Mid Caps Research
-
ఇండెక్స్ ముందు చిన్నబోయిన లార్జ్‌క్యాప్ ఫండ్స్
ముంబై: లార్జ్‌క్యాప్ పథకాలు పనితీరు పరంగా సూచీల ముందు చిన్నబోయాయి. ఈ ఏడాది జూన్ వరకు ఏడాది కాలానికి చూసుకుంటే 91 శాతం పథకాలు రాబడుల విషయంలో ఇండెక్స్‌ల కంటే వెనుకబడ్డాయి. వీటితో పోలిస్తే మెజారిటీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాలు మెరుగైన పనితీరు చూపించాయి. సూచీల కంటే పనితీరులో వెనుకబడిన మిడ్/స్మాల్‌క్యాప్ పథకాలు కేవలం 27.45 శాతంగానే ఉన్నాయి. ఎస్అండ్పీ డౌజోన్స్ ఇండిసెస్ ఓ నివేదిక రూపంలో ఈ వివరాలను విడుదల చేసింది. ఇక 75.61 శాతం ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ (పన్ను ఆదా చేసే) కూడా వాటి సూచీలతో పోలిస్తే మెరుగైన రాబడులను ఇవ్వలేకపోయాయి. 2022 ఆరంభం నుంచి లార్జ్‌క్యాప్ ఫండ్ మేనేజర్లకు కష్టంగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. 87.5 శాతం ఫండ్స్ మొదటి ఆరు నెలల్లో సూచీల కంటే తక్కువ రాబడినిచ్చినట్టు వెల్లడించింది. ఇక మరీ ముఖ్యంగా 2022 జూన్ నాటికి అంతక్రితం ఐదేళ్ల కాలలోనూ 89 శాతం లార్జ్‌క్యాప్ ఫండ్స్ వాటి సూచీల కంటే తక్కువ రాబడులను ఇచ్చాయి. సెప్టెంబర్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.39.88 లక్షల కోట్లకు చేరుకోవడం తెలిసిందే. దీర్ఘకాలలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాలు మంచి పనితీరు చూపించినట్టు ఎస్అండ్పీ నివేదిక తెలిపింది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
చిన్న షేర్లు రేసు గుర్రాలు
ఈ క్యాలండర్ ఏడాది(2021)ని నిజానికి చిన్న షేర్ల నామ సంవత్సరంగా చెబుతున్నారు విశ్లేషకులు. 2021 జనవరి మొదలు ఇప్పటివరకూ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 21 శాతం ర్యాలీ చేస్తే.. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 60 శాతం దూసుకెళ్లింది. ఇక సెకండరీ మార్కెట్లు సైతం దూకుడు ప్రదర్శించాయి. 63 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రావడం ద్వారా రూ. 1.19 లక్షల కోట్లను సమీకరించాయి. ఇది సరికొత్త రికార్డుకాగా.. కొత్త ఏడాది(2022)లోనూ మార్కెట్లలో బుల్ జోరు కనిపించే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇప్పటివరకూ దేశీ స్టాక్ మార్కెట్లలో చిన్న షేర్లు దూకుడు ప్రదర్శించాయి. భారీ లాభాలతో ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చాయి. మార్కెట్లు నిర్మాణాత్మక బుల్ ట్రెండ్‌లో ఉండటంతో ఈ స్పీడ్ మరో రెండేళ్లపాటు అంటే 2022, 2023లోనూ కనిపించే వీలున్నట్లు ట్రేడింగో వ్యవస్థాపకుడు పార్ధ్ న్యాటి అభిప్రాయపడ్డారు. దీంతో మిడ్, స్మాల్ క్యాప్స్ మరింత బలపడవచ్చని అంచనా వేశారు. కాగా.. సమీప కాలంలో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదిలే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. ఒమిక్రాన్ వల్ల ఎదురయ్యే రిస్కులు, అంతర్జాతీయ సంకేతాలతో హెచ్చుతగ్గులకు ఆస్కారమున్నట్లు తెలియజేసింది. అయితే దీర్ఘకాలంలో సానుకూల ఆర్థిక గణాంకాలు, కంపెనీల పటిష్ట ఆర్జనలు వంటి అంశాలు స్టాక్ మార్కెట్ ట్రెండ్‌ను ప్రభావితం చేయగలవని పేర్కొంది. దీర్ఘకాలిక లాభాలపై పన్ను, నియంత్రణా విధానాల్లో మార్పుల కారణంగా 2018–2020 మధ్య మిడ్, స్మాల్ క్యాప్ షేర్లకు గడ్డుకాలం ఎదురైనట్లు పార్ధ్ పేర్కొన్నారు. తదుపరి ఆర్థిక సంస్కరణలు తదితర ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలతో చిన్న కంపెనీలు అధిక వృద్ధి బాట పట్టినట్లు వివరించారు. బడా ప్రాఫిట్స్ కరోనా మహమ్మారి ఆందోళనలను పెడచెవిన పెడుతూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతూ వచ్చారు. దీంతో ఈ ఏడాది జనవరి– అక్టోబర్ మధ్య సెన్సెక్స్ 50,000 పాయింట్ల మైలురాయి నుంచి చరిత్ర సృష్టిస్తూ 61,000 పాయింట్లకు ఎగసింది. ఇది 21 శాతం వృద్ధికాగా.. ప్రస్తుతం 58,000 పాయింట్ల స్థాయికి చేరింది. అయితే చిన్న, మధ్యతరహా కౌంటర్లకు డిమాండ్ పెరగడంతో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈ నెలాఖరుకల్లా 37 శాతం జంప్‌చేసింది. స్మాల్ క్యాప్ మరింత అధికంగా 60 శాతం పురోగమించింది. ప్రపంచ బ్యాంకుల నుంచి లిక్విడిటీ మద్దతు, అంతర్జాతీయంగా వ్యాక్సిన్ల పంపిణీ వేగమందుకోవడం, ప్రోత్సాహక ఆర్థిక విధానాలు వంటి అంశాలు పలు మార్కెట్లకు అండనిచ్చాయి. వెరసి అక్టోబర్ 19కల్లా బీఎస్ఈ మిడ్ క్యాప్ 27,246 పాయింట్ల వద్ద, స్మాల్ క్యాప్ 30,417 వద్ద సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. సెన్సెక్స్ 62,245 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ 18,600 వద్ద ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలను అందుకున్నాయి. కోవిడ్–19 భయాలను అధిగమిస్తూ 2020లో మొదలైన ర్యాలీ 2021లోనూ కొనసాగడం విశేషం. నిజానికి 2020లో సెన్సెక్స్ 16 శాతం పుంజుకోగా.. సాŠమ్ల్, మిడ్ క్యాప్స్ 24 శాతం బలపడ్డాయి. లాక్డౌన్లకు చెల్లు 2020 మార్చిలో కోవిడ్–19 కట్టడికి లాక్డౌన్ ప్రకటించడంతో ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతాయన్న అంచనాలతో మార్కెట్లు ఒక్కసారిగా బేర్ గుప్పెట్లోకి చేరాయి. అయితే నెల రోజుల్లోనే ప్రపంచ బ్యాంకుల లిక్విడిటీ దన్నుతో బుల్స్ పట్టుసాధించినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా 2017లో దూకుడు చూపిన చిన్న, మధ్యతరహా కౌంటర్లు ఆపై కష్టకాలాన్ని ఎదుర్కొన్నట్లు పైపర్ సెరికా వ్యవస్థాపకుడు అభయ్ అగర్వాల్ తెలియజేశారు. దీంతో అధిక వృద్ధికి అవకాశమున్న చిన్న షేర్లు మార్కెట్లను మించిన క్యాచప్ ర్యాలీని అందుకున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది చివర్లో ఓవైపు విదేశీ ఇన్వెస్టర్లు బ్లూచిప్స్‌లో అమ్మకాలకు దిగినప్పటికీ దేశీ ఫండ్స్, సంపన్న వర్గాలు, రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు క్యూకట్టడం చిన్న షేర్లకు జోష్‌నిచ్చినట్లు వివరించారు. సాధారణంగా చిన్న షేర్లపట్ల స్థానిక ఇన్వెస్టర్లు ఆసక్తి చూపితే.. విదేశీ ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్స్పైనే దృష్టిపెడతారని విశ్లేషకులు చెబుతున్నారు. ఐపీవో స్పీడ్ ఈ ఏడాది రిటైల్ ఇన్వెస్టర్లు పబ్లిక్ ఇష్యూలకు సైతం క్యూకట్టారు. దీంతో కొత్తతరం టెక్ కంపెనీలు జొమాటో, నైకా, పేటీఎమ్, పాలసీబజార్ తదితరాలు భారీస్థాయిలో నిధులను సమకూర్చుకుని స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. వెరసి గత రెండు దశాబ్దాలలోనే 2021 ఐపీవోలకు అత్యుత్తమ ఏడాదిగా నిలిచింది. పలు ఐపీవోలు ఇన్వెస్టర్లకు లాభాలు పంచడంతో ప్రైమరీ మార్కెట్ కళకళలాడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దేవయాని ఇంటర్నేషనల్, నజారా టెక్నాలజీస్, గో ఫ్యాషన్, రోలెక్స్ రింగ్స్ ఏకంగా 100 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్కావడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. చదవండి: సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తోంది, యువత చూపంతా ఐపీవోలపైనే -
Fund Review : రిస్క్ తట్టుకుంటే రాబడులు
మోస్తరు రిస్క్ భరించే వారు ఫ్లెక్సీక్యాప్ విభాగంలోని పథకాలను పెట్టుబడులకు పరిగణనలోకి తీసుకోవచ్చు. మార్కెట్ క్యాప్ పరంగా అనువైన అవకాశాలున్న చోటు పెట్టుబడులు పెట్టుకోగల సౌలభ్యం ఉన్నవే ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్. గతేడాది సెబీ కొత్తగా ఈ విభాగాన్ని ప్రవేశపెట్టింది. ఈ విభాగంలో డీఎస్పీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ మంచి పనితీరును చూపిస్తోంది. లార్జ్‌క్యాప్‌లో స్థిరత్వం, మిడ్, స్మాల్క్యాప్లతో అధిక రాబడులు ఈ పథకంలో భాగంగా ఉంటాయి. దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వారు తమ పోర్ట్‌ఫోలియోలో ఈ పథకాన్ని భాగం చేసుకోవచ్చు. గతంలో ఈ పథకం మల్టీక్యాప్ పేరుతో కొనసాగడం గమనార్హం. పెట్టుబడుల విధానం పేరులో ఉన్నట్టుగానే లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాల్లో ఆకర్షణీయైమన పెట్టుబడుల అవకాశాలను ఈ పథకం ఎంపిక చేసుకుంటుంది. ఒక విభాగంలో వ్యాల్యూషన్స్ ఖరీదుగా మారిన సందర్భాల్లో పెట్టుబడుల కేటాయింపులు తగ్గించుకుని, ఆకర్షణీయంగా ఉన్న ఇతర విభాగాల్లోని అవకాశాలపై ఇన్వెస్ట్ చేయడాన్ని గమనించొచ్చు. నాణ్యమైన, సత్తా ఉన్న కంపెనీలను ఎంపిక చేసుకుని, ఎక్కువ కాలం పాటు కొనసాగడాన్ని అనుసరిస్తుంది. మార్కెట్ కరెక్షన్లలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంటుంది. లార్జ్‌క్యాప్‌నకు ఎక్కువ కేటాయింపులు చేయడం ద్వారా 2008, 2011, 2015 మారెŠక్ట్ పతనాల్లో నష్టాలు పరిమితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. అదే సమయంలో మార్కెట్ ర్యాలీల్లోనూ మెరుగైన ప్రదర్శనే చేసింది. 2017 బుల్ మార్కెట్లో ఈ పథకం పనితీరే ఇందుకు నిదర్శనం. 2020 మార్చి మార్కెట్ పతనం సమయంలో ఈక్విటీల్లో పెట్టుబడులు 93 శాతంగానే ఉన్నాయి. మార్కెట్ల విలువలు గరిష్టాలకు చేరాయన్న జాగ్రత్తతో నగదు నిల్వలను పెంచుకుంది. మే వరకు చూసిన తర్వాత క్రమంగా ఈక్విటీల్లో పెట్టుబడులను పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. దీంతో సూచీలతో పోలిస్తే మెరుగైన పనితీరు ఈ పథకం నమోదు చేసింది. రోలింగ్ రాబడులను గమనించినట్టయితే ఐదేళ్లు అంతకుమించిన కాలాల్లో ఎప్పుడూ కూడా ఈ పథకంలో ప్రతికూల రాబడులు (నష్టాలు) లేకపోవడం ముఖ్యంగా గమనించాలి. మార్కెట్ పతనాలు, ర్యాలీల్లో మెరుగైన ప్రదర్శన చూపించిందని చెప్పడానికి నిదర్శనంగా.. డౌన్‌సైడ్ క్యాప్చర్ రేషియో 93గా, అప్‌సైడ్ క్యాప్చర్ రేషియో 103గా ఉన్నాయి. రాబడులు ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో సుమారు రూ.6,000 కోట్ల పెట్టుబడులున్నాయి. గడిచిన ఏడాది కాలంలో రాబడులు 55 శాతంగా ఉన్నాయి. ఐదేళ్లలో 16 శాతం, ఏడేళ్లలో 15 శాతం, పదేళ్లలోనూ 15.5 శాతం చొప్పన వార్షిక రాబడులను ఇచ్చింది. ఫ్లెక్సీక్యాప్ విభాగంతో పోలిస్తే రెండు శాతం వరకు అధిక రాబడులను ఈ పథకంలో చూడొచ్చు. మొత్తం పెట్టుబడుల్లో 99 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన ఒక శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో 62 స్టాక్స్ ఉన్నాయి. లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో 64 శాతం పైగా పెట్టుబడులు కలిగి ఉండగా.. మిడ్‌క్యాప్‌లో 27 శాతం, స్మాల్‌క్యాప్‌లో 8 శాతానికి పైనే పెట్టుబడులు నిర్వహిస్తోంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ.. 32 శాతం కేటాయింపులు ఈ రంగంలోని కంపెనీలకే ఈక్విటీ టాప్ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల కేటాయింపులు ఐసీఐసీఐ బ్యాంకు 8.26 హెచ్డీఎఫ్సీ బ్యాంకు 6.02 ఇన్ఫోసిస్ 4.12 అల్ట్రాటెక్సిమెంట్ 3.79 బజాజ్ ఫైనాన్స్ 3.27 బజాజ్ ఫిన్సర్వ్ 3.16 అవెన్యూ సూపర్‌మార్ట్స్ 3.07 గుజరాత్ గ్యాస్ 2.93 యాక్సిస్ బ్యాంకు 2.78 మదర్సన్ సుమీ 2.34 చదవండి: రిటైర్మెంట్ తర్వాత స్థిర ఆదాయం కోసం ఇలా చేయండి -
మహీంద్రా మాన్యులైఫ్ నుంచి కొత్త ఫండ్
మహీంద్రా మాన్యులైఫ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ తాజాగా ఫ్లెక్సి క్యాప్ యోజన పేరిట కొత్త ఫండ్ ఆఫర్‌ను (ఎన్ఎఫ్వో) ప్రకటించింది. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. దీర్ఘకాలికంగా ఈక్విటీ మార్కెట్లు, ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీల్లో చేసే పెట్టుబడుల వృద్ధిని ఆశించే ఇన్వెస్టర్లకు ఇది అనువైనదిగా ఉంటుందని సంస్థ ఎండీ, సీఈవో అశుతోష్ బిష్ణోయి తెలిపారు. జులై 30న ప్రారంభమైన ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆగస్టు 13న ముగుస్తుందని చెప్పారు. తిరిగి ఆగస్టు 25 నుంచి విక్రయాలు, కొనుగోళ్లకు ఈ స్కీమ్ అందుబాటులోకి వస్తుందని వివరించారు. ఫ్లెక్సి క్యాప్ యోజన ఫండ్ ద్వారా సమీకరించిన నిధుల్లో 65 శాతం భాగాన్ని ఈక్విటీ, ఈక్విటీ సంబంధ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు బిష్ణోయి పేర్కొన్నారు. ఇక మిగతా నిధులను రెపో, రివర్స్ రెపో వంటి డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో 35 శాతం దాకా, అలాగే రీట్స్ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు), ఇన్విట్స్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు) యూనిట్లలో 10 శాతం దాకా ఇన్వెస్ట్ చేయవచ్చన్నారు. ఈక్విటీల ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ, ఫ్లెక్సి క్యాప్ ఫండ్స్ స్థిరమైన రాబడులు అందించగలుగుతాయని పేర్కొన్నారు. -
ఆటుపోట్లలోనూ ఈ మిడ్ క్యాప్స్ జోరు
తొలుత నమోదైన భారీ నష్టాల నుంచి దేశీ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ప్రస్తుతం స్వల్ప హెచ్చుతగ్గుల నడుమ కదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్ క్యాప్ షేర్లు ట్రేడర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో బలహీన మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. జాబితాలో కేపీఐటీ టెక్నాలజీస్, వైభవ్ గ్లోబల్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ చోటు సాధించాయి. ట్రేడింగ్ వివరాలు చూద్దాం.. కేపీఐటీ టెక్నాలజీస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం దూసుకెళ్లి రూ. 110 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 113 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.67 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 3.02 లక్షల షేర్లు చేతులు మారాయి. వైభవ్ గ్లోబల్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 3 శాతం జంప్‌చేసి రూ. 1,839 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,878 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3,200 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 4,200 షేర్లు చేతులు మారాయి. సెంట్రల్ బ్యాంక్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 12 శాతం ర్యాలీ చేసి రూ. 16.75 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.19 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.31 లక్షల షేర్లు చేతులు మారాయి. స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 3.5 శాతం లాభపడి రూ. 683 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 688 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 15,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో లక్ష షేర్లు చేతులు మారాయి. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 3 శాతం ఎగసి రూ. 131 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.55 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.18 లక్షల షేర్లు చేతులు మారాయి. -
ఈ చిన్న షేర్లు.. రన్ రాజా రన్
విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల పరుగు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా మార్కెట్లను మార్కెట్లను మించి భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో హెచ్ఐఎల్ లిమిటెడ్, డీఎల్ఎఫ్ లిమిటెడ్, టీసీఎన్ఎస్ క్లాతింగ్, జీవోసీఎల్ కార్పొరేషన్, వెండ్(Wendit) ఇండియా చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. టీసీఎన్ఎస్ క్లాతింగ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 8.5 శాతం జంప్ చేసింది. రూ. 445 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 4,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 16,000 షేర్లు చేతులు మారాయి. డీఎల్ఎఫ్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 11 శాతం ర్యాలీ చేసింది. రూ. 177 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 9 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 26.53 లక్షల షేర్లు చేతులు మారాయి. వెండ్ ఇండియా ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 3,887 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టం కావడం విశేషం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 150 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 5,100 షేర్లు చేతులు మారాయి. జీవోసీఎల్ కార్పొరేషన్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 9.5 శాతం జంప్‌చేసింది. రూ. 211 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 14,500 షేర్లు చేతులు మారాయి. హెచ్ఐఎల్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 13 శాతం దూసుకెళ్లి రూ. 1834 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1879 వరకూ ఎగసింది. ఇది ఏడాది గరిష్టంకావడం విశేషం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 5,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 9,500 షేర్లు చేతులు మారాయి. -
ఈ మిడ్, స్మాల్ క్యాప్స్.. రేసు గుర్రాలు
హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి పతన బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 450 పాయింట్లు, నిఫ్టీ 131 పాయింట్లు చొప్పున పడిపోయాయి. ఈ నేపథ్యంలోనూ కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు భారీ లాభాలతో దూకుడు చూపున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. జాబితాలో శ్రీరామ్ సిటీయూనియన్ ఫైనాన్స్, ఈక్లర్క్స్ సర్వీసెస్, మహీంద్రా లైఫ్‌స్పేస్, టీసీపీఎల్ ప్యాకేజింగ్, అశోకా బిల్డ్‌కాన్, ఎన్డీఆర్ ఆటో కంపోనెంట్స్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం... శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 11 శాతం దూసుకెళ్లింది. రూ. 793 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 845 వరకూ లాభపడింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 19,000 షేర్లు చేతులు మారాయి. ఈక్లర్క్స్ సర్వీసెస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం దూసుకెళ్లింది. రూ. 680 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 735 వరకూ ఎగసింది. ఇది ఏడాది గరిష్టంకావడం విశేషం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 12,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 69,000 షేర్లు చేతులు మారాయి. మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం జంప్‌చేసి రూ. 236 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 256 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3,500 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 41,000 షేర్లు చేతులు మారాయి. అశోకా బిల్డ్‌కాన్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం జంప్‌చేసి రూ. 70 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.4 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 5.4 లక్షల షేర్లు చేతులు మారాయి. ఎన్డీఆర్ ఆటో కంపోనెంట్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 201 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది ఏడాది గరిష్టంకావడం గమనార్హం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 2,300 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 29,000 షేర్లు చేతులు మారాయి. టీసీపీఎల్ ప్యాకేజింగ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 15 శాతం దూసుకెళ్లి రూ. 393 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 410 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1,500 షేర్లు మాత్రమే కాగా.. మిడ్‌సెషన్‌కల్లా 7,000 షేర్లు చేతులు మారాయి. -
చివరికి అక్కడక్కడే- మిడ్ క్యాప్స్ జూమ్
విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి బలహీనపడ్డాయి. చివరికి సెన్సెక్స్ 59 పాయింట్లు తక్కువగా 38,310 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 8 పాయింట్లు నీరసించి 11,300 వద్ద నిలిచింది. యూఎస్, ఆసియా మార్కెట్లు లాభపడటంతో తొలుత సెన్సెక్స్ 38,517 వరకూ ఎగసింది. మధ్యాహ్నం నుంచీ అమ్మకాలు పెరగడంతో 38,215 వరకూ వెనకడుగు వేసింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 11,359 వద్ద గరిష్టాన్ని తాకగా.. 11,270 వద్ద కనిష్టాన్ని చేరింది. పీఎస్‌యూ బ్యాంక్స్, ఫార్మా డీలా ఎన్ఎస్ఈలో మీడియా, ఆటో, మెటల్, రియల్టీ రంగాలు 1.4-1 శాతం లాభపడ్డాయి. అయితే పీఎస్‌యూ బ్యాంక్స్, ఫార్మా 1 శాతం చొప్పున క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్, ఎల్అండ్టీ, హిందాల్కో, టైటన్, ఇన్ఫ్రాటెల్, అదానీ పోర్ట్స్, హీరో మోటో, ఎన్టీపీసీ, ఐవోసీ, అల్ట్రాటెక్, టెక్ మహీంద్రా 4.6-1 శాతం మధ్య ఎగశాయి. అయితే సన్ ఫార్మా, ఐషర్, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐటీసీ, గెయిల్, పవర్‌గ్రిడ్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ 2-0.4 శాతం మధ్య డీలా పడ్డాయి. ఆటో జూమ్ డెరివేటివ్స్‌లో భారత్ ఫోర్జ్, అశోక్ లేలాండ్, ఇండిగో, భెల్, చోళమండలం, శ్రీరామ్ ట్రాన్స్, టాటా పవర్, పీవీఆర్, టాటా కన్జూమర్, కంకార్ 16-4 శాతం జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు అరబిందో 6 శాతం పతనంకాగా.. ఐబీ హౌసింగ్, బంధన్ బ్యాంక్, ఐసీఐసీఐ ప్రు, పీఎన్బీ 2.5-1.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.6-0.8 శాతం స్థాయిలో ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,578 లాభపడగా.. 1155 నష్టాలతో ముగిశాయి. డీఐఐల అమ్మకాలు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 351 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 940 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1014 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1415 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 303 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 505 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ జోరు చూడతరమా!
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు హైజంప్ చేశాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 680 పాయింట్లు, నిఫ్టీ 185 పాయింట్లు చొప్పున దూసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు మార్కెట్లను మించుతూ దౌడు తీస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. జాబితాలో ఎస్సెల్ ప్రొప్యాక్, జీఈ షిప్పింగ్, క్లాప్లిన్ పాయింట్ ల్యాబ్, ఎస్ఎంఎస్ లైఫ్‌సైన్సెస్ ఇండియా, రినైసన్స్ గ్లోబల్ లిమిటెడ్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం... ఎస్సెల్ ప్రొప్యాక్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం దూసుకెళ్లింది. రూ. 262 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 280 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకడం విశేషం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 23,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా లక్ష షేర్లు చేతులు మారాయి. జీఈ షిప్పింగ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం దూసుకెళ్లింది. రూ. 274 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 22,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 80,000 షేర్లు చేతులు మారాయి. క్లాప్లిన్ పాయింట్ ల్యాబ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 8.5 శాతం జంప్‌చేసి రూ. 509 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 519 వరకూ ఎగసింది. ఇది ఏడాది గరిష్టంకావడం విశేషం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 39,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా లక్ష షేర్లు చేతులు మారాయి. ఎస్ఎంఎస్ లైఫ్‌సైన్సెస్ ఇండియా ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 16 శాతం దూసుకెళ్లింది. రూ. 468 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 479 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3,500 షేర్లు మాత్రమేకాగా.. మధ్యాహ్నానికల్లా 28,000 షేర్లు చేతులు మారాయి. రినైసన్స్ గ్లోబల్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 11 శాతం జంప్ చేసి రూ. 280 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 298 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 2,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 3,000 షేర్లు చేతులు మారాయి. -
మార్కెట్లు బోర్లా- ఈ షేర్లు సూపర్‌ఫాస్ట్
అంతర్జాతీయ మార్కెట్లు బలహీనపడటంతో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి మరింత డీలాపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 222 పాయింట్లు వెనకడుగు వేసి 36,516కు చేరగా.. నిఫ్టీ 69 పాయింట్లు క్షీణించి 10,744 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. జాబితాలో క్వాంటమ్ పేపర్స్, సీమెక్ లిమిటెడ్, పైసాలో డిజిటల్, ఇన్స్పిరిసిస్ సొల్యూషన్స్, భారత్ డైనమిక్స్ చోటు సాధించాయి. ఇతర వివరాలు చూద్దాం.. ఇన్స్పిరిసిస్ సొల్యూషన్స్ ఐటీ సర్వీసుల ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 27.3 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం కేవలం 1600 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 44,000 షేర్లు చేతులు మారాయి. క్వాంటమ్ పేపర్స్ పేపర్ తయారీ ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 16.5 శాతం దూసుకెళ్లి రూ. 597 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 614 వద్ద ఏడాది గరిష్టానికి చేరింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం కేవలం 350 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 8,000 షేర్లు చేతులు మారాయి. పైసాలో డిజిటల్ ఈ ఎన్బీఎఫ్సీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 16 శాతం దూసుకెళ్లి రూ. 242 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 250 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 1600 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 600 షేర్లు మాత్రమే చేతులు మారాయి. సీమెక్ లిమిటెడ్ ఆఫ్‌షోర్ సర్వీసుల ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 12.5 శాతం జంప్‌చేసి రూ. 418 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 442 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 7,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 23,000 షేర్లు చేతులు మారాయి. భారత్ డైనమిక్స్ ఎన్ఎస్ఈలో ఈ పీఎస్‌యూ షేరు ప్రస్తుతం 5 శాతం జంప్‌చేసి రూ. 402 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 415కు ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 1.51 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 2.87 లక్షల షేర్లు చేతులు మారాయి. -
తొలి 6 నెలల్లో పలు ప్రధాన షేర్లు బేర్
ఈ క్యాలండర్ ఏడాది తొలి అర్ధభాగం(జనవరి-జూన్)లో పలు బ్లూచిప్, మిడ్ క్యాప్ కౌంటర్లు అమ్మకాలతో డీలాపడ్డాయి. ఏస్ ఈక్విటీ నివేదిక ప్రకారం బీఎస్ఈ-500 ఇండెక్స్‌లో సుమారు 70 శాతం షేర్లు నేలచూపులకే పరిమితమయ్యాయి. వీటిలో 21 కౌంటర్లు 50 శాతానికిపైగా పతనంకావడం గమనార్హం. అత్యధికంగా విలువను కోల్పోయిన రంగాలలో రిటైల్, క్యాసినో, హోటల్, ఎయిర్‌లైన్ చోటు చేసుకున్నాయి. జాబితాలో లెమన్ ట్రీ హోటల్స్, ఫ్యూచర్ రిటైల్, డెల్టా కార్ప్, స్పైస్‌జెట్, ఈఐహెచ్ తదిరాలున్నాయి. తొలి ఆరు నెలల్లో లెమన్ ట్రీ హోటల్స్ షేరు 63 శాతం, ఫ్యూచర్ రిటైల్ 62 శాతం, డెల్టా కార్ప్ 56 శాతం, స్పైస్‌జెట్, ఈఐహెచ్ 55 శాతం చొప్పున పతనమయ్యాయి. బౌన్స్‌బ్యాక్‌కు చాన్స్ కోవిడ్-19 కారణంగా పలు కంపెనీల బిజినెస్‌లు దెబ్బతిన్నట్లు కేఆర్ చోక్సీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఎండీ దేవెన్ చోక్సీ పేర్కొన్నారు. కార్యకలాపాలు నీరసించడంతో హోటల్, ఎయిర్‌లైన్ తదితర రంగాల కంపెనీలలో అమ్మకాలు పెరిగినట్లు తెలియజేశారు. అయితే ఈ కంపెనీలు బౌన్స్‌బ్యాక్ సాధించేందుకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. సమీప భవిష్యత్‌లో ఫలితాలు నిరాశపరిచే వీలున్నప్పటికీ తదుపరి దశలో బిజినెస్‌లు పుంజుకోవచ్చని తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో బిజినెస్‌లు దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్లేనని విశ్లేషించారు. ఇదీ తీరు ఆతిథ్య రంగం విషయానికివస్తే.. పరిస్థితులు వెంటనే రికవర్ అయ్యే అవకాశాలు కనిపించడంలేదని విశ్లేషకులు పేర్కొన్నారు. నెల రోజుల క్రితం లెమన్ ట్రీ హోటల్స్‌కు రీసెర్చ్ సంస్థ ఐడీబీఐ క్యాపిటల్ బయ్ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. అయితే టార్గెట్ ధరలో రూ. 30 నుంచి రూ. 24కు కోత పెట్టింది. ఇక ప్రస్తుత అనిశ్చితుల కారణంగా ఒబెరాయ్ హోటళ్ల దిగ్గజం ఈఐహెచ్ కౌంటర్‌కు హోల్డ్ రేటింగ్‌ను ఇస్తున్నట్లు ఐసీఐసీఐ డైరెక్ట్ పేర్కొంది. పటిష్ట బ్యాలన్స్‌షీట్, దేశంలోని కీలక బిజినెస్, లీజర్ ప్రాంతాలలో హోటళ్లు వంటి అంశాలు ఈఐహెచ్కు బలమని ఈ సందర్భంగా తెలియజేసింది. అయితే కోవిడ్-19 కారణంగా ఆతిథ్య రంగంపైనే అధికంగా ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు వివరించింది. కాగా.. తాజ్ గ్రూప్ హోటళ్ల దిగ్గజం ఇండియన్ హోటల్స్ షేరు సైతం ఈ 6 నెలల్లో 45 శాతం తిరోగమించింది. ఫ్యూచర్ రిటైల్ ముకేశ్ అంబానీ గ్రూప్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాలు కొనుగోలు చేయనున్న వార్తలతో ఇటీవల ఫ్యూచర్ రిటైల్ ర్యాలీ బాటలో సాగుతోంది. తద్వారా ఏప్రిల్‌లో నమోదైన కనిష్టం నుంచి 111 శాతం ర్యాలీ చేసింది. అయినప్పటికీ 2020 ఏడాది తొలి ఆరు నెలల్లో ఈ కౌంటర్ 62 శాతం వెనకడుగు వేయడం గమనార్హం! ఇదే విధంగా చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్, ఇండిగో బ్రాండ్ సర్వీసుల ఇంటర్గ్లొబ్ ఏవియేషన్ ఈ కాలంలో 26 శాతం చొప్పున క్షీణించాయి. ఇండస్ఇండ్ బేర్ ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఏకంగా 68 శాతం పతనమైంది. బ్యాంక్ వ్యవస్థాపకులు షేర్ల తనఖాపై నిధులు సమీకరించడం, ఆస్తుల(రుణాల) నాణ్యత క్షీణించడం, తక్కువ వ్యయ డిపాజిట్లు మందగించడం వంటి అంశాలు ఈ కౌంటర్‌ను దెబ్బతీస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే మార్చిలో నమోదైన కనిష్టం నుంచి చూస్తే ఇండస్ఇండ్ షేరు రెట్టింపునకుపైగా జంప్‌చేసింది. కాగా.. షేరు ధర- బుక్‌వేల్యూ నిష్పత్తి ప్రకారం 12ఏళ్ల కనిష్టానికి చేరిందంటూ వారం రోజుల క్రితం కిమ్ ఎంగ్ సెక్యూరిటీస్ ఈ కౌంటర్‌కు బయ్ రేటింగ్ ఇచ్చింది. -
ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ జోరు చూడతరమా!
అంతర్జాతీయ మార్కెట్ల ప్రోత్సాహంతో సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్ 509 పాయింట్లు జంప్‌చేసి 35,425కు చేరగా.. నిఫ్టీ 130 పాయింట్లు జమ చేసుకుని 10,432 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇంతకుమించిన స్పీడ్‌ను కొన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ట్రేడింగ్ పరిమాణం సైతం భారీగా ఎగసింది. జాబితాలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, నవభారత్ వెంచర్స్, గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్, ఇన్ఫీబీమ్ ఎవెన్యూస్, ఫీమ్ ఇండస్ట్రీస్, బాలాజీ అమైన్స్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. ఐబీ హౌసింగ్ ఫైనాన్స్ ఎన్ఎస్ఈలో ఈ ఎన్బీఎఫ్సీ షేరు ప్రస్తుతం 5 శాతం జంప్‌చేసి రూ. 218 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 232 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 35 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 55.5 లక్షల షేర్లు చేతులు మారాయి. నవభారత్ వెంచర్స్ ఈ డైవర్సిఫైడ్ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 7 శాతం లాభపడి రూ. 55 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 95,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో లక్ష షేర్లు చేతులు మారాయి. ఇన్ఫీబీమ్ ఎవెన్యూస్ వెబ్, డిజిటల్ సర్వీసుల ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 62.3 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 75,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 1.09 లక్షల షేర్లు చేతులు మారాయి. గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ ఎనర్జీ, ఇన్ఫ్రా తదితర బిజినెస్‌లు కలిగిన ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 2 శాతం బలపడి రూ. 581 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 615 వరకూ దూసుకెళ్లింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 1,400 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 700 షేర్లు మాత్రమే చేతులు మారాయి. ఫీమ్ ఇండస్ట్రీస్ ఎన్ఎస్ఈలో ఆటో విడిభాగాల తయారీ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం 18 శాతం దూసుకెళ్లి రూ. 420 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 427 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం కేవలం 7,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 47,000 షేర్లు చేతులు మారాయి. బాలాజీ అమైన్స్ స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ ఈ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 10 శాతం దూసుకెళ్లి రూ. 542 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 558 వద్ద ఏడాది గరిష్టానికి చేరింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 22,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 94,000 షేర్లు చేతులు మారాయి. -
మార్కెట్ల జోరు- ఈ మిడ్ క్యాప్స్ బోర్లా
చైనాతో సరిహద్దు వివాదం, పెరుగుతున్న కోవిడ్-19 కేసుల నేపథ్యంలోనూ దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 35,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. నిఫ్టీ 100 పాయింట్లు ఎగసింది. ఈ నేపథ్యంలోనూ కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొటున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం భారీగా ఎగసింది. జాబితాలో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, వక్రంగీ లిమిటెడ్, ఐటీఐ లిమిటెడ్, జెన్సన్ టెక్నాలజీస్, ఎల్టీ ఫుడ్స్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. ఎల్ఐసీ హౌసింగ్ గృహ రుణాల ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 6 శాతం పతనమైంది. అమ్మేవాళ్లు అధికంకావడంతో రూ. 268 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 266 వరకూ జారింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 4.2 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 7.5 లక్షల షేర్లు చేతులు మారాయి. వక్రంగీ లిమిటెడ్ టెక్నాలజీ ఆధారిత సేవల ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 5 శాతం పతనమైంది. అమ్మేవాళ్లు అధికంకావడంతో రూ. 35 వద్ద లోయర్ సర్క్యూట్‌ను తాకింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3.32 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 2 లక్షల షేర్లు చేతులు మారాయి. ఐటీఐ లిమిటెడ్ టెలికం రంగ ఈ ప్రభుత్వ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 4.5 శాతం పతనమైంది. అమ్మేవాళ్లు అధికంకావడంతో రూ. 102 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 2.2 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 1.63 లక్షల షేర్లు చేతులు మారాయి. జెన్సర్ టెక్నాలజీస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ల ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 4 శాతం క్షీణించి రూ. 130 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 30,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 46,000 షేర్లు చేతులు మారాయి. ఎల్టీ ఫుడ్స్ బస్మతి బియ్యం ఎగుమతి చేసే ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 8.5 శాతం కుప్పకూలి రూ. 39 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3.87 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 6.67 కోట్ల షేర్లు చేతులు మారాయి. -
ఏడాది కాలానికి 8 మిడ్ క్యాప్స్!
ప్రభుత్వ చర్యలు, కేంద్ర బ్యాంకుల ప్యాకేజీలు కలగలసి ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో తాజాగా అమెరికన్ ఇండెక్స్ నాస్డాక్ సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఇందుకు వీలుగా మార్చి కనిష్టం నుంచి 45 శాతం ఎగసింది. ఈ బాటలో దేశీ స్టాక్ మార్కెట్లు సైతం మార్చి 23న నమోదైన కనిష్టం నుంచి 34 శాతం ర్యాలీ చేశాయి. దీంతో బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 31 శాతం పురోగమించింది. కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరించడంతో మార్చి నెలలో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు పతనమైన సంగతి తెలిసిందే. అయితే పలు దేశాలు భారీ స్థాయిలో లిక్విడిటీని పంప్చేయడంతో నెల రోజుల్లోనే మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ సాధించాయి. మధ్యలో కొంతమేర ఆటుపోట్లు చవిచూసినప్పటికీ గత రెండు వారాలుగా ప్రపంచ మార్కెట్లు మళ్లీ పరుగు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రోకింగ్ సంస్థలు 8-12 నెలల కాలానికి కొన్ని మిడ్ క్యాప్ కౌంటర్లను సూచిస్తున్నాయి. వివరాలు చూద్దాం.. యూపీఎల్ లిమిటెడ్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో పటిష్ట ఫలితాలు సాధించింది. ఇటీవల కొంతమేర నికర రుణ భారాన్ని తగ్గించుకుంది. కంపెనీ పనితీరుపై లాక్‌డవున్ ప్రభావం తక్కువే. రూ. 630 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో యూపీఎల్ షేరు రూ. 426 వద్ద ట్రేడవుతోంది. సీసీఎల్ ప్రొడక్ట్స్ వియత్నాంలో కంపెనీ అతిపెద్ద తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. కోవిడ్-19 పెద్దగా ప్రభావం చూపలేదు. కాఫీకి డిమాండ్ కొనసాగుతోంది. సప్లై చైన్ మెరుగుపడనుంది. ఇకపైనా ప్రొడక్టులకు పటిష్ట డిమాండ్ కనిపించనుంది. రూ. 315 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో సీసీఎల్ ప్రొడక్ట్స్ షేరు రూ. 226 వద్ద ట్రేడవుతోంది. -ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ పీఐ ఇండస్ట్రీస్ పటిష్ట ఎగ్జిక్యూషన్ సామర్థ్యాలను కలిగిన కంపెనీ 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉంది. ఆశావహ రుతుపవనాల కారణంగా మార్జిన్లు మెరుగుపడే వీలుంది. అగ్రికెమికల్స్తోపాటు ఇతర విభాగాలలోనూ విస్తరిస్తోంది. రూ. 1840 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో పీఐ ఇండస్ట్రీస్ షేరు 1620 వద్ద ట్రేడవుతోంది. గుజరాత్ గ్యాస్ గత కొన్నేళ్లలో కొత్తగా 12వరకూ జిల్లాలలో కార్యకలాపాలు విస్తరించింది. రౌండ్ 9,10లో భాగంగా 7 కొత్త ప్రాంతాలలో హక్కులను సొంతం చేసుకుంది. తద్వారా మరో 5-7ఏళ్లపాటు సిటీగ్యాస్ పంపిణీలో అతిపెద్ద నెట్వర్క్ కలిగిన కంపెనీగా కొనసాగనుంది. చౌక ఎల్ఎన్జీ ధరలు, నియంత్రణ సంస్థల మద్దతుతో అమ్మకాల పరిమాణం పెరిగే వీలుంది. రూ. 315 టార్గెట్ ధరతో సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో గుజరాత్ గ్యాస్ షేరు రూ. 292 వద్ద కదులుతోంది. -సెంట్రమ్ బ్రోకింగ్ టాటా కన్జూమర్ దేశీ వినియోగ రంగ వేగాన్ని అందిపుచ్చుకునే సన్నాహాల్లో ముందుంది. ఇందుకు వీలుగా టాటా కెమికల్స్ నుంచి కన్జూమర్ బిజినెస్‌ను విడదీసి విలీనం చేసుకుంది. తద్వారా టాటా కన్జూమర్గా ఆవిర్భవించింది. పటిష్ట బ్యాలన్స్‌షీట్, బ్రాండ్లు, క్యాష్‌ఫ్లో, బలమైన యాజమాన్యం వంటి అంశాలు కంపెనీకి సానుకూలం. రూ. 431 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం టాటా కన్జూమర్ షేరు రూ. 384 వద్ద ట్రేడవుతోంది. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ గతేడాది పటిష్ట పనితీరు చూపింది. ముఖ్యమైన డీల్స్‌ను సైతం గెలుచుకుంది. డిజిటల్ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ముందునిలిచే అవకాశముంది. తద్వారా ఈ ఏడాది సైతం మెరుగైన పనితీరు చూపనుంది. రూ. 2060 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ షేరు రూ. 1897 వద్ద కదులుతోంది. -మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్ కెమికల్ బిజినెస్‌లో కంపెనీకి పట్టుంది. ప్రధానంగా ఫ్లోరోకెమికల్స్ విభాగం అదనపు బలాన్నిస్తోంది. పటిష్టమైన పరిశోధన, అభివృద్ధి సామర్థ్యం ద్వారా ఫ్లోరోకెమికల్స్ అప్లికేషన్స్‌లో అగ్రభాగాన నిలుస్తోంది. తద్వారా అవకాశాలను ముందుగానే అందిపుచ్చుకుంటోంది. రూ. 4,000 టార్గెట్ ధరతో సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎస్ఆర్ఎఫ్ షేరు రూ. 3,660 వద్ద కదులుతోంది. ఆస్ట్రల్ పాలీటెక్నిక్ ఈ ఏడాది తొలి రెండు నెలల్లో(జనవరి, ఫిబ్రవరి) కంపెనీ చూపిన వృద్ధి అంతర్గత పటిష్టతను చూపుతోంది. లాక్‌డవున్ తదుపరి పీవీసీ పైపుల పరిశ్రమలో కన్సాలిడేషన్‌కు దారిచూపవచ్చు. భవిష్యత్‌లో పరిశ్రమను మించి వేగవంత వృద్ధిని సాధించే వీలుంది. కంపెనీకున్న సామర్థ్యం రీత్యా మార్కెట్ వాటాను మరింత పెంచుకునే అవకాశముంది. రూ. 1100 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఆస్ట్రల్ పాలీ షేరు 898 వద్ద ట్రేడవుతోంది. -ఎడిల్వీజ్ బ్రోకింగ్ -
నష్టాల మార్కెట్లో ఈ షేర్లు యమస్పీడ్
