కొన్ని నేరాలు చూస్తే మనుషుల ఆలోచనలు ఎలా ఇంతలా గగుర్పొడేచాలా ఉన్నాయిరా బాబు! అనిపిస్తుంది. అలాంటి దారుణమైన నేరాలు వెలుగోలోకి రానివి ఎన్నో ఉన్నాయి. జాబ్ పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేసిన ఉదంతాలను ఎన్నో చూశాం. అవన్నీ ఒక ఎత్తు అనుకుంటే..ఇప్పుడూ ఏకంగా మానవసంబంధాలకు అర్థమిచ్చే పవిత్రమైన గర్భధారణ కూడా ఒక దందాలా నడిపిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. దీన్ని కూడా ఓ జాబ్ పేరుతో రిక్రూట్‌మెంట్ అంటే బాబోయ్! ఏంటీదీ? మనం మనుషులమేనా అన్నంత అసహ్యం కలగకమానదు ఈ ఘటన వింటే. కాసులు కోసం ఇంతలా దిగజారిపోతున్నాడా మావనవుడు అన్నంతగా విస్తుపోయాలా ఉంది.
అసలేం జరిగిందంటే..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బీహార్‌లో మహిళలను గర్భవతులను చేస్తే డబ్బులు ఇస్తామన్న దిగ్బ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. దీన్ని ఓ ముఠా ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ పేరుతో రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆరోపణలపై పోలీసులు సుమారు 8 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. బీహార్‌లోని నవాడాలో ఆ దుండగలను అదుపులోకి తీసుకున్నారు. వారంతా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ పేరుతో వాట్సాప్, సోషల్ మీడియాల ద్వారా పురుషులను సంప్రదిస్తారు. పైగా ఈ సర్వీస్‌కు ప్రతిఫలంగా లక్షలు కూడా అందిస్తామని చెబుతున్నారు. అందుకోసం ఆ ముఠా ఆసక్తిగల వ్యక్తులను రూ. 799/తో రిజిస్టర్ చేయించుకోమని చెబుతారు.
ఆ తర్వాత మహిళల ఫోటోలు పంపిస్తారు. వారు సెలక్ట్ చేసుకున్న అమ్మాయిని బట్టి సుమారు 5 వేల నుంచి 20 వేల వరకు సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకుంటారు. ఆ తర్వాత వారు వారు ఎంపిక చేసుకున్న మహిళను గనుక ప్రెగ్నెంట్ చేయగలిగితే రూ. 13 లక్షల వరకు ముట్ట చెబుతారట. ఒకవేళ అలా చేయలేకపోయినా కనీసం రూ. 5లక్షల వరకు చెల్లిస్తామని ముఠా హామీ ఇచ్చిన్టలు పోలీసులు వెల్లడించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గురించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ దందాకు ప్రధాన సూత్రదారితో సహా మిగిలిన నిందుతులను కూడా అదుపులోకి తీసుకుంటామని అధికారులు చెప్పుకొచ్చారు.
మొన్నటివరకు అద్దె గర్భాల దందా!. ఇపుడు ఏకంగా మహిళలను ప్రెగ్నెంట్ చేసే దందా!. అసలేంటిది ఏదీ వ్యాపారం, ఏదీ ఉద్యోగం అనే ఇంకితం కూడా లేకుండా ఇంత దారుణమైన నేరాలా!. సమాజం ఎటువైపు పోతుంది. మనం ఎక్కడ ఉన్నాం అనిపిస్తోంది కదా!. టెక్నాలజీ పేరుతో ఎంతో ముందుకు వెళ్లామా లేకా ఆ టెక్నాలజీ ఇంత జుగుప్పకరమైన నేరాలకు పాల్పడేందుకు ఉపయోగపడుతుందనాలా పాలుపోవడం లేదు. నేరం ఎందువల్ల జరిగిందో పక్కనే పెడితే.. అలాంటి రిక్యూట్‌మెంట్‌లు దారణమైనవని, నేరమని తెలిసి ఆ బురదలోకి వెళ్లి నూరేళ్ల జీవితాలను బలిచేసుకుంటోంది యువత. దయచేసి సమాజం అన్నక అన్ని రకాల మనుషుల ఉంటారు. అలాగే మనిషి అన్నాక కుటుంబ పరంగా సవాలక్ష సమస్యలు ఉన్నా తప్పు చేసే అవకాశం ఉన్న వెళ్లకుండా ఉన్నవాడే గొప్పోడు. సంపాదించటం కంటే సక్రమంగా ఉండటం అన్నింటి కంటే ముఖ్యమైనది. ఏదైనా గానీ సరైన దారిలో వెళ్లి జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడం మాత్రం మన చేతిలోనే ఉంటుది. ఆ విషయం మరవద్దు.
(చదవండి: పీహెచ్‌డీ, నాలుగు మాస్టర్ డిగ్రీలు..కానీ బతుకుదెరువు కోసం ఆ వ్యక్తి..)
Comments
Please login to add a commentAdd a comment