Shorter
-
డిసెంబరు 21.. రాత్రి 16 గంటలు.. పగలు 8 గంటలు
శీతాకాలం.. పగటి కాలం తక్కువ..రాత్రి పొద్దు ఎక్కువ అంటారు. అయితే డిసెంబర్ 21 రాత్రిపూట మనం ఒక వింతను చూడబోతున్నాం. ఆరోజు సుదీర్ఘమైన రాత్రి కాలం రానుంది. ఆరోజు ఏకంగా 16 గంటపాటు రాత్రి సమయం ఉండనుంది. అయితే పగటి వేళ 8 గంటలు మాత్రమే ఉంటుంది. ఇలా జరగడాన్ని శీతాకాలపు అయనాంతం(వింటర్ సోల్స్టైస్) అంటారు.శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజున సూర్యుని నుండి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ కాలం ఉంటుంది. శీతాకాలపు అయనాంతం ఏర్పడిన రోజున భూమి దాని ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా 2024, డిసెంబరు 21న ఈ ఏడాదిలో అత్యంత తక్కువ పగలు, సుదీర్ఘమైన రాత్రి ఏర్పడుతుంది. భూమి దాని అక్షం మీద తిరిగే సమయంలో దక్షిణ అర్ధగోళంలో భూమి నుండి సూర్యుడి దూరం గరిష్టంగా ఉన్న రోజున అయనాంతం వస్తుంది. ఇది శీతాకాలంలో ఏర్పడుతున్నందున దీనిని శీతాకాలపు అయనాంతం అని అంటారు.శీతాకాలపు అయనాంతం ఏర్పడే తేదీ ప్రతీయేటా మారుతుంటుంది. అయితే అది డిసెంబర్ 20- 23 తేదీల మధ్యనే వస్తుంటుంది. డిసెంబర్ 21న భూమికి సూర్యునికి గరిష్ట దూరం ఉండటం వల్ల సూర్యకిరణాలు ఆలస్యంగా భూమిని చేరుతాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల కూడా కనిపిస్తుంది. వివిధ దేశాల్లో శీతాకాలపు అయనాంతం(వింటర్ సోల్స్టైస్) రోజున ఉత్సవాలు జరుపుకుంటారు. చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలలో, బౌద్ధమతంలోని యిన్, యాంగ్ శాఖకు చెందిన ప్రజలు శీతాకాలపు అయనాంతం ఐక్యత, శ్రేయస్సును అందించే రోజుగా భావిస్తారు.శీతాకాలపు అయనాంతంపై వివిధ దేశాల్లో వేర్వేరు నమ్మకాలున్నాయి. శీతాకాలపు అయనాంతం వచ్చినప్పుడు ఉత్తర భారతదేశంలో శ్రీ కృష్ణునికి నైవేద్యం సమర్పించి, గీతా పారాయణం చేస్తారు. రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో పుష్యమాస పండుగ ను జరుపుకుంటారు. సూర్యుని ఉత్తరాయణం ప్రక్రియ శీతాకాలపు అయనాంతం నుండి మొదలవుతుంది. అందుకే భారతదేశంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.ఇది కూడా చదవండి: బిష్ణోయ్ గ్యాంగ్‌లో మేడం మాయ.. చేసే పని ఇదే.. -
ఆజానుబాహుల దేశంగా పేరు.. కానీ పొట్టిగా అయిపోతున్నారు!
