ఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 2,525 కోట్లను తాకింది. పెద్ద కార్ల అమ్మకాలు ఊపందుకోవడం, మెరుగైన ధరలు, వ్యయ నియంత్రణలు, అధిక నిర్వహణేతర ఆదాయం ఇందుకు సహకరించాయి. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 1,036 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 26,512 కోట్ల నుంచి రూ. 32,338 కోట్లకు జంప్‌చేసింది. కాగా.. మాతృ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్(ఎస్ఎంసీ) నుంచి గుజరాత్‌లోని తయారీ ప్లాంటును సొంతం చేసుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది. తద్వారా క్లిష్టతను తగ్గిస్తూ ఒకే గొడుగుకిందకు తయారీ కార్యకలాపాలను తీసుకురానున్నట్లు తెలిపింది. కాంట్రాక్ట్ తయారీకి టాటా సుజుకీ మోటార్ గుజరాత్(ఎస్ఎంజీ)తో కాంట్రాక్ట్ తయారీ ఒప్పందం రద్దుకు బోర్డు అనుమతించినట్లు మారుతీ వెల్లడించింది. అంతేకాకుండా ఎస్ఎంసీ నుంచి ఎస్ఎంజీ షేర్లను సొంతం చేసుకోనున్నట్లు తెలిపింది. ఎస్ఎంసీకి పూర్తి అనుబంధ సంస్థ అయిన ఎస్ఎంజీ వార్షికంగా 7.5 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఉత్పత్తులను పూర్తిగా ఎంఎస్‌ఐకు సరఫరా చేస్తోంది. 2024 మార్చి31కల్లా లావాదేవీ పూర్తికాగలదని అంచనా వేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. 2030–31కల్లా 40 లక్షల వాహన తయారీ సామర్థ్యంవైపు కంపెనీ సాగుతున్నట్లు ఎంఎస్ఐ చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. వచ్చే ఏడాది తొలి బ్యాటరీ వాహనాన్ని విడుదల చేయడంతో సహా.. వివిధ ప్రత్యామ్నాయ టెక్నాలజీలవైపు చూస్తున్నట్లు చెప్పారు. 6 శాతం అప్ క్యూ1లో మారుతీ అమ్మకాలు 6%పైగా పుంజుకుని 4,98,030 వాహనాలకు చేరాయి. వీటిలో దేశీయంగా 9 శాతం వృద్ధితో 4,34,812 యూనిట్లను తాకగా.. ఎగుమతులు మాత్రం 69,437 యూనిట్ల నుంచి తగ్గి 63,218 వాహనాలకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు బీఎస్ఈలో 1.6 శాతం బలపడి రూ. 9,820 వద్ద ముగిసింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్యూ1 భేష్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 29 శాతం జంప్‌చేసి రూ. 12,370 కోట్లను అధిగమించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 9,579 కోట్లు మాత్రమే ఆర్జించింది. అయితే గతేడాది (2022–23) క్యూ4(జనవరి–మార్చి)లో ఆర్జించిన రూ. 12,594 కోట్లతో పోలిస్తే తాజా లాభం స్వల్పంగా తగ్గింది. ఇక మొత్తం ఆదాయం రూ. 44,202 కోట్ల నుంచి రూ. 61,021 కోట్లకు దూసుకెళ్లింది. నిర్వహణ వ్యయాలు 34 శాతం పెరిగి రూ. 15,177 కోట్లకు చేరాయి. ఈ జూలై 1 నుంచి బ్యాంక్ మాతృ సంస్థ, మారి్టగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్‌ను విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వడ్డీ ఆదాయం అప్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.12 శాతం నుంచి 1.17 శాతానికి నామమాత్రంగా పెరిగాయి. గతేడాది క్యూ4లో నమోదైన 1.28 శాతం నుంచి చూస్తే నీరసించాయి. ప్రస్తుత సమీక్షా కాలంలో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం సైతం 30 శాతం ఎగసి రూ. 11,952 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం 21 శాతం బలపడి రూ. 23,599 కోట్లకు చేరింది. ఇందుకు అడ్వాన్సుల(రుణాలు)లో నమోదైన 15.8 శాతం వృద్ధి, 4.1 శాతానికి బలపడిన నికర వడ్డీ మార్జిన్లు దోహదం చేశాయి. ఈ కాలంలో రూ. 9,230 కోట్ల ఇతర ఆదాయం ఆర్జించింది. ఇందుకు రూ. 552 కోట్లమేర ట్రేడింగ్ లాభాలు సహకరించాయి. గతేడాది క్యూ1లో ఈ పద్దుకింద రూ. 1,077 కోట్ల నష్టం ప్రకటించింది. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 3,122 కోట్ల నుంచి రూ. 2,860 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 18.9 శాతాన్ని తాకింది. ఇతర విశేషాలు... ► జూన్‌కల్లా బ్యాంకు మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,81,725కు చేరింది. ► అనుబంధ సంస్థ హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్ నికర లాభం రూ. 441 కోట్ల నుంచి రూ. 567 కోట్లకు జంప్ చేసింది. ► హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ లాభం దాదాపు యథాతథంగా రూ. 189 కోట్లుగా నమోదైంది. ► బ్యాంక్ మొత్తం బ్రాంచీల సంఖ్య 7,860కు చేరింది. వీటిలో 52 శాతం సెమీఅర్బన్, గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నాయి. ► గతేడాది 1,400 బ్రాంచీలను ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది సైతం ఈ బాటలో సాగనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. మార్కెట్ క్యాప్ రికార్డ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 2 శాతం బలపడి రూ. 1,679 వద్ద ముగిసింది. దీంతో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 12.65 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి మార్కెట్ విలువరీత్యా రిలయన్స్ ఇండస్ట్రీస్(రూ. 18.91 లక్షల కోట్లు), టీసీఎస్(రూ. 12.77 లక్షల కోట్లు) తర్వాత మూడో ర్యాంకులో నిలిచింది. అంతేకాకుండా డాలర్ల మార్కెట్ విలువలో 154 బిలియన్లకు చేరడం ద్వారా ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజాలు మోర్గాన్ స్టాన్లీ(144 బిలి యన్ డాలర్లు), బ్యాంక్ ఆఫ్ చైనా(138 బి.డా.), గోల్డ్‌మన్ శాక్స్(108 బి.డా.)లను దాటేసింది. ప్రపంచ బ్యాంకింగ్‌లో 7వ ర్యాంక్ ర్యాంక్ బ్యాంక్ పేరు మార్కెట్ క్యాప్ 1. జేపీ మోర్గాన్ 438 2. బ్యాంక్ ఆఫ్ అమెరికా 232 3. ఐసీబీసీ(చైనా) 224 4. అగ్రికల్చరల్ బ్యాంక్(చైనా) 171 5. వెల్స్ ఫార్గో 163 6. హెచ్ఎస్బీసీ 160 7. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 154 (విలువ బిలియన్ డాలర్లలో– విదేశీ బ్యాంకులు శుక్రవారం(14న) ధరల్లో) -
పటిష్ట బాటన భారత్ ఎకానమీ..!
ముంబై: బ్యాంకింగ్ రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 14.2 శాతం నమోదయినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాలు వెల్లడించాయి. 2021 ఇదే కాలంలో బ్యాంకింగ్ రుణ వృద్ధి 6 శాతం. గడచిన త్రైమాసికం (2022 జనవరి–మార్చి)లో ఈ రేటు 10.8 శాతంగా ఉంది. ఎకానమీ పురోగమన బాటలో ఉందనడానికి తాజా గణాంకాలు నిదర్శనమని నిపుణులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఆర్బీఐ మే నెల నుంచి ఆగస్టు వరకూ 1.40 (ప్రస్తుతం 5.40 శాతం) పెంచింది. ఇందులో జూన్ వరకూ పెరిగిందే 90 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం). ఈ పరిస్థితుల్లో బ్యాంకింగ్‌సైతం రుణ రేట్లను పెంచడం ప్రారంభించింది. అయినప్పటికీ పటిష్ట స్థాయిలో రుణ వృద్ధి రేటు నమోదుకావడాన్ని చూస్తే, వ్యవస్థలో డిమాండ్ పరిస్థితులు బాగున్నాయని స్పష్టమవుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘జూన్ త్రైమాసిక రుణ, డిపాజిట్ వృద్ధి 2022’ శీర్షికన ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులుసహా అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల నుంచి సమీకరించిన సమాచారం ఆధారంగా తాజా గణాంకాలు రూపొందాయి. ► దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విస్తృత ప్రాతిపదికన రుణ వృద్ధి నమోదయ్యింది. ► గడచిన ఐదు త్రైమాసికాల్లో డిపాజిట్ వృద్ధి రేటు 9.5 శాతం నుంచి 10.2 శాతం శ్రేణిలో ఉంది. ► జూన్ త్రైమాసికంలోని దేశ వ్యాప్తంగా మొత్తం డిపాజిట్లలో కరెంట్, సేవింగ్స అకౌంట్ (సీఏఎస్ఏ) నిష్పత్తి 73.5 శాతం. గత ఏడాది ఇదే సమయంలో ఈ నిష్పత్తి 70.5 శాతం. ఒక్క మొట్రోపాలిటన్ బ్రాంచీల్లో ఈ నిష్పత్తి వార్షికంగా చూస్తే 84.3 శాతం నుంచి 86.2 శాతానికి పెరిగింది. లిస్టెడ్ ప్రైవేటు కంపెనీల అమ్మకాలు 41 శాతం అప్ కాగా లిస్టెడ్ నాన్–ఫైనాన్స్ ప్రైవేటు కంపెనీల అమ్మకాలు జూన్ త్రైమాసికంలో 41 శాతం పెరిగి రూ.14.11 కోట్లుగా నమోదయినట్లు ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. 2021 ఇదే కాలంలో ఈ అమ్మకాల్లో 60.6 శాతం వృద్ధి నమోదుకాగా, 2022 జనవరి–మార్చిలో ఈ రేటు 22.3 శాతంగా ఉంది. -
టీసీఎస్ క్లారిటీ: ఉద్యోగులకు పండగే
సాక్షి,ముంబై: దేశంలోని మేజర్ ఐటీ కంపెనీలన్నీ వేరియబుల్ పే విషయంలో ఉద్యోగులకు షాకివ్వగా దేశీయ అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. మొదటి త్రైమాసికంలో తన ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ వేతనాన్ని చెల్లిస్తున్నట్లు స్పష్టం చేసింది. జూన్ క్వార్టర్లో సీనియర్ ఉద్యోగులకు వేరియబుల్ పే రోల్ అవుట్‌ను టీసీఎస్ ఒక నెల ఆలస్యం చేసిందన్న నివేదికల నేపథ్యంలో టీసీఎస్ ఈ క్లారిటీ ఇచ్చింది. పలు నివేదికల్లో తెలిపినట్టుగా 2022-23 ఆర్థిక సంవత్సరం మార్చి-జూన్ త్రైమాసికంలో సీ3ఏ, సీ3బీ, సీ 4, ఉద్యోగులకు వేరియబుల్ పే చెల్లింపు ఆలస్యం చేయడం లేదని తెలిపింది. సాధారణ ప్రక్రియ ప్రకారం వేరియబుల్ పే ఒకటి లేదా రెండు నెలల్లో చెల్లిస్తామని, ఈ ప్రక్రియలో ఎలాటి జాప్యం లేదని పేర్కొంది. 100 శాతం చెల్లిస్తామని టీసీఎస్ ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చింది. కాగా మార్జిన్లపై ఒత్తిడి, సప్లై చెయిన్ సమస్యలు, టెక్నాలజీలో కొత్త పెట్టుబడుల కారణంగా ఇన్ఫోసిస్, విప్రోతో సహా ఇతర ఐటీ మేజర్లు కూడా తమ ఉద్యోగుల వేరియబుల్ వేతనాన్ని తగ్గించడమో, లేదా ఆలస్యం చేసిందని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విప్రో సి-సూట్ స్థాయి ఎగ్జిక్యూటివ్‌లకు మేనేజర్ల వేరియబుల్ పేని కూడా నిలిపివేసినట్టు సమాచారం. ఫ్రెషర్స్ నుండి టీమ్ లీడర్లవరకు గ్రేడ్లలోని ఉద్యోగులు మొత్తం వేరియబుల్ పేలో 70 శాతం మాత్రమే పొందనున్నారని తెలుస్తోంది. -
41 శాతం పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు జూన్ త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 41 శాతం పెరిగినట్లు లోక్‌సభలో ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదురి వెల్లడించారు. 2021-22 ఇదే కాలంతో పోల్చిచూస్తే, ఈ విలువ రూ.2,50,881 కోట్ల నుంచి రూ.3,54,570 కోట్లకు చేరినట్లు ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. ఇక ఇదే కాలంలో వస్తు సేవల పన్ను, కస్టమ్స్ సుంకాలుసహా పరోక్ష పన్ను వసూళ్లు 9.4 శాతం పెరిగి రూ.3,14,476 కోట్ల నుంచి రూ.3,44,056 కోట్లకు ఎగసినట్లు ఆయన వెల్లడించారు. కేంద్రంపై పెరిగిన వడ్డీ భారం కేంద్రంపై వడ్డీ చెల్లింపుల భారం పెరిగినట్లు చౌదురి మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2021–22లో (జీడీపీ విలువలో) ఈ పరిమాణం 3.1 శాతంగా ఉందని, విలువలో ఇది రూ.7.31 లక్షల కోట్లని ఆయన తెలిపారు. 2014-15లో వడ్డీ చెల్లింపుల విలువ 3.27 లక్షల కోట్లయితే, జీడీపీలో ఇది 2.6 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 2014-15లో ప్రభుత్వంపై చెల్లింపుల భారం రూ.62.44 లక్షల కోట్లయితే (జీడీపీలో 50.1 శాతం), 2021-22లో ఈ విలువ రూ.138.88 లక్షల కోట్లని (జీడీపీలో 58.7 శాతం) వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ భారం 155.33 లక్షల కోట్లకు (60.2 శాతం) చేరే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. -
ఎంఅండ్ఏ డీల్స్ జోరు
ముంబై: ఈ క్యాలండర్ ఏడాది క్యూ1(జనవరి–మార్చి)లో దేశీయంగా విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్ఏ) విభాగం జోరందుకుంది. తొలి క్వార్టర్లో 30.3 బిలియన్ డాలర్ల విలువైన ఎంఅండ్ఏ లావాదేవీలు జరిగాయి. ఇవి గత నాలుగేళ్లలోనే అత్యధికంకాగా.. పరిమాణం రీత్యా 29.6 శాతం జంప్‌చేశాయి. వెరసి 2018లో నమోదైన 31.1 బిలియన్ డాలర్లను అధిగమించాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంఅండ్ఏ డీల్స్ క్షీణించగా.. దేశీ మార్కెట్లో ఊపందుకోవడం గమనార్హం! గతేడాది(2021) క్యూ1తో పోలిస్తే డీల్స్ విలువ 5.6 శాతం పుంజుకోగా.. పరిమాణం రీత్యా తొలి క్వార్టర్‌కు కొత్త రికార్డ్ నెలకొల్పాయి. ప్రపంచంలోనే ఫైనాన్షియల్ మార్కెట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గణాంకాలు అందించడంలో టాప్ ర్యాంకులో ఉన్న ఎల్ఎస్ఈజీ బిజినెస్(రెఫినిటివ్) రూపొందించిన గణాంకాలివి. దేశీ కంపెనీలు ఎంఅండ్ఏ లావాదేవీలలో దేశీ కంపెనీల డీల్స్ 8.3 శాతం తగ్గి 23.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దేశీ ఎంఅండ్ఏలు 24.5 శాతం క్షీణించి 12.1 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇన్‌బౌండ్(దేశంలోకి) డీల్స్ 18 శాతం ఎగసి 11.6 బిలియన్ డాలర్లను తాకాయి. 2017 తొలి క్వార్టర్ తదుపరి ఇవే అత్యధికం. విదేశాలలో 8.2 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్‌తో యూఎస్ అగ్రపథాన నిలవగా.. 39 శాతం జంప్‌చేశాయి. ఇన్‌బౌండ్ డీల్స్‌లో వీటి వాటా 70 శాతం! ఔట్‌బౌండ్(దేశం వెలుపలకు) డీల్స్ రెట్టింపునకుపైగా పెరిగి 5 బిలియన్ డాలర్లకు చేరాయి. 2010 తదుపరి ఇవి గరిష్టంకాగా.. 3.9 బిలియన్ డాలర్ల విలువైన 21 డీల్స్‌తో యూఎస్ టాప్‌లో నిలిచింది. ఇది 77 శాతం మార్కెట్ వాటాకు సమానం. బయోకాన్ డీల్ యూఎస్ సంస్థ వియాట్రిస్ ఇంక్‌కు చెందిన బయోసిమిలర్స్ బిజినెస్‌ను దేశీ కంపెనీ బయోకాన్ 3.335 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఇది అతిపెద్ద డీల్‌కాగా, యూఎస్ హెల్త్‌కేర్ విభాగంలోని ఔట్‌బౌండ్ డీల్స్‌లో సరికొత్త రికార్డుకావడం విశేషం! హైటెక్నాలజీ రంగంలో మెజారిటీ డీల్స్ జరిగాయి. వీటి మొత్తం విలువ 6.6 బిలియన్ డాలర్లు. గతేడాది క్యూ1తో పోలిస్తే రెట్టింపయ్యాయి. వీటి మార్కెట్ వాటా 21.8 శాతానికి సమానం. ఈ బాటలో హెల్త్‌కేర్ 4.7 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్‌తో 15.5 శాతం మార్కెట్ వాటాను సాధించింది. తదుపరి ఫైనాన్షియల్స్ 4.1 బిలియన్ డాలర్లతో 13.5 శాతం వాటాను పొందాయి. అయితే డీల్స్ విలువ 41 శాతానికిపైగా క్షీణించింది. 2020 నుంచి ప్రపంచవ్యాప్తంగా డీల్స్ కనిష్ట స్థాయికి చేరగా.. దేశీయంగా జోరందుకోవడం ప్రస్తావించదగ్గ అంశమని రెఫినిటివ్ సీనియర్ విశ్లేషకులు ఎలయిన్ ట్యాన్ పేర్కొన్నారు. పీఈ పెట్టుబడులు, నగదు నిల్వలు, చరిత్రాత్మక కనిష్టంలోని వడ్డీ రేట్లు వంటి కీలక అంశాలు ప్రభావం చూపినట్లు వివరించారు. పీఈ డీల్స్ పీఈ డీల్స్ భారీగా పెరిగి 9.8 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో హైటెక్నాలజీ విభాగం 28.7 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. అయితే ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్(ఈసీఎం) లావాదేవీలు 64 శాతంపైగా పడిపోయాయి. 2019 తదుపరి ఇవి కనిష్టంకాగా.. ఈసీఎం ఆఫరింగ్స్ 23.3 శాతం నీరసించాయి. దేశీయంగా ఐపీవో యాక్టివిటీ 57 శాతం తిరోగమించింది. వీటి సంఖ్య సైతం దాదాపు 15 శాతం తగ్గింది. క్యూ1లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ పీజు 33.5 శాతం వెనకడుగుతో 179.7 మిలియన్ డాలర్లకు పరిమితమైంది. 2016 తరువాత ఇది కనిష్టంకాగా.. అండర్‌రైటింగ్ 43 శాతంపైగా క్షీణించి 40.9 మిలియన్ డాలర్లను తాకింది. డెట్ క్యాపిటల్ మార్కెట్ అండర్‌రైటింగ్ పీజు 24 శాతం బలహీనపడి 2016 తరువాత కనిష్టంగా 49.1 బిలియన్ డాలర్లుగా నమోదైంది. -
అమ్మకాల్లో దూసుకెళ్తున్న మెర్సిడెస్ బెంజ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఈ ఏడాది జనవరి–మార్చిలో 4,022 యూనిట్లు విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 26 శాతం అధికం. సెమికండక్టర్ల కొరత, సరఫరా అడ్డంకులు, ముడి సరుకు, రవాణా వ్యయాలు పెరిగినప్పటికీ ఎస్‌యూవీలు, సెడాన్స్‌కు విపరీత డిమాండ్ ఉందని కంపెనీ తెలిపింది. 4,000 యూనిట్లకు పైగా ఉన్న అత్యధిక ఆర్డర్ బుక్ రాబోయే నెలల్లో సానుకూల దృక్పథానికి దారి తీస్తుందని వివరించింది. అమ్మకాల్లో ఈ–క్లాస్ లాంగ్ వీల్‌బేస్ సెడాన్, జీఎల్సీ, జీఎల్ఏ, జీఎల్ఈ ఎస్‌యూవీలు టాప్‌లో నిలిచాయి. ఏఎంజీ, సూపర్ లగ్జరీ కార్ల విభాగం 35 శాతం వృద్ధి చెందింది. ప్రస్తుతం మోడల్‌నుబట్టి వెయిటింగ్ పీరియడ్ అత్యధికంగా 11 నెలల వరకూ ఉంది. చదవండి: యజమానులు ఉద్యోగులకు కార్లు గిప్ట్ గా ఇస్తారా? ఇదిగో ఈయన ఇస్తున్నాడు!! -
జియోను వెనక్కినెట్టిన వోడాఫోన్ ఐడియా...!
Vi Leads Ookla Speed Test In First Quarter Of 2021: ప్రముఖ టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియా రికార్డును సృష్టించింది. మొబైల్ నెట్వర్క్ స్పీడ్ విషయంలో జియోను, ఎయిర్‌టెల్‌ను వెనక్కినెట్టింది. 2021 తొలి త్రైమాసికంలో వోడాఫోన్ ఐడియా స్పీడ్ స్కోర్ 16.10 ఎమ్బీపీఎస్ను సాధించింది. తొలి త్రైమాసికంగాను వోడాఫోన్ ఐడియా ఊక్లా అందించే స్పీడ్‌టెస్ట్ అవార్డులను గెలుచుకుంది. కాగా జియో 13.98 ఎమ్‌బీపీఎస్, ఎయిర్టెల్ 13.86 ఎమ్‌బీపీఎస్ స్పీడ్ స్కోర్‌ను సాధించినట్లు ఊక్లా ఒక ప్రకటనలో పేర్కొంది. చదవండి: మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. అదిరిపోయే స్పీడ్, రేంజ్ దేశవ్యాప్తంగా సుమారు 19,718,623 స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడే ప్రధాన మొబైల్ నెట్‌వర్క్‌ల ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్‌లను ఊక్లా పరీక్షించింది. రోజువారీ ప్రాతిపదికన చాలా మంది నెట్వర్క్ ప్రొవైడర్ల నుంచి కస్టమర్స్ పొందుతున్న మొబైల్ నెట్వర్క్ డౌన్లోడ్ వేగం, మధ్యస్థ వేగంపై ఊక్లా దృష్టి సారించింది. ఈ స్పీడ్ టెస్ట్‌లను ముంబై, అహ్మాదాబాద్, ఢిల్లీ ప్రాంతాల్లో ఊక్లా నిర్వహించింది. 2021 తొలి త్రైమాసికంలో ఐఫోన్ 11, రెడ్మీ నోట్ 5 ప్రొ, రెడ్బీ నోట్ 8 ప్రొ, రెడ్ మీ నోట్7 ప్రొ, ఐఫోన్ ఎక్స్ఆర్ స్మార్ట్ఫోన్ల నుంచి ఇంటర్నెట్ స్పీడ్ డేటాను రికార్డ్ చేసినట్లు ఊక్లా పేర్కొంది. కాగా దేశవ్యాప్తంగా మధ్యస్థ డౌన్లోడ్ వేగం 9.6 ఎమ్‌బీపీఎస్‌గా ఉన్నట్లు ఊక్లా వెల్లడించింది. అయితే..ఆయా మొబైల్ నెట్వర్క్ కంపెనీల వారిగా వోడాఫోన్ ఐడియా 11.34 ఎమ్‌బీపీఎస్, ఎయిర్టెల్ 10.10 ఎమ్‌బీపీఎస్, జియో 8.23 ఎమ్‌బీపీఎస్ మేర సగటు మధ్యస్థ డౌన్లోడ్ వేగాన్ని నమోదు చేశాయి. దేశవ్యాప్తంగా అప్లోడింగ్ వేగంలో తొలి త్రైమాసికంలో 3.19ఎమ్‌బీపీఎస్ స్పీడ్ నమోదైంది. కాగా వోడాఫోన్ ఐడియా 4.91 ఎమ్‌బీపీఎస్, ఎయిర్టెల్ 3.16 ఎమ్‌బీపీఎస్, జియో 2.54 ఎమ్‌బీపీఎస్ సగటు అప్లోడ్ వేగాన్ని సాధించాయి. చదవండి: అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్..! భారత్ నుంచి.... -
క్యూ1లో బజాజ్ ఆటో స్పీడ్
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి క్వార్టర్లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 1,170 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో నమోదైన రూ. 395.5 కోట్లతో పోలిస్తే నాలుగు రెట్లు అధికం. ఇందుకు ప్రధానంగా ఎగుమతులు కారణమైనట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది క్యూ1లో దేశవ్యాప్త లాక్డౌన్లు అమ్మకాలను దెబ్బతీసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఆదాయం జూమ్ క్యూ1లో బజాజ్ ఆటో మొత్తం ఆదాయం సైతం రూ. 3,079 కోట్ల నుంచి రూ. 7,386 కోట్లకు జంప్‌చేసింది. ప్రస్తుత త్రైమాసికంలోనూ కోవిడ్–19 సెకండ్ వేవ్ ప్రభావం చూపినప్పటికీ పలు దేశాలకు పెరిగిన ఎగుమతులు దన్నునిచ్చినట్లు కంపెనీ వివరించింది. క్యూ1లో వాహన అమ్మకాలు 4,43,103 యూనిట్ల నుంచి 10,06,014 యూనిట్లకు ఎగసినట్లు తెలియజేసింది. వీటిలో ఎగుమతులు మూడు రెట్లు ఎగసి 6,48,877 యూనిట్లకు చేరగా.. దేశీయంగా 3,57,137 వాహనాలు విక్రయమయ్యాయి. జూన్ చివరికల్లా మిగులు నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 19,097 కోట్లను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. మొబిలిటీ విభాగంలో ద్విచక్ర, త్రిచక్ర ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల తయారీ కోసం పూర్తి అనుబంధ సంస్థను ఏర్పాటు చేసేందుకు బోర్డు అనుమతించినట్లు బజాజ్ ఆటో తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో బజాజ్ ఆటో షేరు 1.2% నీరసించి రూ. 3,860 వద్ద ముగిసింది. -
ఇన్ఫీ.. అంచనాలు అప్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం దాదాపు 23 శాతం ఎగసింది. రూ. 5,195 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 4,233 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 18 శాతం పుంజుకుని రూ. 27,896 కోట్లకు చేరింది. గతంలో రూ. 23,665 కోట్ల టర్నోవర్ సాధించింది. కాగా.. ఈ ఏడాది జూన్ 25న ప్రారంభించిన ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా 9.8 మిలియన్ షేర్లను కొనుగోలు చేసినట్లు తెలియజేసింది. వీటి విలువ రూ. 1,542 కోట్లుకాగా.. ఒక్కో షేరుకీ రూ. 1,569 సగటు ధరలో బైబ్యాక్ చేసినట్లు వెల్లడించింది. బైబ్యాక్‌కు ప్రకటించిన గరిష్ట బైబ్యాక్ ధర రూ. 1,750. భారీ డీల్స్ పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలను ఇన్ఫోసిస్ ఎగువముఖంగా సవరించింది. 14–16 శాతం స్థాయిలో వృద్ధి సాధించగలమని తాజాగా అంచనా వేసింది. ఇంతక్రితం 12–14 శాతం పురోగతిని ఊహించిన సంగతి తెలిసిందే. క్యూ1లో 2.6 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 19,250 కోట్లు) విలువైన కాంట్రాక్టులను కుదుర్చుకుంది. డిజిటల్ విభాగంలో టాలెంట్‌కు భారీ డిమాండ్ ఉన్నట్లు ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్ రావు పేర్కొన్నారు. ఐటీ పరిశ్రమలో పెరుగుతున్న ఉద్యోగ వలస (అట్రిషన్) సమీపకాలంలో సవాళ్లు విసరనున్నట్లు అభిప్రాయపడ్డారు. డిమాండుకు అనుగుణంగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 35,000 మందిని కొత్తగా ఎంపిక చేసుకోనున్నట్లు తెలియజేశారు. అంచనాలకు అనుగుణమైన మార్జిన్లను సాధించగలమని భావిస్తున్నట్లు సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ పేర్కొన్నారు. వ్యయ నియంత్రణ, నిపుణులను నియమించుకోవడం తదితర అంశాలు ఇందుకు సహకరించనున్నట్లు తెలియజేశారు. ఐటీ పోర్టల్‌కు దన్ను ఆదాయ పన్ను శాఖ కొత్త పోర్టల్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను శీఘ్రగతిన పరిష్కరిస్తున్నట్లు క్యూ1 ఫలితాల విడుదల సందర్భంగా ఇన్ఫోసిస్ పేర్కొంది. పోర్టల్‌కు ప్రస్తుతం కంపెనీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేసింది. సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు చేపట్టినట్లు తెలియజేసింది. భారీ సంఖ్యలో రిటర్నులు దాఖలవుతున్నాయని, పోర్టల్‌లోని పలు విభాగాలు ఇప్పటికే సవ్యంగా పనిచేస్తున్నట్లు వివరించింది. ఇప్పటివరకూ 10 లక్షల ఐటీఆర్‌లు దాఖలైనట్లు వెల్లడించింది. ఆధునిక ఆదాయ పన్ను ఫైలింగ్ విధానాల అభివృద్ధి కోసం 2019లో ఇన్ఫోసిస్ కాంట్రాక్టును పొందింది. రిటర్నుల ప్రాసెసింగ్ సమయాన్ని 63 రోజుల నుంచి ఒకేరోజుకి తగ్గించడం, వేగవంత రిఫండ్స్ తదితరాలకు వీలుగా పోర్టల్‌ను అభివృద్ధి చేయవలసి ఉంది. అభివృద్ధి చేసిన పోర్టల్ సర్వీసులు ఈ జూన్‌లో ప్రారంభమయ్యాయి. అయితే కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. మార్కెట్లు ముగిశాక ఇన్ఫోసిస్ ఫలితాలు ప్రకటించింది. ఎన్ఎస్ఈలో ఇన్ఫోసిస్ షేరు 2 శాతం లాభపడి రూ. 1,577 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 1,583–1,538 మధ్య ఊగిసలాడింది. క్యూ1 హైలైట్స్.. ► మొత్తం ఆదాయంలో డిజిటల్ విభాగం 54 శాతం వాటాను ఆక్రమిస్తోంది. వార్షిక ప్రాతిపదికన 42 శాతానికిపైగా వృద్ధిని సాధించింది. ► నిర్వహణ లాభ(ఇబిట్) మార్జిన్ 22.7 శాతం నుంచి 23.7 శాతానికి బలపడింది. ► డాలర్ల రూపేణా ఆదాయం 21.2 శాతం ఎగసి 378.2 కోట్ల డాలర్లను చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన 4.7 శాతం పుంజుకుంది. ► ఈపీఎస్ దాదాపు 23 శాతం జంప్‌చేసి రూ. 12.24ను తాకింది. ► ఉద్యోగులకు ఈ జనవరిలో ఒకసారి, జూలైలో మరోసారి అదనపు చెల్లింపులు, ప్రమోషన్లు. ► 2,67,953కు కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య. ఉద్యోగ వలస 13.9 శాతం. నమ్మకాన్ని పెంచాయ్ ఉద్యోగుల అంకితభావం, క్లయింట్లకున్న విశ్వాసం సహకారంతో గత దశాబ్ద కాలంలోనే వేగవంత వృద్ధిని సాధించగలిగాం. వార్షిక ప్రాతిపదికన 17 శాతం, త్రైమాసికవారీగా దాదాపు 5 శాతం చొప్పున పురోగమించాం. ఫైనాన్షియల్, రిటైల్, తయారీ, లైఫ్ సైన్సెస్ విభాగాల్లో కాంట్రాక్టులకు డిమాండ్ కనిపిస్తోంది. క్యూ1లో భారీ డీల్స్‌ను సంపాదించాం. ఉద్యోగుల నిబద్ధత, పటిష్ట ఫలితాలు వంటి అంశాలు ఆదాయ వృద్ధి అంచనాలను పెంచేందుకు నమ్మకాన్ని కలిగించాయి. – సలీల్ పరేఖ్, సీఈవో, ఎండీ, ఇన్ఫోసిస్ -
ఆటో విడిభాగాల లాభాలు వీక్!
న్యూఢిల్లీ: కోవిడ్–19 సెకండ్ వేవ్ కారణంగా ఆటో విడిభాగాల కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి క్వార్టర్లో ఆర్థిక సవాళ్లను ఎదుర్కోనున్నట్లు రేటింగ్ దిగ్గజం ఇక్రా తాజాగా అంచనా వేసింది. కరోనా కేసుల కట్టడికి ఆంక్షలు, లాక్డౌన్ల నేపథ్యంలో నిర్వహణ లాభాలపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు పేర్కొంది. వెరసి క్యూ1(ఏప్రిల్–జూన్)లో ఆటో విడిభాగాల కంపెనీల నిర్వహణ లాభాల్లో 70 శాతం కోత పడేవీలున్నట్లు ఒక నివేదికలో అభిప్రాయపడింది. ఇందుకు మరోవైపు వేగంగా పెరిగిన కమోడిటీల ధరలు కారణంకానున్నట్లు తెలియజేసింది. అయితే వీటిని వాహన తయారీ(ఓఈఎం) సంస్థలకు బదిలీ చేసే వీలున్నప్పటికీ ఇందుకు 3–6 నెలల సమయం పడుతుందని వివరించింది. ఆంక్షల ఎఫెక్ట్ ఈ ఏడాది క్యూ1లో ఆటో విడిభాగాల కంపెనీల మొత్తం ఆదాయాలూ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోనున్నట్లు ఇక్రా నివేదిక పేర్కొంది. త్రైమాసికవారీగా చూస్తే 30–40 శాతం స్థాయిలో టర్నోవర్ తగ్గవచ్చని అంచనా వేసింది. ఫలితంగా నిర్వహణ లాభం (ఇబిటా) గత ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికంతో పోలిస్తే 70 శాతం స్థాయిలో క్షీణించవచ్చని అభిప్రాయపడింది. కాగా.. కరోనా ప్రతికూలతల నేపథ్యంలో లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ గత కొద్ది నెలలుగా ఆటో విడిభాగాల పరిశ్రమను ఎగుమతులు ఆదుకుంటున్నట్లు ఇక్రా నివేదిక పేర్కొంది. దీంతో దేశీ డిమాండుపైనే అధికంగా ఆధారపడే కంపెనీలపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు తెలియజేసింది. నిల్వలు పెరుగుతున్నాయ్ స్వల్ప కాలంలో ఆటో విడిభాగాల పరిశ్రమ సవాళ్లను ఎదుర్కోనున్నప్పటికీ పూర్తి ఏడాదిలో పటిష్ట పనితీరు చూపే వీలున్నట్లు పేర్కొంది. ఆదాయంలో సగటున 20–23% పురోగతి నమోదుకాగలదని అంచనా వేసింది. ఆటోమొబైల్ రంగంలో పలు విభాగాలలోనూ రెండంకెల వృద్ధికి వీలుండటంతో ఆదాయాలు పుంజుకోగలవని వివరించింది. ఏప్రిల్‌లో ఉత్పత్తిలో నిలకడ కొనసాగినప్పటికీ గత రెండు నెలల్లో రిటైల్ విక్రయాలు పడిపోయినట్లు తెలియజేసింది. దీంతో ఆటో రంగ పరిశ్రమలో నిల్వలకు అవకాశం ఏర్పడినట్లు ప్రస్తావించింది. పలు ఓఈఎంలు జూన్ నెలలో ఒకే షిఫ్ట్‌కు పరిమితంకావడంతో ఉత్పత్తి పరిమాణం మందగించనున్నట్లు తెలియజేసింది. కమోడిటీ ధరలు సైతం ఒత్తిడిని పెంచనున్నట్లు ఇక్రా వివరించింది. ప్రస్తుత ఏడాది తొలి అర్ధభాగంలో ఈ ప్రభావం అధికంగా కనిపించనుందని, అక్టోబర్–మార్చి నుంచి ధరలు కొంతమేర బలహీనపడవచ్చని విశ్లేషించింది. ఎలక్ట్రానిక్ పరికరాల కొరత, సెమీకండక్టర్ ధరల పెరుగుదల సైతం ఆటో పరిశ్రమకు సమస్యలు సృష్టించనున్నట్లు ఇక్రా అభిప్రాయపడింది. చదవండి: అదిరిపోయిన బీఎండబ్ల్యూ ‘మినీ’ కార్లు..! హ్యుందాయ్ కెట్రాలో కొత్త మోడల్... తగ్గిన ధర -
కాఫీ డే...కలసివచ్చిన ‘మైండ్ ట్రీ’ వాటా విక్రయం
కాఫీ డే ఎంటర్ప్రైజెస్ కంపెనీ నికర లాభం జూన్ క్వార్టర్లో భారీగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో (ఏప్రిల్–జూన్ క్వార్టర్) రూ.21 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,567 కోట్లకు పెరిగిందని కాఫీ డే ఎంటర్ప్రైజెస్ తెలిపింది. ఐటీ కంపెనీ మైండ్‌ట్రీలో వాటా విక్రయం కారణంగా వచ్చిన అసాధారణ లాభాల కారణంగా ఈ క్యూ1లో నికర లాభం ఈ స్థాయిలో వృద్ధి చెందిందని తెలియజేసింది. మొత్తం ఆదాయం రూ.966 కోట్ల నుంచి రూ.942 కోట్లకు తగ్గిందని పేర్కొంది. షేర్ 5% లాభంతో రూ.43 వద్ద ముగిసింది. -
కంపెనీల వేటలో డాక్టర్ రెడ్డీస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) తాజాగా మరింత వృద్ధి సాధించే దిశగా ఇతర కంపెనీలను కొనుగోలు చేసే యోచనలో ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు వివిధ దశల్లో ఉన్నాయి. రుణ, ఈక్విటీ నిష్పత్తి కనిష్ట స్థాయిలో ఉండటంతో ఇతర సంస్థల కొనుగోలుకు ఆర్థికంగా కొంత వెసులుబాటు లభించగలదని డీఆర్ఎల్ భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో డీఆర్ఎల్ సహ చైర్మన్, సీఈవో జీవీ ప్రసాద్ ఈ విషయాలు వెల్లడించారు. తొలి త్రైమాసికంలో డీఆర్ఎల్ నికర లాభం 45% ఎగిసి రూ. 663 కోట్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ1లో నికర లాభం రూ. 456 కోట్లు. కెనడాలో రెవ్లిమిడ్ ఔషధ వివాదానికి సంబంధించి సెల్జీన్ సంస్థతో సెటిల్మెంట్ ఒప్పందం కింద రూ. 350 కోట్లు అందడం .. కంపెనీ లాభాల పెరుగుదలకు దోహదపడింది. క్యూ1లో సంస్థ ఆదాయం రూ. 3,721 కోట్ల నుంచి రూ. 3,843 కోట్లకు పెరిగింది. ‘తొలి త్రైమాసికంలో చాలా మటుకు కీలక మార్కెట్లలో వృద్ధి నమోదు చేయగలిగాం. పనితీరును మెరుగుపర్చుకోవడంపై మరింతగా దృష్టి సారిస్తాం‘ అని ప్రసాద్ తెలిపారు. ఆగస్టు 1 నుంచి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఎరెజ్ ఇజ్రేలీ బాధ్యతలు చేపడతారని ఆయన వెల్లడించారు. జీవీ ప్రసాద్ ఇకపై సహ చైర్మన్, ఎండీగా కొనసాగుతారు. ప్రస్తుతం ఇజ్రేలీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్త ఉత్పత్తుల ఊతం.. కొత్త ఉత్పత్తుల ఊతంతో కీలకమైన ఉత్తర అమెరికా, భారత్ తదితర మార్కెట్లలో ఆదాయాలు మెరుగుపర్చుకోగలిగినట్లు డీఆర్ఎల్ సీఎఫ్‌వో సౌమేన్ చక్రవర్తి తెలిపారు. గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయం ఎనిమిది శాతం వృద్ధితో రూ. 3,298 కోట్లకు చేరింది. ఉత్తర అమెరికాలో జనరిక్స్ ఆదాయం మూడు శాతం వృద్ధితో రూ. 1,632 కోట్లకు పెరిగింది. జనరిక్స్‌కు సంబంధించి యూరప్‌లో 19 శాతం (రూ.240 కోట్లు), భారత్‌లో 15 శాతం (రూ. 696 కోట్లు), వర్ధమాన దేశాల మార్కెట్లలో ఆదాయాలు 10 శాతం (రూ. 729 కోట్లు) మేర వృద్ధి నమోదు చేశాయి. తొలి త్రైమాసికంలో ఉత్తర అమెరికా మార్కెట్లో అయిదు కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడంతో పాటు ఐసోట్రెటినోయిన్ ఔషధాన్ని రీ–లాంచ్ చేసినట్లు సౌమేన్ చక్రవర్తి చెప్పారు. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్డీఏలో మొత్తం 107 జనరిక్ ఔషధాలకు అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అమ్మకాల పెరుగుదల, కొత్త ఉత్పత్తుల ఊతంతో భారత మార్కెట్ ఆదాయాలు వార్షిక ప్రాతిపదికన 15 శాతం వృద్ధి నమోదు చేశాయి. తగ్గిన పీఎస్‌ఏఐ .. అయితే, ఫార్మా సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయాలు గణనీయంగా తగ్గాయి. వార్షిక ప్రాతిపదికన 16 శాతం, సీక్వెన్షియల్‌గా 33 శాతం క్షీణతతో రూ. 454 కోట్లకు పరిమితమయ్యాయి. కొన్ని ఔషధాల నాణ్యతపరమైన అంశాలు తొలి త్రైమాసికంలో పీఎస్‌ఏఐ విభాగంపై ప్రతికూల ప్రభావం చూపాయని, రెండో త్రైమాసికంలో పరిస్థితులు సర్దుకోగలవని సౌమేన్ చక్రవర్తి వివరించారు. ఫలితాలు మార్కెట్ ముగిశాక వెల్లడయ్యాయి. సోమవారం బీఎస్ఈలో డీఆర్ఎల్ షేరు సుమారు రెండు శాతం క్షీణించి రూ. 2,653 వద్ద ముగిసింది. -
9న టీసీఎస్‌తో ఫలితాల బోణీ
న్యూఢిల్లీ: కంపెనీల క్యూ1 ఫలితాల సీజన్ ఆరంభమ వుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ (ఏప్రిల్–జూన్, క్యూ1) ఫలితాలను జూలై 9న దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ బోణీ చేయనుంది. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వచ్చే నెల 12న ఫలితాలను వెల్లడించనున్నది. విప్రో ఫలితాలు అదే నెల 17న వెలువడతాయి. -
బజాజ్ ఆటో... లాభం రూ.1,042 కోట్లు
న్యూఢిల్లీ: వాహన దిగ్గజం బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.1,042 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.837 కోట్లతో పోలిస్తే 25 శాతం వృద్ధి సాధించామని బజాజ్ ఆటో తెలిపింది. అమ్మకాలు జోరుగా ఉండటంతో క్యూ1లో ఈ స్థాయి లాభం సాధించామని పేర్కొంది. గత క్యూ1లో రూ.5,740 కోట్లుగా ఉన్న అమ్మకాలు ఈ క్యూ1లో రూ.7,267 కోట్లకు పెరిగాయి. గతేడాది జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చినందున ఈ అమ్మకాల గణాంకాలను పోల్చడానికి లేదని వెల్లడించింది. అంచనాలు మిస్... కంపెనీ స్టాండెలోన్ నికర లాభం 21% వృద్ధితో రూ.1,115 కోట్లకు చేరింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే నికర లాభం 11% తగ్గింది. అంతకు ముందటి క్వార్టర్ (గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో) ఈ కంపెనీ రూ.1,175 కోట్ల నికర లాభం సాధించింది. మరోవైపు కంపెనీ లాభం అంచనాలను అందుకోలేకపోయింది. ఈ కంపెనీ రూ.6,359 కోట్ల మొత్తం ఆదాయం, రూ.1,261 కోట్ల నికర లాభం సాధించగలదని విశ్లేషకులు అంచనా వేశారు. అమ్మకాలు 38 శాతం అప్.. మొత్తం వాహన విక్రయాలు 38 శాతం వృద్ధి చెందాయి. గత క్యూ1లో 8.88 లక్షలుగా ఉన్న వాహన విక్రయాలు ఈ క్యూ1లో 12.26 లక్షలకు పెరిగాయి. మొత్తం మోటార్ బైక్‌ల అమ్మకాలు 7.75 లక్షల నుంచి 33 శాతం వృద్ధితో 10.29 లక్షలకు పెరిగాయని, వీటిల్లో దేశీయ అమ్మకాలు 39 శాతం, ఎగుమతులు 25 శాతం చొప్పున వృద్ధి చెందాయని కంపెనీ వివరించింది. వాణిజ్య వాహనాల దేశీయ విక్రయాలు 52,347 నుంచి 80 శాతం వృద్ధితో 94,431కు పెరిగాయి. 9 శాతం పతనమైన షేర్ ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో బజాజ్ ఆటో షేర్ 9% పతనమై రూ.2,841 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 9.4% నష్టం తో రూ.2,820ని తాకింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. షేర్ ధర భారీగా పతనం కావడంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.7,862 కోట్లు క్షీణించి రూ.82,212 కోట్లకు తగ్గింది. -
అంచనాలు మించిన టీసీఎస్
ముంబై: అంచనాలను మించిన లాభాలతో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్‌ని ప్రారంభించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ వ్యాపార విభాగాల ఊతంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో కంపెనీ నికర లాభం 23 శాతం ఎగిసింది. రూ. 7,340 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇది రూ. 5,945 కోట్లు. క్యూ1లో టీసీఎస్ లాభాలు సుమారు రూ. 6,957 కోట్ల మేర ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. మరోవైపు, ఆదాయం సైతం సుమారు 15.8 శాతం వృద్ధితో రూ. 29,584 కోట్ల నుంచి రూ. 34,261 కోట్లకు ఎగిసింది. సీక్వెన్షియల్‌గా చూస్తే కంపెనీ నికర లాభం 6.3 శాతం, ఆదాయం 6.8 శాతం పెరిగాయి. షేరు ఒక్కింటికి రూ. 4 మేర మధ్యంతర డివిడెండ్ ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. టాటా గ్రూప్ లాభాల్లో సింహభాగం వాటా టీసీఎస్‌దే ఉంటోంది. ‘మెరుగైన ఆర్థిక ఫలితాలతో కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. బ్యాంకింగ్ విభాగం ఈ క్వార్టర్లో గణనీయంగా కోలుకుంది. మిగతా వ్యాపార విభాగాలు కూడా మెరుగైన పనితీరే కొనసాగిస్తున్నాయి. నిలకడగా మెరుగైన వృద్ధి రేటును కొనసాగించగలం‘ అని టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేశ్ గోపీనాథన్ ధీమా వ్యక్తం చేశారు. స్థిర కరెన్సీ మారకం విలువ ప్రాతిపదికన 9.3 శాతం మేర ఆదాయ వృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ వార్షిక లక్ష్యానికి మించి రెండంకెల స్థాయి వృద్ధిని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. కీలక క్లయింట్లు.. టెక్నాలజీపై పెట్టుబడులు గణనీయంగా పెంచుకుంటుండటం, పెద్ద సంఖ్యలో డీల్స్ ఇందుకు తోడ్పడగలవని గోపీనాథన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య బీమా పథకానికి డిజైన్ చేసిన నమూనానే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు ఆయుష్మాన్ భారత్ పథకానికి కూడా ఉపయోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తొలి త్రైమాసికంలో కొత్త డీల్స్.. క్యూ1లో కొత్తగా 100 మిలియన్ డాలర్ల పైబడిన డీల్స్ రెండు దక్కించుకున్నట్లు టీసీఎస్ పేర్కొంది. అలాగే 5 మిలియన్ డాలర్ల పైబడిన కేటగిరీలో కొత్తగా 13 క్లయింట్స్ జతయినట్లు వివరించింది. ఐటీ సర్వీసుల విభాగంలో ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్) స్వల్పంగా 0.1 శాతం తగ్గి 10.9 శాతానికి పరిమితమైంది. జూన్ క్వార్టర్ ఆఖరు నాటికి సంస్థలో ఉద్యోగుల సంఖ్య (కన్సాలిడేటెడ్) 4 లక్షల మార్కును దాటి 4,00,875గా ఉంది. గత క్యూ1తో పోలిస్తే ప్రస్తుత క్యూ1లో రిక్రూట్మెంట్ నికరంగా 5,800 మంది ఉద్యోగుల మేర పెరిగింది. సిబ్బందిలో మహిళా ఉద్యోగుల సంఖ్య 35.6 శాతానికి చేరింది. జూన్ త్రైమాసికంలో కొత్తగా 62 పేటెంట్లకు దరఖాస్తు చేసినట్లు, దీంతో మొత్తం పేటెంట్ల దరఖాస్తుల సంఖ్య 3,978కి చేరినట్లు సంస్థ తెలిపింది. 715 పేటెంట్లు మంజూరు అయినట్లు వివరించింది. తొలి త్రైమాసికంలో వేతనాల పెంపు, వీసా వ్యయాల పెరుగుదల రూపంలో ప్రతికూల అంశాలు ఎదురైనప్పటికీ.. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం నాలుగు శాతం క్షీణించిన నేపథ్యంలో ఆ ప్రభావం కొంత తగ్గినట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) వి. రామకృష్ణన్ తెలిపారు. ఉద్యోగుల టెక్నాలజీ నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు శిక్షణపై మరింతగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. కరెన్సీ ప్రభావాలు ఎలా ఉన్నప్పటికీ.. యూరప్ వంటి డాలర్‌యేతర ఎకానమీల్లో వ్యాపార అవకాశాల అన్వేషణ కొనసాగుతుందన్నారు. మరోవైపు, సొంత ఉత్పత్తులను మెరుగుపర్చుకోవడంతో పాటు కొత్త ఉత్పత్తుల కొనుగోలుకు కూడా ప్రాధాన్యమివ్వనున్నట్లు టీసీఎస్ సీవోవో ఎన్జీ సుబ్రమణియం చెప్పారు. బ్యాంకింగ్ సేవల్లో 4.1 శాతం వృద్ధి .. బీఎఫ్ఎస్ఐ విభాగం వ్యాపారం 4.1 శాతం వృద్ధి నమోదు చేసింది. గడిచిన 15 త్రైమాసికాల్లో ఇదే అత్యధికం. ఇక, ఇతర విభాగాల్లో ఎనర్జీ అత్యధికంగా 30.9 శాతం, తయారీ 6.9 శాతం, రిటైల్ అండ్ కన్జూమర్ బిజినెస్ 12.7 శాతం, కమ్యూనికేషన్ 9.5 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. క్రితం త్రైమాసికంతో పోలిస్తే డిజిటల్ విభాగం ఆదాయ వృద్ధి ఏకంగా 44 శాతం ఎగిసింది. మొత్తం ఆదాయంలో దీని వాటా నాలుగో వంతుగా ఉంటోంది. -
భారీగా నష్టపోయిన సన్‌ఫార్మా
ముంబై: దేశీయ పార్మా దిగ్గజం ఫలితాల్లో భారీగా కుదేలైంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సన్‌ఫార్మా మార్కెట్ అంచనాలను మించి భారీ నష్టాలను మూటగట్టుకుంది. క్యూ1 లో రూ. 425కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. జూన్ 30 తో ముగిసిన త్రైమాసికానికి రూ .424.92 కోట్లు నష్టపోయినట్లు సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. దాదాపు వెయ్యి కోట్ల లాభాలను ఆర్జించనుందని ఎనలిస్టులు అంచనావేశారు. ఆదాయం 25శాతం క్షీణించింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ. 8,256 కోట్లతో పోలిస్తే ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ .6,208.79 కోట్లుగా నిలిచింది. ఎబిటామార్జిన్లు 17. 6 శాతంగా నిలిచాయి. మరోవైపు వన్ టైం లాస్‌గా రూ. 950.5 కోట్లను నష్టపోయినట్టు సన్ ఫార్మా ప్రకటించింది. జులై 2017 నెలలో మోడఫినిల్కు సంబంధించి యాంటీట్రస్ట్ వ్యాజ్యానికి సంబంధించి మొత్తం 147 మిలియన్ డాలర్లు చెల్లించాలని కంపెనీ అంగీకరించిందని తెలిపింది. ఈ ఫలితాల నేపథ్యంలో సన్‌పార్మా కౌంటర్ 3శాతం నష్టపోయింది. -
లాభాల్లోకి టాటా స్టీల్ క్యూ 1 ఫలితాలు
ముంబై: స్టీల్ దిగ్గజం టాటా స్టీల్ లిమిటెడ్ బాగా తేరుకుంది. అంచాలనకనుగుణంగానే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాల్లో నష్టాలనుంచి కోలుకొని లాభాలను నమోదు చేసింది. సంవత్సరం క్రితం నష్టాల నుంచి లాభాల్లోకి మళ్లి రూ.921 కోట్ల నికర లాభాలను సాధించింది. సోమవారం టాటా స్టీల్ ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్యూ 1 ఫలితాలను ప్రకటించింది. జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో స్టీల్ మేకర్ నికర లాభం 921 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ .3,183 కోట్లు నష్టపోయింది. ముఖ్యంగా కళింగ నగర్ ప్లాంట్ ద్వారా అమ్మకాలు సంస్థ లాభాలకు మంచి బూస్ట్నుఅందించాయి. ఈ త్రైమాసికంలో స్థూల ఋణం రూ .4,798 కోట్లు పెరగడంతో ఫారెక్స్ ప్రభావం పెరిగింది. మరోవైపు ఫలితాలు మెరుగ్గా ఉండనున్నాయనే నేపథ్యంలో సోమవారం బిఎస్ఇలో టాటా స్టీల్ కౌంటర్ 4 శాతం ఎగిసి 600 రూపాయలకు చేరుకుంది. -
పీఎన్బీ లాభం 12% వృద్ధి
క్యూ1లో రూ.343 కోట్లు న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు జూన్ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. లాభం 12 శాతం వృద్ధితో రూ.343 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 7 శాతం పెరిగి రూ.14,468 కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో లాభం రూ.306 కోట్లు, ఆదాయం రూ.13,475 కోట్లుగా ఉంది. ఆస్తుల నాణ్యత సైతం కొద్దిగా మెరుగైంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 13.75 శాతం నుంచి 13.66 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏలు 9.16 శాతం నుంచి 8.67 శాతానికి దిగివచ్చాయి. దీంతో ఎన్పీఏలకు చేసిన కేటాయింపులు 19 శాతం తగ్గి రూ.2,559 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఎన్పీఏలకు కేటాయింపులు రూ.3,165 కోట్లు కావడం గమనార్హం. అయితే, మార్చి క్వార్టర్లో ఉన్న స్థూల ఎన్పీఏలు 12.53 శాతం కంటే పెరిగినట్టు తెలుస్తోంది. మెరుగైన ఫలితాలతో పీఎన్బీ స్టాక్ ధర బీఎస్ఈలో ఒక శాతం పెరిగి రూ.158.90 వద్ద క్లోజయింది. -
నిరాశపరిచిన బజాజ్ ఆటో
క్యూ1లో19% డౌన్; రూ.836 కోట్లు న్యూఢిల్లీ: దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటైన బజాజ్ ఆటో ఫలితాల్లో ఉసూరుమనిపించింది. విక్రయాలు పడిపోవడంతో జూన్ త్రైమాసికంలో లాభం ఏకంగా 19 శాతం క్షీణించింది. కంపెనీ రూ.836.79 కోట్ల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,039.70 కోట్లు కావటం గమనార్హం. మొత్తం ఆదాయం కూడా తగ్గి రూ.6,177 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.6,355 కోట్లు. బీఎస్–3 నుంచి బీఎస్–4 కాలుష్య ప్రమాణాలకు మారడంతో పాటు జీఎస్టీ వల్ల కూడా జూన్ త్రైమాసికంలో పరిశ్రమపై ప్రభావం పడిందని బజాజ్ ఆటో తెలియజేసింది. జూన్ క్వార్టర్లో వాహన విక్రయాలు 8,88,434గా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్లో నమోదు చేసిన 9,94,733 వాహన విక్రయాలతో పోల్చి చూస్తే 10.68 శాతం తక్కువ. ‘‘జీఎస్టీకి మారడం వల్ల జూన్ 30 నాటికి డీలర్ల వద్ద మిగిలి ఉన్న ఒక్కో వాహనంపై రూ.1,400 సీఎస్టీ, ఆటోసెస్, ఎంట్రీ ట్యాక్స్ రూపేణా నష్టం వాటిల్లింది. దీంతో డీలర్లకు పరిహారం రూపేణా రూ.32 కోట్లు చెల్లించాం’’ అని బజాజ్ ఆటో తెలిపింది. బీఎస్ఈలో స్టాక్ ధర గురువారం 0.38 శాతం నష్టపోయి రూ.2,814.15 వద్ద క్లోజయింది. -
మైండ్ ట్రీ లాభాలకు కరెన్సీ, వీసాల సెగ
క్యూ1 స్వల్ప క్షీణత; రూ.122 కోట్లు న్యూఢిల్లీ: మధ్య స్థాయి ఐటీ కంపెనీ మైండ్‌ట్రీ లాభం జూన్ త్రైమాసికంలో స్వల్పంగా క్షీణించింది. రూ.121.7కోట్ల లాభాన్ని ఆర్జించింది. కరెన్సీ విలువల్లో అస్థిరతలు, వీసా వ్యయాలు అధికం కావడం, అనుబంధ సంస్థల నుంచి ఎదురైన ప్రతికూలతలు ఇందుకు కారణంగా కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే రూ.1,347 కోట్ల నుంచి రూ.1,355 కోట్లకు పెరిగింది. కంపెనీ సీఈవో, ఎండీ రోస్టోవ్ రావణన్ మాట్లాడుతూ.. తమ సబ్సిడరీలైన మ్యాగ్నెట్, బ్లూఫిన్ ప్రభావం లాభాలపై పడిందని, ఓ క్లయింట్ ప్రాజెక్టు నిలిచిపోయినట్టు చెప్పారు. తాము కొనుగోలు చేసిన ఈ సబ్సిడరీల నుంచి కొంత కాలం పాటు ప్రతికూలతలు ఉండొచ్చన్నారు. ఈ కారణంగానే ఈ ఏడాది వృద్ధి అంచనాలను సవరించాల్సి వస్తుందన్నారు. వేతన పెంపు ప్రభావం మార్జిన్లపై 1.5 – 2 శాతం మేర ఉంటుందని తెలిపారు. -
ఐటీ జాబ్‌లు కష్టమే!!
♦ కొత్త కొలువులకు ఆటోమేషన్, కొత్త టెక్నాలజీల సెగ... ♦ క్యూ–1లో దిగ్గజాల నియామకాల్లో తిరోగమనం... ♦ టీసీఎస్, ఇన్ఫీల్లో చేరినవారికన్నా మానేసినవారే ఎక్కువ ♦ టీసీఎస్‌లో 1,414 మంది, ఇన్ఫీలో 1,811 మంది తగ్గుదల... ♦ కోతలు లేవంటూనే.. జోరు తగ్గించామంటున్న కంపెనీలు ♦ మానేసిన వారిలో... తీసేసిన వారూ ఉండొచ్చన్న నిపుణులు ఉద్యోగాల కల్పవృక్షంగా చెప్పుకునే ఐటీ పరిశ్రమ.. ఇప్పుడు కొత్త కొలువుల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ప్రధానంగా ఆటోమేషన్‌కు తోడు డిజిటల్, క్లౌడ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దిశగా అడుగులేస్తున్న ఐటీ కంపెనీలు.. ‘జాబ్‌లెస్’ వృద్ధిపై దృష్టిపెడుతున్నాయి. ఉన్న ఉద్యోగులను తొలగించడం లేదని చెబుతూనే... కొత్త నియామకాల్లో వేగం తగ్గించామని ఒప్పుకుంటున్నాయి. ఉద్యోగుల ఉత్పాదక సామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరచడం ద్వారా, అంటే ఉన్న సిబ్బంది నుంచే సాధ్యమైనంత మేర పనిని పిండుకొని లాభదాయకతను నిలబెట్టుకోవాలనేది వాటి వ్యూహం. ఫలితంగా దేశీ ఐటీ రంగంలో కొత్త కొలువులు కనాకష్టంగా మారే పరిస్థితి నెలకొంది. అమెరికా సహా కొన్ని దేశాల రక్షణాత్మక చర్యలు, వీసా నిబంధనల కఠినతరం వంటివి కూడా ఐటీ రంగానికి పెను సవాళ్లుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి కూడా. తాజా ఫలితాల్లో తేటతెల్లం... దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు ఇటీవలే ప్రకటించిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2017–18, ఏప్రిల్–జూన్, క్యూ–1) ఫలితాల్లో ఉద్యోగాలు తగ్గుతున్న ధోరణి స్పష్టమైంది. టీసీఎస్ క్యూ1లో స్థూలంగా 11,202 మంది ఉద్యోగులను నియమించుకుంది. అయితే, 12,616 మంది కంపెనీని వీడిపోయారు. దీంతో నికరంగా 1,414 ఉద్యోగాలు తగ్గిపోయాయి. మార్చి చివరి నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,87,223 కాగా, జూన్ చివరినాటికి మొత్తం సిబ్బంది 3,85,809కి పడిపోయింది. గడిచిన మూడు నెలల్లో ఉద్యోగులెవరినీ తొలగించలేదని టీసీఎస్ హెచ్ఆర్ హెడ్ అజోయ్ ముఖర్జీ ఫలితాల సందర్భంగా చెప్పారు. అయితే, ఈ ఏడాది కొత్త ఉద్యోగాల కల్పన కాస్త తక్కువగా ఉండొచ్చని ఆయన స్పష్టం చేయడం నియామకాల్లో మందగమనానికి నిదర్శనం. మరోపక్క, ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్) క్యూ1లో 12 శాతానికి ఎగబాకింది. ఇన్ఫోసిస్ విషయానికొస్తే... ఈ ఏడాది ఏప్రిల్– జూన్ కాలానికి నికరంగా 1,811 ఉద్యోగాలు తగ్గాయి. దీంతో జూన్ చివరి నాటికి ఇన్ఫీ మొత్తం సిబ్బంది (అనుబంధ సంస్థలతో కలిపి) సంఖ్య 1,98,553కు చేరింది. జూన్ క్వార్టర్లో ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్) 21 శాతానికి ఎగబాకింది. మార్చి క్వార్టర్లో ఇది 17.1 శాతం మాత్రమే. హైరింగ్‌ను కొనసాగిస్తున్నామని, అయితే, నియామకాల్లో వృద్ధి తగ్గుముఖం పట్టినట్లు ఫలితాల ప్రకటన సందర్భంగా ఇన్ఫోసిస్ చీఫ్ విశాల్ సిక్కా కూడా చెప్పారు. ఉద్యోగుల వలసల రేటు భారీగా పెరగడం, నికర నియామకాలు తగ్గడాన్ని చూస్తుంటే... నైపుణ్యాలు, పనితీరు సరిగ్గా లేవంటూ కొంతమంది సిబ్బందికి పొమ్మనలేక పొగబెడుతున్నారా అన్న వాదనలు కూడా బలపడుతున్నాయి. ఇలా పొగబెట్టి పంపించేసిన వారిని వెళ్లిపోయిన వారిగా చూపించటం వల్లే అట్రిషన్ రేటు అంత ఎక్కువ ఉందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. మారుతున్న క్లయింట్ల ధోరణి... ప్రస్తుతం దేశం నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతుల విలువ 117 బిలియన్ డాలర్లు. ఇందులో దాదాపు ఐదో వంతు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లదే. అయితే, ఇప్పటివరకూ దేశీ ఐటీ కంపెనీలకు భారీగా వ్యాపారాన్ని ఇస్తున్న బ్యాంకింగ్, రిటైల్, ఇంధన రంగం వంటి సంప్రదాయ సర్వీసుల నుంచి ఆదాయంలో మందగమనం ఐటీ కంపెనీలను తీవ్రంగా కలవరపెడుతోంది. ఎందుకంటే మన ఐటీ సంస్థలు సంపాదిస్తున్న ప్రతి 5 డాలర్లలో 4 డాలర్లు ఈ రంగాలకు చెందిన సేవల నుంచే లభిస్తున్నాయి. మరోపక్క, ఆటోమేషన్ కారణంగా కిందిస్థాయి ఉద్యోగుల అవసరం అంతకంతకూ తగ్గుతూవస్తోంది. ఐటీ సంస్థల ప్రధాన క్లయింట్లు కూడా డిజిటల్, క్లౌడ్ వంటి టెక్నాలజీలవైపు తమ వ్యయాలను మళ్లిస్తుండటం కూడా ఆ దిశగా మన ఐటీ కంపెనీలు కొత్త పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి. డిజిటల్ నైపుణ్యాల్లో 2.15 లక్షల మందికిపైగా ఉద్యోగులకు శిక్షణనిచ్చినట్లు తాజాగా టీసీఎస్ వెల్లడించింది. ఇదిలాఉండగా, ఐటీ కంపెనీ లకు ప్రధాన ఆదాయ వనరైన అమెరికా వంటి దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక ధోరణితో(అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చాక ఈ వైఖరి మరింత పెరిగిపోయింది) మన కంపెనీలు అమెరికన్లను ఎక్కువ జీతాలిచ్చి తప్పకుండా నియమించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు అమెరికన్లకు భారీగా కొలువులను కూడా ప్రకటించాయి. ఈ ప్రభావంతో కంపెనీల వ్యయం పెరిగి... దేశీయంగా కొత్త ఉద్యోగాలను కల్పించేందుకు వెనకాడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మార్జిన్లు కాపాడుకోవడానికే... కొత్త టెక్నాలజీలకు మారుతున్న తరుణంలో కొత్తవారికి అవకాశాలు సన్నగిల్లుతాయన్నది తాజాగా కంపెనీల వాదన. ‘అంతర్గతంగా టాలెంట్ పూల్ (నిపుణులను తయారు చేసుకోవడం) ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. ఎందుకంటే మా కంపెనీ స్థాయి దృష్ట్యా డిజిటల్, క్లౌడ్ వంటి కొత్త సేవల్లో అనుభవం ఉన్నవారిని పూర్తిగా బయటినుంచి తీసుకోవడం కష్టం. కొందరిని నియమించుకుంటాం కానీ, ఎక్కువగా ప్రస్తుత ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపయోగించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాం.’ అని టీసీఎస్ హెచ్ఆర్ హెడ్ అజోయ్ ముఖర్జీ పేర్కొన్నారు. సిబ్బంది ఉత్పాదకత(యుటిలైజేషన్) ఇటీవలి కాలంలో 2 శాతం పెరిగిందని.. అయితే, డాలరుతో రూపాయి మారకం విలువ ఎగబాకడం(ఏప్రిల్–జూన్‌లో 3.5 శాతం పెరిగింది. 64.5 వద్ద కదలాడుతోంది) దీని ఫలితాన్ని దెబ్బతీసినట్లు ఇన్ఫీ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరైన మోహన్ దాస్ పాయ్ చెబుతున్నారు. అంతేకాకుండా ఐటీపై ప్రపంచవ్యాప్తంగా కంపెనీల వ్యయాలు తగ్గడంతో మన ఐటీ సంస్థల మార్జిన్లకు ఎసరుపెడుతోందని చెప్పారు. ఇన్ఫోసిస్ నిర్వహణ మార్జిన్ క్యూ1లో అరశాతం తగ్గి 24.1 శాతానికి పరిమితమైంది. ఇక టీసీఎస్ మార్జిన్లు అయితే, 2.3 శాతం దిగజారి.. 23.4 శాతానికి పడిపోయాయి. ఈ తరుణంలో మార్జిన్లు పడిపోకుండా చూసుకోవడానికి కొత్త నియామకాలను చాలా కంపెనీలు వాయిదా వేసుకుంటున్నాయని ఆయన అంటున్నారు. నాస్కామ్ అంచనాల్లోనూ... ఈ ఏడాది(2017–18)లో భారత్ ఐటీ ఎగుమతుల వృద్ధి అంచనాలను నాస్కామ్ తగ్గించడం మందగమనానికి అద్దం పడుతోంది. వరుసగా రెండో ఏడాదీ వృద్ధి సింగిల్ డిజిట్‌కే (7–8%) పరిమితం చేసింది. గతేడాది ఎగుమతులు 8.3% పెరిగాయి. ఇక దేశీయంగా పరిశ్రమ ఆదాయం 8.6% వృద్ధితో 38 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో మొత్తం ఐటీ పరిశ్రమ ఆదాయం 155 బిలియన్ డాలర్లుగా లెక్కతేలింది. భారత్ స్థూలదేశీయోత్పత్తి(జీడీపీ)లో ఇది 7.7%. ఇదిలాఉండగా, ఈ ఏడాది దేశీ ఐటీ కంపెనీలు 1.5 లక్షల కొత్త ఉద్యోగాలు ఇస్తాయనేది నాస్కామ్ తాజా అంచనా. దీంతో మొత్తం కొలువుల సంఖ్య 38.5 లక్షలకు చేరొచ్చని భావిస్తోం ది. గతేడాది(2016–17) 1.73 లక్షలు, అంతక్రితం ఏడాది(2015–16) 2 లక్షల కొత్త ఉద్యోగాలతో పోలిస్తే హైరింగ్ జోరు తగ్గుతున్న దాఖలాలు స్పష్టంగా కనబడుతున్నాయి. -
క్యూ1 ఫలితాలే కీలకం!
