కరోనా సమయంలో ఎంతోమంది టెకీలు జాబ్స్ కోల్పోయారు. డిసెంబర్ 2024లో కూడా దిగ్గజ కంపెనీలు సైతం లేఆప్స్ ప్రకటించాయి. కాగా ఇప్పుడు కొన్ని సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ జాబితాలో టీసీఎస్ చేరింది. ఇప్పుడు తాజాగా విప్రో కూడా నేనున్నానంటూ.. ముందుకు వచ్చింది.
దిగ్గజ ఐటీ కంపెనీ విప్రో (Wipro) 2025-26 (FY26) ఆర్థిక సంవత్సరంలో 10,000-12,000 మంది ఫ్రెషర్‌లను ఆన్‌బోర్డ్ చేయాలనే ప్రణాళికలను ప్రకటించింది. కంపెనీ యొక్క చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ 'సౌరభ్ గోవిల్' (Saurabh Govil) తన Q3FY25 ఆదాయ నివేదికను కంపెనీ విడుదల చేసిన తర్వాత, విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విప్రో తెలిపింది. అక్టోబర్ - డిసెంబర్ (క్యూ3) త్రైమాసికంలో దాదాపు 7,000 మంది ఇప్పటికే ఆన్‌బోర్డ్‌లో ఉన్నారు. కాగా FY25 చివరి త్రైమాసికంలో మరో 2,500-3,000 మంది చేరే అవకాశం ఉంది. కాగా 2024 డిసెంబర్ చివరి నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2,39,655గా ఉన్నట్లు సమాచారం.
విప్రో, టీసీఎస్ బాటలో ఇన్ఫోసిస్
టీసీఎస్ కంపెనీ ఉద్యోగులను నియమించుకోవాలనే ప్రకటన చేసిన తరువాత, విప్రో కూడా ప్రకటించింది. ఈ వరుసలో ఇన్ఫోసిస్ కూడా చేసింది. FY26లో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని ఇన్ఫోసిస్ యోచిస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే.. త్వరలోనే లెక్కకు మించిన ఫ్రెషన్స్ ఐటీ కంపెనల్లో ఉద్యోగాలు పొందనున్నట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment