సాక్షి, ముంబై : దేశీయ ఐటీ దిగ్గజం విప్రో రెండవ త్రైమాసిక ఫలితాలను మంగళవారం వెల్లడించింది. విశ్లేషకుల అంచనాలను మించి ఫలితాలను నమోదు చేసింది. మార్కెట్ ముగిసిన తరువాత ప్రకటించిన ఫలితాల్లో సంస్థ భారీ నికర లాభాల సాధించింది. నికర లాభాలు వార్షిక ప్రాతిపదికన 36 శాతం ఎగిసాయి. గత ఏడాది ఇదే క్వార్టర్‌లోని 1886 కోట్ల రూపాయలతో పోల్చితే ఏడాది క్యూ2లో రూ. 2650కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. ఎనలిస్టులు రూ.2303 కోట్ల లాభాలను అంచనావేశారు. ఎబిటా మార్జిన్లు 18.1 శాతంగా ఉన్నాయి. ఆదాయం 4 శాతం ఎగిసి రూ. 15,130 కోట్లను ఆర్జించింది. ఐటీ ఉత్పత్తుల విభాగం ఆదాయం రూ. 320 కోట్లుగా ఉంది.
మూడవ క్వార్టర్‌కు సంబంధించిన రెవెన్యూ గెడెన్స్ 0.8 శాతంనుంచి 2.8 శాతంగా పేర్కొంది. రానున్న త్రైమాసికంలో ఆదాయాలు, మార్జిన్లు మరింత మెరుగ్గా ఉండనున్నాయని విప్రో సీఎండీ అబిదాలి నీముచ్‌వాలా తెలిపారు. తన ఐటీ సేవల వ్యాపారం ఆదాయం డిసెంబర్ 31 తో ముగిసిన త్రైమాసికంలో 0 2,065 మిలియన్- 10 2,106 మిలియన్ల పరిధిలో ఉంటుందని ఆశిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment