విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల పరుగు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా మార్కెట్లను మార్కెట్లను మించి భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో హెచ్‌ఐఎల్ లిమిటెడ్, డీఎల్‌ఎఫ్ లిమిటెడ్, టీసీఎన్‌ఎస్ క్లాతింగ్, జీవోసీఎల్ కార్పొరేషన్, వెండ్(Wendit) ఇండియా చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..
టీసీఎన్‌ఎస్ క్లాతింగ్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8.5 శాతం జంప్ చేసింది. రూ. 445 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 4,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 16,000 షేర్లు చేతులు మారాయి.
డీఎల్‌ఎఫ్ లిమిటెడ్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 11 శాతం ర్యాలీ చేసింది. రూ. 177 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 9 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 26.53 లక్షల షేర్లు చేతులు మారాయి.
వెండ్ ఇండియా
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 3,887 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టం కావడం విశేషం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 150 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 5,100 షేర్లు చేతులు మారాయి.
జీవోసీఎల్ కార్పొరేషన్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 9.5 శాతం జంప్‌చేసింది. రూ. 211 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 14,500 షేర్లు చేతులు మారాయి.
హెచ్‌ఐఎల్ లిమిటెడ్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 13 శాతం దూసుకెళ్లి రూ. 1834 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1879 వరకూ ఎగసింది. ఇది ఏడాది గరిష్టంకావడం విశేషం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 5,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 9,500 షేర్లు చేతులు మారాయి.
Comments
Please login to add a commentAdd a comment