large cap funds
-
ఇండెక్స్ ముందు చిన్నబోయిన లార్జ్‌క్యాప్ ఫండ్స్
ముంబై: లార్జ్‌క్యాప్ పథకాలు పనితీరు పరంగా సూచీల ముందు చిన్నబోయాయి. ఈ ఏడాది జూన్ వరకు ఏడాది కాలానికి చూసుకుంటే 91 శాతం పథకాలు రాబడుల విషయంలో ఇండెక్స్‌ల కంటే వెనుకబడ్డాయి. వీటితో పోలిస్తే మెజారిటీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాలు మెరుగైన పనితీరు చూపించాయి. సూచీల కంటే పనితీరులో వెనుకబడిన మిడ్/స్మాల్‌క్యాప్ పథకాలు కేవలం 27.45 శాతంగానే ఉన్నాయి. ఎస్అండ్పీ డౌజోన్స్ ఇండిసెస్ ఓ నివేదిక రూపంలో ఈ వివరాలను విడుదల చేసింది. ఇక 75.61 శాతం ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ (పన్ను ఆదా చేసే) కూడా వాటి సూచీలతో పోలిస్తే మెరుగైన రాబడులను ఇవ్వలేకపోయాయి. 2022 ఆరంభం నుంచి లార్జ్‌క్యాప్ ఫండ్ మేనేజర్లకు కష్టంగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. 87.5 శాతం ఫండ్స్ మొదటి ఆరు నెలల్లో సూచీల కంటే తక్కువ రాబడినిచ్చినట్టు వెల్లడించింది. ఇక మరీ ముఖ్యంగా 2022 జూన్ నాటికి అంతక్రితం ఐదేళ్ల కాలలోనూ 89 శాతం లార్జ్‌క్యాప్ ఫండ్స్ వాటి సూచీల కంటే తక్కువ రాబడులను ఇచ్చాయి. సెప్టెంబర్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.39.88 లక్షల కోట్లకు చేరుకోవడం తెలిసిందే. దీర్ఘకాలలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాలు మంచి పనితీరు చూపించినట్టు ఎస్అండ్పీ నివేదిక తెలిపింది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
ఇండెక్స్ ఫండ్స్.. ఆప్షన్లు ఎన్నో..!
మ్యూచువల్ ఫండ్స్‌లో ప్యాసివ్ ఫండ్స్ (ఇండెక్స్ ఫండ్స్)కు ఆదరణ పెరుగుతోంది. రెండేళ్ల క్రితం ప్యాసివ్ ఫండ్స్ నిర్వహణలో రూ.8,000 కోట్ల ఆస్తులు ఉంటే.. అవి ఇప్పుడు రూ.50,000 కోట్లకు పెరగడం ఇందుకు నిదర్శనం. ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు, లార్జ్‌క్యాప్ యాక్టివ్ ఫండ్స్ పనితీరు అంత ఆశాజనకంగా లేకపోవడం, తక్కువ వ్యయాలు.. వెరసి ప్యాసివ్ ఫండ్స్‌కు ఆదరణ విస్తరిస్తోంది. ఆయా సూచీల్లోని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేవే ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ పనితీరు స్థాయిలో రాబడులను అందించడం వీటి ప్రత్యేకత. యాక్టివ్ ఫండ్స్‌తో పోలిస్తే వీటిల్లో నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. మరి రాబడులు సంగతి ఏమిటి? ఇండెక్స్ ఫండ్స్‌లో అసలు ఎన్ని రకాలున్నాయి? తమ లక్ష్యానికి అనుకూలమేనా? వీటికి సమాధానమే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం. నేడు వివిధ సూచీలను అనుసరించి పెట్టుబడులు పెట్టే ఇండెక్స్ ఫండ్స్ 50 వరకు ఉన్నాయి. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్, మూమెంటమ్, క్వాలిటీ ఇలా ఎన్నో విభాగాల్లో ప్యాసివ్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్‌ను తీసుకుంటే.. ఈ పథకం నిఫ్టీ–50లోని కంపెనీల్లో వాటి వెయిటేజీకి తగినట్టు పెట్టుబడులు పెడుతుంది. ఇందులో ఫండ్ మేనేజర్ ప్రమేయం పెద్దగా ఉండదు. కానీ, యాక్టివ్ ఫండ్స్ అలా కాదు. ఆయా పథకం పెట్టుబడుల విధానాన్ని అనుసరించి ఇండెక్స్‌లో కాకుండా.. మంచి వృద్ధికి అవకాశం ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వీటిని యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ అంటారు. వీటిల్లో రాబడులు ఫండ్స్ మేనేజర్ నైపుణ్యాలపైనే ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే పెట్టుబడులు ఎక్కడ పెట్టాలన్న స్వేచ్ఛ వారికి ఉంటుంది. మార్కెట్ పరిస్థితులు, కంపెనీల్లో జరిగే పరిణామాలు, ఆకర్షణీయమైన అవకాశాలకు అనుగుణంగా వీరు పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తూ ఉంటారు. అధిక రాబడులను ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తుంటాయి. కనుక వీటిల్లో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది. ఎందుకనో గానీ, గతంతో పోలిస్తే మన మార్కెట్ కొంత పరిపక్వత సాధించిన నేపథ్యంలో ఏవో కొన్ని మినహాయిస్తే యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ రాబడులు సూచీలతో పోలిస్తే ఏమంత మెరుగ్గా ఉండడం లేదు. అందు కనే ప్యాసివ్ ఫండ్స్ మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇండెక్స్ ఫండ్స్ మార్కెట్ గణనీయంగా ఉంటుంది. మన దగ్గరే ఇది ఇంకా మొగ్గ దశలోనే ఉంది. యూఎస్ మార్కెట్లో మొత్తం మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల్లో 35% ప్యాసివ్ ఫండ్స్ నిర్వహణలో ఉన్నాయి. లార్జ్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ అన్నింటిలోకి లార్జ్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్‌కు ఎక్కువ ఆదరణ ఉంది. ఎందుకంటే లార్జ్‌క్యాప్ విభాగంలోనే ఎక్కువ యాక్టివ్ ఫండ్స్ సూచీలకు మించి రాబడులను ఇవ్వలేకపోతున్నాయి. 2018లో సెబీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల పునర్వ్యవస్థీకరణ చేపట్టిన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. ఫలితంగా ఈ విభాగంలో ప్యాసివ్ ఫండ్స్‌ను ఆశ్రయించే ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు. నేడు లార్జ్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్‌లో (ప్యాసివ్ ఫండ్స్) ఎన్నో భిన్నమైన పథకాలు అందుబాటులో ఉండడాన్ని గమనించాలి. నిఫ్టీ 50 టీఆర్ఐ, నిఫ్టీ నెక్ట్స్ 50 టీఆర్ఐ, నిఫ్టీ 100 టీఆర్ఐ, ఎస్అండ్పీ బీఎస్ఈ సెన్సెక్స్ టీఆర్ఐ, లో వోలటాలిటీ ఇండెక్స్ ఫండ్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. టీఆర్ఐ అంటే మొత్తం సూచీ రాబడులుగా చూడాలి. నిఫ్టీ 50 టీఆర్ఐ, సెన్సెక్స్ టీఆర్ఐ ఫండ్స్ అన్నవి ఈ రెండు సూచీల్లోని అగ్రగామి లార్జ్‌క్యాప్ కంపెనీలను ప్రతిఫలిస్తాయి. గడిచిన పదేళ్లలో సగటున సూచీల స్థాయిలోనే ఇవి రాబడులు ఇచ్చాయి. అదే విధంగా సూచీలు ప్రతికూల రాబడులను ఇచ్చిన సందర్భాల్లోనూ ఈ పథకాల్లో నష్టాలు అదే స్థాయిలో ఉంటాయి. కనుక ఇన్వెస్టర్లు లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే ఈ రెండు సూచీలకు సంబంధించి ఏదేనీ పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చు. తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న పథకాన్ని ఎంపిక చేసుకోవడం సరైనది అవుతుంది. ఇండెక్స్ ఫండ్స్‌కు సంబంధించి ట్రాకింగ్ ఎర్రర్ అని ఒకటి ఉంటుంది. సూచీతో పోలిస్తే పథకం ఇచ్చిన రాబడులకు మధ్య ఉన్న అంతరమే ట్రాకింగ్ ఎర్రర్. చాలా వరకు లార్జ్‌క్యాప్ ఫండ్స్‌కు ట్రాకింగ్ ఎర్రర్ 0.10–0.27 శాతం మధ్య ఉంటుంది. అంటే ఒక సూచీ ఏడాది కాలంలో 16 శాతం రాబడులను ఇస్తే, అదే సూచీని అనుసరించే ఇండెక్స్ ఫండ్ రాబడి 15.90 శాతం మేర ఉండొచ్చు. అప్పుడు 0.10 శాతాన్ని ట్రాకింగ్ ఎర్రర్‌గా పేర్కొంటారు. అందుకని ఇండెక్స్ ఫండ్స్‌లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉన్న దానిని ఎంపిక చేసుకోవాలి. దీర్ఘకాలంలో సూచీలతో పోలిస్తే తక్కువ ట్రాకింగ్ ఎర్రర్ ఉండి, తక్కువ ఎక్స్పెన్స్ రేషియో పథకం అయితే ఇంకా మంచిది. ఐడీఎఫ్సీ నిఫ్టీ ఫండ్‌లో ఎక్స్పెన్స్ రేషియో 0.08 శాతం మేర ఉంటే.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్‌లో 0.17 శాతం ఉంది. వీటి డైరెక్ట్ ప్లాన్లను ఎంపిక చేసుకోవచ్చు. అలాగే, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ 0.16 శాతం మేర ఎక్స్పెన్స్ రేషియోను వసూలు చేస్తోంటే, నిప్పన్ ఇండియా ఇండెక్స్ ఫండ్ సెన్సెక్స్ ప్లాన్‌లో ఎక్స్పెన్స్ రేషియో 0.15 శాతంగా ఉంది. వీటి ట్రాకింగ్ ఎర్రర్ 0.16 శాతంలోపే ఉంది. ఇవన్నీ మూడేళ్లకు పైగా పనిచేస్తున్న పథకాలు. నిఫ్టీ 100 నిఫ్టీ 100 టీఆర్ఐ అన్నది మార్కెట్ విలువలో టాప్–100 కంపెనీలను ప్రతిఫలిస్తుంది. ఇవన్నీ లార్జ్‌క్యాప్ కిందకే వస్తాయి. ఈ లార్జ్‌క్యాప్ ఇండెక్స్‌ను ప్రతిఫలించే ప్యాసివ్ ఫండ్స్‌ను ఇటీవలే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, ఐడీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ ఆవిష్కరించాయి. కనుక ఈ పథకాలకు దీర్ఘకాల చరిత్ర లేదు. అయినప్పటికీ సూచీల స్థాయిలో రాబడిని వీటి నుంచి ఆశించొచ్చు. ఎన్ఎస్ఈ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్లో నిఫ్టీ 100 కంపెనీల వాటా 70 శాతంగా ఉంది. నిఫ్టీ 50, సెన్సెక్స్ స్థాయిలోనే రాబడులు వీటిలో ఉండొచ్చు. నిఫ్టీ నెక్ట్స్ 50 మార్కెట్ విలువ పరంగా 51వ స్థానం నుంచి 100 వరకు ఉన్న కంపెనీలు నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీ కిందకు వస్తాయి. టాప్ 50 కంపెనీలు నిఫ్టీ 50 కింద ఉంటాయి. కానీ, నిఫ్టీ–50తో పోలిస్తే నెక్ట్స్ 50లో ఎక్కువ అస్థిరత కనిపిస్తుంది. కనుక రిస్క్‌ను సర్దుబాటు చేసుకునే, దీర్ఘకాల ఇన్వెస్టర్లు ఈ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, యూటీఐ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. వీటి ట్రాకింగ్ ఎర్రర్ 0.14 శాతం మేర ఉంది. ఈ రెండూ కూడా 0.30 శాతం, 0.33 శాతం మేర ఎక్స్పెన్స్ రేషియోను వసూలు చేస్తున్నాయి. ఒకవేళ ఇన్వెస్టర్లు ఎవరైనా నిఫ్టీ–50, నిఫ్టీ నెక్ట్స్50 పథకాల్లో విడిగా ఇన్వెస్ట్ చేసుకునేట్టు అయితే.. దీనికి బదులు నేరుగా నిఫ్టీ 100 ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే ఈ రెండు సూచీల్లో ఉండే కంపెనీలే నిఫ్టీ 100 సూచీలోనూ ఉంటాయి. కాకపోతే వెయిటేజీ పరంగా అంతరం చూడొచ్చు. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ అధిక రిస్క్‌ను భరించగలిగే ఇన్వెస్టర్లు మిడ్‌క్యాప్ విభాగంలో ఇండెక్స్ ఫండ్స్ కోసం చూస్తుంటే.. నిఫ్టీ 150 టీఆర్ఐను అనుసరించే నాలుగు పథకాలు ఉన్నాయి. ఇక్కడ యాక్టివ్, ప్యాసివ్ ఫండ్స్ గురించి ఒక విషయం చెప్పుకోవాలి. మిడ్‌క్యాప్ విభాగంలో ఒక్క యాక్సిస్ మిడ్‌క్యాప్ ఫండ్ మినహా మిగిలిన అన్ని యాక్టివ్ పథకాలు సూచీలకు సమానంగా, అంతకంటే అధిక రాబడులను ఇచ్చాయి. కానీ, ప్రతికూల పరిస్థితుల్లో సూచీలతో పోలిస్తే అధిక నష్టాలను కూడా పంచాయి. అందుకనే ఈ విభాగంలో ఇండెక్స్ ఫండ్స్ ఎంపిక మెరుగైనది అవుతుంది. ఉన్న నాలుగు ఇండెక్స్ ఫండ్స్‌లో మూడు 2021లో మొదలైనవి. మోతీలాల్ ఓస్వాల్‌కు చెందిన పథకం 2019లో ప్రారంభమైంది. కనుక వీటి రాబడులను విశ్లేషించడానికి కొంత సమయం ఇవ్వాల్సిందే. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ కూడా ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చినవే. వీటికి సంబంధించి దీర్ఘకాల ట్రాక్ రికార్డు లేదు. ఈ విభాగంలో మూడు పథకాలు ఉండగా, అన్నీ నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250టీఆర్ఐను అనుసరించేవే. స్ట్రాటజీ ఇండెక్స్ ఫండ్స్ (వ్యూహాత్మకమైనవి) ఇండెక్స్‌లోని కాంపోనెంట్స్లోనే కొన్ని అంశాల ఆధారంగా ఎంపిక చేసిన షేర్లలో ఇవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఉదాహరణకు నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్ అన్నది.. నిఫ్టీ 200 ఇండెక్స్‌లోని మూమెంటమ్ పరంగా టాప్ 30 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇందుకు ఆయా స్టాక్స్ ధరల కదలికలు ప్రామాణికం అవుతాయి. అలాగే, నిఫ్టీ 100 లో వోలటాలిటీ 30 ఇండెక్స్ కూడా ఒకటి. అంటే నిఫ్టీ 100 సూచీలోని 100 కంపెనీల్లో తక్కువ అస్థిరతలతో ఉన్న 30 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. నిఫ్టీ 50, నిఫ్టీ 100 ఇండెక్స్‌లకు సంబంధించి ఈక్వల్ వెయిట్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇవేమి చేస్తాయంటే ఆయా సూచీల్లోని కంపెనీల్లో వాటికున్న వెయిటేజీ ప్రకారం ఇన్వెస్ట్ చేయవు. అన్ని కంపెనీలకు సమాన కేటాయింపులు చేస్తాయి. ఉదాహరణకు నిఫ్టీ 50లో ఒక్క రిలయన్స్ వెయిటేజీ 10.86 శాతంగా ఉంది. సాధారణ నిఫ్టీ 50 ఫండ్ అయితే తనవద్దనున్న నిర్వహణ ఆస్తుల్లో 10.86 శాతాన్ని రిలయన్స్‌కు కేటాయిస్తుంది. ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్ అలా కాదు. నిఫ్టీ 50 కంపెనీలకు ఒక్కో దానికి 2 శాతం చొప్పున కేటాయింపులు చేస్తుంది. దీనివల్ల ఒకటే రంగంలో ఎక్కువ పెట్టుబడులు పోగు పడవు. నిఫ్టీలో బ్యాంకింగ్ ఇండెక్స్‌కు వెయిటేజీ ఎక్కువ. ఈక్వల్ వెయిటేజీ ఇండెక్స్ ఫండ్‌కు వస్తే సమాన కేటాయింపులు చేస్తుంది కనుక దీన్ని నిరోధించొచ్చు. ఇండెక్స్ ఫండ్స్‌లోనే భిన్నమైన ఎక్స్పోజర్ కోరుకునే వారికి ఇవి అనుకూలంగా ఉంటాయి. నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్ క్వాలిటీ స్కోరు ఆధారంగా నిఫ్టీ 100 కంపెనీల్లో మెరుగైన 30 కంపెనీల్లో పెట్టుబడులు పెడతాయి. క్వాలిటీ అంటే.. అధిక లాభదాయకత ను చూపిస్తున్న కంపెనీలు. అంటే కంపెనీల రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఆర్‌వోఈ) అధికంగా ఉంటుంది. ఈక్విటీతో పోలిస్తే తక్కువ రుణ భారం ఉన్నవి. అలాగే, ఆదాయం, లాభాల్లో పెద్దగా అస్థిరతలు లేనివి ఈ ఇండెక్స్ కిందకు వస్తాయి. క్వాలిటీ స్కోరు, ఫ్రీ ఫ్లోట్ మా ర్కెట్ క్యాప్ ఆధారంగా కేటాయింపులు ఉంటాయి. అయితే, నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్ రాబడులు.. నిఫ్టీ 100 కంటే గడిచిన 3–5 ఏళ్లలో తక్కువగా ఉన్నాయి. ఇక్కడ నాణ్యతకు, తక్కువ అస్థిరతలకు ప్రాధాన్యం ఉం టుంది. అందుకని రాబడి తక్కువ ఉన్నప్పటికీ, మార్కెట్ పతనాల్లో నషా ్టలు కూడా పరి మితంగా ఉంటాయని గమనించాలి. ఈ విభాగంలో ఎడెల్వీజ్ మ్యూచు వల్ ఫండ్ ఒక్కటే నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్ ఫండ్‌ను ఆఫర్ చేస్తోంది. ప్రారంభించి ఆరు నెలలే అయింది. ఎక్స్పెన్స్ రేషియో 0.27 శాతమే ఉంది. నిఫ్టీ 200 మోమెంటమ్ 30 ఇండెక్స్ ఇటీవలి కాలంలో మంచి పనితీరు చూపిం చిన కంపెనీలు ఈ ఇండెక్స్ పరిధిలోకి వస్తాయి. గడిచిన 6, 12 నెలల్లో నిఫ్టీ టాప్ 200 కంపెనీల్లో (లార్జ్ అండ్ మిడ్‌క్యాప్) అధిక రాబడులను ఇచ్చిన టాప్ 30 కంపెనీలను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేసేవే నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్స్. సూచీల కంటే ఈ పథకాల్లో రాబడి 6% అధికంగా ఉంది. యూటీఐ మ్యూచువల్ పండ్, మోతీలాల్ ఓస్వాల్ మ్యూ చువల్ ఫండ్ సంస్థలు ఈ పథకాలను అందిస్తున్నాయి. ఈ రెండూ గడచిన ఏడాది కాలంలో ఆరంభమైనవి. పెద్దగా ట్రాక్ రికార్డు లేదు. గమనిక యాక్టివ్ ఫండ్స్‌కు సంబంధించి స్మాల్‌క్యాప్ విభాగం ఒక్కటీ భిన్నంగా ఉంది. అన్ని పేరున్న స్మాల్‌క్యాప్ యాక్టివ్ పథకాలు సూచీలకంటే అధిక రాబడులిస్తున్నాయి. అంతేకాదు, అస్థిరతలూ తక్కువగా ఉంటున్నాయి. అధిక రిస్క్ భరించగలిగేవారు స్మాల్‌క్యాప్ విభాగంలో ఇండెక్స్ ఫండ్స్‌కు బదులు యాక్టివ్ స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు వెళ్లొచ్చు. వీటిలో ఎస్బీఐ, యాక్సిస్, నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ మంచి పనితీరు చూపిస్తున్నాయి. -
Fund Review : రిస్క్ తట్టుకుంటే రాబడులు
మోస్తరు రిస్క్ భరించే వారు ఫ్లెక్సీక్యాప్ విభాగంలోని పథకాలను పెట్టుబడులకు పరిగణనలోకి తీసుకోవచ్చు. మార్కెట్ క్యాప్ పరంగా అనువైన అవకాశాలున్న చోటు పెట్టుబడులు పెట్టుకోగల సౌలభ్యం ఉన్నవే ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్. గతేడాది సెబీ కొత్తగా ఈ విభాగాన్ని ప్రవేశపెట్టింది. ఈ విభాగంలో డీఎస్పీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ మంచి పనితీరును చూపిస్తోంది. లార్జ్‌క్యాప్‌లో స్థిరత్వం, మిడ్, స్మాల్క్యాప్లతో అధిక రాబడులు ఈ పథకంలో భాగంగా ఉంటాయి. దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వారు తమ పోర్ట్‌ఫోలియోలో ఈ పథకాన్ని భాగం చేసుకోవచ్చు. గతంలో ఈ పథకం మల్టీక్యాప్ పేరుతో కొనసాగడం గమనార్హం. పెట్టుబడుల విధానం పేరులో ఉన్నట్టుగానే లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాల్లో ఆకర్షణీయైమన పెట్టుబడుల అవకాశాలను ఈ పథకం ఎంపిక చేసుకుంటుంది. ఒక విభాగంలో వ్యాల్యూషన్స్ ఖరీదుగా మారిన సందర్భాల్లో పెట్టుబడుల కేటాయింపులు తగ్గించుకుని, ఆకర్షణీయంగా ఉన్న ఇతర విభాగాల్లోని అవకాశాలపై ఇన్వెస్ట్ చేయడాన్ని గమనించొచ్చు. నాణ్యమైన, సత్తా ఉన్న కంపెనీలను ఎంపిక చేసుకుని, ఎక్కువ కాలం పాటు కొనసాగడాన్ని అనుసరిస్తుంది. మార్కెట్ కరెక్షన్లలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంటుంది. లార్జ్‌క్యాప్‌నకు ఎక్కువ కేటాయింపులు చేయడం ద్వారా 2008, 2011, 2015 మారెŠక్ట్ పతనాల్లో నష్టాలు పరిమితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. అదే సమయంలో మార్కెట్ ర్యాలీల్లోనూ మెరుగైన ప్రదర్శనే చేసింది. 2017 బుల్ మార్కెట్లో ఈ పథకం పనితీరే ఇందుకు నిదర్శనం. 2020 మార్చి మార్కెట్ పతనం సమయంలో ఈక్విటీల్లో పెట్టుబడులు 93 శాతంగానే ఉన్నాయి. మార్కెట్ల విలువలు గరిష్టాలకు చేరాయన్న జాగ్రత్తతో నగదు నిల్వలను పెంచుకుంది. మే వరకు చూసిన తర్వాత క్రమంగా ఈక్విటీల్లో పెట్టుబడులను పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. దీంతో సూచీలతో పోలిస్తే మెరుగైన పనితీరు ఈ పథకం నమోదు చేసింది. రోలింగ్ రాబడులను గమనించినట్టయితే ఐదేళ్లు అంతకుమించిన కాలాల్లో ఎప్పుడూ కూడా ఈ పథకంలో ప్రతికూల రాబడులు (నష్టాలు) లేకపోవడం ముఖ్యంగా గమనించాలి. మార్కెట్ పతనాలు, ర్యాలీల్లో మెరుగైన ప్రదర్శన చూపించిందని చెప్పడానికి నిదర్శనంగా.. డౌన్‌సైడ్ క్యాప్చర్ రేషియో 93గా, అప్‌సైడ్ క్యాప్చర్ రేషియో 103గా ఉన్నాయి. రాబడులు ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో సుమారు రూ.6,000 కోట్ల పెట్టుబడులున్నాయి. గడిచిన ఏడాది కాలంలో రాబడులు 55 శాతంగా ఉన్నాయి. ఐదేళ్లలో 16 శాతం, ఏడేళ్లలో 15 శాతం, పదేళ్లలోనూ 15.5 శాతం చొప్పన వార్షిక రాబడులను ఇచ్చింది. ఫ్లెక్సీక్యాప్ విభాగంతో పోలిస్తే రెండు శాతం వరకు అధిక రాబడులను ఈ పథకంలో చూడొచ్చు. మొత్తం పెట్టుబడుల్లో 99 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన ఒక శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో 62 స్టాక్స్ ఉన్నాయి. లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో 64 శాతం పైగా పెట్టుబడులు కలిగి ఉండగా.. మిడ్‌క్యాప్‌లో 27 శాతం, స్మాల్‌క్యాప్‌లో 8 శాతానికి పైనే పెట్టుబడులు నిర్వహిస్తోంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ.. 32 శాతం కేటాయింపులు ఈ రంగంలోని కంపెనీలకే ఈక్విటీ టాప్ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల కేటాయింపులు ఐసీఐసీఐ బ్యాంకు 8.26 హెచ్డీఎఫ్సీ బ్యాంకు 6.02 ఇన్ఫోసిస్ 4.12 అల్ట్రాటెక్సిమెంట్ 3.79 బజాజ్ ఫైనాన్స్ 3.27 బజాజ్ ఫిన్సర్వ్ 3.16 అవెన్యూ సూపర్‌మార్ట్స్ 3.07 గుజరాత్ గ్యాస్ 2.93 యాక్సిస్ బ్యాంకు 2.78 మదర్సన్ సుమీ 2.34 చదవండి: రిటైర్మెంట్ తర్వాత స్థిర ఆదాయం కోసం ఇలా చేయండి -
అవకాశం ఎక్కడ ఉన్నా అందిపుచ్చుకోవడమే..!
లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగంలో వృద్ధి, లాభాలకు అవకాశం ఉన్న స్టాక్స్‌ల్లో ఇన్వెస్ట్ చేసేవే మల్టీక్యాప్ ఫండ్స్. విడిగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌తో పోలిస్తే మల్టీక్యాప్ ఫండ్స్‌లో రిస్క్ తక్కువ. అదే సమయంలో అచ్చమైన లార్జ్‌క్యాప్ ఫండ్స్‌తో పోలిస్తే మల్టీక్యాప్ ఫండ్స్‌లో అస్థిరతలు ఎక్కువ. గత ఏడాదిన్నర, రెండేళ్ల కాలంలో లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లోనే రాబడులు ఉన్నాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాల్లో అధిక శాతం స్టాక్స్ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. త్వరలో ఈ విభాగంలోని స్టాక్స్ కూడా ర్యాలీ చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కనుక లార్జ్‌క్యాప్‌కే పరిమితం కాకుండా, మార్కెట్ వ్యాప్తంగా పెట్టుబడుల అవకాశాలను గుర్తించి ఇన్వెస్ట్ చేసే మల్టీక్యాప్ ఫండ్స్‌ను ఎంచుకోవడం మంచి ఆలోచన అవుతుంది. అందులోనూ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా పెట్టుబడులను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ ఫండ్ కూడా ఒకటి. రాబడులు..: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ పథకానికి మార్కెట్లో సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 1994 అక్టోబర్‌లో ఈ పథకం ఆరంభమైంది. నాటి నుంచి నేటి వరకు వార్షికంగా 14.43 కాంపౌండెడ్ రాబడులను (సీఏజీఆర్) ఈ పథకం అందించింది. ఇదే కాలంలో నిఫ్టీ–50 వృద్ధి 10.36 శాతమే. గత 15 ఏళ్లుగా ఈ ఫండ్‌లో ప్రతీ నెలా రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇన్వెస్టర్లకు రూ.51.6 లక్షలు సమకూరేది. ప్రతీ నెలా రూ.10వేల చొప్పున గత మూడేళ్లలో మొత్తం రూ.3.6 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటే, అదిప్పుడు రూ.3.9 లక్షలుగా ఉండేది. అంటే సీఏజీఆర్ రాబడులు 6.1 శాతమే. అదే గత ఐదేళ్లలో ప్రతీనెలా రూ.10వేల చొప్పున పెట్టుబడి పెడితే రూ.7.4 లక్షలు అయ్యేది. ఇక్కడ సీఏజీఆర్ రాబడులు 8.5 శాతం. ఇక గత పదేళ్ల కాలంలో ప్రతీ నెలా రూ.10వేల పెట్టుబడి పెట్టి ఉంటే రూ.23 లక్షలు సమకూరేవి. ఇక్కడ సీఏజీఆర్ రాబడులు 12.5 శాతం. అంటే దీర్ఘకాలంలో ఈ పథకం స్థిరమైన, మెరుగైన రాబడులను ఇచ్చినట్టు చెప్పుకోవాలి. కనుక మార్కెట్లలో అస్థిరతలను దృష్టిలో ఉంచుకుని, ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం అయితే దీన్ని పరిశీలించొచ్చు. పెట్టుబడుల విధానం టాప్ డౌన్, బోటమ్ అప్ ఈ రెండు విధానాలను రంగాల వారీ, స్టాక్ వారీ ఎంపికకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ ఫండ్ మేనేజర్ అనుసరిస్తున్నారు. ఇందులో టాప్ డౌన్ అంటే, స్థూల ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక రంగంలో పరిణామాలు, అంతర్జాతీయ, దేశీయ మార్కెట్ ధోరణులను పరిగణనలోకి తీసుకుని అనువైన రంగాలను పెట్టుబడులకు ఎంచుకోవడం. అదే బోటమ్ అప్ అంటే.. విడిగా కంపెనీలను, వాటి వృద్ధి అవకాశాలు, స్టాక్ వ్యాల్యూషన్ల ఆధారంగా పెట్టుబడులకు ఎంపిక చేసుకోవడం. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 78 స్టాక్స్ ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌లో 71 శాతం, మిగిలిన మేర మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 26 శాతం పెట్టుబడులను ఈ రంగం స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేసింది. -
లార్జ్‌క్యాప్ పథకాల్లో మేటి!
సూచీలు ముందుకే పయనిస్తున్నాయి. కానీ, అన్ని లార్జ్‌క్యాప్ పథకాలు సూచీలతో పోలిస్తే రాబడుల పరంగా షార్ప్‌గా ఉన్నాయంటే... అవునని చెప్పలేం. అన్ని పథకాలు సూచీలకు దీటుగా, సూచీలను మించి రాబడులను అన్ని సమయాల్లోనూ ఇస్తాయని ఆశించలేం. కొన్నింటికే అది సాధ్యపడుతుంది. ఈ విభాగంలోని యాక్సిస్ బ్లూచిప్ పథకం మాత్రం లార్జ్‌క్యాప్ పథకాల విభాగం సగటు రాబడులతో పోల్చినా, సూచీలతో పోల్చి చూసినా రాబడుల పరంగా మెరుగ్గా కనిపిస్తోంది. పరిమిత రిస్క్, దీర్ఘకాలంలో (ఐదేళ్లకు మించి) అధిక రాబడులను కోరుకునే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. లార్జ్‌క్యాప్ కేటగిరీలో అధిక రాబడులను ఇచ్చిన పథకాల్లో ఇదీ ఒకటి. రాబడులు..: దీర్ఘకాలంలో ఈ పథకం రాబడులు ఆకర్షణీయంగా ఉన్నాయి. ముఖ్యంగా గత ఏడాది కాలంలో మార్కెట్లో ఎన్నో అస్థిరతలు నెలకొన్న విషయం తెలిసిందే. గతేడాది సూచీల లాభాలు ఐదు శాతం లోపునకు పరిమితం అయ్యాయి. కానీ, యాక్సిస్ బ్లూచిప్ పథకం మాత్రం గడచిన ఏడాది కాలంలో 9.90 శాతం రాబడులను ఇవ్వడం గమనార్హం. మరి ఇదే సమయంలో రాబడులకు ప్రామాణికంగా చూసే నిఫ్టీ 50 రాబడులు మాత్రం 3.99 శాతంగానే ఉన్నాయి. ఇక లార్జ్‌క్యాప్ ఫండ్స్ కేటగిరీ సగటు రాబడులు గత ఏడాది కాలంలో 0.88 శాతంగానే ఉన్నాయి. అంటే ఏ విధంగా చూసినా ఈ పథకం చక్కని పనితీరు చూపించినట్టు తెలుస్తోంది. ఇక మూడేళ్ల కాలంలో చూస్తే వార్షిక సగటు రాబడులు 15 శాతంగా ఉన్నాయి. అయితే మూడేళ్ల కాలంలో నిఫ్టీ 50 రాబడులు కూడా ఇంచుమించు 15 శాతం దగ్గర్లోనే 14.96 శాతంగా ఉండగా, లార్జ్‌క్యాప్ విభాగం రాబడులు 13.50 శాతమే ఉన్నాయి. ఐదేళ్ల కాల వ్యవధిలోనూ యాక్సిస్ బ్లూచిప్ ప్రదర్శనే ముందుంది. వార్షికంగా 15.82 శాతం రాబడులను అందించింది. ఈ కాలంలో నిఫ్టీ 50 రాబడులు 14 శాతంగాను, ఈ విభాగం రాబడులు 13.90 శాతంగాను ఉన్నాయి. నిర్వహణ విధానం నూరు శాతం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేసింది. కానీ, మార్కెట్ అస్థిరతల్లో పెట్టుబడుల కేటాయింపుల పరంగా మార్పులతో రాబడులను కాపాడే చర్యలను ఈ పథకం మేనేజర్లు చేయడాన్ని గమనించొచ్చు. ఇందుకు నిదర్శనం... ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలోని ఆస్తుల్లో ఈక్విటీల్లో పెట్టుబడులు 81.65 శాతంగానే ఉన్నాయి. 19 శాతానికి పైన డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడనే కాదు, మార్కెట్ల వ్యాల్యూషన్లు అధిక స్థాయిలకు చేరినప్పుడు, ప్రతికూల సమయాల్లోనూ ఈ విధమైన నిర్వహణ చర్యలే ఈ పథకం పనితీరు మెరుగ్గా ఉండేలా చేస్తున్నాయి. గత ఏడాది కాలంలో బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, టీసీఎస్‌లో ఎక్కువ కేటాయింపులు కలిగి ఉండటంతో అధిక రాబడులను తెచ్చుకోగలిగింది. ప్రస్తుతం ఈ మూడు స్టాక్స్‌లోనే 17 శాతానికి పైగా పెట్టుబడులు కలిగి ఉంది. ఇవే అని కాదు, ఈ పథకం నిర్వహణలోని చాలా స్టాక్స్ గతేడాది కాలంలో ర్యాలీ చేయడం గమనార్హం. -
సూచీలకు మించి రాబడులు
అన్ని కాలాల్లోనూ సూచీలకు తగ్గకుండా రాబడులను అందించడంలో ఎడెల్వీజ్ లార్జ్‌క్యాప్ పథకం పనితీరు గురించి తప్పకుండా చెప్పుకోవాల్సిందే. గడిచిన ఏడాది కాలంలో 17 శాతం రాబడులను అందించి లార్జ్‌క్యాప్ విభాగంలో ఉత్తమ పథకంగా నిలిచింది. లార్జ్‌క్యాప్ కారణంగా మార్కెట్లు ర్యాలీ చేయగా, ఇదే కాలంలో పోటీ పథకాల్లో రాబడులు ఒక అంకె వరకే ఉండటం గమనార్హం. బెంచ్‌మార్క్ నిఫ్టీ50తో పోలిస్తే రాబడుల్లో ముందు నిలిచింది. ఈ పథకం 2009లో ప్రారంభం కాగా, పనితీరు విషయంలో అప్పటి నుంచి మెరుగైన ప్రదర్శనే చూపుతోంది. దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టగలిగే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. పోర్ట్‌ఫోలియో నాణ్యమైన వ్యాపారంతోపాటు, ఆ వ్యాపారంలో స్థిరమైన అధిక వృద్ధికి అవకాశం ఉన్న స్టాక్స్‌లో ఎడెల్వీజ్ లార్జ్‌క్యాప్ ఇన్వెస్ట్ చేస్తుంది. వృద్ధి అవకాశాలకు తోడు షేరు ధర ఆకర్షణీయ స్థాయిలో ఉన్న స్టాక్స్‌ను ఎంచుకుంటుంది. భిన్న రంగాలకు చెందిన 50కు పైగా లార్జ్‌క్యాప్ స్టాక్స్‌ను ఎంచుకోవడం ద్వారా ఆటుపోట్లకు చెక్ పెట్టడం, రిస్క్‌ను సాధ్యమైనంత తగ్గించుకోవడం ఈ పథకం విధానాల్లో భాగం. స్టాక్స్ ఎంపిక పటిష్టంగా ఉండటం, క్యాష్ కాల్స్ తీసుకోవడం వంటి విధానాలు ఈ పథకం పనితీరు మార్కెట్ ర్యాలీల్లో మెరుగ్గా ఉండటం, కరెక్షన్లలో నష్టాలను పరిమితం చేసేందుకు సాయపడుతోంది. 2014, 2017 మార్కెట్ ర్యాలీల్లో లార్జ్‌క్యాప్ విభాగంలోనూ, బెంచ్ మార్క్ రాబడులతో పోల్చి చూస్తే ఎడెల్వీజ్ లార్జ్‌క్యాప్ మెరుగ్గా ఉండటం గమనార్హం. అలాగే, 2011, 2015 మార్కెట్లలో బలహీనత నెలకొన్న సమయాల్లోనూ పనితీరులో ముందే ఉంది. అస్సెట్ అలొకేషన్ (పెట్టుబడుల కేటాయింపు)ను వేగంగా మార్పు చేయడాన్ని కూడా గమనించొచ్చు. ఉదాహరణకు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈక్విటీలకు కేటాయింపులు 79 శాతంగా ఉండగా, మే నెలకు వచ్చే సరికి 84 శాతానికి పెంచుకుంది. తిరిగి జూన్ నెలలో 76 శాతానికి తగ్గించుకుంది. దీనివల్ల అధిక పోర్ట్‌ఫోలియో టర్నోవర్‌కు దారితీస్తుంది. అయినప్పటికీ దీనివల్ల అధిక ఎక్స్పెన్స్ రేషియోకు దారితీయకపోవడాన్ని గమనించొచ్చు. ముఖ్యంగా ఈ పథకంలో ఆకర్షణీయమైన అంశం... రెగ్యులర్ పథకంలో ఎక్స్పెన్స్ రేషియో కేవలం 1.38 శాతంగానే ఉండటం. మిగిలిన పథకాల్లో ఇది 2.6 శాతం వరకు ఉండడాన్ని చూడొచ్చు. దీనివల్ల దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు అధిక రాబడులకు వీలుంటుంది. స్టాక్స్ ఎంపిక ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో దిగ్గజ కంపెనీలన్నీ ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యూనిలీవర్, టీసీఎస్‌లో వాటాను పెంచుకుంది. నిజానికి ఇదే కాలంలో ఈ స్టాక్స్ మంచి ర్యాలీ చేయడంతో ఈ పథకం మెరుగైన రాబడులను ఇవ్వగలిగింది. ఇక గత ఏడాదిలో ప్రైవేటు రంగ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, సాఫ్ట్ వేర్ కంపెనీల్లో వాటాలను పెంచుకుంది. ప్రస్తుతం ఫైనాన్షియల్, ఎఫ్ఎంసీజీ, టెక్నాలజీ రంగ స్టాక్స్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టింది. -
దీర్ఘకాలానికి ఈక్విటీ ఫండ్స్ బెటర్
