Mercedes - Benz company
-
కొత్త సంవత్సరం వాహన ధరలు పెంపు.. ఎంతంటే..
లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి అన్ని మోడళ్ల ధరలను 2025 జనవరి 1 నుంచి 3 శాతం వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. పెరుగుతున్న ముడిసరుకు వ్యయాలు, రవాణా ఖర్చుల ప్రభావాన్ని భర్తీ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది.‘స్థిరమైన వృద్ధిని నిర్ధారించడానికి కంపెనీతోపాటు డీలర్ భాగస్వాములకు ఈ దిద్దుబాటు అవసరం. మా విలువైన కస్టమర్లపై ధరల పెంపు ప్రభావాన్ని తగ్గించడానికి కట్టుబడి ఉన్నాం’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ అన్నారు. ఏ4, ఏ6, క్యూ3, క్యూ5, క్యూ7 వంటి మోడళ్లను భారత్‌లో ఆడి విక్రయిస్తోంది. ఇప్పటికే బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు తమ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ కంపెనీలు కూడా జనవరి నుంచి రేట్లు పెంచనున్నాయి.ఇదీ చదవండి: యాపిల్‌లో ఉద్యోగం జైలు జీవితం లాంటిది!బీఎండబ్ల్యూ మోటోరాడ్ ధరలు ప్రియంవాహన తయారీలో ఉన్న జర్మనీ సంస్థ బీఎండబ్ల్యూకు చెందిన ద్విచక్ర వాహన విభాగం బీఎండబ్ల్యూ మోటోరాడ్ 2025 జనవరి 1 నుండి అన్ని మోడళ్ల ధరలను 2.5 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. ముడిసరుకు ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా ధరలను సవరిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. -
ఖరీదైన కారు కొన్న జాన్వీ కపూర్ సిస్టర్.. ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ భామ జాన్వీకపూర్ చెల్లెలు, శ్రీదేవి ముద్దుల కూతురు ఖుషీ కపూర్ ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొత్త రెడ్ కలర్ మెర్సిడెజ్ కారులో తిరుగుతూ ముంబయి వీధుల్లో కనిపించింది. ఈ కారు విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నటికి కంగ్రాట్స్ చెబుతున్నారు.కాగా.. ఖుషీ కపూర్ ది ఆర్చీస్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో బెట్టి కూపర్ పాత్రలో మెప్పించింది. 2023లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో సుహానా ఖాన్, అగస్త్యానందా కీలక పాత్రల్లో కనిపించారు. ఖుషీ ప్రస్తుతం రొమాంటిక్ కామెడీగా వస్తోన్న నాడనియాన్ చిత్రంలో నటించనుంది. ఇందులో ఇబ్రహీం అలీఖాన్ హీరోగా చేస్తున్నారు. ఆ తర్వాత హిందీలో రీమేక్ చేస్తోన్న లవ్ టుడే చిత్రంలో కనిపించనుంది. మరోవైపు జాన్వీ కపూర్ దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అసౌకర్యంగా ఉండేందుకు ఎవరూ లగ్జరీ కార్లు కొనరు: సుప్రీంకోర్టు
వినియోగదారులు తమ అసౌకర్యం కోసం విలాసవంతమైన కార్లను కొనుగోలు చేయరని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రముఖ లగ్జరీ కార్ల తయరీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఉత్పత్తుల్లో తలెత్తిన సమస్యల పరిష్కారంపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు సమర్థించింది. జస్టిస్ బేలా ఎమ్ త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం రెండు వేర్వేరు కేసుల అప్పీళ్లను పరిష్కరించింది.సంస్థ డైరెక్టర్ల కోసం కొనుగోలు చేసిన బెంజ్ కార్ల విషయంలో సమస్యలను ఎదుర్కొన్న రెండు కంపెనీలు వేర్వేరుగా జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ)ను ఆశ్రయించాయి. మొదటి కేసులో కంట్రోల్స్ అండ్ స్విచ్ గేర్ కంపెనీ లిమిటెడ్ దాని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కోసం రెండు మెర్సిడెస్ కార్లను కొనుగోలు చేసింది. బెంజ్ అనేకసార్లు మరమ్మతులు చేసినప్పటికీ కార్లలోని హీటింగ్ సమస్యను తగ్గించలేకపోయింది. దాంతో కంపెనీ ఎన్సీడీఆర్సీని సంప్రదించింది. వినియోగదారుకు అనుకూలంగా తీర్పు రావడంతో దాన్ని సవాలు చేస్తూ బెంజ్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కారును వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించినట్లు కోర్టులో వాదించింది. కానీ అందుకు సరైన ఆధారాలు సమర్పించలేకపోయింది. దాంతో పూర్తి వివరాలు పరిశీలించిన కోర్టు ఎన్సీడీఆర్సీ తీర్పును సమర్థించింది. కస్టమర్ మెర్సిడెస్ కారుకు బదులుగా వేరే కొత్త కారు ఇవ్వాలని లేదా బెంజ్ కారు కొనుగోలుకు అయిన రూ.1.15 కోట్లలో సగం తిరిగి చెల్లించాలని ఆదేశించింది.రెండో కేసులో సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ సంస్థ తన మేనేజింగ్ డైరెక్టర్ కోసం మెర్సిడెస్ ఈ-క్లాస్ కారును 2006లో కొనుగోలు చేసింది. ప్రమాదవశాత్తు ఈ కారు వేరే వాహనంతో ఢీకొట్టింది. అయితే సరైన రీతిలో ఎయిర్‌బ్యాగ్‌లు అమర్చక పోవడంవల్ల డైరెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయంపై బెంజ్ కంపెనీను సంప్రదిస్తే డ్రైవర్ స్థానంలో ఉన్నవారికి సీట్ బెల్ట్ ఉండడంతో ప్రమాద తీవ్రత అంతగా ఉండదని చెప్పింది. ఈ ప్రమాదంలో ఎయిర్‌బ్యాగ్‌ని అమర్చడం అవసరం లేదని బెంజ్ వాదించింది. ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చకపోవడం వల్ల సర్వీస్‌లో లోపం ఉన్నందుకు ఎన్సీడీఆర్సీ రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని బెంజ్‌ను ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ మెర్సిడెస్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఈ కేసులోనూ వినియోగదారుకు అనుకూలంగా ఎన్సీడీఆర్సీ ఇచ్చిన తీర్పును కోర్టు సమర్థించింది.ఇదీ చదవండి: ఒక వ్యక్తికి రూ.2 లక్షలే అప్పు ఇవ్వాలి: ఎంఫిన్ఈ కేసులు విచారించిన ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ..‘ఏదైనా ఉత్పత్తులు కొనేపుడు వినియోగదారులు కంపెనీలు ప్రచురించిన బ్రోచర్లు చూసి ఆకర్షితులవుతారు. సంస్థలు వాటిపై ఉన్న ప్రతి సౌకర్యాలను వినియోగదారులకు అందించాల్సిందే. దానిపై నమ్మకంతోనే కంపెనీ వస్తువులను కొనుగోలు చేస్తారు. కంపెనీలు కూడా ఆ విలాసాలను చూపించే తమ ఉత్పత్తులను ప్రచారం చేస్తుంటాయి. ప్రజలు అసౌకర్యంగా ఉండేందుకు రూ.లక్షలు ఖర్చుపెట్టి అత్యాధునిక విలాసవంతమైన కార్లను కొనుగోలు చేయరు’ అని స్పష్టం చేసింది. -
ఆర్డర్లు ఉన్నాయి.. కానీ టైమ్‌కి డెలివరీ చేయలేం!
కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చిప్సెట్ల కొరత విపరీతంగా పెరిగిపోయింది. ప్రముఖ కంపెనీలు తమ దగ్గరున్న ఆఖరి కార్లను కూడా అమ్మేశాయి. చిప్ సెట్ల కొరత కారణంగా కొత్త కార్లు తయారు చేయడం గగనంగా మారింది. దేశీయంగా మహీంద్రా మొదలు ఇంటర్నేషనల్ లెవల్లో మెర్సిడెజ్ బెంజ్ వరకు అన్ని సంస్థలు ఇదే ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ విషయాన్ని తాజా ట్వీట్ ద్వారా తెలిపారు ఆనంద్ మహీంద్రా. మెర్సిడెజ్ బెంజ్ గ్లోబల్ హెడ్ మార్టిన్ ష్వెంక్ ఇటీవల మాట్లాడుతూ.. తమ దగ్గరున్న చివరి కారును కూడా అమ్మేశామని, ఇప్పటికిప్పుడు తమకు ఐదు వేల కార్లకు ఆర్డర్ రెడీగా ఉందని తెలిపారు. అయితే ఈ కార్లు తయారు చేసేందుకు అవసరమైన చిప్సెట్లు మాత్రం సరిపడా అందుబాటులో లేవన్నారు. దీంతో మెర్సిడెజ్ బెంజ్‌లో కొత్త కారు కావాలంటే కనీసం రెండు నెలల నుంచి రెండేళ వరకు ఎదురు చూడక తప్పడం లేదంటూ స్పష్టం చేశారు. This is what I was referring to in my last tweet… It’s a problem for all car manufacturers.. https://t.co/8bd29HnrbB — anand mahindra (@anandmahindra) May 17, 2022 చదవండి: ఎంట్రి లెవల్ కార్ల అమ్మకాలు ఢమాల్ -
మెర్సిడెస్ నుంచి కొత్త కారు.. ప్రారంభానికి ముందే అదిరిపోయే బుకింగ్స్!
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తాజాగా భారత్‌లో సి–క్లాస్ సెడాన్ కొత్త వర్షన్ ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.55 లక్షల నుంచి ప్రారంభం. 1.5 లీటర్ గ్యాసోలిన్ ఇంజన్‌తో సి–220, అలాగే 2.0 లీటర్ డీజిల్ పవర్‌ట్రైన్స్‌తో సి–220డి, 330డి రూపుదిద్దుకున్నాయి. సి–200 రూ.55 లక్షలు, సి–220డి రూ.56 లక్షలు, 330డి రూ.61 లక్షలు ఉంది. మెర్సిడెస్ సి–క్లాస్ సెడాన్ కొత్త వర్షన్‌కి అంచనాలను మించి కస్టమర్ల నుంచి స్పందన ఉందని కంపెనీ తెలిపింది. 1,000 పైగా యూనిట్లకు ముందస్తు బుకింగ్స్ ఉన్నాయని, ఇది 2–3 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్‌కు దారితీసిందని వెల్లడించింది. ఈ స్థాయి ప్రీ బుకింగ్స్ మెర్సిడెస్కు ఇదే తొలిసారి అని వివరించింది. 2022లో మొత్తం 10 ఉత్పత్తులను పరిచయం చేయాలన్నది సంస్థ లక్ష్యం. వీటిలో సి–క్లాస్ కొత్త వర్షన్‌తో సహా రెండు అందుబాటులోకి వచ్చాయి. చదవండి: వామ్మో ఆ కారుకి అంత డిమాండా? ఏడాదిన్నర వెయిటింగ్ పీరియడ్!! -
మార్కెట్లోకి కొత్త కారు.. తెగ కొనేస్తున్న బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్
స్టార్ హీరోలకు, హీరోయిన్లకు లగ్జరీ కార్లు అంటే మక్కువ ఎక్కువ. మార్కేట్లోకి వచ్చిన కొత్తరకం మోడల్ కార్లను ఎప్పుడెప్పుడు తమ ఇంటిముందు పార్క్ చేయాలాని ఎదురు చూస్తుంటారు. అందుకే కొత్త రకం కారు వచ్చిందంటే చాలు క్షణం అలస్యం చేయకుండా కొనేస్తారు. దేశంలో భాగ పేరొందిన మోడల్స్‌లో సూపర్-హాట్ మెర్సిడెస్ మేబాచ్ జీఎల్ఎస్ 600 ఒకటి. దీని ధర 2- 4 కోట్ల వరకు ఉంటుంది. ఈ కారు అంటే హీరో, హిరోయిన్లు తెగ ఇష్ట పడుతున్నారు. ఇటీవల ఈ మోడల్ కారును కొనుగోలు చేసిన వారిలో భాగ పేరొందిన స్టార్ హీరో, హీరోయిన్ల గురుంచి తెలుసుకుందాం. ఈ ఖరీదైన కారును నడుపుతు వారు రహదారిపై కనిపించారు. 1.రామ్ చరణ్ దక్షిణాది అతిపెద్ద హీరోలలో రామ్ చరణ్ ఒకరు. అతని ఫ్యాన్ ఫాలోయింగ్ సంఖ్య ఈ కారు కోసం అతను చెల్లించిన మొత్తం కంటే ఎక్కువ. హై సెక్యూరిటీ, అధునాతన టెక్నాలజీతో చరణ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ కారు ధర రూ.4 కోట్లు ఉంటుందట. అయితే చెర్రి దగ్గర ఇప్పటికే ఫెరారీ, బీఎమ్‌డబ్ల్యూ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. 2.రణవీర్ సింగ్ మిస్టర్ బాజీరావ్ 'మస్తానీ' గత సంవత్సరం జూలైలో ఈ మెర్సిడెస్ మేబాచ్ జీఎల్ఎస్ కారును కొన్నాడు. భారతదేశంలో ప్రారంభించిన ఒక నెల తరువాత దీనిని కొనుగోలు చేశాడు. దీనిని కొనుగోలు చేసిన తర్వాత లంబోర్ఘినిని కూడా కొనుగోలు చేశాడు.(చదవండి: ఆపిల్ కొంపముంచిన చిప్స్...!) 3. అర్జున్ కపూర్ 'అర్జున్ కపూర్' పరిచయం అవసరంలేని బాలీవుడ్ స్టార్. ఎందుకంటే ఇతడు హీరోగా మాత్రమే కాకుండా అసిస్టెంట్ ప్రొడ్యూసర్, అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసారు. అతడు ఇషాక్ జాదే వంటి సినిమా వల్ల బాగా పాపులర్ అయ్యాడు. జర్మనీ లగ్జరీ వాహన తయారీ సంస్థ Mercedes-Maybach GLS 600 కారుని ఈ ఏడాది సెప్టెంబర్ లో కొనుగోలు చేశాడు.(చదవండి: సౌరవ్ గంగూలీపై కోకాకోలా కీలక నిర్ణయం..!) 4. కృతి సనన్ ‘మిమి’ సక్సెస్.. చేతిలో ‘ఆదిపురుష్’ వంటి భారీ ప్రాజెక్ట్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్న హీరోయిన్ కృతీ సనన్ తనకు తానే ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చుకున్నారు. సరికొత్త మెర్సిడెస్-మేబాచ్ జీఎల్ఎస్ 600 కారును తనకు తానే గిఫ్ట్‌గా ఇచ్చుకున్నారు కృతీ సనన్. 5. ఆయుష్మాన్ ఖురానా 2018లో వచ్చిన ‘అంధాదూన్’ అనే సినిమాతో ఆయన నేషనల్ అవార్డు అందుకున్న ఆయుష్మాన్ ఖురానా ఈ ఏడాది జూలై నెలలో ఖరీదైన మెర్సిడెస్-మేబాచ్ జీఎల్ఎస్ 600 కారును కొన్నారు. -
ఈ కారులో ఏది అనుకుంటే అదే జరుగుతుంది..!
మ్యునీచ్: 2009లో జేమ్స్ కామెరాన్ దర్శకత్వం వహించిన అవతార్ సినిమా మనందరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అవతార్ సినిమా సంచలన విజయాన్ని నమోదుచేసింది. అవతార్ సినిమా ఒక విజువల్ వండర్‌గా ప్రేక్షకులకు కనువిందుచూసింది. ఈ సినిమాలో పండోరా ప్రపంచంలో హీరో అక్కడ ఉన్న గుర్రాలను మచ్చిక చేసుకోవడం తన తోకను గుర్రం మైండ్‌తో మమేకం చేసి, హీరో ఆలోచనలకు తగ్గట్టుగా గుర్రం నడుచుకునే సన్నివేశాలను గమనించే ఉంటాం. ఇదే తరహాలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ కారును రూపొందించింది. చదవండి: Mercedes EQE Electric Sedan: టెస్లాకు పోటీగా మెర్సిడిజ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు..! మెర్సిడెజ్ ఈ కారులో స్టీరింగ్‌ను అమర్చలేదు. కేవలం హ్యూమన్ మైండ్ ద్వారా నియంత్రించవచ్చును. మెర్సిడెజ్ జెంజ్ విజన్ ఎవీటీర్ న్యూవెర్షన్‌ను జర్మనీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఐఏఏ మొబిలీటీ 2021 షోలో మెర్సిడెజ్ ప్రదర్శనకు ఉంచింది. కారు లోపలి బయటి భాగాలు సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఉన్న మాదిరిగా ఉంటాయి. ఈ కారులో ఎలాంటి స్టీరింగ్ ఉండదు. బీసీఐ టెక్నాలజీ సహయంతో కారును నియంత్రించవచ్చును. బీసీఐ టెక్నాలజీ అనగా మీరు కారులో రేడియో స్టేషన్‌ను మార్చడం, లేదా కార్ లోపలి లైట్స్కోసం ఎలాంటి బటన్స్‌ను స్విచ్ చేయకుండా మైండ్‌లో వాటి గురించి ఆలోచించడంతోనే స్విచ్ఆన్, ఆఫ్ చేయవచ్చును. బీసీఐ సిస్టమ్ పనిచేయడం కోసం కంపెనీ తయారుచేసిన ప్రత్యేకమైన హెల్మెట్‌ను ధరించాల్సి ఉంటుంది. ఈ హెల్మెట్ సహాయంతో కారును నియత్రించవచ్చును. ఈ కారును డిస్నీ సంస్ధ సహకారంతో మెర్సిడెజ్ సంయుక్తంగా అభివృద్ధి చేసింది. ఈ కారు కాన్సెప్ట్‌ను అవతార్ సినిమా నుంచి మెర్సిడెజ్ ప్రేరణ పొందింది. IN PICS | Mercedes-Benz Vision AVTR concept can read your mind The automaker has created this concept car in collaboration with @Disney and it takes inspiration from the movie popular sci-fi movie, #Avatar. @IAAmobility Details: https://t.co/svdJLFDUts pic.twitter.com/dd6QWN4D7X — HT Auto (@HTAutotweets) September 7, 2021 చదవండి: ఎలక్ట్రిక్ వాహన రంగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించిన స్విట్జర్లాండ్ సంస్థ..! -
టెస్లాకు పోటీగా మెర్సిడిజ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు..!
మ్యునీచ్: ఎలక్ట్రిక్ వాహన విభాగంలో రారాజు ఎవరంటే ఠక్కున చెప్పే పేరు టెస్లా. ప్రపంచవ్యాప్తంగా టెస్లా కార్లకు ఉన్న ఆదరణ అంతాఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో టెస్లా సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ, ఏకఛత్రాధిపత్యంగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లను టెస్లా ఏలుతుంది. ఎలక్ట్రిక్ వాహన రంగంలో టెస్లాకు పోటీగా ఇప్పటికే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు సిద్ధమైయ్యాయి. చదవండి: బీఎమ్‌డబ్ల్యూ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్..! చూస్తే వావ్ అనాల్సిందే..! తాజాగా జర్మనీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఆటో మొబిలీటీ షోలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడిజ్ బెంజ్ తన కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. మెర్సిడిజ్ ఈక్యూఈ ఎలక్ట్రిక్ సెడాన్ కారును ఐఏఏ మొబిలిటీ 2021 షోలో మెర్సిడిజ్ ప్రదర్శనకు ఉంచింది. ఈ కారు ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ సంస్థ టెస్లా కంపెనీకి చెందిన టెస్లా ఎస్ మోడల్ కారుకు పోటీగా నిలవనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 2022 సంవత్సరంలో ఈ కారు కొనుగోలుదారులకు అందుబాటులోకి రానుంది. మెర్సిడిజ్ ఈక్యూఈ ఎలక్ట్రిక్ సెడాన్ కారు ఒక్క ఛార్జ్‌తో సుమారు 660 కిమీ ప్రయాణించవచ్చునని కంపెనీ వెల్లడించింది. ఈ కారులో 90kWh బ్యాటరీ అమర్చారు. డీసీ చార్జింగ్ కెపాసిటీలో భాగంగా 170kW బ్యాటరీని ఏర్పాటుచేసింది. అంతేకాకుండా 430 లీటర్ల బూట్ స్పేస్‌ను అందించనుంది. మార్కెట్లోకి రెండు వేరియంట్ల రూపంలో ఈ కారు రిలీజ్ కానుందని కంపెనీ పేర్కొంది. చదవండి: భారత్‌లో సొంత షోరూమ్స్.. ఆన్లైన్ ద్వారా ఆ ఫీట్ సొంతం అయ్యేనా? -
స్టీరింగ్ లేని కారు.. సూపరో సూపరు!
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్, ‘అవతార్’ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌తో కలిసి ఏవీటీఆర్ పేరుతో ఒక అధునాతన కారును రూపొందించింది. ఇవాళ్టి మన ఆలోచనలే రేపు మనం పాటించబోయే ప్రమాణాలు అనే నినాదంతోనే ఈ కార్ ఆవిష్కారం సాధ్యమైందని మెర్సిడెజ్ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో నెవాడా రాష్ట్రం (అమెరికా) లోని లాస్‌వేగాస్ నగరంలో మొదటిసారిగా దీన్ని ప్రదర్శించారు. కారు గురించి వివరిస్తూ 13 నిమిషాల వీడియోని యూట్యూబ్‌లో విడుదల చేశారు. టైర్లు కాదు పంజాలు.. ఈ కారుకు ఉండే టైర్లు చక్రాల మాదిరిగా కాకుండా గోళాకారంగా ఉంటాయి. జంతువు పంజా, పువ్వు ఆకృతులను దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించామని చీఫ్ డిజైన్ ఆఫీసర్ గోర్డెన్ వాజెనర్ తెలిపారు. ఇరుకు ప్రదేశాల్లో పార్కింగ్ కోసం ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన వివరించారు. స్టీరింగ్‌కు బదులుగా ప్యాడ్.. కారులో స్టీరింగ్‌కు బదులుగా డ్రైవర్ లేదా ప్రయాణీకుల సీటు పక్కన ఒక సెంట్రల్ కంట్రోల్ ప్యాడ్ ఉంటుంది. దానిపై చెయ్యి పెట్టి ముందు, వెనక, కుడి, ఎడమ.. ఇలా ఏ వైపు కావాలంటే ఆ వైపుకి కారుని పోనివ్వచ్చు. మీతో సంభాషిస్తుంది కూడా.. స్టీరింగ్ వీల్, డిస్ప్లే బటన్లు, టచ్ స్ర్కీన్లు ఏవీ లేకున్నా ఈ కార్ మీతో సంభాషిస్తుంది. కృత్రిమ మేధ సహకారంతో సైగలు, నాడీ, హృదయ స్పందనల ఆధారంగా పరిస్థితులను అర్థం చేసుకుంటుంది. ముందు అద్దంపై రంగులు మార్చుతూ వేగం, దిశ, బ్రేకుల పనితీరుని తెలియజేస్తుంది. ఇది రోడ్డుపైకి ఎప్పుడొస్తుందో స్పష్టంగా తెలియదు గానీ ఈ ప్రదర్శనతో ప్రపంచమార్కెట్లో మెర్సిడెజ్ బెంజ్ ఒక సంచలనానికి తెర తీసిందన్నది నిర్వివాదాంశం. -
మెర్సిడెస్ బెంజ్.. లిమిటెడ్ ఎడిషన్లు
ముంబై: లగ్జరీ కార్లు తయారు చేసే మెర్సిడెస్-బెంజ్ కంపెనీ ఏ-క్లాస్, బీ-క్లాస్ మోడళ్లలో లిమిటెడ్ ఎడిషన్స్‌ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఏ-క్లాస్ ఎడిషన్ 1 ధర రూ.26.17 లక్షలు, బీ-క్లాస్ ఎడిషన్ 1 ధర రూ.28.75 లక్షలు(రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ముంబై). తమ మొత్తం అమ్మకాల్లో 20% వాటా ఈ రెండు కార్లదేనని.. ఆ ఉత్సాహంతోనే ఈ రెండు కార్లలో లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను అందిస్తున్నామని మెర్సిడెస్-బెంజ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ బొరిస్ ఫిట్జ్ చెప్పారు. 200 కార్లనే అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. వీటిలో పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టబుల్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్, రివర్స్ కెమెరా తదితర ఫీచర్లున్నాయి.