nine
-
పఠాన్‌కోట్‌లో అనుమానితులు.. భద్రతా సంస్థలు అప్రమత్తం
జమ్ముకశ్మీర్‌లో ఇటీవలి కాలంతో తరచూ ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. భారత్- పాక్ సరిహద్దుల్లోనూ ఇలాంటి ఘటనలు కనిపిస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లా సరిహద్దు గ్రామాల్లో 48 గంటల్లో తొమ్మిది మంది అనుమానితులు కనిపించడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.తొలుత బమియల్ నియోజకవర్గంలోని చోడియా గ్రామంలో ఒక మహిళ ముగ్గురు అనుమానితులను చూశారు. అదే గ్రామంలో ఇద్దరు అనుమానితులు కనిపించారు. ఇదేవిధంగా జమ్ము-కథువా సరిహద్దుకు ఆనుకుని ఉన్న చక్రాల్ గ్రామంలో ఇద్దరు యువకులు.. నలుగురు అనుమానితులను గమనించారు. దీంతో వీరు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు, బీఎస్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. శాటిలైట్తోనూ, డ్రోన్ల ద్వారా కూడా ఆ ప్రాంతంలో అణువణువునా గాలిస్తున్నారు. భద్రతా సంస్థల అధికారులు ఆ ప్రాంతంలో క్యాంప్ నిర్వహిస్తున్నారు.చక్రాల్ గ్రామానికి చెందిన రఘువీర్ సింగ్, రిషు కుమార్ అనే యువకులు తమకు నలుగురు అనుమానితులు కనిపించినట్లు పోలీసులకు తెలిపారు. వారంతా నల్లటి దుస్తులు ధరించి, ముఖాలకు మాస్క్‌లు పెట్టుకుని, చెరుకు తోటల్లో దాక్కున్నారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు, ఆపరేషన్ గ్రూప్ కమాండో, బీఎస్ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఇది సాయంత్రం వరకు కొనసాగింది. అయితే నిందితుల జాడ ఇంకా లభించలేదు. మరోవైపు పంజాబ్ పోలీస్ బోర్డర్ రేంజ్ డీఐజీ తాజాగా ఆర్మీ అధికారులతో సమావేశమై పలు భద్రతా అంశాలపై చర్చించారు. -
పూరీ ఆలయంలోనికి అక్రమంగా బంగ్లాదేశీయులు
ఒడిశాలోని పూరీలో గల జగన్నాథ ఆలయంలోకి అనధికారికంగా తొమ్మిది మంది బంగ్లాదేశీయులు ప్రవేశించారు. వీరిని ఒడిశా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కొందరు బంగ్లాదేశ్ జాతీయులు ఆలయంలోకి వెళ్లడాన్ని తాము చూశామని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు తమకు చెప్పారని ఒక అధికారి మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై వీహెచ్‌పీ కార్యకర్తలు సింగ్‌ద్వార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆ బంగ్లాదేశ్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. కొందరు హిందూయేతర బంగ్లాదేశీయులు ఆలయంలోకి ప్రవేశించినట్లు తమకు ఫిర్యాదు అందిందని, ఇద్దరు బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నామని, వారిని విచారిస్తున్నామని పూరీ అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఎస్పీ సుశీల్ మిశ్రా తెలిపారు. ఆలయ నిబంధనల ప్రకారం హిందువులకు మాత్రమే ఆలయంలోనికి ప్రవేశం ఉంది. ఈ ఆలయంలోనికి హిందువులు కానివారు ప్రవేశిస్తే వారిపై చర్యలు తీసుకుంటారు. అదుపులోకి తీసుకున్న బంగ్లాదేశీయుల పాస్‌పోర్టులను తనిఖీ చేస్తున్నామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. విచారణ సమయంలో ఒకరు హిందువని తేలింది. మిగిలిన పాస్‌పోర్టులపై విచారణ కొనసాగుతోంది. ఆలయ పరిసరాల్లోకి వచ్చిన తొమ్మిది మందిలో నలుగురు ఆలయంలోనికి ప్రవేశించినట్లు విచారణలో తేలింది. -
సౌర వ్యవస్థలో గ్రహాలెన్ని? తొమ్మిదా? ఎనిమిదా?
మన సౌర కుటుంబంలోని గ్రహాలు ఎన్ని? తొమ్మిది అని.. అవి బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్, ఫ్లూటో.. అని వెంటనే చెప్పేముందు ఒకసారి ఆగండి.. గతంలో గ్రహానికున్న లక్షణాలు లేవంటూ ఫ్లూటోను ఆ లిస్టులోంచి తీసేశారు. కొన్నేళ్ల కిందట శాస్త్రవేత్తలు..గ్రహాలకు సంబంధించిన గుర్తింపునకు దాని పరిమాణం, ఆకృతి, కక్ష్య తదితర నిబంధనలు రూపొందించారు. ఈ లక్షణాలలో కొన్నింటికి అనుగుణంగా ఫ్లూటో లేకపోవడంతో దానిని గ్రహాల లిస్టు నుంచి తొలగించి.. మరుగుజ్జు గ్రహాల జాబితాలో చేర్చారు. ఖగోళ శాస్త్రవేత్తలు 1990ల ప్రారంభంలో సౌరకుటుంబంలోని నెప్ట్యూన్‌కు మించిన ఖగోళ పదార్థాలను కనుగొన్నారు. వీటిని ట్రాన్స్-నెప్ట్యూనియన్ ఆబ్జెక్ట్స్ (టీఎన్‌ఓఎస్) అని పిలుస్తారు. ఇవి సౌర వ్యవస్థ అంచున ఉన్న కైపర్ బెల్ట్‌ను కలిగి ఉంటాయి. కైపర్ బెల్ట్ అనేది మన సౌర వ్యవస్థలో ఒక భాగం. ఇది సూర్యుని నుండి దాదాపు 30 నుండి 50 ఖగోళ యూనిట్ల దూరంలో విస్తరించి ఉంది. 2005లో ‘ఎరిస్’(మరగుజ్జు గ్రహం)ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది దాదాపుగా ప్లూటోతో సమానమైన పరిమాణంలో ఉంది. కానీ దీనిని గ్రహంగా పరిగణించరాదనే వాదనను బలపడింది. సమయం గడిచేకొద్దీ శాస్త్రవేత్తలు విశ్వం అంతటా గ్రహాలు సమృద్ధిగా ఉన్నాయని కనుగొన్నారు. దీంతో అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల సమాఖ్య 2006లో గ్రహం అనే పదానికి సరికొత్త నిర్వచనం అవసరమని నిర్ణయించింది. సౌర వ్యవస్థలోని గ్రహం నిర్వచనం కోసం వారు మూడు ప్రమాణాలను సూత్రీకరించారు. ఒక గ్రహం అనేది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండాలి. అది తప్పనిసరిగా గురుత్వాకర్షణ శక్తి కలిగి గుండ్రంగా ఉండాలి. అలాగే ఆ గ్రహం తన కక్ష్యలోని శిధిలాల మార్గాన్ని క్లియర్ చేయడానికి సొంత గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉండాలి. దీని ప్రకారం ప్లూటో మొదటి రెండు ప్రమాణాలను కలిగి ఉంది. మూడవ లక్షణం దానిలో లేదు. అందుకే ప్లూటో, ఎరిస్లతో పాటు ఇతర ట్రాన్స్-నెప్ట్యూనియన్ పదార్థాలను ‘మరగుజ్జు గ్రహాలు’గా వర్గీకరించారు. ఇప్పుడు సౌర వ్యవస్థలో గ్రహాలు ఎన్ని అనేదానికి సమాధానం చెప్పాల్సివస్తే అవి ఎనిమిది అని చెప్పాలి. ఇంతకుమించి ఏమున్నాయనే విషయానికొస్తే ప్రస్తుతం ధృవీకరించిన ఎక్సోప్లానెట్ల సంఖ్య ఐదు వేలకుపైగానే ఉంది. -
ఏఐ ముప్పు లేని టెక్ జాబ్‌లు! ఐటీ నవరత్నాలు ఇవే..
డిజిటల్ పరివర్తన వేగవంతంగా జరుగుతున్న ప్రస్తుత యుగంలో సంచలనంగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ, డేటా సైన్స్ పట్ల దృక్ఫథాన్ని పూర్తిగా మార్చేసింది. ఇది టెక్ పరిశ్రమలో అనేక ఉద్యోగాలకు ముప్పుగా పరిణమించందన్న ఆందోళనల నేపథ్యంలో పూర్తిగా ఆటోమేషన్‌కు ఆస్కారం లేని కొన్ని కెరియర్ మార్గాలు ఉన్నాయి. మానవ అంతర్దృష్టి, సృజనాత్మక సమస్య-పరిష్కారం, భావోద్వేగ మేధస్సుతో ముడిపడిన కొన్ని జాబ్‌లు ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధిపత్య కాలంలో కీలకంగా ఉంటాయి. లెర్న్బే వ్యవస్థాపకుడు, సీఈవో కృష్ణ కుమార్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ముప్పు లేని తొమ్మిది రకాల ఐటీ జాబ్‌ల గురించి తెలియజేశారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. డేటా సైంటిస్టులు డేటా సైన్స్ అనేది డేటా క్లీనింగ్, ప్రీ-ప్రాసెసింగ్ వంటి అనేక అంశాలను ఏఐ ఆటోమేట్ చేసిన ఒక ఫీల్డ్. అయినప్పటికీ, దాని ప్రధాన భాగంలో డేటా సైన్స్‌కు ప్రోగ్రామ్ చేయలేని మానవ అంతర్ దృష్టి, చాతుర్యం అవసరం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పనితీరు కేవలం అంకెలు, సంఖ్యల్లో మాత్రమే ఉంటుంది. కానీ డేటా సైంటిస్టులు తమ మేధస్సుతో అర్థవంతవంతమైన ఫలితాలను సాధించగలరు. ఏఐ ఎథిసిస్ట్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతమవుతున్న నేపథ్యంలో ఏఐ ఎథిక్స్ నిపుణుల అవసరం చాలా కీలకంగా మారింది. ఈ నిపుణులు ఏఐ సిస్టమ్‌ల ఎథిక్స్ అమలుకు మార్గనిర్దేశం చేస్తారు. ఏఐ వ్యవస్థలు పారదర్శకంగా, వినియోగదారు గోప్యతను రక్షించే విధంగా ఉండేలా చూస్తూరు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం నుంచి ఉత్పన్నమయ్యే రిస్కులు, సామాజిక చిక్కులను అంచనా వేస్తారు. ఈ పని చేసేవారికి సామాజిక నిబంధనలు, నైతికత, మానవ హక్కుల గురించి లోతైన అవగాహన అవసరం. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అసాధారణ నెట్వర్క్ ప్రవర్తన లేదా పొటెన్షియల్ థ్రెట్స్‌ను గుర్తించడం ద్వారా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీకి సహాయపడుతుంది. అయినప్పటికీ, సైబర్ సెక్యూరిటీ నిపుణుల పాత్ర కీలకమైనది. వ్యూహరచన చేయడం, ఏఐ గుర్తించిన అంశాలను సమీక్షించడం, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న థ్రెట్స్‌ను గుర్తించి సృజనాత్మకంగా స్పందించడం వీరి ముఖ్యమైన విధులు. మానవ మనస్తత్వం సూక్ష్మ నైపుణ్యాలు, సైబర్ నేరస్థుల ఉద్దేశాలను అర్థం చేసుకోవడం వంటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేయలేని పనులను వీరు చేస్తారు. సాఫ్ట్వేర్ డెవలపర్లు, ఇంజనీర్లు కోడ్ రాయడం, డీబగ్గింగ్, టెస్టింగ్ కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విలువైన సాధనంగా మారింది. ఏది ఏమైనప్పటికీ, వినూత్న సాఫ్ట్వేర్ రూపకల్పన, వినియోగదారు అవసరాలను అర్థం చేసుకోవడం, సమస్య-పరిష్కారంలో సృజనాత్మకత వంటివి మానవులకు మాత్రమే సాధ్యమైన ప్రత్యేకమైన లక్షణాలు. సాఫ్ట్వేర్ అభివృద్ధిలో నైతిక పరిగణనలు, మానవ ప్రమేయం ఇప్పటికీ అవసరం. యూఎక్స్ డిజైనర్లు యూజర్ ఎక్స్పీరియన్స్ (UX) డిజైనర్లు సహజమైన, యూజర్లను ఆకర్షించేలా ఇంటర్‌ఫేస్‌లను రూపొందిస్తారు. యూజర్లకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి మానవ మనస్తత్వం, సాంస్కృతిక అంశాలను అర్థం చేసుకోవాలి. టెస్టింగ్, డేటా అనాలిసిస్ వంటి కొన్ని అంశాలలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయం చేయగలిగినప్పటికీ సంతృప్తికరమైన యూజర్ ఎక్స్పీరియన్స్ రూపొందించడంలో డిజైన్ థింకింగ్, సృజనాత్మకత వంటివి యూఎక్స్ డిజైనర్లు మాత్రమే చేయగలరు. డెవాప్స్ ఇంజినీర్లు డెవలప్మెంట్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం, డెవలప్మెంట్, ఆపరేషన్స్ టీమ్స్ మధ్య సమన్వయాన్ని పెంపొందించడం ప్రధానంగా డెవాప్స్ (DevOps) ఇంజనీర్లు చేసే పని. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్‌సైకిల్‌లోని భాగాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేట్ చేయగలదు. కానీ కమ్యూనికేషన్, సహకారం, నిర్ణయం తీసుకోవడానికి మానవ అవసరం కీలకం. ఏఐ/ ఎంఎల్ రీసెర్చర్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) రీసెర్చర్లు ఏఐ డెవలప్మెంట్లో ముందంజలో ఉంటారు. మోడల్ ఆప్టిమైజేషన్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడగలిగినప్పటికీ, ఏఐ, ఎంఎల్ పురోగతిని నడిపించే ప్రాథమిక పరిశోధనకు మానవ ఉత్సుకత, చాతుర్యం, క్రిటికల్ థింకింగ్ అవసరం. మానవ రీసెర్చర్లా ప్రశ్నించడం, ఊహించడం, ఆవిష్కరణలు వంటివి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేయలేదు. టెక్ ప్రాజెక్ట్ మేనేజర్లు ప్రాజెక్ట్ ట్రాకింగ్, రిస్క్ మేనేజ్మెంట్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతున్నప్పటికీ ప్రాజెక్ట్ మేనేజర్ల పాత్ర కీలకం. టీమ్ కోఆర్డినేషన్, సమస్యలను పరిష్కరించడం, తమ అనుభవం, అంతర్ దృష్టితో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇటువంటి పనులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేయలేదు. డేటా స్టోరీటెల్లర్స్ డేటా స్టోరీటెల్లర్లు సంక్లిష్ట డేటాను ఆకర్షణీయమైన కథనంలోకి మార్చే నిపుణులు. డేటాను అర్థమయ్యేలా ప్రదర్శించడానికి వీక్షకుల గురించి లోతైన అవగాహన, సందర్భ భావం, సృజనాత్మకత అవసరం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డేటాను హ్యాండిల్ చేయగలదు కానీ మనుషులను అర్థం చేసుకుని వారికి అర్థమయ్యేలా చెప్పలేదు. ఇదీ చదవండి: Millennials: చాలా మంది అప్పడు పుట్టినవాళ్లే! భారత్‌లో ఉద్యోగులపై ఆసక్తికర రిపోర్ట్ -
‘మీరెవరండీ బాబూ’.. ఇదెలా ఎలా సాధ్యం?
‘ఎన్ని పాటలు పాడగలరు?’ అని అడిగితే ‘ఎన్నయినా సరే’ అంటారు పాటలను ప్రేమించే గాయకులు. ‘ఒకే ఒక్క నిమిషంలో ఎన్ని పాడగలరు?’ అని అడిగితే మాత్రం– ‘మీరెవరండీ బాబూ’ అంటారు. అయితే సాత్ కొరియాకు చెందిన ఒక యువ జంట ఇండోనేషియా నుంచి ఇండియా (బాలీవుడ్ సినిమా సుఖూన్లోని దిల్ కో ఖరార్ ఆయా.. పాట) వరకు తొమ్మిది భాషలలో 13 పాటలు పాడారు. ఈ వీడియో 2.1 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొని దూసుకుపోతోంది. ‘ఇది సరేగానీ.. ఒక్క నిమిషంలో 13 పాటలు ఎలా సాధ్యం?’ అనే సందేహం అందరికీ వస్తుంది. 13 పాటలలోని ఒక్కో చరణాన్ని తీసుకొని ఒకే పాటలా చాలా స్పీడ్‌గా పాడారు. చదవండి: ఈమె దెయ్యమా.. మనిషా..? అనుమానం వస్తే తప్పులేదు.. ఎందుకంటే? -
28 ఏళ్లకే తొమ్మిది మందికి జన్మనిచ్చిన మహిళ.. వీడియో వైరల్
మహిళలకు మాతృత్వం ఒక వరం. తమ కుంటూ ఒకరో, ఇద్దరో పిల్లలు ఉండాలనే కోరుకుంటుంది ప్రతి జంట. ఐతే ఏ జంట అయిన తమ ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా తమకు నచ్చిన విధంగా పిలల్లను కనాలని ప్లాన్ చేసుకుంటారు. అది సహజం. కానీ ఇక్కడొక మహిళ ఒకరో ఇద్దరో కాదు ఏకంగా తొమ్మిది మందికి జన్మనిచ్చింది. అది కూడా కంటిన్యూస్ ప్రతి ఏడాది గర్భం ధరిస్తూ.. పిల్లలను కనింది. వివరాల్లోకెళ్తే..అమెరికాలోని నెవాడా రాష్ట్రానికి చెందిన కోర డ్యూక్ 28 ఏళ్లకే 9 మందికి జన్మనిచ్చింది. ఆమె తొలిసారిగా 17 ఏళ్ల వయసులో తొలి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత నుచి ప్రతి ఏడాది గర్భవతిగా ఉంటూ వచ్చింది. అలా చివరికి 2012లో ఆఖరి బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆమెకు 39 ఏళ్లు. ఈ మేరకు డ్యూక్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సంతానం గురించి తెలియజేస్తు వీడియోని షేర్ చేయడంతో అది కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఐతే డ్యూక్ తానెప్పుడూ ఇంతమంది పిల్లలను కనాలని అస్సలు అనుకోలేదని చెబుతోంది. సంప్రదాయ గర్భనిరోధక పద్ధతులు విఫలం కావడంతోనే ఇంతమంది సంతానానికి జన్మనిచ్చినట్లు చెప్పింది. ఆమె సంతానం వరసగా ఎలిజా(21), షీనా(20), జాన్(17), కైరో(16), సయా(14), అవీ(13), రోమానీ(12), తాజ్(10) తదితర పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆమె తన భాగస్వామి ఆండ్రి, తన పెద్ద కుటుంబంతో కలిసి జీవిస్తోంది. తొమ్మిదో బిడ్డకు జన్మనిచ్చాక శాశ్వత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నట్లు తెలిపింది. View this post on Instagram A post shared by Kora Duke 🇮🇳 (@mzkora) (చదవండి: సముద్రాన్నే నివాసంగా..నీటి అడుగున 100 రోజులు జీవించనున్న మనిషి) -
వింత: శిశువు కాలికి తొమ్మిది వేళ్లు
సాక్షి, బళ్లారి: కాలికి తొమ్మిది వేళ్లతో శిశువు జన్మించిన అరుదైన ఘటన హొసపేటెలో చోటు చేసుకుంది. హొసపేటె తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన గర్భిణి కాన్పు కోసం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. బుధవారం ఆమె మగబిడ్డకు జన్మ ఇచ్చింది. అయితే శిశువు ఎడమ కాలికి తొమ్మిది వేళ్లు ఉండటం వైద్యులను ఆశ్చర్యపరిచింది. ఇలా తొమ్మిది వేళ్లతో జన్మించిన బాలురు ప్రపంచంలో 20 మంది ఉన్నారని వైద్యులు తెలిపారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. -
రూ.75కే మీడియా సంస్థ అమ్మకం!
