ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా టెక్నాలజీ కంపెనీల్లో నియామకాలు మందగించాయి. దీంతో టెక్ ఉద్యోగార్థులు జాబ్‌లు దొరక్క సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఊరట కలిగించే అధ్యయనం ఒకటి వెలువడింది. ఇక రానున్నవి మంచిరోజులే అని ఆ అధ్యయనం చెబుతోంది.
టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ‘సీల్’ గ్రూప్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. చాలా కంపెనీలు టెక్నాలజీ, ఇన్నోవేషన్-లీడ్ ఇనిషియేటివ్‌ల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) హెడ్‌కౌంట్‌ను పెంచుకోవాలని చూస్తున్నాయి. ప్రత్యేక డిజిటల్ మెషీన్ లెర్నింగ్ నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతోందని ఈ అధ్యయనం తెలిపింది.
ఇలాంటి ఉద్యోగాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అప్లైడ్ మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ యాప్స్ డిజైన్, ఇంజినీరింగ్, యూఐ/యూఎక్స్ డిజైన్ వంటి ఉద్యోగులను గ్లోబల్ కేపిబిలిటీ సెంటర్లు నియమించుకుంటున్నాయని ‘సీల్’ అధ్యయనం పేర్కొంది. సాఫ్ట్‌వేర్, ఆటోమోటివ్, ఫార్మాస్యూటికల్స్, బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాలలో ఈ ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తాయని వివరించింది.
96 కంపెనీల నుంచి ఇన్‌పుట్స్
గతేడాది ప్రారంభమైన లేదా విస్తరించిన 96 కంపెనీల నుంచి తీసుకున్న ఇన్‌పుట్స్ ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఇవి ఇప్పటికే గ్లోబల్ కేపిబిలిటీ సెంటర్లు కలిగి 57,500 మందికి ఉద్యోగాలు కల్పించిన సంస్థలు. ఈ సెంటర్లలో ఏడాదిగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు డిమాండ్ పెరిగినట్లుగా ఈ అధ్యయనం వెల్లడించింది. క్లౌడ్ ఇంజనీర్లు, డేటా ఇంజనీర్లకు కూడా డిమాండ్ పెరిగిందని పేర్కొంది.
గత సంవత్సరంలో, ఆటో రంగంలో కంపెనీలు గణనీయంగా గ్లోబల్ కేపిబిలిటీ సెంటర్లును ఏర్పాటు చేశాయని ‘సీల్’ హెచ్‌ఆర్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆదిత్య నారాయణ్ మిశ్రా తెలిపారు. అధ్యయనం ప్రకారం, బెంగళూరులో 42 శాతం, హైదరాబాద్‌లో 22 శాతం, పూణేలో 10 శాతం, ఢిల్లీలో 8 శాతం జీసీసీలు ఏర్పాటయ్యాయి.
ఆఫీస్ నుంచి పని చేసేవే..
అన్ని జీసీసీ ఉద్యోగ అవకాశాలలో దాదాపు 51 శాతం ఆఫీస్ నుంచి పని చేసేవే. వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాల పరంగా ఐటీ రంగంతో పోల్చితే ఇది తక్కువే. ఐటీ రంగంలో
77 శాతం వర్క్ ఫ్రమ్ హోం పద్ధతిలో నియామకాలు జరుగుతున్నట్లు ఈ అధ్యయనం పేర్కంది.
Comments
Please login to add a commentAdd a comment