volume growth
-
ఎఫ్ఎంసీజీ కంపెనీలకు ద్రవ్యోల్బణం షాక్! అక్కడ డిమాండ్ ఢమాల్!
ముంబై: ఎఫ్ఎంసీజీ కంపెనీలు వ్యాపారంలో స్తబ్దతను చూస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ సన్నగిల్లడం, అధిక ద్రవ్యోల్బణం పరిస్థితుల నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ ఆదాయాల్లో పెద్దగా వృద్ధి కనిపించదని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికే పరిమితం కాకుండా, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే పరిస్థితి కొనసాగొచ్చని పేర్కొంది. 2022-23లో 7-9 శాతం మధ్య ఆదాయంలో వృద్ధి నమోదు కావచ్చన్న అంచనాను వెల్లడించింది. (బడా టెక్ కంపెనీల నియంత్రణలో వైఫల్యం: కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు) గత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ఆదాయం 8.5 శాతం వృద్ధిని చూడడం గమనార్హం. ‘‘రూ.4.7 లక్షల కోట్ల మొత్తం ఆదాయంలో 40 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తోంది. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో అధిక ద్రవ్యోల్బణం, తగ్గిన వేతనాలు, కరోనాతో ఉపాధి నష్టం పరిస్థితులు నెలకొన్నట్టు’’ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఎఫ్ఎంసీజీ రంగంపై ఓ నివేదికను విడుదల చేసింది. తయారీ వ్యయాలు పెరగడంతో, మార్జిన్లను కాపాడుకునేందుకు కరోనా అనంతరం విడతల వారీగా రేట్లను ఎఫ్ఎంసీజీ కంపెనీలు పెంచాయి. దీని ప్రభావం కూడా వృద్ధిపై ఉన్నట్టు ఈ నివేదిక వివరించింది. (టెల్కోలకు భారీ ఊరట, 4జీ యూజర్లకు గుడ్ న్యూస్) ధరలు తగ్గితే అనుకూలం.. ద్రవ్యోల్బణం ఇప్పటికీ గరిష్ట స్థాయిల్లోనే ఉన్నందున వచ్చే ఆర్థిక సంవత్సరం సైతం ఆదాయంలో వృద్ధి ఇప్పటి మాదిరే ఉండొచ్చని, ఒకవేళ ధరలు దిగొస్తే పరిస్థితి మెరుగుపడొచ్చన్నది క్రిసిల్ విశ్లేషణ. కంపెనీల నిర్వహణ మార్జిన్లు 1-1.5 శాతం తగ్గి 18-19 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. తయారీ వ్యయాలు (గోధుమ, పాలు, మొక్కజొన్న, బియ్యం, చమురు), మార్కెటింగ్ వ్యయాలు అధికంగా ఉండడాన్ని ప్రస్తావించింది. ఇవి గత నాలుగైదు త్రైమాసికాలుగా పెంచిన ధరల అనుకూలతను తగ్గించినట్టు వివరించింది. ఇక వంట నూనెలు, చక్కెర ధరలు తగ్గినందున కొంత అనుకూలిస్తుందని పేర్కొంది. రూ.4.7 లక్షల కోట్ల ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో 35 శాతం వాటా కలిగిన 76 కంపెనీల వివరాలను క్రిసిల్ విశ్లేషించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ మార్జిన్లు 0.50–0.70 శాతం మేర పెరగొచ్చని అంచనా వేసింది. ధరల ప్రభావం.. పట్టణ వినియోగంపై ద్రవ్యోల్బణం (రేట్ల పెరుగుదల) ప్రభావం తక్కువగానే ఉందని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. 2020-2021లో మాదిరే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ స్తబ్ధుగానే ఉంటుందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంత్లాలో చిన్న ప్యాకెట్లకు డిమాండ్ పెరగడాన్ని క్రిసిల్ ప్రస్తావించింది. పంటలకు అధిక కనీస మద్దతు ధరలు, సాగు దిగుబడి మెరుగ్గా ఉండడం గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ వచ్చే ఆర్థిక సంత్సరంలో పుంజుకుంటుందని చెప్పడానికి సంకేతాలుగా తెలియజేసింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం పట్టణాల్లో డిమాండ్ స్థిరంగా ఉంటుందని క్రిసిల్ అంచనా వేసింది. ఇక ఫుడ్ అండ్ బెవరేజెస్ అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 8-10 శాతం పెరగొచ్చని పేర్కొంది. గృహ సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ అమ్మకాల్లో 6-8 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. -
మార్కెట్లు బోర్లా- ఈ చిన్న షేర్లు భలేభలే
ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు క్షీణ పథంలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 162 పాయింట్లు తక్కువగా 39,588కు చేరగా.. నిఫ్టీ 44 పాయింట్లు బలహీనపడి 11,627 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో టీవీఎస్ మోటార్, వైభవ్ గ్లోబల్ లిమిటెడ్, బజాజ్ హెల్త్‌కేర్, ధని సర్వీసెస్, ఆసమ్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. టీవీఎస్ మోటార్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 7 శాతం జంప్‌చేసి రూ. 450 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 461 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 62,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 2.04 లక్షల షేర్లు చేతులు మారాయి. వైభవ్ గ్లోబల్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 6.4 శాతం లాభపడి రూ. 1,979 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2,040 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం కేవలం 1,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 4,000 షేర్లు చేతులు మారాయి. బజాజ్ హెల్త్‌కేర్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం దూసుకెళ్లి రూ. 545 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 590 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 43,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 2.6 లక్షల షేర్లు చేతులు మారాయి. ధని సర్వీసెస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.5 శాతం జంప్‌చేసి రూ. 194 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో పాక్షిక చెల్లింపుల ఈ షేరు మరింత అధికంగా 12 శాతం పెరిగి రూ. 93కు చేరింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 74,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 45,000 షేర్లు చేతులు మారాయి. ఆసమ్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 11 శాతం పురోగమించి రూ. 55 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 5,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 4,200 షేర్లు చేతులు మారాయి. -
ఈ చిన్న షేర్లు.. రన్ రాజా రన్
విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల పరుగు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా మార్కెట్లను మార్కెట్లను మించి భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో హెచ్ఐఎల్ లిమిటెడ్, డీఎల్ఎఫ్ లిమిటెడ్, టీసీఎన్ఎస్ క్లాతింగ్, జీవోసీఎల్ కార్పొరేషన్, వెండ్(Wendit) ఇండియా చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. టీసీఎన్ఎస్ క్లాతింగ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 8.5 శాతం జంప్ చేసింది. రూ. 445 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 4,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 16,000 షేర్లు చేతులు మారాయి. డీఎల్ఎఫ్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 11 శాతం ర్యాలీ చేసింది. రూ. 177 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 9 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 26.53 లక్షల షేర్లు చేతులు మారాయి. వెండ్ ఇండియా ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 3,887 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టం కావడం విశేషం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 150 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 5,100 షేర్లు చేతులు మారాయి. జీవోసీఎల్ కార్పొరేషన్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 9.5 శాతం జంప్‌చేసింది. రూ. 211 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 14,500 షేర్లు చేతులు మారాయి. హెచ్ఐఎల్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 13 శాతం దూసుకెళ్లి రూ. 1834 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1879 వరకూ ఎగసింది. ఇది ఏడాది గరిష్టంకావడం విశేషం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 5,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 9,500 షేర్లు చేతులు మారాయి. -
ఎఫ్ఎంసీజీ దిగ్గజం లాభాలు పెంచేసింది!