వెల్లింగ్టన్: కరోనా మహమ్మారి దెబ్బకు రెవెన్యూ పడిపోయి మీడియా సంస్థలు కుదేలవుతున్నాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘స్టఫ్’. ఎన్నో జాతీయ దినపత్రికలను ప్రచురిస్తూ, స్టఫ్ పేరుతోనే ఎంతో ప్రజాదరణ కలిగిన వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న ఈ సంస్థను.. కేవలం డాలర్‌కే (మన రూపాయిల్లో రూ.75) కంపెనీ సీఈవో సినేడ్ బౌచర్‌కు విక్రయిస్తున్నట్టు మాతృ సంస్థ నైన్ ఎంటర్టైన్మెంట్ ప్రకటించింది. ఈ డీల్ ఈ నెలాఖరుకు పూర్తవుతుందని ఆస్ట్రేలియన్ స్టాక్ మార్కెట్‌కు తెలియజేసింది. స్టఫ్‌లో 400 జర్నలిస్టులు సహా 900 మంది పనిచేస్తున్నారు. ప్రకటనల ఆదాయం పడిపోవడంతో స్టఫ్ ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న క్రమంలో ఈ డీల్ చోటు చేసుకుంది. -
సైనికుడు
మాచవరంలో ఉట్టిపడుతున్న జాతీయభావం ఆర్మీలో చేరిన 11 మంది యువకులు కొన్నేళ్లుగా దేశ సేవకే అంకితం కఠినతరమైన విధులే అయినా సంతృప్తికరం దేశరక్షణకు ఈ మాత్రం కష్టం తప్పదంటున్న యువకులు యువతకు ఆదర్శం ఈ జవాన్లు వెల్లివిరుస్తున్న దేశభక్తి ఆర్మీవైపు ధనాసిరి యువత ∙తొమ్మిది మంది విధుల్లో ఒక మాచవరం.. ఒక ధనాసిరి.. ఇక్కడి యువకులు ఇంజనీర్లు, వైద్యులు కావాలనుకోవడం లేదు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే ఇండియన్ ఆర్మీలో చేరాలనుకుంటున్నారు. ఈ రెండు గ్రామాల నుంచి వెళ్లి భారత సైన్యంలో చేరిన మన మెతుకుసీమ కుర్రాళ్ల గురించి స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కథనం.. – మెదక్/జహీరాబాద్ ‘కార్గిల్’ కదిలించింది! 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో 9వ తరగతి చదువుతున్నాను. మన సైనికులు వీరోచితంగా పోరాడి పాకిస్థాన్ సైనికులను తరిమి కొట్టడం నన్ను కదిలించింది. ఆ యుద్ధంలో అమరులైన సైనికుల కుటుంబాల కోసం నేను మరికొందరు మిత్రులతో కలిసి విరాళాలు సేకరించాను. ఇండియన్ ఆర్మీ నాలో స్ఫూర్తినింపింది. మన సైనికులు మన కోసం చేస్తున్న త్యాగం.. నాలో సైనికుడు కావాలనే లక్ష్యాన్ని ఏర్పరిచింది. మొదట్లో నా నిర్ణయాన్ని తల్లిదండ్రులు కాదన్నా తరువాత అంగీకరించారు. ప్రస్తుతం అసోంలో విధులు నిర్వర్తిస్తున్నాను. – చాగంటి కాంతారావు, జవాన్ ‘నీ తల్లిమోసేది నవ మాసాలేరా...! ఈ తల్లి మోయాలి కడవరకు రా..! కట్టే కాలే వరకు రా...!! ఆ రుణం తలకొరివితో తీరేను రా... ఈ రుణం ఏ రూపాన తీరేనురా..?’ అని ఓ సినీ గేయ రచయిత రాసినట్టుగానే తల్లి కన్నా దేశం గొప్పదే. ఎందుకంటే మనం కట్టెల్లో కాలేవరకు మోసేది మన దేశమే.. మరి, మనం పుట్టి పెరిగి పెద్దయినా ఈ దేశం కోసం ఏం చేయగలం?.. ఎలా చేయగలం?.. దేశం రుణం తీర్చుకోవడానికి దారేది..? అని ఆలోచించి దారి వెతుక్కున్నారు మాచవరం గ్రామానికి చెందిన 11 మంది యువకులు. కొన్నేళ్లుగా ఆర్మీలో చేరి దేశ రక్షణకు కాపలా కాస్తున్నారు. సైనికులుగా దేశానికి సేవచేసే అదృష్టం కలిగినందుకు ఎంతో సంతోషంగా ఉందంటున్నారు మాచవరం యువకులు. వారిలో ఓ ముగ్గురు ‘సాక్షి’తో ఫోన్లో తమ మనోగతాన్ని పంచుకున్నారు. – మెదక్ జహీరాబాద్: మండలంలోని ధనాసిరి గ్రామం సైనికుల పుట్టినిల్లుగా మారింది. ఈ గ్రామానికి చెందిన అనేక మంది యువకులు ఆర్మీలో చేరి దేశానికి సేవచేస్తున్నారు. దేశరక్షణకు అనుక్షణం కష్టపడుతున్నారు. ప్రస్తుతం తొమ్మిది మంది విధుల్లో ఉండగా మరో 18 మంది రిటై ర్ అయ్యారు. ఎస్.గణపతి, దిగంబర్, గౌతం, శేఖర్, బస్వరాజ్, ఎం.భాస్కర్‌రెడ్డి, దేవరాజ్, జి.గుండప్ప, కె.బక్కారెడ్డిలు ప్రస్తుతం దేశం లోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. గ్రామానికి చెందిన వారు అనేక మంది ఆర్మీలో చేరి దేశానికి సేవలందిస్తుండడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ గ్రామానికే గర్వకారణంగా పేర్కొంటున్నారు. మెదక్ మండలం మాచవరం ఓ చిన్న గ్రామం. జనాభా 1,400. ఇక్కడి నుంచి 11 మంది యువకులు ఆర్మీలో చేరి విధులు నిర్వహిస్తున్నారు. అందులో ముగ్గురు సైనికులు పోచయ్య, మల్లేశం, చాగంటి కాంతారావులు ‘సాక్షి’తో ఫోన్లో ముచ్చటించారు. ఆర్మీలో చేరి దేశానికి సేవ చేస్తోండడం ఎంతో సంతృప్తినిస్తోందని చెబుతున్నారు. ఇదివరకు ఎక్కడకెక్కడ ఎలా పనిచేసిందీ?, దేశరక్షణకు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో వారు పంచుకున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఏనాడూ వెన్ను చూపలేదని చెప్పుకొచ్చారు. ఆ వివరాలు వారి మాటల్లో... ఆర్మీలో ఉద్యోగమంటే ప్రాణం... రామకిష్టయ్య–ఆగమ్మ మా అమ్మానాన్నలు. వారికి నేను రెండో సంతానం. 13 ఏళ్లుగా ఆర్మీలో చేరి జవానుగా పనిచేస్తున్నా. మిలటరీలో ఉద్యోగం చేయాలనేది నా చిన్ననాటి కోరిక. ఆ దిశగా కృషి చేసి నా కల నెరవేర్చుకున్నా. ఆర్మీలో ఉద్యోగం చేయడం భారతీయుడిగా ఎంతో గర్వంగా ఉంది. దేశరక్షణలో భాగంగా కళ్లముందు ఎన్నో ఘోర ఘటనలు జరిగినా అదరకుండా భారతమాత రక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. 2008–09 మధ్యకాలంలో మైనస్ 17 డిగ్రీల ఉష్ణోగ్రతలో నేను జమ్ముకాశ్మీర్, శ్రీనగర్ సరిహద్దుల్లో విధులు నిర్వహించా. ఓ రోజు అర్ధరాత్రి ఉగ్రవాదులు ఓ గ్రామంలో చొరబడి విచక్షణరహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఆ ముష్కరుల కాల్పులకు అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. నాతోటి సహచరుడు కూడా ప్రాణాలు వదిలాడు. మరో మిత్రుడికి గాయాలయ్యాయి. అప్పుడు జవాన్లమంతా కలిసి ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడాం. 24 గంటలపాటు హోరాహోరి కాల్పులు జరిగాయి. నిద్ర ఆహారం లేదు. మైనస్ డిగ్రీల్లో జరుగుతున్న హోరాహోరి కాల్పుల్లో ఆ ప్రాంతం వేడెక్కింది. కొంతమంది ఉగ్రవాదులు తప్పించుకుని వెళ్లిపోగా మరికొందరు మృత్యువాత పడ్డారు. ఈ రకంగా భరతమాత రుణం తీర్చుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుతం కొల్కటలో పనిచేస్తున్నా. అమ్మానాన్నను ఒప్పించి... ఆర్మీలో చేరేందుకు మొదట్లో అమ్మానాన్న ఒప్పుకోలేదు. వారిని అతికష్టం మీద ఒప్పించాను. 11 ఏళ్ల క్రితం నేను ఆర్మీలో చేరా. ప్రస్తుతం రాజస్థాన్‌లో పనిచేస్తున్నా జమ్మూలో పనిచేసిన అనుభవం ఉంది. సహజంగా ఒక్కకొడుకు ఉన్న దంపతులు ఆర్మీలోకి పంపాలంటే భయపడుతుంటారు. అందరిలాగే మాతల్లిదండ్రులు సైతం అడ్డుచెప్పారు. కానీ ఈ గడ్డపై పుట్టినందుకు దేశరక్షణ కోసం పాటుపడటం కన్నా మరెందులోనూ సంతృప్తి లేదని తల్లిదండ్రులను ఒప్పించా. ఈ దేశం నాకేం ఇచ్చిందనడం కన్నా.. ముందు ఈ దేశంకోసం నేను ఏం చేశానని ప్రతి యువకుడు ఆలోచించి దేశరక్షణలో పాలుపంచుకోవాలి. – మల్లేశం, జవాను దేశభక్తితోనే ఆర్మీలోకి.. మా గ్రామ యువకుల్లో దేశభక్తి ఎక్కువ. ఆ కారణంగానే చాలామంది ఆర్మీలో పనిచేస్తున్నారు. మాజీ సర్పంచ్, స్వాతంత్యస్రమర యోధులు చందర్‌పాల్ గ్రామంలో సంఘం కార్యక్రమాలు నిర్వహించే వారు. ఇందులో గ్రామానికి చెందిన అనేకమంది చురుగ్గా చురుకుగా పాల్గొనే వారు. ప్రజల్లో దేశ భక్తి కూడా అధికంగా పెరిగింది. యువకులు దేశానికి సేవలందించాలనే ఉద్దేశంతో ఆర్మీలో చేరారు. ఇది మా గ్రామానికి ఎంతో గర్వకారణం. – ప్రతాప్ కుల్కర్ణి, ధనాసిరి దేశానికి సేవలందించేందుకే... దేశానికి సేవలందించాలనే ఉద్దేశంతో మా గ్రామానికి చెందిన అనేక మంది ఆర్మీలో చేరారు. దేశ భక్తితోపాటు ప్రతిభతో ఉద్యోగాలు సంపాదించారు. ధనాసిరికి చెందినవారు చాలామంది ఆర్మీలో చేరడం జహీరాబాద్ ప్రాంతానికే గర్వకారణం. – బన్నెల్లి మల్లికార్జున్‌రెడ్డి, ధనాసిరి, సత్వార్ పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు నా సోదరుడు ఆర్మీలో చేరడం సంతోషంగా ఉంది నా సోదరుడు ఎస్.గణపతి ఆర్మీలో చేరి దేశానికి సేవలందించడం సంతోషంగా ఉంది. జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో జేసీఓగా సేవలందిస్తున్నాడు. ఆయన ఆర్మీలో చేరడం మా గ్రామానికి ఎంతో గర్వంగా ఉంది. దేశానికి సేవలందించడమే కాదు కుటుంబ యోగక్షేమాలు కూడా చూస్తున్నాడు. – ఎస్.సంతోష్, ధనాసిరి -
9 టెలికాం కంపెనీలకు ట్రాయ్ జరిమానా