net up
-
క్యూ2లో కర్ణాటక బ్యాంక్ రికార్డు లాభాలు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ కర్ణాటక బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై-సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 228 శాతం దూసుకెళ్లి రూ. 411 కోట్లను అధిగమించింది. ఇది ఒక క్వార్టర్లో బ్యాంక్ చరిత్రలోనే అత్యధికంకాగా.. గతేడాది(2021-22) ఇదే కాలంలో కేవలం రూ. 125 కోట్లు ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం సైతం 26 శాతం ఎగసి రూ. 803 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.03 శాతం నుంచి 3.36 శాతానికి, నికర ఎన్పీఏలు 2.16 శాతం నుంచి 1.72 శాతానికి దిగివచ్చాయి. ఫలితాల నేపథ్యంలో కర్ణాటక బ్యాంక్ షేరు బీఎస్ఈలో 20 శాతం దూసుకెళ్లి రూ. 113 వద్ద ముగిసింది. -
ఎఫ్ఎంసీజీ దిగ్గజం లాభాలు పెంచేసింది!
ముంబై : ఓ వైపు నుంచి పతంజలి నుంచి గట్టి పోటీ, మరోవైపు నుంచి ఎకానమీలో నగదు కొరత ఎదుర్కొంటున్నప్పటికీ ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందూస్తాన్ యూనీలివర్ మెరుగైన లాభాలనే ఆర్జించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలను 7 శాతం పెంచుకుని, రూ.1038 కోట్లగా నమోదుచేసింది. గత ఆర్థికసంవత్సరంలో ఈ కంపెనీ లాభాలు రూ.971.66 కోట్లగా ఉన్నాయి. క్వార్టర్ సమీక్షలో కంపెనీ అమ్మకాలు రూ.8,124.48 కోట్లగా ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరం కంటే 1 శాతం తగ్గాయి. అయితే ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఈ క్వార్టర్లో నికర లాభాలు 0.5 శాతం కోల్పోతుందని విశ్లేషకులు అంచనావేశారు. మొత్తం ఆదాయం, లాభాలు పడిపోతాయనుకున్నారు. నికర లాభాల్లో మెరుగైన ప్రదర్శన చూపిన హిందూస్తాన్ యూనీలివర్, ఆదాయాల్లో కొంత పడిపోయింది. ఇన్పుట్ కాస్ట్‌లు పెరగడంతో ఉత్పత్తుల ధరలు 60 బేసిస్ పాయింట్లు పెరిగినట్టు కంపెనీ పేర్కొంది. ఈబీఐటీడీఏలు 5 శాతం తగ్గినట్టు హెచ్‌యూఎల్ తెలిపింది. నగదు కొరత పరిస్థితులు మార్కెట్‌పై తాత్కాలిక ప్రభావం చూపిందని కంపెనీ చైర్మన్ హరీశ్ మన్వాని తెలిపారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులకు సంకేతాలు వెలువడుతున్నాయని, తమ వాల్యుమ్ గ్రోత్, మార్జిన్లను మెరుగుపరుచుకోవడం కోసం నూతనావిష్కరణలపై ఎక్కువగా ఫోకస్ చేస్తామన్నారు. హోమ్ కేర్ సెగ్మెంట్ మెరుగైన ప్రదర్శన చూపిందని, సర్ఫ్‌లో రెండింతలు వృద్ధి సాధించామన్నారు. -
హెచ్‌యూఎల్‌ను నిరాశపర్చిన వాల్యుమ్ గ్రోత్
ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ అయిన హిందూస్తాన్ యూనిలివర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్) తొలి త్రైమాసిక ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను తాకలేకపోయింది. బలహీనమైన వాల్యుమ్ వృద్ధిని నమోదుచేసి మార్కెట్లను నిరాశపరిచింది. సోమవారం విడుదల చేసిన ఏప్రిల్-జూన్ తొలి త్రైమాసిక ఫలితాల్లో నికర లాభాలను 9.8 శాతం ఎక్కువగా నమోదుచేసినప్పటికీ, బలహీనమైన వాల్యుమ్ వృద్ధితో కంపెనీ షేర్లు పతనమయ్యాయి. అయితే కంపెనీ సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో యేటికేటికీ కంపెనీ నికరలాభాలు రూ.1,174కోట్లగా నమోదయ్యాయి. ఆదాయం 3శాతం వృద్ధితో రూ.8,235.70 కోట్లగా రికార్డుచేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నికర ఆదాయం రూ.7,967.43 కోట్లగా ఉన్నాయి. యేటికేటికి వాల్యుమ్ గ్రోత్ 4శాతంగా నమోదుచేసి, విశ్లేషకుల అంచనాలు తారుమారు చేసింది. వాల్యుమ్ గ్రోత్ తక్కువగా ఉండటంతో, కంపెనీ షేర్లు 2.04శాతం పతనమై, రూ.920.45గా నమోదైంది. నికర అమ్మకాలు 3.56శాతం పెరిగి, రూ.7,987.74 కోట్లగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ అమ్మకాలు కేవలం రూ.7,712.71 కోట్లు మాత్రమే. -
లాభాల్లో ఇండస్ ఇండ్...తప్పని బ్యాడ్ లోన్ భారం
ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు జోరు నేటినుంచి ప్రారంభమైంది. ప్రైవేట్ రంగానికి చెందిన ఇండస్ ఇండ్ బ్యాంకు తొలి త్రైమాసికంలో నికర లాభాల్లో అదరగొట్టింది. 2016 జూన్ 30కు ముగిసిన త్రైమాసికంలో నికర లాభాలు 26శాతం జంప్ అయి, రూ.661 కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు నికరలాభాలు రూ.525 కోట్లగా ఉన్నాయి. నికర వడ్డీ ఆదాయం పెరగడంతో బ్యాంకు లాభాల బాటలో నడిచింది. నికర వడ్డీ ఆదాయం ఈ త్రైమాసికంలో రూ.1,325 కోట్లగా రికార్డు అయ్యాయి. ఈ ఆదాయాలు గతేడాది ఇదే క్వార్టర్లో రూ.980 కోట్లగా ఉన్నాయి. అయితే ప్రైవేట్ రంగానికి చెందిన ఈ బ్యాంకు కేవలం రూ.653 కోట్లను మాత్రమే నికర లాభాలుగా నమోదుచేస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంచనావేశారు. విశ్లేషకుల అంచనాల కంటే కాస్త అధికంగానే బ్యాంకు లాభాలను నమోదుచేసింది. నికర వడ్డీ మార్జిన్లు ఈ త్రైమాసికంలో 3.97శాతం మెరుగయ్యాయి. అయితే బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు(నాన్ ఫర్ ఫార్మింగ్ ఆస్తులు) జూన్ క్వార్టర్లో రూ.776 కోట్లనుంచి రూ.860 కోట్లకు ఎగిశాయి. అదేవిధంగా నికర నిరర్ధక ఆస్తుల సైతం 0.36శాతం నుంచి 0.38శాతానికి పెరిగాయి. దీంతో బ్యాడ్ లోన్స్ ప్రభావం స్టాక్ మార్కెట్లో బ్యాంకు షేర్లపై పడింది. ఇండస్ ఇండ్ బ్యాంకు షేరు రూ.0.24శాతం పడిపోయి రూ.1,124వద్ద ముగిసింది.