ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కాపెక్స్ (మూలధనం) వ్యయంలో ఇతర రాష్ట్రాలకంటే కూడా ముందంజలో అగ్రగామిగా అవతరించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) డేటా ప్రకారం.. ఏప్రిల్ - జూన్ కాలంలో ఆంధ్రప్రదేశ్ మూలధన వ్యయంలో రూ. 12,669 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. కాగా FY24కి రాష్ట్ర కాపెక్స్ బడ్జెట్ రూ. 31,061 కోట్లుతో 41 శాతంగా ఉంది.
ఇక్కడ తెలుసుకోవలసిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తెలంగాణ మూలధన వ్యయం కూడా గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 8 శాతంతో పోలిస్తే FY24 బడ్జెట్‌లో 27 శాతానికి పెరిగింది. క్యూ1లో వార్షిక లక్ష్యంలో 20 శాతానికి పైగా సాధించిన ఇతర రాష్ట్రాలుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఉన్నాయి.
20 రాష్ట్రాల కాపెక్స్ ఖర్చులను విశ్లేషించిన రేటింగ్ ఏజెన్సీ.. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లు కలిసి మొదటి త్రైమాసికంలో మొత్తం క్యాపెక్స్‌లో 56.4 శాతంగా ఉన్నాయని పేర్కొంది. పటిష్టమైన పన్ను వసూళ్లు, వ్యయం తగ్గడం, ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో సబ్సిడీలు, జీతాల చెల్లింపుల ద్వారా కాపెక్స్ వృద్ధి కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ తన బడ్జెట్ రెవెన్యూ రాబడిలో క్యూ1లో 22 శాతాన్ని సాధించింది. ఇది క్రితం సంవత్సరం త్రైమాసికంలో 18 శాతంగా ఉంది. గత సంవత్సరంతో పోల్చితే ఈ త్రైమాసికంలో వడ్డీ, పెన్షన్, సబ్సిడీ చెల్లింపులు వంటి వ్యయాలను నియంత్రించడంలో కూడా రాష్ట్రం బాగా పనిచేసింది.
Comments
Please login to add a commentAdd a comment