‘మా తాత ఆరు అడుగుల ఆజానుబాహుడు తెలుసా?’ అని ఎవరన్నా అంటే ‘హా..అయితే మరి నువ్వేంట్రా ఇంతే ఉన్నావ్?’ అనే మాటలు తరచుగా వింటూనే ఉంటాం. తాతలు పొడుగ్గా ఉంటే ఆ వంశీకులు కూడా పొడవుగానే అవుతారు. అది డీఎన్ఏను బట్టి ఉంటుంది. కానీ ఒకప్పుడు ఆరు అడుగుల పొడుగు ఉండేవారు. కాలం, తరాలు గడుస్తున్న కొద్దీ ఆ వంశంలో పుట్టిన వారు పొడవు తగ్గిపోతుంటారా? అంటే నిజమేనంటోంది ఓ సర్వే. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత పొడుగైన వారిగా పేరొందిన నెదర్లాండ్స్ దేశస్థులు ఇప్పుడు అంత పొడవు పెరగడం లేదట.. పైగా పొడవు తగ్గిపోతూ..పొట్టిగా అయిపోతున్నారట. వారు ఎందుకు పొడవు తగ్గిపోతున్నారో తెలుసుకుందామా.? ఒకప్పుడు ఆరడుగుల ఆజానుబాహులకు నెదర్లాండ్స్ పెట్టింది పేరు. ఆ దేశంలో పుట్టే పురుషులతో పాటు మహిళలు కూడా ఆరేడు అడుగుల ఎత్తు ఉండేవారు. అందుకే ప్రపంచంలో పొడవైన వ్యక్తులున్న దేశంగా ‘నెదర్లాండ్స్’ గుర్తింపు సాధించింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన జనాభా కలిగిన దేశంగా గత 6 దశాబ్దాలుగా ఈ రికార్డు నెదర్లాండ్ పేరిటే ఉంది. ఇప్పుడు ఆ రికార్డుకు ఆ దేశం క్రమంగా దూరమవుతున్నట్లు తాజా అధ్యయనంలో స్పష్టమైంది. మునుపటి తరంతో పోల్చితే ఆ దేశస్థులు క్రమంగా పొడుగు తగ్గిపోతున్నారు. 1980లో పుట్టిన వారితో పోలిస్తే 2001లో పుట్టిన వారు పొట్టిగా ఉన్నారని తాజా అధ్యయనంలో తేలింది. అయితే ఈ భూ ప్రపంచంలో ఇప్పటికీ ఎక్కువ ఎత్తున్న జనాభా కలిగిన దేశంగా నెదర్లాండ్స్ నిలవడం విశేషం. ప్రస్తుతం ఆ దేశంలో 19 ఏళ్ల యువకుడి సగటు ఎత్తు 6 అడుగులు (182.9 సెం.మీ) కాగా, యువతి ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలు (169.3 సెం.మీ)గా ఉంది. 1980లో పుట్టిన మునుపటి తరంతో పోల్చితే 2001లో పుట్టినవారు సరాసరిగా కనీసం 1 సెంటీ మీటర్ ఎత్తు తగ్గిపోయినట్లు తెలుస్తోంది. మహిళలు 1.4 సెం.మీ మేర ఎత్తు తగ్గిపోయారు. ఆ దేశంలోని 19 నుంచి 60 ఏళ్ల వయస్కులైన 7,19,000 మంది ఎత్తుపై ఈ సర్వే నిర్వహించారు. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ ఎత్తు తగ్గడానికి కారణాలివే.... నెదర్లాండ్స్ ప్రజలు ఎత్తు తగ్గిపోవడానికి గల కారణాలను ఆ దేశ ప్రభుత్వ సంస్థ సీబీఎస్ విశ్లేషించింది. సరైన పౌష్టికాహారం తీసుకోనందునే వారు క్రమంగా ఎత్తు తగ్గిపోతున్నట్లు పేర్కొంది. పౌష్టికాహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే రాబోయే తరం ఎత్తు మరింత తగ్గిపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2007లో ఏర్పడిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం నెదర్లాండ్స్‌పై తీవ్ర ప్రభావం చూపింది. అప్పట్లో ఆ దేశంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తద్వారా అప్పట్లో చిన్నారులు సరైన పౌష్టికాహారానికి దూరమై ఉండవచ్చని భావిస్తున్నారు. అది వారి ఎత్తు తగ్గడానికి కారణమై ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. బాల్యంలో సరైన వసతులు లేకపోవడం కూడా వారి ఎత్తును ప్రభావం చేస్తుందని పేర్కొన్నారు -
రానా దగ్గుబాటికి షాక్ ఇచ్చిన కుర్రాడు!
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటికి ఓ ప్రత్యేకత ఉంది. దక్షిణాది హీరోల్లో రానా అందరికంటే పొడగరి. ఆ మాటకొస్తే బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్ కంటే కూడా రానా పొడుగ్గా ఉంటారు. అందుకే ఏ ఫంక్షన్‌కు వెళ్లినా యువ హీరో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉంటారు. ఇట్టే అందరి దృష్టిలో పడతారు. అలాంటి రానాకు ఈ మధ్య ఓ ఫంక్షన్లో ఓ కుర్రాడు ఎదురుపడ్డాడు. అతణ్ని చూడగానే రానా ఒకింత షాక్‌కు గురయ్యారు. విషయమేంటంటే రానా కంటే ఆ కుర్రాడు చాలా పొడుగ్గా ఉంటాడు. ఆ కుర్రాడిని చూసి అబ్బురపడిన రానా అతని దగ్గరికి వెళ్లి ముచ్చటించారు. రానా ఆ కుర్రాడి భుజాల కంటే తక్కువ ఎత్తు ఉన్నారు. అతనితో కలసి ఫొటో దిగారు. -
పొట్టి అని చింత ఏలనోయ్...
అధ్యయనం పొట్టిగా ఉన్నామని బాధపడనక్కర్లేదనీ, ఆత్మన్యూనతకు గురి కావలసిన అవసరం లేదనీ చెబుతున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. వాళ్లు చెప్పే శుభవార్త ఏమంటే, పొడుగైన పురుషులతో పోల్చితే పొట్టిగా ఉన్నవాళ్ల జీవితకాలం ఎక్కువ. షార్ట్ స్టేచర్(చిన్న రూపం)కూ, ఎక్కువకాలం జీవించడానికి సంబంధించిన జీన్స్కూ సంబంధం ఉంటుందని ఆ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రొటెక్టివ్ జీన్‌ను జ్ఠౌ03 అని పిలుస్తారు. అంతేకాదు, పొట్టిగా ఉన్న వాళ్లలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు పొడుగు వాళ్లతో పోల్చితే తక్కువగా ఉంటాయి. పొట్టి, పొడుగు వాళ్లను ఎంచుకొని జీవనశైలి, ఆరోగ్య పరిస్థితి...తదితర విషయాలు అధ్యయనం చేసింది ప్రొఫెసర్ విల్కాక్స్ బృందం. ‘‘మేము చెప్పిందే అంతిమసత్యం అనుకోవడం లేదు, కానీ ఎత్తుకు, జీవితకాలానికి బలమైన సంబంధం ఉందని బలంగా చెప్పవచ్చు’’ అంటున్నాడు విల్కాక్స్. ‘‘జంతువుల రూపాలకు, జీవితకాలానికి గల సంబంధం గురించి మనకు తెలుసు. మనిషి విషయంలో మాత్రం తెలియదు. ఆ దిశగా మేము ప్రయత్నించాం’’ అంటున్నాడు ఆయన. పరిశోధనకు ఎంచుకున్న పురుషులలో కొందరి వయసు 90, 100 వరకు ఉంది. ఇటాలియన్ దీవి సార్టినియాలో పొట్టిగా ఉన్న పురుషులు, తమ వయసు ఉన్న పొడవైన పురుషులతో పోల్చితే రెండు సంవత్సరాలు ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు కనుగొన్నారు. చివరగా ఓ మాట: పొట్టిగా ఉన్న ఎలుకలు, కోతులు సాధారణంగా ఎక్కువ కాలం జీవిస్తాయి. చిన్నగా ఉండే ఆసియన్ ఏనుగు, పెద్దదైన ఆఫ్రికన్ ఏనుగు కంటే ఎక్కువ కాలం జీవిస్తుంది.