ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ జోరు చూడతరమా! | Mid, Small caps jumps with volumes | Sakshi
Sakshi News home page

ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ జోరు చూడతరమా!

Published Wed, Jul 1 2020 2:43 PM | Last Updated on Wed, Jul 1 2020 2:43 PM

Mid, Small caps jumps with volumes - Sakshi

అంతర్జాతీయ మార్కెట్ల ప్రోత్సాహంతో సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్‌ 509 పాయింట్లు జంప్‌చేసి 35,425కు చేరగా.. నిఫ్టీ 130 పాయింట్లు జమ చేసుకుని 10,432 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో మిడ్‌, స్మాల్ క్యాప్‌ కౌంటర్లు ఇంతకుమించిన స్పీడ్‌ను కొన్ని  ప్రదర్శిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ట్రేడింగ్‌ పరిమాణం సైతం భారీగా ఎగసింది. జాబితాలో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, నవభారత్‌ వెంచర్స్‌, గల్ఫ్‌ ఆయిల్‌ లూబ్రికెంట్స్‌, ఇన్ఫీబీమ్‌ ఎవెన్యూస్‌, ఫీమ్‌ ఇండస్ట్రీస్‌, బాలాజీ అమైన్స్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్‌
ఎన్‌ఎస్‌ఈలో ఈ ఎన్‌బీఎఫ్‌సీ షేరు ప్రస్తుతం 5 శాతం జంప్‌చేసి రూ. 218 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 232 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం 35 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 55.5 లక్షల షేర్లు చేతులు మారాయి.

నవభారత్‌ వెంచర్స్‌
ఈ డైవర్సిఫైడ్‌ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో  ప్రస్తుతం 7 శాతం లాభపడి రూ. 55 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం 95,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో  లక్ష షేర్లు చేతులు మారాయి.

ఇన్ఫీబీమ్‌ ఎవెన్యూస్
వెబ్‌, డిజిటల్‌ సర్వీసుల ఈ కంపెనీ షేరు  ఎన్‌ఎస్‌ఈలో  ప్రస్తుతం 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 62.3 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం 75,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో  1.09 లక్షల షేర్లు చేతులు మారాయి.

గల్ఫ్‌ ఆయిల్‌ లూబ్రికెంట్స్
ఎనర్జీ, ఇన్‌ఫ్రా తదితర బిజినెస్‌లు కలిగిన ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో  ప్రస్తుతం 2 శాతం బలపడి రూ. 581 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 615 వరకూ దూసుకెళ్లింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం 1,400 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో  700 షేర్లు మాత్రమే చేతులు మారాయి.

ఫీమ్‌ ఇండస్ట్రీస్‌
ఎన్‌ఎస్‌ఈలో ఆటో విడిభాగాల తయారీ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం 18 శాతం దూసుకెళ్లి రూ. 420 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 427 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం కేవలం 7,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో  47,000 షేర్లు చేతులు మారాయి.

బాలాజీ అమైన్స్‌
స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీ ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో  ప్రస్తుతం 10 శాతం దూసుకెళ్లి రూ. 542 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 558 వద్ద ఏడాది గరిష్టానికి చేరింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం 22,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో  94,000 షేర్లు చేతులు మారాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement