hires
-
మొన్న టీసీఎస్.. నేడు విప్రో: ఫ్రెషర్లకు పండగే..
కరోనా సమయంలో ఎంతోమంది టెకీలు జాబ్స్ కోల్పోయారు. డిసెంబర్ 2024లో కూడా దిగ్గజ కంపెనీలు సైతం లేఆప్స్ ప్రకటించాయి. కాగా ఇప్పుడు కొన్ని సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ జాబితాలో టీసీఎస్ చేరింది. ఇప్పుడు తాజాగా విప్రో కూడా నేనున్నానంటూ.. ముందుకు వచ్చింది.దిగ్గజ ఐటీ కంపెనీ విప్రో (Wipro) 2025-26 (FY26) ఆర్థిక సంవత్సరంలో 10,000-12,000 మంది ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేయాలనే ప్రణాళికలను ప్రకటించింది. కంపెనీ యొక్క చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ 'సౌరభ్ గోవిల్' (Saurabh Govil) తన Q3FY25 ఆదాయ నివేదికను కంపెనీ విడుదల చేసిన తర్వాత, విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విప్రో తెలిపింది. అక్టోబర్ - డిసెంబర్ (క్యూ3) త్రైమాసికంలో దాదాపు 7,000 మంది ఇప్పటికే ఆన్‌బోర్డ్‌లో ఉన్నారు. కాగా FY25 చివరి త్రైమాసికంలో మరో 2,500-3,000 మంది చేరే అవకాశం ఉంది. కాగా 2024 డిసెంబర్ చివరి నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2,39,655గా ఉన్నట్లు సమాచారం.విప్రో, టీసీఎస్ బాటలో ఇన్ఫోసిస్టీసీఎస్ కంపెనీ ఉద్యోగులను నియమించుకోవాలనే ప్రకటన చేసిన తరువాత, విప్రో కూడా ప్రకటించింది. ఈ వరుసలో ఇన్ఫోసిస్ కూడా చేసింది. FY26లో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని ఇన్ఫోసిస్ యోచిస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే.. త్వరలోనే లెక్కకు మించిన ఫ్రెషన్స్ ఐటీ కంపెనల్లో ఉద్యోగాలు పొందనున్నట్లు స్పష్టమవుతోంది. -
ప్రాణంలేని ఉద్యోగికి 12 లక్షల జీతం
-
జోరుగా.. హుషారుగా..నియామకాలు!
న్యూఢిల్లీ: రానున్న మూడు నెలల్లో (అక్టోబర్–డిసెంబర్) ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున రానున్నాయి. 54 శాతం కంపెనీలు ఉద్యోగులను నియమించుకోవాలని అనుకుంటున్నాయి. మ్యాన్ పవర్ గ్రూప్ నిర్వహించిన ‘ఎంప్లాయ్మెంట్ అవుట్‌లుక్ సర్వే’ ఈ వివరాలను నివేదికగా విడుదల చేసింది. కార్మిక మార్కెట్ సెంటిమెంట్ రానున్న త్రైమాసికానికి బలంగా ఉన్నట్టు తెలిపింది. మ్యాన్‌పవర్ గ్రూపు భారత్ సహా 41 దేశాల్లో ఉపాధి మార్కెట్ తీరుతెన్నులను అర్థం చేసుకునేందుకు ఈ సర్వే నిర్వహించింది. భారత్‌లో సర్వే ఫలితాలను గమనించినట్టయితే.. 64 శాతం కంపెనీలు ఉద్యోగులను పెంచుకోవాలని అనుకుంటున్నాయి. 24 శాతం కంపెనీలు ఎలాంటి మార్పు ఉండదని చెప్పాయి. 10 శాతం కంపెనీల్లో నియామకాల ధోరణి తగ్గింది. దీని ప్రకారం సగటున 54 శాతం కంపెనీలు ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ఈ సర్వే తేల్చింది. బ్రెజిల్లో 56 శాతం కంపెనీలు వచ్చే మూడు నెలలకు ఉద్యోగుల నియామకాల విషయంలో ఆశావహంగా ఉంటే, ఆ తర్వాత భారత్ అత్యధిక రేటుతో రెండో స్థానంలో ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే.. మన దేశంలో నియామకాల సెంటిమెంట్‌లో 10 శాతం వృద్ధి కనిపిస్తోంది. త్రైమాసికం వారీగా చూస్తే నియామకాల సెంటిమెంట్ 3% మెరుగుపడింది. భారత్‌కు ప్రయోజనం.. ‘‘భారత్ ఆర్థిక మూలాలు పటిష్టంగా, బలంగా ఉన్నాయి. స్వల్పకాల ప్రతికూలతలు ఉన్నా కానీ, వృద్ధికి మద్దతునిచ్చే విధానాలు, మౌలిక రంగంలో పెట్టుబడులు, ఎగుమతులు పెరగడం వల్ల మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి ప్రతికూలతలను అధిగమిస్తుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల వర్ధమాన దేశాలు, మరీ ముఖ్యంగా భారత్ వృద్ధికి మద్దతునిస్తుంది. ఎగుమతులు పెంచుకుంటుంది. అదే సమయంలో అంతర్జాతీయ మందగమనంపై వదంతులు నేపథ్యంలో ఐటీ కంపెనీల్లో అప్రమత్త ధోరణి నెలకొంది’’అని మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా ఎండీ సందీప్ గులాటీ తెలిపారు. నియామకాల పట్ల సానుకూల ధోరణి బలంగానే ఉన్నా కానీ, తమకు కావాల్సిన నైపుణ్య మానవ వనరులు లభించడం లేదని 85 శాతం కంపెనీలు చెప్పడం ఆందోళనకరం. ఇక భారత్‌లో ప్రాంతాల వారీగా చూస్తే దక్షిణాది, ఉత్తరాదిన వచ్చే మూడు నెలల్లో ఉద్యోగులను నియమించుకోవాలని 56 శాతం కంపెనీలు అనుకుంటుంటే.. పశ్చిమాదిన 53 శాతం, తూర్పున 47 శాతంగానే ఉంది. -
భార్య చేసిన తప్పు! బిలియనీర్ కావాల్సినోడు...ఇప్పుడు..
Man Hires NASA Linked Experts To Find Hard Drive With 7500 Bitcoins: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ భారీ ఆదరణ నోచుకుంటుంది. వీటికి అంతస్థాయిలో ఆదరణ రావడానికి ముఖ్య కారణం ఒకటి ట్యాక్స్ ఫ్రీ, మరోకటి పకడ్బంది భద్రత. క్రిప్టోకరెన్సీల లావాదేవీలను బ్లాక్‌చైయిన్ టెక్నాలజీ ఉపయోగించి చేస్తారు. ఆయా యూజర్లు క్రిప్టోకరెన్సీలను ఎన్క్రిప్టెడ్ సెక్యూరిటీతో భద్రంగా ఒక హర్డ్ డిస్క్‌లో సేవ్ చేసుకోవచ్చును. కాగా యూకేకు చెందిన జేమ్స్ హూవెల్స్ మాజీ భార్య చేసిన చిన్న పొరపాటు అతడిని బిలియనీర్ కాకుండా చేసింది. చెత్త బుట్టలో పడేసిన భార్య..! ప్రపంచంలోని అత్యంత దురదృష్టవంతుడు అంటే ఇతడేనెమో...! బహుశా..! 36 ఏళ్ల జేమ్స్ హోవెల్స్ మాజీ భార్య చేసిన పొరపాటుతో ఏకంగా 7500 బిట్కాయిన్లను పొగొట్టుకున్నాడు. అతడి భార్య 2013లో 7500 బిట్కాయిన్ల హార్డ్ డిస్క్‌ను చెత్త బుట్టలో పడేసింది. ఈ హర్డ్ డిస్క్‌ను వెతకడం కోసం నాసా శాస్త్రవేత్తలను నియమించుకున్నాడు. బిలియనీర్ కావాల్సినోడు.. జేమ్స్ హూవెల్స్ మాజీ భార్య చేసిన చిన్న పొరపాటు బిలియనీర్ అవ్వకుండా చేసింది. నేడు 7500 బిట్కాయిన్ల విలువ నేడు ఇండియన్ కరెన్సీలో దాదాపు 3,404 కోట్లకు సమానం. పొగొట్టుకున్న హర్డ్ డిస్క్‌ను సంపాదించేందుకు అమెరికా ఒన్ట్రాక్ కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. వీరు గతంలో కొలంబియా స్పేస్ షటిల్ భూమిపై కూలిపోయినప్పుడు నాసాకు సహయాన్ని అందించింది. ఈ హార్డ్ డిస్క్‌ను పొందేందుకు ముమ్మర ప్రయత్నాలను చేస్తున్నాడు జేమ్స్. ఈ హర్డ్ డిస్క్ వెతుకులాటలో ఒన్ట్రాక్ విజయవంతమైతే దానిని క్రాక్ చేయడంతో జేమ్స్ రాత్రికి రాత్రే బిలియనీర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అక్కడి స్ధానిక సౌత్ వేల్స్ పోలీసులు హార్డ్‌డిస్క్ వెతికేందుకు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. చదవండి: ఇండియన్ ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్...! షావోమీ నుంచి..ధర ఏంతంటే..? -
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..!
Indian IT Services to hire about 450,000 people in H2FY22 UnearthInsight: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..! వచ్చే ఏడాది ఐటీ కంపెనీల్లో కొలువుల జాతర మొదలుకానుంది. కోవిడ్-19 ఉదృత్తి తగ్గడంతో ఐటీ కంపెనీలు భారీ సంఖ్యలో నియామకాలను చేపట్టనున్నట్లు మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ అన్ఎర్త్ ఇన్సైట్ ఒక నివేదికలో పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఐటీ కంపెనీలు సుమారు 4.5 లక్షల నియామకాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐటీ ఉద్యోగుల అట్రిషన్ రేట్ కూడా అధికంగానే ఉంది. దీంతో వారి స్థానంలో సుమారు 1.75 లక్షల ఉద్యోగాలను ఐటీ కంపెనీలు భర్తీ చేయనున్నట్లు అన్ఎర్త్ ఇన్సైట్ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్‌లోని టాప్-30 కంపెనీలు ఇప్పటికే 2.5 లక్షల ఫ్రెషర్స్‌కు అవకాశాలను కల్పించినట్లు అన్ఎర్త్ ఇన్సైట్ పేర్కొంది. వీటిలో ఫ్రెషర్లను నియమించిన టాప్ కంపెనీలలో టీసీఎస్ 77వేలు, ఇన్ఫోసిస్ 45వేలు, కాగ్నిజెంట్ 45వేలు,హెచ్‌సీఎల్ టెక్ 22వేల ఉద్యోగాలను కల్పించాయి. భారత టెక్ కంపెనీలు ముఖ్యంగా ఉద్యోగుల నైపుణ్యాలను పెంచే ప్రోగ్రామ్‌పై దృష్టిసారించినట్లుగా తెలుస్తోంది. చదవండి: ఉద్యోగుల కోసం క్యాబిన్లు, ఇకపై ట్రైన్లలో ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు అట్రిషన్ రేట్ కూడా ఎక్కువే...! FY22లో అట్రిషన్ రేట్ 17-19 శాతంగా ఉండగా..అది వచ్చే FY23లో 16-18 శాతం ఉంటుందని అన్ఎర్త్ ఇన్సైట్ అభిప్రాయపడింది. కాగా ఐటీ కంపెనీలు వీరి స్ధానాల్లో కొత్త నియాకాలను భర్తీ చేసే అవకాశం లేకపోలేదని తన నివేదికలో పేర్కొంది. క్లౌడ్ సర్వీసులకే అధిక ప్రాధాన్యం..! పలు దిగ్గజ ఐటీ కంపెనీలు క్లౌడ్ సర్వీస్‌లపై ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. 2030 నాటికి క్లౌడ్ ఆధారిత సర్వీసుల విలువ ఏకంగా 80-100 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉన్నట్లు అన్ఎర్త్ ఇన్సైట్ వెల్లడించింది. క్లౌడ్ ఇండస్ట్రీ, సెక్యూరిటీలో చాలా బలమైన రెండంకెల వృద్ధిని నమోదు చేసిన యాక్సెంచర్ వంటి కంపెనీలు భవిష్యత్తులో క్లౌడ్ ఆధారిత సేవలకు నాయకత్వం వహించనున్నట్లు పేర్కొంది. ఫ్రెంచ్ ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని కూడా ప్రాథమికంగా డిజిటల్, క్లౌడ్ సేవలపై పనిచేయనున్నట్లు తెలుస్తోంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్... అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఎడబ్ల్యుఎస్) బిజినెస్ యూనిట్ కోసం ఏకంగా పదివేల నియామకాలను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. చదవండి: వ్యాక్సినేషన్ మస్ట్! నో చెప్తున్న ఉద్యోగులు.. వర్క్‌ఫ్రమ్‌హోం పొడగింపునకు డిమాండ్! -
ఫేస్బుక్ ఇండస్ట్రీ డైరెక్టర్ గా ..
శాన్ ఫ్రాన్సిస్కో: ఫేస్బుక్ ఇండస్ట్రీ డైరెక్టర్ గా గూగుల్ కు చెందిన పుల్కిత్ త్రివేదిని నియమించింది. గూగుల్ ఈ కామర్స్ బాధ్యతలను చూసిన పుల్కిత్ ను నియమించినట్టు సోమవారం ప్రకటించిఒంది. దేశంలో ఖాతాదారులతో వ్యూహాత్మక సంబంధాలు నిలబెట్టడంలో పుల్కిత్ ప్రధాన పాత్ర పోషించనున్నట్టు తెలిపింది. ఈ కామర్స్, రిటైల్, ఆర్థిక సేవలు తదితర అంశాల్లోఆయన పనిచేయనున్నట్టు ప్రకటించింది. కాగా ఫేస్ బుక్ ఇండియా ఇండస్ట్రీ డైరెక్టర్ గా నియమితుడైన త్రివేదికి 18 సంవత్సరాల తో పరిశ్రమ అనుభవం ఉంది. గూగుల్ ఇండియాలో ఏప్రిల్, 2012 చేరిన త్రివేది ఇ-కామర్స్ హెడ్ గా పనిచేశారు. నిపుణులైన తమ బృందంలో త్రివేది చేరడం సంతోషంగా ఉందని, ఫేస్ బుక్ ఇండియా ఎండీ ఉమాంగ్ బేడీ ప్రకటించారు. ప్రతిభావంతుడైన త్రివేది తమ ప్రకటనల వ్యాపార పురోగతిలో సహాయపడగలడనే దీమాను వ్యక్తం చేశారు. వ్యక్తిగత మార్కెటింగ్ సేవలను అందించటంలో తమ సామర్థ్యాన్ని బలోపేతం చేసే వ్యాపార దక్షత ఆయనకుందన్న విశ్వాసాన్ని బేడీ ప్రకటించారు. -
అద్దెకు పోలీసులు
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) లోకి బీహార్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు పోలీసు అధికారుల్ని అద్దె ప్రాతిపదికన నియమించింది. ఈ నియామకాల విషయంలోనే లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌తో విభేధాలు తలెత్తి విషయం కోర్టువరకు చేరిన సంగతి తెలిసిందే. ఇటీవలే కేజ్రీవాల్.. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ను కలిసి ఢిల్లీకి పోలీసుల్ని కేటాయించాల్సిందిగా కోరారు. అందుకు నితిశ్ అంగీకారం తెలపడంతో అద్దె పోలీసులుల నియామకానికి అడ్డంకులు తొలిగిపోయాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ నేపథ్యంలో కేజ్రీ సర్కారు నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది. నియామకాలకు సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఢిల్లీ ఏసీబీలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో తామీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అద్దెకు తీసుకున్నవారిలో ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు ఉన్నారని పేర్కొన్నాయి. ఇటీవలే బీహార్ సీఎం నితీశ్ కుమార్ ను కేజ్రవాల్ తో కేజ్రీచర్చల్లో జరిగిన అవినీతి రహిత పాలన అందించ క్రమంలో ఏసీబీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేజ్రీవాల్ భావిస్తున్నారని, ఆ మేరకు 600 మంది అధికారులు, 24 మంది ఇన్స్పెక్టర్లను నియమించాలని ఆయన భావించారని, అయితే లెఫ్టినెంట్ గవర్నర్ తన విశేషాధికారలను అడ్డుపెట్టుకొని ఢిల్లీ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకించడం వల్లే పక్క రాష్ట్రాల నుంచి పోలీసుల్ని అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆప్ వర్గాలు తెలిపాయి.