Beats Estimates
-
అంచనాలను దాటి దూసుకెళ్లిన ‘హీరో’
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన రంగ దిగ్గజం హీరో మోటోకార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 6 శాతం వృద్ధితో రూ. 1,066 కోట్లను తాకింది. అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు తోడ్పడింది.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,007 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,533 కోట్ల నుంచి రూ. 10,483 కోట్లకు బలపడింది. ఈ కాలంలో 15.2 లక్షల మోటార్‌సైకిళ్లు, స్కూటర్లను విక్రయించింది. గత క్యూ2లో 14.16 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. మూడు మోడళ్లు రెడీ...క్యాష్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా పటిష్ట క్యాష్‌ఫ్లోను సాధిస్తున్నామని, దీంతో ఆర్థికంగా మరింత బలపడుతున్నట్లు కంపెనీ సీఈవో నిరంజన్ గుప్తా పేర్కొన్నారు. ఎంట్రీ, డీలక్స్ విభాగాల్లో మరిన్ని బ్రాండ్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు. తద్వారా ప్రీమియం విభాగంలో పటిష్ట పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకుంటున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: కేటీఎం దూకుడు.. ఒకేసారి మార్కెట్లోకి 10 కొత్త బైక్లురానున్న ఆరు నెలల్లో ఎక్స్‌పల్స్ 210, ఎక్స్ట్రీమ్ 250ఆర్, కరిజ్మా ఎక్స్ఎంఆర్ 250 బైకులను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ ఏడాది చివరికల్లా ప్రీమియా విభాగంలో 100 స్టోర్లను అధిగమించనున్నట్లు తెలియజేశారు. హీరో మోటో షేరు బీఎస్ఈలో 2% బలపడి రూ. 4,604 వద్ద ముగిసింది. -
అంచనాలను మించిన పరోక్ష పన్నులు
సాక్షి, న్యూఢిల్లీ: పరోక్ష పన్నుల ఆదాయం సైతం ప్రత్యక్ష పన్నుల మాదిరే అంచనాలను మించి వసూలైంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ తదితర పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్ సుంకం ‘కరోనా కాలంలోనూ’ భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. దీంతో 2020–21 ఆర్థిక సంవత్సరంలో 9.89 లక్షల కోట్ల ఆదాయం పరోక్ష పన్నుల రూపంలో వస్తుందని కేంద్ర ప్రభుత్వం తొలుత అంచనాలు వేసుకోగా.. వాస్తవానికి అంతకుమించి రూ.10.71 లక్షల కోట్లు సమకూరింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం గణాంకాలను విడుదల చేసింది. పరోక్ష పన్నుల్లో జీఎస్టీ, కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీలు కలసి ఉంటాయి. 2019–20లో పరోక్ష పన్నుల ఆదాయం రూ.9.54 లక్షల కోట్లుగా ఉంది. 2020–21 సంవత్సరానికి తొలుత అధిక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సర్కారు.. కరోనాతో వ్యాపారాలు కుదేలవడంతో లక్ష్యాన్ని రూ.9.89 లక్షల కోట్లకు సవరించింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు ఆర్థిక ఉద్దీపనలకుతోడు.. పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాల పెంపుతో పరోక్ష పన్నుల ఆదాయం అంచనాలను మించి వసూలైంది. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రూపంలో వచ్చే ఆదాయం 59 శాతం పెరిగి రూ.3.91 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. పన్నుల ఆదాయం వివరంగా.. ► వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రూపంలో 2020–21లో రూ.5.48 లక్షల కోట్లు వచ్చింది. 2019–20లో వచ్చిన రూ.5.99 లక్షల కోట్లతో పోలిస్తే 8 శాతం తగ్గింది. ► కస్టమ్స్ రూపంలో రూ.1.32 లక్షల కోట్లు సమకూరింది. 2019–20లో వచ్చిన రూ.1.09 లక్షల కోట్లతో పోలిస్తే 21 శాతం పెరిగింది. ► సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆదాయం రూ.3.91 లక్షల కోట్లుగా ఉంది. 2019–20లో ఆదాయం రూ.2.45 లక్షల కోట్లతో పోలిస్తే 59 శాతం వృద్ధి నమోదైంది. ► ప్రత్యక్ష పన్నుల ఆదాయం (వ్యక్తిగత ఆదాయపన్ను, కార్పొరేట్ పన్ను) 2020–21 సవరిం చిన అంచనాలపై 5% వృద్ధితో రూ.9.45 లక్షల కోట్లుగా నమోదవడం తెలిసిందే. ప్రభుత్వ చర్యలతో పురోగతి ‘‘2020–21లో మొదటి ఆరు నెలల్లో కరోనా వల్ల జీఎస్టీ వసూళ్లపై గణనీయమైన ప్రభావం పడింది. ద్వితీయ ఆరు నెలల్లో జీఎస్టీ వసూళ్లు మంచి వృద్ధిని చూపాయి. ప్రతీ నెలలోనూ జీఎస్టీ ఆదాయం రూ.లక్ష కోట్లుపైనే వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల జీఎస్టీ పన్ను చెల్లింపులు మెరుగుపడ్డాయి’’ అని కేంద్ర ఆర్థిక శాఖా పేర్కొంది. కరోనా రెండో విడత ప్రభావంపై మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) చైర్మన్ అజిత్ కుమార్ స్పందిస్తూ.. ఆదాయం ఏప్రిల్‌లోనూ బలంగా నమోదవుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. -
టాటా మోటార్స్ లాభాలు అదుర్స్
సాక్షి,ముంబై: ఆటో-మేజర్ టాటా మోటార్స్ క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. 2019 డిసెంబర్ 31 తో ముగిసిన మూడో త్రైమాసికంలో టాటా మోటార్స్ 1,755.88 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించి విశ్లేషకుల అంచనాలను బీట్ చేసింది. రూ. 850 కోట్లుగా వుంటుందని ఎనలిస్టులు అంచనా చేశారు. గత ఏడాది ఇదే కాలంలో రూ. 26,992 కోట్ల రికార్డు నికర నష్టాన్ని నమోదు చేసింది. మొత్తం ఆదాయం 6.82 శాతం క్షీణించి రూ. 71,676.07 కోట్లకు పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇది రూ. 76,916 కోట్లు. గురువారం టాటా మోటార్స్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. స్వతంత్ర ప్రాతిపదికన కంపెనీ 1,039.51 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది త్రైమాసికంలో 617.62 కోట్ల రూపాయల లాభాన్ని సాధించింది. స్వతంత్ర మొత్తం ఆదాయం, 10,842.91 కోట్లుగా ఉంది, అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో, 6,207.67 కోట్లు. మూడవ త్రైమాసికంలో, ఎగుమతులతో సహా కంపెనీ స్వతంత్ర హోల్‌సేల్స్ 24.6 శాతం క్షీణించి 1,29,185 యూనిట్లకు చేరుకున్నాయి. చైనాలో అమ్మకాలు బాగా పుంజుకోవడంతో బ్రిటీష్ ఆధారిత సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ లాభాలు 372 మిలియన్ల పౌండ్లకు, ఆదాయం 6.4 బిలియన్ పౌండ్లకు పెరిగింది. ముఖ్యంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఎవోక్ భారీ డిమాండ్ కూడా లాభాలను ప్రభావితం చేసింది. అలాగే గ్లోబల్‌గా జాగ్వార్ ల్యాండ్ రోవర్ తన హవా కొనసాగిస్తుండగా, మార్కెట్ క్షీణత, దేశీయ మార్కెట్లోబీఎస్- 6 నిబంధనలు, కంపెనీ పనితీరును ప్రభావితం చేసిందని టాటా మోటార్స్ తెలిపింది. భారతదేశంలో ఆర్థిక మందగమనం వల్ల ఆటో పరిశ్రమ ప్రభావం కొనసాగుతోంది.మార్కెట్ షేర్లు పెరుగుతున్నప్పటికీ, లాభదాయకత ప్రభావితమైందని కంపెనీ తెలిపింది. -
అంచనాలు దాటేసిన విప్రో : 36 శాతం ఎగిసిన లాభం
సాక్షి, ముంబై : దేశీయ ఐటీ దిగ్గజం విప్రో రెండవ త్రైమాసిక ఫలితాలను మంగళవారం వెల్లడించింది. విశ్లేషకుల అంచనాలను మించి ఫలితాలను నమోదు చేసింది. మార్కెట్ ముగిసిన తరువాత ప్రకటించిన ఫలితాల్లో సంస్థ భారీ నికర లాభాల సాధించింది. నికర లాభాలు వార్షిక ప్రాతిపదికన 36 శాతం ఎగిసాయి. గత ఏడాది ఇదే క్వార్టర్లోని 1886 కోట్ల రూపాయలతో పోల్చితే ఏడాది క్యూ2లో రూ. 2650కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. ఎనలిస్టులు రూ.2303 కోట్ల లాభాలను అంచనావేశారు. ఎబిటా మార్జిన్లు 18.1 శాతంగా ఉన్నాయి. ఆదాయం 4 శాతం ఎగిసి రూ. 15,130 కోట్లను ఆర్జించింది. ఐటీ ఉత్పత్తుల విభాగం ఆదాయం రూ. 320 కోట్లుగా ఉంది. మూడవ క్వార్టర్‌కు సంబంధించిన రెవెన్యూ గెడెన్స్ 0.8 శాతంనుంచి 2.8 శాతంగా పేర్కొంది. రానున్న త్రైమాసికంలో ఆదాయాలు, మార్జిన్లు మరింత మెరుగ్గా ఉండనున్నాయని విప్రో సీఎండీ అబిదాలి నీముచ్వాలా తెలిపారు. తన ఐటీ సేవల వ్యాపారం ఆదాయం డిసెంబర్ 31 తో ముగిసిన త్రైమాసికంలో 0 2,065 మిలియన్- 10 2,106 మిలియన్ల పరిధిలో ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. -
క్యూ4లో అదరగొట్టిన ఇన్ఫీ : కొత్త సీఎఫ్‌వో
సాక్షి,ముంబై : ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. వార్షిక ప్రాతిపదికన 11శాతం వృద్ధిని నమోదు చేసింది. విశ్లేషకుల అంచనాలను బీట్ చేస్తూ ఈ క్వార్టర్లో 3,857 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ.3690 కోట్లను సాధించింది. అయితే గైడెన్స్ విషయంలో నిరాశపర్చింది. శుక్రవారం మార్కెట్ ముగిసిన అనంతరం ప్రకటించిన క్యూ4 ఫలితాల్లో కాన్సిలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 4078 కోట్లను నికర లాభాలను ఇన్ఫీ ప్రకటించిది. ఆదాయం రూ. 21,539 కోట్లను సాధించింది. అలాగే కొత్త సీఎఫ్‌వోగా నిలంజన్ రాయ్ నియామకానికి ఇన్ఫీ బోర్డు ఆమోదం తెలిపింది. మార్చి 1, 2019నుంచి ఆయన నియామకం అమల్లో ఉన్నట్టుగా పరిగణిస్తామని బీస్‌ఈ ఫైలింగ్‌లో సంస్థ వెల్లడించింది. ట్రాన్స్ఫర్మేషన్ ప్రయాణంలో మొదటి సంవత్సరం పూర్తి చేశామని ఇన్ఫీ సీఈవో సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. డివిడెండ్ షేరుకు 10.50 చొప్పున ప్రతి ఈక్విటీ షేరుకు డివిడెండ్‌ను దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ప్రకటించింది. -
క్యూ2లో అదరగొట్టిన టాటా స్టీల్
సాక్షి, ముంబై: దేశీయ స్టీల్ దిగ్గజం టాటా స్టీల్ క్యూ2 ఫలితాల్లో అదరగొట్టింది. ఎనలిస్టుల అంచనాలను బీట్ చేస్తూ మూడురెట్ల లాభాలను సాధించింది. 269.31 శాతం ఎగిసి 3,604 కోట్ల నికర లాభాలను సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 975 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. రెండవ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ .43,544 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.32,464 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఎబిటా మార్జిన్లు 84 జంప్ చేశాయి. దేశంలో అనుకూలమైన వ్యాపార పరిస్థితుల నేపథ్యంలో టాటా స్టీల్ గ్రూప్ ఈ త్రైమాసికంలో మంచి ఫలితాలను సాధించామని టాటా స్టీల్ సీఎండీ టీఎల్ నరేంద్రన్ చెప్పారు. -
బీపీసీఎల్ లాభం మూడు రెట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీపీసీఎల్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో మూడు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.745 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.2,293 కోట్లకు పెరిగిందని బీపీసీఎల్ తెలిపింది. ఒక్కో షేర్ పరంగా నికర లాభం రూ.3.79 నుంచి రూ.11.66కు ఎగసిందని భారత్ పెట్రోలియమ్ కార్పొ లిమిటెడ్(బీపీసీఎల్) పేర్కొంది. టర్నోవర్ 23 శాతం వృద్ధితో రూ.82,431 కోట్లకు పెరిగిందని వివరించింది. అమ్మకాలు 10.04 మిలియన్ టన్నుల నుంచి 10.97 మిలియన్ టన్నులకు చేరాయని పేర్కొంది. ఒక్కో బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చడం వల్ల ఈ క్యూ1లో 7.49 డాలర్ల స్థూల రిఫైనింగ్ మార్జిన్‌ను సాధించామని బీపీసీఎల్ తెలిపింది. గత క్యూ1లో ఇది 4.88 డాలర్లని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బీపీసీఎల్ షేర్ 1.1 శాతం క్షీణించి రూ.388 వద్ద ముగిసింది. -
అదరగొట్టిన ఐఓసీ: బోనస్, డివిడెండ్
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. ఎనలిస్టుల అంచనాలను అధిగమించి భారీ లాభాలను సాధించింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో రెట్టింపు లాభాలను నమోదు చేసింది. మంగళవారం ప్రకటించిన ఐవోసీ ఫలితాల్లో నికర లాభం గత క్వార్టర్లోని రూ. 3994 కోట్ల తో పోలీస్తే ప్రస్తుతం రూ. 7883 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం 22.2 శాతం ఎగిసి రూ. 1.16 లక్షల కోట్ల నుంచి రూ.1.32 లక్షల కోట్లకు పెరిగింది. ఆపరేటింగ్ లాభం 8.1 శాతం పుంజుకుని రూ .7,373 కోట్లుగా నమోదైంది. ఇతర ఆదాయం రూ. 807 కోట్ల నుంచి రూ. 1353 కోట్లకు పుంజుకోగా... ఈ ఏడాది తొలి 9 నెలల కాలంలో స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) బ్యారల్‌కు 8.28 డాలర్లుగా నమోదైనట్లు ఐవోసీ తెలియజేసింది. అంతేకాదు తన వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి ఐవోసీ బోర్డు అనుమతించింది. అంటే ప్రతీ 1 షేరుకీ మరో షేరుని అదనంగా జోడించనుంది. అంతేకాదు షేరుకి రూ. 19 చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు నిర్ణయించింది. -
అంచనాలు మించిన భారతీ ఎయిర్టెల్
విశ్లేషకులు అంచనావేసిన దానికంటే మెరుగైన ఫలితాలనే దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. జూలై-సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ లాభాలు 4.9 శాతం పడిపోయి రూ.1,461 కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ లాభాలు రూ.1,536 కోట్లగా ఉన్నాయి. స్పెక్ట్రమ్ సంబంధిత ఖర్చులు, నైజీరియన్ కరెన్సీ డివాల్యుయేషన్ వంటి కారణాలతో భారతీ ఎయిర్టెల్ లాభాలు పడిపోయినట్టు కంపెనీ ప్రకటించింది. కానీ విశ్లేషకుల అంచనావేసిన దానికంటే బాగానే ఆపరేషన్ ఫర్ఫార్మెన్స్ను కంపెనీ చూపించినట్టు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. విశ్లేషకుల ముందస్తు అంచనా ప్రకారం భారతీ ఎయిర్టెల్ రూ.25,495 కోట్ల రెవెన్యూలపై రూ.1050 కోట్ల లాభాలను మాత్రమే ఆర్జిస్తుందని తెలిసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,053 కోట్లగా ఉన్న నికర వడ్డీ వ్యయాలు రూ.1,603 కోట్లకు ఎగిశాయి. ఈ వ్యయాలు పెరగడానికి ప్రధాన కారణం కూడా స్పెక్ట్రమ్ సంబంధిత వడ్డీ వ్యయాలేనని కంపెనీ వెల్లడించింది. ఉచిత సేవలతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో ఎఫెక్టు భారతీ ఎయిర్‌టెల్‌పై పడింది. ఈ క్వార్టర్లో ఎయిర్ టెల్ మొబైల్ వ్యాపారాలు నెమ్మదించాయి. మొత్తంగా అయితే యేటికేటికి 10.1 శాతం రెవెన్యూ వృద్ధి నమోదుచేస్తూ కంపెనీ ఊపందుకున్నట్టు భారతీ ఎయిర్ టెల్ ప్రకటించింది. నాన్-మొబైల్ బిజినెస్‌ల్లో వృద్ధి నమోదు వల్లే కంపెనీ రెవెన్యూలను పెంచుకోగలిగిందని ఆ సంస్థ సీఈవో, ఎండీ(భారత్, దక్షిణాసియా) గోపాల్ విట్టల్ తెలిపారు. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికానికి రెవెన్యూలు 10.1 శాతం ఎగిసి రూ.19,219 కోట్లగా నమోదయ్యాయి. యేటికేటికీ డిజిటల్ టీవీ వ్యాపారాల్లో 20.9 శాతం వృద్ధి, ఎయిర్టెల్ బిజినెస్‌లో రూ.19.2 శాతం, మొబైల్ వ్యాపారాల్లో 7.9 శాతం వృద్ధి కంపెనీ భారత వ్యాపారాల్లో నమోదుచేసినట్టు భారతీ ఎయిర్టెల్ వెల్లడించింది. కంపెనీ మొత్తం ఆదాయం 3.4 శాతం పెరిగి రూ.24,671.5 కోట్లగా కంపెనీ నమోదుచేసింది. అయితే నైజీరియా కరెన్సీ డివాల్యుయేషన్తో కన్సాలిడేటెడ్ రెవెన్యూ వృద్ధి 3.3 శాతం మందగించింది. -
హెచ్‌సీఎల్ ఫలితాలు భేష్... అమెరికా కంపెనీ కొనుగోలు
ముంబై: దేశంలో నాలుగవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ శుక్రవారం మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన క్యూ2లో ఉత్సాహకరమైన ఫలితాలను ప్రకటించి ఎనలిస్టుల అంచనాలను అధిగమించింది. 17 శాతం వృద్ధితో రూ. 2,016 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. మొత్తం ఆదాయం కూడా 14 శాతంపైగా పుంజుకుని రూ. 11,519 కోట్లను సాధించింది. డాలర్ రెవెన్యూ కూడా 2 శాతం జంప్ చేసి 1722మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది.క్యూ2లో నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 2318 కోట్లు, ఇబిటా మార్జిన్లు 20.1 శాతంగా నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం హెచ్‌సీఎల్ టెక్ షేరు 4 శాతం లాభాలతో ట్రేడవుతోంది. మరోవైపు2016-17ఆర్థిక సంవత్సరానికి గాను 12-14 శాతం ఆదాయ వృద్ధి అంచనా(గెడెన్స్)లను యథాతథంగా ఉంచింది. అమెరికాకు చెందిన బట్లర్ అమెరికా ఏరోస్పేస్ సంస్థను కొనుగోలు చేసినట్లు హెచ్‌సీఎల్ టెక్ వెల్లడించింది. అమెరికా ఏరోస్పేస్, డిఫెన్స్ కస్టమర్లకు ఇంజనీరింగ్ అండ్ డిజైన్ సేవలు అందిస్తున్న ఈ సంస్థ స్వాధీనానికి 8.5 కోట్ల డాలర్లను చెల్లించనున్ననట్టు తెలిపింది. నగదు రూపంలో 85 మిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ఏడాది డిశెంబర్ నాటికి అమెరికా సహా దేశం రెగ్యులేటరీ అనుమతులు పూర్తి కానున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం సీవోవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న విజయ్‌కుమార్‌కు పదోన్నతి కల్పించినట్టు బీఎస్ఈ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. అతణ్ని సీఈవోగా నియమించినట్టు, అక్టోబర్ 20నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. -
అదరగొట్టిన ఎస్ బ్యాంక్
ప్రయివేట్ రంగ సంస్థ ఎస్ బ్యాంక్ అంచనాలను అధిగమించిన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. జూలై -సెప్టెంబర్ క్వార్టర్ లో 32 శాతం వృద్ధితో రూ. 802 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఏడాది రూ. 610 కోట్ల తో పోలిస్తే మెరుగైన ఫలితాలో మరోసారి తన సత్తా చాటింది. ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలనుగురువారం ప్రకటించినసంస్థ నికరవడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) రూ. 1446 కోట్లను సాధించినట్టు తెలిపింది. ఈ ఫలితాలతో దలాల్ స్ట్రీట్ లో ఎస్ బ్యాంక్ షేర్ లాభాల్లో ఉంది. ప్రాఫిట్ గ్రోత్, లోన్ గ్రోత్, ఎస్సెట్ క్వాలిటీలో ఎస్ బ్యాంక్ అద్భుతమైన ఫలితాలు సాధించిందని మార్కెట్ విశ్లేషకుడు జి చొక్క లింగం వ్యాఖ్యానించారు. రుణాల వృద్ధి కొనసాగితే బ్యాంక్ వాల్యూయేషన్ భవిష్యత్తులో మరింత పెరుగుతుందన్నారు. ప్రొవిజన్లు రూ. 104 కోట్ల నుంచి రూ. 162 కోట్లకు పెరిగగా ఇతర ఆదాయం రూ. 618 కోట్ల నుంచి రూ. 888 కోట్లకు జంప్‌చేసింది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) జూన్ త్రైమాసికంలో 0.79 శాతంతో పోలిస్తే 0.83 శాతం నమోదు కాగా, నికర మొండిబకాయిలు(ఎన్పీఏలు) 0.29 శాతం వద్ద, , నికర వడ్డీ మార్జిన్లు'(ఎన్ఐఎం) 3.4 శాతం వద్ద స్థిరంగా ఉన్నట్లు బ్యాంక్ తెలిపింది. కనీస పెట్టుబడుల నిష్పత్తి(సీఏఆర్) 15 శాతంగా నమోదైనట్లు పేర్కొంది. -
అంచనాలను మించిన ఐవోసీ, బోనస్ ప్రకటన
ముంబై: ప్రభుత్వ రంగ ఆయిల్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) అంచనాలకు మించి ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నికర లాభం 25 శాతం పెరిగి రూ. 8269 కోట్లను నమోదు చేసింది. నికర లాభం 4,472 కోట్లుగా విశ్లేషకులు అంచనావేశారు. మొత్తం అమ్మకాలు రూ. 1,14,000 కోట్ల నుంచి 1,01,400 రూ. కోట్లకు తగ్గాయి. స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) కూడా 10.77 డాలర్ల నుంచి 9.98 డాలర్లకు క్షీణించింది. అయితే బ్యారెల్ కు 6 డాలర్లుగా ఉండనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేసాయి. దీంతో ఎబిటా మార్జిన్ కూడా గణనీయంగా పెరిగింది. త్రైమాసిక ప్రాతిపదికన నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 4750 కోట్ల నుంచి రూ. 12,248 కోట్లకు జంప్ చేసింది. ఇబిటా మార్జిన్లు 4.8 శాతం నుంచి 12.8 శాతంగా నమోదయ్యాయి. విశ్లేషకులు అంచనావేసింది రూ. 7,040 కోట్లు. ఇతర ఆదాయం మాత్రం 35 శాతం తగ్గి రూ. 470 కోట్లకు పరిమితమైంది. దేశీయంగా 20.41 మిలియన్ టన్నుల పెట్రో ఉత్పత్తులను విక్రయించింది. కాగా, ఫైనాన్స్ వ్యయాలు 37 శాతం క్షీణించి 680 కోట్లకు చేరాయి. ఇతర ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల్లా ఇండియన్ ఆయిల్ మెరుగైన ఫలితాల ను సాధించిందని గత మూడు త్రైమాసికాలలో అత్యధిక స్థాయిలో ఉండడం ప్రోత్సాహకరమని మార్కెట్ నిపుణుడు గౌరంగ్ షా తెలిపారు. -
ఎన్టీపీసీ ఫలితాలు భేష్
ముంబై: భారతదేశ అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ నేషనల్ థెర్మల్ ఫవర్ కార్పోరేషన్ (ఎన్టీపీసీ) మార్కెట్ అంచనాలకు మించి లాభాలను నమోదు చేసింది. ప్రభుత్వ రంగ విద్యుత్ దిగ్గజమైన ఎన్టీపీసీ ఈ ఏడాది తొలి త్రైమాసిక(క్యూ1) ఫలితాలను సోమవారం విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 4.1 శాతం పెరిగి రూ. 2369 కోట్లను తాకింది. గత ఏడాది ఇది రూ.2,276 కోట్లుగా ఉండగా, రూ. 2346 కోట్ల నికర లాభాలను ఆర్జిస్తుందని విశ్లేషకులు అంచనావేశారు. ఆదాయంలోకూడా ఎన్టీపీసీ అదరగొట్టింది. ఈ త్రైమాసికంలో ఆదాయం 11.5 శాతం ఎగసి రూ.19116 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) 47.5 శాతం జంప్‌చేసి రూ. 5210 కోట్లుకాగా, ఇబిటా మార్జిన్లు 27.3 శాతంగా నమోదయ్యాయి. ఇక పన్ను వ్యయాలు కూడా రూ. 422 కోట్ల నుంచి రూ. 707 కోట్లకు పెరిగాయి. కాగా ఫలితాలు సానుకూలంగాఉన్నప్పటికీ, నేటి మార్కెట్ లో ఎన్టీపీసీ షేరు 3 శాతానికి పైగా నష్టం పోయింది. ఇటీవల బాగా లాభపడడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగారని ఎనలిస్టుల భావన. -
లుపిన్ లాభాలు జంప్
ముంబై: ముంబైకి చెందిన ఫార్మా దిగ్గజం లుపిన్ ఈ ఏడాది తొలి త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. క్యూ1 ఫలితాల్లో నికర లాభాల్లో దూసుకుపోయి విశ్లేషకుల అంచనాలను ఓడించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఆకర్షణీయ ఫలితాలను నమోదు చేసింది. లుపిన్ నికర లాభం 55 శాతం జంప్‌చేసి రూ. 882 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం కూడా 41 శాతం పెరిగి రూ. 4,439 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) 57 శాతం దూసుకెళ్లి రూ. 1308 కోట్లుకాగా, ఇబిటా మార్జిన్లు 26.13 శాతం నుంచి 29.46 శాతానికి ఎగశాయి. ఇతర నిర్వహణ లాభం సైతం 67 శాతం పెరిగి రూ. 126 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఫలితాలు ఉత్సాహకరంగా ఉన్నప్పటికీ, మార్కెట్ లో లుపిన్ షేరు దాదాపు 2 శాతం క్షీణించింది. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం లుపిన్ నష్టాలకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. -
బజాజ్ ఫినాన్స్ బోనస్ బొనాంజా
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ బజాజ్ ఫినాన్స్ ఆర్థిక ఫలితాల్లో అదరగొట్టింది. జూన్ త్రైమాసికంలో అంచనాలకు మించి ఫలితాలను నమోదు చేసింది. మంగళవారం కంపెనీ ప్రకటించిన క్యూ 1 ఫలితాల్లో 54 శాతం వృద్ధితో రూ.424 కోట్ల నికర లభాలను ఆర్జించింది. ఆదాయంలో 38 శాతం వృద్థితో రూ. 2,166 కోట్ల నికర ఆదాయాన్ని సాధించింది. మెరుగైన ఫలితాలను ప్రకటించిన బజాజ్ ఫినాన్స్ బోర్డ్ 1:1 బోనస్ ప్రకటించింది. అలాగే 10రూ. గా ఫేస్ వాల్యూ వున్న షేరును విడగొట్టి (స్ప్లిట్) 2 రూ.నిర్ణయించింది. అంటే ప్రతీ షేరుకు అయిదు షేర్లు అదనంగా వాటాదారులకు అందించనుంది. దీంతో మార్కెట్లో ఈ కంపెనీ షేరు లాభాల్లో దూసుకుపోతోంది. ఈ బంపర్ బొనాంజాతో దాదాపు 5 శాతం లాభాలతో ఫ్లాట్ గా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లో ప్రధాన విజేతగా నిలిచింది. కాగా పుణేకు చెందిన బజాజ్ ఫినాన్స్ రూ.373కోట్ల నికర లాభాలను, 2039కోట్ల నికర ఆదాయన్ని నమోదు చేస్తుందని ఎనలిస్టులు అంచనా వేశారు. ఈ అంచనాలకు భిన్నంగా బజాజ్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడం విశేషం.