డిజిటల్ పరివర్తన వేగవంతంగా జరుగుతున్న ప్రస్తుత యుగంలో సంచలనంగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ, డేటా సైన్స్ పట్ల దృక్ఫథాన్ని పూర్తిగా మార్చేసింది. ఇది టెక్ పరిశ్రమలో అనేక ఉద్యోగాలకు ముప్పుగా పరిణమించందన్న ఆందోళనల నేపథ్యంలో పూర్తిగా ఆటోమేషన్‌కు ఆస్కారం లేని కొన్ని కెరియర్ మార్గాలు ఉన్నాయి.
మానవ అంతర్‌దృష్టి, సృజనాత్మక సమస్య-పరిష్కారం, భావోద్వేగ మేధస్సుతో ముడిపడిన కొన్ని జాబ్‌లు ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధిపత్య కాలంలో కీలకంగా ఉంటాయి. లెర్న్‌బే వ్యవస్థాపకుడు, సీఈవో కృష్ణ కుమార్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ముప్పు లేని తొమ్మిది రకాల ఐటీ జాబ్‌ల గురించి తెలియజేశారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
డేటా సైంటిస్టులు
డేటా సైన్స్ అనేది డేటా క్లీనింగ్, ప్రీ-ప్రాసెసింగ్ వంటి అనేక అంశాలను ఏఐ ఆటోమేట్ చేసిన ఒక ఫీల్డ్. అయినప్పటికీ, దాని ప్రధాన భాగంలో డేటా సైన్స్‌కు ప్రోగ్రామ్ చేయలేని మానవ అంతర్ దృష్టి, చాతుర్యం అవసరం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పనితీరు కేవలం అంకెలు, సంఖ్యల్లో మాత్రమే ఉంటుంది. కానీ డేటా సైంటిస్టులు తమ మేధస్సుతో అర్థవంతవంతమైన ఫలితాలను సాధించగలరు.
ఏఐ ఎథిసిస్ట్స్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతమవుతున్న నేపథ్యంలో ఏఐ ఎథిక్స్ నిపుణుల అవసరం చాలా కీలకంగా మారింది. ఈ నిపుణులు ఏఐ సిస్టమ్‌ల ఎథిక్స్ అమలుకు మార్గనిర్దేశం చేస్తారు. ఏఐ వ్యవస్థలు పారదర్శకంగా, వినియోగదారు గోప్యతను రక్షించే విధంగా ఉండేలా చూస్తూరు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం నుంచి ఉత్పన్నమయ్యే రిస్కులు, సామాజిక చిక్కులను అంచనా వేస్తారు. ఈ పని చేసేవారికి సామాజిక నిబంధనలు, నైతికత, మానవ హక్కుల గురించి లోతైన అవగాహన అవసరం.
సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్
అసాధారణ నెట్‌వర్క్ ప్రవర్తన లేదా పొటెన్షియల్ థ్రెట్స్‌ను గుర్తించడం ద్వారా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీకి సహాయపడుతుంది. అయినప్పటికీ, సైబర్ సెక్యూరిటీ నిపుణుల పాత్ర కీలకమైనది. వ్యూహరచన చేయడం, ఏఐ గుర్తించిన అంశాలను సమీక్షించడం, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న థ్రెట్స్‌ను గుర్తించి సృజనాత్మకంగా స్పందించడం వీరి ముఖ్యమైన విధులు. మానవ మనస్తత్వం సూక్ష్మ నైపుణ్యాలు, సైబర్ నేరస్థుల ఉద్దేశాలను అర్థం చేసుకోవడం వంటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేయలేని పనులను వీరు చేస్తారు.
సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ఇంజనీర్లు
కోడ్ రాయడం, డీబగ్గింగ్, టెస్టింగ్ కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విలువైన సాధనంగా మారింది. ఏది ఏమైనప్పటికీ, వినూత్న సాఫ్ట్‌వేర్ రూపకల్పన, వినియోగదారు అవసరాలను అర్థం చేసుకోవడం, సమస్య-పరిష్కారంలో సృజనాత్మకత వంటివి మానవులకు మాత్రమే సాధ్యమైన ప్రత్యేకమైన లక్షణాలు. సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో నైతిక పరిగణనలు, మానవ ప్రమేయం ఇప్పటికీ అవసరం.
యూఎక్స్ డిజైనర్లు
యూజర్ ఎక్స్‌పీరియన్స్ (UX) డిజైనర్లు సహజమైన, యూజర్లను ఆకర్షించేలా ఇంటర్‌ఫేస్‌లను రూపొందిస్తారు. యూజర్లకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి మానవ మనస్తత్వం, సాంస్కృతిక అంశాలను అర్థం చేసుకోవాలి. టెస్టింగ్, డేటా అనాలిసిస్ వంటి కొన్ని అంశాలలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయం చేయగలిగినప్పటికీ సంతృప్తికరమైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ రూపొందించడంలో డిజైన్ థింకింగ్, సృజనాత్మకత వంటివి యూఎక్స్ డిజైనర్లు మాత్రమే చేయగలరు.
డెవాప్స్ ఇంజినీర్లు
డెవలప్‌మెంట్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం, డెవలప్‌మెంట్, ఆపరేషన్స్ టీమ్స్ మధ్య సమన్వయాన్ని పెంపొందించడం ప్రధానంగా డెవాప్స్ (DevOps) ఇంజనీర్లు చేసే పని. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్‌సైకిల్‌లోని భాగాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేట్ చేయగలదు. కానీ కమ్యూనికేషన్, సహకారం, నిర్ణయం తీసుకోవడానికి మానవ అవసరం కీలకం.
ఏఐ/ ఎంఎల్ రీసెర్చర్స్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) రీసెర్చర్లు ఏఐ డెవలప్‌మెంట్‌లో ముందంజలో ఉంటారు. మోడల్ ఆప్టిమైజేషన్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడగలిగినప్పటికీ, ఏఐ, ఎంఎల్ పురోగతిని నడిపించే ప్రాథమిక పరిశోధనకు మానవ ఉత్సుకత, చాతుర్యం, క్రిటికల్ థింకింగ్ అవసరం. మానవ రీసెర్చర్‌లా ప్రశ్నించడం, ఊహించడం, ఆవిష్కరణలు వంటివి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేయలేదు.
టెక్ ప్రాజెక్ట్ మేనేజర్లు
ప్రాజెక్ట్ ట్రాకింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతున్నప్పటికీ ప్రాజెక్ట్ మేనేజర్‌ల పాత్ర కీలకం. టీమ్ కోఆర్డినేషన్, సమస్యలను పరిష్కరించడం, తమ అనుభవం, అంతర్ దృష్టితో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇటువంటి పనులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేయలేదు.
డేటా స్టోరీటెల్లర్స్
డేటా స్టోరీటెల్లర్లు సంక్లిష్ట డేటాను ఆకర్షణీయమైన కథనంలోకి మార్చే నిపుణులు. డేటాను అర్థమయ్యేలా ప్రదర్శించడానికి వీక్షకుల గురించి లోతైన అవగాహన, సందర్భ భావం, సృజనాత్మకత అవసరం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డేటాను హ్యాండిల్ చేయగలదు కానీ మనుషులను అర్థం చేసుకుని వారికి అర్థమయ్యేలా చెప్పలేదు.
ఇదీ చదవండి: Millennials: చాలా మంది అప్పడు పుట్టినవాళ్లే! భారత్‌లో ఉద్యోగులపై ఆసక్తికర రిపోర్ట్
Comments
Please login to add a commentAdd a comment