
సాక్షి, ముంబై: దేశీయ స్టీల్ దిగ్గజం టాటా స్టీల్ క్యూ2 ఫలితాల్లో అదరగొట్టింది. ఎనలిస్టుల అంచనాలను బీట్ చేస్తూ మూడురెట్ల లాభాలను సాధించింది. 269.31 శాతం ఎగిసి 3,604 కోట్ల నికర లాభాలను సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో 975 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది.
రెండవ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ .43,544 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.32,464 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఎబిటా మార్జిన్లు 84 జంప్ చేశాయి. దేశంలో అనుకూలమైన వ్యాపార పరిస్థితుల నేపథ్యంలో టాటా స్టీల్ గ్రూప్ ఈ త్రైమాసికంలో మంచి ఫలితాలను సాధించామని టాటా స్టీల్ సీఎండీ టీఎల్ నరేంద్రన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment