ముంబై: టెక్స్‌టైల్స్ సంస్థ ఇండోకౌంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మంగళవారం ఆర్థిక ఫలితాలనుప్రకటించింది. నికర లాభం15.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో రూ. 60.3 కోట్ల నికర లాభాలను గడించింది. గత ఏడాది నికర లాభాలు రూ.52 కోట్లుగా ఉన్నాయి. రూ.493 కోట్ల మొత్తం ఆదాయాన్ని సాధించింది. ఈ క్వార్టర్ లోరూ.539కోట్ల ఆదాయాన్ని సాధిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేసాయి. నికర లాభాల్లో వృద్ది ఉన్నప్పటికీ ఆదాయం క్షీణించడంతో షేర్ ధర దాదాపు 7 శాతం నష్టపోయింది. భారీ అమ్మకాలతో కౌంటర్ డీలా పడిన ఇండో కౌంట్ ఉదయం సెషన్ లో 11 శాతానికిపైగా పతనమైంది. ఒక దశలో షేరు ధర రూ. 798 వద్ద కనిష్టాన్ని తాకింది.
ఫలితాలతో డీలా పడిన ఇండోకౌంట్ షేర్
Published Tue, Aug 23 2016 3:12 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
Advertisement
Advertisement