లాభాల్లో ఇండస్ ఇండ్...తప్పని బ్యాడ్ లోన్ భారం | IndusInd Bank Q1 Net Up 26% But Higher Bad Loans Weigh On Shares | Sakshi
Sakshi News home page

లాభాల్లో ఇండస్ ఇండ్...తప్పని బ్యాడ్ లోన్ భారం

Published Mon, Jul 11 2016 4:06 PM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM

లాభాల్లో ఇండస్ ఇండ్...తప్పని బ్యాడ్ లోన్  భారం

లాభాల్లో ఇండస్ ఇండ్...తప్పని బ్యాడ్ లోన్ భారం

ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు జోరు నేటినుంచి ప్రారంభమైంది. ప్రైవేట్ రంగానికి చెందిన ఇండస్ ఇండ్ బ్యాంకు తొలి త్రైమాసికంలో నికర లాభాల్లో అదరగొట్టింది. 2016 జూన్ 30కు ముగిసిన త్రైమాసికంలో నికర లాభాలు 26శాతం జంప్ అయి, రూ.661 కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు నికరలాభాలు రూ.525 కోట్లగా ఉన్నాయి. నికర వడ్డీ ఆదాయం పెరగడంతో బ్యాంకు లాభాల బాటలో నడిచింది. నికర వడ్డీ ఆదాయం ఈ త్రైమాసికంలో రూ.1,325 కోట్లగా రికార్డు అయ్యాయి. ఈ ఆదాయాలు గతేడాది ఇదే క్వార్టర్లో రూ.980 కోట్లగా ఉన్నాయి.

అయితే ప్రైవేట్ రంగానికి చెందిన ఈ బ్యాంకు కేవలం రూ.653 కోట్లను మాత్రమే నికర లాభాలుగా నమోదుచేస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంచనావేశారు. విశ్లేషకుల అంచనాల కంటే కాస్త అధికంగానే బ్యాంకు లాభాలను నమోదుచేసింది. నికర వడ్డీ మార్జిన్లు ఈ త్రైమాసికంలో 3.97శాతం మెరుగయ్యాయి.

అయితే బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు(నాన్ ఫర్ ఫార్మింగ్ ఆస్తులు) జూన్ క్వార్టర్లో రూ.776 కోట్లనుంచి రూ.860 కోట్లకు ఎగిశాయి. అదేవిధంగా నికర నిరర్ధక ఆస్తుల సైతం 0.36శాతం నుంచి 0.38శాతానికి పెరిగాయి. దీంతో బ్యాడ్ లోన్స్ ప్రభావం స్టాక్ మార్కెట్లో బ్యాంకు షేర్లపై పడింది. ఇండస్ ఇండ్ బ్యాంకు షేరు రూ.0.24శాతం పడిపోయి రూ.1,124వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement