Money market
-
లాభాల్లో కదలాడుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 131 పాయింట్లు పెరిగి 23,582కు చేరింది. సెన్సెక్స్ 451 పాయింట్లు ఎగబాకి 77,783 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.4 శాతం లాభపడింది. నాస్డాక్ 0.6 శాతం ఎగబాకింది.కొద్ది రోజులుగా మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న నేపథ్యంలో కొంతమేర షార్ట్‌కవరింగ్‌కు వీలున్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఫలితంగా మార్కెట్లు మంగళవారం కొంత పెరుగుతుననట్లు తెలియజేశారు. ఫెడ్ ఛైర్మన్ జెరొమ్ పావెల్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడంతో ఇప్పటికిప్పుడే వడ్డీరేట్లను తగ్గించే అవసరం ఉండకపోవచ్చని తెలిపారు. దాంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదొడుకులతో కదలాడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 21,716 వద్దకు చేరింది. సెన్సెక్స్ 130 పాయింట్లు దిగజారి 72,141 వద్ద ట్రేడవుతోంది. కొత్త సంవత్సరం నేపథ్యంలో యూఎస్, యూరప్ మార్కెట్లకు సోమవారం సెలవు. ఆసియా-పసిఫిక్ సూచీలు మంగళవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. 2023 డిసెంబరులో జీఎస్టీ వసూళ్లు 10 శాతం పెరిగి రూ.1.64 లక్షల కోట్లకు చేరాయి. మరోవైపు విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం రూ.855 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.410 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.30 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే ఇండియా, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, టైటన్, సన్‌ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, హెచ్‌యూఎల్, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఇండెక్స్ ముందు చిన్నబోయిన లార్జ్‌క్యాప్ ఫండ్స్
ముంబై: లార్జ్‌క్యాప్ పథకాలు పనితీరు పరంగా సూచీల ముందు చిన్నబోయాయి. ఈ ఏడాది జూన్ వరకు ఏడాది కాలానికి చూసుకుంటే 91 శాతం పథకాలు రాబడుల విషయంలో ఇండెక్స్‌ల కంటే వెనుకబడ్డాయి. వీటితో పోలిస్తే మెజారిటీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాలు మెరుగైన పనితీరు చూపించాయి. సూచీల కంటే పనితీరులో వెనుకబడిన మిడ్/స్మాల్‌క్యాప్ పథకాలు కేవలం 27.45 శాతంగానే ఉన్నాయి. ఎస్అండ్పీ డౌజోన్స్ ఇండిసెస్ ఓ నివేదిక రూపంలో ఈ వివరాలను విడుదల చేసింది. ఇక 75.61 శాతం ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ (పన్ను ఆదా చేసే) కూడా వాటి సూచీలతో పోలిస్తే మెరుగైన రాబడులను ఇవ్వలేకపోయాయి. 2022 ఆరంభం నుంచి లార్జ్‌క్యాప్ ఫండ్ మేనేజర్లకు కష్టంగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. 87.5 శాతం ఫండ్స్ మొదటి ఆరు నెలల్లో సూచీల కంటే తక్కువ రాబడినిచ్చినట్టు వెల్లడించింది. ఇక మరీ ముఖ్యంగా 2022 జూన్ నాటికి అంతక్రితం ఐదేళ్ల కాలలోనూ 89 శాతం లార్జ్‌క్యాప్ ఫండ్స్ వాటి సూచీల కంటే తక్కువ రాబడులను ఇచ్చాయి. సెప్టెంబర్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.39.88 లక్షల కోట్లకు చేరుకోవడం తెలిసిందే. దీర్ఘకాలలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాలు మంచి పనితీరు చూపించినట్టు ఎస్అండ్పీ నివేదిక తెలిపింది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
డెట్‌లో నమ్మకమైన రాబడి
స్వల్ప కాల లక్ష్యాలకు డెట్ సాధనాలే అనుకూలం. ఈక్విటీలంటే కనీసం ఐదేళ్లు అంతకుమించి వ్యవధి కావాల్సి ఉంటుంది. రిస్క్ తీసుకోలేని వారి కోసం, స్వల్పకాల లక్ష్యాల కోసం డెట్ ఫండ్స్‌లో.. తక్కువ రిస్క్, మెరుగైన రాబడుల కోసం చూసే వారికి మనీ మార్కెట్ ఫండ్స్ అనుకూలమని చెప్పుకోవచ్చు. 2018–20 మధ్యకాలంలో డెట్ మార్కెట్లో రుణ చెల్లింపుల ఎగవేతలు, సంక్షోభ సమయంలోనూ మనీ మార్కెట్ ఫండ్స్ విభాగం బలంగా నిలబడింది. పెట్టుబడుల విధానం.. ఇవి తక్కువ కాల వ్యవధి కలిగిన సాధనాల్లో (సాధారణంగా ఏడాదిలోపు) ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కనుక క్రెడిట్ రిస్క్ భయం అక్కర్లేదు. వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో దీర్ఘకాలిక డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం సరికాదు. అందుకని ప్రస్తుత తరుణంలో ఈ పథకాలు ఎంతో అనుకూలమని చెప్పుకోవచ్చు. తక్కువ రిస్క్ కోరుకునే వారికి కూడా అనుకూలం. ఈ విభాగంలో ఇన్వెస్టర్లు ప్రధానంగా నాలుగు పథకాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. అవి.. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ (ఏబీఎస్ఎల్) మనీ మేనేజర్, హెచ్డీఎఫ్సీ మనీ మార్కెట్, ఎస్బీఐ సేవింగ్స్, నిప్పన్ ఇండియా మనీ మార్కెట్. స్వల్పకాలం నుంచి మధ్య కాలానికి వీటిని పరిశీలించొచ్చు. ఈ పథకాలన్నీ కూడా కనీసం రూ.10వేల కోట్లకు పైగా నిర్వహణ ఆస్తులు కలిగి ఉన్నవి కావడం గమనించాలి. రాబడులు మనీ మార్కెట్ ఫండ్స్ మూడేళ్లకు పైన పన్ను అనంతరం రాబడుల్లో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైన పనితీరు చూపించాయి. డెట్ పథకాల్లో కనీసం మూడేళ్లపాటు పెట్టుబడులు కొనసాగించినట్టయితే, లాభాలు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తాయి. మూడేళ్ల రోలింగ్ రాబడులను గమనిస్తే ఈ మూడు పథకాల్లోనూ వార్షికంగా 7.5 శాతానికి పైనే ఉన్నాయి. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో ఇవి మనీ మార్కెట్ ఫండ్స్ విభాగంలో రాబడుల పరంగా మెరుగైన స్థానంలో నిలిచాయి. మూడేళ్లలో సగటున రోలింగ్ రాబడి 7.5–7.8 శాతం చొప్పున ఉంది. ఈ కాలంలో గరిష్ట రాబడి 8.9–9.5 శాతం వరకు ఉంటే, కనిష్ట రాబడి 5–5.2 శాతం మధ్య ఉంది. ఒక్క 2021 సంవత్సరాన్ని మినహాయిస్తే గడిచిన పదేళ్ల కాలంలో ఈ పథకాల్లో రాబడి 6.29–9.2 శాతం మధ్య ఉంది. కానీ ఫిక్స్డ్ డిపాజిట్లలో రేట్లు 6–7 శాతంగానే ఉండడాన్ని గమనించాలి. మూడేళ్లకు మించిన కాలానికి వచ్చే రాబడిపై 20 శాతం పన్ను పడుతుంది. కాకపోతే రాబడి నుంచి ద్రవ్యోల్బణాన్ని మినహాయించుకోవచ్చు. ఇండెక్సేషన్ ప్రయోజనం వల్ల రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడకపోవచ్చు. కనుక మూడేళ్లు, ఐదేళ్ల పాటు పెట్టుబడులపై ఈ పథకాల్లో పన్ను అనంతరం నికర వార్షిక రాబడి 7 శాతానికి పైనే, అది కూడా రిస్క్ లేకుండా ఉంటుందని అంచనా వేసుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో ఈ నాలుగు పథకాలూ తక్కువ రిస్క్ పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్నాయి. వీటి పెట్టుబడి సాధనాల సగటు మెచ్యూరిటీ (కాల వ్యవధి ముగియడం) 0.28–0.38 సంవత్సరాలుగా ఉంది. అంటే ఏడాదిలో ఒకటో వంతు. 71–113 వరకు సెక్యూరిటీ సాధనాల్లో పెట్టుబడులు కలిగి ఉన్నాయి. ఒక సాధనంలో 5 శాతానికి మించి పెట్టుబడులు లేవు. వైవిధ్యం ఎక్కువగా కనిపిస్తోంది. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
ఏ ఫండ్ అయితే బెటర్?
స్టాక్ మార్కెట్లు మంచి ఊపుమీదున్నాయి. ఎప్పటికప్పుడు జీవితకాల గరిష్ఠ స్థాయిల్ని నమోదు చేస్తున్నాయి. చాలామంది వీటిలో ఇన్వెస్ట్ చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కాకపోతే స్టాక్ మార్కెట్లో నేరుగా ఇన్వెస్ట్ చేయటం చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం కనక చాలా మంది మ్యూచ్‌వల్ ఫండ్స్‌నే ఆశ్రయిస్తున్నారు. అయితే ఇక్కడో ప్రధాన ప్రశ్న ఉంది. మార్కెట్ నిండా రకరకాల సంస్థలు, రకరకాల ఫండ్లు ఉన్న నేపథ్యంలో అసలు ఏ మ్యూచ్‌వల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలి? మంచి ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి? అందరినీ వేధించే ఈ ప్రశ్నలకు సమాధానం ఒకసారి చూద్దాం... మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో పెట్టడానికి ముందు.. ఇన్వెస్టరు తనకు తానుగా వేసుకోవాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. ఇప్పుడు నా వయసెంత? ఆదాయ వనరులేంటి? ఎందుకోసం ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను? పెట్టుబడిని ఎన్నాళ్లు కొనసాగించగలను? ఎన్నాళ్ల దాకా విక్రయించకుండా స్కీములో కొనసాగగలను? ఇదిగో ఈ ప్రశ్నలకు మనకు మనం ఎంత సంతృప్తికరమైన సమాధానాలను ఇచ్చుకోగలిగితే... మన రిస్కు సామర్థ్యాలు, పెట్టుబడి లక్ష్యాలపై అంతగా అవగాహన తెచ్చుకున్నవారమవుతాం. మన రిస్కు సామరర్థ్యాన్ని అంచనా వేయడానికి వయస్సు, ప్రస్తుత ఆదాయమనేవి చాలా కీలకం. ఇక ఎంత రిస్కు తీసుకోగలం, ఏ లక్ష్యం కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్న అంశాలపై స్పష్టత వస్తే.. అందుకు తగిన మ్యూచువల్ ఫండ్ స్కీమును ఎంచుకునేందుకు వీలవుతుంది. సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ రకరకాల స్కీముల్ని ఆఫర్ చేస్తున్నాయి. వాటిల్లో ప్రధానమైనవి.. మనీ మార్కెట్ ఫండ్స్ ఈ ఫండ్స్ .. ప్రభుత్వ బాండ్లు, ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్, సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్ వంటి స్వల్పకాలిక ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వీటిని రిస్కు తక్కువగా ఉండే ఫండ్స్‌గా పరిగణిస్తారు. ఈక్విటీ ఫండ్స్ ఇవి స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయిన దేశీ కంపెనీల షేర్లలోనే ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వీటిని గ్రోత్ ఫండ్స్‌గా కూడా వ్యవహరిస్తారు. ఒక మోస్తరు నుంచి అధిక రిస్కుగల ఫండ్స్‌గా వీటిని పరిగణిస్తారు. డెట్ ఈ ఫండ్స్ కేవలం అతి తక్కువ రిస్కు ఉండే ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడం ద్వారా స్థిరమైన రాబడులు అందిస్తాయి. వీటిని ఇన్కమ్ ఫండ్స్‌గా కూడా వ్యవహరిస్తారు. ఇవి సాధారణంగా రిస్కు తక్కువగా ఉండే ఫండ్స్. ఈ స్కీముల్లో ఇన్వెస్ట్ చేసేందుకు కొన్ని ఆప్షన్లు కూడా ఉంటాయి. స్కీముతో పాటు సరైన ఆప్షన్‌ను కూడా ఎంచుకుంటేనే లక్ష్యాలు సాధించగలం. ఆ ఆప్షన్స్ ఏంటంటే.. డివిడెండ్ పే అవుట్... ఈ ఆప్షన్లో ఇన్వెస్టరుకు డివిడెండు చెల్లించడం జరుగుతుంది. తద్వారా సదరు స్కీమును హోల్డ్ చేసినంతకాలం మధ్య మధ్యలో ఇన్వెస్టరు చేతికి డివిడెండు రూపంలో రాబడి అందుతూ ఉంటుంది. గ్రోత్ ఆప్షన్... ఈ విధానంలో డివిడెండు చేతికి రాదు. సదరు సంస్థే ఆ డివిడెండును మరిన్ని షేర్లు కొనటానికి ఉపయోగిస్తుంది. తద్వారా ఎన్ఏవీ కూడా పెరుగుతుంటుంది. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు దీన్ని ఎంచుకుంటే శ్రేయస్కరం. డివిడెండ్ రీ–ఇన్వెస్ట్మెంట్... పలువురు ఎంచుకునే ఈ విధానంలో.. డివిడెండు చేతికి రాదు. సదరు సంస్థే ఆ డివిడెండుతో అదే స్కీములో మరిన్ని యూనిట్లు కొనుగోలు చేస్తుంది. దాంతో యూనిట్ల సంఖ్య పెరుగుతుంది. వీటిలో డివిడెండ్ పే అవుట్ ఆప్షన్ ఎంచుకుంటే ఎప్పటికప్పుడు డివిడెండ్ చేతికి వస్తుంది కనుక మన పెట్టుబడి పెరిగే అవకాశాలు తక్కువ. అదే రీ–ఇన్వెస్ట్మెంట్, గ్రోత్ ఆప్షన్లు ఎంచుకుంటే మన చేతికి డివిడెండ్ రాదు. కానీ పెట్టుబడి పెరుగుతుంది. మన అవసరాన్ని బట్టి కావాల్సింది ఎంచుకోవచ్చు. -
చౌక ద్రవ్య విధానం అంటే?
ఆధునిక ప్రపంచంలో ప్రతి దేశం ఒక కేంద్ర బ్యాంకును స్థాపించుకుంది. ఇది దేశంలోని ద్రవ్య మార్కెట్‌కు నాయకత్వం వహించడంతో పాటు ద్రవ్య విధానాన్ని రూపొందిస్తుంది. దీంతోపాటు దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ, ఆర్థిక సంస్థల కార్యకలాపాల పర్యవేక్షణ, నియంత్రణ బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ప్రపంచంలో మొట్టమొదట కేంద్ర బ్యాంకుగా స్వీడన్‌లోని ‘రిక్స్ బ్యాంకు’ను పేర్కొంటారు. దీన్ని 1656లో ‘స్టాక్‌హోమ్ బ్యాంకు’ పేరుతో ‘జొహన్ పామ్స్ట్రచ్’ నెలకొల్పాడు. అధిక కరెన్సీ ముద్రణ వల్ల నష్టాలు రావడంతో పార్లమెంటు తీర్మానం ద్వారా 1668, సెప్టెంబర్ 17న ‘రిక్స్ బ్యాంకు’గా అవతరించింది. కేంద్ర బ్యాంకు నిర్వహించే విధుల దృష్ట్యా 1694లో స్థాపించిన ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్’ను మొదటి కేంద్ర బ్యాంకుగా గుర్తించారు. అమెరికాలో 1913, డిసెంబర్ 23న ఫెడరల్ రిజర్వ్ సిస్టం రూపంలో ఒక కేంద్ర బ్యాంకు వ్యవస్థను నెలకొల్పి, దీనికి అనుబంధంగా 12 ప్రాంతీయ ఫెడరల్ బ్యాంకులను ఏర్పాటుచేశారు. ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్’ను ఆదర్శంగా తీసుకొని 1935లో మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ని ఏర్పాటు చేశారు. 926లో రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ లేదా హిల్టన్–యంగ్ కమిషన్ మన దేశంలో కేంద్ర బ్యాంకును స్థాపించాలని సలహా ఇచ్చింది. 1931లో ఏర్పాటుచేసిన ‘ఇండియన్ సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ’ సైతం కేంద్ర బ్యాంకు ఏర్పాటు చేయాల్సిందిగా సూచించింది. ఫలితంగా 1934 మార్చిలో రిజర్వ్ బ్యాంకు చట్టం రూపొందింది. 1935, ఏప్రిల్ 1న మన దేశ కేంద్ర బ్యాంకుగా ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ రూ.5 కోట్ల మూలధనంతో ఏర్పాటైంది. దీన్ని 1949, జనవరి 1న జాతీయం చేశారు. ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. కోల్‌కతా, చెన్నై, న్యూఢిల్లీల్లో ప్రాంతీయ బోర్డు కార్యాలయాలు ఉన్నాయి. ∙రిజర్వ్ బ్యాంకు గవర్నర్.. ముఖ్య కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తారు. ఆయనతోపాటు నలుగురు డిప్యూటీ గవర్నర్లు, 15 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉంటారు. రిజర్వ్ బ్యాంకు మొదటి గవర్నర్‌గా ఓ.స్మిత్ వ్యవహరించారు. ప్రస్తుత గవర్నర్ ఉర్జిత్ పటేల్ 2016, సెప్టెంబర్ 4న ఆర్బీఐ 24వ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆర్బీఐ.. ప్రభుత్వ విధానాలను అమలు చేస్తుంది. దీంతోపాటు ప్రభుత్వానికి కోశ వ్యవహారాల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తూ దేశ ద్రవ్య విధానాన్ని సమర్థంగా నిర్వహిస్తోంది. ఆర్బీఐ విధులను స్థూలంగా రెండు రకాలుగా పేర్కొనవచ్చు. 1. సంప్రదాయక విధులు 2. అభివృద్ధిపరమైన విధులు సంప్రదాయక విధులు కరెన్సీ నోట్ల జారీ: రిజర్వ్ బ్యాంక్ చట్టం –1934లోని సెక్షన్ 22 ప్రకారం మన దేశంలో రూ.2 నుంచి రూ. 10,000 లోపు విలువ కలిగిన కరెన్సీ నోట్లను జారీ చేసే గుత్తాధికారం ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’కు ఉంది. అలాగే సెక్షన్ 26 ప్రకారం రిజర్వ్ బ్యాంకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం కరెన్సీ నోట్లను రద్దు చేయొచ్చు. 1938లో జారీ చేసిన రూ.10,000, రూ.5,000, రూ.1,000 కరెన్సీ నోట్లను 1946లో రద్దు చేశారు. మళ్లీ 1954లో ప్రవేశపెట్టారు. జనతా ప్రభుత్వం 1978, జనవరి 16న ఈ నోట్ల రద్దుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. మోదీ ప్రభుత్వం 2016, నవంబరు 8న రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేసింది. వీటి స్థానంలో కొత్తగా రూ.2000 నోట్‌ను జారీ చేసింది. కరెన్సీ నోట్ల జారీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా ఒక జారీ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసింది. మన దేశంలో కరెన్సీ నోట్ల జారీకి 1935 నుంచి 1956 వరకు నైష్పత్తిక రిజర్వ్ పద్ధతిని అనుసరించారు. దీని ప్రకారం కరెన్సీ జారీకి 40 శాతం బంగారాన్ని నిల్వ ఉంచాలి. 1956, అక్టోబర్ 10 నుంచి కనిష్ట నిధుల పద్ధతి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం మొత్తం రూ.200 కోట్ల నిల్వల పరిమాణంలో రూ.115 కోట్ల విలువైన బంగారాన్ని, రూ.85 కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని నిల్వగా ఉంచాలి. ప్రభుత్వ బ్యాంకు: ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకర్‌గా, ప్రతినిధిగా, సలహాదారుగా వ్యవహరిస్తుంది. వాణిజ్య బ్యాంకులు ఖాతాదారులకు ఎలాంటి బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పిస్తాయో అవే సౌకర్యాలను రిజర్వ్ బ్యాంక్ ప్రభుత్వానికి కల్పిస్తుంది. ప్రభుత్వ రుణాలను దీని ద్వారా జారీ చేస్తారు. ప్రభుత్వం ఇతర దేశాలకు చేయాల్సిన చెల్లింపుల కోసం ఆర్బీఐ విదేశీ మారక ద్రవ్యాన్ని సరఫరా చేస్తుంది. ప్రభుత్వం తరఫున విదేశీ కరెన్సీ కొనుగోలు, అమ్మకాలను చేపట్టడంతోపాటు ప్రభుత్వ బంగారం నిల్వలను పరిరక్షిస్తుంది. దేశ ఆర్థిక పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ద్రవ్యోల్బణం, ప్రతి ద్రవ్యోల్బణం, కరెన్సీ మూల్యహీనీకరణ, లోటు ద్రవ్యవిధానం, చెల్లింపుల శేషం తదితర విషయాల్లో ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. బ్యాంకులకు బ్యాంకు: రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు నాయకత్వం వహిస్తుంది. అవి స్వీకరించిన డిపాజిట్లలో కొంత భాగాన్ని రిజర్వ్ బ్యాంకులో నిల్వ ఉంచాలి. దీన్నే నగదు నిల్వల నిష్పత్తి అంటారు. ఆర్బీఐ.. వాణిజ్య బ్యాంకుల కార్యకలాపాలను నియంత్రిస్తుంది. వాణిజ్య బ్యాంకులకు అవసరమైనప్పుడు వాటి వద్ద ఉన్న ప్రభుత్వ బాండ్లను, ట్రెజరీ బిల్లులను రీ డిస్కౌంట్ చేసే సౌకర్యం కల్పిస్తుంది. అందుకే దీన్ని అంతిమ రుణదాతగా పేర్కొంటారు. రిజర్వ్ బ్యాంకు క్లియరింగ్ హౌజ్‌ను నిర్వహిస్తూ బ్యాంకుల మధ్య జరిగే లావాదేవీలను పర్యవేక్షిస్తుంది. విదేశీ నిధుల పరిరక్షణ: విదేశీ మారక నియంత్రణ చట్టాన్ని ప్రవేశపెట్టిన తర్వాత విదేశీ మారక నిల్వలన్నీ రిజర్వ్ బ్యాంకు అధీనంలోకి వచ్చాయి. ఈ చట్టం ప్రకారం అనుమతిలేనివారు విదేశీ మారకాన్ని అమ్మడానికి/కొనడానికి వీల్లేదు. విదేశీ ద్రవ్య వ్యవహారాలన్నీ ఆర్బీఐ ద్వారానే జరుగుతాయి. మారకపు రేటులో స్థిరత్వ సాధన: మన దేశానికి అంతర్జాతీయ ద్రవ్యనిధిలో సభ్యత్వం ఉంది. అందువల్ల ఇతర దేశాలతోపాటు కరెన్సీ మారకపు రేటులో స్థిరత్వ సాధన రిజర్వ్ బ్యాంకు బాధ్యత. దీంతో అంతర్జాతీయ కరెన్సీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు.. రక్షకుడిగా వ్యవహరిస్తుంది. పరపతి నియంత్రణ: వాణిజ్య బ్యాంకులు తాము స్వీకరించిన ప్రాథమిక డిపాజిట్ల ఆధారంగా పరపతి ద్రవ్యాన్ని సృష్టిస్తాయి. పరపతి ద్రవ్యం ఎక్కువైనప్పుడు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడతాయి. పరపతి ద్రవ్యం తక్కువైనప్పుడు ఆర్థిక వ్యవస్థలో ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు తలెత్తుతాయి. దీని దృష్ట్యా రిజర్వ్ బ్యాంకు పరిమాణాత్మక, గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలను ఉపయోగించి పరపతిని నియంత్రిస్తుంది. అభివృద్ధి పరమైన విధులు బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధి: రిజర్వ్ బ్యాంకు దేశంలోని బ్యాంకుల కార్యకలాపాలను పర్యవేక్షించడంతోపాటు బ్యాంకింగ్ వ్యవస్థలో నూతన మార్పులను ప్రవేశపెడుతుంది. బ్యాంకుల అభివృద్ధికి బ్యాంకింగ్ కార్యకలాపాల శాఖను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ శాఖల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. వ్యవసాయ పరపతికి ప్రోత్సాహం: రిజర్వ్ బ్యాంకు గ్రామీణ, వ్యవసాయ పరపతిని అందించడంలో పరోక్షంగా కృషి చేçస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర సహకార బ్యాంకులకు, వ్యవసాయ పరపతిని అందించే విత్త సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. తద్వారా వ్యవసాయదారులకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలికరుణ సౌకర్యాల కల్పనకు తోడ్పడుతుంది. గ్రామీణ పరపతిలో శిఖరాగ్ర బ్యాంకుగా వ్యవహరించే నాబార్డు మూలధనంలో 50 శాతాన్ని రిజర్వ్ బ్యాంకే సమకూర్చింది. పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటు: రిజర్వ్ బ్యాంకు పెద్ద పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడుతూనే చిన్న పరిశ్రమల అభివృద్ధికి సైతం కృషి చేస్తుంది. భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు, భారత పారిశ్రామిక విత్త సంస్థ, రాష్ట్ర విత్త సహాయ సంస్థల కార్యకలాపాల్లో రిజర్వ్ బ్యాంకు పాత్ర కీలకం. పారిశ్రామిక విత్త సహాయం నిమిత్తం రిజర్వ్ బ్యాంకు యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాను నెలకొల్పింది. బిల్ మార్కెట్ అభివృద్ధికి కృషి: ఆర్బీఐ 1952లో బిల్ మార్కెట్ పథకాన్ని ప్రారంభించింది. తద్వారా సమర్థవంతమైన ద్రవ్య మార్కెట్‌కు పునాదులు వేసింది. నరసింహం కమిటీ సిఫారసుల మేరకు 1970లో కొత్త బిల్ మార్కెట్ పథకాన్ని ప్రారంభించడం ద్వారా రీ డిస్కౌంటింగ్ పద్ధతులను సులభతరం చేసింది. తద్వారా రుణాల మంజూరీలో అనవసర జాప్యాన్ని నివారించింది. సిబ్బందికి శిక్షణ సౌకర్యాలు: దేశీయ బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న సిబ్బందికి శిక్షణ కోసం ఆర్బీఐ మూడు కళాశాలలను నిర్వహిస్తోంది. అవి.. 1. బ్యాంకర్ల శిక్షణ కళాశాల (ముంబై) 2. వ్యవసాయ బ్యాంకింగ్ కళాశాల (పుణె ) 3. రిజర్వ్ బ్యాంకు సిబ్బంది కళాశాల (చెన్నై). ద్రవ్య విధానం ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు ఆ దేశ ద్రవ్య విధానంపై ఆధారపడి ఉంటుంది. ద్రవ్య విధానం ఆర్థిక విధానంలో అంతర్భాగం. ద్రవ్య విధాన రూపకల్పనలో రిజర్వ్ బ్యాంకు పాత్ర విశిష్టమైంది. ఆర్బీఐ ఆర్థిక వ్యవస్థలో పరపతిని క్రమబద్ధం చేస్తూ ద్రవ్య సరఫరాను అదుపులో ఉంచుతుంది. తద్వారా సాధారణ ధరల స్థాయిలో సుస్థిరత తీసుకొస్తుంది. ఆర్థికాభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడమే ద్రవ్య విధాన ముఖ్య లక్ష్యం. పరపతిని నియంత్రించేందుకు రెండు రకాల సాధనాలు ఉన్నాయి. అవి.. 1. పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు 2. గుణాత్మక నియంత్రణ సాధనాలు పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు బ్యాంకు రేటు: వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న వినిమయ బిల్లుల్ని డిస్కౌంట్ చేయడం ద్వారా లేదా సెక్యూరిటీలను హామీగా ఇవ్వడం ద్వారా రిజర్వ్ బ్యాంకు నుంచి రుణాలు పొందుతాయి. ఈ రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటును బ్యాంకు రేటు అంటారు. దీన్నే ‘రీ డిస్కౌంటింగ్ రేటు’గా కూడా పేర్కొంటారు. ఆర్థిక వ్యవస్థలో పరపతి పరిమాణం ఎక్కువగా ఉండి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ద్రవ్య çసరఫరాను తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంకు.. బ్యాంకు రేటును పెంచుతుంది. దీన్ని ఖరీదైన ద్రవ్య విధానం అంటారు. ఆర్థిక వ్యవస్థలో పరపతి పరిమాణం తక్కువగా ఉండి ప్రతిద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడినప్పుడు రిజర్వ్ బ్యాంకు ద్రవ్య çసరఫరాను పెంచేందుకు బ్యాంకు రేటును తగ్గిస్తుంది. దీన్ని చౌక ద్రవ్య విధానం అంటారు. ప్రస్తుతం బ్యాంకు రేటు 6.25 శాతంగా, రెపో రేటు 6 శాతంగా, రివర్స్ రెపో రేటు 5.75 శాతంగా ఉంది.