దీర్ఘకాలానికి ఈక్విటీ ఫండ్స్ బెటర్ | equity funds better for long time | Sakshi
Sakshi News home page

దీర్ఘకాలానికి ఈక్విటీ ఫండ్స్ బెటర్

Published Mon, Mar 3 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 AM

దీర్ఘకాలానికి ఈక్విటీ ఫండ్స్ బెటర్

దీర్ఘకాలానికి ఈక్విటీ ఫండ్స్ బెటర్

ఐదేళ్ల నుంచి ఒక లార్జ్ క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కానీ ఈ ఫండ్ నేను ఆశించిన రాబడులనివ్వడం లేదు.  పోర్ట్‌ఫోలియోలో లార్జ్ క్యాప్ ఫండ్ ఉండడం తప్పనిసరా? నేను మరో పదేళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్స్ కొనసాగించగలను. కొన్ని మంచి ఫండ్స్‌ను సూచించండి?  - పవన్, విశాఖపట్టణం
 మిడ్, స్మాల్-క్యాప్ ఫండ్స్‌తో పోల్చితే లార్జ్ క్యాప్ ఫండ్స్ కుదురుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఎక్కువ కాలం ఇలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా మార్కెట్లు ఒడిదుడుకుల్లోనే ఉన్నాయి. అందుకే మీరు ఇన్వెస్ట్ చేసిన లార్జ్‌క్యాప్ ఫండ్ పనితీరు మిమ్మల్ని నిరాశ పరిచింది. మరోవైపు వడ్డీరేట్లు అధికంగా ఉండడంతో ఆ ప్రయోజనాలను మీరు కోల్పోయారు. మరో పదేళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్స్ కొనసాగించాలనుకుంటున్నారు. కాబట్టి, లార్జ్‌క్యాప్ కాకుండా ఇతర సెగ్మెంట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీ ఫండ్స్‌ను విస్మరించకండి. దీర్ఘకాలానికి ఈక్విటీ ఫండ్స్ చెప్పుకోదగ్గ స్థాయి రాబడులను అందించగలవు. మీరు నిర్దేశించుకున్న పదేళ్ల ఇన్వెస్ట్‌మెంట్ కాలానికి కొన్ని ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. అవి క్వాంటమ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, ఐసీఐసీఐ పుడెన్షియల్ డైనమిక్, యూటీఐ ఈక్విటీలు.

 నేను 2007 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ, హెచ్‌డీఎఫ్‌సీ టాప్ 200 ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. వీటి పనితీరు బాగా లేదు. మంచి రాబడులనిచ్చే మరికొన్ని ఫండ్స్‌ను సూచించగలరా?
 - రాధిక, ఖమ్మం
 గత ఒకటిన్నర సంవత్సరాలుగా హెచ్‌డీఎఫ్‌సీ టాప్ 200, హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ ఫండ్‌లు ఆయా కేటగిరీ ఫండ్‌లతో పోల్చితే చెప్పుకోదగ్గ పనితీరును కనబరచడం లేదు. అయితే ఈ ఫండ్స్ పూర్తిగా ఇన్వెస్ట్‌మెంట్స్ ఆపేయదగ్గ అధ్వాన ఫండ్స్ కావని చెప్పవచ్చు. మీరు ఈ రెండు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వివిధీకరణను విస్మరించినట్లయింది. ఈ రెండు ఫండ్స్‌ను నిర్వహించేది ఒకే ఫండ్ మేనేజర్. అదీ కాకుండా ఈ రెండు ఫండ్స్ లక్ష్యాలు కూడా ఒకటే.  ఈ రెండు ఫండ్‌ల పోర్ట్‌ఫోలియో 60% ఒకేలా ఉండడమే దీనికి కారణం. మా సూచన  ఏమిటంటే మీరు హెచ్‌డీఎఫ్‌సీ టాప్ 200 ఫండ్ నుంచి వైదొలగండి. ఆ సొమ్మును ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ లేదా క్వాంటమ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ వంటి మల్టీక్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.

 ఒక ఏడాది కాలానికి ఐసీఐసీఐ ఎఫ్‌ఎంసీజీ గ్రోత్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నా మిత్రులేమో ఇది ఈక్విటీ ఫండ్ దీర్ఘకాలానికి అయితేనే ఇలాంటి ఫండ్స్‌ను ఎంచుకోవాలంటున్నారు. నాది సరైన నిర్ణయమేనా? తగిన సూచనలివ్వండి?               - విజయ్, కరీంనగర్
 ఏడాది వంటి స్వల్పకాలానికి ఈక్విటీ ఫండ్స్ గురించి అసలు ఆలోచించనే వద్దు. ఈక్విటీ మార్కెట్లలో వచ్చే స్వల్పకాలిక ఒడిదుడుకుల కారణంగా మీ పెట్టుబడి హరించుకుపోయే అవకాశాలే అధికం. కొన్నేళ్ల పాటు మంచి పనితీరునే కనబరిచే ఈ ఫండ్స్ ఒక్కసారిగా కుప్పకూలవచ్చు. అందుకనే డైవర్సిఫైడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని ఇన్వెస్టర్లకు సూచిస్తాం. ఇలా ఇన్వెస్ట్ చేస్తేనే, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే అసలు ప్రయోజనం నెరవేరుతుంది.

మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ఆ ఫండ్ మేనేజర్ రీసెర్చ్ చేసి మీ కోసం ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాలు తీసుకుంటారు. అలా కాకుండా మీరే ఒక రంగాన్ని ఎంచుకొని, ఆ రంగం ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తే మరి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి అర్థమే ఉండదు. వ్యక్తిగత ఇన్వెస్టర్లకు ఒకే రంగపు మ్యూచువల్ ఫండ్స్ సరైనవి కావు. డైవర్సిఫైడ్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తేనే మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన ప్రయోజనాలు లభిస్తాయి. చాలా డైవర్సిఫైడ్ ఫండ్స్‌లో ఎఫ్‌ఎంసీజీ రంగానికి చెందిన షేర్లు ఉంటాయి. రంగాల వారీ ఫండ్లు అయితే గియితే అద్భుత రాబడులనిస్తాయి లేదంటే వాటి పనితీరు పేలవంగా ఉంటుంది.  


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement