
లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి అన్ని మోడళ్ల ధరలను 2025 జనవరి 1 నుంచి 3 శాతం వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. పెరుగుతున్న ముడిసరుకు వ్యయాలు, రవాణా ఖర్చుల ప్రభావాన్ని భర్తీ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది.
‘స్థిరమైన వృద్ధిని నిర్ధారించడానికి కంపెనీతోపాటు డీలర్ భాగస్వాములకు ఈ దిద్దుబాటు అవసరం. మా విలువైన కస్టమర్లపై ధరల పెంపు ప్రభావాన్ని తగ్గించడానికి కట్టుబడి ఉన్నాం’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ అన్నారు. ఏ4, ఏ6, క్యూ3, క్యూ5, క్యూ7 వంటి మోడళ్లను భారత్‌లో ఆడి విక్రయిస్తోంది. ఇప్పటికే బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు తమ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ కంపెనీలు కూడా జనవరి నుంచి రేట్లు పెంచనున్నాయి.
ఇదీ చదవండి: యాపిల్‌లో ఉద్యోగం జైలు జీవితం లాంటిది!
బీఎండబ్ల్యూ మోటోరాడ్ ధరలు ప్రియం
వాహన తయారీలో ఉన్న జర్మనీ సంస్థ బీఎండబ్ల్యూకు చెందిన ద్విచక్ర వాహన విభాగం బీఎండబ్ల్యూ మోటోరాడ్ 2025 జనవరి 1 నుండి అన్ని మోడళ్ల ధరలను 2.5 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. ముడిసరుకు ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా ధరలను సవరిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.