డ్యూక్.. ఆమె కుటుంబం
మహిళలకు మాతృత్వం ఒక వరం. తమ కుంటూ ఒకరో, ఇద్దరో పిల్లలు ఉండాలనే కోరుకుంటుంది ప్రతి జంట. ఐతే ఏ జంట అయిన తమ ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా తమకు నచ్చిన విధంగా పిలల్లను కనాలని ప్లాన్ చేసుకుంటారు. అది సహజం. కానీ ఇక్కడొక మహిళ ఒకరో ఇద్దరో కాదు ఏకంగా తొమ్మిది మందికి జన్మనిచ్చింది. అది కూడా కంటిన్యూస్ ప్రతి ఏడాది గర్భం ధరిస్తూ.. పిల్లలను కనింది.
వివరాల్లోకెళ్తే..అమెరికాలోని నెవాడా రాష్ట్రానికి చెందిన కోర డ్యూక్ 28 ఏళ్లకే 9 మందికి జన్మనిచ్చింది. ఆమె తొలిసారిగా 17 ఏళ్ల వయసులో తొలి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత నుచి ప్రతి ఏడాది గర్భవతిగా ఉంటూ వచ్చింది. అలా చివరికి 2012లో ఆఖరి బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆమెకు 39 ఏళ్లు. ఈ మేరకు డ్యూక్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సంతానం గురించి తెలియజేస్తు వీడియోని షేర్ చేయడంతో అది కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఐతే డ్యూక్ తానెప్పుడూ ఇంతమంది పిల్లలను కనాలని అస్సలు అనుకోలేదని చెబుతోంది. సంప్రదాయ గర్భనిరోధక పద్ధతులు విఫలం కావడంతోనే ఇంతమంది సంతానానికి జన్మనిచ్చినట్లు చెప్పింది. ఆమె సంతానం వరసగా ఎలిజా(21), షీనా(20), జాన్(17), కైరో(16), సయా(14), అవీ(13), రోమానీ(12), తాజ్(10) తదితర పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆమె తన భాగస్వామి ఆండ్రి, తన పెద్ద కుటుంబంతో కలిసి జీవిస్తోంది. తొమ్మిదో బిడ్డకు జన్మనిచ్చాక శాశ్వత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నట్లు తెలిపింది.
(చదవండి: సముద్రాన్నే నివాసంగా..నీటి అడుగున 100 రోజులు జీవించనున్న మనిషి)
Comments
Please login to add a commentAdd a comment