♦ ఈ వారంలోనే ఆర్ఐఎల్, విప్రో క్యూ1 ఫలితాలు ♦ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపైనా దృష్టి ♦ ఫలితాలను బట్టి షేర్ల కదలికలు ♦ ఈ వారంస్టాక్ మార్కెట్‌పై నిపుణుల అంచనాలు రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, హిందుస్తాన్ యునిలివర్ వంటి బ్లూచిప్ కంపెనీలు వెల్లడించే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలపై ఈ వారం స్టాక్‌మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని నిపుణులంటున్నారు. వీటితో పాటు నేటి (సోమవారం)నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి కేంద్రీకరిస్తారని వారంటున్నారు. ఈ వర్షాకాల సమావేశాలు రాష్ట్రపతి ఎన్నికతో ఆరంభమవుతాయి. ఇక రుతుపవనాల విస్తరణ, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ, విదేశీ పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం.. ఈ అంశాలు కూడా స్టాక్‌మార్కెట్‌పై తగినంతగా ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ఫలితాలను బట్టి సూచీల కదలికలు... కంపెనీల క్యూ1 ఫలితాలను బట్టి స్టాక్ సూచీల కదలికలు ఉంటాయని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్ అభ్నిశ్ కుమార్ సుధాంశు పేర్కొన్నారు. ఈ వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, ఏసీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌యూఎల్ కంపెనీలు క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయని ట్రేడ్‌స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. ఈ వారం ఎలాంటి ఆర్థిక పరమైన గణాంకాలు వెల్లడి కావని, అందుకని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తీరును ఇన్వెస్టర్లు గమనిస్తారని వివరించారు. ఫలితాల సీజన్ ప్రారంభమైనందున షేర్ల వారీ కదలికలు ప్రధానంగా ఉంటాయని పేర్కొన్నారు. క్యూ1 ఫలితాల వెల్లడికి ముందు, ఫలితాలు వెల్లడైన తర్వాత కంపెనీ షేర్లు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడి చెప్పారు. ఇప్పటివరకైతే వర్షాలు సంతృప్తికరంగానే కురిశాయని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో ముడిపడిన వ్యాపారాలకు శుభసూచకమని కోటక్ మ్యూచువల్ ఫండ్‌కు చెందిన చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐఓ–ఈక్విటీ) హర్ష ఉపాధ్యాయ చెప్పారు. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల వడ్డీరేట్ల తగ్గింపుకు అవకాశమేర్పడిందని, మార్కెట్ మరింత ముందుకు పోవడానికి ఇది దోహదపడుతుందని వివరించారు. నేడు ఏసీసీ క్యూ1 ఫలితాలు నేడు (ఈ నెల 17న–సోమవారం) ఏసీసీ, జుబిలంట్ ఫుడ్‌వర్క్స్ తమ క్యూ1 ఫలితాలను వెల్లడిస్తాయి. మంగళవారం(ఈ నెల 18న) హిందుస్తాన్ యునిలివర్, క్రిసిల్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలు, గురువారం(ఈ నెల 19న) విప్రో, బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్‌లు, శుక్రవారం (ఈ నెల 20న) రిలయన్స్ ఇండస్ట్రీస్, అశోక్ లేలాండ్ కంపెనీలు క్యూ1 ఫలితాలను వెల్లడిస్తాయి. ఇక అంతర్జాతీయ అంశాల్లో... సోమవారం యూరోజోన్ రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. గురువారం యూరప్ కేంద్ర బ్యాం క్, జపాన్ కేంద్ర బ్యాంక్‌లు వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకుంటాయి. కొనసాగుతున్న విదేశీ పెట్టుబడుల జోరు విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఈ నెల మొదటి రెండు వారాల్లో ఎఫ్‌పీఐలు మన క్యాపిటల్ మార్కెట్లో రూ.11,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఎఫ్‌పీఐలు మన ఈక్విటీ మార్కెట్లో రూ.498 కోట్లు, డెట్‌మార్కెట్లో రూ.10,405 కోట్లు, వెరశి రూ.10,903 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి–జూన్ కాలానికి వచ్చిన రూ.1.62 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులకు ఇది కొనసాగింపు. జీఎస్టీ అమలు సాఫీగా సాగుతుండడం, భారత ఆర్థిక వ్యవస్థపై ఆశావహ అంచనాలే విదేశీ పెట్టుబడుల జోరుకు కారణాలని నిపుణులంటున్నారు. -
మెప్పించిన ఇన్ఫీ!
♦ అంచనాలు మించిన నికర లాభం ♦ క్యూ1లో రూ.3,483 కోట్లు; 1.3 శాతం వృద్ధి ♦ ఆదాయం రూ.17,078 కోట్లు; 1.7 శాతం అప్ ♦ అమెరికా, యూరప్‌లలో కీలక కాంట్రాక్టుల ఆసరా... ♦ డాలరు ఆదాయ అంచనాలు పెంపు... బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్... అంచనాలను మించిన ఫలితాలతో ఆకట్టుకుంది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(2017–18, క్యూ1)లో కంపెనీ రూ.3,483 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది క్వార్టర్లో లాభం రూ.3,436 కోట్లతో పోలిస్తే... 1.3 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం కూడా 1.7 శాతం పెరిగి రూ.17,078 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో ఆదాయం రూ.16,782 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా ఉత్తర అమెరికా, యూరప్‌లలో కీలకమైన క్లయింట్లను చేజిక్కించుకోవడం ఇన్ఫీ లాభాలకు దన్నుగా నిలిచింది. మరోపక్క, డాలరు రూపంలో ఈ ఏడాది ఆదాయ అంచనాలను(గైడెన్స్) పెంచడం గమనార్హం. దేశీ ఐటీ అగ్రగామి టీసీఎస్ నిరుత్సాహకరమైన ఫలితాలను ప్రకటించిన మర్నాడే... ఇన్ఫోసిస్ సానుకూల పనితీరుతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపడం విశేషం. సీక్వెన్షియల్‌గా ఇలా... క్రితం ఏడాది చివరి త్రైమాసికంలో నమోదైన రూ.3,603 కోట్ల నికర లాభంతో పోలిస్తే సీక్వెన్షియల్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ1లో లాభం 3.3 శాతం దిగజారింది. ఆదాయం కూడా రూ.17,120 కోట్లతో పోలిస్తే స్వల్పంగా 0.2 శాతం తగ్గింది. పరిశ్రమ విశ్లేషకులు ఇన్ఫోసిస్ సగటున క్యూ1లో రూ.3,426 కోట్ల నికర లాభాన్ని, రూ.17,014 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయొచ్చని అంచనా వేశారు. దీనికంటే కాస్త మెరుగ్గానే ఫలితాలు వెలువడ్డాయి. ఇక డాలరు రూపంలో కంపెనీ ఆదాయం క్యూ1లో 3.2 శాతం వృద్ధి చెంది 2,651 మిలియన్లకు చేరింది. సానుకూల గైడెన్స్... గత కొంతకాలంగా ఆదాయ వృద్ధి అంచనా(గైడెన్స్)ను తగ్గించుకుంటూ వస్తున్న ఇన్ఫోసిస్.. ఆశ్చర్యకరమైన రీతిలో దీన్ని ఈసారి పెంచింది. ఈ ఏడాది మొత్తానికి చూస్తే డాలరు ఆదాయాల్లో 7.1–9.1 శాతం వృద్ధి ఉండొచ్చని క్యూ1 ఫలితాల సందర్భంగా ప్రకటించింది. గతంలో ఈ గైడెన్స్ 6.1–8.1 శాతంగా ఉంది. ఇక స్థిర కరెన్సీ ప్రాతిపదికన గైడెన్స్‌ను గతంలో ప్రకటించిన మాదిరిగానే 6.5–8.5 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఇన్ఫీ వెల్లడించింది. కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో(టాప్ ఎగ్జిక్యూటివ్ వేతనాల పెంపు ఇతరత్రా) నారాయణ మూర్తితో పాటు ఇతర కంపెనీ వ్యవస్థాపకులతో కంపెనీ బోర్డు సభ్యులకు ఇటీవలి కాలంలో విభేదాలు బయటపడిన సంగతి తెలిసిందే. దీనికితోడు అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు వీసా నిబంధనలను కఠినతరం చేయడం, కరెన్సీ హెచ్చుతగ్గులు ఇతరత్రా సమస్యలు కూడా ఐటీ రంగాన్ని వెంటాడుతున్నాయి. ఇతర ముఖ్యాంశాలివీ... ⇔ కంపెనీ వద్ద నగదు నిల్వలు ఈ ఏడాది జూన్ చివరి నాటికి 1.9 శాతం పెరిగి 6,091 మిలియన్ డాలర్లకు(దాదాపు రూ.39,335 కోట్లు) చేరాయి. ⇔ ఏప్రిల్–జూన్ కాలంతో కంపెనీ కొత్తగా 59 క్లయింట్లను జత చేసుకుంది. ఇందులో 100 మిలియన్ డాలర్ల కేటగిరీలో 8 క్లయింట్లు, 25 మిలియన్ డాలర్ల కేటగిరీలో 6 క్లయింట్లు, 10 మిలియన్ కేటగిరీలో 1 క్లయింట్, మిలియన్ డాలర్ల కేటగిరీలో 8 క్లయింట్లు కొత్తగా లభించారు. ⇔ కంపెనీ మొత్తం ఆదాయంలో అత్యధిక వాటా (61.1%) కలిగిన ఉత్తర అమెరికా ప్రాంతం వ్యాపారంలో సీక్వెన్షియల్‌గా (క్యూ4తో పోలిస్తే) 1.3 శాతం వృద్ధి నమోదైంది. యూరప్ వ్యాపారం(ఆదాయంలో 22.4 శాతం వాటా) 4.7 శాతం ఎగబాకింది. ఇక భారత్‌కు సంబంధించి వ్యాపారంలో 14.2 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. ⇔ తాము కొత్తగా అనుసరించనున్న నిధుల కేటాయింపు పాలసీకి కొన్ని అనుమతుల కోసం వేచిచూస్తున్నామని కంపెనీ సీఎఫ్ఓ ఎం.డి.రంగనాథ్ చెప్పారు. ఒక క్రమపద్ధతిలో దీన్ని అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ పాలసీ ప్రకారం ప్రస్తుత 2017–18 ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్/షేర్ల బైబ్యాక్‌ల కోసం రూ.13,000 కోట్ల మేర నిధులను ఖర్చుచేయాలని కంపెనీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ⇔ ఫలితాల నేపథ్యంలో ఇన్ఫీ షేరు బీఎస్ఈలో 3% పైగా ఎగబాకి రూ.1,007ను తాకింది. చివర్లో అమ్మకాలు చోటచేసుకోవడంతో స్వల్ప నష్టం(0.4%)తో రూ.972 వద్ద ముగిసింది. ఆరు నెలల్లో 10 వేల జాబ్స్... రానున్న రెండేళ్లలో అమెరికాలో తాము అక్కడి స్థానికులకు 10 వేల ఉద్యోగాలను కల్పించనున్నామని.. అయితే, వచ్చే ఆరు నెలల్లోపే భారత్‌లోకూడా అంతే మొత్తంలో కొత్త కొలువులు ఇవ్వనున్నట్లు కంపెనీ సీఈఓ విశాల్ సిక్కా పేర్కొన్నారు. అమెరికాలో ఉద్యోగ కల్పన ప్రభావం ఇక్కడి నియామకాలపై ఉండబోదని, హైరింగ్‌ను తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే కంపెనీ ఈ ఏడాది 19,000 క్యాంపస్ ఆఫర్లను ప్రకటించినట్లు కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) యూబీ ప్రవీణ్ రావు పేర్కొన్నారు. ఇందులో 12,000–13,000 మంది కంపెనీలో చేరుతారని అంచనా వేస్తున్నట్లు వివరించారు. గడిచిన క్వార్టర్లో(ఏప్రిల్–జూన్) 1,000 మందికిపైగా కొత్తగా చేరారని ఆయన తెలిపారు. ఆటోమేషన్, కఠిన వీసా నిబంధనల కారణంగా ఐటీ రంగంలో ఇటీవలి కాలంలో భారీగా ఉద్యోగాల కోతలకు దారీతీస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా, క్యూ1లో నికరంగా 1,811 మంది ఉద్యోగాలు కంపెనీలో తగ్గాయి. దీంతో జూన్ చివరి నాటికి ఇన్ఫీ మొత్తం సిబ్బంది(అనుబంధ సంస్థలతో కలిపి) సంఖ్య 1,98,553కు చేరింది. జూన్ క్వార్టర్లో ఉద్యోగుల వలసల రేటు(అట్రిషన్) 21 శాతానికి ఎగబాకింది. మార్చి క్వార్టర్లో ఇది 17.1 శాతంగా ఉంది. డ్రైవర్‌లెస్ కార్ట్‌లో సిక్కా ఎంట్రీ... ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా మీడియాతో మాట్లాడేందుకు ఇన్ఫీ సీఈఓ విశాల్ సిక్కా వినూత్న రీతిలో ఒక డ్రైవర్‌లెస్ వాహనం(గోల్ఫ్ కార్ట్)లో ఎంట్రీ ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది. ఈ వాహనాన్ని ఇన్ఫోసిస్ మైసూర్ సెంటర్లోనే సొంతంగా తయారు చేయడం విశేషం. కృత్రిమ మేధస్సు ఇతరత్రా నవతరం సాంకేతిక పరిజ్ఞానాలపై తమ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం కోసమే ఈ స్వయంచోదిత(అటానమస్) వాహనాన్ని అభివృద్ధి చేయడంపై తాము దృష్టిపెట్టామని ఆయన పేర్కొన్నారు. ‘అధునాతన, భవిష్యత్ టెక్నాలజీలను మనం ఆవిష్కరించలేమని ఎవరు చెప్పారు. ఇప్పుడు నేను, ప్రవీణ్(సీఓఓ) వచ్చిన ఈ అటానమస్ వెహికల్(టెస్టింగ్ అవసరాలకు) స్వయంగా మైసూర్‌లోని ఇన్ఫోసిస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ సెంటర్లో అభివృద్ధి చేసిందే’ అని సిక్కా ట్వీట్ చేశారు. కొత్త సేవలు, సాఫ్ట్వేర్లపై కంపెనీ నిరంతరం మరింతగా దృష్టి కేంద్రీకరిస్తుందనేదానికి ఇలాంటి ఆవిష్కణలే నిదర్శనం అని కూడా ఆయన పేర్కొన్నారు. కాగా, గూగుల్, ఉబెర్ వంటి దిగ్గజాలు ఇప్పటికే డ్రైవర్‌లెస్ వాహనాలను తీసుకొచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మార్జిన్లపై ఒత్తిడి, పలు సమస్యలు వెంటాడినప్పటికీ... విభిన్న రంగాలు, ప్రాంతాల నుంచి కూ1 ఆదాయంలో విస్తృత స్థాయి వృద్ధి సాధించగలిగాం. మొత్తంమీద కంపెనీ పనితీరు మెరుగైన రీతిలోనే కొనసా గుతోంది. గడిచిన ఆరు క్వార్టర్ల నుంచి వరుసగా ఉద్యోగుల ఉత్పాదకత సామర్థ్యం(రెవెన్యూ పర్ ఎంప్లాయీ) పుంజుకుంటుండటం ఉత్సాహకరమైన అంశం. – విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ -
స్ట్రీట్ అంచనాలు బీట్ చేసిన ఇన్ఫీ
ముంబై: దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్ ఫలితాలు అంచనాలు తప్పగా.. రెండో దిగ్గజం ఇన్ఫోసిస్ విశ్లేషకుల అంచనాలను బీట్ చేసింది. నేడు ప్రకటించిన 2017-18 జూన్ క్వార్టర్ ఫలితాల్లో ఇన్ఫోసిస్ అంచనా వేసిన దానికంటే మెరుగైన ప్రదర్శననే కనబర్చి, నికర లాభాలు రూ.3,483 కోట్లగా నమోదుచేసింది. కీలక క్లయింట్ల సహకారంతో మెరుగైన ఫలితాలను నమోదుచేసినట్టు కంపెనీ నేడు బీఎస్ఈకి సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే సీక్వెన్షియల్‌గా మాత్రం కంపెనీ నికరలాభాలు 3.3 శాతం పడిపోయాయి. అంచనాల ప్రకారం ఇన్ఫీకి రూ.3,429 కోట్ల లాభాలు మాత్రమే వస్తాయని విశ్లేషకులు భావించారు. గత క్వార్టర్లో కంపెనీ లాభాలు రూ.3,603 కోట్లగా ఉన్నాయి. రెవెన్యూలు కూడా స్వల్పంగా 0.2 శాతం క్షీణించి రూ.17,078 కోట్లగా నమోదయ్యాయి. అయితే డాలర్ రెవెన్యూ వృద్ధి 3.2 శాతం పైకి ఎగిసి 2,651 మిలియన్ డాలర్లుగా ఉంది. స్థిరమైన కరెన్సీ రెవెన్యూ వృద్ధి కూడా 2.7 శాతంగా నమోదైంది. కంపెనీ ఈ ఆర్థిక సంవత్సర డాలర్ రెవెన్యూ వృద్ధి గైడెన్స్‌ను పెంచింది. ముందస్తు 6.1-8.1 శాతంగా ఉన్న గైడెన్స్‌ను 7.1-9.1 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. స్థిరమైన కరెన్సీ రెవెన్యూ వృద్ధి గైడెన్స్‌ను స్థిరంగా 6.5-8.5 శాతంగా ఉంచింది. ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్‌ను కూడా ప్రస్తుతమున్న 23-25 శాతాన్నే కొనసాగిస్తున్నట్టు పేర్కొంది. కంపెనీ రూ.13వేల కోట్ల నగదును డివిడెండ్ లేదా బైబ్యాక్ రూపంలో ఇన్వెస్టర్లకు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ క్వార్టర్లో గ్రాస్ అడిక్షన్ 59కి పెరిగింది. 25 మిలియన్ డాలర్ల కేటగిరీలో 6 గురు క్లయింట్లను చేర్చుకున్నట్టు తెలిపింది. -
గణాంకాలు, ఫలితాలు కీలకం
♦ క్యూ1 ఫలితాల వెల్లడి ఆరంభం ♦ 13న టీసీఎస్, 14న ఇన్ఫోసిస్ ♦ ఐఐపీ, ద్రవ్యోల్బణ గణాంకాల ప్రభావం కూడా ♦ ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అభిప్రాయం ఈ వారం నుంచి ఫలితాల సీజన్ ప్రారంభం కానున్నది. ఈ వారంలో వెల్లడయ్యే కంపెనీల ఆర్థిక ఫలితాలు మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. వీటితో పాటు ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాల ప్రభావం కూడా ఈ వారం మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని వారంటున్నారు. రుతుపవనాల విస్తరణ, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కూడా స్టాక్ సూచీలపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. జీఎస్టీ అమలు సాఫీగా సాగిపోతోందని, ఇక ఇప్పుడు మార్కెట్ దృష్టి కంపెనీలు వెల్లడించే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలపై ఉంటుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. వీటితో పాటు పారిశ్రామికోత్పత్తి, టోకు ధరల, వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని వివరించారు. ఈ గణాంకాలను బట్టే స్టాక్ సూచీల కదలికలు ఆధారపడి ఉంటాయని అమ్రపాలి ఆద్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్ అభ్నిశ్ కుమార్ సుధాంశు చెప్పారు. మే నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ నెల 12న (బుధవారం) మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడవుతాయి. అదే రోజు జూన్ నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా మార్కెట్ ముగిసిన తర్వాతనే వస్తాయి. ఇక టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ నెల 14న (శుక్రవారం) వస్తాయి. గురువారం టీసీఎస్ ఫలితాలు... ఈ నెల 13న(గురువారం) టీసీఎస్ ఫలితాలు వస్తాయి. శుక్రవారం (ఈ నెల 14న) ఇన్ఫోసిస్ ఫలితాలు వస్తాయి. ఇక ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ నెల 11న (మంగళవారం) క్యూ1 ఫలితాలను వెల్లడిస్తుంది. అదే రోజు సౌత్ ఇండియన్ బ్యాంక్, ఆమ్టెక్ ఆటో, సీసీఎల్ ప్రొడక్ట్స్, మోనెట్ ఇస్పాత్ కంపెనీలు కూడా క్యూ1 ఫలితాలను వెల్లడిస్తాయి. బుధవారం (ఈ నెల12న) బజాజ్ కార్ప్ ఫలితాలను ప్రకటిస్తుంది. ఈ నెల 13(గురువారం) టీసీఎస్‌తో పాటు సైయంట్, గోవా కార్బన్, హట్సన్ ఆగ్రో, ఇన్పీబీమ్, ఎంసీఎక్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రా కంపెనీలు తమ క్యూ1 ఫలితాలను వెల్లడిస్తాయి. శనివారం (ఈ నెల 15న) కర్ణాటక బ్యాంక్, గృహ ఫైనాన్స్ కంపెనీలు ఫలితాలు ప్రకటిస్తాయి. ఇక అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే సోమవారం నాడు చైనా రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. బుధవారం (ఈ నెల 12న) యూరప్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, చైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వివరాలు వెల్లడవుతాయి. ఈ నెల 14న అమెరికా మే నెల పారిశ్రామికోత్పత్తి, జూన్ నెల రిటైల్ అమ్మకాలు, జూన్ నెల ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. ఇదే రోజు జపాన్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెల్లడవుతాయి. విదేశీ పెట్టుబడుల జోరు... విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లో జోరుగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ఏడాది జూన్ వరకూ అంటే మొదటి ఆర్నెల్లలో 2,300 కోట్ల డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టారు. గత ఏడాది ఇదే కాలానికి విదేశీ పెట్టుబడులు 120 కోట్ల డాలర్లు(రూ.7,600 కోట్లు)గా ఉన్నాయి. 2019లో ఎన్నికలు రానున్నాయని, ఎన్నికలకు ఉన్న రెండేళ్ల వ్యవధిలోనే కేంద్రం మరిన్ని సంస్కరణలు తెస్తుందన్న అంచనాల కారణంగానే విదేశీ పెట్టుబడులు జోరుగా వచ్చాయని మార్నింగ్ స్టార్ ఇండియా సీనియర్ అనలిస్ట్ హిమాంశు శ్రీవాత్సవ చెప్పారు. జీఎస్టీ అమలు, వర్షాలు బాగానే కురుస్తాయన్న అంచనాలు కూడా సానుకూల సెంటిమెంట్‌కు దోహదం చేశాయని వివరించారు. ఈ ఏడాది జనవరి–జూన్ కాలానికి విదేశీ ఇన్వెస్టర్లు మన ఈక్విటీ మార్కెట్లో రూ.53,354 కోట్లు(820 కోట్ల డాలర్లు), డెట్ మార్కెట్లో రూ.94,199 కోట్లు(1,450 కోట్ల డాలర్లు) చొప్పున ఇన్వెస్ట్ చేశారని డిపాజటరీ సంస్థల గణాంకాలు వెల్లడించాయి. మొత్తం మీద విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్లో ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో రూ.1,47,553 కోట్లు(2,266 కోట్ల డాలర్లు) నికరంగా ఇన్వెస్ట్ చేశారు. భారత కరెన్సీ రూపాయి నిలకడగా ఉండటం వల్ల కూడా డెట్ మార్కెట్లో జోరుగా విదేశీ పెట్టుబడులు వచ్చాయని షేర్‌ఖాన్ అనలిస్ట్ హేమాంగ్ జని చెప్పారు. ఈ ఏడాది మొదటి నెలలో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. కానీ ఫిబ్రవరి నుంచి పెట్టుబడులు పెట్టటం ప్రారంభించారు. ఈ జోరు జూన్ వరకూ కొనసాగింది. ఈ జోరు మరింతగా కొనసాగాలంటే విదేశీ ఇన్వెస్టర్ల అంచనాలకనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పనిచేయాల్సి ఉంటుందని నిపుణులంటున్నారు. -
క్యూ1లో14% పెరిగిన ఆదాయపు పన్ను వసూళ్లు!
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను వసూళ్లు ఏప్రిల్–జూన్ త్రైమాసికం (క్యూ1)లో నికరంగా 14% పెరిగి రూ.1.42 లక్షల కోట్లకు చేరాయి. అడ్వాన్స్ పన్ను చెల్లింపుల్లో గణనీయ వృద్ధి దీనికి కారణం. అయితే నికర వసూళ్ల మొత్తాల్లో నుంచి రూ.55,520 కోట్లను రిఫండ్‌గా రెవెన్యూ శాఖ జారీ చేసింది. అయితే గతేడాది రిఫండ్స్‌తో పోల్చితే ఇది 5.2% తక్కువ. 2017–18లో మొత్తంగా రూ.9.8 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు కేంద్ర బడ్జెట్ లక్ష్యం. -
కోల్ ఇండియా లాభం 14 శాతం డౌన్
న్యూఢిల్లీ: కోల్ ఇండియా నికర లాభం (కన్సాలిడేట్) జూన్‌తో ముగిసిన క్యూ1లో 14.7 శాతం తగ్గుదలతో రూ.3,065 కోట్లకు క్షీణించింది. అమ్మకాల్లో తగ్గుదలే నికర లాభం క్షీణతకు ప్రధాన కారణం. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.3,597 కోట్ల కన్సాలిడేట్ నికర లాభాన్ని ప్రకటించింది. ఇక ఈ క్యూ1లో కంపెనీ నికర అమ్మకాలు 6 శాతం క్షీణతతో రూ.17,796 కోట్లకు తగ్గాయి. కాగా కంపెనీ మొత్తం వ్యయాలు రూ.14,834 కోట్లకు తగ్గాయి. గత క్యూ1లో కంపెనీ వ్యయాలు రూ.15,321 కోట్లుగా ఉన్నాయి. గత క్యూ1లో 121 మిలియన్ టన్నులుగా ఉన్న కంపెనీ ఉత్పత్తి ఈ క్యూ1లో 4 శాతం వృద్ధితో 126 మిలియన్ టన్నులకు ఎగసింది. స్టాండలోన్ ప్రాతిపదికన చూస్తే.. కంపెనీ నికర లాభం రూ.487 కోట్ల నుంచి రూ.4 కోట్లకు తగ్గింది. నికర అమ్మకాలు రూ.37 కోట్ల నుంచి రూ.23 కోట్లకు పడ్డాయి. గత త్రైమాసికంలో అనుబంధ కంపెనీలు డివిడెండు చెల్లించని కారణంగా మాతృ కంపెనీ అయిన కోల్ ఇండియాకు ఆదాయం పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం కోల్ ఇండియా నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 598 మిలియన్ టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దేశీ బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండియా వాటా 80 శాతంగా ఉంది. -
పునర్వ్యవస్థీకరణపైఅపోలో హాస్పిటల్స్ దృష్టి
♦ 18 శాతం క్షీణించిన నికరలాభం ♦ జీఎస్టీతో హెల్త్‌కేర్ వృద్ధి: ప్రతాప్ సి.రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్వహణ సామర్ధ్యాన్ని మెరుగుపర్చుకుని మరింత వృద్ధి సాధించడంపై అపోలో హాస్పిటల్స్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా వ్యాపార విభాగాలను పునర్వ్యవస్థీకరించేందుకు కసరత్తు ప్రారంభించింది. వ్యాపార పునర్వ్యవస్థీకరణకు సంబంధించి పలు ప్రతిపాదనలు, అవకాశాలను కంపెనీ బోర్డు పరిశీలించినట్లు అపోలో హాస్పిటల్స్ గురువారం వెల్లడించింది. పునర్వ్యవస్థీకరణ అమలుకు తగు మార్గదర్శ ప్రణాళికను రూపొందించే బాధ్యతలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రీస్ట్రక్చరింగ్ కమిటీకి బోర్డు అప్పగించినట్లు వివరించింది. శోభన కామినేని, సంజయ్ నాయర్, ఎన్ వాఘుల్ తదితర డెరైక్టర్లు ఇందులో సభ్యులుగా ఉంటారని సంస్థ పేర్కొంది. తగ్గిన నికర లాభం... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్ నికర లాభం సుమారు 18 శాతం క్షీణించి రూ. 72.5 కోట్లకు తగ్గింది. అంతక్రితం క్యూ1లో ఇది రూ. 87.5 కోట్లు. మరోవైపు, మొత్తం ఆదాయం మాత్రం 12 శాతం వృద్ధితో రూ. 1,306 కోట్ల నుంచి రూ. 1,465 కోట్లకు పెరిగింది. విభాగాల వారీగా చూస్తే .. హెల్త్ కేర్ సేవల ద్వారా ఆదాయం సుమారు ఆరు శాతం వృద్ధితో రూ. 833 కోట్లకు చేరగా, ఫార్మసీ విభాగం ఆదాయం 22 శాతం పెరిగి రూ. 632 కోట్లుగా నమోదైంది. క్యూ1లో స్టాండెలోన్ ఫార్మసీల విభాగంలో కొత్తగా 57 స్టోర్స్ ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం 8 క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లు ఉండగా రాబోయే రోజుల్లో కొత్తగా మరో రెండు ఇన్స్టిట్యూట్లను (భువనేశ్వర్, ముంబైలలో) ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. ప్రతిపాదిత వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం హెల్త్‌కేర్ రంగ వృద్ధికి దోహదపడగలదని ఆయన అభిప్రాయపడ్డారు. -
జీవీకే పవర్ నష్టం రూ. 51 కోట్లు
న్యూఢిల్లీ: మౌలిక రంగ సంస్థ జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్టాండెలోన్ ప్రాతిపదికన రూ. 51 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం క్యూ1లో ఇది రూ. 3 కోట్లు. మరోవైపు తాజాగా ఆదాయం రూ. 6.62 కోట్ల నుంచి రూ. 6.81 కోట్లకు పెరిగినట్లు సంస్థ తెలిపింది. అటు ఈ ఏడాది జూన్ 30 నాటికి జీవీకే కోల్ డెవలపర్స్ (సింగపూర్) తీసుకున్న రూ. 7,843 కోట్ల మేర రుణాలకు పూచీకత్తు ఇచ్చినట్లు, వివిధ పెట్టుబడులపై రూ. 295 కోట్ల మేర నిధులు రావాల్సి ఉందని కంపెనీ పేర్కొంది. బొగ్గు ధరల పతనం కారణంగా ఆస్తులకు మించి రుణభారంతో సతమతమవుతున్న జీవీకే కోల్ త్వరలో కోలుకోగలదని ఆశాభావం వ్యక్తం చేసింది. -
ఐఓసీ లాభం 25% అప్
క్యూ1లో రూ. 8,269 కోట్లు 1:1 బోనస్ షేర్లు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) కంపెనీ చరిత్రలో అత్యధిక తొలి త్రైమాసిక లాభాన్ని ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికం(2016-17, క్యూ1)లో కంపెనీ నికర లాభం 25 శాతం ఎగసి రూ.8,269 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.6,591 కోట్లుగా ఉంది. పటిష్టమైన పెట్రోకెమికల్ మార్జిన్లతో పాటు ఇన్వెంటరీ(నిల్వలు) సంబంధిత లాభాలు దీనికి దోహదం చేశాయి. గతేడాది క్యూ1లో రూ.1,14,200 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.1,07,671 కోట్లకు చేరింది. అయితే, స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం) 10.77 డాలర్ల నుంచి 9.98 డాలర్లకు తగ్గింది. కాగా, ఐఓసీ డెరైక్టర్ల బోర్డు రూ.10 ముఖ విలువగల ఒక్కో షేరుకు ప్రతిగా మరో షేరును(1:1 ప్రాతిపదికన) బోనస్‌గా ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసింది. ఫలితాల నేపథ్యంలో సోమవారం సల్పంగా 0.3 శాతం నష్టంతో రూ.572 వద్ద ముగిసింది. -
అంచనాలను మించిన ఐవోసీ, బోనస్ ప్రకటన
ముంబై: ప్రభుత్వ రంగ ఆయిల్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) అంచనాలకు మించి ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నికర లాభం 25 శాతం పెరిగి రూ. 8269 కోట్లను నమోదు చేసింది. నికర లాభం 4,472 కోట్లుగా విశ్లేషకులు అంచనావేశారు. మొత్తం అమ్మకాలు రూ. 1,14,000 కోట్ల నుంచి 1,01,400 రూ. కోట్లకు తగ్గాయి. స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) కూడా 10.77 డాలర్ల నుంచి 9.98 డాలర్లకు క్షీణించింది. అయితే బ్యారెల్ కు 6 డాలర్లుగా ఉండనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేసాయి. దీంతో ఎబిటా మార్జిన్ కూడా గణనీయంగా పెరిగింది. త్రైమాసిక ప్రాతిపదికన నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 4750 కోట్ల నుంచి రూ. 12,248 కోట్లకు జంప్ చేసింది. ఇబిటా మార్జిన్లు 4.8 శాతం నుంచి 12.8 శాతంగా నమోదయ్యాయి. విశ్లేషకులు అంచనావేసింది రూ. 7,040 కోట్లు. ఇతర ఆదాయం మాత్రం 35 శాతం తగ్గి రూ. 470 కోట్లకు పరిమితమైంది. దేశీయంగా 20.41 మిలియన్ టన్నుల పెట్రో ఉత్పత్తులను విక్రయించింది. కాగా, ఫైనాన్స్ వ్యయాలు 37 శాతం క్షీణించి 680 కోట్లకు చేరాయి. ఇతర ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల్లా ఇండియన్ ఆయిల్ మెరుగైన ఫలితాల ను సాధించిందని గత మూడు త్రైమాసికాలలో అత్యధిక స్థాయిలో ఉండడం ప్రోత్సాహకరమని మార్కెట్ నిపుణుడు గౌరంగ్ షా తెలిపారు. -
టాటామోటార్స్ లాభాల్లో క్షీణత.. షేర్ జంప్
ముంబై: ప్రముఖ మోటారు వాహనాల ఉత్పత్తి సంస్థ టాటామోటార్స్ ఈ ఆర్థిక సంవత్సరానికి క్యూ1 ఆర్థిక ఫలితాలను శుక్రవారం ప్రకటించిది. కన్సాలిడేటెడ్ నికరలాభంలో క్షీణతను నమోదు చేయగా మొత్తం ఆదాయంలో వృద్ధిని సాధించింది. గత ఏడాది రూ.5,254 కోట్ల లాభాలతో పోలిస్తే నికర లాభాల్లో 57శాతం క్షీణించి రూ. 2,260 కోట్లుగా నమోదైంది. విక్రయాల్లో 10 శాతం వృద్ధిని సాధించి రూ. 66,101 కోట్లను ఆర్జించింది. మొత్తం ఆదాయం 9 శాతం పెరిగి రూ. 67,230 కోట్లుగా నమోదుచేసింది. గత ఏడాది జూన్ 30, 2015 తో ముగిసిన త్రైమాసికంలో ఇది 61,734 కోట్లుగా ఉంది. నిర్వహణ లాభం(ఇబిటా) 31 శాతం క్షీణించి రూ. 7613 కోట్లకు చేరగా, ఇబిటా మార్జిన్లు 17.9 శాతం నుంచి 11.4 శాతానికి బలహీనపడ్డాయి. ఈ కాలంలో పన్ను వ్యయాలు రూ. 1649 కోట్ల నుంచి రూ.720 కోట్లకు తగ్గగా, ఇతర ఆదాయం కూడా రూ. 220 కోట్ల నుంచి రూ. 174 కోట్లకు క్షీణించింది. అయితే మార్కెట్ లో టాటా మోటార్స్ షేర్ 4 శాతం జంప్ అయింది. -
ఫలితాలతో డీలా పడిన ఇండోకౌంట్ షేర్
ముంబై: టెక్స్టైల్స్ సంస్థ ఇండోకౌంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మంగళవారం ఆర్థిక ఫలితాలనుప్రకటించింది. నికర లాభం15.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో రూ. 60.3 కోట్ల నికర లాభాలను గడించింది. గత ఏడాది నికర లాభాలు రూ.52 కోట్లుగా ఉన్నాయి. రూ.493 కోట్ల మొత్తం ఆదాయాన్ని సాధించింది. ఈ క్వార్టర్ లోరూ.539కోట్ల ఆదాయాన్ని సాధిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేసాయి. నికర లాభాల్లో వృద్ది ఉన్నప్పటికీ ఆదాయం క్షీణించడంతో షేర్ ధర దాదాపు 7 శాతం నష్టపోయింది. భారీ అమ్మకాలతో కౌంటర్ డీలా పడిన ఇండో కౌంట్ ఉదయం సెషన్ లో 11 శాతానికిపైగా పతనమైంది. ఒక దశలో షేరు ధర రూ. 798 వద్ద కనిష్టాన్ని తాకింది. -
మిస్ అయిన జస్ట్ డయల్
ముంబై: ఎనలిస్టుల అంచనాలను అందుకోవడంలో జస్ట్ డయల్ మిస్ అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నిరాశాజనక ఫలితాలను నమోదు చేసింది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో నికర లాభం 8 శాతం పెరిగి రూ. 39 కోట్లుగా ప్రకటించింది. మొత్తం ఆదాయం 6 శాతం పెరిగి రూ. 176 కోట్లకు చేరింది. మార్చి క్వార్టర్ లో రూ.179 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన సంస్థ ఈ సారి మరింత క్షీణించింది. అటు నిర్వహణ లాభం(ఇబిటా) కూడా 35 శాతం క్షీణించి రూ. 29 కోట్లకు పరిమితమైంది. ఇబిటా మార్జిన్లు 27 శాతం నుంచి 17 శాతానికి పడిపోయాయి. దీంతో మదుపర్లు ఈ షేర్ అమ్మకాలవైపు మొగ్గు చూపారు. మొదట్లో 6 శాతానికిపైగా పతనమైనా అనంతరం కోలుకుంది. దాదాపు 3శాతం నష్టాల్లో ఉంది ఎక్కువ వ్యాపారకాంక్షతో ఇచ్చిన ఎగ్రెస్సివ్ డిస్కౌంట్లు ఆదాయాన్ని దెబ్బతీశాయని ఎనలిస్టుల అంచనా. మరోవైపు జొమాటో, ప్రాక్టో లాంటి సంస్థల పోటీ గత కొన్ని త్రైమాసికాల్లో ఒత్తిడిపెంచిందని తెలిపారు. -
నాలుగు రెట్లు పెరిగిన హిందాల్కో నికర లాభం
న్యూఢిల్లీ: అల్యూమినియం ఉత్పత్తి సంస్థ హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆకర్షణీయ ఫలితాలను వెల్లడించింది. స్వతంత్ర నికర లాభాల్లో నాలుగు రెట్లకు పైగా ఎగబాకింది. జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో మంచి కార్యనిర్వాహక పనితీరుతో మెరుగైన ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ 294 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఏడాది ఇది 61 కోట్లు. అయితే నికర లాభం నాలుగు రెట్లు పెరిగినా ఆదాయం మాత్రం క్షీణించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మొత్తం ఆదాయం 11 శాతం పడిపోయి రూ 7,716,53 కోట్లు ఆర్జించినట్టు బిఎస్ఇకి తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో రూ 8,667 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కంపెనీ మొత్తం ఖర్చులు రూ 7,993.05 కోట్ల నుంచి రూ 6,703.82 కోట్లకు తగ్గాయి. అల్యూమినియం ఆదాయంలో తరుగుదల ఉన్నప్పటికీ, ఇయర్ ఆన్ ఇయర్ అల్యూమినియం ఆదాయం 8 శాతం వాల్యూమ్ గ్రోత్ ను సాధించింది. అయితే కాపర్ రెవెన్యూ 28 శాతం క్షీణించింది. ఈ ఫలితాలతో మార్కెట్లో షేరు బాగా పుంజుకుంది. దాదాపు 3 శాతం ఎగిసింది. కంపెనీ ప్రతికూల స్థూల ఆర్థిక పరిస్థితుల్లో ఒక బలమైన కార్యాచరణ ప్రదర్శించిందనీ, ద్రవ్యోల్బణం, ఎనర్జీ ధరలు మద్దతిచ్చాయని హిందాల్కో ఒక ప్రకనటలో తెలిపింది. స్థానిక మార్కెట్ లో అల్యూమినియం డిమాండ్ తగ్గడం ప్రభావితం చేసిందని పేర్కొంది. అలాగే భారీ దిగుమతులు కూడా ఫలితాలను దెబ్బతీసిందని తెలిపింది. అయితే రూపాయి బలపడడం, తగ్గిన ముడిసరుకు ధరలు, ప్రధానంగా ఎనర్జీ ఇన్ పుట్స్ భారీ ఊరటనిచ్చాయని చెప్పింది. -
ఫలితాల్లో దూసుకుపోయిన సన్ ఫార్మా
ముంబై: భారతీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా మెరుగైన ఫలితాలను ప్రకటించింది. వడోదరకు చెందిన ఈ కంపెనీ అంచనాలను మించి ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో నికర లాభం రూ. 556 కోట్ల నుంచి రూ. 2034 కోట్లకు దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం కూడా 22 శాతం ఎగసి రూ. 8243 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) 65 శాతం పెరిగి రూ. 2921 కోట్లుగా నమోదైంది. ఇబిటా మార్జిన్లు కూడా 26.1 శాతం నుంచి 35.4 శాతానికి భారీగా బలపడ్డాయి. ఈ కాలంలో రూ. 685 కోట్లమేర అనూహ్య నష్టాలు(ఎక్సెప్షనల్ లాస్) నమోదైనట్లు కంపెనీ తెలియజేసింది. అలాగే పన్ను వ్యయాలు రూ. 113 కోట్ల నుంచి రూ. 353 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది. ఈ ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేరు భారీగా లాభపడింది. ముగింపులో 0.95 శాతం లాభపడి రూ. 800 దగ్గర స్థిర పడింది. -
జూబిలంట్ లైఫ్‌సెన్సైస్ లాభం 22 శాతం అప్
న్యూఢిల్లీ: జూబిలంట్ లైఫ్‌సెన్సైస్ కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 22 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.132 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.162 కోట్లకు పెరిగిందని జూబిలంట్ లైఫ్‌సెన్సైస్ తెలిపింది. ఫార్మా సెగ్మెంట్లో అమ్మకాలు జోరుగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని జూబిలంట్ లైఫ్ సెన్సైస్ చైర్మన్ శ్యామ్ ఎస్. భర్తియ తెలిపారు. నికర అమ్మకాలు రూ.1,401 కోట్ల నుంచి రూ.1,426 కోట్లకు పెరిగాయని వివరించారు. -
28వేల దిగువకు సెన్సెక్స్
♦ బ్రెగ్జిట్ తర్వాత భారీ పతనం ♦ 310 పాయింట్లు నష్టపోయి 27,775కు ఇండెక్స్ ♦ 103 పాయింట్లు కోల్పోయి 8,690కు నిఫ్టీ లాభాల స్వీకరణ కొనసాగడంతో బుధవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో బీఎస్ఈ సెన్సెక్స్ 28వేల పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 8,600 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్ 310 పాయింట్లు(1.10 శాతం) నష్టపోయి 27,775 పాయింట్ల వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు (1.19 శాతం)నష్టపోయి 8,690 పాయింట్ల వద్ద ముగిశాయి. ఏడు వారాల్లో సెన్సెక్స్ ఇన్ని పాయింట్లు నష్టపోవడం ఇదే మొదటిసారి. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడం నుంచి చూస్తే ఇదే అత్యధిక పాయింట్ల పతనం. అన్ని రంగాల షేర్లకూ నష్టాలే.. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియడం, యూరప్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభం కావడం, డాలర్ బలహీనపడడం, అమెరికా ముడి చమురు నిల్వలు పెరిగాయన్న తాజా నివేదిక కారణంగా సరఫరాలు పెరుగుతాయనే ఆందోళనతో ముడిచమురు ధరలు పడిపోవడం... తదితర అంశాలు ప్రతికూల ప్రభావం చూపించాయి. రిఫైనరీ, ఇంధన, వాహన, ఫార్మా, విద్యుత్తు, కన్సూమర్ డ్యూరబుల్స్, యుటిలిటీస్, బ్యాంక్ షేర్లలో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. బీఎస్ఈ అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. ప్లస్ నుంచి మైనస్‌లోకి...: సెన్సెక్స్ లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారిపోయింది. 28,143-27,737 గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య 406 పాయింట్ల రేంజ్లో కదలాడింది.జీఎస్టీ ఆమోదం, మంచి వర్షాలు, ఫెడ్ వడ్డీరేట్ల పెంపు జాప్యం వంటి అంశాలన్నింటినీ మార్కెట్ ఇప్పటికే డిస్కౌంట్ చేసుకుందని, ఈ ఏడాది మార్చి నుంచి చూస్తే స్టాక్ సూచీలు 22 శాతం లాభపడటంతో లాభాల స్వీకరణ అనివార్యమని అంచనా. అదానీ సెజ్ 8 శాతం అప్.. క్యూ1లో నికర లాభం 31 శాతం పెరగడంతో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ షేర్ 8 శాతం లాభంతో రూ. 259వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే. యూరియా వ్యాపారాన్ని యారా ఫెర్టిలైజర్స్‌కు రూ.2,670 కోట్లకు విక్రయించడంతో టాటా కెమికల్స్ షేర్ 9 శాతం వరకూ పెరిగింది. లుపిన్, నష్టాలు బుధవారం కూడా కొనసాగాయి. ఈ షేర్ 4 శాతం క్షీణించి రూ.1,545కు పడిపోయింది. ఆదిత్య బిర్లా గ్రూప్ పునర్వ్యస్థీకరణ చర్యల నేపథ్యంలో ఆదిత్య బిర్లా నువో 16 శాతం పెరిగింది. మూడు సెన్సెక్స్ షేర్లకే లాభాలు.., 30 సెన్సెక్స్ షేర్లలో 26 షేర్లు నష్టపోగా, మూడు షేర్లు-అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, టీసీఎస్, కోల్ ఇండియా, మాత్రమే లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.6 శాతం, హీరో మోటొకార్ప్ 2.5%, ఐసీఐసీఐ బ్యాంక్ 2.4%, మహీంద్రా అండ్ మహీంద్రా 2.2%, మారుతీ సుజుకీ 2%, టాటా మోటార్స్ 2%, సిప్లా 1.9 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.9%, ఏషియన్ పెయింట్స్ 1.5 శాతం, విప్రో 1.4 శాతం, టాటా స్టీల్ 1.4%, సన్ ఫార్మా 1.3 శాతం, ఎస్బీఐ 1.3 శాతం చొప్పున నష్టపోయాయి. బీఎస్ఈలో 1,895 షేర్లు నష్టాల్లో, 835 షేర్లు లాభాల్లో ముగిశాయి. -
అదరగొడుతున్న అదానీ పోర్ట్స్
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ పోర్ట్స్ ప్రకటించిన తొలి త్రైమాసిక ఫలితాల జోరుతో మార్కెట్లో షేర్లు సంచలనాలు సృష్టిస్తున్నాయి. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్(సెజ్) షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో 8 శాతం మేర జంప్ అయి, 257.35 వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీ మార్నింగ్ ట్రేడింగ్‌లో అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్‌గా నిలిచి 7నెలల గరిష్టాన్ని తాకింది. దేశీయ అతిపెద్ద పోర్ట్ డెవలపర్ గా ఉన్న అదానీ పోర్ట్స్ 2016-17 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో, తన లాభాలు 31 శాతం ఎగిసినట్టు ప్రకటించింది. క్యూ1లో రూ.1,826.58 కోట్ల మొత్తం ఆదాయాలపై రూ. 836 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాలు ఆర్జించినట్టు తెలిపింది. అదేవిధంగా గతేడాది ఇదే త్రైమాసికంలో 39.61 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉన్న కార్గో వాల్యుమ్ 42.33 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగినట్టు ఫలితాల్లో పేర్కొంది. కంపెనీ ఫలితాల ప్రకారం.. అదానీ పోర్ట్స్ వాల్యుమ్ ఈ త్రైమాసికంలో 7 శాతం ఎగిసింది. కార్గో వాల్యుమ్‌లో బలమైన వృద్ధి, కార్యాచరణ సామర్థ్యాలు, తాము అనుసరించిన వ్యూహాలు బల్క్ కార్గో వాల్యుమ్ను పెంచి కంపెనీకి లాభాలను చేకూర్చాయని కంపెనీ సీఈవో కరణ్ అదానీ చెప్పారు. గ్లోబల్‌గా ట్రేడ్ వాల్యుమ్స్ పెంచుకోవడం అదానీ పోర్ట్స్‌కు మరింత లబ్దిని చేకూరుస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేవరకు పార్టీ అడ్వాన్స్‌లకు కంపెనీ కోత విధించినున్నట్టు పేర్కొంది. దీంతో పార్టీ రుణాలను కంపెనీ తగ్గించుకోనుంది. ఈ ప్రకటన పెట్టుబడిదారుల్లో కొత్త ఆశలు చిగురించింది. గత మూడేళ్లలో ఈ రుణాలు 5.8 టైమ్స్ పెరిగాయి. ఈ ప్రకటనలతో మార్కెట్లో అదానీ పోర్ట్స్ షేర్లు దూసుకెళ్తున్నాయి. -
లుపిన్ లాభాలు జంప్
ముంబై: ముంబైకి చెందిన ఫార్మా దిగ్గజం లుపిన్ ఈ ఏడాది తొలి త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. క్యూ1 ఫలితాల్లో నికర లాభాల్లో దూసుకుపోయి విశ్లేషకుల అంచనాలను ఓడించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఆకర్షణీయ ఫలితాలను నమోదు చేసింది. లుపిన్ నికర లాభం 55 శాతం జంప్‌చేసి రూ. 882 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం కూడా 41 శాతం పెరిగి రూ. 4,439 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) 57 శాతం దూసుకెళ్లి రూ. 1308 కోట్లుకాగా, ఇబిటా మార్జిన్లు 26.13 శాతం నుంచి 29.46 శాతానికి ఎగశాయి. ఇతర నిర్వహణ లాభం సైతం 67 శాతం పెరిగి రూ. 126 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఫలితాలు ఉత్సాహకరంగా ఉన్నప్పటికీ, మార్కెట్ లో లుపిన్ షేరు దాదాపు 2 శాతం క్షీణించింది. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం లుపిన్ నష్టాలకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. -
లాభాల్లో ఆంధ్రాబ్యాంక్ ఢమాల్
ముంబై: నిరుత్సాహకర ఫలితాలతో ఆంధ్రాబ్యాంక్ ఢమాల్ అంది. ప్రభుత్వరంగ సంస్థ ఆంధ్రా బ్యాంక్ ఈ ఏడాది( 2016-17) తొలి త్రైమాసికంలో నికర లాభాలు దాదాపు 85 శాతం (84.64) క్షీణించాయి. గతేడాది తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో రూ. 203 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది కేవలం రూ. 31 కోట్లను మాత్రమే ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) మాత్రం దాదాపు 10 శాతం జంప్‌చేసి రూ. 1269 కోట్లను తాకగా, మొత్తం ఆదాయం కూడా 7 శాతం పెరిగి రూ. 4855 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు 56 శాతం ఎగసి రూ. 969 కోట్లకు చేరాయి. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 2.87 శాతం నుంచి 2.90 శాతానికి పెంచుకోగలిగింది. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 5.75 శాతం నుంచి 10.30 శాతానికి జంప్‌చేయగా, నికర ఎన్పీఏలు కూడా 2.99 శాతం నుంచి 6.21 శాతానికి పెరిగాయి. నిర్వహణ వ్యయాలు 16.6 శాతం అధికమై రూ. 753 కోట్లను తాకగా, మొత్తం డిపాజిట్లు 16 శాతంపైగా ఎగసి రూ.1,78,268 కోట్లకు చేరాయి. ఇక రుణ విడుదల (అడ్వాన్సెస్) కూడా 9 శాతం పెరిగి రూ. 1,37,228 కోట్లుగా నమోదయ్యాయి. బిజినెస్ గ్రోత్ 13-14 ఉంటుందని ఆశిస్తున్నామని ఆంధ్రబ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ సురేష్ ఎన్ పటేల్ చెప్పారు. ఈ త్రైమాసికంలో రిటైల్ క్రెడిట్ పోర్ట్‌ఫోలియో విస్తరణ ద్వారా బ్యాంకు రెవెన్యూ, మార్జిన్స్ 26.5 శాతం పెరిగిందన్నారు. బ్యాంక్ పై స్లిప్ పేజేస్ భారం గత క్వార్టర్లోని రూ. 2500కోట్లతో పోలిస్తే రూ.3500కోట్లకు చేరిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నామన్నారు. ఇప్పటివరకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఇటీవల ప్రవేశ పెట్టబడిన సస్టైనబుల్ స్ట్రక్టరింగ్ ఆఫ్ స్ట్రెస్స్డ్ ఎస్సెట్స్ పథకం నుంచి తమకు ఎలాంటి నిర్దేశాలు అందలేదని ఒక ప్రశ్నకు సమాధానం పటేల్ చెప్పారు. -
జేకే సిమెంట్ లాభాలు జూమ్
ముంబై: దేశంలో రెండవ అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తి దారు జేకే సిమెంట్ లాభాల్లో దూసుకుపోయింది. జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో రూ 60.85 కోట్ల స్వతంత్ర నికరలాభాలను ఆర్జించినట్టు శనివారం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ 1.05 కోట్లతో పోలిస్తే గణనీయనమైన లాభాలను ఆర్జించింది. కంపెనీ నికర అమ్మకాలు 886,70 కోట్లకు పెరిగాయని జేకే సిమెంట్ లిమిటెడ్ బిఎస్ఇ ఫైలింగ్ లో తెలిపింది.గత ఏడాది ఇదే కాలంలో రూ 812,09 కోట్ల రూపాయలు గా ఉంది. జేకే సిమెంట్ వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం వైట్ సిమెంట్ 6,00,000 టన్నుల, 7,00,000 టన్నుల వాల్ పుట్టి వార్షిక సామర్ధ్యాన్ని కలిగి వుంది. -
క్యూ1 ఫలితాలు...
ఐషర్ మోటార్స్ లాభం 59 శాతం వృద్ధి ఐషర్ మోటార్స్: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి రూ.376 కోట్ల నికర లాభం(కన్సాలిటేడెట్) సాధించింది. గత క్యూ1లో ఆర్జించిన నికర లాభం(రూ. 237 కోట్లు)తో పోల్చితే 59 శాతం వృద్ధి సాధించింది. మొత్తం ఆదాయం రూ.1,096 కోట్ల నుంచి రూ.1,556 కోట్లకు పెరిగింది. షేర్ ధర బీఎస్ఈలో 4 శాతం వరకూ పెరిగి రూ.2,075 వద్ద ముగిసింది. జీఎస్కే ఫార్మా లాభం 23 శాతం డౌన్ గ్లాక్సోస్మిత్‌లైన్ ఫార్మా ఈ క్యూ1లో రూ.72 కోట్ల నికర లాభం(స్టాండోలోన్) సాధించింది. గత క్యూ1లో సాధించిన నికర లాభం(రూ.94 కోట్లు)తో పోల్చితే 23 శాతం క్షీణించిందని పేర్కొంది. వ్యయాలు పెరగడమే దీనికి కారణమని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.652 కోట్ల నుంచి రూ.705 కోట్లకు పెరిగిందని వివరించింది. బీఎస్ఈలో కంపెనీ షేర్ 1 శాతం నష్టపోయి రూ.3,348 వద్ద ముగిసింది. ముత్తూట్ ఫైనాన్స్ ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.270 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ1లో సాధించిన నికర లాభం(రూ. 183 కోట్లు)తో పోల్చితే 48 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. రిటైల్ రుణాలు రూ.1,000 కోట్ల నుంచి 48 శాతం వృద్ధితో రూ.1,481కోట్లకు పెరిగాయని వివరించింది. నిర్వహణ ఆస్తులు రూ.24,409 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ25,860 కోట్లకు పెరిగాయని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.1,301 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ.1,143 కోట్లకు పెరిగిందని వివరించింది. బీఎస్ఈలో షేర్ ధర 3 శాతం వృద్ధితో రూ.319 వద్ద ముగిసింది. సియట్ లాభం 17 శాతం డౌన్ టైర్ల తయారీ కంపెనీ సియట్ ఈ క్యూ1లో రూ.93 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ1లో ఆర్జించిన నికర లాభం(రూ.113 కోట్లు)తో పోల్చితే 17 శాతం క్షీణత నమోదైంది. నికర అమ్మకాలు రూ.1,404 కోట్ల నుంచి రూ.1,461 కోట్లకు పెరిగాయి. బీఎస్ఈలో కంపెనీ షేర్ స్వల్పంగా పెరిగి రూ.884 వద్ద ముగిసింది. -
ఎయిర్టెల్ లాభం 31% డౌన్
♦ క్యూ1లో రూ.1,462 కోట్లు... ♦ ఆదాయం రూ. 25,573 కోట్లు; 8 శాతం వృద్ధి న్యూఢిల్లీ: దేశీ టెలికం అగ్రగామి భారతీ ఎయిర్టెల్ నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(2016-17, క్యూ1)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 31 శాతం దిగజారి రూ.1,462 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,113 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా భారీస్థాయిలో పెట్టుబడుల ప్రభావం లాభాల తగ్గుదలకు కారణమైనట్లు కంపెనీ పేర్కొంది. అయితే, రూ.556 కోట్ల అసాధారణ రాబడి వచ్చిన నేపథ్యంలో గతేడాది లాభాన్ని అంతర్జాతీయ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రమాణాల(ఐఎఫ్ఆర్ఎస్) నుంచి భారత్ అకౌంటింగ్ ప్రమాణాల(ఇండ్-ఏఎస్) మేరకు రూ.2,113 కోట్లుగా చూపాల్సి వచ్చిందని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఐఎఫ్ఆర్ఎస్ ప్రకారం గతేడాది(2015-16) క్యూ1లో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.1,554 కోట్లుగా నమోదైనట్లు తెలిపింది. ఇక కన్సాలిడేటెడ్ ఆదాయం 7.9 శాతం వృద్ధితో రూ.23,681 కోట్ల నుంచి రూ.25,573కు చేరింది. అయితే, ఆఫ్రికా టెలికం యూనిట్, టవర్ ఆస్తుల విక్రయానికి అనుగుణంగా ఈ ఆదాయాన్ని సర్దుబాటు చేసినట్లు పేర్కొంది. మొబైల్ డేటా జోరు... క్యూ1లో కంపెనీ మొత్తం మొబైల్ డేటా ఆదాయం 34.1 శాతం ఎగబాకి రూ.4,640 కోట్లకు దూసుకెళ్లింది. మొబైల్ సర్వీసుల్లో 9.1 శాతం వృద్ధి నేపథ్యంలో భారత్ కార్యకలాపాలకు సంబంధించి ఆదాయం జూన్ క్వార్టర్లో రూ.19,155 కోట్లకు పెరిగిందని కంపెనీ పేర్కొంది. క్యూ1లో 10.3 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపింది. ‘ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మంచి పనితీరును కనబరిచాం. కాల్‌డ్రాప్ సమస్య పరిష్కారంలో భాగంగా మా కస్టమర్లందరికీ కంపెనీ మొత్తం మొబైల్ నెట్‌వర్క్‌ను పారదర్శకంగా చూపించేలా ‘ప్రాజెక్ట్ లీప్’ను అమలు చేస్తున్నాం’ అని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈఓ (భారత్, దక్షిణాసియా) గోపాల్ విఠల్ పేర్కొన్నారు. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ♦ ఇక భారత్ కార్యకలాపాలకు సంబంధించి క్యూ1లో లాభం 8.7% దిగజారి రూ. రూ.2,249 కోట్ల నుంచి రూ. 2,051 కోట్లకు తగ్గింది. ♦ దక్షిణాసియా విభాగం నికర నష్టం(అసాధారణ అంశాలు కాకుండా) రూ.235 కోట్ల నుంచి రూ. 251 కోట్లకు పెరిగింది. అయితే, ఆఫ్రికా కార్యకలాపాల నికర నష్టం మాత్రం రూ.976 కోట్ల నుంచి రూ. 520 కోట్లకు దిగొచ్చింది. ♦ క్యూ1లో కంపెనీ పెట్టుబడులు 23 శాతం ఎగసి రూ.4,925 కోట్లకు చేరాయి. ♦ కన్సాలిడేటెడ్ నికర రుణ భారం జూన్ చివరికి 23.5% ఎగసి రూ. 83,492 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే నెలాఖరుకు రూ.67,746 కోట్లు. ♦ గతేడాది క్యూ1తో పోలిస్తే మొబైల్ డేటా సేవల్లో ఒక్కో యూజర్ నుంచి సగటు నెలవారీ ఆదాయం రూ.21 పెరిగి రూ.202కు చేరింది. ♦ జూన్ ఆఖరికి భారత్‌లో మొబైల్ యూజర్ల సంఖ్య 25.5 కోట్లుగా ఎయిర్టెల్ తెలిపింది. కంపెనీ మొత్తం కార్యకలాపాలకు సంబంధించి కస్టమర్ల సంఖ్య 35.7 కోట్లకు పెరిగింది. ♦ ఎయిర్టెల్ షేరు ధర బుధవారం బీఎస్ఈలో 0.8% లాభంతో రూ. 373 వద్ద ముగసింది. ట్రేడింగ్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. -
భారీగా తగ్గిన రెడ్డీస్ నికర లాభం
♦ నికర లాభం 76% తగ్గి రూ.153 కోట్లకు ♦ టర్నోవరు 14 శాతం పడి రూ.3,222 కోట్లకు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఔషధ రంగ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ జూన్ త్రైమాసికం(2016-17, క్యూ1) కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం భారీగా తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 76 శాతం తగ్గి రూ.647.4 కోట్ల నుంచి రూ.153.5 కోట్లకు వచ్చి చేరింది. టర్నోవరు 14.11 శాతం పడి రూ.3,752 కోట్ల నుంచి రూ.3,222 కోట్లుగా ఉంది. నిర్వహణ లాభం 60 శాతం తగ్గి రూ.400 కోట్లు నమోదు చేసింది. యూఎస్, వెనిజులా మార్కెట్లలో అమ్మకాలు మందగించడమే లాభం తగ్గడానికి కారణమని కంపెనీ వెల్లడించింది. యూఎస్ఎఫ్డీఏ నుంచి వార్నింగ్ లెటర్ రావడంతో ఉత్పత్తుల విడుదల ఆలస్యం కావడం ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిందని వివరించింది. పోటీ పెరగడంతో ప్రధాన మాలిక్యూల్స్ విలువ పడిపోవడం కూడా సమస్యను పెంచిందని డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిజిత్ ముఖర్జీ వెల్లడించారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌమెన్ చక్రవర్తితో కలసి ఈ సందర్భంగా మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. పెరిగిన భారత వ్యాపారం..: ఉత్తర అమెరికా జనరిక్స్ వ్యాపారం 16.2 శాతం తగ్గి రూ.1,552 కోట్లు నమోదు చేసింది. ఇక యూరప్ జనరిక్స్ వ్యాపారం 16 శాతం పడి రూ.161.5 కోట్లుగా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లు 26 శాతం తగ్గి రూ.427.7 కోట్లను తాకాయి. వీటికి భిన్నంగా భారత్‌లో కంపెనీ వ్యాపారం పెరిగింది. జూన్ త్రైమాసికంలో భారత మార్కెట్ 10 శాతం వృద్ధి చెంది రూ.522 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఫార్మాస్యూటికల్ సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ ఆదాయం 16 శాతం పడి రూ.469 కోట్లుగా ఉంది. పరిశోధన, అభివృద్ధికి చేసిన వ్యయాలు 9 శాతం అధికమై రూ.480 కోట్లుంది. 5 శాతం పడిన షేర్లు.. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో రెడ్డీస్ షేరు మంగళవారం సుమారు 5 శాతం పడింది. బీఎస్ఈలో షేరు 4.37% పడి రూ.3,322.85 వద్ద స్థిరపడింది. ఇంట్రా డేలో 5.15 శాతం తగ్గి రూ.3,295 నమోదు చేసింది. ఎన్ఎస్ఈలో షేరు 4.67 శాతం పడి రూ.3,319.65 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో 1.54 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో 15 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. -
భారీగా కుదేలైన రెడ్డీస్ ల్యాబ్స్
-
లాభాల్లో మారుతీ రయ్..రయ్..