ముంబై : ఓ వైపు నుంచి పతంజలి నుంచి గట్టి పోటీ, మరోవైపు నుంచి ఎకానమీలో నగదు కొరత ఎదుర్కొంటున్నప్పటికీ ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందూస్తాన్ యూనీలివర్ మెరుగైన లాభాలనే ఆర్జించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలను 7 శాతం పెంచుకుని, రూ.1038 కోట్లగా నమోదుచేసింది. గత ఆర్థికసంవత్సరంలో ఈ కంపెనీ లాభాలు రూ.971.66 కోట్లగా ఉన్నాయి. క్వార్టర్ సమీక్షలో కంపెనీ అమ్మకాలు రూ.8,124.48 కోట్లగా ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరం కంటే 1 శాతం తగ్గాయి. అయితే ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఈ క్వార్టర్లో నికర లాభాలు 0.5 శాతం కోల్పోతుందని విశ్లేషకులు అంచనావేశారు. మొత్తం ఆదాయం, లాభాలు పడిపోతాయనుకున్నారు. నికర లాభాల్లో మెరుగైన ప్రదర్శన చూపిన హిందూస్తాన్ యూనీలివర్, ఆదాయాల్లో కొంత పడిపోయింది. ఇన్పుట్ కాస్ట్‌లు పెరగడంతో ఉత్పత్తుల ధరలు 60 బేసిస్ పాయింట్లు పెరిగినట్టు కంపెనీ పేర్కొంది. ఈబీఐటీడీఏలు 5 శాతం తగ్గినట్టు హెచ్‌యూఎల్ తెలిపింది. నగదు కొరత పరిస్థితులు మార్కెట్‌పై తాత్కాలిక ప్రభావం చూపిందని కంపెనీ చైర్మన్ హరీశ్ మన్వాని తెలిపారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులకు సంకేతాలు వెలువడుతున్నాయని, తమ వాల్యుమ్ గ్రోత్, మార్జిన్లను మెరుగుపరుచుకోవడం కోసం నూతనావిష్కరణలపై ఎక్కువగా ఫోకస్ చేస్తామన్నారు. హోమ్ కేర్ సెగ్మెంట్ మెరుగైన ప్రదర్శన చూపిందని, సర్ఫ్‌లో రెండింతలు వృద్ధి సాధించామన్నారు. -
హెచ్‌యూఎల్‌ను నిరాశపర్చిన వాల్యుమ్ గ్రోత్
ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ అయిన హిందూస్తాన్ యూనిలివర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్) తొలి త్రైమాసిక ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను తాకలేకపోయింది. బలహీనమైన వాల్యుమ్ వృద్ధిని నమోదుచేసి మార్కెట్లను నిరాశపరిచింది. సోమవారం విడుదల చేసిన ఏప్రిల్-జూన్ తొలి త్రైమాసిక ఫలితాల్లో నికర లాభాలను 9.8 శాతం ఎక్కువగా నమోదుచేసినప్పటికీ, బలహీనమైన వాల్యుమ్ వృద్ధితో కంపెనీ షేర్లు పతనమయ్యాయి. అయితే కంపెనీ సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో యేటికేటికీ కంపెనీ నికరలాభాలు రూ.1,174కోట్లగా నమోదయ్యాయి. ఆదాయం 3శాతం వృద్ధితో రూ.8,235.70 కోట్లగా రికార్డుచేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నికర ఆదాయం రూ.7,967.43 కోట్లగా ఉన్నాయి. యేటికేటికి వాల్యుమ్ గ్రోత్ 4శాతంగా నమోదుచేసి, విశ్లేషకుల అంచనాలు తారుమారు చేసింది. వాల్యుమ్ గ్రోత్ తక్కువగా ఉండటంతో, కంపెనీ షేర్లు 2.04శాతం పతనమై, రూ.920.45గా నమోదైంది. నికర అమ్మకాలు 3.56శాతం పెరిగి, రూ.7,987.74 కోట్లగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ అమ్మకాలు కేవలం రూ.7,712.71 కోట్లు మాత్రమే.