ఎఫ్ఎంసీజీ దిగ్గజం లాభాలు పెంచేసింది!
ఎఫ్ఎంసీజీ దిగ్గజం లాభాలు పెంచేసింది!
Published Mon, Jan 23 2017 6:18 PM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM
ముంబై : ఓ వైపు నుంచి పతంజలి నుంచి గట్టి పోటీ, మరోవైపు నుంచి ఎకానమీలో నగదు కొరత ఎదుర్కొంటున్నప్పటికీ ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందూస్తాన్ యూనీలివర్ మెరుగైన లాభాలనే ఆర్జించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలను 7 శాతం పెంచుకుని, రూ.1038 కోట్లగా నమోదుచేసింది. గత ఆర్థికసంవత్సరంలో ఈ కంపెనీ లాభాలు రూ.971.66 కోట్లగా ఉన్నాయి. క్వార్టర్ సమీక్షలో కంపెనీ అమ్మకాలు రూ.8,124.48 కోట్లగా ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరం కంటే 1 శాతం తగ్గాయి. అయితే ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఈ క్వార్టర్లో నికర లాభాలు 0.5 శాతం కోల్పోతుందని విశ్లేషకులు అంచనావేశారు.
మొత్తం ఆదాయం, లాభాలు పడిపోతాయనుకున్నారు. నికర లాభాల్లో మెరుగైన ప్రదర్శన చూపిన హిందూస్తాన్ యూనీలివర్, ఆదాయాల్లో కొంత పడిపోయింది. ఇన్పుట్ కాస్ట్లు పెరగడంతో ఉత్పత్తుల ధరలు 60 బేసిస్ పాయింట్లు పెరిగినట్టు కంపెనీ పేర్కొంది. ఈబీఐటీడీఏలు 5 శాతం తగ్గినట్టు హెచ్యూఎల్ తెలిపింది. నగదు కొరత పరిస్థితులు మార్కెట్పై తాత్కాలిక ప్రభావం చూపిందని కంపెనీ చైర్మన్ హరీశ్ మన్వాని తెలిపారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులకు సంకేతాలు వెలువడుతున్నాయని, తమ వాల్యుమ్ గ్రోత్, మార్జిన్లను మెరుగుపరుచుకోవడం కోసం నూతనావిష్కరణలపై ఎక్కువగా ఫోకస్ చేస్తామన్నారు. హోమ్ కేర్ సెగ్మెంట్ మెరుగైన ప్రదర్శన చూపిందని, సర్ఫ్లో రెండింతలు వృద్ధి సాధించామన్నారు.
Advertisement
Advertisement