every year
-
డిసెంబరు 21.. రాత్రి 16 గంటలు.. పగలు 8 గంటలు
శీతాకాలం.. పగటి కాలం తక్కువ..రాత్రి పొద్దు ఎక్కువ అంటారు. అయితే డిసెంబర్ 21 రాత్రిపూట మనం ఒక వింతను చూడబోతున్నాం. ఆరోజు సుదీర్ఘమైన రాత్రి కాలం రానుంది. ఆరోజు ఏకంగా 16 గంటపాటు రాత్రి సమయం ఉండనుంది. అయితే పగటి వేళ 8 గంటలు మాత్రమే ఉంటుంది. ఇలా జరగడాన్ని శీతాకాలపు అయనాంతం(వింటర్ సోల్స్టైస్) అంటారు.శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజున సూర్యుని నుండి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ కాలం ఉంటుంది. శీతాకాలపు అయనాంతం ఏర్పడిన రోజున భూమి దాని ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా 2024, డిసెంబరు 21న ఈ ఏడాదిలో అత్యంత తక్కువ పగలు, సుదీర్ఘమైన రాత్రి ఏర్పడుతుంది. భూమి దాని అక్షం మీద తిరిగే సమయంలో దక్షిణ అర్ధగోళంలో భూమి నుండి సూర్యుడి దూరం గరిష్టంగా ఉన్న రోజున అయనాంతం వస్తుంది. ఇది శీతాకాలంలో ఏర్పడుతున్నందున దీనిని శీతాకాలపు అయనాంతం అని అంటారు.శీతాకాలపు అయనాంతం ఏర్పడే తేదీ ప్రతీయేటా మారుతుంటుంది. అయితే అది డిసెంబర్ 20- 23 తేదీల మధ్యనే వస్తుంటుంది. డిసెంబర్ 21న భూమికి సూర్యునికి గరిష్ట దూరం ఉండటం వల్ల సూర్యకిరణాలు ఆలస్యంగా భూమిని చేరుతాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల కూడా కనిపిస్తుంది. వివిధ దేశాల్లో శీతాకాలపు అయనాంతం(వింటర్ సోల్స్టైస్) రోజున ఉత్సవాలు జరుపుకుంటారు. చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలలో, బౌద్ధమతంలోని యిన్, యాంగ్ శాఖకు చెందిన ప్రజలు శీతాకాలపు అయనాంతం ఐక్యత, శ్రేయస్సును అందించే రోజుగా భావిస్తారు.శీతాకాలపు అయనాంతంపై వివిధ దేశాల్లో వేర్వేరు నమ్మకాలున్నాయి. శీతాకాలపు అయనాంతం వచ్చినప్పుడు ఉత్తర భారతదేశంలో శ్రీ కృష్ణునికి నైవేద్యం సమర్పించి, గీతా పారాయణం చేస్తారు. రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో పుష్యమాస పండుగ ను జరుపుకుంటారు. సూర్యుని ఉత్తరాయణం ప్రక్రియ శీతాకాలపు అయనాంతం నుండి మొదలవుతుంది. అందుకే భారతదేశంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.ఇది కూడా చదవండి: బిష్ణోయ్ గ్యాంగ్‌లో మేడం మాయ.. చేసే పని ఇదే.. -
28 ఏళ్లకే తొమ్మిది మందికి జన్మనిచ్చిన మహిళ.. వీడియో వైరల్
మహిళలకు మాతృత్వం ఒక వరం. తమ కుంటూ ఒకరో, ఇద్దరో పిల్లలు ఉండాలనే కోరుకుంటుంది ప్రతి జంట. ఐతే ఏ జంట అయిన తమ ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా తమకు నచ్చిన విధంగా పిలల్లను కనాలని ప్లాన్ చేసుకుంటారు. అది సహజం. కానీ ఇక్కడొక మహిళ ఒకరో ఇద్దరో కాదు ఏకంగా తొమ్మిది మందికి జన్మనిచ్చింది. అది కూడా కంటిన్యూస్ ప్రతి ఏడాది గర్భం ధరిస్తూ.. పిల్లలను కనింది. వివరాల్లోకెళ్తే..అమెరికాలోని నెవాడా రాష్ట్రానికి చెందిన కోర డ్యూక్ 28 ఏళ్లకే 9 మందికి జన్మనిచ్చింది. ఆమె తొలిసారిగా 17 ఏళ్ల వయసులో తొలి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత నుచి ప్రతి ఏడాది గర్భవతిగా ఉంటూ వచ్చింది. అలా చివరికి 2012లో ఆఖరి బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆమెకు 39 ఏళ్లు. ఈ మేరకు డ్యూక్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సంతానం గురించి తెలియజేస్తు వీడియోని షేర్ చేయడంతో అది కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఐతే డ్యూక్ తానెప్పుడూ ఇంతమంది పిల్లలను కనాలని అస్సలు అనుకోలేదని చెబుతోంది. సంప్రదాయ గర్భనిరోధక పద్ధతులు విఫలం కావడంతోనే ఇంతమంది సంతానానికి జన్మనిచ్చినట్లు చెప్పింది. ఆమె సంతానం వరసగా ఎలిజా(21), షీనా(20), జాన్(17), కైరో(16), సయా(14), అవీ(13), రోమానీ(12), తాజ్(10) తదితర పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆమె తన భాగస్వామి ఆండ్రి, తన పెద్ద కుటుంబంతో కలిసి జీవిస్తోంది. తొమ్మిదో బిడ్డకు జన్మనిచ్చాక శాశ్వత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నట్లు తెలిపింది. View this post on Instagram A post shared by Kora Duke 🇮🇳 (@mzkora) (చదవండి: సముద్రాన్నే నివాసంగా..నీటి అడుగున 100 రోజులు జీవించనున్న మనిషి) -
కోవిడ్ టీకా.. ఏడాదికి ఒకటా?
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్ వ్యాక్సిన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. ఇదిగో వ్యాక్సిన్ అదిగో వ్యాక్సిన్ అంటూ వివిధ దేశాల్లోని పరిశోధన సంస్థలు చేస్తున్న ప్రకటనలతో సామాన్య జనంలో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే, ఆ వచ్చే వ్యాక్సిన్ జీవితకాలం ఎంత అనే విషయంలోనే ఇప్పుడు కొత్త వాదన తెరపైకి వచ్చింది. దాని శక్తి ఒక ఏడాదికే పరిమితమైనా ఆశ్చర్యపోనవసరంలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వేగంగా రూపాంతరంతో.. కోవిడ్–19 విషయంలో ఆది నుంచీ అంతా గందరగోళమే కనిపిస్తోంది. ఇప్పటికీ ఆ వైరస్ తీరుతెన్నులూ పూర్తిగా స్పష్టంకాలేదు. ఇలాంటి సమయంలో దాన్ని నిరోధించే వ్యాక్సిన్ విషయంలో ఇతమిత్థ సమాచారం అంటూ ఏమీ లేదు. కానీ గతంలో ఉన్న అనుభవాల నేపథ్యంలో ఇలాంటి అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. సాధారణంగా వ్యాక్సిన్ అంటే జీవితకాలం పనిచేస్తుందనే భావన ఉంటుంది. కానీ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ విషయంలో ఈ అభిప్రాయం మారిపోయింది. అత్యంత వేగంగా రూపాంతరం చెందే లక్షణం ఉండటమే ఇందుకు కారణం. ఇన్‌ఫ్లూయెంజాకు 1930లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. కానీ 1990 తర్వాతే అన్ని దేశాల్లో విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాక్సిన్ ఓసారి తీసుకుంటే ఇక జీవితాంతం ఫ్లూ బారిన పడకుండా నిశ్చింతగా ఉండొచ్చనే భరోసా మాత్రం లేకుండా పోయింది. ఈ ఫ్లూ వైరస్ అత్యంత వేగంగా మార్పు చెందుతుండటంతో ప్రతి సంవత్సరం శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ను అందుకు తగ్గట్టుగా మార్పు చేయాల్సి వస్తోంది. ఫలితంగా ప్రతి ఏటా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోవిడ్‌కు అందుబాటులోకి వచ్చే వ్యాక్సిన్ కూడా ఇలా తరచూ వేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనాలో పుట్టిన కోవిడ్–19 వైరస్ ప్రభావం వేర్వేరు దేశాల్లో వేర్వేరుగా ఉంటోంది. ఒకే దేశంలో నెలలు గడిచేకొద్దీ దానిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫ్లూ వైరస్ అంత వేంగంగా ఆ మార్పులు లేకున్నా, వైరస్ మాత్రం రూపాంతరం చెందుతోందని అంటున్నారు. దీంతో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. వైరస్ మారితే అది పనిచేసే అవకాశం ఉండదు. అప్పుడు వ్యాక్సిన్‌లో మార్పులు అవసరమవుతాయి. ప్రతి ఏటా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే.. నేను ప్రతి సంవత్సరం అమెరికా వెళ్తుంటాను. అక్కడ ఫ్లూ ప్రభావం ఎక్కువ. ప్రతి ఏటా దాదాపు 20వేల మం ది చనిపోతారు. వైరస్‌లో మార్పుల వల్ల ప్రతి సంవత్సరం కొత్త వ్యాక్సిన్ వస్తోంది. అందుకే ప్రతి సంవత్సరం ఆ వ్యాక్సిన్ తీసుకుంటున్నా. ఈసారి కోవిడ్ ప్రభావంతో అమెరికా వెళ్లలేదు. అయినా పక్షం రోజుల క్రితం వ్యాక్సిన్ తీసుకున్నాను. ఫ్లూ వైరస్ సోకకుండా ఉండాలంటే ప్రతి సంవత్సరం ఆ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే. – డాక్టర్ రాజారెడ్డి, నిమ్స్ విశ్రాంత డైరెక్టర్ -
ఏటా జిల్లాస్థాయి స్పోర్ట్స్ మీట్లు
కస్తూర్బా బాలికా విద్యాలయాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం : సర్వశిక్షా అభియా¯ŒS పీఓ గంగవరం (రంపచోడవరం) : జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ది చేస్తామని జిల్లా సర్వశిక్షా అభియా¯ŒS పీఓ శేషగిరిరావు పేర్కొన్నారు. కొత్తాడ కస్తూర్బా గాం«ధీ బాలికా విద్యాలయం క్రీడా మైదానంలో రెండోరోజులుగా నిర్వహిస్తున్న కేజీబీవీ జిల్లా స్పోర్ట్స్ మీట్ గురువారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారిణి కె.పద్మావతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో 12 కస్తూర్బా విద్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. క్రీడల్లో నైపుణ్యం పెంపొందించాలనే యోచనతో పరీక్షల సమయమైనా క్రీడా పోటీలు నిర్వహించామన్నారు. రన్నింగ్, త్రోబాల్, కబడ్డీ, ఖోఖో, లాంగ్‌జంప్, చదరంగం, టెన్నికాయిట్, షాట్‌ఫుట్ వంటి పోటీలు నిర్వహించారు. వీటిలో కొత్తాడ కేజీబీవీ బాలికలు స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో, వ్యక్తిగత చాంపియన్, ఆల్ రౌండ్ చాంపియ¯ŒS షిప్‌లు సాధించారు. విజేతలకు పీఓ శేషగిరిరావు బహుమతులు అందించి అభినందించారు. ఎస్ఎస్ఏ ఎఫ్ఏఓ నాగమణి, ఏఎంఓలు వెంకట్రావ్, దేవుడు, నాగేశ్వరరావు, శ్రీనివాస్, మండల విద్యాశాఖా«ధికారి మల్లేశ్వరరావు, యూటీఎఫ్ కార్యదర్శి కె.కృష్ణ, ఏజెన్సీ పీఈటీల సంఘం అధ్యక్షులు కె.పోతురాజుదొర, పీడీలు తిరుపతిరావ్, చిన్నారావు, సుదర్శ¯ŒSరావు, బాబూరావు, రాజేశేఖర్, వివిధ పాఠశాలలకు చెందిన పీఈటీలు అరుణకుమారి, జానకీ తదితరులు పాల్గొన్నారు. 12 కేజీబీవీలకు చెందిన ప్రత్యేకాధికారులు , సిబ్బంది పాల్గొన్నారు. బాలికలు ఆలపించన గీతాలు, నృత్యాలు సభికులను ఎంతో ఆకట్టుకున్నాయి. -
మిస్సింగ్
-
జెడ్పీకి ఏటా రూ.10 కోట్ల ఆదాయం
జెడ్పీ సీఈఓ పద్మ రాయవరం : వివిధ రిజిస్ట్రేషన్ల ద్వారా జిల్లా పరిషత్‌కు ఏటా రూ.10 కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్టు జెడ్పీ సీఈవో కె.పద్మ తెలిపారు. రాయవరం మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇసుక సీనరేజ్ ద్వారా వచ్చే ఆదాయం ఇప్పుడు రావడం లేదన్నారు. బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు 315 ఊళ్లను ఎంపిక చేసినట్టు ఆమె తెలిపారు. ఇప్పటి వరకు 60 గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తి స్థాయిలో నిర్మించేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. వచ్చే అక్టోబరు 2వ తేదీ నాటికి మరో 100 గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. జిల్లాలో 48 జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో శిథిల భవనాలు ఉన్నట్టు గుర్తించామని, వాటిలో ఇప్పటికే 21 కూల్చివేసినట్టు తెలిపారు. శిథిల భవనాల కూల్చివేతలో జాప్యం చోటు చేసుకోకుండా మండల స్థాయిలో ఎంపీడీవో, మండల విద్యాశాఖాధికారి, మండల ఇంజనీరింగ్ అధికారి, సంబంధిత పాఠశాల హెచ్ఎంతో కూడిన కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు. జెడ్పీ పరిధిలో 426 ఉన్నత పాఠశాలలున్నాయన్నారు. వీటిలో 241 ఉన్నత పాఠశాలలు ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ అయ్యాయన్నారు. ఇవి నాన్‌టీచింగ్ స్టాఫ్ కొరతను ఎదుర్కొంటున్నాయని, పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. అపరిశుభ్రతతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వారం రోజుల పాటు అన్ని పంచాయతీల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. డ్రైన్లలో సిల్ట్ తొలగించడం, దోమల నివారణకు మందులు చల్లించడం వంటి చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇన్చార్జ్ డీపీవోగా జెడ్పీ సీఈవో బోట్‌క్లబ్ (కాకినాడ) : ఇన్చార్జ్ డీపీవోగా, జెడ్పీ సీఈవో కె.పద్మను నియమిస్తూ జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో డెంగ్యూ జ్వరాలు వణికిస్తున్న తరుణంలో ప్రస్తుత ఇన్చార్జ్ డీపీవోగా పనిచేస్తున్న జేవీఎస్‌ఎన్ శర్మ ఎటువంటి చర్యలు తీసుకొనకపోవడం వల్ల ఆయనపై చర్యలు తీసుకొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపం కారణంగా ప్రజలు అనారోగ్యాలు పాలవుతున్న పంచాయతీ కార్యదర్శులతోను, ఈవోపీఆర్డీలతో సమావేశాలు నిర్వహించకపోవడం వల్ల శర్మను ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తొలగించినట్టు తెల్సింది. శర్మ అమలాపురం డీఎల్పీవోగా పనిచేస్తు కాకినాడ ఇన్చార్జ్ డీపీవోగా గత మార్చినెలలో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి పలు అవినీతి ఆరోపణలు రావడం కూడా ఆయనను తప్పించడానికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఇక ప్రతీ ఏడాదికి ఓ ఆడి ఎలక్ట్రిక్ కారు
జర్మన్ ఆటోమొబైల్ తయారీసంస్థ ఆడీ, కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ మోడల్ ను ప్రతిఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. 2018 నుంచి ఈ ప్లాన్ ను అమలుచేయాలని భావిస్తోంది. టెస్లాకు, లగ్జరీ కార్ల మార్కెట్ ల్లో ఉన్నఇతర కంపెనీలకు పోటీగా ఈ కార్లను ప్రవేశపెట్టాలని ఆడీ నిర్ణయించింది. ఈ కొత్త ప్రయత్నం ఆడీ ఈ-క్రోన్ క్వాట్రో కాన్సెప్ట్ తో రూపొందే అన్నీ ఎలక్ట్రిక్ లగ్జరీ క్లాస్ ఎస్‌యూవీలపై చేపట్టనుంది. గురువారం జరిగిన కారు తయారీదార్ల వార్షిక సమావేశంలో ఆడీ సీఈవో రాబర్ట్ స్టాడ్లర్ ఈ విషయాన్ని తెలిపారు. మొదట లార్జ్ సిరీస్ ఎలక్ట్రిక్ కారు తయారీని 2018లో చేపడతామని వెల్లడించారు. ఆ ఏడాది నుంచి ప్రతి ఏడాది ఎలక్ట్రిక్ మోడల్ కారును మార్కెట్లోకి ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు. ఆడీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను మార్కెట్లోకి చూపించుకోవడానికి కాదని, అధిక వాల్యుమ్ విభాగాలు క్యూలైన్ క్రాస్ ఓవర్స్, వాగన్స్, ఎస్‌యూవీలను మార్కెట్లోకి ప్రవేశపెడతామని కంపెనీ తెలిపింది. గ్యాస్, డీజిల్ వెహికిల్స్ తో పాటు ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికిల్స్ పై ఆడీ మొదటి నుంచి దృష్టిపెట్టింది. తన పేరెంట్ కంపెనీ ఫోక్స్ వాగన్ డీజిల్ కర్బన ఉద్గారాల ఎక్కువగా ఉపయోగించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గతేడాది నుంచి ఆడీ ఎలక్ట్రిక్ కార్లపై ఎక్కువ దృష్టిసారిస్తోంది. -
యూనిఫాం ఎక్కడ ?
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం పంపిణీ ప్రతియేటా ప్రహసనంగా మారుతోంది. పాఠశాలలు తెరిచిన రోజునే పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందజేస్తామని పదే పదే ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వాధినేతల మాటలు నీటి మూటలవుతున్నాయి. ఏటా రెండు జతల యూనిఫాం ఉచితంగా ఇస్తామని విద్యా పక్షోత్సవాల్లో ఇచ్చిన హామీలను పాలకులు విస్మరిస్తున్నారు. ఫలితంగా గత ఏడాది తొడిగిన దుస్తులనే విద్యార్థులు మళ్లీ వేసుకుని పాఠశాలలకు వెళుతున్నారు. గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న 2,72,264 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాం పంపిణీ చేసేందుకు రాజీవ్ విద్యామిషన్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఒక్కో విద్యార్థికి క్లాత్ కొనుగోలుకు జతకు రూ.160, కుట్టుకూలికి రూ.40 కలిపి రెండు జతలకు రూ.400 చొప్పున జిల్లాకు కేటాయించిన రూ.10.89 కోట్ల నిధులను పాఠశాల యాజమాన్య కమిటీల (ఎస్ఎంసీ) బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం నెల రోజుల కిందట జమ చేసింది. పాఠశాలలు తెరిచిన ఆరు నెలల తరువాత తీరిగ్గా మేల్కొన్న ప్రభుత్వం నిధులు విడుదల చేసి చేతులు దులుపుకుంది. కాగా 2.72 లక్షల మంది విద్యార్థులకు అవసరమయ్యే క్లాత్ సరఫరా బాధ్యతను ప్రభుత్వం ఆప్కోకు అప్పగించింది. దీంతో సగం నిధులను ఎస్ఎంసీలు ఆప్కోకు చెల్లించాయి. 10 మండలాలకే క్లాత్ సరఫరా విద్యార్థులకు యూనిఫాం ఆర్డర్ పొందిన ఆప్కో ఇప్పటికి 10 మండలాలకే క్లాత్ సరఫరా చేసింది. క్లాత్ అందుకున్న ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు యూనిఫాం కుట్టించి ఇచ్చేందుకు టైలర్ల వద్దకు పంపారు. మిగిలిన 47 మండలాలకు క్లాత్ పూర్తి స్థాయిలో చేరేందుకు మరో నెలరోజులకు పైగా సమయం పట్టే అవకాశముంది. దీంతో విద్యాసంవత్సరం చివర్లో గానీ విద్యార్థులకు కొత్త యూనిఫాం అందే పరిస్థితి కనిపించడం లేదు. ఏ విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులకు అదే విద్యా సంవత్సరంలో యూనిఫాం అందించేందుకు ముందస్తు ప్రణాళిక వేసుకున్న ప్రభుత్వం దానిని అమలు పర్చడంలో విఫలమైంది. ఫలితంగా ఆలస్యంగా విడుదల చేసిన నిధులు లక్ష్యాన్ని చేరలేకపోతున్నాయి. నెల రోజుల్లోగా పూర్తిస్థాయిలో సరఫరా విద్యార్థులకు యూనిఫాం కుట్టించి ఇచ్చేందుకు ప్రభుత్వం ఎస్‌ఎంసీల ఖాతాల్లోకే నేరుగా నిధులు జమ చేసింది. ఆయా నిధులతో క్లాత్ కొనుగోలుకు ఆప్కోకు ఆర్డర్ ఇచ్చి, వచ్చిన క్లాత్‌ను 10 మండలాలకు చేరవేశాం. మరో నెల రోజుల వ్యవధిలో మిగిలిన మండలాలకు పూర్తిస్థాయిలో క్లాత్ అందుతుంది. గతంలో కంటే ప్రస్తుత విద్యాసంవత్సరంలోనే యూనిఫాం కొనుగోలుపై వేగంగా నిర్ణయం తీసుకున్నాం. - బి. రాజకుమారి, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి, రాజీవ్ విద్యామిషన్ -
బ్రహ్మోత్సవాలు విజయవంతం
సాక్షి, తిరుమల: ఓ వైపు సమైక్య ఉద్యమ హోరు.. మరో వైపు భక్తుల భక్తి పారవశ్యం..మధ్య అఖిలాండకోటి బ్రహ్మోండ నాయకుని బ్రహ్మోత్సవాలు ఆదివారం అంగరంగవైభవంగా ముగిశాయి. ఉదయం చక్రస్నానంలో సేద తీరిన శ్రీవారు, రాత్రి ధ్వజావరోహణంలో ఉత్సవాలకు ముగింపు పలికారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సమైక్యాంధ్ర ఉద్యమ సెగలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు సాగాయి. తిరుమలకు వచ్చే భక్తులకు అడుగడుగునా ప్రయాణ కష్టాలు ఎదురయ్యాయి. ఫలితంగా భక్తుల సంఖ్య, హుండీ కానుకలు తగ్గిపోయాయి. వాహన సేవల్లో భక్తులు పలుచగా కనిపించినా గరుడవాహనంలో రెండున్నర లక్షల మంది పాల్గొనడం విశేషం. ఈసారి బ్రహ్మోత్సవాల్లో స్వర్ణరథోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ ఎక్కడా హడావిడిగా కనిపించలేదు. టీటీడీ బోర్డు చైర్మన్ బాపిరాజు సాదాసీదాగా వ్యహరించారు. కోలాహలంగా వాహన సేవలు ఈ నెల 5వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమైన ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు అత్యంత వేడుకగా సాగాయి. తొలి రోజు పెద్ద శేషవాహనంతో ప్రారంభమైన ఉత్సవాలు ఆఖరి రోజు తిరిచ్చివాహనంతో ముగిశాయి. జేఈవో శ్రీనివాసరాజు నేతృత్వంలో ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, పేష్కారు సెల్వం, స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి వాహన సేవల ఊరేగింపుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. తగ్గిన భక్తులు .. హుండీ కానుకలు ఈ సారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిది రోజుల్లో మొత్తం 4లక్షలా 48వేల 416 మంది దర్శించుకున్నారు. ఈ సంఖ్య గతంలో కంటే 5.47 శాతం తగ్గింది. పటిష్ట భద్రత బ్రహ్మోత్సవాల్లో టీటీడీ సీవీఎస్వో జీవీజీ అశోక్‌కుమార్, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, అర్బన్‌జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు, ఏఎస్పీ ఉమామహేశ్వర్ శర్మ, డీఎస్పీ నంజుండప్ప పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. సుమారు 3 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. సమష్టిగా చైర్మన్, ఈవో, అధికారులు ధర్మకర్తల మండలి చైర్మన్ కనుమూరి బాపిరాజు , టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, సీవీఎస్వో అశోక్‌కుమార్ నుంచి అటెండర్ స్థాయి వరకు అధికార యంత్రాంగం సమష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. బోర్డుల సభ్యుల హడావిడి ఏమాత్రం కనిపించలేదు. సభ్యుల్లో ఎల్ఆర్.శివప్రసాద్, లక్ష్మణరావు అన్ని వాహన సేవల్లో పాల్గొన్నారు. హడావిడికి దూరంగా ఈవో టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ గత ఈవోలకు భిన్నంగా తనదైన శైలిలలో కనిపించారు. ఉత్సవాల్లో ఎక్కడా హడావిడికి అవకాశం ఇవ్వలేదు. ఇదే తరహాలోనే జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు కూడా కనిపించారు. చైర్మన్ బాపిరాజు మాత్రం సమైక్యసెగ ఉండడంతో ఈసారి ఉత్సవాల్లో ఎక్కడా సందడి చేయకుండా వాహనసేవలకే పరిమితమయ్యారు. జేఈవో శ్రీనివాసరాజు, సీవీఎస్వో జీవీజీ అశోక్‌కుమార్, అదనపు సీవీఎస్వో శివకమార్రెడ్డి, చీఫ్ ఇంజినీరు చంద్రశేఖరరెడ్డి బ్రహ్మోత్సవాలను పర్యవేక్షించా రు. ఆలయ వ్యవహారాల్లో డెప్యూటీ ఈవోలు చిన్నంగారి రమణ, గదుల కేటాయింపుల్లో ఎస్టేట్ ఆఫీసర్ దేవేంద్రరెడ్డి, తిరుమలను పరిశుభ్రంగా ఉంచడంలో హెల్త్ ఆఫీసర్ వెంకట్రమణ నిరంతరం జేఈవోకు అందుబాటులో ఉంటూ పర్యవేక్షించారు. పుష్ప, ఫొటో ప్రదర్శన విద్యుత్ అలంకరణలు భేష్ ఈసారి టీటీడీ ఉద్యానవన ం, విద్యుత్ విభాగాలు పోటీపడి అలంకరణ లు చేశాయి. గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు నేతృత్వంలో 25 టన్నుల పుష్పాలతో ఆలయ మహద్వారం నుంచి గర్భాలయం వరకు సుగంధ పరిమళ భరిత పుష్పాలతో అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక వాహనసేవల్లో కూడా పూల అలంకరణలు ఉత్సవాలకు ఆకర్షణగా నిలిచి భక్తులను మైమరింపించాయి. విద్యుత్ విభాగం ఎస్ఈ వేంకటేశ్వర్లు, డీఈ రవిశంకర్‌రెడ్డి రాత్రీపగలూ తేడా లేకుండా పని చేశారు. పుష్ప ప్రదర్శన, ఫొటో ఎగ్జిబిషన్లకు భక్తుల నుంచి విశేష సందన లభించింది.