అంతర్జాతీయ మార్కెట్లు బలహీనపడటంతో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి మరింత డీలాపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 222 పాయింట్లు వెనకడుగు వేసి 36,516కు చేరగా.. నిఫ్టీ 69 పాయింట్లు క్షీణించి 10,744 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. జాబితాలో క్వాంటమ్ పేపర్స్, సీమెక్ లిమిటెడ్, పైసాలో డిజిటల్, ఇన్‌స్పిరిసిస్ సొల్యూషన్స్, భారత్ డైనమిక్స్ చోటు సాధించాయి. ఇతర వివరాలు చూద్దాం..
ఇన్‌స్పిరిసిస్ సొల్యూషన్స్
ఐటీ సర్వీసుల ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 27.3 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం కేవలం 1600 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 44,000 షేర్లు చేతులు మారాయి.
క్వాంటమ్ పేపర్స్
పేపర్ తయారీ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 16.5 శాతం దూసుకెళ్లి రూ. 597 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 614 వద్ద ఏడాది గరిష్టానికి చేరింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం కేవలం 350 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 8,000 షేర్లు చేతులు మారాయి.
పైసాలో డిజిటల్
ఈ ఎన్‌బీఎఫ్‌సీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 16 శాతం దూసుకెళ్లి రూ. 242 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 250 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 1600 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 600 షేర్లు మాత్రమే చేతులు మారాయి.
సీమెక్ లిమిటెడ్
ఆఫ్‌షోర్ సర్వీసుల ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 12.5 శాతం జంప్‌చేసి రూ. 418 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 442 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 7,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 23,000 షేర్లు చేతులు మారాయి.
భారత్ డైనమిక్స్
ఎన్‌ఎస్‌ఈలో ఈ పీఎస్‌యూ షేరు ప్రస్తుతం 5 శాతం జంప్‌చేసి రూ. 402 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 415కు ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 1.51 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 2.87 లక్షల షేర్లు చేతులు మారాయి.
Comments
Please login to add a commentAdd a comment