కండల కోసం కంగారు పడితే.. గుండెకు ముప్పు, ప్రాణాలే పోతాయ్‌! | fake muscle growth injections Hyderabad taskforce arrested three people | Sakshi
Sakshi News home page

కండల కోసం కంగారు పడితే.. గుండెకు ముప్పు, ప్రాణాలే పోతాయ్‌!

Published Tue, Mar 26 2024 4:21 PM | Last Updated on Tue, Mar 26 2024 4:27 PM

fake muscle growth injections Hyderabad taskforce arrested three people - Sakshi

మనసులో అనుకోగానే బరువు తగ్గిపోవాలి. చిటికె వేయగానే కండలు తిరిగిన బాడీ సొంతం కావాలి. ప్రతీదీ షార్ట్‌ కట్‌లో అయి పోవాలి. ప్రస్తుతం యువత మనుసుల్లోమెదులుతున్న ట్రెండ్‌ ఇదే. ఈ క్రేజ్‌నే కొంతమంది కేడీగాళ్లు సొంతం చేసుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడుతూ యువత ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. వారి ప్రాణాలమీదికి తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి షాకింగ్‌ విషయాలు వెలుగులోకి  వచ్చాయి.

తాజాగా అక్రమంగా మెఫాటర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న గ్యాంగ్‌ను టాస్క్‌ఫోర్క్‌ అదుపులోకి తీసుకుంది.  ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేసి, నిందితుల నుండి 75 ఇంజక్షన్లను సీజ్ చేశామని  టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మి పెరుమాళ్ ప్రకటించారు. కండరాల పెరుగుదలకు ఇంజక్షన్లు దోహదపడతాయని నమ్మబలుకుతారు. వాటిని అక్రమంగా విక్రయిస్తున్నారు. దీన్ని నమ్మిన బాడీ బిల్డర్లు  డాక్టర్ట సిఫారసు, ప్రికాషన్స్ లేకుండానే  ఈ ఇంజక్షన్లను ఎడా పెడా  వాడేస్తున్నారు. దీంతో కండలు పెరగడం సంగతి మాట అటుంచి  గుండెకు తీరని ముప్పని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇలాంటి నకిలి ఇంజెక్షన్లను అమ్ముతున్నగ్యాంగ్‌కు సంబంధించి  ప్రధాన నిందితుడు నితేష్ సింగ్ ఆసిఫ్ నగర్‌లో పల్స్ ఫిట్నెస్ పేరిట జిమ్  నడిపిస్తున్నాడు. ఇతనికి  సయ్యద్ జాఫర్ అలీ, రాహుల్ సింగ్ రిసెప్షనిస్ట్ లుగా వర్క్ చేస్తున్నారు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే  ఇంజక్షన్లను అక్రమంగా విక్రయించడమే వీరి దందా. ఈ ఇంజక్షన్లు తీసుకుంటే షార్ట్ టైంలో కండరాలు పెరుగుతాయని జిమ్‌కు వచ్చేవారిని నమ్మిస్తారు.

ముంబై నుండి ఈ ఇంజక్షన్లను కొరియర్ ద్వారా నగరానికి తెప్పిస్తారు. బహిరంగ మార్కెట్లో 500 పలికే ఇంజక్షన్లను అక్రమంగా 2000 వరకు విక్రయిస్తారు. ఇంజక్షన్స్ అతిగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోకులు, సడన్ కార్డియాక్ అరెస్ట్  దారి తీయవచ్చుని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement