హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఏప్రిల్–జూన్‌లో దేశవ్యాప్తంగా 3,551 యూనిట్లు విక్రయించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రెండింతలకుపైగా వృద్ధి సాధించింది.
కంపెనీకి ఇప్పటి వరకు అత్యధిక అమ్మకాలు నమోదైన రెండవ త్రైమాసికం కూడా ఇదే. జనవరి–జూన్‌లో 56 శాతం వృద్ధితో 7,573 యూనిట్ల అమ్మకాలను రికార్డు చేసింది. సరఫరా సమస్యలు ఉన్నప్పటికీ ఈ ఘనత సాధించడం విశేషమని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో మార్టిన్ ష్వింక్ తెలిపారు.
సెమికండక్టర్ల కొరత మరికొన్ని నెలలపాటు కొనసాగుతుందని చెప్పారు. ప్రస్తుతం 6,000లకుపైగా కార్లకు ఆర్డర్లు ఉన్నాయని వెల్లడించారు. భారతీయ కస్టమర్లు ఎంతగానో ఎదురు చూస్తున్న అంతర్జాతీయ మోడళ్లు కొన్ని మూడవ త్రైమాసికంలో అడుగు పెట్టనున్నాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment