శీతాకాలం.. పగటి కాలం తక్కువ..రాత్రి పొద్దు ఎక్కువ అంటారు. అయితే డిసెంబర్ 21 రాత్రిపూట మనం ఒక వింతను చూడబోతున్నాం. ఆరోజు సుదీర్ఘమైన రాత్రి కాలం రానుంది. ఆరోజు ఏకంగా 16 గంటపాటు రాత్రి సమయం ఉండనుంది. అయితే పగటి వేళ 8 గంటలు మాత్రమే ఉంటుంది. ఇలా జరగడాన్ని శీతాకాలపు అయనాంతం(వింటర్ సోల్‌స్టైస్) అంటారు.
శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజున సూర్యుని నుండి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ కాలం ఉంటుంది. శీతాకాలపు అయనాంతం ఏర్పడిన రోజున భూమి దాని ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా 2024, డిసెంబరు 21న ఈ ఏడాదిలో అత్యంత తక్కువ పగలు, సుదీర్ఘమైన రాత్రి ఏర్పడుతుంది. భూమి దాని అక్షం మీద తిరిగే సమయంలో దక్షిణ అర్ధగోళంలో భూమి నుండి సూర్యుడి దూరం గరిష్టంగా ఉన్న రోజున అయనాంతం వస్తుంది. ఇది శీతాకాలంలో ఏర్పడుతున్నందున దీనిని శీతాకాలపు అయనాంతం అని అంటారు.
శీతాకాలపు అయనాంతం ఏర్పడే తేదీ ప్రతీయేటా మారుతుంటుంది. అయితే అది డిసెంబర్ 20- 23 తేదీల మధ్యనే వస్తుంటుంది. డిసెంబర్ 21న భూమికి సూర్యునికి గరిష్ట దూరం ఉండటం వల్ల సూర్యకిరణాలు ఆలస్యంగా భూమిని చేరుతాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల కూడా కనిపిస్తుంది. వివిధ దేశాల్లో శీతాకాలపు అయనాంతం(వింటర్ సోల్‌స్టైస్) రోజున ఉత్సవాలు జరుపుకుంటారు. చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలలో, బౌద్ధమతంలోని యిన్, యాంగ్ శాఖకు చెందిన ప్రజలు శీతాకాలపు అయనాంతం ఐక్యత, శ్రేయస్సును అందించే రోజుగా భావిస్తారు.
శీతాకాలపు అయనాంతంపై వివిధ దేశాల్లో వేర్వేరు నమ్మకాలున్నాయి. శీతాకాలపు అయనాంతం వచ్చినప్పుడు ఉత్తర భారతదేశంలో శ్రీ కృష్ణునికి నైవేద్యం సమర్పించి, గీతా పారాయణం చేస్తారు. రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో పుష్యమాస పండుగ ను జరుపుకుంటారు. సూర్యుని ఉత్తరాయణం ప్రక్రియ శీతాకాలపు అయనాంతం నుండి మొదలవుతుంది. అందుకే భారతదేశంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
ఇది కూడా చదవండి: బిష్ణోయ్ గ్యాంగ్‌లో మేడం మాయ.. చేసే పని ఇదే..
Comments
Please login to add a commentAdd a comment