ఇక ప్రతీ ఏడాదికి ఓ ఆడి ఎలక్ట్రిక్ కారు
జర్మన్ ఆటోమొబైల్ తయారీసంస్థ ఆడీ, కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ మోడల్ ను ప్రతిఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. 2018 నుంచి ఈ ప్లాన్ ను అమలుచేయాలని భావిస్తోంది. టెస్లాకు, లగ్జరీ కార్ల మార్కెట్ ల్లో ఉన్నఇతర కంపెనీలకు పోటీగా ఈ కార్లను ప్రవేశపెట్టాలని ఆడీ నిర్ణయించింది. ఈ కొత్త ప్రయత్నం ఆడీ ఈ-క్రోన్ క్వాట్రో కాన్సెప్ట్ తో రూపొందే అన్నీ ఎలక్ట్రిక్ లగ్జరీ క్లాస్ ఎస్యూవీలపై చేపట్టనుంది. గురువారం జరిగిన కారు తయారీదార్ల వార్షిక సమావేశంలో ఆడీ సీఈవో రాబర్ట్ స్టాడ్లర్ ఈ విషయాన్ని తెలిపారు.
మొదట లార్జ్ సిరీస్ ఎలక్ట్రిక్ కారు తయారీని 2018లో చేపడతామని వెల్లడించారు. ఆ ఏడాది నుంచి ప్రతి ఏడాది ఎలక్ట్రిక్ మోడల్ కారును మార్కెట్లోకి ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు. ఆడీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను మార్కెట్లోకి చూపించుకోవడానికి కాదని, అధిక వాల్యుమ్ విభాగాలు క్యూలైన్ క్రాస్ ఓవర్స్, వాగన్స్, ఎస్యూవీలను మార్కెట్లోకి ప్రవేశపెడతామని కంపెనీ తెలిపింది. గ్యాస్, డీజిల్ వెహికిల్స్ తో పాటు ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికిల్స్ పై ఆడీ మొదటి నుంచి దృష్టిపెట్టింది. తన పేరెంట్ కంపెనీ ఫోక్స్ వాగన్ డీజిల్ కర్బన ఉద్గారాల ఎక్కువగా ఉపయోగించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గతేడాది నుంచి ఆడీ ఎలక్ట్రిక్ కార్లపై ఎక్కువ దృష్టిసారిస్తోంది.