
జీవితంలో మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా కోవిడ్ సంక్షోభం తరువాత ఆరోగ్యం ఉన్నవారు వ్యాయామం చేస్తూ పలు ఆకస్మిక మరణాలు ఆందోళన రేపుతున్నాయి. జిమ్‌లో వ్యాయామం చేస్తూ 17 ఏళ్ల బాలుడు మరణించిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోఈ విషాదం చోటు చేసుకుంది. భాన్‌పురిలోని స్పేస్ జిమ్‌లో బుధవారం వ్యాయామం చేస్తూ 17 ఏళ్ల మైనర్ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. రోజు మాదిరిగానే ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతూ ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల సమాచారం ప్రకారం సత్యం (17) రహంగ్‌డేల్ భన్‌పురిలోని ధనలక్ష్మి నగర్‌లో నివాసముంటున్నాడు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం జిమ్‌లోని ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతున్న అతడు ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కిందపడిపో యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేదు. అయితే అతని మరణానికి గల కారణాలను ఇంకా అధికారికంగా వెల్లడిరచలేదు. పోస్టుమార్టం నివేదిక తరువాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
సత్యం తండ్రి సుభాష్ రహంగ్‌డేల్ చిరు వ్యాపారం చేసుకునేవాడు. ఇద్దరు కుమారుల్లో సత్యం పెద్దవాడు. ఇటీవల ధనలక్ష్మి నగర్‌లోని కృష్ణ ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. కానీ ఈ సంతోషం వారికి ఎంతోకాలం నిలవలేదు. ఎదిగిన కొడుకు ఆకస్మికంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.