ముంబై: లార్జ్‌క్యాప్ పథకాలు పనితీరు పరంగా సూచీల ముందు చిన్నబోయాయి. ఈ ఏడాది జూన్ వరకు ఏడాది కాలానికి చూసుకుంటే 91 శాతం పథకాలు రాబడుల విషయంలో ఇండెక్స్‌ల కంటే వెనుకబడ్డాయి. వీటితో పోలిస్తే మెజారిటీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాలు మెరుగైన పనితీరు చూపించాయి. సూచీల కంటే పనితీరులో వెనుకబడిన మిడ్/స్మాల్‌క్యాప్ పథకాలు కేవలం 27.45 శాతంగానే ఉన్నాయి. ఎస్‌అండ్‌పీ డౌజోన్స్ ఇండిసెస్ ఓ నివేదిక రూపంలో ఈ వివరాలను విడుదల చేసింది.
ఇక 75.61 శాతం ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్స్ (పన్ను ఆదా చేసే) కూడా వాటి సూచీలతో పోలిస్తే మెరుగైన రాబడులను ఇవ్వలేకపోయాయి. 2022 ఆరంభం నుంచి లార్జ్‌క్యాప్ ఫండ్ మేనేజర్లకు కష్టంగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. 87.5 శాతం ఫండ్స్ మొదటి ఆరు నెలల్లో సూచీల కంటే తక్కువ రాబడినిచ్చినట్టు వెల్లడించింది. ఇక మరీ ముఖ్యంగా 2022 జూన్ నాటికి అంతక్రితం ఐదేళ్ల కాలలోనూ 89 శాతం లార్జ్‌క్యాప్ ఫండ్స్ వాటి సూచీల కంటే తక్కువ రాబడులను ఇచ్చాయి. సెప్టెంబర్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.39.88 లక్షల కోట్లకు చేరుకోవడం తెలిసిందే. దీర్ఘకాలలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాలు మంచి పనితీరు చూపించినట్టు ఎస్‌అండ్‌పీ నివేదిక తెలిపింది.
చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!
Comments
Please login to add a commentAdd a comment