వరుసగా ఆరు రోజులపాటు ర్యాలీ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లకు అలుపొచ్చింది. దీంతో లాభనష్టాల మధ్య ఆయాసపడుతున్నాయి. వెరసి మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్ 318 పాయింట్లు క్షీణించి 33,791కు చేరగా.. నిఫ్టీ 102 పాయింట్లు పతనమై 9,959ను తాకింది. అయితే ప్రపంచ స్టాక్ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాల కారణంగా మార్కెట్లు తొలుత కొంతమేర లాభాల మధ్య కదిలాయి. ఈ నేపథ్యంలోనూ కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీలు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం ఊపందుకుంది. జాబితాలో జిందాల్ స్టీల్, బిర్లా సాఫ్ట్ లిమిటెడ్, వెండిట్ ఇండియా, వీల్స్ ఇండియా, సారేగామా ఇండియా చోటు చేసుకున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. జిందాల్ స్టీల్ ప్రయివేట్ రంగ మెటల్ దిగ్గజం జిందాల్ స్టీల్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 6 శాతం జంప్‌చేసి రూ. 135 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 138 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 12.35 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 13.31 లక్షల షేర్లు చేతులు మారాయి. బిర్లాసాఫ్ట్ ప్రయివేట్ రంగ ఐటీ సేవల కంపెనీ బిర్లాసాఫ్ట్ లిమిటెడ్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 6 శాతం జంప్‌చేసి రూ. 80 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 63,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 95,000 షేర్లు చేతులు మారాయి. వెండిట్ ఇండియా అబ్రాసివ్స్, గ్రైండింగ్ వీల్స్ తయారీ కంపెనీ వెండిట్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 504 ఎగసి రూ. 3023 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం కేవలం 60 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1650 షేర్లు చేతులు మారాయి. వీల్స్ ఇండియా ఆటో రంగ విడిభాగాల తయారీ కంపెనీ వీల్స్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 86 ఎగసి రూ. 517 వద్ద ట్రేడవుతోంది. ఈ కౌంటర్లో బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం కేవలం 550 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 12.1 లక్షలకుపైగా షేర్లు చేతులు మారడం విశేషం. సారేగామా ఇండియా దేశంలోనే అతిపెద్ద మ్యూజిక్ లైబ్రరీ కలిగిన కంపెనీ సారేగామా ఇండియా షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 67 ఎగసి రూ. 402 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం కేవలం 4500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 23,000 షేర్లు చేతులు మారాయి. -
మార్కెట్లు లాభాల్లో- ఈ షేర్లు నష్టాల్లో
లాక్‌డవున్ అమలవుతున్నప్పటికీ పలు రంగాలలో కార్యకలాపాలు తిరిగి జోరందుకోనుండటంతో స్టాక్ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 513 పాయింట్లు జంప్‌చేసి 30,709ను తాకగా.. నిఫ్టీ 158 పాయింట్లు ఎగసి 9,036 వద్ద ట్రేడవుతోంది. తద్వారా 9,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. జాబితాలో భారతీ ఇన్ఫ్రాటెల్, అరవింద్ ఫ్యాషన్స్, కేపీఐటీ టెక్నాలజీస్, కొఠారీ ప్రొడక్ట్స్, జువారీ గ్లోబల్ చోటు చేసుకున్నాయి. వివరాలు చూద్దాం.. భారతీ ఇన్ఫ్రాటెల్: మొబైల్ టవర్ల రంగ ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9 శాతం కుప్పకూలి రూ. 200 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3.58 లక్షల షేర్లుకాగా..మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 5.49 లక్షల షేర్లు చేతులు మారాయి. అరవింద్ ఫ్యాషన్స్: ఈ లైఫ్‌స్టైల్ దుస్తుల కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 6.3 శాతం దిగజారి రూ. 113 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 110 వద్ద ఏడాది కనిష్టానికి చేరింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 16,000 షేర్లుకాగా..మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 3900 షేర్లు చేతులు మారాయి. కేపీఐటీ టెక్నాలజీస్: ఈ ఐటీ సేవల కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 5 శాతం పతనమై రూ. 43 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 9,000 షేర్లుకాగా..మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 9500 షేర్లు చేతులు మారాయి. కొఠారి ప్రొడక్ట్స్: ఈ స్మాల్ క్యాప్ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో 6 శాతం తిరోగమించి రూ. 40 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం కేవలం 500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 6000 షేర్లు చేతులు మారాయి. జువారీ గ్లోబల్: ఈ ప్రయివేట్ రంగ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 37 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం కేవలం 3400 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 3000 షేర్లు చేతులు మారాయి. -
మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో మంచి అవకాశాలు
ఎన్డీఏకు స్పష్టమైన విజయాన్ని ఇవ్వడంతో ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సెంటిమెంట్ నెలకొంది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగంలో పెట్టుబడులకు ఇది మంచి అనుకూల సమయం. వృద్ధిని పునరుద్ధరించేందుకు నూతన ప్రభుత్వం బలమైన విధానపర చర్యల్ని చేపట్టే అవకాశం ఉంది. మిడ్, స్మాల్‌క్యాప్ రెండు రకాల పరిస్థితుల్లో మంచి పనితీరు చూపిస్తాయి. మార్కెట్లు రిస్కీగా ఉన్నా, ఒక్కో సందర్భంలో ఇవి మంచి ప్రదర్శన చూపుతాయి. సెన్సెక్స్‌తో పోలిస్తే వ్యాల్యూషన్లు సౌకర్యంగా ఉన్నప్పుడు కూడా ఇది జరుగుతుంది. సెన్సెక్స్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్ ఇండెక్స్ 12 శాతం ప్రీమియంతోనూ గతంలో ట్రేడయింది. ఇప్పుడు మిడ్‌క్యాప్ సూచీ తక్కువలో ఉందంటే, భవిష్యత్తులో వేగవంతమైన పనితీరు చూపించే అవకాశం ఉంటుందని అర్థం. రిస్కీ స్థాయికి వెళ్లిన తర్వాత మిడ్‌క్యాప్స్, స్మాల్‌క్యాప్స్‌లో దిద్దుబాటు జరగడం వల్లే ప్రస్తుతం తక్కువ వ్యాల్యూషన్లకు వచ్చాయి. ఎన్నికల నేపథ్యంలో అనిశ్చితి... ప్రస్తుతం మిడ్‌క్యాప్ సూచీ సెన్సెక్స్ కంటే 10 శాతం డిస్కౌంట్లో ఉంది. ఎన్నికల నేపథ్యం మార్కెట్లలో రిస్క్‌ను పెంచింది. మిడ్‌క్యాప్ స్టాక్స్ తక్కువ విలువల వద్ద ట్రేడవుతున్నాయి. ఈ తరహా పరిస్థితులు... దిద్దుబాటుకు గురైన మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ర్యాలీ చేస్తాయని సూచిస్తున్నాయి. వచ్చే 12 నెలల్లో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ మంచి పనితీరు చూపిస్తాయని మేం భావిస్తున్నాం. మిడ్‌క్యాప్ ఈక్విటీ ఫండ్స్ పథకాలు ప్రధానంగా మిడ్‌క్యాప్ కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. సెబీ నిర్వచనం ప్రకారం... మార్కెట్ విలువ పరంగా 101 నుంచి 250 వరకు స్థానాల్లో ఉన్నవి మిడ్‌క్యాప్. మిడ్‌క్యాప్ పథకాలు వాటి పోర్ట్‌ఫోలియోలో కనీసం 65 శాతాన్ని మిడ్‌క్యాప్ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రూ.8,500 కోట్లకుపైగా మార్కెట్ క్యాప్ కలిగిన కంపెనీలు 150 వరకు ఉన్నాయి. మరో 35 శాతాన్ని మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే సౌకర్యాన్ని ఈ పథకాలు కలిగి ఉంటాయి. హెచ్డీఎఫ్సీ ఫండ్... హెచ్డీఎఫ్సీ మిడ్‌క్యాప్ ఫండ్ మిడ్‌క్యాప్ విభాగంలో మంచి పనితీరు కలిగిన పథకం. 12 ఏళ్ల బలమైన ట్రాక్ రికార్డు కలిగి ఉంది. దీర్ఘకాలంలో సంపద సృష్టించాలన్న లక్ష్యాన్ని ఈ పథకం రుజువు చేసి చూపించింది. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి వార్షికంగా 15 శాతం రాబడులను ఇచ్చింది. కానీ, ఇదే కాలంలో నిఫ్టీ మిడ్‌క్యాప్– 100 సూచి రాబడులు 11 శాతంగానే ఉన్నాయి. మధ్య కాలం నుంచి దీర్ఘకాలంలో ఈ పథకం గొప్ప పనితీరుతో ముందున్నది. ఈ పథకం ఆరంభమైన నాటి నుంచి ప్రతీ నెలా రూ.10,000 సిప్ చేస్తూ వస్తే ఇప్పటికి రూ.14.40 లక్షల పెట్టుబడి రూ.45.42 లక్షలుగా వృద్ది చెందేది. తగినంత వృద్ధి అవకాశాలు, బలమైన ఆర్థిక సామర్థ్యం (రిటర్న్ రేషియో, క్యాష్‌ఫ్లో), స్థిరమైన, అర్థం చేసుకోతగిన వ్యాపార నమూనాలు, ఆమోదనీయమైన వ్యాల్యూషన్ అంశాల ఆధారంగా స్టాక్స్ ఎంపిక చేసుకుంటుంది. బలమైన పనితీరు చరిత్ర, తగినంత వైవిధ్యం, అనుభవంతో కూడిన నిర్వహణ బృందంతో కూడిన హెచ్డీఎఫ్సీ మిడ్‌క్యాప్ అపార్చునిటీస్ ఫండ్, మిడ్‌క్యాప్ విభాగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మంచి ఆప్షన్ అవుతుంది. ఇన్వెస్టర్లు తమ ఆర్థిక లక్ష్యాల సాధన కోసం ఈ పథకంలో ఇన్వెస్ట్‌మెంట్‌కు సిప్ మార్గాన్ని ఎంచుకోవచ్చు. అధిక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లకు మిడ్‌క్యాప్ ఫండ్స్ సూచించడం జరుగుతుంది. కనుక అధిక రిస్క్ తీసుకుని, అధిక రాబడులు కోరుకునే వారు ఈ తరహా పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. -
ఒడిదుడుకుల వారం...
న్యూఢిల్లీ: బడ్జెట్ నేపథ్యంలో ఈ వారంలో స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు మరింతగా పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. నేడు(సోమవారం) వెలువడే టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు, వారం రోజుల తర్వాత చైనా స్టాక్ మార్కెట్ సోమవారం ప్రారంభం కావడం, ముడి చమురు ధరలు రికవరీ కావడం, రూపాయి కదలికలు తదితర అంశాలు కూడా తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్ పూర్తవడంతో ఇక ఇన్వెస్టర్ల దృష్టి కేంద్ర బడ్జెట్‌పై పడుతుందని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్(మిడ్‌క్యాప్స్ రీసెర్చ్) రవి షెనాయ్ చెప్పారు. ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాం కాల ప్రభావం కూడా ఉంటుందన్నారు. గత ఏడాది డిసెంబర్లో పారిశ్రామికోత్పత్తి ప్రతికూలంగానే ఉండడం వల్ల సమీప భవిష్యత్తులో స్టాక్ మార్కెట్లో తీవ్ర స్థాయిలోనే ఒడిదుడుకులు తప్పవని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ చెప్పారు. చైనా సూచీల ప్రభావం వారం రోజుల సెలవుల అనంతరం చైనా మార్కెట్ సోమవారం నుంచే ప్రారంభమవుతుందని, చైనా స్టాక్ సూచీల కదలికలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని కోటక్ సెక్యూరిటీస్ హెడ్(ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్) దీపేన్ షా అంటున్నారు. బడ్జెట్ నేపథ్యంలో రంగాల వారీ కదలికలు చోటు చేసుకుంటాయని అంతర్జాతీయ పరిణామాల ప్రభావమూ ఉంటుందని వివరించారు. చైనా మార్కెట్ ఎలా ఉంటుందోనని ప్రపంచమార్కెట్లన్నీ ఎదురు చూస్తున్నాయని ఈక్విరస్ సెక్యూరిటీస్ హెడ్ పంకజ్ శర్మ చెప్పారు. గత వారంలో ప్రపంచ మార్కెట్లలో అల్లకల్లోలం చెలరేగిన నేపథ్యంలో చైనా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు పట్ల ఇన్వెస్టర్లు ఎలా ప్రతిస్పందిస్తారో ఈ వారం తెలుస్తుందని వివరించారు. చైనా స్టాక్ సూచీల గమనం ఈక్విటీ మార్కెట్పైననే కాక, రూపాయిపైన కూడా ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. పతనం కొనసాగుతుంది..! ప్రస్తుత స్టాక్ మార్కెట్ పతనం ఈ వారమూ కొనసాగుతుందని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా అంచనా వేస్తున్నారు. నిలకడైన రికవరీ సాధించాలంటే, ముందు మార్కెట్ స్థిరత్వాన్ని పొందాలని, గత వారం క్షీణత వేగాన్ని చూస్తే ఆ అవకాశాలు స్వల్పంగానే ఉన్నాయని వివరించారు. బీఎస్ఈ సెన్సెక్స్ గత వారంలో 1,631 పాయింట్లు(6.62%), నిఫ్టీ 508 పాయింట్లు (6.78%) చొప్పున నష్టపోయాయి. స్టాక్ సూచీలు 21 నెలల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి. విదేశీ నిధుల ఉపసంహరణ అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగించిందనే భయాలతో భారత స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు గత రెండు వారాల్లో రూ.2,254 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అయితే డెట్‌మార్కెట్లో మాత్రం రూ.962 కోట్ల పెట్టుబడులు పెట్టారు.