ఐదేళ్ల నుంచి ఒక లార్జ్ క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కానీ ఈ ఫండ్ నేను ఆశించిన రాబడులనివ్వడం లేదు. పోర్ట్‌ఫోలియోలో లార్జ్ క్యాప్ ఫండ్ ఉండడం తప్పనిసరా? నేను మరో పదేళ్ల పాటు ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించగలను. కొన్ని మంచి ఫండ్స్‌ను సూచించండి? - పవన్, విశాఖపట్టణం మిడ్, స్మాల్-క్యాప్ ఫండ్స్‌తో పోల్చితే లార్జ్ క్యాప్ ఫండ్స్ కుదురుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఎక్కువ కాలం ఇలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా మార్కెట్లు ఒడిదుడుకుల్లోనే ఉన్నాయి. అందుకే మీరు ఇన్వెస్ట్ చేసిన లార్జ్‌క్యాప్ ఫండ్ పనితీరు మిమ్మల్ని నిరాశ పరిచింది. మరోవైపు వడ్డీరేట్లు అధికంగా ఉండడంతో ఆ ప్రయోజనాలను మీరు కోల్పోయారు. మరో పదేళ్ల పాటు ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించాలనుకుంటున్నారు. కాబట్టి, లార్జ్‌క్యాప్ కాకుండా ఇతర సెగ్మెంట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీ ఫండ్స్‌ను విస్మరించకండి. దీర్ఘకాలానికి ఈక్విటీ ఫండ్స్ చెప్పుకోదగ్గ స్థాయి రాబడులను అందించగలవు. మీరు నిర్దేశించుకున్న పదేళ్ల ఇన్వెస్ట్మెంట్ కాలానికి కొన్ని ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. అవి క్వాంటమ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, ఐసీఐసీఐ పుడెన్షియల్ డైనమిక్, యూటీఐ ఈక్విటీలు. నేను 2007 నుంచి హెచ్డీఎఫ్సీ ఈక్విటీ, హెచ్డీఎఫ్సీ టాప్ 200 ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. వీటి పనితీరు బాగా లేదు. మంచి రాబడులనిచ్చే మరికొన్ని ఫండ్స్‌ను సూచించగలరా? - రాధిక, ఖమ్మం గత ఒకటిన్నర సంవత్సరాలుగా హెచ్డీఎఫ్సీ టాప్ 200, హెచ్డీఎఫ్సీ ఈక్విటీ ఫండ్లు ఆయా కేటగిరీ ఫండ్లతో పోల్చితే చెప్పుకోదగ్గ పనితీరును కనబరచడం లేదు. అయితే ఈ ఫండ్స్ పూర్తిగా ఇన్వెస్ట్మెంట్స్ ఆపేయదగ్గ అధ్వాన ఫండ్స్ కావని చెప్పవచ్చు. మీరు ఈ రెండు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వివిధీకరణను విస్మరించినట్లయింది. ఈ రెండు ఫండ్స్‌ను నిర్వహించేది ఒకే ఫండ్ మేనేజర్. అదీ కాకుండా ఈ రెండు ఫండ్స్ లక్ష్యాలు కూడా ఒకటే. ఈ రెండు ఫండ్ల పోర్ట్‌ఫోలియో 60% ఒకేలా ఉండడమే దీనికి కారణం. మా సూచన ఏమిటంటే మీరు హెచ్డీఎఫ్సీ టాప్ 200 ఫండ్ నుంచి వైదొలగండి. ఆ సొమ్మును ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ లేదా క్వాంటమ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ వంటి మల్టీక్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఒక ఏడాది కాలానికి ఐసీఐసీఐ ఎఫ్ఎంసీజీ గ్రోత్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నా మిత్రులేమో ఇది ఈక్విటీ ఫండ్ దీర్ఘకాలానికి అయితేనే ఇలాంటి ఫండ్స్‌ను ఎంచుకోవాలంటున్నారు. నాది సరైన నిర్ణయమేనా? తగిన సూచనలివ్వండి? - విజయ్, కరీంనగర్ ఏడాది వంటి స్వల్పకాలానికి ఈక్విటీ ఫండ్స్ గురించి అసలు ఆలోచించనే వద్దు. ఈక్విటీ మార్కెట్లలో వచ్చే స్వల్పకాలిక ఒడిదుడుకుల కారణంగా మీ పెట్టుబడి హరించుకుపోయే అవకాశాలే అధికం. కొన్నేళ్ల పాటు మంచి పనితీరునే కనబరిచే ఈ ఫండ్స్ ఒక్కసారిగా కుప్పకూలవచ్చు. అందుకనే డైవర్సిఫైడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని ఇన్వెస్టర్లకు సూచిస్తాం. ఇలా ఇన్వెస్ట్ చేస్తేనే, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే అసలు ప్రయోజనం నెరవేరుతుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ఆ ఫండ్ మేనేజర్ రీసెర్చ్ చేసి మీ కోసం ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకుంటారు. అలా కాకుండా మీరే ఒక రంగాన్ని ఎంచుకొని, ఆ రంగం ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తే మరి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి అర్థమే ఉండదు. వ్యక్తిగత ఇన్వెస్టర్లకు ఒకే రంగపు మ్యూచువల్ ఫండ్స్ సరైనవి కావు. డైవర్సిఫైడ్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తేనే మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన ప్రయోజనాలు లభిస్తాయి. చాలా డైవర్సిఫైడ్ ఫండ్స్‌లో ఎఫ్ఎంసీజీ రంగానికి చెందిన షేర్లు ఉంటాయి. రంగాల వారీ ఫండ్లు అయితే గియితే అద్భుత రాబడులనిస్తాయి లేదంటే వాటి పనితీరు పేలవంగా ఉంటుంది.