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ విశ్లేషకులు అంచనాలను అధిగమించింది. 2016-17 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసిక ఫలితాల్లో నికర లాభాలు 23 శాతం జంప్ అయి, రూ.1,486.2 కోట్లగా నమోదుచేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ లాభాలు రూ.1,208.1 కోట్లగా ఉన్నాయి. రెవెన్యూలు 11.6 శాతం ఎగిసి, రూ.14,655 కోట్లగా రికార్డు చేసింది. అయితే రూ.15,133 కోట్ల అమ్మకాలతో కేవలం రూ.1,197 కోట్లను మాత్రమే మారుతీ సుజుకీ నికర లాభాలు నమోదవుతాయని ఎన్డీటీవీ నిర్వహించిన మార్కెట్ విశ్లేషకుల పోల్ లో తేలింది. ఈ అంచనాలను అధిగమించి, మారుతీ సుజుకీ తన లాభాల్లో దూసుకెళ్లింది. కంపెనీ సంపాదించిన ఇతరత్రా ఆదాయాలు లాభాలు పెరగడానికి దోహదంచేశాయని కంపెనీ పేర్కొంది. టర్నోవర్ ఎక్కువగా ఉండటం, ముడి సరుకుల వ్యయాల తగ్గుదల, నాన్-ఆపరేటింగ్ ఆదాయాలు పెరగటం,తక్కువ తరుగుదల ఇవన్నీ జూన్ త్రైమాసికంలో లాభాలు పెరగడానికి దోహదం చేశాయని కంపెనీ తన ఫైలింగ్‌లో తెలిపింది. జూన్ త్రైమాసికంలో ఇతరాత్ర ఆదాయలు 134 శాతం పెరిగి, రూ.483 కోట్లగా నమోదయ్యాయి. అయితే రెవెన్యూ ముందస్తు అంచనాలను మారుతీ మిస్ చేసింది. వాల్యుమ్ గ్రోత్ తక్కువగా ఉండటంతో రెవెన్యూ అంచనాలను కంపెనీ మిస్ అయినట్టు మారుతీ పేర్కొంది. మనేసర్‌లోని సుబ్రోస్ లిమిటెడ్ ప్లాంట్‌లో నెలకొన్న ప్రమాద కారణంగా ఆ ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేయడంతో, కంపెనీ 10 వేల యూనిట్ల ఉత్పత్తిని కోల్పోయిందని వెల్లడించింది. దీంతో వాల్యుమ్ గ్రోత్ పడిపోయిందని నివేదించింది. జూన్ క్వార్టర్లో కంపెనీ 3.84 లక్షల వాహనాలను విక్రయించినట్టు మారుతీ పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ అమ్మకాలు 3.41 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. ఏడాది బేసిక్‌గా ఎగుమతులు 27 శాతం పడిపోయినా.. దేశీయ అమ్మకాలు 5.4 శాతం పెరిగినట్టు తన ఫలితాల్లో మారుతీ నివేదించింది. -
బజాజ్ ఫినాన్స్ బోనస్ బొనాంజా
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ బజాజ్ ఫినాన్స్ ఆర్థిక ఫలితాల్లో అదరగొట్టింది. జూన్ త్రైమాసికంలో అంచనాలకు మించి ఫలితాలను నమోదు చేసింది. మంగళవారం కంపెనీ ప్రకటించిన క్యూ 1 ఫలితాల్లో 54 శాతం వృద్ధితో రూ.424 కోట్ల నికర లభాలను ఆర్జించింది. ఆదాయంలో 38 శాతం వృద్థితో రూ. 2,166 కోట్ల నికర ఆదాయాన్ని సాధించింది. మెరుగైన ఫలితాలను ప్రకటించిన బజాజ్ ఫినాన్స్ బోర్డ్ 1:1 బోనస్ ప్రకటించింది. అలాగే 10రూ. గా ఫేస్ వాల్యూ వున్న షేరును విడగొట్టి (స్ప్లిట్) 2 రూ.నిర్ణయించింది. అంటే ప్రతీ షేరుకు అయిదు షేర్లు అదనంగా వాటాదారులకు అందించనుంది. దీంతో మార్కెట్లో ఈ కంపెనీ షేరు లాభాల్లో దూసుకుపోతోంది. ఈ బంపర్ బొనాంజాతో దాదాపు 5 శాతం లాభాలతో ఫ్లాట్ గా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లో ప్రధాన విజేతగా నిలిచింది. కాగా పుణేకు చెందిన బజాజ్ ఫినాన్స్ రూ.373కోట్ల నికర లాభాలను, 2039కోట్ల నికర ఆదాయన్ని నమోదు చేస్తుందని ఎనలిస్టులు అంచనా వేశారు. ఈ అంచనాలకు భిన్నంగా బజాజ్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడం విశేషం. -
ఫలితాల్లో అదరగొట్టిన ఎంఫసిస్
న్యూఢిల్లీ : బెంగళూరుకు చెందిన ఐటీ కంపెనీ ఎంఫసిస్కు 2016-17 ఆర్థిక సంవత్సరంలో త్రైమాసిక ఫలితాల బోణి అదిరింది. తొలి త్రైమాసికంలో కన్సాలిడేటడ్ నికర లాభాలు 38శాతం దూసుకెళ్లి, రూ.204.3 కోట్లగా నమోదయ్యాయి. 2016 జూన్ క్వార్టర్ ఫలితాలను కంపెనీ శనివారం ప్రకటించింది. వరుసగా ఇన్ఫోసిస్, విప్రో లాంటి ఐటీ దిగ్గజాలు ఫలితాల్లో నిరాశపరిచినా.. ఎంఫసిస్ మాత్రం లాభాల్లో దూసుకెళ్లింది. నిర్వహణ ఆదాయం యేటికేటికి 1.5 శాతం ఎగబాకి, రూ.1,516.6 కోట్లగా నమోదైనట్టు పేర్కొంది. తొలి త్రైమాసిక ప్రారంభం బాగుందని.. కొత్త తర సర్వీసులపై కంపెనీ ఎక్కువగా ఫోకస్ చేయడంతో, స్ట్రాంగ్ రిజల్ట్స్ ను నమోదుచేసినట్టు ఎంఫసిస్ సీఈవో గణేష్ అయ్యర్ పేర్కొన్నారు. 2016 ఆర్థిక సంవత్సరం ఎంఫసిస్కు బ్యానర్ ఏడాదని, వృద్ధిని, లాభాలను ఆర్జించడానికి ఈ ఏడాది తాము వ్యూహాత్మక రోడ్ మ్యాప్‌ను రూపొందించుకున్నామని అయ్యర్ వెల్లడించారు.ఇంటర్నేషనల్ రెవెన్యూ ఏడాదికి ఏడాది 14.7 శాతం పెరిగినట్టు కంపెనీ పేర్కొంది. -
యాక్సిస్ లాభాలకు బకాయిల సెగ
హెచ్డీఎఫ్సీ, కొటక్ మహింద్రా బ్యాంకుల వల్లే దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంకుకి మొండిబకాయిల బెడద తప్పలేదు. శుక్రవారం ప్రకటించిన 2016-17 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాల్లో నికర లాభాలు 21 శాతం పడిపోయాయి. జూన్ క్వార్టర్లో నికరలాభాలు రూ.1555.53 కోట్లగా ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభాలు రూ.1978.44 కోట్లగా ఉన్నాయి. మరోవైపు బ్యాడ్ లోన్స్ లేదా స్థూల నిరర్థక ఆస్తులు 59 శాతం పెరిగి, రూ.4010.23 కోట్లగా నమోదైనట్టు బ్యాంకు పేర్కొంది. 2016 మార్చి త్రైమాసికంలో ఇవి రూ.2522.14 కోట్లగా ఉన్నాయి. అయితే నికర వడ్డీ ఆదాయాలు 11.35 శాతం ఎగిసి, రూ.4,516.92 కోట్లగా నమోదుచేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయాలు రూ.4,056.23 కోట్లగా ఉన్నాయి. నిర్వహణ లాభాలు కూడా 9.22 శాతం జంప్ అయి, ఏడాదికి ఏడాది రూ.4,469.37 కోట్లగా రికార్డు చేసింది. ఏప్రిల్-జూన్ కాలంలో తన నెట్ వర్క్ లను విస్తరించుకున్నట్టు యాక్సిస్ బ్యాంకు ప్రకటించింది. దేశమంతటా తను కలిగి ఉన్న నెట్ వర్క్ లకు 102 బ్రాంచ్ లను కలుపుకున్నట్టు వెల్లడించింది. దీంతో జూన్ 30కి 1,882 సెంటర్లలలో బ్యాంకుకు మొత్తం 3,006 దేశీయ బ్రాంచ్‌లు, ఎక్స్టెన్షన్ కేంద్రాలు ఉన్నాయి. ఫలితాల నేపథ్యంలో ఈ బ్యాంకు షేర్లు 0.13 శాతం పడిపోయి, రూ.537.55గా నమోదైంది. -
ఐటీసీ లాభం 2,385 కోట్లు క్యూ1లో 10 శాతం వృద్ధి
ఆదాయం 8 శాతం అప్; రూ.13,157 కోట్లు న్యూఢిల్లీ: దేశీ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ ఈ ఏడాది మార్చితో ముగిసిన తొలి త్రైమాసికంలో (2016-17, క్యూ1) స్టాండ్ అలోన్ ప్రాతిపదికన రూ.2,385 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కిందటేడాది ఇదే కాలంలో లాభం రూ.2,166 కోట్లతో పోలిస్తే 10 శాతం వృద్ధి నమోదైంది. ఇక మొత్తం ఆదాయం 8.3 శాతం వృద్ధితో రూ. 12,233 కోట్ల నుంచి రూ.13,253 కోట్లకు పెరిగింది. వ్యాపారంలో పలు సవాళ్లు, ఎఫ్ఎంసీజీ రంగంలో డిమాండ్ మందగమనం, సిగరెట్ల పరిశ్రమపై ప్రభుత్వ నియంత్రణల ప్రభావం ఉన్నప్పటికీ స్థిరమైన పురోగతిని సాధించినట్లు ఐటీసీ పేర్కొంది. కంపెనీకి ప్రధాన ఆదాయ వనరైన సిగరెట్ల వ్యాపారం ఆదాయం క్యూ1లో రూ. 8,231 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ ఆదాయం రూ. 7,734 కోట్లతో పోలిస్తే 6.4 శాతం వృద్ధి చెందింది. ఇతర విభాగాలను చూస్తే... ⇒ సిగరెట్లు సహా మొత్తం ఎఫ్ఎంసీజీ, ఇతరత్రా విభాగాల ఆదాయం క్యూ1లో 9.5 శాతం పెరిగి రూ. 2,385 కోట్లుగా నమోదైంది. ⇒ హోటళ్ల వ్యాపార ఆదాయం మాత్రం స్వల్పంగా 0.16 శాతం తగ్గి రూ. 287 కోట్లకు పరిమితమైంది. ⇒ అగ్రి బిజినెస్ ఆదాయం 20.15 శాతం ఎగసి రూ. రూ.2,325 కోట్ల నుంచి రూ. 2,794 కోట్లకు వృద్ధి చెందింది. ⇒ పేపర్ బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్ వ్యాపార ఆదాయం 1.57 శాతం క్షీణించి రూ. 1,322 కోట్లకు తగ్గింది. ⇒ ఫలితాల నేపథ్యంలో గురువారం బీఎస్ఈలో ఐటీసీ షేరు స్వల్ప నష్టంతో రూ.251 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సీఈఓగా దేవేశ్వర్కు చివరి ఏజీఎం.. ఐటీసీ 105వ వాటాదారుల వార్షిక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించనుంది. ప్రస్తుతం కంపెనీ చైర్మన్, సీఈఓగా వ్యవహరిస్తున్న యోగేష్ చందర్ దేవేశ్వర్ చివరిసారిగా సీఈఓ హోదాలో ఏజీఎంలో మాట్లాడనున్నారు. సీఈఓగా ఆయన పదవీకాలం 2017 ఫిబ్రవరి 4తో పూర్తికానుంది. యువతరానికి అవకాశమివ్వటం కోసం మరోవిడత సీఈఓ బాధ్యతలను చేపట్టకూడదని యోగేశ్వర్ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. అయితే, చైర్మన్‌గా మాత్రం ఆయన కొనసాగుతారు. సిగరెట్ల వ్యాపారమే ప్రధానంగా కొనసాగుతున్న తరుణంలో 1996లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వచ్చిన యోగేశ్వర్... విభిన్న రంగాల్లోకి కంపెనీని విస్తరించి ఎఫ్ఎంసీజీ దిగ్గజంగా మార్చారు. ఆయన సారథ్యం చేపట్టేనాటికి ఐటీసీ వార్షికాదాయం రూ.5,200 కోట్లు కాగా, ఇప్పుడు రూ.50 వేల కోట్లకు చేరింది. ఇక వార్షిక స్థూల లాభం రూ.452 కోట్ల నుంచి 33 రెట్లు ఎగబాకి రూ.14,958 కోట్లకు పెరిగింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్...లాభం 20 శాతం అప్
♦ రూ.19,323 కోట్లకు మొత్తం ఆదాయం ♦ నికర వడ్డీ ఆదాయం 22 శాతం వృద్ధి ♦ పెరుగుతున్న మొండి బకాయిలు ♦ లాభాన్ని తగ్గించిన కేటాయింపుల భారం ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో బ్యాంక్ నికర లాభం 20 శాతం వృద్ధి చెంది రూ.3,239 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం, నిర్వహణ లాభం, నికర వడ్డీ ఆదాయం అంచనాలను మించి పెరగడం వల్ల ఈ స్థాయి నికర లాభం వచ్చిందని నిపుణులంటున్నారు. అయితే కేటాయింపులతో పాటు పన్ను భారం కూడా అధికంగా ఉండడం వల్ల నికర లాభం ఈ స్థాయికే పరిమితమైందని వారు పేర్కొన్నారు. మొత్తం ఆదాయం 17 శాతం అప్... గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో రూ.16,503 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో 17 శాతం వృద్ధి చెంది రూ.19,323 కోట్లకు పెరిగిందని బ్యాంక్ డిప్యూటీ ఎండీ, పరేశ్ సుక్తాంకర్ చెప్పారు. ‘‘నికర ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.10,588 కోట్లకు పెరిగింది. ఫీజు, కమీషన్ల ఆదాయం రూ.1,713 కోట్ల నుంచి రూ.1,978 కోట్లకు పెరగ్గా... విదేశీ మారక, డెరివేటివ్‌ల ఆదాయం రూ.348 కోట్ల నుంచి రూ.315 కోట్లకు తగ్గింది. నికర ఆదాయంలో 71 శాతంగా ఉన్న నికర వడ్డీ ఆదాయం రూ.6,389 కోట్ల నుంచి 22 శాతం వృద్ధితో రూ.7,781 కోట్లకు, మొత్తం ఆదాయంలో 27 శాతం వాటా ఉన్న ఇతర ఆదాయం 14 శాతం వృద్ధి చెంది రూ.2,807 కోట్లకు పెరిగాయి’’ అని సుక్తాంకర్ వివరించారు. రుణ వృద్ధి, పరిశ్రమ సగటుతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా పెరిగి 20 శాతానికి చేరిందన్నారు. నికర వడ్డీ మార్జిన్లు 4.3 శాతం నుంచి 4.4 శాతానికి పెరిగాయి. డిపాజిట్లు 19 శాతం వృద్ధితో రూ.5,73,755 కోట్లకు, అడ్వాన్స్‌లు 23 శాతం వృద్ధి చెంది రూ.4,70,622 కోట్లకు చేరాయని చెప్పారాయన. మొత్తం బ్యాలెన్స్ షీట్ రూ.6,29,322 కోట్ల నుంచి రూ.7,55,100 కోట్లకు పెరిగింది. నిబంధనలకు మించి సీఏఆర్! గత క్యూ1లో రూ.728 కోట్లుగా ఉన్న కేటాయింపులు రూ.867 కోట్లకు పెరిగాయని సుక్తాంకర్ చెప్పారు. మొండి బకాయిలు పెరిగినప్పటికీ, బ్యాంక్కేమీ ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. పెరుగుతున్న మొండి బకాయిల్లో భారీ కార్పొరేట్ రుణాలేమీ లేవన్నారు. బాసెల్ త్రి మార్గదర్శకాల ప్రకారం, 9 శాతంగా ఉండాల్సిన క్యాపిటల్ అడెక్వసి రేషియో(సీఏఆర్) 15.5 శాతంగా ఉందని పేర్కొన్నారు. మొండి బకాయిల సెగ... హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొన్నాళ్లుగా రిటైల్ రుణాలపైననే అధికంగా దృష్టి కేంద్రీకరిస్తోంది. ఫలితంగా పరిశ్రమ వృద్ధి కంటే కూడా అత్యధికమైన వృద్ధిని సాధిస్తోంది. మరోవైపు ఇతర బ్యాంక్‌లతో పోలిస్తే ఈ బ్యాంక్ రుణ నాణ్యత కూడా బాగా మెరుగ్గా ఉంది. ఇలాంటి ప్రత్యేకతలున్న హెచ్‌డీఎఫ్‌సీకి ఇప్పుడు ఇతర బ్యాంకుల్లానే మొండి బకాయిల సెగ తగులుతోంది. స్థూల మొండి బకాయిలు 0.95 శాతం నుంచి 1.04 శాతానికి చేరాయి. నికర మొండి బకాయిలు మాత్రం ఫ్లాట్‌గా 0.3 శాతంగానే ఉన్నాయి తప్ప తగ్గలేదు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయి(రూ.1,240)ను తాకింది. చివరకు స్వల్ప నష్టంతో రూ.1,228 వద్ద ముగిసింది. -
హెచ్‌యూఎల్‌ను నిరాశపర్చిన వాల్యుమ్ గ్రోత్
ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ అయిన హిందూస్తాన్ యూనిలివర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్) తొలి త్రైమాసిక ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను తాకలేకపోయింది. బలహీనమైన వాల్యుమ్ వృద్ధిని నమోదుచేసి మార్కెట్లను నిరాశపరిచింది. సోమవారం విడుదల చేసిన ఏప్రిల్-జూన్ తొలి త్రైమాసిక ఫలితాల్లో నికర లాభాలను 9.8 శాతం ఎక్కువగా నమోదుచేసినప్పటికీ, బలహీనమైన వాల్యుమ్ వృద్ధితో కంపెనీ షేర్లు పతనమయ్యాయి. అయితే కంపెనీ సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో యేటికేటికీ కంపెనీ నికరలాభాలు రూ.1,174కోట్లగా నమోదయ్యాయి. ఆదాయం 3శాతం వృద్ధితో రూ.8,235.70 కోట్లగా రికార్డుచేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నికర ఆదాయం రూ.7,967.43 కోట్లగా ఉన్నాయి. యేటికేటికి వాల్యుమ్ గ్రోత్ 4శాతంగా నమోదుచేసి, విశ్లేషకుల అంచనాలు తారుమారు చేసింది. వాల్యుమ్ గ్రోత్ తక్కువగా ఉండటంతో, కంపెనీ షేర్లు 2.04శాతం పతనమై, రూ.920.45గా నమోదైంది. నికర అమ్మకాలు 3.56శాతం పెరిగి, రూ.7,987.74 కోట్లగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ అమ్మకాలు కేవలం రూ.7,712.71 కోట్లు మాత్రమే. -
లాభాల్లో ఇండస్ ఇండ్...తప్పని బ్యాడ్ లోన్ భారం
ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు జోరు నేటినుంచి ప్రారంభమైంది. ప్రైవేట్ రంగానికి చెందిన ఇండస్ ఇండ్ బ్యాంకు తొలి త్రైమాసికంలో నికర లాభాల్లో అదరగొట్టింది. 2016 జూన్ 30కు ముగిసిన త్రైమాసికంలో నికర లాభాలు 26శాతం జంప్ అయి, రూ.661 కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు నికరలాభాలు రూ.525 కోట్లగా ఉన్నాయి. నికర వడ్డీ ఆదాయం పెరగడంతో బ్యాంకు లాభాల బాటలో నడిచింది. నికర వడ్డీ ఆదాయం ఈ త్రైమాసికంలో రూ.1,325 కోట్లగా రికార్డు అయ్యాయి. ఈ ఆదాయాలు గతేడాది ఇదే క్వార్టర్లో రూ.980 కోట్లగా ఉన్నాయి. అయితే ప్రైవేట్ రంగానికి చెందిన ఈ బ్యాంకు కేవలం రూ.653 కోట్లను మాత్రమే నికర లాభాలుగా నమోదుచేస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంచనావేశారు. విశ్లేషకుల అంచనాల కంటే కాస్త అధికంగానే బ్యాంకు లాభాలను నమోదుచేసింది. నికర వడ్డీ మార్జిన్లు ఈ త్రైమాసికంలో 3.97శాతం మెరుగయ్యాయి. అయితే బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు(నాన్ ఫర్ ఫార్మింగ్ ఆస్తులు) జూన్ క్వార్టర్లో రూ.776 కోట్లనుంచి రూ.860 కోట్లకు ఎగిశాయి. అదేవిధంగా నికర నిరర్ధక ఆస్తుల సైతం 0.36శాతం నుంచి 0.38శాతానికి పెరిగాయి. దీంతో బ్యాడ్ లోన్స్ ప్రభావం స్టాక్ మార్కెట్లో బ్యాంకు షేర్లపై పడింది. ఇండస్ ఇండ్ బ్యాంకు షేరు రూ.0.24శాతం పడిపోయి రూ.1,124వద్ద ముగిసింది. -
భారత్‌లోనే మొబైల్ యూజర్ల జోరు..
న్యూఢిల్లీ: ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే మొబైల్ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో (క్యూ1) భారత్‌లో మొబైల్ వినియోగదారులు కొత్తగా 2.6 కోట్లు పెరిగారని టెలికం ఉపకరణాల తయారీ సంస్థ ఎరిక్సన్ తెలిపింది. ఈ త్రైమాసికంలో అంతర్జాతీయ మొబైల్ వినియోగదారుల సంఖ్య కొత్తగా 10.8 కోట్లు పెరిగి 720 కోట్లకు చేరిందని పేర్కొంది. మొబైల్ వినియోగదారుల సంఖ్య భారత్‌లోనే (2.6 కోట్లు) అధికంగా పెరుగుతోందని వివరించింది. దీని తర్వాతి స్థానాల్లో చైనా (80 లక్షలు), మయన్మార్ (50 లక్షలు), ఇండోనేసియా (40 లక్షలు), జపాన్ (40 లక్షలు) ఉన్నాయి. క్యూ1లో జరిగిన మొత్తం మొబైల్ హ్యాండ్సెట్స్ విక్రయాల్లో 75 శాతం స్మార్ట్ఫోన్లే ఉన్నాయని పేర్కొంది. 2020 నాటికి స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్న వారు 610 కోట్ల మంది ఉంటారని.. అలాగే స్మార్ట్‌ఫోన్ డాటా వినియోగం 10 రెట్లు పెరుగుతుందని అంచనా వేసింది. 4జీ స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్న వారు 60 కోట్ల మంది ఉంటారని తెలిపింది. -
విప్రో లాభం 30 శాతం అప్
బెంగళూరు: దేశంలో మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం(2013-14, క్యూ1)లో రూ.2,103 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.1,623 కోట్లతో పోలిస్తే లాభం 29.5 శాతం ఎగబాకింది. ఆదాయం కూడా కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 15.5 శాతం వృద్ధితో రూ.11,246 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో మొత్తం ఆదాయం రూ.9,733 కోట్లుగా నమోదైంది. సీక్వెన్షియల్‌గా...: గత ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికం(క్యూ4)లో ఆర్జించిన రూ.2,226 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా నికరలాభం 9.5 శాతం తగ్గింది. ఆదాయం(క్యూ4లో 11,703 కోట్లు) కూడా 3.91 శాతం తక్కువగా నమోదైంది. ఐటీ సేవల పనితీరు... క్యూ1లో విప్రో ఐటీ సేవల విభాగం నుంచి రూ.10,500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 18 శాతం వృద్ధి చెందింది. డాలరు రూపంలో చూస్తే కంపెనీ క్యూ1 నికర లాభం 35.1 కోట్ల డాలర్లుగా, ఆదాయం రూ.1.9 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఐటీ సేవల ఆదాయం 1.74 డాలర్లకు చేరింది. సీక్వెన్షియల్‌గా 1.2 శాతం, వార్షిక ప్రాతిపదికన 9.6 శాతం వృద్ధి సాధించింది. విప్రో గతంలో ఇచ్చిన ఆదాయ అంచనా(గెడైన్స్) 1.715-1.755 బిలియన్ డాలర్లు కాగా.. ఈ స్థాయిలోనే ఫలితాల్లో నమోదుకావడం గమనార్హం. కాగా, ప్రస్తుత జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు ఆదాయం 1.77-1.81 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని విప్రో పేర్కొంది. అప్లికేషన్, ఇన్ఫ్రా రంగాల్లో కుదుర్చుకున్న భారీ డీల్స్ కంపెనీ మెరుగైన పనితీరుకు దోహదం చేసిందని.. తాజాగా కెనడా కంపెనీ ఆట్కోతో అతిపెద్ద అవుట్సోర్సింగ్ డీల్ కుదరడం తమ కంపెనీ సామర్థ్యానికి, ఇన్వెస్టర్లలో విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని విప్రో సీఈఓ టీకే కురియన్ వ్యాఖ్యానించారు. ఉత్తరఅమెరికా దేశాల్లో ఐటీ వ్యయాలు మళ్లీ పుంజుకుంటుండటం కలిసొస్తున్న అంశమని ఆయన చెప్పారు. ప్రస్తుత క్వార్టర్ ఆదాయాల్లో 20 శాతం వృద్ధి ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. కాగా, విప్రో ఫలితాలపై మార్కెట్ విశ్లేషకులు పెదవివిరిచారు. ఇతర ముఖ్యాంశాలివీ... క్యూ1లో 35 మంది క్లయింట్లు జతయ్యారు. జూన్ 30 నాటికి ఐటీ సేవల విభాగంలో 1,47,452 మంది సిబ్బంది ఉన్నారు. ఐటీ ఉత్పత్తుల విభాగం ఆదాయం జూన్ క్వార్టర్లో 6 శాతం తగ్గి.. రూ.770 కోట్లుగా నమోదైంది. ఇక ఆదాయంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగం(బీఎఫ్ఎస్ఐ) నుంచి అత్యధిక వాటా లభించింది. తర్వాత స్థానంలో తయారీ, హైటెక్, ఇంధనం, సహజవనరులు-యుటిలిటీస్, గ్లోబల్ మీడియా-టెలికం, రిటైల్, కన్సూమర్ ట్రాన్స్పోర్ట్ హెల్త్‌కేర్-లైఫ్ సెన్సైస్‌లు నిలిచాయి. ప్రాంతాల వారీగా ఆదాయాల్లో అమెరికా టాప్‌లో ఉండగా.. యూరప్, మిగతా దేశాలు(భారత్‌సహా) ఉన్నాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర గురువారం బీఎస్ఈలో 1.31 శాతం లాభపడి రూ.577 వద్ద స్థిరపడింది. -
మార్కెట్ల ట్రెండ్ నిర్దేశానికి చాన్స్
ఇకపై స్టాక్ మార్కెట్ల దిశను నిర్దేశించే పలు కీ లక పరిణామాలు ఈ వారం చోటుచేసుకోనున్నట్లు నిపుణులు తెలిపారు. సామాన్యుడి దగ్గర్నుంచీ సంపన్నుల వరకూ, ఇటు రిటైల్ ఇన్వెస్టర్ల దగ్గర్నుంచి అటు మార్కెట్ వర్గాల వరకూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్ర వార్షిక బడ్జెట్ గురువారం(10న) వెలువడనుంది. అంతకుముందే మోడీ ప్రభుత్వం లోక్‌సభలో మంగళవారం(8న) రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆపై బుధవారం(9న) ఆర్థిక సర్వే వెల్లడికానుంది. ఇవికాకుండా శుక్రవారం సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ ఏడాది తొలి క్వార్టర్(2013-14, ఏప్రిల్-జూన్) ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది. ఇదే రోజున మే నెలకుగాను పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం వెలువడనున్నాయి. ఇలాంటి పలు అంశాల నేపథ్యంలో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు అత్యంత కీలకంగా నిలవనున్నదని విశ్లేషకులు పేర్కొన్నారు. ఫలితాల సీజన్ షురూ! ఇన్ఫోసిస్ ఫలితాలతో ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ1 ఫలితాల సీజన్ మొదలుకానుంది. కార్పొరేట్ల ఫలితాలు కూడా సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపనున్నప్పటికీ గురువారం వెలువడనున్న సాధారణ బ డ్జెట్పైనే దేశ, విదేశీ ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టిసారించినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఆర్థిక వ్యవస్థ పురోగతికి సహాయపడే చర్యలుంటాయని భావిస్తున్నట్లు రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. దీంతో మార్కెట్లు పటిష్టంగా ట్రేడయ్యే అవకాశముందని అంచనా వేశారు. అయితే పలు గణాంకాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఈ వారం మార్కెట్లలో భారీ హెచ్చుతగ్గులకు అవకాశంలేకపోలేదని వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లు రిస్క్‌మేనేజ్‌మెంట్ నిబంధనలను అనుసరించడం మేలు చేకూరుస్తుందని సలహా ఇచ్చారు. ర్యాలీ కొనసాగుతుంది... ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌పై మార్కెట్ వర్గాలలో గరిష్టస్థాయిలో అంచనాలున్నాయని, దీంతో గడిచిన వారంలో కనిపించిన ర్యాలీ మరింత జోరందుకోవచ్చునని అత్యధిక శాతంమంది నిపుణులు అంచనా వేశారు. వృద్ధి, సంస్కరణలపై మోడీ ప్రభుత్వం చూపుతున్న ఆసక్తి ఇందుకు దోహదపడుతుందని తెలిపారు. మార్కెట్లలో నెలకొన్న భారీ అంచనాల నేపథ్యంలో బడ్జెట్ తరువాత కూడా ర్యాలీ కొనసాగేందుకు అవకాశముందని యాంప్లస్ కన్సల్టింగ్ ఎండీ ప్రవీణ్ నిగమ్ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా హెల్త్‌కేర్, ఇన్ఫ్రా, రక్షణ రంగాలు వెలుగులో నిలిచే వీలుందని పేర్కొన్నారు. రుతుపవనాల ఎఫెక్ట్ బడ్జెట్, ఫలితాలు, ఐఐపీ గణాంకాలకుతోడు రుతుపవనాల గమనం కూడా సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు వివరించారు. కాగా, సోమవారం(7) నుంచీ మార్కెట్లు మరింత పుంజుకుంటాయని జయంత్ అంచనా వేశారు. గడిచిన వారం మార్కెట్లు 3.5% ర్యాలీ చేయడం ద్వారా కొత్త రికార్డులను నమోదు చేశాయి. మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 862 పాయింట్లు లాభపడి కొత్త గరిష్టం 25,962 వద్ద నిలవగా, ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ సైతం 243 పాయింట్లు పురోగమించి 7,752 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. ఫండ్స్ పెట్టుబడులు 3,300 కోట్లు ఈక్విటీలలో దేశీ మ్యూచువల్ ఫండ్స్ జూన్ నెలలో రూ. 3,300 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. తద్వారా మార్కెట్లలో కనిపిస్తున్న పటిష్ట ర్యాలీ నేపథ్యంలో వరుసగా రెండో నెలలోనూ నికర పెట్టుబడిదారులుగా నిలిచాయి. అంతక్రితం మే నెలలో నికరంగా ఈక్విటీలలో రూ. 105 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించిన తాజా గణాంకాలివి. కాగా, మరోవైపు డెట్ మార్కెట్లో ఫండ్స్ మరింత అధికంగా ఇన్వెస్ట్చేయడం గమనార్హం. గడిచిన నెలలో ఫండ్స్ నికరంగా రూ. 68,000 కోట్ల విలువైన రుణ సెక్యూరిటీలను కొనుగోలు చేశాయి. నిజానికి దేశీ మ్యూచువల్ ఫండ్స్ గతేడాది సెప్టెంబర్ నుంచీ ఈక్విటీలలో నికర అమ్మకందారులుగా నిలుస్తూ వచ్చాయి. తొలిసారి ఈ బాటను వీడి మే నెలలో నికర కొనుగోలుదారులుగా నిలవడం విశేషం. కొనసాగుతున్న ఎఫ్ఐఐల జోరు.. దేశీ క్యాపిటల్ మార్కెట్లో ఈ క్యాలెండర్ ఏడాది తొలి అర్ధభాగంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు 20.4 బిలియన్ డాలర్లకు(రూ. 1.23 లక్షల కోట్లు) చేరాయి. జనవరి-జూన్ కాలంలో ఎఫ్ఐఐలు నికరంగా ఈక్విటీలలో 9.96 బిలియన్ డాలర్లను(రూ. 59,795 కోట్లు), డెట్ మార్కెట్లో 10.42 బిలియన్ డాలర్లను(రూ. 62,834 కోట్లు) ఇన్వెస్ట్ చేశారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించిన తాజా గణాంకాలివి. నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం, సంస్కరణలు, వృద్ధిపై కొత్త ప్రభుత్వం దృష్టిపెట్టడం వంటి అంశాలు విదేశీ పెట్టుబడులకు కారణంగా నిలుస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తొలి ఆరు నెలల్లో మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 20% దూసుకెళ్లింది. -
క్యాడ్ డేటా కీలకం!
న్యూఢిల్లీ: ఈ వారంలో మార్కెట్ కదలికలను ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పలు గణాంకాలు నిర్ధేశించనున్నాయి. ముఖ్యంగా జూన్ క్వార్టర్‌కు సంబంధించిన కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) డేటాతోపాటు సెప్టెంబర్ నెల ఆటోమొబైల్, సిమెంట్ కంపెనీల విక్రయాల గణాంకాలు కూడా వెలువడనున్నాయి. దీంతోపాటు వ్యాపార కార్యలాపాలపై పలు ప్రైవేటు సర్వేలు కూడా రానున్నాయి. ఇవన్నీ స్టాక్‌మార్కెట్ల గమనాన్ని ప్రభావితం చేయనున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క, ఈ వారంలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా సెలవు ఉండటంతో.. నాలుగు ట్రేడింగ్ రోజులు మాత్రమే ఉండటం కూడా గమనార్హం. ఇక ఈ ఏడాది(2013-14) సెప్టెంబర్‌తో ముగిసే రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాలు అక్టోబర్ రెండో వారంలో ప్రారంభం కానున్నాయి. కార్పొరేట్ ఫలితాలు మొదలయ్యేవరకూ స్టాక్ సూచీలు నిస్తేజంగానే కదలాడే అవకాశం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. అమెరికా రుణ పరిమితి అంశం, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లపై నిర్ణయం(అక్టోబర్ 2న) వంటి అంతర్జాతీయ పరిణామాలను కూడా ఇన్వెస్టర్లు నిశితంగానే గమనించనున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం. సోమవారం(30న) ఆర్బీఐ జూన్ క్వార్టర్(క్యూ1) క్యాడ్ గణాంకాలను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ తీవ్ర హెచ్చుతగ్గులకు గురై చివరకు నష్టాలతో ముగిసిన సంగతి తెలిసిందే. గతవారం మొత్తంమీద 537 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 17,727 వద్ద ముగిసింది. క్యాడ్ మళ్లీ పైకి... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికం(క్యూ1)లో క్యాడ్(మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చే, బయటికిపోయే విదేశీ మారక నిధుల మధ్య వ్యత్యాసం) మళ్లీ ఎగబాకే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జీడీపీతో పోలిస్తే క్యాడ్ 4 శాతంగా నమోదుకావచ్చని డీబీఎస్ పేర్కొంది. ముఖ్యంగా ఈ మూడు నెలల్లో బంగారం దిగుమతులు పెరగడం, ఎగుమతుల తగ్గుదలే దీనికి కారణమని తెలిపింది. గతేడాది(2012-13)లో రికార్డు స్థాయిలో 4.8 శాతానికి(88.8 బిలియన్ డాలర్లు) దూసుకెళ్లిన క్యాడ్... ఆఖరిదైన మార్చి క్వార్టర్లో మాత్రం కాస్త శాంతించి 3.6 శాతానికి(18.1 బిలియన్ డాలర్లు) పరిమితమైన సంగతి తెలిసిందే. మరోపక్క, క్యూ1లో క్యాడ్ 5%గా ఉండవచ్చునని ఆర్థిక శాఖ అంచనా వేసింది. క్యాడ్ పెరుగుదల ప్రభావంతోనే రూపాయి పతనమవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ కొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి(68.80) పడిపోయి.. ప్రస్తుతం 63 స్థాయిలో ఉంది. గణాంకాల వరుస... అక్టోబర్ 1న ఆటోమొబైల్ కంపెనీలు, సిమెంట్ అమ్మకాల గణాంకాలు వెలువడనున్నాయి. దీంతో మంగళవారం నాడు ఈ రెండు రంగాల స్టాక్స్‌పై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టిసారించనున్నారు. తయారీ రంగానికి సంబంధించి హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు కూడా రానున్నాయి. అక్టోబర్ 4న దేశీ సేవా రంగ పనితీరుపై సర్వే నివేదిక వెలువడనుంది. కాగా, దేశీయంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి భారీ పరిణామాలేవీ ప్రస్తుతానికి లేవని, అక్టోబర్ 2వ వారంలో క్యూ2 కార్పొరేట్ ఫలితాలు ప్రారంభమైన తర్వాతే మార్కెట్ ట్రెండ్‌ను అంచనావేయడానికి వీలవుతుందని కోటక్ సెక్యూరిటీస్ హెడ్(ప్రైవేట్ క్లయింట్ గ్రూప్) దీపేన్ షా వ్యాఖ్యానించారు. దేశీ కంపెనీల ఆర్థిక ఫలితాలు మందకొడిగానే ఉండొచ్చని కూడా ఆయన అంచనా వేశారు. ఎన్ఎస్ఈ నిఫ్టీలో స్వల్పకాలానికి బేరిష్ ధోరణి ఉండొచ్చని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. రానున్న ట్రేడింగ్ సెషన్లలో 5,800 పాయింట్లు.. నిఫ్టీకి కీలక నిర్ణాయక స్థాయి అని పేర్కొన్నారు. రూపాయి కదలికలు, అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణి కూడా మార్కెట్ దిశను నిర్ధేశించడంలో ప్రధాన పాత్ర పోషించనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికాలో ప్రభుత్వ రుణ పరిమితి విషయంపైనా ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నారు. అమెరికాలో వ్యయాల కోతపై చర్చిం చేందుకు మరికొంత గడువును కోరే అవకాశం ఉందని షా చెబుతున్నారు. కొనసాగుతున్న ఎఫ్ఐఐల జోరు... దేశీ స్టాక్ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ముఖ్యంగా పడిపోతున్న రూపాయి, మందగమనంలో చిక్కుకున్న వృద్ధికి ఊతమిచ్చేలా ఆర్బీఐ కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ తీసుకున్న పలు చర్యలు విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపుతున్నాయి. దీంతో సెప్టెంబర్ నెలలో 27వ తేదీ నాటికి 2.09 బిలియన్ డాలర్ల(సుమారు రూ.13,228 కోట్లు) నిధులను స్టాక్ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా కుమ్మరించారు. ఆగస్టులో నికరంగా రూ.16,000 కోట్లను వెనక్కితీసుకున్న విదేశీ పెట్టుబడిదారులు మళ్లీ సెప్టెంబర్‌లో కొనుగోళ్ల బాటపట్టడం గమనార్హం. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లలోకి నికరంగా రూ. 73,400 కోట్ల నిధులను పెట్టుబడిగా పెట్టగా.. డెట్ మార్కెట్ నుంచి రూ.36,914 కోట్లను నికరంగా ఉపసంహరించుకున్నారు. -
వృద్ధికి తూట్లు!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం అంతకంతకూ తీవ్రతరమవుతోంది. పస్తుత ఆర్థిక సంవత్సరం, మొదటి త్రైమాసికంతో (2013-14, ఏప్రిల్-జూన్, క్యూ1)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి మరింత కిందికి జారిపోయింది. నాలుగేళ్ల కనిష్ట స్థాయిలో 4.4 శాతంగా నమోదయ్యింది. కేంద్ర గణాంకాల సంస్థ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రధాన రంగాలైన తయారీ, మైనింగ్‌ల అత్యంత పేలవ పనితీరు ఈ గణాంకాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. 2012-13 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్‌తో పోల్చుకుంటే, గడచిన త్రైమాసికంలో ఈ రెండు రంగాల్లో అసలు వృద్ధి లేకపోగా, క్షీణతను నమోదుచేసుకున్నాయి. నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి, హోటల్స్ అండ్ రవాణాసహా పలు రంగాల్లో సైతం మెరుగైన ఫలితాలు లేకపోవడం వృద్ధి తీరును తీవ్రంగా దెబ్బతీసింది. 2012-13 ఇదే కాలంలో జీడీపీ వృద్ధి రేటు 5.4 శాతం. నెలల్లో వరుసగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో అంటే 2013 జనవరి-మార్చి మధ్య 4.8 శాతం. రెండు విధాలా పోల్చినా వృద్ధి రేటు పడిపోవడం ఆందోళన కలిగించే విషయమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. గత ఏడాది ఇదే కాలంతో పోల్చి, ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే వివిధ రంగాల తీరు ఇలా... అన్నీ తక్కువే... తయారీ: మొత్తం జీడీపీలో దాదాపు 15 శాతం వాటా కలిగిన తయారీ రంగం క్షీణత మరింత పెరిగింది. ఇది -1 శాతం నుంచి -1.2 శాతానికి పడింది. మైనింగ్, క్వారీయింగ్: 0.4 శాతంగా ఉన్న వృద్ధి రేటు, గడచిన క్వార్టర్లో 2.8 శాతం క్షీణత (-)లోకి జారిపోయింది. వ్యవసాయం: జీడీపీలో దాదాపు 14 శాతం వాటా ఉన్న ఈ రంగం వృద్ధి 2.9 శాతం నుంచి 2.7 శాతానికి తగ్గింది. సేవల రంగం: జీడీపీలో సగానికిపైగా వాటా కలిగిన ఈ రంగం (ఫైనాన్సింగ్, బీమా, రియల్టీసహా) వృద్ధి రేటు 9.3 శాతం నుంచి 8.9 శాతానికి తగ్గింది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా: ఈ రంగాల వృద్ధి రేటు 6.2 శాతం నుంచి 3.7 శాతానికి పడిపోయింది. నిర్మాణం: ఈ రంగం వృద్ధి రేటు కూడా భారీగా 7 శాతం నుంచి 2.8 శాతానికి దిగింది. వాణిజ్యం, హోటల్స్, రవాణా, కమ్యూనికేషన్లు: వృద్ధి 6.1 శాతం నుంచి 3.9 శాతానికి పడింది. కమ్యూనిటీ, సామాజిక, వ్యక్తిగత సేవలు: ఈ రంగంలో వృద్ధి రేటు మాత్రం స్వల్పంగా 8.9 శాతం నుంచి 9.4 శాతానికి పెరిగింది. దేశీయోత్పత్తి మొత్తంగా ఈ త్రైమాసికంలో 4.4 శాతం వృద్ధితో (2004-05 ధరల బేస్‌గా ఫ్యాక్టర్ కాస్ట్ అంటే పెరిగిన ధరల పరిగణన ప్రాతిపదికన) రూ.13,14,256 కోట్ల నుంచి రూ. 13,71,446 కోట్లకు చేరింది. తక్షణ చర్యలు అవసరం ఆర్థిక మందగమనం నుంచి దేశాన్ని బయటపడేయడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక వర్గాలు విజ్ఞప్తి చేశాయి. పెట్టుబడిదారు సెంటిమెంట్ మెరుగుపడలేదని, ఇది దిగువస్థాయిలోనే ఉందని గణాంకాలు పేర్కొంటున్నాయని విశ్లేషిం చారు. ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సహకారాత్మక చర్య లు అవసరమని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ విశ్లేషించారు. ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తి కనిష్ట స్థాయిలను చూడకపోగా, ఇంకా దిగువకు పడిపోవచ్చన్న సంకేతాలను గణాంకాలు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సం స్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేయ డం, విద్యుత్ రంగానికి బొగ్గు సరఫరాలను మెరుగుపరచడం, మైనింగ్ రంగంలో పోటీతత్వాన్ని పెంపొం దించడం, ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ అమలును వేగవంతం చేయడం సానుకూల పరిణామాలకు దారితీస్తాయని వివరించారు. సాధారణ వర్షపాతం నమోదయితే, వ్యవసాయ దిగుబడులు పెరిగి గ్రామీణ ఆదాయాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడుతూ, ఇదే జరిగితే గ్రామీణ డిమాండ్ మెరుగుదలకు, ఆర్థికాభివృద్ధికి ఇది దోహదపడే అవకాశం ఉందని సైతం ఈ సందర్భంగా విశ్లేషించారు. తక్షణ చర్యలకు ఉపక్రమించాల్సిన తరుణమిదని ప్రత్యేకించి తయారీ రంగంలో సంస్కరణలు అవసరం అని ఫిక్కీ ప్రెసిడెంట్ నైనాలాల్ కిద్వాయ్ అన్నారు. అనుకుంటున్నదే... వృద్ధి మందగమనంలో ఉందన్న విషయం తెలిసిందే. మొదటి త్రైమాసిక ఫలితాలు బాగుంటాయని మనం ఎప్పుడూ భావించలేదు. ఇకపై పరిస్థితి మెరుగుపడుతుంది. గడచిన రెండు మూడు నెలలుగా తీసుకున్న పలు చర్యల వల్ల రెండో త్రైమాసికం, ద్వితీయార్ధంలో మాత్రం మెరుగైన ఫలితాలను చూడవచ్చు. - మాంటెక్ సింగ్, ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ భవిష్యత్ బాగుంటుంది... ప్రస్తుతానికి దేశ జీడీపీ వృద్ధిరేటు మందగమనంలోనే ఉన్నా.. రానున్న కాలంలో పుంజుకోనుంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వృద్ధి మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నాం. అదేవిధంగా మూడు, నాలుగో త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ పనితీరు మరింత బాగుంటుంది. - అరవింద్ మయారామ్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ముందుముందు కష్టమే... పారిశ్రామిక రంగంలో వ్యవస్థాగత లోటుపాట్లు సరిచేయనిదే భవిష్యత్తులో సైతం వృద్ధి రేటు పుంజుకోవడం సాధ్యం కాదు. పైగా గణాంకాలు మరింత దిగజారే అవకాశమూ ఉంది. అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీ సానుకూల ప్రభావం దేశంలోని సేవల రంగంపై కనబడుతుంది. - అనీస్ చక్రవర్తి, డెలాయిట్