అంచనాలను మించిన ఐవోసీ, బోనస్ ప్రకటన
Published Mon, Aug 29 2016 4:03 PM | Last Updated on Tue, Jun 4 2019 6:19 PM
ముంబై: ప్రభుత్వ రంగ ఆయిల్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) అంచనాలకు మించి ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నికర లాభం 25 శాతం పెరిగి రూ. 8269 కోట్లను నమోదు చేసింది. నికర లాభం 4,472 కోట్లుగా విశ్లేషకులు అంచనావేశారు. మొత్తం అమ్మకాలు రూ. 1,14,000 కోట్ల నుంచి 1,01,400 రూ. కోట్లకు తగ్గాయి. స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్‌ఎం) కూడా 10.77 డాలర్ల నుంచి 9.98 డాలర్లకు క్షీణించింది. అయితే బ్యారెల్ కు 6 డాలర్లుగా ఉండనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేసాయి. దీంతో ఎబిటా మార్జిన్ కూడా గణనీయంగా పెరిగింది. త్రైమాసిక ప్రాతిపదికన నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 4750 కోట్ల నుంచి రూ. 12,248 కోట్లకు జంప్ చేసింది. ఇబిటా మార్జిన్లు 4.8 శాతం నుంచి 12.8 శాతంగా నమోదయ్యాయి. విశ్లేషకులు అంచనావేసింది రూ. 7,040 కోట్లు. ఇతర ఆదాయం మాత్రం 35 శాతం తగ్గి రూ. 470 కోట్లకు పరిమితమైంది. దేశీయంగా 20.41 మిలియన్ టన్నుల పెట్రో ఉత్పత్తులను విక్రయించింది. కాగా, ఫైనాన్స్ వ్యయాలు 37 శాతం క్షీణించి 680 కోట్లకు చేరాయి.
ఇతర ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల్లా ఇండియన్ ఆయిల్ మెరుగైన ఫలితాల ను సాధించిందని గత మూడు త్రైమాసికాలలో అత్యధిక స్థాయిలో ఉండడం ప్రోత్సాహకరమని మార్కెట్ నిపుణుడు గౌరంగ్ షా తెలిపారు.
Advertisement