- కస్తూర్బా బాలికా విద్యాలయాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
- : సర్వశిక్షా అభియా¯ŒS పీఓ
ఏటా జిల్లాస్థాయి స్పోర్ట్స్ మీట్‌లు
Published Thu, Mar 2 2017 11:27 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM
గంగవరం (రంపచోడవరం) :
జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ది చేస్తామని జిల్లా సర్వశిక్షా అభియా¯ŒS పీఓ శేషగిరిరావు పేర్కొన్నారు. కొత్తాడ కస్తూర్బా గాం«ధీ బాలికా విద్యాలయం క్రీడా మైదానంలో రెండోరోజులుగా నిర్వహిస్తున్న కేజీబీవీ జిల్లా స్పోర్ట్స్ మీట్ గురువారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారిణి కె.పద్మావతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో 12 కస్తూర్బా విద్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. క్రీడల్లో నైపుణ్యం పెంపొందించాలనే యోచనతో పరీక్షల సమయమైనా క్రీడా పోటీలు నిర్వహించామన్నారు. రన్నింగ్, త్రోబాల్, కబడ్డీ, ఖోఖో, లాంగ్‌జంప్, చదరంగం, టెన్నికాయిట్, షాట్‌ఫుట్ వంటి పోటీలు నిర్వహించారు. వీటిలో కొత్తాడ కేజీబీవీ బాలికలు స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో, వ్యక్తిగత చాంపియన్, ఆల్ రౌండ్ చాంపియ¯ŒS షిప్‌లు సాధించారు. విజేతలకు పీఓ శేషగిరిరావు బహుమతులు అందించి అభినందించారు. ఎస్‌ఎస్‌ఏ ఎఫ్‌ఏఓ నాగమణి, ఏఎంఓలు వెంకట్రావ్, దేవుడు, నాగేశ్వరరావు, శ్రీనివాస్, మండల విద్యాశాఖా«ధికారి మల్లేశ్వరరావు, యూటీఎఫ్ కార్యదర్శి కె.కృష్ణ, ఏజెన్సీ పీఈటీల సంఘం అధ్యక్షులు కె.పోతురాజుదొర, పీడీలు తిరుపతిరావ్, చిన్నారావు, సుదర్శ¯ŒSరావు, బాబూరావు, రాజేశేఖర్, వివిధ పాఠశాలలకు చెందిన పీఈటీలు అరుణకుమారి, జానకీ తదితరులు పాల్గొన్నారు. 12 కేజీబీవీలకు చెందిన ప్రత్యేకాధికారులు , సిబ్బంది పాల్గొన్నారు. బాలికలు ఆలపించన గీతాలు, నృత్యాలు సభికులను ఎంతో ఆకట్టుకున్నాయి.
Advertisement