
సెమికండక్టర్ల కొరత, సరఫరా అడ్డంకులు, ముడి సరుకు, రవాణా వ్యయాలు పెరిగినప్పటికీ ఎస్‌యూవీలు, సెడాన్స్‌కు విపరీత డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఈ ఏడాది జనవరి–మార్చిలో 4,022 యూనిట్లు విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 26 శాతం అధికం.
సెమికండక్టర్ల కొరత, సరఫరా అడ్డంకులు, ముడి సరుకు, రవాణా వ్యయాలు పెరిగినప్పటికీ ఎస్‌యూవీలు, సెడాన్స్‌కు విపరీత డిమాండ్ ఉందని కంపెనీ తెలిపింది. 4,000 యూనిట్లకు పైగా ఉన్న అత్యధిక ఆర్డర్ బుక్ రాబోయే నెలల్లో సానుకూల దృక్పథానికి దారి తీస్తుందని వివరించింది.
అమ్మకాల్లో ఈ–క్లాస్ లాంగ్ వీల్‌బేస్ సెడాన్, జీఎల్‌సీ, జీఎల్‌ఏ, జీఎల్‌ఈ ఎస్‌యూవీలు టాప్‌లో నిలిచాయి. ఏఎంజీ, సూపర్ లగ్జరీ కార్ల విభాగం 35 శాతం వృద్ధి చెందింది. ప్రస్తుతం మోడల్‌నుబట్టి వెయిటింగ్ పీరియడ్ అత్యధికంగా 11 నెలల వరకూ ఉంది.
చదవండి: యజమానులు ఉద్యోగులకు కార్లు గిప్ట్ గా ఇస్తారా? ఇదిగో ఈయన ఇస్తున్నాడు!!