ఐషర్ మోటార్స్ లాభం 59 శాతం వృద్ధి
ఐషర్ మోటార్స్: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి రూ.376 కోట్ల నికర లాభం(కన్సాలిటేడెట్) సాధించింది. గత క్యూ1లో ఆర్జించిన నికర లాభం(రూ. 237 కోట్లు)తో పోల్చితే 59 శాతం వృద్ధి సాధించింది. మొత్తం ఆదాయం రూ.1,096 కోట్ల నుంచి రూ.1,556 కోట్లకు పెరిగింది. షేర్ ధర బీఎస్‌ఈలో 4 శాతం వరకూ పెరిగి రూ.2,075 వద్ద ముగిసింది.
జీఎస్‌కే ఫార్మా లాభం 23 శాతం డౌన్
గ్లాక్సోస్మిత్‌లైన్ ఫార్మా ఈ క్యూ1లో రూ.72 కోట్ల నికర లాభం(స్టాండోలోన్) సాధించింది. గత క్యూ1లో సాధించిన నికర లాభం(రూ.94 కోట్లు)తో పోల్చితే 23 శాతం క్షీణించిందని పేర్కొంది. వ్యయాలు పెరగడమే దీనికి కారణమని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.652 కోట్ల నుంచి రూ.705 కోట్లకు పెరిగిందని వివరించింది. బీఎస్‌ఈలో కంపెనీ షేర్ 1 శాతం నష్టపోయి రూ.3,348 వద్ద ముగిసింది.
ముత్తూట్ ఫైనాన్స్
ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.270 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ1లో సాధించిన నికర లాభం(రూ. 183 కోట్లు)తో పోల్చితే 48 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. రిటైల్ రుణాలు రూ.1,000 కోట్ల నుంచి 48 శాతం వృద్ధితో రూ.1,481కోట్లకు పెరిగాయని వివరించింది. నిర్వహణ ఆస్తులు రూ.24,409 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ25,860 కోట్లకు పెరిగాయని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.1,301 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ.1,143 కోట్లకు పెరిగిందని వివరించింది. బీఎస్‌ఈలో షేర్ ధర 3 శాతం వృద్ధితో రూ.319 వద్ద ముగిసింది.
సియట్ లాభం 17 శాతం డౌన్
టైర్ల తయారీ కంపెనీ సియట్ ఈ క్యూ1లో రూ.93 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ1లో ఆర్జించిన నికర లాభం(రూ.113 కోట్లు)తో పోల్చితే 17 శాతం క్షీణత నమోదైంది. నికర అమ్మకాలు రూ.1,404 కోట్ల నుంచి రూ.1,461 కోట్లకు పెరిగాయి. బీఎస్‌ఈలో కంపెనీ షేర్ స్వల్పంగా పెరిగి రూ.884 వద్ద ముగిసింది.