సంప్రదాయేతర రంగాల్లోనూ మహిళలు దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఆటోమొబైల్ సెక్టార్లో అతివల ప్రాతినిధ్యం పెరుగుతోంది. ఇప్పటికే ఓలా స్కూటర్ల తయారీలో మహిళల కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా మహీంద్రా గ్రూపు సేల్స్ విభాగంలో మహిళలకు ప్రోత్సహిస్తోంది.
మహీంద్రా గ్రూపు ఆధ్వర్యంలో ఇటీవల నేషనల్ క్యాపిటర్ రీజియన్ ఢిల్లీలో కొత్తగా వాహనాల అమ్మకం షోరూం ఏర్పాటు చేశారు. అయితే గతానికి భిన్నంగా స్వీపర్ మొదలు మేనేజర్ వరకు ప్రతీ ఒక్క పోస్టులో మహిళలనే నియమించారు. దేశంలోనే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో తొలిసారిగా మొత్తం మహిళా సిబ్బందితో నడుస్తున్న షోరూమ్‌గా ఇది నిలిచింది. ఈ విషయాన్ని ఆ గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విటర్‌లో పంచుకున్నారు. మహిళలు అభివృద్ధి చెందినప్పుడే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. తద్వారా మొత్తం సమాజమే అభివృద్ధి బాట పడుతుందంటూ మహీంద్రా రైజ్ స్లోగన్‌ను జత చేశారు.
Thank you @KonceptautoLN for giving me the required dose of #MondayMotivation ! https://t.co/pWoAyffj2n
— anand mahindra (@anandmahindra) May 16, 2022
చదవండి: మహీంద్రా ఆన్ ది మూవ్
Comments
Please login to add a commentAdd a comment