
న్యూఢిల్లీ: కంపెనీల క్యూ1 ఫలితాల సీజన్ ఆరంభమ వుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ (ఏప్రిల్–జూన్, క్యూ1) ఫలితాలను జూలై 9న దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ బోణీ చేయనుంది. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వచ్చే నెల 12న ఫలితాలను వెల్లడించనున్నది. విప్రో ఫలితాలు అదే నెల 17న వెలువడతాయి.