కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చిప్‌సెట్ల కొరత విపరీతంగా పెరిగిపోయింది. ప్రముఖ కంపెనీలు తమ దగ్గరున్న ఆఖరి కార్లను కూడా అమ్మేశాయి. చిప్ సెట్ల కొరత కారణంగా కొత్త కార్లు తయారు చేయడం గగనంగా మారింది. దేశీయంగా మహీంద్రా మొదలు ఇంటర్నేషనల్ లెవల్‌లో మెర్సిడెజ్ బెంజ్ వరకు అన్ని సంస్థలు ఇదే ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ విషయాన్ని తాజా ట్వీట్ ద్వారా తెలిపారు ఆనంద్ మహీంద్రా.
మెర్సిడెజ్ బెంజ్ గ్లోబల్ హెడ్ మార్టిన్ ష్వెంక్ ఇటీవల మాట్లాడుతూ.. తమ దగ్గరున్న చివరి కారును కూడా అమ్మేశామని, ఇప్పటికిప్పుడు తమకు ఐదు వేల కార్లకు ఆర్డర్ రెడీగా ఉందని తెలిపారు. అయితే ఈ కార్లు తయారు చేసేందుకు అవసరమైన చిప్‌సెట్లు మాత్రం సరిపడా అందుబాటులో లేవన్నారు. దీంతో మెర్సిడెజ్ బెంజ్‌లో కొత్త కారు కావాలంటే కనీసం రెండు నెలల నుంచి రెండేళ వరకు ఎదురు చూడక తప్పడం లేదంటూ స్పష్టం చేశారు.
This is what I was referring to in my last tweet… It’s a problem for all car manufacturers.. https://t.co/8bd29HnrbB
— anand mahindra (@anandmahindra) May 17, 2022
Comments
Please login to add a commentAdd a comment