ఫేస్బుక్ ఇండస్ట్రీ డైరెక్టర్ గా .. | Facebook hires Google’s Pulkit Trivedi as Industry Director | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్ ఇండస్ట్రీ డైరెక్టర్ గా ..

Published Mon, Dec 12 2016 3:11 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

Facebook hires Google’s Pulkit Trivedi as Industry Director

శాన్ ఫ్రాన్సిస్కో: ఫేస్బుక్ ఇండస్ట్రీ డైరెక్టర్ గా గూగుల్ కు చెందిన  పుల్కిత్ త్రివేదిని నియమించింది. గూగుల్  ఈ కామర్స్  బాధ్యతలను చూసిన  పుల్కిత్ ను  నియమించినట్టు సోమవారం  ప్రకటించిఒంది.  దేశంలో ఖాతాదారులతో వ్యూహాత్మక సంబంధాలు నిలబెట్టడంలో పుల్కిత్ ప్రధాన పాత్ర పోషించనున్నట్టు తెలిపింది. ఈ కామర్స్, రిటైల్,  ఆర్థిక సేవలు తదితర అంశాల్లోఆయన పనిచేయనున్నట్టు ప్రకటించింది.

కాగా ఫేస్ బుక్   ఇండియా ఇండస్ట్రీ  డైరెక్టర్ గా నియమితుడైన త్రివేదికి 18 సంవత్సరాల తో పరిశ్రమ అనుభవం ఉంది. గూగుల్ ఇండియాలో ఏప్రిల్, 2012 చేరిన త్రివేది  ఇ-కామర్స్ హెడ్ గా పనిచేశారు. నిపుణులైన తమ బృందంలో త్రివేది చేరడం సంతోషంగా ఉందని, ఫేస్ బుక్ ఇండియా ఎండీ ఉమాంగ్ బేడీ ప్రకటించారు. ప్రతిభావంతుడైన  త్రివేది తమ  ప్రకటనల వ్యాపార పురోగతిలో సహాయపడగలడనే దీమాను వ్యక్తం చేశారు.  వ్యక్తిగత మార్కెటింగ్  సేవలను అందించటంలో తమ  సామర్థ్యాన్ని బలోపేతం చేసే  వ్యాపార దక్షత ఆయనకుందన్న విశ్వాసాన్ని బేడీ ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement